గ్రామస్తులతో మాట్లాడుతున్న సభ్యులు
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : మండలంలోని మర్కల్ గ్రామాన్ని స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కేంద్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రెండు ఏళ్ల క్రితం మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికీ ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని, ఇంకా మరుగుదొడ్లు ఎక్కడ నిర్మించుకుంటామని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజీఎస్, ఐకేపీ అధికారులకు లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. నిరుపేదలమైన తమకు లంచం ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నారు. ఈ విషయమై వచ్చే శుక్రవారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధి మానిటరింగ్ అధికారి సంతోష్, జిల్లా కో–ఆర్డీనేటర్‌లు శంకర్, నారాయణ, జిల్లా ప్రేరక్ రమాదేవి, జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావ్, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో యోసెఫ్, ఏపీవో శృతి, ఈసీ తిరుపతి నాయక్, ఎఫ్‌ఏ రాములు, టీఏలు జగదీశ్వర్ రెడ్డి, గంగాధర్, సంతోష్, రైతు సమన్వయ సమితి చైర్మన్ రాంరెడ్డి, జూకంటి రాజులు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాతుసంగెంలో కేంద్ర బృందం పర్యటన
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం జాతీయ స్థాయి పర్యవేక్షక బృందం సభ్యులు సంతోష్...ఎంపీడీవో సాయాగౌడ్‌తో కలిసి పర్యటించారు. గ్రామంలో బృందం సభ్యులు ఇంటింటికి తిరిగి మౌళిక సదుపాయాలున్నాయా లేదా అని విచారణ చేశారు. ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఎస్‌బీఎం రమాదేవి, జిల్లా కో–ఆర్డినేటర్ శంకర్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ వజీర్ ముకుంద్‌రావు, నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment