సాక్షి, అమరావతి: నలభై ఏళ్లు నిండిన టీడీపీ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అన్నీ అబద్ధాలే వల్లెవేశారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావమో లేదంటే మçహానాడు కార్యక్రమమో తప్ప మిగతా సమయాల్లో ఎన్టీ రామారావును చంద్రబాబు ఎందుకు గుర్తుపెట్టుకోరని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టలేదని గుర్తుచేశారు.
సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని, బీసీ డిక్లరేషన్ తీసుకురావడంతోపాటు వారి అభివృద్ధికి 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం తప్ప ఆయనకు మంచి చేసింది ఏమీలేదని విమర్శించారు.
ఇలాంటప్పుడు తప్ప ఎన్టీఆర్ గుర్తురారా?
Published Wed, Mar 30 2022 4:01 AM | Last Updated on Wed, Mar 30 2022 4:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment