inspection
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీకి టాస్క్‌ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో పరికరాలు, మందుల లభ్యత, ఫైర్ సేఫ్టీ తదితరాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా పది టాస్‌్కఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బృందాలు క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించి నివేదిక ఇవ్వాలన్నారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన శాఖ ఉన్నాధికారులతో సమావేశం నిర్వహించారు. టాస్‌్కఫోర్స్ బృందాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల తీరు ను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పర్యవేక్షణ సాగేలా నూతన వ్యవస్థ అందుబాటులోకి తేవాలని చెప్పారు. దీనిపై త్వర లో సెంట్రల్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్న ట్లు పేర్కొన్నారు. ఎక్విప్మెంట్ స్థాయిని బట్టి రెండు నుంచి నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలో పరికరాలకు రిపేర్లు చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాకో బయోమెడికల్ ఇంజనీర్ రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ పదేళ్లలో బయోమెడికల్ ఇంజనీర్లనునియమించకపోవడంతో చిన్న చిన్న రిపేర్ల కోసమూ ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోందని అధికారులు రాజనర్సింహకు వివరించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ క్రియేట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతీ జిల్లాకు కనీసం ఒక బయోమెడికల్ ఇంజనీర్ ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలన్నా రు. కొంతమంది సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మిషన్లను రిపేర్‌లో పెడుతున్నారని అధికారులు వివరించగా... అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మందుల సరఫరాలో నిర్లక్షం వహిస్తే సంబంధిత అధికారిపై కొర డా ఝుళిపించాలన్నారు. ఎక్స్పైరీ తేదీ కంటే 3 నెలల ముందే మెడిసిన్‌ను వినియోగించాలని, లేని పక్షంలో వెనక్కి పంపించాలన్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లు, హాస్పిటల్ ఫార్మసీ స్టోర్లలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలన్నారు. పలు హాస్పిటల్స్‌లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ సరిగా లేవని గుర్తించామని, నాలుగైదు సంవత్సరాలుగా నిర్వహణ సరిగా లేదని అధికారులు వివరించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో అజాగ్రత్త వద్దని, ప్రతి హాస్పి టల్లో అవసరమైనమేర అలారమ్, స్మోక్ డిటెక్టర్స్, మంటలను ఆర్పే యంత్రాలను అందుబాటులో ఉంచాలని రాజనర్సింహ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్‌ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
అటవీ భూములు అన్యాక్రాంతం కాలేదు
మాచవరం: పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో ఫారెస్ట్ లాండ్స్ లేవని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయోమో పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడి భూమలను శనివారం పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు మాచవరం మండలం చెన్నయపాలెం, దాచేపల్లి మండలం తంగెడ శివారు అటవీ భూములను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు. అటవీ భూములు ఏవీ అన్యాక్రాంతం కాలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అటవీ భూములకు ఎనిమిది మీటర్ల దూరంలోనే సరస్వతీ భూములు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయినా మరో రెండు రోజులు మాచవరం మండలం భీమవరం, పిన్నెల్లి గ్రామాల సరిహద్దు భూములను కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట డీఆర్వో విజయలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ భూముల పరిశీలన మండలంలోని చెన్నయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో ఉన్న రెవెన్యూ భూములను తహసీల్దార్ క్షమారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ సంస్థకు చెందిన కొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయడం జరిగిందని, మరికొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయాల్సి ఉందని చెప్పారు. రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయ్యాయా లేదా అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. వార్తా కథనాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు ఆ గ్రామాల్లోని భూములలో సర్వే చేస్తామని తెలిపారు. -
లోకేష్ వస్తే పిల్లలు టైంకు తినొద్దా!
-
హైదరాబాద్ పబ్స్ లో అధికారుల సోదాలు
-
విశాఖలో అర్థరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు
-
ఈసీకి బాలినేని ఫిర్యాదు.. 19 నుంచి ‘ఒంగోలు’ ఈవీఎంల చెకింగ్
సాక్షి, ఒంగోలు అర్బన్: ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈవీఎంల పరిశీలనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయమై శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను విలేకర్లు అడగగా.. జరిగేది రీకౌంటింగ్ కాదని, డమ్మీ బ్యాలెట్లతో ఈవీఎంల పరిశీలన జరుగుతుందని చెప్పారు.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించనున్నట్టు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు రెండు ఈవీఎంల వంతున పరిశీలించనున్నట్లు తెలిపారు. -
మారని ఉద్యోగుల తీరు.. ఉదయం 11 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనం
-
ఐఏఎస్సా.. అయితే..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘మేం అధికారంలో ఉన్నాం. మా షాపులు తనిఖీ చేస్తారా.. ఎంత ధైర్యం.. మా జోలికొస్తే ఊరుకోం..’ ఇవి ఏ ఉద్యోగినో, చిన్న అధికారినో ఉద్దేశించి అన్న మాటలు కాదు. సాక్షాత్తు ఐఏఎస్ అధికారి అయిన సబ్ కలెక్టర్‌ను ఉద్దేశించి అన్న మాటలు. ‘ఐఏఎస్ అధికారి అయితే మాత్రం మా షాపుల్ని తనిఖీ చేస్తారా? తమాషాలు చేస్తున్నారా?..’ అంటూ తెలుగుదేశం నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను అడ్డుకున్నారు. దీంతో ఆయన మౌనంగా వెనుదిరిగారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. తెలుగుదేశం నేతల బరితెగింపుపై అధికార యంత్రాంగంలోను, ప్రజల్లోను తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా.. అన్నట్లు రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుంటే.. నియోజకవర్గస్థాయిలో తెలుగుదేశం నేతలు అదేరీతిలో రెచి్చపోయి వ్యవహరిస్తున్నారు. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం రాత్రి 10 గంటల సమయంలో యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ దుకాణాల తనిఖీకి వచ్చారు. సిబ్బందితో కలిసి పలు షాపుల్ని తనిఖీ చేశారు. తొలుత వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు చెందిన రేషన్ దుకాణాలను పరిశీలించారు. అనంతరం టీడీపీ సానుభూతిపరులకు చెందిన దుకాణాల తనిఖీకి వెళ్లారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ మీనాను ఉద్దేశించి తీవ్రపదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ‘మేం అధికారంలోకి వచ్చి నెలకాకముందే మా రేషన్ దుకాణాల్లోనే తనిఖీ చేస్తారా..’ అంటూ నిలదీశారు. ‘ఏం? ఐఏఎస్ అధికారి అయితే మాత్రం తమాషా చేస్తున్నారా..’ అంటూ మరికొందరు దూషణలకు దిగారు. పక్కనే ఉన్న పోలీసు అధికారులను కూడా దూషించారు. టీడీపీ నేతల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్ కలెక్టర్ తనిఖీలు నిలిపేసి వెళ్లిపోయారు. అడ్డుకున్నది అధికార పార్టీ నేతలు కావడంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక్క అధికారి కూడా కనీసం ఫిర్యాదు చేయలేదు. బ్లాక్ మార్కెట్‌కు బియ్యం టీడీపీ సానుభూతిపరుల దుకాణాల నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు తనిఖీలను అడ్డుకున్నారని తెలిసింది. టీడీపీకి చెందినవారి షాపులకు ఒక్కోదానికి సుమారు 30 క్వింటాళ్ల బియ్యం తక్కువ దిగుమతి అయినట్లు తెలిసింది. పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని స్టాక్‌పాయింట్ నుంచే నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్ కలెక్టర్ తనిఖీలో ఈ బండారం బయటపడుతుందనే భయంతోనే టీడీపీ నేతలు షాపుల తనిఖీనే అడ్డుకున్నారని తెలిసింది. అందుకే సబ్ కలెక్టరును కూడా లెక్కచేయకుండా ఎదిరించినట్లు భావిస్తున్నారు. తనిఖీకి వచ్చిన సబ్ కలెక్టర్, పోలీసు అధికారులపై టీడీపీ నేతలు విరుచుకుపడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నా జిల్లా యంత్రాంగం కనీసం స్పందించలేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి దీనిపై సమగ్ర విచారణ జరిపి అధికారుల విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఉత్తమ్ బృందం
-
కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి కేంద్ర బృందం ఏర్పాటు
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టును తనిఖీ చేసి నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలంటూ కేంద్ర జలశక్తి ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేసి, సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు, వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. -
మీ ఇష్టానుసారంగా వస్తారా?
సాక్షి, హైదరాబాద్: సమయపాలన పాటించకుండా..విధులకు మీ ఇష్టానుసారంగా వస్తే ఎలా అంటూ సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో పలు విభాగాలను మంత్రి పొంగులేటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు ఎంత మంది సమయానికి హాజరవుతున్నారో తెలుసుకునేందుకు ఉదయం 11:40 నిమిషాలకు మంత్రి సచివాలయంలోని రెవెన్యూ శాఖకు వెళ్లారు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చిలే కనిపించాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బందిని పిలిచి ఆరా తీశారు. ఎవరైనా సెలవులో ఉన్నారా అని అడిగారు. వారు చెప్పిన జవాబుతో ఆయన సంతృప్తి చెందలేదు. మీరే ఇలా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? ‘ఉదయం 11: 40 దాటినా ఇంకా 80 శాతం మందికిపైగా ఉద్యోగులు విధుల్లో రాకపోవడం ఏంటని..’ మంత్రి వారిని ప్రశ్నించారు. రిజిస్టర్ తనిఖీ.. పలు విభాగాల పరిశీలన తనిఖీలో భాగంగా ఉద్యోగుల హాజరు పట్టిక తీసుకురావాలని అక్కడే ఉన్న సిబ్బందిని మంత్రి ఆదేశించారు. రిజిస్టర్ పరిశీలించి ఒక్కో సెక్షన్లో ఈ సమయంలో కూడా ముగ్గురు నలుగురే ఉంటే ఎలా అని మండిపడ్డారు. ప్రభుత్వ వారధిగా మీరే సమయానికి రాకపోతే ఎలా? అన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి సమాచారం, అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళతారని నిలదీశారు. రెవెన్యూ విభాగంలోని ఐదు సెక్షన్లలో ఏ సెక్షన్లో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు, సెక్షన్ ఇన్చార్జ్పై చర్యలు తీసుకుంటాం సచివాలయంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సమయానికి విధుల్లోకి రావాలి. ఉద్యోగుల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి రావొద్దు. అనివార్య కారణాలు ఉంటే సెక్షన్ ఇన్చార్జ్కు సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారం లేకుండా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఆయా ఉద్యోగులు, సెక్షన్ ఇన్చార్జ్పై చర్యలు తప్పవు. – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల/మార్టూరు: నోవా అగ్రిటెక్ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం మార్టూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలను తనిఖీ చేసేందుకు వచ్చిన మైనింగ్ విజిలెన్స్ అధికారులపై తన అనుచరులతో పాటు ఏకంగా దాడికి పాల్పడ్డారు. గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలు చేయనిచ్చేది లేదంటూ తొలుత అధికారులను అడ్డగించారు. తనిఖీకి వచ్చిన మైనింగ్ ఏడీతోపాటు మిగిలిన అధికారులనూ దుర్భాషలాడారు. మైనింగ్ అధికారులతో వచ్చిన డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి తెగబడ్డారు. గౌరవప్రదమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి పరిశ్రమలను తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులపై బరితెగించి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారు. విచారణ జరిగితే అక్రమాలు వెలుగుచూస్తాయన్నా భయంతోనే ఏలూరి దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే మార్టూరు గ్రానైట్ పరిశ్రమల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో నెల్లూరు మైనింగ్ విజిలెన్స్ ఏడీ బాలాజీనాయక్, మచిలీపట్నం మైనింగ్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం తనిఖీల నిమిత్తం మార్టూరుకు వచ్చారు. బాలాజీనాయక్ బృందం బల్లికురవ మండలం వేమవర వద్ద ఉన్న ఎమ్మెల్యే ఏలూరి అనుచరుడు కోటపాటి సురేష్‌కు చెందిన రెండు ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించగా మచిలీపట్నం ఏడీ ప్రతాప్‌రెడ్డి మార్టూరులోని ఏలూరి మరో అనుచరుడు కామినేని జనార్దన్‌కు చెందిన ఫ్యాక్టరీలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని మార్టూరులోనే ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు తెలియజేయడంతో అనుచరులతో సహా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏడీ ప్రతాప్‌రెడ్డిని ఎలా తనిఖీలు చేస్తారంటూ నిలదీశారు. తనిఖీలు చేస్తామంటే చూస్తూ ఉరుకునేది లేదంటూ గొడవకు దిగాడు. అనుచరులతో కలిసి అధికారులను దుర్భాషలాడారు. వారిపై జులుం ప్రదర్శించారు. ఏడీ ప్రతాప్‌రెడ్డిపై జరుగుతున్న దౌర్జన్యం చూసి అడ్డుకోబోయిన డ్రైవర్ శ్రీనివాసరావుపై ఏలూరి అనుచరులు దాడికి దిగారు. అతనిని ఇష్టానుసారం కొట్టారు. ఫ్యాక్టరీ ఆవరణలోని ఓ గదిలో బంధించారు. ఎమ్మెల్యే, అనుచరులపై కేసులు నమోదు ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నరసింహారావు మంగళవారం రాత్రి తెలిపారు. ఏలూరి సాంబశివరావు, ప్రత్తిపాటి సురేష్, చల్లగుండ్ల కృష్ణ, దివ్య ప్రసాద్, షేక్ అబ్దుల్ రజాక్, మిన్నెకంటి రవి, అడుసుమల్లి శ్రీనివాసరావు, నడింపల్లి హనుమాన్ ప్రసాద్, మరికొందరిపై మైనింగ్ ఏడీ ఆర్ ప్రతాప్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. వీరిపై ఐపీసీ 341, 353, 323, 324, 427, 386, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. -
మేడిగడ్డ: విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీస్‌లో విజిలెన్స్ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఫోర్స్మెంట్ తనిఖీలు చేస్తోంది. మహాదేవపూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మెడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేస్తోంది. -
ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా మంగళవారం రాత్రి మొదలు నిరంతర పర్యవేక్షణ పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాం. ప్రతి ఫిర్యాదుపై దగ్గర్లోని వీడియో సర్వేలన్స్ బృందాలు వెళ్లి విచారణ చేస్తాయి.’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకల పంపిణీని కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా 24్ఠ7 పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్ రూమ్స్ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. స్థానికేతరులందరూ వెళ్లిపోవాలి... ఎన్నికల ప్రచారానికి తెరపడిందని, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందని వికాస్ ప్రకటించారు. రాజకీయ, ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలతో పాటు 114 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులందరూ నియోజకవర్గాలను విడిచి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు ప్రతి పార్టీ నిషేధాజ్ఞలు పాటించాలి నిషేధాజ్ఞలను అనుసరించాలనీ, టీవీ, సినిమా, రేడియో వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదనే నిబంధనలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు వికాస్‌రాజ్ సూచించారు. ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధ గంట వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదన్నారు. మీడియా సర్విఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆమోదంతోనే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజేస్లపై నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీల స్టార్ క్యాంపైనర్లు పత్రికా సమావేశాలు పెట్టరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు ఈవీఎంల తరలింపును ఫాలో కావచ్చు.. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించడం, మొబైల్ ఫోన్స్, కార్డ్‌లెస్ ఫోన్లు, వాహనాలతో రావడంపై నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకుని రావడం, తీసుకెళ్లడం కోసం వాహనాలను సమకూర్చడం నేరమని హెచ్చరించారు. ఈవీఎంల మూడో ర్యాండమైజేషన్ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేందాలకు బుధవారం ఉదయం పోలింగ్ సిబ్బంది వచ్చాక వారికి ఈవీఎంలను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ఈవీఎంలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో అభ్యర్థుల ఏజెంట్లు తమ వాహనాల్లో ఫాలో కావచ్చని సూచించారు. నిర్దేశిత రూట్లలోనే ఈవీఎంలను రవాణా చేయాల్సి ఉంటుందని, మధ్యలో ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు అభ్యర్థి ఒక వాహనం వాడడానికి మాత్రమే అనుమతిస్తామని, ఏజెంట్‌కు మరో వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్ స్లిప్పుల్లో అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ గుర్తు ఉండరాదన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదు.. పోలింగ్ రోజు మాక్ పోల్ కోసం అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోల్ నిర్వహించిన తర్వాత వీవీ ప్యాట్ కంపార్ట్మెంట్ను ఖాళీ చేయాల్సి ఉంటుందని, కంట్రోల్ యూనిట్ మెమోరీని సైతం డిలీట్ చేయాలన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదని, లేనిపక్షంలో ప్రిసైడింగ్ అధికారులు వారిని బయటికి గెంటివేస్తారన్నారు. పోస్టల్ బ్యాలెట్లో విఫలం కాలేదు.. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పనలో విఫలమైనట్టు వచ్చిన ఆరోపణలను వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి సదుపాయం కల్పించామన్నారు. 27,178 మంది ఇంటి నుంచే ఓటేయగా, వారిలో 15,999 మంది 80ఏళ్లుపైబడినవారు, 9459 మంది దివ్యాంగులు, 1720 మంది అత్యవసర సేవల ఓటర్లున్నారని వెల్లడించారు. మరో 10,191 మంది సర్విసు ఓటును ఎల్రక్టానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్నారని, డిసెంబర్ 3న ఉదయం 7.59 గంటలకు అవి సంబంధిత కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 1.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నాటికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సంబంధిత నియోజకవర్గానికి పంపించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఎక్ఛేంజ్ కేంద్రం పెట్టామని ఆయన వివరించారు సెక్టోరియల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు... ప్రతి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఒక్కో సెక్టోరియల్ అధికారిని నియమించామని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారని వికాస్‌రాజ్ తెలిపారు. శాంతిభద్రతల సమస్యలొస్తే చర్యలు తీసుకునే మెజిస్టీరియల్ అధికారాలు వారికి ఉంటాయన్నారు. ఎక్కడైన ఈవీఎంలు పనిచేయని పక్షంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఈవీఎంలను వారే సమకూర్చుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహమద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్ 30న పోలింగ్ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు. -
ఎన్నికలపై ఎక్సైజ్ నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో అధికారులు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర సరిహద్దుల వెంట వాహనాలను తనిఖీ చేసేందుకు 21 శాశ్వత ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో 8, మహారాష్ట్ర సరిహద్దులో 8, కర్ణాటక సరిహద్దులో 4, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. పోలీసులు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సమన్వయంతో 89 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, 4 సరిహద్దు మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 8 ఇన్కమింగ్ రైలు మార్గాల నుండి వచ్చే రైళ్లను తనిఖీ చేయడానికి 13 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదుపులో 29,663 మంది ఈనెల 5న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షా సమావేశం తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ఇప్పటివరకు రూ.1.14 కోట్ల విలువైన 14,227 లీటర్ల మద్యం, 1,710 కిలోల బెల్లం, 170 కిలోల గంజాయి, 21 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,663 మంది అనుమానాస్పద వ్యక్తులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 14 మందిపై పీడీ యాక్టు నమోదు చేశారు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న 8,362 మంది నిఘా పరిధిలో ఉన్నారు. -
రాజమండ్రి స్టేషన్లో రైల్వే జీఎం తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా దువ్వాడ–రాజమండ్రి సెక్షన్ల మధ్య రియర్ విండో తనిఖీ ద్వారా ట్రాక్, సిగ్నలింగ్ భద్రత వ్యవస్థ అంశాలను పరిశీలించారు. అక్కడ నుంచి రాజమండ్రి స్టేషన్లో పర్యటించి క్రూ కంట్రోల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, అక్కడి సిబ్బంది బుకింగ్ లాబీ పనితీరును సమీక్షించారు. లోకో పైలట్లు, గార్డుల విధుల నిర్వహణకు సంబంధించిన క్రూ మేనేజ్మెంట్ పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా రన్నింగ్ స్టాఫ్‌ని డ్యూటీకి తీసుకునే ముందు తగిన విశ్రాంతిని అందించడంపై దృష్టి సారించాలని, అలాగే సిబ్బందికి తగిన విశ్రాంతి ఉండేలా డ్యూటీ నిర్వహణ పద్ధతిని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మల్టిపర్పస్ స్టాల్స్, వన్ స్టేషన్– వన్ ప్రొడక్ట్ స్టాల్స్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల సౌకర్యాలపై సమీక్షించారు. స్టేషన్ ఆవరణలో త్వరలో ప్రారంభం కానున్న రైల్ కోచ్ రెస్టారెంట్‌ను కూడా ఆయన సందర్శించారు. ఆయనతో పాటు విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కలిసి పలు రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడి వినతిపత్రాలు అందజేశారు. -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
సర్టీఫికెట్ల తనిఖీకి ప్రత్యేక సెంటర్!
సాక్షి, హైదరాబాద్: గురుకుల కొలువుల నియామకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏర్పా ట్లు చకచకా చేస్తోంది. ఇప్పటికే అర్హత పరీక్షలన్నీ నిర్వహించిన బోర్డు... మెజార్టీ సబ్జెక్టు లకు సంబంధించి తుది కీలను సైతం విడుదల చేసింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ కేట గిరీలకు సంబంధించి కోర్టు పరిధిలో కేసులుండటంతో ఆయా పరీక్షల తుది కీలను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఫైనల్ కీలు ఖరారు చేసిన సబ్జెక్టులకు సంబంధించి మెరిట్ జాబితాలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. 9,210 పోస్టుల భర్తీకి.. గురుకుల విద్యా సంస్థల్లో ప్రధానంగా 9 విభాగాల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్ఈఐ ఆర్బీ 9 రకాల ప్రకటనలు జారీ చేసింది. ఇందులో 61 సబ్జెక్టుల్లో ఈ పోస్టులున్నాయి. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేస్తూ మెరిట్ జాబితాలు విడుదల చేస్తారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టీఫికెట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ సెంటర్‌కు హాజరై పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. తొలుత జిల్లాల వారీగా పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం... మరోవైపు రెండు వారాల పాటు పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తుండడంతో హైదరాబాద్‌లో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందని బోర్డు అధికారులు అంచనాకు వచ్చారు. ఈమేరకు పరిశీలన కేంద్రం ఏర్పాటు, నిర్వహణపైన కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్లో తేదీల ఎంపిక... వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థి ముందుగా టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీల్లో అభ్యర్తికి అనుకూలంగా ఉన్న ఒక రోజును ఎంపిక చేసుకుని ఆమేరకు పరిశీలనకు హాజరుకావాలి. ఈనెల మూడో వారం నాటికి మెరిట్ జాబితాలు రెడీ చేసేలా బోర్డు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మెరిట్ జాబితాలు ఖరారైన తదుపరి వారంలోనే పరిశీలన ప్రక్రియ ప్రారంభించనుంది. -
100 మందితో గర్ల్స్ హాస్టల్.. రాత్రుళ్లు 89 మంది మిస్సింగ్..
లక్నో: 100 మంది ఉన్నట్లు రిజస్టర్ చేసిన బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రిళ్లు 89 మంది మిస్ అయ్యారు. ఈ మేరకు రాత్రిపూట అధికారులు తనిఖీలకు వెళ్లగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన బాలికలపై ప్రశ్నించగా.. హాస్టల్ వార్డెన్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పరాస్‌పూర్ ప్రాంతంలో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మా సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. రిజిస్టర్లో 100 మంది పేర్లు నమోదు చేయగా.. కేవలం 11 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వేలేకపోయారు. దీంతో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్ చంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఓ టీచర్, హాస్టల్ వార్డెన్, వాచ్మెన్, ఓ జవాన్ పేర్లను నమోదు చేశారు. డిపార్టెమెంట్ కూడా సదరు వ్యవహారంపై చర్యలు తీసుకుంటోందని ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. ఇదీ చదవండి: Onion Price Hike: ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
జగిత్యాల: పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యులు సమయపాలన పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశా రు. డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లోనే ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం జగిత్యాల జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ సహా పత్తాలేని పలువురు మంత్రి వచ్చిన సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు విధుల్లో లేరు. దీంతో విచారణకు మంత్రి ఆదేశించారు. ఇక స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు వార్డుల్లో కలియ తిరిగారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ అరుణశ్రీ లీవ్ పెట్టకుండా వెళ్లిపోవడం, పీడియాట్రిక్‌లోని ఇద్దరు ప్రొఫెసర్లు విధుల్లో లేకపోవడం, అనస్తీషి యా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోపా టు, ఆప్తాల్మజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత లీవ్‌కు దరఖాస్తు చేయకుండా వెళ్లిపోవడంపై మంత్రి ఆ గ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులకు మెమో జారీచేయాలని డీఎంఏ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. కాగా, ‘వైద్యులు ఉన్నా.. లేనట్లే’శీర్షికన ఈనెల 7న ‘సాక్షి’కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి.. ఇటీవల జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పత్రిలోని వైద్యులతో నేరుగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు. -
అధికారుల వింత రూల్స్.. బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్ల చెకింగ్.. ఎందుకంటే..?
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ ఏ వింతైన నిబంధనను తీసుకువచ్చింది. ఇకపై బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ల ఫోన్లను కూడా తనిఖీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. చెకింగ్ అధికారుల రూట్ వివరాలను బస్సు డ్రైవర్లు తమ సహోద్యోగులకు చేరవేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. చెకింగ్ అధికారుల రూట్‌కు అనుగుణంగా ఇతర రూట్లలోని ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. సంస్థ ప్రయోజనాల కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారులు బస్సుల్లో చెకింగ్ చేసే సమయంలో మొదట బస్సు డ్రైవర్, కండక్టర్ ఫోన్లను చెక్ చేస్తారని మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ గార్గ్ తెలిపారు. చెకింగ్ సమయంలో డ్రైవర్, కండక్టర్ సహోద్యోగులకు సంబంధిత వివరాలను పంపినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని కనుగొన్నట్లు వ్లెడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి దయా శంకర్ సింగ్ కూడా ఈ నిబంధనలపై స్పందించారు. ఉద్యోగులందరూ ఈ నియమాలను పాటించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తామని ఉద్యోగులను హెచ్చరించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫోన్‌ను వాడడం తమ వ్యక్తిగత హక్కు అని చెబుతున్నాయి. వ్యక్తిగత వివరాలు సెల్ఫోన్లో భద్రపరుచుకుంటామని వెల్లడించాయి. చెకింగ్‌ల పేరిట తమ వ్యక్తిగత హక్కుకు భంగం వాటిల్లుతుందని తెలిపాయి. ఈ నిబంధనల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించాయి. ఇదీ చదవండి: పండుగ సెలవుల్లో విషాదం: రెస్టారెంట్లో పేలిన సిలిండర్.. 31 మంది దుర్మరణం -
తనిఖీ అధికారి యమ.. స్పీడ్..! ఇట్టే పసిగడుతుంది..! వీడియో వైరల్..
సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ ఒక్కోసారి విభిన్నరీతిలో వైరల్ అవుతోంది. ఒక్కోసారి చెప్పలేం ఏ కంటెంట్ వైరల్ అవుతుందో? ఎందుకు ఆ కంటెంట్‌ను వీక్షకులు ఇష్టపడుతున్నారో? తాజాగా ఓ క్యాలిటీ చెకింగ్ వీడియోకు గొప్పగా ఆదరణ లభించింది. కేవలం పది రోజుల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతకూ ఈ వీడియోలో ఉన్న విషయం ఏంటంటే..? క్యాలిటీ చెకింగ్ ఆఫీసర్ పనేంటో తెలుసు కదా? పదార్థం నాణ్యతను తనిఖీ చేస్తుంటారు. వీడియోలో బియ్యం గోదాంలో బియ్యం క్వాలిటీని చెకింగ్ చేస్తుంది ఓ అమ్మాయి. అయితే.. కార్మికులు వరుసగా బియ్యం సంచులను మోసుకుంటూ వెళుతుండగా.. ఆవిడ ఒక్కరే అందరి సంచుల్లోని బియ్యాన్ని చాలా వేగంగా తనిఖీ చేస్తోంది. నాణ్యత సరిగా లేని బియ్యం సంచిని పక్కకు తీసుకురమ్మని ఆదేశిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈవిడ స్పీడ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Tech | Engineering | Gadgets (@techniiverse) ఇదీ చదవండి: ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
యాదాద్రి భువనగిరి జిల్లా భీమనపల్లిలో కల్తీ పాల కలకలం
-
వంద రోజుల్లో అందరికీ కంటి పరీక్షలు
గజ్వేల్: వందరోజుల్లో అందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి పరీక్షల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటివెలుగు శిబిరాల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 70 లక్షల పైచిలుకు మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. వారిలో 32 లక్షలమంది పురుషులు, 37 లక్షల పైచిలుకు మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 48.91 లక్షల మందికి ఎలాంటి సమస్యల్లేవని తేలిందన్నారు. కంటి సమస్యలు ఉన్న 12 లక్షల మందికి రీడింగ్ అద్దాలు ఇప్పటికే పంపిణీ చేయగా, మరో 8 లక్షల మందికి 15 రోజుల్లో డాక్టర్లు సూచించిన అద్దాలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 4,565 పంచాయతీలు, 1,616 మున్సిపల్ వార్డుల్లో శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందన్నారు. తనిఖీ సందర్భంగా శిబిరాల్లో మెరుగైన సేవలందుతున్నాయని మహిళలు చెప్పడం తనకు ఆనందాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బంది, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, బీఆర్ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షులు బెండె మధు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇక పక్కాగా ఇన్ఫెక్షన్ల కట్టడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన మ్యాన్యువల్‌ను విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రి రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు తోడ్పడతాయని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, ఇటీవల మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు ఇన్ఫెక్షన్కు గురై మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, రోగుల చికిత్సలకు ఉపయోగించే పరికరాలను స్టెరిలైజ్ చేయడం, పీపీఈ కిట్లు వాడటం, లాండ్రీ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి చేయడం వంటివి చేపట్టాలని మార్గదర్శకాల్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమైన మార్గదర్శకాలు... ►రోగుల మూత్ర నమూనాలు, ఆసుపత్రుల్లోని నీటి నమూనాలు, వెంటిలేటర్లపై ఉన్న రోగుల మందుల నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబ్‌లో పరీక్షించి వాటి ఫలితాలపై ఆసుపత్రి అంటువ్యాధుల నియంత్రణ కమిటీ తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ►రోగులకు అందించే ఆహారాన్ని ప్రతి 4 నెలలకోసారి పరీక్షించాలి. ►తాగునీటిలో ఉండే బ్యాక్టీరియాపై నెలవారీ నిఘా చేపట్టాలి. పేషెంట్ కేర్ యూనిట్లు, హాస్పిటల్ కిచెన్, క్యాంటీన్లు, హాస్టళ్ల నుంచి ల్యాబ్‌లో ప్రతి నెలా ఒకసారి తాగునీటి పరీక్ష నిర్వహించాలి. ►వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులకు చేతి శుభ్రత శిక్షణా కార్యక్రమాన్ని నెలకోసారి తప్పనిసరిగా నిర్వహించాలి. ►బయో వ్యర్థాల నిర్వహణ, పారబోత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. సెంట్రల్ స్టోరేజీ ఏరియాలో బయోమెడికల్ వ్యర్థాలను నిల్వ చేయడానికి సురక్షితమైన, వెంటిలేషన్ ఉన్న ప్రాంతం కేటాయించాలి. ఆయా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ►అంటువ్యాధుల తీవ్రత ఉన్నప్పుడు రోగులు, సిబ్బంది, సందర్శకుల రాకపోకలను తగ్గించాలి. రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. ►అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్న సమయంలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. ►ఒకేసారి అవుట్‌బ్రేక్ జరిగితే వ్యాప్తిని గుర్తించి ప్రమాదంలో ఉన్నవారెవరో తెలుసుకోవాలి. -
ప్రైవేట్ ట్రావెల్స్ పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
-
మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థల్లో ఉద్యోగులను ప్రశ్నిస్తున్న CID
-
మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థల్లో తనిఖీలు
-
కొత్తపేటలో వీఎంసీ అధికారుల తనిఖీలు
-
పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్రబృందం ప్రశంసలు
-
డిప్యూటీ తహసీల్దార్‌పై టీడీపీ నేతల హత్యాయత్నం
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో రేషన్ షాపును తనిఖీ చేయడానికి వెళ్లిన డిప్యూటీ తహసీల్దారుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడే ప్రసాద్, ఆయన అనుచరులు హత్యాయత్నానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న వీఆర్వోపైనా దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరులో డీలర్ లుక్కా అరుణ్‌బాబు నిర్వహిస్తున్న రేషన్ దుకాణం (నం.27)లో స్టాకు తనిఖీకి డిప్యూటీ తహసీల్దార్ (పీడీఎస్) గుమ్మడి విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు. తనిఖీల్లో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అధికారులు డీలర్ స్టేట్మెంట్ తీసుకుని రిపోర్టు రాస్తున్న సమయంలో బోడే ప్రసాద్ రాత్రి 10 గంటలకు రేషన్‌షాపు వద్దకు వచ్చి.. తన వెంట వచ్చిన అనుచరులతో అధికారులపై దాడి చేయించారు. వారు డిప్యూటీ తహసీల్దార్ గొంతు నులిమి చంపే యత్నం చేశారు. రిపోర్టును బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ కంటికి తీవ్ర గాయమైంది. ఆయనకు కంటికి వైద్యం కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో వీఆర్వో మంగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. పరారీలో బోడే ప్రసాద్.. దాడి తర్వాత బోడే ప్రసాద్ పరారీలో ఉన్నట్టు పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై ఐపీసీ 353, 332, 323, 506, 392, 307 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఎ1గా బోడే ప్రసాద్, ఎ2గా వంగూరు పవన్, ఎ3గా కంఠమనేని పార్థు, ఎ4గా దొంతగాని పుల్లేశ్వరరావు, ఎ5గా కొల్లిపర ప్రమోద్‌కుమార్, ఎ6గా కిలారు ప్రవీణ్‌కుమార్, ఎ7గా బోడె మనోజ్, ఎ8గా కాపరౌతు వాసు, ఎ9గా కిలారు కిరణ్‌కుమార్, ఎ10గా చిగురుపాటి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు ఉన్నారని చెప్పారు. వీరిలో ఎ1, ఎ3 మినహా మిగతా వారిని బుధవారం అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు బోడే ప్రసాద్ కోసం గాలిస్తున్నామని సీఐ తెలిపారు. రేషన్ షాపు సీజ్ చేశాం ప్రతి నెలా అన్ని రేషన్ షాపుల్లో స్టాకు తనిఖీలు చేస్తాం. ఇందులో భాగంగానే పెనమలూరులో రేషన్‌షాపును తనిఖీ చేసి రిపోర్టు రాస్తుండగా దాడి చేశారు. ఈ ఘటనతో రేషన్‌షాపు సీజ్ చేశాం. తనిఖీకి వచ్చిన అధికారులపై దాడి చేయటం దారుణం. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. డీలర్‌ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. – జి.భద్రు, తహసీల్దార్, పెనమలూరు -
గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీ
సాక్షి, గుంటూరు/గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌ను బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల అధిపతులు, వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రోగులకు అందుతున్న వైద్యం, అందుబాటులో ఉన్న వసతులపై సమీక్షించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డైరెక్టర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాఘవేంద్ర తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ నాడు–నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల నిర్మాణాల కోసం ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా తమ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలలను తీసుకొస్తున్నట్టు తెలిపారు. గ్రామగ్రామానికీ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు తీసుకొస్తున్న గొప్ప ప్రభుత్వం తమదన్నారు. టెలి మెడిసిన్, నాడు–నేడు కార్యక్రమాలతో వైద్య రంగంలో ఏపీ రోల్‌మోడల్‌గా నిలుస్తోందన్నారు. మెడికల్ అడ్మినిస్ట్రేటర్ల నియామకం నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలల్లో, టీచింగ్ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. వైద్య పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెడికల్ సూపరింటెండెంట్లు వైద్య సేవలపైనే దృష్టి కేంద్రీకరించేలా.. నూతనంగా మెడికల్ అడ్మినిస్ట్రేటర్లను నియమిస్తామని, వైద్య పరికరాలు, శానిటేషన్, సెక్యూరిటీ, సివిల్, ఎలక్ట్రికల్ పనులన్నీ అడ్మినిస్ట్రేటర్లు చూస్తారని తెలిపారు. -
ఇంప్లాంట్ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ
గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్ (మెటల్ ప్లేట్) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్ ప్లేట్ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌహతి ఎయిర్‌పోర్టులో వృద్ధురాలికి అవమానం -
జగనన్న కాలనీలను పరిశీలించిన మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు
-
జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించిన హెచ్ఎండీఏ తాజాగా తక్కువ విస్తీర్ణంలోని అక్రమ భవనాలపై దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీలలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. వివిధ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగాలు, మున్సిపల్ అధికారులు, పోలీసులు తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలతో త్వరలోనే విస్తృత స్థాయిలో దాడులు చేపట్టనున్నారు. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. గత నెల 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించారు. నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. చట్టవిరుద్ధమని తెలిసినా.. గ్రామ పంచాయతీలలో జీ+2 కోసం అనుమతులు తీసుకొన్న భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అయిదారు అంతస్తుల భవనాలను నిర్మించారు. హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతలలో చాలా వరకు 600 నుంచి1000 గజాల విస్తీర్ణం కలిగిన స్థలాలు. ఇక నుంచి 600 చదరపు గజాల లోపు స్థలాల్లోనూ చేపట్టిన అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా దాడులు కొనసాగించనున్నారు. 150 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాల్లో కూడా చాలా చోట్ల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. ఇలాంటివి పూర్తిగా చట్టవిరుద్ధం. (క్లిక్: ఫ్లాట్ కొంటున్నారా? ఏం చేస్తే బెటర్!) అక్రమాలు వేల సంఖ్యలో.. నగర శివారు ప్రాంతాల్లో వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామపంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. కోవిడ్ కాలంలో ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన అక్రమ కట్టడాలు వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. కొరవడిన నిఘా... హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతల్లో తిరిగి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూల్చిన కట్టడాలను ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఎమ్మెల్యేల అండతో తిరిగి నిర్మిస్తున్నారు. నిజాంపేట్, తుర్కయంజాల్, పోచారం, ఘట్కేసర్, అన్నోజీగూడ తదితర చోట్ల ఇలా పునర్నిర్మించి కొనుగోలుదారులకు అప్పగించారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో TSRTC MD సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
-
సవాళ్లే సక్సెస్‌కు మెట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొట్టమొదటి మహిళా రిఫైనరీ యూనిట్ హెడ్‌గా సమర్ధంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్లా మిస్త్రీ. పురుషాధిపత్య విభాగమైన మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ లీడర్‌గా కొనసాగుతున్న శుక్లా ఈ యేడాది ప్రతిష్టాత్మక ఇటిప్రైమ్ ఉమన్ లీడర్షిప్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. గతంలో భారతీయ హైడ్రోకార్బన్ పరిశ్రమలోనూ మొట్టమొదటి మహిళా ఇన్స్పెక్షన్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం శుక్లా ఖాతాలో ఉంది. వారంలో అన్ని షిఫ్టులలోనూ, సమ్మె రోజున కూడా సమర్థంగా విధులను నిర్వర్తించిన అధికారిగా, సహోద్యోగులకు రోల్‌మోడల్‌గా నిలుస్తారు శుక్లా. అత్యుత్తమ సంస్థాగత నైపుణ్యాలతో, ఏ మాత్రం సంకోచం లేకుండా కీలక విధులను నిర్వర్తిస్తారనే ఘనత ఆమెది. వెస్ట్ బెంగాల్‌లోని సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్న బసంతి అనే ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగారు శుక్లా మిస్ట్రీ. ప్రతి యేటా వరదలకు గురవుతుండే ఆ గ్రామానికి పడవ సాయం తప్ప రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. కరెంటు, కాలేజీలు లేని చోటు నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఇంజినీర్‌గా చేరడానికి ఎన్నో అవరోధాలను అధిగమించారు. అంచెలంచెలుగా రిఫైనరీ హెడ్‌గా ఎదిగారు. ‘మన దారి ఎప్పుడూ సునాయసంగా ఉండదు. కష్టాలు అనే బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. సవాళ్లుగా వాటిని ఎదుర్కొని, ప్రయాణం కొనసాగిస్తేనే గమ్యానికి చేరగలం’ అంటారు ఐదు పదుల వయసున్న శుక్లా. సామర్థ్య నిరూపణ రిఫైనరీ కార్యకలాపాలలో ప్రత్యేక శ్రద్ధ అన్నివేళలా అవసరం. లేదంటే, ప్రమాదకరస్థితిని ఎదుర్కోక తప్పదు. అలాంటి కీలమైన విధి నిర్వహణ గురించి శుక్లా వివరిస్తూ ‘ముడిసరుకును మెరుగుపరిచే ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుంది. వారంలో అన్ని షిఫ్టులకీ లీడ్ చేయడం తప్పనిసరి. అందరికీ సరైన గైడ్‌లైన్స్ ఇస్తూ ఉండాలి’ అని వివరిస్తారు ఆమె. పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో దూరపు బంధువు అందించిన సాయంతో, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1986లో ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఐఓసీలో చిన్న పోస్టులో చేరారు. అక్కడ మగవాళ్లు ఆన్సైట్లో పనిచేయడం చూసి, ఈ రంగంలో మహిళ ఎదగడానికి హద్దులున్నాయని గమనించారు. ఒక మహిళా ఇంజినీర్‌గా ఆఫీసులోనే కాకుండా పట్టుదలతో సైట్లో పనిచేయడానికి అనుమతి లభించేలా కష్టపడ్డారు. కానీ, ఆ సవాల్ అక్కడితో ఆగలేదు. శుక్లా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘మగ సహచరులతో పనిచేయగల అర్హతను సంపాదించుకోవడమే కాదు తగిన సామర్థ్యాన్ని కూడా చూపగలగాలి’ అంటారామె. అందుకు కొన్నేళ్ల సమయం పట్టిందని వివరిస్తారు శుక్లా. అవకాశాల కల్పనకు కృషి ఐసిఎఫ్ఎఐ నుంచి మోడర్న్ టెక్నాలజీలో డిప్లమా కూడా చేసిన శుక్లా నిర్వర్తించే విధులను గమనిస్తే అత్యంత చురుకుదనం, మానసిక శక్తి అవసరమయ్యే కఠినమైన ఉద్యోగం ఇది అని తెలుస్తుంది. మహిళలు కఠినమైన పని చేయడానికి ఇది తమకు తగనిది అని భావించడం తప్పు అనే శుక్లా ‘ఆడ–మగ తేడా లేదు. ఒకసారి పని మొదలుపెడితే ఎవరైనా దానిని సజావుగా పూర్తి చేయగల సామర్థ్యం తప్పక కలిగి ఉంటారు. అప్పుడు సమస్యలు, సవాళ్లు ఏవైనా కాలక్రమేణా తగ్గిపోతుంటాయి. మెరుగైన పనిని ‘చేయగలను’ అని సంకల్పించుకుంటేనే అవకాశాలు మనకోసం నడిచి వస్తాయి. అందుకు ప్రకృతి కూడా మన సమర్థతను నిరూపించుకోగలిగే స్థైర్యాన్ని ఇస్తుంది’ అంటారు. మనల్ని మనం అంగీకరిస్తేనే.. శుక్లా ఈ ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో ఇండియన్ ఆయిల్స్‌లో ముగ్గురు మహిళలలో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత తన పనితనాన్ని నిరూపించుకుంటూ ఒక్కో మెట్టును అధిరోహించుకుంటూ వెళ్లారు. తరచూ దేశవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణిస్తూ, అవగాహన పెంచుకోవడంతో పాటు, సవాళ్లను ఎదుర్కోవడానికి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ‘మగ సహచరులతో కలిసి పనిచేసే వాతావరణాన్ని మనమే తయారుచేసుకోవాలి. నేను సైట్లో వచ్చిన మొదటి రోజుల్లో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడకున్నారు. కానీ, నన్ను నేను నిరూపించడం మొదలుపెట్టేసరికి ఇతరులూ నా సమర్థతను అంగీకరించడం ప్రారంభించారు. నేను వృత్తిరీత్యా కతార్‌కు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆఫీస్‌ను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నాను. 75 మంది గల గల్ఫ్ దేశ సభ్యులలో ఏకైక మహిళగా ఏడాది పాటు పనిచేశాను. సాధారణంగా మహిళలు డెస్క్ జాబ్‌లు సరైనవి అన్నట్టుగా భావిస్తుంటారు. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు తమ సామర్థ్యాలను తాము గుర్తిస్తున్నారు. చేయగలం అని నిరూపిస్తున్నారు. ఈ రంగంలో అమ్మాయిలు బాగా రాణించగలరు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని వివరిస్తారు శుక్లా. అవార్డుల నిధి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మొదటి మహిళా యూనిట్ హెడ్‌గా చరిత్ర సృష్టించిన శుక్లా గతంలో ఎన్పిఎంపీ అవార్డు, పెట్రోఫెడ్ బెస్ట్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ అవార్డ్, కైజెన్ అవార్డ్ ఫర్ బెస్ట్ సజెషన్, పెట్రోటెక్ ఉజాసిని అవార్డు మొదలైన అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న శుక్లా మంచి వక్త. వ్యాస రచన, కవిత్వం, క్రీడల పైనా ఎంతో ఆసక్తి చూపుతారు. కష్టంగా అనిపించే పనులను పట్టుదలతో చేపట్టి, సంకల్పబలంతో సాధించి, ఆశ్చర్యపరిచే విజయాలను సొంతం చేసుకునే శుక్లా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఏపీలో సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు
-
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు
-
కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం భవనాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని గురువారం ఆయన సందర్శించి పనులను పరిశీలించారు. పనుల వేగం, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారుల కృషిని అభినందించారు. మంత్రి, అధికారులు, నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలిస్తూ అప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలిచ్చారు. సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగి..తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర పనులకు సూచనలు చేశారు. ఎలివేషన్ ప్రకాశవంతంగా ఉండాలి సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శించి చూపారు. వాటి నాణ్యత, కలర్, డిజైన్లను పరిశీలించిన సీఎం.. ఎలివేషన్ ప్రకాశవంతంగా, అందంగా కనిపించేలా చూడాలన్నారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ఫైనల్ చేశారు. మోడల్ వాటర్ ఫౌంటెయిన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను కేసీఆర్ పరిశీలించారు. కాగా స్కై లాంజ్ నిర్మాణం గురించి సీఎంకు అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం ఇదే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్అండ్బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో.. -
గెజిట్ నోటిఫికేషన్ అమలుపై తాడోపేడో
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ జులై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై తాడోపేడో తేల్చుకోవడానికి బోర్డు సిద్ధమైంది. ఆపరేషనల్ ప్రోటోకాల్‌ను రూపొందించేందుకు ఈనెల 12, 13న నాగార్జునసాగర్, దాని నుంచి నేరుగా నీటిని వాడుకునే ఔట్లెట్లు (సాగర్ స్పిల్ వే, ప్రధాన విద్యుత్కేంద్రం, సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, విద్యుత్కేంద్రం, సాగర్ కుడి కాలువ హెడ్‌రెగ్యులేటర్, విద్యుత్కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, సాగర్ వరద కాలువ)లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కృష్ణా బోర్డు ఓ కమిటీని పంపుతోంది. గత నెల 26న కృష్ణా బోర్డు కమిటీని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పరిశీలనకు తెలంగాణ జెన్కో, నీటిపారుదల శాఖ అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తన అధీనంలో ఉన్న నాగార్జునసాగర్‌ను పరిశీలించేందుకు బోర్డు కమిటీని తెలంగాణ సర్కార్ అనుమతిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ అనుమతించకపోతే అదే అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని బోర్డు నిర్ణయించింది. అలాగే, కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసే మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపడతామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. తొలుత అంగీకరించి ఆపై అడ్డంతిరిగి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తీసుకుని.. వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 అవుట్లెట్లు (ప్రాజెక్టులు)ను నిర్వహించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. బోర్డు సూచనల మేరకు ఏపీలోని హంద్రీ–నీవా (మల్యాల, ముచ్చుమర్రి పంప్ హౌస్‌లు), పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం స్పిల్ వే, కుడిగట్టు విద్యుత్కేంద్రం, సాగర్ కుడి కాలువ విద్యుత్కేంద్రాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ సర్కార్‌తో చర్చించి శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి పంప్ హౌస్, సాగర్ స్పిల్ వే, ప్రధాన విద్యుత్కేంద్రం, సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, విద్యుత్కేంద్రం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్; ఏఎమ్మార్పీ, సాగర్ వరద కాలువలను బోర్డుకు అప్పగిస్తామని బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు తెలిపారు. ఆ తర్వాత వారు అడ్డం తిరిగారు. నిర్వహణ నియమావళిపై అధ్యయనానికి మోకాలడ్డు శ్రీశైలం, సాగర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నిర్వహణ నియమావళి (ఆపరేషనల్ ప్రోటోకాల్)పై అధ్యయనం చేసి, ముసాయిదా నివేదికను రూపొందించేందుకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈనెల 25, 26న ఈ కమిటీ శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించింది. ఈ పర్యటనకు కమిటీలోని తెలంగాణ సర్కార్ తరఫున సభ్యులు గైర్హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పరిశీలనకు కమిటీని తెలంగాణ సర్కార్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ అధీనంలోని సాగర్ పరిశీలనకు కమిటీ 12, 13న పర్యటిస్తుందని ఇప్పటికే ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మురళీధర్‌లకు బోర్డు సమాచారం ఇచ్చింది. దీనిపై ఇప్పటిదాకా తెలంగాణ అధికారులు స్పందించలేదు. -
సాక్షి ఎఫెక్ట్: పెట్రోల్ బంకుల్లో అధికారుల తనిఖీలు
సాక్షి, అమరావతి: పెట్రోల్ బంకుల్లో చిప్‌లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న తీరుపై ‘కనికట్టు కొలత’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై తూనికలు–కొలతల శాఖ స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అసిస్టెంట్ కంట్రోలర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో విజయవాడలోని 7 పెట్రోల్ బంకులను అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా బంకులను పరిశీలించారు. పెట్రోల్ కొలతలు, నాణ్యతను పరీక్షించి రికార్డులను చూశారు. వారం పాటు ఈ తనిఖీలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు. చదవండి: కనికట్టు కొలత.. బంకుల్లో పెట్రోల్ కాజేస్తున్న చిప్‌లు -
అలా చేయడానికేనా ప్రభుత్వ ఉద్యోగం?
భద్రాచలం(ఖమ్మం): భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొబైల్ కోర్టు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌పై జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాచలంలో శనివారం పర్యటించిన కలెక్టర్ ఆకస్మికంగా మొబైల్ కోర్టును తనిఖీ చేశారు. బీరువాలు తీయించి ఫైళ్లను పరిశీలించగా, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనిల్‌కుమార్ కార్యాలయ విధులకు రాకుండా ఇంటి నుంచి కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. చదవండి: ( Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా ) హైదరాబాద్‌లో ఉండి సిబ్బంది ద్వారా ఫైళ్లు తెప్పించుకుని సంతకాలు చేస్తుండటమే కాకుండా స్వాతంత్య్ర వేడుకలకూ రాకుండా సిబ్బందితో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు తెలుసుకున్నారు. అలాగే వాద, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తించారు. దీంతో ఇంటి నుంచి పనిచేయడానికేనా ఉద్యోగమని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీనియర్ అసిస్టెంట్ రషీద్, రికార్డు అసిస్టెంట్ వహీద్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. తర్వాత న్యాయవాదులతో భేటీ కాగా, అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు అన్ని వసతులతో కూడిన భవనాన్ని మంజూరు చేయాలని వారు విన్నవించారు. చదవండి:( ముద్దు సీన్లలో నటించడం వాళ్లకు నచ్చేది కాదు: ప్రీతి జింగానియా ) -
రైతులా వచ్చిన సబ్ కలెక్టర్.. దుకాణాదారులకు ముచ్చెమటలు
కైకలూరు: అది కైకలూరు జాతీయ రహదారిపై అడవి నాయుడు సెంటర్. సమయం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలు. లుంగీ, షర్టు ధరించి ఓ వ్యక్తి బైక్‌పై ఎరువుల దుకాణానికి వచ్చాడు. యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. దుకాణం యజమాని ఓ తెల్లచీటీపై రాసి, పక్కనే గోడౌన్లో తెచ్చుకో అని పంపించాడు. అక్కడకెళ్లి రెండు బస్తాలను బైక్‌పై వేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చాడు. బోర్డులో సూచించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారేంటని నిలదీశాడు. రైతులందరి నుంచి ఇలానే వసూలు చేస్తున్నారా అంటూ గద్దించాడు.. అప్పటికి గానీ ఆ వ్యాపారికి అర్థంకాలేదు.. ఎరువుల కోసం వచ్చింది రైతు కాదు, విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ అని. అసలేం జరిగిందంటే... కలెక్టరు జె.నివాస్ ఆదేశాలతో సబ్ కలెక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ రైతు వేషధారణలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలకు ముదినేపల్లి మండలం దేవపూడి శ్రీలక్ష్మీగణేష్ ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. అప్పటికి దుకాణం తెరవలేదు. అక్కడే ఉన్న రైతులను ధరలపై ప్రశ్నించగా అధిక ధరలు అడుగుతున్నారని బదులిచ్చారు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓను పిలిపించి, ఆ దుకాణాన్ని తనిఖీచేసి, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత కైకలూరులో వాసవీ ఫెర్టిలైజర్స్‌కు వెళ్లి యూరియా కావాలని అడగ్గా, వ్యాపారి లేదని సమాధానం చెప్పాడు. అక్కడి నుంచి వెంకట నాగదత్త ఏజెన్సీస్‌కు వెళ్లి యూరియా, డీఏపీ కావాలని అడిగారు. యూరియా బస్తా ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ బస్తాకు రూ.1200 బదులు రూ.1250 తీసుకున్నారు. పైగా ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా విక్రయించారు. అనంతరం వాసవీ ఫెర్టిలైజర్స్‌లో తనిఖీ చేయగా గోడౌన్లో యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాలను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని తహసీల్దారు సాయి కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడీ జి.గంగాధరరావు, ఏఓ దివ్యను సబ్ కలెక్టర్ ఆదేశించారు. -
కారు వదిలి ట్రాక్టర్‌పై కలెక్టర్ రయ్ రయ్
సాక్షి, యాలాల: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటిక పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పౌసమి బసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగెంకుర్దు, బెన్నూరు, అగ్గనూరులో పర్యటించి, అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. సంగెంకుర్దులో శ్మశానవాటికను పరిశీలించేందుకు బయలుదేరగా కలెక్టర్ కారు బురద రోడ్డుపై ముందుకు కదలలేదు. దీంతో వాహనం దిగిన ఆమె స్థానికులు తెప్పించిన ట్రాక్టర్‌పై వెళ్లి పనులను పరిశీలించారు. క్రిమిటోరియం నిర్మాణా లకు సంబంధించిన బిల్లులు రావడం లేదని పలువురు సర్పంచ్‌లు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శ్రీలత, పటేల్‌రెడ్డి, భీమప్ప, పీఆర్ డీఈ కరణాకర్‌చారి, ఎంపీడీఓ పుష్పలీల, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ ఉన్నారు. వర్షం ముసిరేసి.. దంచేసి వికారాబాద్ అర్బన్: జిల్లాలో జోరు వాన కురిసింది శుక్రవారం ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు కాస్త శాంతించిన వరుణుడు ఆతర్వాత మళ్లీ దంచేశాడు. దీంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కాగా గురువారం అత్యధికంగా పూడూరులో 25.2, దౌల్తాబాద్‌లో 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దేముల్ 21, వికారాబాద్, కుల్క చర్లలో15, పరిగి14, దోమ, ధారూరు, బంట్వారంలో 12, మోమిన్‌పేట 9, నవాబుపేట్ 8.8, మర్పల్లి 7.8, తాండూరు 8.8, కొడంగల్‌లో 6.2, బషీరాబాద్ 5.8, బొంరాస్‌పేట్ 4.2, యాలాలలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వాహనాల తనిఖీలను పరిశీలించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తార్నాకలో సోమవారం పోలీస్ చెక్‌పోస్ట్‌ను డీజీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను పొడిగించిందని ఆయన అన్నారు. కరోనాను అంతం చేసేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో తెలంగాణలో నేరాల శాతం తగ్గిందని వెల్లడించారు. గూడ్స్ వాహనాలకు రాత్రి 9 నుంచి ఉదయం 11 గంటల వరకే అనుమతి ఉందని తెలిపారు. చదవండి: కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన..సీపీ చర్యలు -
గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
-
GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కోసం తాపత్రయ పడే జీహెచ్ఎంసీలో వాస్తవ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. వరుసగా మూడో రోజు ఆకస్మిక తనిఖీల్లోనూ మేయర్‌కు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, అధ్వాన్నపు పారిశుధ్య పరిస్థితులు దర్శనమిచ్చాయి. చెత్త తీసుకువెళ్లేందుకు స్వచ్ఛ ఆటోల వాళ్లు రావడం లేదని పలు ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ప్రాంతాల్లో పారిశుధ్యం జరగడం లేదని నింబోలిఅడ్డాలోని ప్రజలు మేయర్ దృష్టికి తేగా, సంబంధిత ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)ను తొలగించాలని ఆదేశించడంతో అందుకనుగుణంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో.. మేయర్ గద్వాల విజయలక్ష్మి క్షేత్రస్థాయి పర్యటనలతో చెత్త సమస్యలపై ఇప్పుడు దృష్టి సారించినప్పటికీ, జీహెచ్ఎంసీ ఈ అంశాన్ని ఎంతోకాలంగా వదిలేసింది. క్షేత్రస్థాయిలో ఈ పనులు నిర్వహించాల్సిన డీసీలు, ఏఎంఓహెచ్‌లు, ఎస్‌ఎఫ్‌ఏలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పట్టు లేకుండా పోయింది. దాంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. పేరుకు బయోమెట్రిక్ హాజరైనప్పటికీ, ఏ ఒక్కరోజు కూడా పారిశుధ్య సిబ్బంది టీమ్స్‌లోని సభ్యులందరూ హాజరు కారు. ఇవన్నీ పైస్థాయిలోని వారికి తెలియక కాదు. తెలిసినా పట్టించుకోలేదు. కేవలం స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం.. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరానికి తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చర్యలతో వారిని ఆకట్టుకునే పనులు చేస్తున్నారు. అంతేకాదు.. పౌరస్పందన విభాగంలో మార్కులు పొందేందుకు ప్రజల బదులు జీహెచ్ఎంసీ సిబ్బందే, అసలు విధులు పక్కనపెట్టి ఫీడ్‌బ్యాక్ పంపించారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ర్యాంకుల సర్టిఫికెట్లపై చూపే మోజులో నాలుగోవంతైనా వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తే ప్రజలకు చెత్త సమస్యలు తప్పుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేసినా ఉన్నతస్థాయిలోని యంత్రాంగం పట్టించుకోకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ చదవండి: అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు హైదరాబాద్ సిటీ బస్సులు తిరిగేది ఇక ఈ సమయంలోనే! -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన సామినేని
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో ధనంబోర్డ్ కాలనీ, కాకాని నగర్, డాoగే నగర్, యానాది కాలనీలో వరద ముంపు ప్రాంతాలను ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సామినేని వెంకట కృష్ణప్రసాద్, తన్నీరు నాగేశ్వరావు, సహా వివిధ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. హైవేపై దాదాపు రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. (విరిగిపడ్డ కొండచరియలు, ఒకరు మృతి) -
‘డబుల్’ కాక
లక్డీకాపూల్/తుక్కుగూడ/రామచంద్రపురం (హైదరాబాద్): డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన సవాల్ వేడి మరింత రాజుకుంది. రెండో రోజు శుక్రవారం ఇళ్ల పరిశీలన సవాల్ ప్రతి సవాల్ మధ్య సాగింది. ‘చెప్పింది ఒకటి.. చూపింది ఒకట’ని ప్రతిపక్షం విమర్శించగా.. ‘జాబితా ఇస్తాం.. మీరే చూసుకోండి’ అంటూ అధికారపక్షం పేర్కొంది. చివరికి ఇళ్ల పరిశీలన సైతం అర్థాంతరంగా ముగిసింది. దీనిపై భట్టి పారిపోయారంటూ మంత్రులు ఎద్దేవా చేయగా, ప్రభుత్వమే పారిపోయిందంటూ భట్టి ఎదురుదాడి చేశారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు రోడ్ నం.14లోని భట్టి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. అక్కడి నుంచి భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో కలసి మంఖాల్‌లో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. అనం తరం రాంపల్లిలో ఇళ్ల పరిశీలన కొనసాగుతుండగా కాంగ్రెస్ నాయకులు అర్ధంతరంగా విరమించుకొని వెనుదిరిగారు. ఆ తర్వాత కొల్లూరులో ఇళ్లను మంత్రులు తలసాని, మల్లారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మల్లెపల్లి లలితా సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్లో ‘లక్ష’ చూపించగలరా?: భట్టి గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు చూపిస్తామని శాసనసభలో చెప్పిన మంత్రి వాటిని జీహెచ్ఎంసీలోనే చూపించగలరా అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన ఇళ్లను చూపి ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ వీటినే చూపించి లబ్ధిపొందడానికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను గ్రేటర్ ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్‌లో కట్టిన ‘డబుల్’ఇళ్లను చూపించలేక శివారుకు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. మొత్తం ఇళ్లను చూపించమని అడిగితే జాబితా ఇస్తాం చూసుకోండంటూ అధికారపక్షం తప్పించుకు పారిపోయిందని భట్టి విమర్శించారు. జాబితా ఇస్తాం తనిఖీ చేసుకోండి లక్ష ‘డబుల్’ఇళ్ల జాబితా ఇస్తామని, కాంగ్రెస్ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్లి తనిఖీ చేసుకోవచ్చని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సవాల్ విసిరారు. కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో చేసిన సవాల్ మేరకు స్వయంగా భట్టి విక్రమార్కను తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించామన్నారు. ఈ రోజు కూడా వాటిని చూపించేందుకు తీసుకెళ్లగా, భట్టి మధ్యలోనే వెళ్లిపోయారని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా విలువైన భూముల్లో పేదలకు రెండు పడకల ఇళ్లు నిర్మిస్తున్నామని, వీటిలో ఆధునిక సదుపాయాలు సైతం కల్పిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు అగ్గిపెట్టెలాంటి ఇళ్లు నిర్మించారని, వాటిలోకి ఇప్పటివరకు ఎవరూ రాలేదని మంత్రులు విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ విలువైన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేదన్నారు. వీటిని చూసి తట్టుకోలేకే భట్టి విక్రమార్క మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. -
హాయ్‌ల్యాండ్‌లో అనధికార కోవిడ్ సెంటర్!
సాక్షి, మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఓ ప్రయివేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో అనధికార కోవిడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం రాత్రి మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు తనిఖీకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కొంతమంది కోవిడ్ రోగులు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం. మిగిలిన వారిని విచారించగా.. తాము హోం క్వారంటైన్లో ఉండలేక హాయ్‌ల్యాండ్‌లో ఉంటున్నట్టు చెప్పారు. రోజుకు ఒక్కో రూమ్‌కు ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. -
తనిఖీల కొరడా.. రికార్డులు గల్లంతు
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ దిశగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోపు ఫీజు నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలోని 9ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను కమిషన్ సభ్యుడైన కడప ఆర్జేడి కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో 20మంది వైఎస్సార్ జిల్లా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బట్టబయలయ్యాయి. తనిఖీ చేసిన ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు కమిషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో 8, శ్రీకాళహస్తిలో ఒకటి, మొత్తం 9ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో తనిఖీలు చేశారు. తిరుపతిలో జీఎస్ మా డవీధిలోని శ్రీచైతన్య, కరకంబాడిరోడ్డులోని స్ప్రింగ్‌డేల్, భవానీనగర్‌లోని సిల్వర్ ఓక్స్, శివజ్యోతినగర్‌లోని రత్నం, ముత్యాలరెడ్డిపల్లెలోని నారాయణ, కేశవరెడ్డి, హథీరాంజీ కాలనీలోని భాష్యం, రవీంద్రభారతి, శ్రీకాళహస్తిలో నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఈ తనిఖీలు చేశారు. రికార్డులు గల్లంతు ఒక్కో పాఠశాలకు ఇద్దరు చొప్పున కమిషన్ ప్రతినిధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కమిషన్ ప్రధానంగా ఫీజులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, సిబ్బంది, తరగతి గదులు, భవనం, క్రీడా మైదానం, విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ గుర్తింపునకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. అయితే చాలా పాఠశాలల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. అలాగే ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతభత్యాలు చెల్లించే రికార్డులు లేనట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అదనపు తరగతులు నిర్వహించడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని టాయ్లెట్లు లేకపోవడం, క్రీడా మైదానం లేకపోవడం వంటి అంశాలు వెలుగుచూశాయి. ఒకే తరగతిలో ఒక్కో విద్యార్థి నుంచి ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించారు. అలాగే రికార్డులు కాగితాలకే పరిమితమైనట్లు గుర్తించారు. పలు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ కమిషన్ బృందం నోట్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. ఈ నెలాఖరులోపు జూనియర్ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు సమాచారం. క్రీడామైదానం లేని నారాయణ ప్రైవేట్ పాఠశాల భవనం -
క్యూలో నిల్చుని.. నేలపై కూర్చుని..
నిజామాబాద్ అర్బన్: శుక్రవారం ఉదయం 8 గంటలు.. ఓ వ్యక్తి సైకిల్‌పై సాదాసీదాగా సర్కారు దవాఖానాకు వచ్చాడు. ‘జలధార’వద్దకు వెళ్లి లీటర్ నీటికి ధర ఎంత? అని ఆరా తీశాడు. ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్లో నిల్చుని మాట కలిపాడు. మెట్ల దగ్గర కింద కూర్చొని.. ఏం పెద్దయ్యా.. ఆరోగ్యం బాగా ఉందా అని అడిగాడు. వైద్యులు బాగానే చూస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నాడు. అక్కడి నుంచి గైనిక్, జనరల్ తదితర విభాగాల్లోనూ కలియ తిరిగాడు. అయితే, గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. వచ్చిన వ్యక్తి కలెక్టర్ అని తెలియడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి రోగులు, వారి బంధువులు అవాక్కయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ జిల్లాకు బదిలీపై వచ్చి మూడు రోజులవుతోంది. తాను బస చేసిన ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి సైకిల్‌పై బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. పార్కింగ్‌లో సైకిల్ స్టాండ్ వేసి మొదట ఆస్పత్రి ఆవరణలో జలధార కేంద్రానికి వెళ్లారు. లీటరు మంచినీరు రెండు రూపాయలకు విక్రయించడాన్ని గుర్తించారు. రూపాయికే విక్రయించాలి కదా అని అడగ్గా.. నిర్వాహకుడు రెండు రూపాయలే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అక్కడి నుంచి ఆస్పత్రిలోని ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్లో నిల్చుని మాట కలిపారు. వారి ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకున్న ఆయన.. వైద్యులు బాగానే చూస్తున్నారా.. సౌకర్యాలు సరిగా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గైనిక్, జనరల్ తదితర విభాగాల్లో కలియ తిరిగాడు. బాలింతలతో మాట్లాడారు. నాలుగైదు చోట్ల మెట్ల వద్ద, వార్డుల వద్ద కింద కూర్చొని రోగులతో మాట్లాడారు. ఓ రోగి బంధువును తనతో పాటు తీసుకుని వెళ్లి వార్డులను తనిఖీ చేశారు. జనరిక్ మందుల షాపులను పరిశీలించారు. వార్డు బాయ్‌లు, నర్సులు, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ శిబిరం వద్ద వివరాలు తెలుసుకున్నారు. అయితే.. గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. కలెక్టర్ వచ్చాడని తెలియడంతో వైద్యులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి రోగులు, వారి బంధువులు సంభ్రామాశ్చర్యానికి లోనయ్యారు. 111 సిబ్బందికి మెమోలు కలెక్టర్ మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. విధుల్లో గైర్హాజరైన 111 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. జలధార కేంద్రాన్ని సీజ్ చేశారు. -
రైతులను నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా
సాక్షి, సంగారెడ్డి: రైతులకు సంబంధించిన భూముల రికార్డు పనుల్లో కాలయాపన చేసే వారిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం కంది మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఇయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందరర్భంగా కార్యాలయంలోని భూ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన పాసు పుస్తకాలు, రికార్డులను త్వరగా అందజేసేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా తయారైన పాసు పుస్తకాలను తహసీల్దార్లే గ్రామాలకు వెళ్లి అందజేయాలన్నారు. కోర్టు కేసుల వివరాలను రిజిస్టర్లో పొందుపర్చాలని సూచించారు. వీఆర్ఓలు తమ వద్ద పట్టా పాసు పుస్తకాలను ఉంచుకోకూడన్నారు. మ్యుటేషన్లను పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. అవసరమైన సరి్టఫికెట్లను 24 గంటల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిఖం భూములు, ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే సహించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు తమ పేరున ఉన్న భూములకు సంబంధించిన రికార్డులను అందజేసేందుకు వీఆర్ఓ కాలయాపన చేస్తున్నారని ఉత్తర్‌పల్లికి చెందిన ఓ రైతు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రైతులను ఇబ్బంది పెడుతూ రికార్డులు అందజేయడంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తానని వీఆర్ఓ శంకరయ్యను హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, నాయబ్ తహసీల్దార్ సల్ల మల్లయ్య, ఆర్ఐ సంతో‹Ùకుమార్, వీఆర్ఓలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పటాన్చెరు టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచి్చన రోగులను, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్ని కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారని, రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ప్రసవాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మొత్తం కాన్పుల్లో 15 శాతం సాధారణమైనవి ఉంటేనే హెల్తీ ఇండెక్స్ కింద సూచిస్తుందని తెలిపారు. దాని ప్రకారంగా మన జిల్లాలో 25 శాతం వరకు ఉందన్నారు. రాష్ట్రంలో మనం బెస్ట్‌గా ఉన్నామని చెప్పారు. అయినప్పటికి 15 శాతానికి తీసుకురావాలన్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పని తీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రామ్మోహన్ రావు
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో తీరు మారలేదు. ఆస్పత్రిని కలెక్టర్ రామ్మోహన్ రావు గతంలో ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో పలువురు వైద్యులు అనధికారికంగా విధులకు హాజరుకాని విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. శనివారం కలెక్టర్ మరోసారి ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అదే పరిస్థితి ఎదురైంది. పలువురు వైద్యులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఆస్పత్రిలోని వివిధ వార్డులను సందర్శించగా, అత్యవసర విభాగంలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వర్తిస్తూ కనిపించారు. దీంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి లేకుండానే మరొకరికి బదులు గా అత్యవసర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ యుగేంధర్, అదేవిధంగా మెటర్నిటీ వార్డులో విధులకు గైర్హాజరైన వైద్యులు కృష్ణ కూమారి, నస్రీన్ ఫాతిమా, భీంసింగ్, స్టాఫ్ నర్సు ప్రేమలతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంఐసీ, ఐసీయూ, ఆర్థోపెడి క్ విభాగాలతో పాటు వంటగది, బ్లడ్‌బ్యాంకు, సదరం క్యాంపును కలెక్టర్ పరిశీలించారు. వివిధ విభాగాల వార్డుల్లో ఆస్పత్రి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. రోగులను పరామర్శించారు. రోగులకు ఎదురయ్యే సమ స్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నా రు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమ స్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది, అధికారులు సమస్వయంతో కలిసి పని చేయాలన్నారు. రోగులకు అసాకర్యం కలుగకుండా సేవలు అందించాలన్నారు. ప్రతిరోజు ఆస్పత్రి ని శుభ్రంగా ఉంచాలని, ఆస్పత్రి ఆవరణలో ఎక్కడకూడా చెత్త, ఇతర వస్తువులు కనిపించ కూడదన్నారు. వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నా రు. వార్డుల్లో స్పేస్ విభజన సక్రమంగా లేదని క లెక్టర్ పేర్కొన్నారు. ఒక్కో వార్డులో ఒక్కో విధం గా ఉందన్నారు. పరిశీలించి తగు విధంగా ఏ ర్పాటు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఆస్పత్రి సూ పరింటెండెంట్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ఆర్ఎంఓ ఉంటారన్నారు. ఈ కమిటీ పదిహే ను రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో పది లిఫ్ట్‌లు ఉండగా, రెండు మాత్రమే పని చే స్తున్నాయి. మిగతా లిఫ్ట్‌లకు వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాల ని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులకు మె నూ ప్రకారం భోజనం, టిఫిన్ అందించాలన్నారు. సదరం క్యాంపులో దివ్యాంగులకు వేగంగ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి ఆస్పత్రి అ భివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. -
ఇఎస్ఐ ఆసుపత్రుల్లో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, కర్నూలు : రాయలసీమ జోన్ జాయింట్ డైరెక్టర్ పరిధిలోని ఇఎస్ఐ ఆసుపత్రుల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని వచ్చిన నివేదిక మేరకు విజిలెన్స్ అధికారులు తగిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలోని డిస్పెన్సరీల్లో మందులకు సంబంధించిన రికార్డులను శనివారం తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం సాయంత్రానికి పూర్తి నివేదికను ఇవ్వననున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
కడప ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ దాడి!
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో 15మంది ప్రైవేటు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి తొంభైవేల మూడు వందల పది(90,310) రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆర్టీవో కార్యాలయం సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికి తనీఖీలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
వేగం పుంజుకున్న ‘యాదాద్రి’ పనులు
సాక్షి, యాదాద్రి : యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు శివాలయం, కొండ కింద చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. సీఎం కేసీఆర్ గతనెల 17న యాదాద్రిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన ఆదేశాలతో పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఫిబ్రవరిలో మహాయాగాన్ని చేపట్టి ప్రధానాలయంలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే. సీఎం ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంతోపాటు అధికారులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ప్రధానాలయం పనులను వేగవంతం కోసం అధికారులు, శిల్పులు శ్రమిస్తున్నారు. గర్భాలయం, ముఖమండపం, ఆలయంలో పంచనారసింహుల రాతి విగ్రహాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గర్భాలయంలో కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేయగా మరికొన్నింటిని ప్రతిష్టించే పనిలో ఉన్నారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం పక్కన మెట్ల పనులు జరుగుతుండగా, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి విగ్రహాల ఏర్పాటు, ఆలయ నవీకరణ, ఫ్లోరింగ్, ప్రాకార మండపాలు, తిరుమాఢవీధుల్లో ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. అష్టభుజి మండపాలపై శిల్పాలకు మెరుగుదిద్దడం, పంచతల రాజగోపురాలపై మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన సత్యనారాయణ వ్రతమండపం, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణ మండపం, అష్టభుజి ప్రాకారాల తుది మెరుగులతోపాటు ఆలయంలో విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. శివాలయం పనుల్లో కూడా వేగం పెంచారు. కొండపైన ఆలయం శిల్పాల పనులతో సమాంతరంగా సివిల్ పనులు చేస్తున్నారు. అలాగే కొండపైన వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. రహదారుల విస్తరణ పనులు.. యాదాద్రి ప్రధానాలయానికి నలుదిక్కులా రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు చేరుకునే రోడ్డు పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం పాతగుట్ట క్రాస్ రోడ్డు వద్ద నిలిచిపోయిన పనులను ప్రధానాలయం వరకు చేసే కార్యక్రమంలో అధికారులు బిజీబిజీగా ఉన్నా రు. రోడ్డు వెడల్పు చేయడంతోపాటు సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా మొక్కలు నాటడం, రోడ్డును తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నారు. రోడ్డు విస్తరణ విషయంలో బాధితులతో పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ వారికి ఆశిం చిన మేరకు లబ్ధి చేకూరడం లేదన్న ఆందోళనలో ఉన్నారు. నిర్వాసితులు తగిన నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కొత్త విద్యుత్ టవర్ల ఏర్పాటు రోడ్డు వెడల్పు సమయంలో విద్యుత్ టవర్లను ఏర్పాటు చేయడానికి ఆ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారి విస్తరణతో సమాంతరంగా టవర్లు ఏర్పాటు చేయడానికి ట్రాన్స్‌కో అధికారులు సిద్ధమయ్యారు. అధికారులు భూసేకరణ చేసే సమయంలోనే టవర్ల కోసం స్థల సేకరణ చేయనున్నారు. దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణ పనులను మంగళవారం ఉదయం వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు పరిశీలించారు. గర్భాలయం, రాజగోపురాలు, ఆలయ తిరుమాడ వీధులు, ఇటీవల వచ్చిన జయ, విజయుల ద్వార పాలకుల విగ్రహాలను పరిశీలించారు. అక్కడి నుంచి శివాలయానికి వెళ్లి పనులను పరిశీలించారు. ముఖ, నవగ్రహ మండపాల పనులను సరిగ్గా నడుస్తున్నాయా ? లేదా అని ఆరా తీశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నంచి నూతనంగా నిర్మాణం జరుగుతున్న ప్రసాద విక్రయశాల నిర్మాణ భవనాలను సందర్శించారు. ప్రసాదాల తయారీకి సంబంధించి మరిని మషనరీలరావడంతో వాటి ఉపయోగం గురించి ఆయనకు తెలియజేశారు. ప్రసాదాల తయారీకి సంబంధించిన 4అంతస్థుల భవనంలో ఏయే అంతస్థులో ఏమేమి వస్తాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థపతి ఆనందాచారి వేలు, ఆలయ ఈఓ గీతారెడ్డి, శిల్పులు మొగిలి, ఆదిత్య చిరంజీవి, పలువురు అధికారులు ఉన్నారు. -
పద్ధతి మారకపోతే పంపించేస్తా
సాక్షి, అనంతపురం: ‘‘ఇదేమైనా కార్యాలయమా..? మరేదైనా అనుకుంటున్నారా..? వేళకు రావాలని తెలీదా.? ఇష్టానుసారం ఎలా వస్తారు..? పద్ధతి మార్చుకోవాలి. తొలిసారి వదిలిపెడుతున్నా. మళ్లీ వస్తా. అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు.’’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయ ఉద్యోగులను హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్ పరిశీలించారు. టైపిస్ట్ విజయరాజు, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్ రిజిస్టర్లో సంతకాలు చేయకపోవడంతో వారు డ్యూటీకి రాలేదా? అని డీడీ యుగంధర్‌ను మంత్రి ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీసుకు వచ్చి బయోమెట్రిక్ వేసి అనుమతితో వెళ్లారని వివరించారు. వచ్చి కూడా రిజిస్టర్లో సంతకం చేయకపోతే ఎలా? ఏమనుకుంటున్నారు? అని మంత్రి మండిపడ్డారు. అనారోగ్య రీత్యా విజయరాజు సరిగా రావడం లేదని, వచ్చినా పని చేయడని డీడీ వివరించారు. మంత్రి స్పందిస్తూ రెగ్యులర్ ఉద్యోగి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే మరొకరిని నియమించుకుని పనులకు ఆటంకం కలుగకుండా చూడాలని సూచించారు. అర్జీల నమోదులో నిర్లక్ష్యంపై ఆగ్రహం ‘స్పందన’ కార్యక్రమానికి అందిన అర్జీల నమోదు ప్రక్రియ సరిగా లేకపోవడంతో మంత్రి శంకరనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కార్యాలయ ఆవరణను పరిశీలించారు. కార్యాలయ స్థలాన్ని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయించి బంకులను తొలగించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ తప్పనిసరి బీసీ సంక్షేమ వసతి గృహాల్లో కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీసీలను ఉన్నత స్థాయిలో చూడాలనే ఆలోచనతోనే ఆయన పాలన సాగిస్తున్నారన్నారు. పేదరికం కారణంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రుచికరమైన భోజనం అందించేందుకు ప్రతి విద్యార్థికీ నెలకు రూ.1,050 వెచ్చిస్తున్నామన్నారు. హాస్టళ్లను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం వసతి గృహాల స్థితిపై ఫొటోలు తీయిస్తున్నామన్నారు. రెండేళ్ల తర్వాత చేసిన అభివృద్ధిపై ఫొటోలు తీయించి ‘నాడు–నేడు’ అని ప్రజలకు తెలియజేస్తామన్నారు. అలాగే కార్పొరేషన్ ద్వారా అర్హులైన బీసీలకు సంక్షేమపథకాలు అమలు చేస్తామన్నారు. మంత్రి వెంట బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు యుగంధర్, అనంతపురం ఏబీసీడబ్ల్యూఓ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఉన్నారు. -
అతి పెద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పనుల పురోగతిపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుమారు రూ.1,355 కోట్ల వ్యయంతో 124 ఎకరాల విస్తీర్ణంలో 15,660 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కాలనీ... దేశంలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం గృహల కాలనీగా చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు. దాదాపు మున్సిపాలిటీగా ఉన్న ఈ కాలనీలో అంతర్గత రహదారులు, వీధి దీపాలు, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, పార్కులు, ప్లేగ్రౌండ్లు, పోలీసు స్టేషన్, పెట్రోల్ బంక్, విద్య సంస్థలు, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా మొట్టమొదటి హౌజింగ్ కాలనీగా గుర్తిపు పొందిందన్నారు. ఈ గృహాల్లో 9, 10 ,11 అంతస్తుల్లో 117 బ్లాకుల్లో అత్యంత ఆధునిక శీర్వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ ఫామ్ పద్దతిలో నిర్మాణం జరుగుతుందన్నారు. -
గురుకుల హస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీ,ఎమ్మెల్యే
-
కలెక్టర్ సీరియస్
సాక్షి, పోడూరు(పశ్చిమ గోదావరి) : కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మంగళవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో సిబ్బంది హడలెత్తిపోయారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్(ఏబీసీడబ్ల్యూఓ)ను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్టేరు సమీపంలో ఉన్న నెగ్గిపూడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను నాలుగునెలల కిందటే ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూలు ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచే స్కూళ్లు తెరిచినా ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ పొందకపోవడంతో తరగతులు నిర్వహించడంలేదు. 11 హాస్టళ్ల నుంచి దాదాపు 219 మంది విద్యార్థులు నెగ్గిపూడిలోని రెసిడెన్షియల్ స్కూల్లో చేరాల్సి ఉంది. ఇంతవరకు ఒక్కరూ చేరలేదు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో ఆయన రికార్డులను పరిశీలించడంతో ఈ వైఫల్యాలన్నీ వెలుగుచూశాయి. ఎస్సీ బాలికల హాస్టల్ పరిశీలన కలెక్టర్ రేవు ముత్యాలరాజు మంగళవారం మద్యాహ్నం తణుకు పట్టణంలో అకస్మికంగా పర్యటించారు. మంగళవారం తణుకులోని ఇరగవరం కాలనీలో గల ఎస్సీ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ ముత్యాలరాజు అకస్మికంగా తనిఖీ చేశారు. తను పరిశీలిస్తున్న విషయం కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్త పాటించారు. ముందుగా తణుకు మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే తణుకు పట్టణంలో గతంలో సేకరించిన రాజీవ్ స్వగృహ పథకంలో ఉద్యోగుల గృహ వసతి కోసం సేకరించిన 20.8 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అందులో విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఎల్ శివకుమార్ ఉన్నారు. -
అధికారుల వైఖరిపై స్మితాసబర్వాల్ అసంతృప్తి
సాక్షి, రామగుండం: గోలివాడ పంపుహౌస్ పనుల్లో పురో‘గతి’ లోపించడంతో పక్షం రోజుల్లోనే సీఎం పేషీ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం రెండోసారి పర్యటించారు. ఈనెల 2న సీఎం కేసీఆర్ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, గోలివాడ పంపుహౌస్ పనులను సందర్శించారు. ఆ సమయంలో వివిధ ప్రాజెక్టుల్లో అధికారులు పనుల పురోగతిపై ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రబీకి సాగు నీరందించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ మారిన రాజకీయ సమీకరణాలు, అకాల వర్షాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో వర్షాకాలానికి సాగు నీరందించాలనే లక్ష్యంతో సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 31లోపు నూరు శాతం పూర్తి కష్టమే... సీఎం కేసీఆర్ పర్యటన సమయంలో గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించిన సమయంలో వారం రోజుల్లో తొలిసారి ఒక మోటార్ డ్రైరన్ చేస్తామని, ప్రతీ పది రోజులకు ఒకసారి ఒక్కో మోటారు డ్రైరన్ చేసి మార్చి 31వ తేదీలోగా నూరుశాతం పంపుహౌస్‌ను వినియోగంలోకి తీసుకువస్తామని అధికారులు సీఎంకు విన్నవించినప్పటికీ పనుల పురోగతిని పరిశీలిస్తే కష్టమేనని తెలుస్తోంది. తాను పర్యటించి పక్షం రోజులైన గోలివాడ పంపుహౌస్‌లో ఒక్క మోటార్ కూడా డ్రైరన్ చేయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్ గోలివాడ పంపుహౌస్‌ను సందర్శించారు. తొమ్మిది మోటార్లలో ఒక మోటారును బిగించగా, మరో మూడు మోటార్లకు సిమెంట్ ప్లాట్‌ఫామ్స్ సిద్ధం చేయగా, మరో మూడింటికి ఇప్పుడే ఎరక్షన్ పనులు కొనసాగుతుండగా, మిగతా రెండు మోటార్ల పనులు ఇంకా ప్రారంభించలేదు. దీనికి తోడు అదనంగా మరో నాలుగు మోటార్లను స్టాండ్‌బైగా బిగింపుకు గోలివాడ పంపుహౌస్‌లో డిజైన్ చేశారు. ఎర్త్ పనులు నూరు శాతం పూర్తికాగా కాంక్రీట్ పనులు 43 వేల క్యూబిక్ మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. పంపుహౌస్పరిధిలోని 18 లైన్ల పైపులైన్ పనులలో 487 పైపులను 17,964 ఆర్ఎంటీతో వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15,044 పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ఇరవై నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జనవరి 28న డ్రైరన్‌కు కసరత్తు...? గోలివాడ పంపుహౌస్‌లో తొమ్మిది మోటార్లలో ఈనెల 28వ తేదీన తొలి మోటార్ డ్రై రన్ చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరొకటి ఫిబ్రవరి 25న, ఏప్రిల్ 10 నాటికి మిగతా ఏడు మోటార్లను వినియోగంలోకి తీసుకురానున్నట్లు పేర్కొంటున్నారు. మోటార్ల డ్రైరన్ గడువు పెరుగుతుండడం పట్ల సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టడం లేదని, పనుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతోనే పనులలో పురోగతి మందగిస్తుందని, ఇకనుంచి పనులు వేగవంతం చేస్తేనే ఏప్రిల్ పది నాటికి పూర్తయి వర్షాకాలం నాటికి సాగునీరందించే అవకాశం అందని సూచించారు. -
కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్
సాక్షి, భూపాలపల్లి/పెద్దపల్లి: రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన తొలి అధికార పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మేడిగడ్డకు చేరుకున్న కేసీఆర్ ప్రాజెక్టు పనుల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎప్పట్టిలోగా పూర్తవుతాయని ఆరా తీశారు. బ్యారేజీ పనులు సకాలంలో పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ పంపుహౌస్ నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. అంతకు ముందు ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ బ్యారేజీ పనులను కేసీఆర్ పరిశీలించారు. కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నారు. కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన సీఎం మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్ అక్కడి నుంచి కన్నెపల్లి పంపుహౌస్ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన కేసీఆర్ అధికారులను అడిగి పనుల పురోగతిపై ఆరా తీశారు. పంపుహౌజ్ పనుల పురోగతిపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి ఆయన అన్నారం బ్యారేజీకి చేరుకోనున్నారు. కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చిన కేసీఆర్‌ను మేడిగడ్డ పంపుహౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో సీతక్క, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డిలు ఉన్నారు. -
కాంగ్రెస్ కార్యాలయంలో తనిఖీలు : మండిపడ్డ ఎమ్మెల్యే
సాక్షి, వరంగల్ రూరల్ : ఎటువంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో తనిఖీలు చేయడం పట్ల కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం లేకుండా మా పార్టీ కార్యలయంలో తనిఖీలు జరిపే అధికారం అధికారులకు ఉంది. కానీ తనిఖీలు చేసే సందర్భంలో తహశీల్దార్, కమిషనర్, ఇంటి యాజిమాని లేదా పార్టీ కార్యాలయ బాధ్యునికైనా సమాచారం ఇవ్వడం కనీస ధర్మమన్నారు. నిబంధనలు పాటించకుండా మా పార్టీ కార్యాలయం తాళం పగలగొట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయించిన దుర్మార్గపు చర్యగా ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు తన రాజకీయ జీవితంలో ఎన్నడు చూడలేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ అధికారులకు, పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలంటూ అధికారులను కోరారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు.. చీరలు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంస్కృతి టీఆర్ఎస్ పార్టీదంటూ ఆయన ధ్వజమేత్తారు. -
కాళేశ్వరాలయంలో టీకాబ్ చైర్మన్ పూజలు
కొండూరి కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరున్ని టీక్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆలయానికి రాగా ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఈఓ శ్రీనివాస్ శాలువాతో సన్మాంచారు. వాయువేగంతో కాళేశ్వరం... అనంతరం రవీందర్రావు కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయివేగంతో జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీపతిబాపు, ధర్మకర్త అడుప సమ్మయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మహేష్ ఉన్నారు. -
వాటర్‌ప్లాంట్లపై దాడులు
మంచిర్యాలక్రైం : జిల్లా కేంద్రంలోని పలు వాటర్‌ప్లాంట్లపై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథి, కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారి రవీంద్రచారి ఆధ్వర్యంలో శనివారం దాడులు చేపట్టారు. ఈనెల 19న ‘సాక్షి’లో ‘నీళ్ల దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు పట్టణంలోని గంగోత్రి, జేఎస్ ఇండస్ట్రీస్, నేచర్ వాటర్‌ప్లాంట్లపై దాడులు చేసి నీటిశుద్ధి నిర్వహణ తీరును పరిశీలించారు. అనుమతి పత్రాలు తనిఖీలు చేశారు. పరీక్షల నిమిత్తం నీటి నమూనాలు సేకరించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పలువురు వాటర్ప్లాంట్లు నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. సేకరించిన నీళ్లలో కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ టీం, కల్తీ నిరోధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫార్మా సిటీ భూముల పరిశీలన
భూసేకరణ వివరాలివీ.. కేటగిరీ ఎకరాలు లబ్ధిదారులు జీఓ 45 ప్రకారం 5,650.34 2,008 జీఓ 123 ప్రకారం 710.18 360 2017 భూసేకరణ చట్టం 618.04 295 ఆక్రమణదారులు 206.23 327 ఇవిగాకుండా.. అక్రమార్కుల చెర నుంచి 395 ఎకరాలను వెనక్కి తీసుకున్న రెవెన్యూయంత్రాంగం టీఎస్ఐఐసీకి బదలాయించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రపంచస్థాయి ఔషధనగరి(ఫార్మాసిటీ) స్థాపనకు కీలక అడుగు పడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రతినిధుల బృందం గురువారం ప్రతిపాదిత ఫార్మాసిటీ భూములను పరిశీలించి.. సందేహాలను నివృత్తి చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును 19,930 ఎకరాల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముచ్చర్ల కేంద్రంగా కందుకూరు, కడ్తాల, యాచారం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీతో జిల్లా రూపు రేఖలు సంపూర్ణంగా మారిపోతాయని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో 2014 చివరలో అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించాలని సంకల్పించింది. న్యాయపరమైన అవరోధాలు అధిగమించి.. మొదటి దశకు సరిపడా భూసేకరణ ప్రక్రియ పూర్తికావడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టు పనులకు ముహూర్తం పెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఔషధనగరి ఏర్పాటుకు అవసరమైన కీలక అనుమతులను పొందడంపై దృష్టిసారించింది. ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ముగించడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ అనుమతులపై క్షేత్రస్థాయిలో పర్యటించింది. నేరుగా ప్రతిపాదిత ప్రదేశానికి హెలికాప్టర్లో వచ్చిన ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర అధికారుల బృందం.. ఫార్మారంగంతో ఎదురయ్యే పరిణామాలు, కాలుష్య ఉద్గారాలు రాకుండా తీసుకునే చర్యలు, పర్యావరణంపై ప్రభావం తదితర అంశాలను అధికారులతో చర్చించింది. అంతేగాకుండా భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంది. ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా దక్కడంతో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపేణా భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో ప్రతిపాదిత ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల నివాసగృహాల నిర్మాణం మొదలైన విషయాలను పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని అడిగి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు స్థానికుల నుంచి ఏలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదని, అక్కడక్కడా ఒకరిద్దరు పరిహారం తీసుకున్నవారే.. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పారని అధికారుల దృష్టికి తెచ్చినట్లు సమాచారం. రూ.363.23 కోట్లు చెల్లింపు.. ఔషధనగరి (ఫార్మాసిటీ)కి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.363.23 కోట్లు వెచ్చించింది. 7581.14 ఎకరాల భూమిని సేకరించి ఈ మేరలో పరిహారం రూపేణా భూములు కోల్పోయిన వారికి డబ్బులు చెల్లించింది. మేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, మీర్ఖాన్పేట, ముచ్చర్ల, పంజాగూడ, కొత్తూరు, మహమ్మద్‌నగర్, తిమ్మాయిపల్లి, కందుకూరు, ముద్విన్, కర్కల్‌పహాడ్, కడ్తాల్‌లో ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూములను సమీకరించింది. జీఓ 45, 123, రాష్ట్ర భూ సేకరణ చట్టం–2017 కింద భూములను తీసుకుంది. ఇవేగాకుండా ఆక్రమిత ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుంది. తద్వారా ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగమం చేస్తోంది. అయితే, భూసేకరణ తీరును సవాల్ చేస్తూ భూ నిర్వాసితులు కొందరు న్యాయస్థానానికెక్కడంతో కొన్ని గ్రామాల్లో సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి చోట్ల 2017 చట్టం ప్రకారం భూములను తీసుకునేందుకు రెవెన్యూయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఏరియల్ సర్వే, మ్యాపుల పరిశీలన హెలికాప్టర్‌తో సర్వే కందుకూరు: ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ భూముల్లో కేంద్ర పర్యావరణ బృందం గురువారం పర్యటించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో కేంద్రం పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి గుప్తా, అదనపు కార్యదర్శి వర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో కలిసి మొదట ఏరియల్ సర్వే చేశారు. అనంతరం 2.15 గంటలకు ముచ్చర్ల రెవెన్యూ సర్వే నంబర్ 288లోని భూమిలో దిగారు. వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని దాదాపుగా గంటకు పైగా పరిశీలించారు. మ్యాపులను చూసి వివరాలను జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్‌తో పాటు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సర్పంచ్, రైతులు, ప్రజలు ఎక్కడ అని బృందంలోని సభ్యులు ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం. అనంతరం 3.20 గంటలకు కేంద్ర బృందం హెలికాప్టర్లో తిరిగి వెళ్లిపోయింది. కాగా ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉదయం నుంచే దాదాపుగా 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఫార్మాసిటీలోకి వెళ్లే దారులను దిగ్బంధించారు. వచ్చి పోయే వారిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పొలాలకు వెళ్లే రైతులను సవాలక్ష ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. -
బిల్లులు చెల్లించట్లేదు సార్..
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : మండలంలోని మర్కల్ గ్రామాన్ని స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కేంద్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రెండు ఏళ్ల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని, ఇంకా మరుగుదొడ్లు ఎక్కడ నిర్మించుకుంటామని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్, ఐకేపీ అధికారులకు లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. నిరుపేదలమైన తమకు లంచం ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నారు. ఈ విషయమై వచ్చే శుక్రవారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధి మానిటరింగ్ అధికారి సంతోష్, జిల్లా కో–ఆర్డీనేటర్లు శంకర్, నారాయణ, జిల్లా ప్రేరక్ రమాదేవి, జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్రావ్, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో యోసెఫ్, ఏపీవో శృతి, ఈసీ తిరుపతి నాయక్, ఎఫ్ఏ రాములు, టీఏలు జగదీశ్వర్ రెడ్డి, గంగాధర్, సంతోష్, రైతు సమన్వయ సమితి చైర్మన్ రాంరెడ్డి, జూకంటి రాజులు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతుసంగెంలో కేంద్ర బృందం పర్యటన గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం జాతీయ స్థాయి పర్యవేక్షక బృందం సభ్యులు సంతోష్...ఎంపీడీవో సాయాగౌడ్‌తో కలిసి పర్యటించారు. గ్రామంలో బృందం సభ్యులు ఇంటింటికి తిరిగి మౌళిక సదుపాయాలున్నాయా లేదా అని విచారణ చేశారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఎస్బీఎం రమాదేవి, జిల్లా కో–ఆర్డినేటర్ శంకర్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ వజీర్ ముకుంద్‌రావు, నాయకులు ఉన్నారు. -
నిర్మల్ బస్టాండ్‌లో మంత్రి తనిఖీ
నిర్మల్‌టౌన్ : ∙నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదివారం రాష్ట మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తనిఖీ చేశారు. సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్సు సర్వీసుల సేవలపై ఆరా తీశారు. బస్సుల వేళల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? అని ప్రయాణికులను అడిగారు. ప్రయాణికులు తమ సమస్యలు మంత్రి ఐకేరెడ్డి దృష్టికి తీసుకురాగా, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అప్పాల గణేశ్, ముత్యంరెడ్డి, పాకాల రాంచందర్, కౌన్సిలర్ నేల్ల అరుణ్, తోట నర్సయ్య తదితరులున్నారు. -
డా.రెడ్డీస్‌కు మరో షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కి మరోసారి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్, విశాఖ దగ్గర్లోని దువ్వాడ ప్లాంటుకి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ ఓఏఐతో కూడిన ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్(ఈఐఆర్)ను జారీ చేసింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో డా.రెడ్డీస్ టాప్ లూజర్‌గా నిలిచింది. ట్రేడర్ల అమ్మకాలతో 4.5 శాతం పతనమైంది. ఫార్మా సెక్టార్లో ఓఏఐ అంటే నియంత్రణా సంబంధిత చర్యలకు ఉపక్రమించినట్టేనని ఎనలిస్టులు చెబుతున్నారు.. 2017 ఫిబ్రవరి-మార్చి తనిఖీలలో యూఎస్ఎఫ్డీఏ దువ్వాడ ప్లాంటుపై 13 అబ్జర్వేషన్స్‌ను నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి రెడ్డీస్ ఇంజక్టబుల్స్‌ను రూపొందిస్తోంది. దాదాపు 2015 నుంచి వెలిబుచ్చుతున్న అభ్యంతరాల నివారణకు కంపెనీ తగిన చర్యలు చేపట్టలేదంటూ యూఎస్ఎఫ్డీఏ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై డా.రెడ్డీస్‌ను వివరణకోరామని మార్కెట్ రెగ్యులేటరీ తెలిపింది. తాజా రిపోర్ట్‌పై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే నవంబర్ 21, 2017న విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉత్పాదక కేంద్రానికి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈఐఆర్ అందినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రెడ్డీస్ తెలిపింది. కానీ సంస్థ తనిఖీ ప్రక్రియ ఇంకా లేదని చెప్పింది. కాగా అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ కంపెనీకి మూడు హెచ్చరిక లేఖను జారీ చేసింది. దువ్వాడ ప్లాంట్ సహా దాని తనిఖీ బృందాలు ఆమోదయోగ్యమైన సమస్యలను ఉన్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 25న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. గత నెలగా రెడ్డీస్ కౌంటర్ 8శాతానికిపైగా లాభపడింది. -
అంతా ఓకే.. కానీ!
పాలమూరు: ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం మాదిరిగానే పాలమూరులోని మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం తరగతుల నిర్వహణకు కూడా అనుమతి లభించే అవకాశముందని తెలుస్తోంది. ఎంసీఐ బృందం శుక్రవారం చేపట్టిన తనిఖీల అనంతరం అధికారులు వెల్లడించిన అభిప్రాయమిది. అయితే, అధికారులు మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో కొన్ని సమస్యలను గుర్తించినా వాటిని సరి చేసుకుంటామని వారు చెబుతున్నారు. పాలమూరు మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రితో ఉన్న వసతులు, సౌకర్యాలను ఎంసీఐ బృందం శుక్రవారం పరిశీలించింది. ఎంసీఐ బృందం సభ్యులు డాక్టర్ సయ్యద్, డాక్టర్ అభయ్‌కుమార్, డాక్టర్ మమత రాగా, డీఎంఈ రమేష్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ వారి వెంట ఉండి ఇక్కడి సౌకర్యాలను వివరించారు. విడివిడిగా.. ఎంసీఐ బృందం సభ్యులు మొదట విడివిడిగా జనరల్ ఆస్పత్రిని, మెడికల్ కళాశాలలో అన్ని విభాగాలను క్షుణంగా పరిశీలించారు. బృందం సభ్యుల్లో ఒకరు వైద్య కళాశాల, మరొకరు ల్యాబ్‌లు, వసతి గృహాలను పరిశీలించగా.. ఇంకొకరు జనరల్ ఆస్పత్రిలో పరిశీలించారు. ఆ తర్వాత తాము గుర్తించిన అంశాలపై నివేదికలు రూపొందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్, పిడియాట్రిక్, ఆర్థో, జనరల్ వార్డు, గైనిక్, లేబర్ రూం, డయాలసిస్, కంటి విభాగాలను తనిఖీ చేసిన వారు నూతన వైద్యుల పనితీరు, హాజరు, ల్యాబ్‌లు, తరగతి గదులు, ఇతర సౌకర్యాలపై ఆరా> తీశారు. ఆ తర్వాత సర్జికల్ వార్డులో గత పది రోజులుగా ఎన్ని కేసులు వచ్చాయి, ఎందరికి చికిత్స అందజేశారో తెలుసుకున్నారు. ఈక్రమంలోనే కేస్‌షీట్లు సక్రమంగా లేవని గుర్తించిన ఎంసీఐ బృందం అక్కడ విధుల్లో ఉన్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆనంతరం ఐసీయూ, చిన్న పిల్లల విభాగం, స్కానింగ్ సెంటర్లు, శిశు సంజీవని, రక్త పరీక్షల విభాగం, ల్యాబ్‌ను తనిఖీ చేశారు. జనరల్ వార్డులో పరిశీలన సందర్భంగా ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎందరు రోగులు ఉన్నారని అడిగితే సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇక కొన్ని వార్డుల దగ్గర నర్సులు లేకపోవడతో ఎంసీఐ బృందం సభ్యులు.. సరిపడా సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. కేవలం ప్రసవాలేనా? జనరల్ ఆస్పత్రి పరిశీలన సందర్భంగా ఎంసీఐ బృందం సభ్యులు ఒక్కో వైద్యుడితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి వసతులు ఉన్నాయి. ఇంకా ఏమేం కావాలని చర్చించారు. ఆస్పత్రి పరిశీలన సందర్భంగా.. ఇక్కడ కేవలం ప్రసవాలే తప్ప ఇతర వ్యాధులకు చికిత్స అందించడం లేదని వారు గుర్తించారు. దీంతో ‘మీ సేవలు ఇంతేనా’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇంత పెద్ద ఆస్పత్రి ఒక ముఖ్య శస్త్రచికిత్స కూడా జరగకపోవడం ఆశ్చర్యకంగా ఉందని పేర్కొంటూ.. సర్జికల్ వార్డులు ఉన్నా ముఖ్యమైన సర్జరీలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వారు ఎదిర శివారులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాలు, ఎదిర పీహెచ్‌సీతో పాటు రామయ్యబౌళి అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు. -
డా.రెడ్డీస్ ప్లాంట్‌లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్ లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలు మొదలుకానున్నాయి. సంస్థకు చాలా కీలకమైన శ్రీకాకుళం ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ ఈ నెలాఖరున తనిఖీలు చేపట్టనుంది. మార్చి 27 న ఈ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అమెరికా డ్రగ్ రె గ్యులేటరీ మీడియా కు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ప్లాంట్ సక్రియాత్మక ఔషధ అంశాల (API) సరఫరా పరంగా చాలా కీలకం. ఫిబ్రవరి- మార్చి 2017లో మిర్యాల గూడ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్ఎఫ్డీఏ 3 లోపాలు(అబ్జర్వేషన్స్) నమోదు చేసింది. ఇక విశాఖకు దగ్గర్లోగల దువ్వాడ ప్లాంటు తనిఖీల్లో భాగంగా 13 అబ్జర్వేషన్స్ నోట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలుచేపట్టనుంది. నవంబర్ 2015 లో ఈ మూడు ప్లాంట్లపైనా యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ డ్రగ్‌మేకర్ చిక్కుల్లోపడింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ మూడు ప్లాంట్ల వాటా 10-12 శాతంగా ఉంది. -
మొబైల్ యూజర్ల గుర్తింపును తనిఖీ చేయండి
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగదారులు టెలికాం కంపెనీలకు ఇచ్చిన గుర్తింపు వివరాలను ఏడాదిలోపు తనిఖీ చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంది. కొత్తగా సిమ్‌లు మంజూరు చేయడానికి ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానాన్నే ఉపయోగించాలని సోమవారం చెప్పింది. జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణల నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్‌కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ తీర్పు చెప్పింది. వినియోగదారులు రీచార్జ్ చేసుకునే సమయంలో వారి వివరాలను మళ్లీ తీసుకోవచ్చని కోర్టు సూచించగా, రీచార్జ్ ఔట్లెట్లు అపరిమిత సంఖ్యలో ఉన్నందున ఇది సాధ్యం కాకపోవచ్చని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు చెప్పారు. -
బీసీ హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పెద్దపల్లిరూరల్: రంగంపల్లిలోని వెనకబడిన తరగతుల వసతి గృహాన్ని కలెక్టర్ అలగు వర్షిణి మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. వసతిగృహ ఆవరణంతా కలియతిరిగిన కలెక్టర్ సౌకర్యాల కల్పనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు వండిపెడుతున్న అన్నం, కూరలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని విద్యార్థులను ఆరా తీశారు. మరుగుదొడ్లను పరిశీలించడంతోపాటు నీటి సరఫరా, కరెంటు, గదులలో ఫ్యాన్ సౌకర్యాల ఏర్పాట్లను చూసిన కలెక్టర్ వసతుల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణగా ఉండేందుకు గాయత్రీ విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ అందించిన రగ్గులనుమ కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. -
రహదారి ‘నాణ్యత’ పరిశీలన
చేవెళ్ల: చేవెళ్ల నుంచి కందవాడ- నక్కలపల్లిల మీదుగా వెంకటాపూర్ వరకు చేపట్టిన రోడ్డు పనులను క్వాలిటీ కంట్రోల్ ఉన్నతాధికారులు సోమవారం పరిశీలించారు. జాతీయ రహదారుల క్వాలిటీ కంట్రోల్ ఉన్నతాధికారి చౌదరీరంజిత్‌సింగ్ నేతృత్వంలోని బృందం సభ్యులు పనుల వివరాలను తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సడక్యోజన కింద 12.4 కిలోమీటర్ల రోడ్డు ఫార్మేషన్, పటిష్టత, బీటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6.73 కోట్లు మంజూరు చేసింది. చేవెళ్ల నుంచి షాబాద్, కందవాడ మీదుగా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి నుంచి వెంకటాపూర్ వరకు చేపట్టిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. నాణ్యత కూడా బాగుందని తెలిపారు. ఈ రోడ్డుతో ఎన్ని గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది, ఎప్పటిలోగా రహదారిని అందుబాటులోకి తెస్తారని ఈఈ రవీందర్‌రెడ్డి, కాంట్రాక్టర్ కె.మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని వారు అధికారులకు తెలిపారు. పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఏఈ భాస్కర్‌రెడ్డి, పీఆర్ ఏఈలు శేఖర్, రాజు, సైట్ ఇంజినీర్ గోపాల్ తదితరులు ఉన్నారు. -
సరుకు పంపిణీ ఏజెన్సీలపై చర్యలు
ఐటీడీఏ డీడీ రామ్మూర్తి అంగన్వాడీ కేంద్రాల తనిఖీ నిర్వహణ తీరుపై అసంతప్తి సిబ్బందిపై ఆగ్రహం కెరమెరి : అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లతో పాటు ఇతర సరుకులు పంపిణీ చేసే ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ డీడీ (డెప్యూటీ డైరెక్టర్) రామ్మూర్తి అన్నారు. మండలంలోని సాంగ్వి, పెద్ద సాకడ, ఝరి, మోడి కెరమెరిలోని చందుగూడ, సుల్తాన్‌గూడ, పోచమ్మగుడి, జన్కాపూర్, జైరాంగూడ, ఆంద్‌గూడ గ్రామాల్లోని 13 అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, గర్భిణీ, బాలింతల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుల్తాన్‌గూడ అంగన్వాడీ కేంద్రంలో గత నెలలో 1372 గుడ్డు పంపిణీ చేయాల్సి ఉండగా 992 సరఫరా చేశారని, ఝరి కేంద్రంలో కేవలం నెలంతా 10 గుడ్లు పంపిణీ చేయడం, ఇతర కేంద్రాల్లో కూడా ఎక్కడా సరిపడా గుడ్లను సరఫరా చేయకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అందాల్సిన వారికి పౌష్టికాహారం లభించక రక్తహీనత ఏర్పడుతోందని చెప్పారు. ఎక్కడ కూడా మెనూ పాటించడం లేదన్నారు. రికార్డులు కూడా సరిగా నమోదు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దష్టికి సమస్య... పలు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించకపోవడాన్ని జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పలు అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడా కూడా దుస్తులు ఇవ్వక పోవడానికి గల కార ణాలను తెలుసుకున్నారు. ఇలాంటి సమస్యలు పునరావతమైతే అంగన్వాడీలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, నిర్వహణ సరిగా లేదన్నారు. అనంతరం తన భర్త మతి చెంది మూడు మాసాలు గడుస్తున్నా నేటికీ వితంతు పింఛన్ రావడం లేదని, డెత్ సర్టిఫికెటు అడిగితే ఇంటి పన్ను కడితే సర్టిఫికెటు ఇస్తామంటున్నారని చందుగూడ గ్రామానికి చెందిన పార్వతిబాయి డీడీ ఎదుట వాపోయారు. దీంతో ఆయన స్పందిస్తూ ఎంపీడీవోతో మాట్లాడి పింఛన్ ఇప్పిస్తాని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు రాజశ్రీ, జంగుబాయి తదితరులున్నారు. -
అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ
నడిగూడెం: మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఐసీడిఎస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని రిజిస్టర్లు, చిన్నారుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే పౌష్టికాహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కృష్ణకుమారి, అసిస్టెంట్ సీyీ పీఓ వెంకటలక్ష్మి, సూపర్వైజర్లు కోటేశ్వరి, రాజ్యలక్ష్మి, తదితరులున్నారు. -
హత్నూర పీఎస్ భేష్
ప్రశంసించిన డీఐజీ.. సిబ్బంది సమస్యలు తెలుసుకున్న ఉన్నతాధికారి హత్నూర: స్థానిక పోలీస్టేషన్ పని తీరుతోపాటు రికార్డు నిర్వహణ భేష్‌గా ఉందని డీఐజీ అకున్ సబర్వాల్ అన్నారు. శనివారం పోలీస్టేషన్‌ను ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి డీఐజీ పరిశీలించారు. స్టేషన్‌కు ఆయన స్థానిక ఎస్సై బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఏడుగురు కానిస్టేబుళ్లను వ్యక్తిగతంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరేడ్ భేష్‌గా చేశారంటూ ప్రశంసిస్తూ రివార్డులను ప్రకటించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్‌ను పరిశీలించి పోలీస్టేషన్ ప్రశాంత నిలయంగా ఉందన్నారు. అనంతరం మొక్కలునాటిన డీఐజీ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. పోలీస్టేషన్ రికార్డులను పరిశీలించడంతోపాటు నిర్వహణ తీరు బాగుందన్నారు. రికార్డులు ప్రతి ఒక్కటి సక్రమంగా ఉన్నాయని అభినందించారు. స్టేషన్లో రికార్డులు, సీడీ ఫైల్స్ చక్కగా నిర్వహించినందుకు ఏఎస్ఐ సుదర్శన్, హెడ్‌కానిస్టేబుల్ జగదీశ్వర్లకు, కానిస్టేబుల్ సికిందర్, శ్రీరాములు, భూపాల్‌లకు రివార్డు ప్రకటించి అభినందించారు. కానిస్టేబుల్ బాల్‌రాజ్, హోంగార్డు మల్లేశంగౌడ్‌ల పనితీరుపై రివార్డు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎస్సై బాల్‌రెడ్డి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. బొల్లారం పోలీస్టేషన్‌ను రెండు నెలల క్రితం పరిశీలించిన సమయంలో ఎస్సైగా పని చేసిన ప్రశాంత్‌ను సైతం ఆయన అభినందించారు. డీఐజీతోపాటు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి , కరీంనగర్ ఓస్డీ రోహినిప్రియదర్శిని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ తిరుపతిరాజు, ఎస్సై బాల్‌రెడ్డి, శిక్షణ ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.