గోలివాడలో నిర్వాసితుల ఆందోళన | golivada people concern against pumphouse | Sakshi
Sakshi News home page

గోలివాడలో నిర్వాసితుల ఆందోళన

Published Tue, May 2 2017 1:35 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

గోలివాడలో నిర్వాసితుల ఆందోళన - Sakshi

గోలివాడలో నిర్వాసితుల ఆందోళన

► పరిహారమివ్వకుండానే పనులు చేస్తున్నారని ఆగ్రహం
► పంప్‌హౌస్‌ పనులను నిలిపివేయాలంటూ నిరసన

రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా పంప్‌హౌస్‌ నిర్మిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోలివాడలో నిర్వా సితులు ఆందోళనకు దిగారు. పరిహారం విష యం కొలిక్కి రాకుండానే పట్టాభూముల్లో పనులు ఎలా ప్రారంభిస్తారంటూ సోమవా రం వేకువజామునే నిర్వాసితులు ఆందోళ న కు దిగారు.  ఆదివారమే పనులు ప్రారంభ మయ్యాయి. పనులు చేపట్టకుండా బైఠా యించారు. సమాచారం అందుకున్న పోలీసు లు సంఘటనాస్థలానికి వచ్చి పనులు అడ్డు కోవద్దంటూ నిర్వాసితులను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

రైతు ఆత్మహత్యాయత్నం.... పట్టా భూముల్లో పంప్‌హౌస్‌ నిర్మాణ పను లు ప్రారంభించడంతో మట్ట మహేం దర్‌రెడ్డి అనే నిర్వాసితుడు ఒంటిపై కిరోసిన్‌ పోసు కుని నిప్పంటించుకునేందుకు యత్నించా డు. గమనించిన ఓ పోలీసు అతడిని వారిం చాడు. ఈ క్రమంలో పెనుగులాట జరగడం తో పోలీస్‌ చేతిలో ఉన్న ఆయుధం మహేం దర్‌రెడ్డి తలకు తగిలి రక్తస్రావ మైంది. ప్రభుత్వ పనులను ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా గోలివాడకు చెందిన 42 మంది భూనిర్వా సితులపై కేసులు నమోదు చేశామని రామ గుండం సీఐ వాసుదేవరావు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement