కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ధనంబోర్డ్ కాలనీ, కాకాని నగర్, డాoగే నగర్, యానాది కాలనీలో వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సామినేని వెంకట కృష్ణప్రసాద్, తన్నీరు నాగేశ్వరావు, సహా వివిధ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. హైవేపై దాదాపు రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. (విరిగిపడ్డ కొండచరియలు, ఒకరు మృతి)
Comments
Please login to add a commentAdd a comment