కాళేశ్వరం బరాజ్‌లపై పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈఎన్సీ బి.నాగేంద్రరావు వెల్లడి
బరాజ్‌లలో లోపాలపై తనిఖీ చేసి నివేదికలిచ్చాం
కానీ నష్టనివారణ చర్యలను రామగుండం ఈఎన్సీ చేపట్టలేదు
ఉన్నత స్థాయి ఆదేశాలతోనే బరాజ్‌లలో నీటి నిల్వలు కొనసాగించారు
భారీ నిల్వల వల్ల ఇసుక కొట్టుకుపోయి బరాజ్‌లు దెబ్బతిని ఉండొచ్చని వివరణ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలపై 2021 అక్టోబర్, నవంబర్‌లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చినా.. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు ఆరోపించారు. బరాజ్‌ల ఎగువన, దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపో యాయని, దిగువన వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని నివేదికలలో తెలిపామని వివరించారు. ప్రాజెక్టుల ఈఈలు, ఎస్‌ఈలు, సీఈలు దీనికి బాధ్యులని.. బరాజ్‌లలో లోపాలున్నట్టు ఎన్నడూ నల్లా వెంకటేశ్వర్లు తమకు నివేదిక సమర్పించలేదని పేర్కొ న్నారు.
కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బి.నాగేంద్రరావును మూడున్నర గంటలకుపైగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 120కిపైగా ప్రశ్నలు వేసింది. నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్‌ఎం) విభా గానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేదని.. క్షేత్ర స్థాయి అధికారులకు ప్రాజెక్టుల నిర్వహణపై ఎప్ప టికప్పుడు ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా కమి షన్‌కు నాగేంద్రరావు వివరించారు.
తమ తనిఖీల నివేదికలను కమిషన్‌కు అందజేశారు. డిఫెక్ట్ లయ బిలిటీ పీరియడ్‌లో బరాజ్‌లకు రక్షణ చర్యలు తీసు కోవాలని.. వర్షాకాలానికి ముందు, తర్వాత, మధ్య లో పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించాలని తాము కోరినా రామగుండం ఈఎన్సీ చేయలేదని వివరించారు. ఐఎస్ కోడ్, కేంద్ర జలసంఘం మా న్యువల్స్‌ను కూడా పాటించలేదని ఆరోపించారు. బరాజ్‌ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినట్టు నల్లా వెంకటేశ్వర్లు నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు.
గేట్ల నిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించినట్టు సమాచారం లేదని.. వరద ఉధృతితో దిగువన రక్షణ పనులు దెబ్బతినడానికి అది ఒక కారణం కావొచ్చని తెలిపారు. మరమ్మతులు చేయడం కోసం బరాజ్ లలో నీటి నిల్వలను తగ్గించాలని నిర్మాణ సంస్థలు కోరినా పట్టించుకోలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ దిశగా తమ కార్యాలయం ఆదేశాలేమీ ఇవ్వలేదని, అయితే నిల్వలను పెంచాలని నల్లా వెంకటేశ్వర్లు మౌఖిక ఆదేశాలిచ్చారని నాగేంద్రరావు వివరించారు.
ఈఎన్సీ పోస్టు అలంకారానికా?
‘బరాజ్‌ల వైఫల్యానికి నిర్వహణ వైఫల్యం ఓ కారణం కాదా? ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) పోస్టు ఎందుకు ఉంది? అలంకారానికా?’ అని కమిషన్ నిలదీయగా.. నిర్వహణ బాధ్యత క్షేత్రస్థాయి సీఈలదేనని నాగేంద్రరావు బదులిచ్చారు. నిర్వహ ణ మాన్యువల్స్, సర్క్యులర్లు జారీచేసి వాటిని పాటించాలని కోరడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
నిరంతర నిల్వలతో బరాజ్‌ల ఎగువ భాగంలో మరమ్మతులు సాధ్యం కాలేదని, దిగువన అవకాశమున్నా మరమ్మతులు చేయలేదని వివరించారు. అయితే ‘నీటి నిల్వ అవసరాలకు బరాజ్‌లు పనికిరావని ఐఎస్ కోడ్‌లో ఉన్న విషయం మీకు తెలియదా? నిల్వ చేయాలని ఆదేశించినది ఎవరు? నిల్వలతోనే పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బరాజ్‌లు దెబ్బతిన్నాయా?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే నీళ్లు నిల్వ చేశా రని నాగేంద్రరావు వివరించారు.
నిల్వలతో ఇసుక కొట్టుకుపోయి దెబ్బతినే అవకాశాలుంటాయని అంగీకరించారు. మూడు బరాజ్‌ల పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పనులు పూర్తయ్యా యని, మేడిగడ్డ బరాజ్‌లో నిబంధనల ప్రకారం పనులు జరగలేదని నాగేంద్రరావు తెలిపారు.
నాణ్యతా పరీక్షలకు మనస్సాక్షి అంగీకరించలేదా?
‘వరదల అనంతరం బరాజ్‌ల పరిస్థితి ఏమిటి? ఏమైనా దెబ్బతిన్నాయా? నిర్మాణం సరిగ్గా జరిగిందా? లేదా? అని పరిశీలించాలని మీ మనస్సాక్షి అంగీకరించలేదా?’ అని క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సీఈ అజయ్‌కుమార్‌ను పీసీ ఘోష్ కమిషన్ నిలదీసింది. అయితే నిర్మాణ దశలో, బిల్లుల చెల్లింపుల సమయంలోనే నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరం ఉండదని అజయ్‌కుమార్ బదులిచ్చారు.
ఇక అసంపూర్తి పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నోటీసులిచ్చామని కమిషన్‌కు మాజీ ఈఈ సర్దార్ వివరించారు. గురువారం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment