Pumphouse
-
చైనా వాళ్లు వస్తేనే మోటార్ ఆన్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. నిధుల వ్యయం నుంచి పంప్‌హౌస్‌లో మోటార్లు నడిపించే వరకు ప్రతీ అంశంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్విడెక్టులు, పంప్‌హౌస్‌ల నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. అయితే ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తి కాకపోవడంతో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదు. దీంతో ఇప్పటి వరకు అందుబాటులోకి వచి్చన సీతమ్మసాగర్ ప్రధాన కాల్వను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు కలిపేలా కొత్తగా రాజీవ్ కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. రాజీవ్ కెనాల్ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో 1.50 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించాలని నిర్ణయించారు. డ్రై రన్‌కు వెనకడుగు.. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఉన్న మొదటి పంప్‌హౌస్‌లో 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటార్లు, రెండో పంప్‌హౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు మోటార్లు, మూడో పంప్‌హౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు ఐదు, 30 మెగావాêట్ల సామర్థ్యం గల మోటార్లు రెండు ఉన్నాయి. ప్రస్తుత అవసరాల ప్రకారం ఒక్కో పంప్‌హౌస్‌లో ఒక్కో మోటార్‌ను నడిపించి నీటిని లిఫ్ట్ చేసినా సరిపోతుంది. దీంతో ఈ పంప్‌హౌస్‌ల్లో డ్రై రన్‌కు వడివడిగా ముందుకు కదిలిన ప్రభుత్వం.. చివరి నిమిషంలో వెనకడుగు వేసింది. చైనా తంటాలు.. మూడు పంప్‌హౌస్‌ల్లో మొత్తం 19 మోటార్లను చైనాకు చెందిన షాంఘై ఎలక్ట్రిక్ కంపెనీ రెండేళ్ల క్రితమే బిగించింది. అయితే ప్రధాన కాల్వల నిర్మా ణం కాకపోవడం, విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో రెండేళ్లుగా అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో కంపె నీకి చెందిన ఇంజనీర్లు చైనా వెళ్లిపోయారు. రెండేళ్ల పాటు మోటార్లు, పంపులు అలాగే ఉండటంతో వా టి ప్రస్తుత పరిస్థితి ఏంటనే అంశంపై స్పష్టత లేదు. విదేశాంగ శాఖకు చేరిన పంచాయితీ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశంపై ఇటు ఎల్అండ్టీ, అటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య డిఫెక్ట్ లయబులిటీ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సొంతంగా మోటార్లు ఆన్ చేసి రిస్క్ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో చైనా బృందాన్ని త్వరగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను సంప్రదించారు. సాధ్యమైనంత త్వరగా చైనా ఇంజనీర్లను రప్పించేలా ప్రయతి్నస్తున్నారు తప్పితే రిస్క్ తీసుకొని మోటార్లు ఆన్ చేసేందుకు సాహసించడం లేదు. ఆగçస్టు 15 నాటికి సారునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారమే ముందుకెళ్లడం మేలనే భావనలో ప్రభుత్వం ఉంది. -
Sitarama Lift Irrigation Project: అయ్యో .. ‘రామా’
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలానికల్లా సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్న హామీ నీరుగారినట్లే కనబడుతోంది. పూర్తికాని భూసేకరణ, నిధుల లేమి, కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ అన్నీ కలిసి ఆశలకు గండికొడుతున్నాయి. గోదావరి నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్‌హౌస్‌లు సిద్ధం చేసినా, ఆయకట్టుకు నీరిచ్చే సత్తుపల్లి ట్రంక్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. మూడు పంప్‌హౌస్‌లు సిద్ధమైనా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామను చేపట్టారు. మూడున్నరేళ్ల కింద మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. రెండు పంప్‌హౌస్‌ల్లో ఆరు మోటార్లను గతేడాదే పూర్తి చేయగా, మూడో పంప్‌హౌస్‌లో 7 మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉండగా.. విద్యుత్ సరఫరా చేస్తే నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూడు పంప్‌హౌస్‌ల పరిధిలో 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ ఉన్నా ఆయకట్టు మాత్రం లేదు. ఈ ప్రధాన కాల్వ పనులకు సంబంధించే రూ.450 కోట్ల మేర బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ప్రాజెక్టులో భాగంగా మూడో పంప్‌హౌస్ దిగువన 116 కిలోమీటర్ల పొడవునా సత్తుపల్లి ట్రంక్ కెనాల్ తవ్వాల్సి ఉంది. దీనిద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ వానాకాలానికే సుమారు లక్ష ఎకరాలకు నీరివ్వాలని ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు భూసేకరణకు గానీ, జరిగిన పనులకు గానీ ఒక్క రూపాయి చెల్లించలేదు. ముందుకు సాగని పనులు కెనాల్ తవ్వేందుకు 1,650 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 500 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.40 కోట్లు చెల్లించారు. మరో 214 ఎకరాలకు సంబంధించి ప్రభు త్వం నిర్ణయించిన ధరకంటే అధిక ధర పరిహారంగా చెల్లించాలని రైతులు కోర్టుకు వెళ్లడంతో సేకరణ ఆగిపోయింది. ఇక మిగతా భూమిలో కొంతమేర అవార్డు చేసినా, ప్రభుత్వం చెల్లించా ల్సిన రూ.60 కోట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో కాల్వ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అటవీ శాఖ నుంచి బదలాయించిన 1,202 ఎకరాల భూమి పరిధిలోనే ప్రస్తుతం కాల్వ తవ్వకం జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికే..! 116 కిలోమీటర్ల కెనాల్ తవ్వకానికి 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని చేయాల్సి ఉండగా, ఇంతవరకు 52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. సుమారు 25 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పూర్తయినా, మిగతా పనుల పూర్తికి భూసేకరణ జరగకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి తోడు తవ్విన పనులకు సంబంధిం చిన రూ.45 కోట్ల బిల్లులు ప్రభుత్వం ఆరు నెలలుగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నిధుల విడుదలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రధాన కాల్వ పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలే ఇక్కడా పనిచేస్తుండగా.. నిధుల విడుదల లేకపోవడంతో సంస్థలు పనివేగాన్ని తగ్గించుకుంటున్నాయి. యంత్రాలను ఇతర ప్రాజెక్టుల పనులకు తరలిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇతర ప్రాధాన్యత శాఖలకు నిధుల వెచ్చింపు ఎక్కువగా చేస్తుండటంతో వచ్చే ఏడాది జూన్ నాటికే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
కాళేశ్వరాలయంలో టీకాబ్ చైర్మన్ పూజలు
కొండూరి కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరున్ని టీక్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆలయానికి రాగా ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఈఓ శ్రీనివాస్ శాలువాతో సన్మాంచారు. వాయువేగంతో కాళేశ్వరం... అనంతరం రవీందర్రావు కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయివేగంతో జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీపతిబాపు, ధర్మకర్త అడుప సమ్మయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మహేష్ ఉన్నారు. -
గోలివాడలో నిర్వాసితుల ఆందోళన
► పరిహారమివ్వకుండానే పనులు చేస్తున్నారని ఆగ్రహం ► పంప్‌హౌస్ పనులను నిలిపివేయాలంటూ నిరసన రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా పంప్‌హౌస్ నిర్మిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోలివాడలో నిర్వా సితులు ఆందోళనకు దిగారు. పరిహారం విష యం కొలిక్కి రాకుండానే పట్టాభూముల్లో పనులు ఎలా ప్రారంభిస్తారంటూ సోమవా రం వేకువజామునే నిర్వాసితులు ఆందోళ న కు దిగారు. ఆదివారమే పనులు ప్రారంభ మయ్యాయి. పనులు చేపట్టకుండా బైఠా యించారు. సమాచారం అందుకున్న పోలీసు లు సంఘటనాస్థలానికి వచ్చి పనులు అడ్డు కోవద్దంటూ నిర్వాసితులను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతు ఆత్మహత్యాయత్నం.... పట్టా భూముల్లో పంప్‌హౌస్ నిర్మాణ పను లు ప్రారంభించడంతో మట్ట మహేం దర్‌రెడ్డి అనే నిర్వాసితుడు ఒంటిపై కిరోసిన్ పోసు కుని నిప్పంటించుకునేందుకు యత్నించా డు. గమనించిన ఓ పోలీసు అతడిని వారిం చాడు. ఈ క్రమంలో పెనుగులాట జరగడం తో పోలీస్ చేతిలో ఉన్న ఆయుధం మహేం దర్‌రెడ్డి తలకు తగిలి రక్తస్రావ మైంది. ప్రభుత్వ పనులను ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా గోలివాడకు చెందిన 42 మంది భూనిర్వా సితులపై కేసులు నమోదు చేశామని రామ గుండం సీఐ వాసుదేవరావు తెలిపారు. -
భీమా ఫేజ్–2 పంప్‌హౌస్ ట్రయల్‌రన్
మక్తల్ : పట్టణ సమీపంలోని భీమా ఫేజ్–2 పంప్‌హౌస్‌ను మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సందర్శించారు. రెండోసారి ట్రయల్‌రన్ చేశారు. పంప్‌హౌస్ నుంచి మోటార్‌ను ప్రారంభించిన అనంతరం సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని వదిలారు. రిజర్వాయర్ వరకు ఎమ్మెల్యే కాల్వ వెంబడి వెళ్లి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.. అని పరిశీలించారు. ఆయన మాట్లాడూతూ నియోజకవర్గంలో అన్ని మండలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రారంభిస్తామని, రైతులకు పుష్కలంగా సాగునీరు వస్తుందని అన్నారు. ఖరీఫ్‌లో సాగునీరు పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. భీమా పంప్‌హౌస్ నుంచి కాల్వ వెంబడి నీళ్లు రావడంతో మక్తల్ పట్టణ ప్రజలు నీటిని చూసేందుకు బారీగా తరలివస్తున్నారు. ఎమ్మెల్యే వెంట మక్తల్ టీఆర్ఎస్ ఇ¯Œæచార్జ్ దేవరిమల్లప్ప, సీఈ ఖగేందర్, ఎస్ఈ భద్రయ్య, డీఈ నాగిరెడ్డి, ఈఈ వీరేశం, నాయకులు గోపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బాల్‌రాంరెడ్డి, గుర్నాథ్రెడ్డి, శివారెడ్డి తదితరులు ఉన్నారు.