
సాక్షి, జగ్గయ్యపేట : అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలంటూ జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. రేషన్ కార్డుల జారీ, పింఛన్లు మంజూరు చేయడంలో అధికారులు పక్షపాతం చూపుతున్నారంటూ బాధితులతో కలసి వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు.
హూటాహుటిన ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమించుకోవాలని కోరారు. ధర్నా చేసేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించారు. అరెస్టు చేసిన వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment