Superfast Quality Inspection Of Rice Sacks By A Woman Video Viral - Sakshi
Sakshi News home page

క్యూసీ ఆఫీసరమ్మ యమ.. స్పీడ్..! ఇట్టే పసిగడుతుంది..! వీడియో వైరల్..

Published Sat, Jun 10 2023 7:50 PM | Last Updated on Sat, Jun 10 2023 8:23 PM

Superfast Quality Inspection Of Rice Sacks By A Woman Video Viral - Sakshi

సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ ఒక్కోసారి విభిన్నరీతిలో వైరల్ అవుతోంది. ఒక్కోసారి చెప్పలేం ఏ కంటెంట్‌ వైరల్ అవుతుందో? ఎందుకు ఆ కంటెంట్‌ను వీక్షకులు ఇష్టపడుతున్నారో? తాజాగా ఓ క్యాలిటీ చెకింగ్ వీడియోకు గొప్పగా ఆదరణ లభించింది. కేవలం పది రోజుల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతకూ ఈ వీడియోలో ఉన్న విషయం ఏంటంటే..?

క్యాలిటీ చెకింగ్ ఆఫీసర్ పనేంటో తెలుసు కదా? పదార్థం నాణ్యతను తనిఖీ చేస్తుంటారు. వీడియోలో బియ్యం గోదాంలో బియ్యం క్వాలిటీని చెకింగ్ చేస్తుంది ఓ అమ్మాయి. అయితే.. కార్మికులు వరుసగా బియ్యం సంచులను మోసుకుంటూ వెళుతుండగా.. ఆవిడ ఒక్కరే అందరి సంచుల్లోని బియ్యాన్ని చాలా వేగంగా తనిఖీ చేస్తోంది. నాణ్యత సరిగా లేని బియ్యం సంచిని పక్కకు తీసుకురమ్మని ఆదేశిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈవిడ స్పీడ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

   

ఇదీ చదవండి: ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement