కాళేశ్వరాలయంలో టీకాబ్‌ చైర్మన్‌ పూజలు | Kannepalli Pump House Inspected by TSCAB Chairman | Sakshi
Sakshi News home page

Published Tue, May 29 2018 9:48 AM | Last Updated on Tue, May 29 2018 9:49 AM

Kannepalli Pump House Inspected by TSCAB Chairman - Sakshi

కన్నెపల్లి పంప్‌హస్‌ను చూస్తున్నటీక్యాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు

కొండూరి కాళేశ్వరం : మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరున్ని టీక్యాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆలయానికి రాగా ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఈఓ శ్రీనివాస్‌ శాలువాతో సన్మాంచారు.

వాయువేగంతో కాళేశ్వరం... 
అనంతరం రవీందర్‌రావు కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయివేగంతో జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీపతిబాపు, ధర్మకర్త అడుప సమ్మయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ మహేష్‌ ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement