గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ బృందం | Ysrcp Complaint To Governor About Tdp Attacks | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ బృందం

Published Thu, May 16 2024 5:01 PM | Last Updated on Thu, May 16 2024 6:54 PM

Ysrcp Complaint To Governor About Tdp Attacks

సాక్షి, విజయవాడ: రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ బృందం గురువారం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్సార్‌సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యం పైనా వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.

పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటుచేసుకున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని.. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వైఎస్సార్‌సీపీ పేర్కొంది. మంత్రి బొత్సతో పాటు గవర్నర్‌ని కలిసిన వారిలో మేరుగ నాగార్జున, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కావలి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు.

బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు: మంత్రి బొత్స 
బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాము. అబర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలి. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాము

దీపక్‌ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారు: పేర్ని నాని
ఉద్దేశ పూర్వకంగా  దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం. రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్‌లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరాము

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement