jaggayyapet
-
రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
జగ్గయ్యపేట అర్బన్: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కాన్వాయ్‌కు దారి ఇవ్వకుండా కారు వెనుక అద్దాలను కొడుతూ కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అసలేం జరిగిందంటే.. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఉదయభాను బలుసుపాడు రోడ్డులోని టిడ్కో గృహాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి జగ్గయ్యపేటకు తిరిగి వస్తుండగా పట్టణంలోని పెద్ద సెంటర్లో టీడీపీ కార్యకర్తలు దళిత ఆత్మీయ సమ్మేళనం పేరుతో ర్యాలీగా వస్తూ ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌కు దారి ఇవ్వకుండా టీడీపీ జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే కారు వెనుక అద్దాలను కొడుతూ టీడీపీ జిందాబాద్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఉదయభాను వెంట సుమారు 15 మంది కార్యకర్తలు ఉండగా, టీడీపీ వారు వందలాది మంది ఉన్నారు. టీడీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలకు ప్రతిగా ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్త తమ జెండా ఊపడంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు అతనిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పాత మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఉంచి గేట్లు వేశారు. అయినా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ వీరంగం సృష్టించారు. కొన్ని రాళ్లు పోలీసులు, విలేకరులకు కూడా తగిలాయి. కనిపించిన చోటల్లా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను నియంత్రించి పరిస్థితిని చక్కదిద్దారు. నందిగామ ఏసీపీ డాక్టర్ బి.రవికిరణ్ వచ్చి బందోబస్తును పర్యవేక్షించారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం వీధుల్లో కవాతు నిర్వహించారు. శాంతియుతంగా వస్తున్న తమ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని, కొందరిని గాయపరిచారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ తెలిపారు. -
జగ్గయ్యపేటలో జన సునామీ
పెనుగంచిప్రోలు/జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది. విజయవాడ రోడ్డులోని వైఎస్సార్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వద్దకు చేరింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సామాజిక నినాదం హోరెత్తింది. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు తమ ఇంటి ముంగిటకే వస్తున్నాయంటూ సామాజిక సాధికార బస్సు యాత్ర వెంట ఉత్సాహంగా కదిలారు. సమ సమాజ స్థాపనకు పునాది: మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రానికి వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సమ సమాజ స్థాపన జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బడుగు, బలహీన, వర్గాలకు మేలు చేసింది జగన్ ఒక్కరేనని స్పష్టం చేశారు. ఆయా వర్గాలకు చెందిన ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని.. దీనికి సీఎం వైఎస్ జగన్ దార్శనికతే కారణమని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు భరోసా: మంత్రి రజిని రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రాధాన్యమిస్తూ.. వారికి భరోసా కల్పిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శాసనసభలో 17 మంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు.. అన్ని రకాల పదవుల్లో 60% అవకాశం కల్పించడం ఓ చరిత్రగా చెప్పారు. భావితరాల బంగారు భవిత కోసం జగనన్నకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు జైలుకు పంపితే, జగనన్న పార్లమెంట్‌కు పంపాడు: ఎంపీ నందిగం సురేష్ చేయని తప్పుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తనను జైలుకు పంపితే.. దళితుడనైన తనను దేశ ప్రధాని పక్కన పార్లమెంట్లో కూర్చునే గొప్ప అవకాశాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని కోర్టుల ద్వారా చంద్రబాబు పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్థసారథి, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం
-
పింఛన్లపై ఆందోళన : వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్టు
సాక్షి, జగ్గయ్యపేట : అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలంటూ జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. రేషన్ కార్డుల జారీ, పింఛన్లు మంజూరు చేయడంలో అధికారులు పక్షపాతం చూపుతున్నారంటూ బాధితులతో కలసి వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. హూటాహుటిన ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను విరమించుకోవాలని కోరారు. ధర్నా చేసేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. దీంతో వైఎస్ఆర్ సీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించారు. అరెస్టు చేసిన వారిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. -
జగ్గయ్యపేటలో మద్యం బాటిళ్ల సీజ్
-
షాడో ఎమ్మెల్యే దందా
విజయవాడ : వచ్చేది మన కంపెనీ. మన కంపెనీ అంటే అందరిది. గ్రామస్తులు ఎదురు తిరగకుండా, వ్యతిరేకత రాకుండా మీరే చూసుకోవాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ‘బాస్’ నుంచి ఫోన్ వస్తే అంతే సంగతులు. కాబట్టి ఎవరెవరికి ఏం కావాలో అడిగి తీసుకెళ్లండి. ఒట్టిచేతులతో వెళితే మాత్రం కుదరదు. ఇదీ జగ్గయ్యపేట పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులకు షాడో ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీప బంధువు కేఎస్ఎన్ మూర్తి జగ్గయ్యపేటలోని జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పేరుతో భారీ కర్మాగారాన్ని నిర్మించనున్నారు. రూ.10వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమకు ఎక్కడా చిన్నపాటి ఆటంకం లేకుండా సజావుగా సాగించటానికి స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. తీవ్ర విష వాయువులు వెలువరించే ఈ పరిశ్రమతో 7 గ్రామాలకు సమీపంలోని జగ్గయ్యపేటకు తీవ్ర ముంపు ఉంటుంది. ముఖ్యంగా పరిశ్రమలోని అమ్మోనియన్ నైట్రిక్, యాసిడ్, అమ్మోనియా ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థాలు పొగ తీవ్ర ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణలో పరిశ్రమ ఏర్పాటుపై ప్రజలందరూ వ్యతిరేకించటానికి ఇటీవల సన్నద్ధమయ్యారు. నయానా.. భయానా.. గురువారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అవాంతరాలు ఎదురుకాకుండా వీబీసీ ప్రతినిధులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ బాధ్యతలను నియోజకవర్గ ప్రజాప్రతినిధి భుజానికి ఎత్తుకొని ఈ బాధ్యతలు తన సోదరుడికి అప్పగించారు. దీంతో గత 5 రోజులుగా జయంతిపురం, రావిరాల, వేదాద్రి, చిల్లకల్లు, ముక్త్యాల, కేఅగ్రహారం, ధర్మవరప్పాడు తండా, బూదవాడ గ్రామాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ స్థానిక నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత ముఖ్యులందరికీ నేరుగా కంపెనీ ప్రతినిధులతో భారీ ప్యాకేజీలు ఇప్పించి గ్రామాల్లో ప్రజలందరినీ పూర్తిస్థాయిలో ఒప్పించే బాధ్యత వారిపై పెట్టారు. పరిశ్రమ మరో మూడేళ్లలో వస్తుందని, పరిశ్రమ మొదలయ్యాక నియోజకవర్గంలో నైపుణ్యత ఉన్న వెయ్యి మందికి వెంటనే ఉద్యోగాలు ఇస్తారని, తరువాత ఏడాదికి 50 నుంచి 100 మంది చొప్పున తీసుకుంటారని, గ్రామంలో నిరుద్యోగం అనేదే ఉండదని విస్తృత ప్రచారం చేయాల్సిందిగా సదరు షాడో ఎమ్మెల్యే సూచించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి అందరికి పరిస్థితి వివరించి కొందరికి డబ్బు ఆశ, మరికొందరికి ఉద్యోగాల ఆశ చూపి దారిలోకి తెచ్చారు. దీంతో కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో డబ్బు పంపిణీ పూర్తి చేశారు. మరో వైపు కంపెనీ ప్రతినిధి రామారావు గత 5 రోజులుగా జగ్గయ్యపేటలోనే ఉండి అన్ని గ్రామాల్లో తిరుగుతూ పరిస్థితిని చక్కబెడుతున్నారు. మరోవైపు వ్యతిరేకించిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా గ్రామాల్లోకి పంపటం, అవసరమైతే బైండోవర్ కేసులు పెట్టించటానికి వెనుకాడేది లేదని పరోక్షంగా చెప్పటంతో గ్రామస్తుల వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న జగ్గయ్యపేట సమీపంలో ఈ పరిశ్రమ వస్తే తీవ్రత మరింత పెరగనుంది. -
'పేదలపైనే ప్రభుత్వ ప్రతాపం'
జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఎర్రకాల్వ పక్కన ఏడేళ్ల నుంచి నివాసం ఉంటున్నవారిని తక్షణం ఖాళీ చేయాలని పేదలకు నోటీసులు ఇవ్వడం సరికాదని వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఎర్రకాల్వ పక్కన నివసిస్తున్న 257 మందికి.. వారం రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్నవారు భయాందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న తమను వెళ్లిపోవాలనటం సరికాదన్నారు. ప్రభుత్వం పేదలపై ప్రతాపం చూపడం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాను గురువారం ఎర్రకాల్వ నివాసులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోటీసులపై ప్రభుత్వం పునరాలోచించాలని, లేకుంటూ వారి తరఫున ఉద్యమిస్తామన్నారు. -
సరయూలో ఇద్దరు గల్లంతు
సాక్షి, హైదరాబాద్/జగ్గయ్యపేట: బియాస్ నది, డిండి ప్రాజెక్ట్ ఉదంతాల నుంచి తేరుకోక ముందే తాజాగా సరయూ నదిలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వేద పండిత విద్యార్థులు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రామాయణ సుందరకాండ యజ్ఞానికి 48 మంది విద్యార్థులు వెళ్లారు. వీరు బుధవారం తెల్లవారు జామున సరయూ నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా ఇద్దరు ప్రమాదవశాత్తు అందులో పడ్డారు. గల్లంతైన వారిలో డబీర్‌పురాకు చెందిన కిరణ్(20), మల్కాజ్‌గిరికి చెందిన చక్రపాణిశర్మ(21)లు ఉన్నారు. అల్వాల్‌కు చెందిన విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో 48 మంది విద్యార్థుల బృందం సోమవారం వరంగల్ నుంచి అయోధ్యకు రైలులో వెళ్లింది. బుధవారం అయోధ్యలో రామాయణ సుందరకాండ యజ్ఞం జరగాల్సి ఉంది. ఈ యజ్ఞానికి ముందు తెల్లవారు జామున వీరంతా సరయూ నది తీరంలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. స్నానాలు చేస్తూ ఫొటోలు దిగేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే నదిలోకి దిగిన వారిలో కిరణ్, చక్రపాణిశర్మలు గల్లంతయ్యారు. చక్రపాణి మెదక్ జిల్లా వర్గల్ గ్రామంలో వేద పాఠశాలలో చదువు పూర్తి చేసుకుని సికింద్రాబాద్‌లోని ఎన్ఆర్ఐఐ సంస్థలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. కిరణ్ తండ్రి గతంలోనే మృతి చెందగా, ఇప్పుడు అతనూ గల్లంతు కావడంతో అతని తల్లికి రోదనే మిగిలింది. అన్నీ మేమే అయి పెంచాం... ‘తండ్రి మరణించడంతో అన్నీ మేమే అయి పెంచాం. పెళ్లి కూడా చేసేందుకు సంబంధాలు చూస్తున్నాం.. ఇంతలో ఎంత ఘోరం జరిగింది..’ అంటూ గల్లంతైన పెద్దింటి కిరణ్‌కుమార్ శర్మ(25) అక్క, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జగ్గయ్యపేటకు చెందిన కిరణ్‌కుమార్ శర్మ తండ్రి మరణించడంతో అతని అక్క జయలక్ష్మి, బావ మార్తి ఆదిత్యకుమార్‌శర్మ, మేనమామలు పెంచి పెద్దచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నదిలో మునిగిపోయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ సంతాపం అయోధ్య వద్ద సరయూ నదిలో వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల మరణం పట్ల తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
'వాళ్లిద్దరూ స్వర్గాన్ని తీసుకువస్తారట!'
జగ్గయ్యపేట : ఈనాడు రాతలు చదువుతుంటే బాధేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రోడ్ షోలో ప్రసంగించారు. నరేంద్ర మోడీ..చంద్రబాబులు స్వర్గాన్ని తెస్తామనే విధంగా మాటలు చెబుతున్నారని వాటిని ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. మన రాష్ట్రం గురించి మోడీకేం తెలుసని జగన్ మండిపడ్డారు. మన దగ్గర నుంచి గ్యాస్ తీసుకెళ్లి అక్కడ తక్కువ ధరకు ఇచ్చుకుని.. మనకు మాత్రం రెట్టింపు రేటు కడుతున్నారని జగన్ తెలిపారు. తాను లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని జగన్ అన్నారు. మరోవైపు తెలంగాణ ఇచ్చింది సోనియానే కాదని... ఈచిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలని అంటున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత సీమాంధ్రలో జగన్ వల్లే తెలంగాణ వచ్చిందని అబద్దాలు చెబుతారన్నారు. 1999-2004 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు..బీజేపీకి 1000కి.మీ సముద్రతీరం కనిపించలేదా? అని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ముందే ప్రజల సమస్యలు, కట్టాల్సిన ప్రాజెక్టులు గుర్తుకొస్తాయా అన్నారు. చంద్రబాబు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ అబద్ధాలాడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. మన రాష్ట్ర బడ్జెట్ లక్షా 25వేల కోట్లు ఉంటే...లక్షా 50వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారన్నారు. 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని, మన రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తానని ముందుకు వస్తారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామని జగన్ అన్నారు. -
గ్యాస్‌గోడౌన్ పక్కనే పైప్ బాంబు
గుర్తించి నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్ జగ్గయ్యపేటలో తప్పిన పెను ప్రమాదం జగ్గయ్యపేట, న్యూస్‌లైన్: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గ్యాస్ గోడౌన్ పక్కనే హైఎక్స్ప్లోజివ్ పైప్బాంబు లభించడం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గయ్యపేటలోని జైసంతోషి గ్యాస్ గోడౌన్ లో బాంబు ఉందంటూ ఈనెల 7న గోడౌన్ యజమాని మూర్తికి ఫోన్‌కాల్ వచ్చింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గోడౌన్‌ను, కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినా బాంబు ఆచూకీ తెలియలేదు. అయితే గోడౌన్లో బాంబు ఉందంటూ ఎస్ఐ శ్రీనుకు గురువారం, శుక్రవారం కూడా ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీంతో ఎస్ఐ మరోసారి ఉదయం నుంచి తన సిబ్బందితో గోడౌన్ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్ సుమారు గంటపాటు తనిఖీ చేసిన అనంతరం గోడౌన్ పక్కన కారు పార్కింగ్ సమీపంలో ఉన్న పొదల్లో బాంబును గుర్తించారు. మూడు గంటలపాటు శ్రమించి దాన్ని నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అరకిలో అమోనియో నైట్రేట్, 250 గ్రాముల జిలిటెన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను 12అంగుళాల పైపులో ఉంచి దానికి సేప్టీ ఫీజును ఏర్పాటుచేసి ఈ బాంబును తయారుచేశారు. ఇది పూర్తిగా నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ కావడంతో నిర్వీర్యం చేయడానికి స్క్వాడ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ బాంబు పేలితే పక్కనే ఉన్న గ్యాస్ గోడౌన్కూడా పేలి పెను ప్రమా దం సంభవించేదని, వేలాదిమంది మృతి చెందేవారని ఆందోళన వ్యక్తంచేశారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లిం మైనార్టీల ర్యాలీ