ఖైదీలతో మాట్లాడుతున్న అనధికార బృంద సభ్యులు
గార: అంపోలు వద్ద ఉన్న జిల్లా జైలులో ఖైదీలకు అమలవుతున్న సౌకర్యాలపై అనధికారిక బృందం బుధవారం తనిఖీ చేసింది. రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ నియమించిన ఈ బృందం జైలులోని వంటగది, వాటర్‌ప్లాంట్, గ్రంథాలయం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలు, వసతులపై ఆరా తీశారు. జిల్లా జైలులో క్రైమ్ రేటు తగ్గినట్టుగా బృందం గుర్తించిందని న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో బృంద సభ్యులు టి.బృంద, జి. కృష్ణారావు, జైలు సూపరింటెండెంట్ సుబ్బారావు, జైలర్లు వేణుగోపాలరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.