Nagendra Rao
-
లోపాలు తేలినా.. నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలపై 2021 అక్టోబర్, నవంబర్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చినా.. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు ఆరోపించారు. బరాజ్‌ల ఎగువన, దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపో యాయని, దిగువన వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని నివేదికలలో తెలిపామని వివరించారు. ప్రాజెక్టుల ఈఈలు, ఎస్ఈలు, సీఈలు దీనికి బాధ్యులని.. బరాజ్‌లలో లోపాలున్నట్టు ఎన్నడూ నల్లా వెంకటేశ్వర్లు తమకు నివేదిక సమర్పించలేదని పేర్కొ న్నారు.కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బి.నాగేంద్రరావును మూడున్నర గంటలకుపైగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 120కిపైగా ప్రశ్నలు వేసింది. నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్ఎం) విభా గానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేదని.. క్షేత్ర స్థాయి అధికారులకు ప్రాజెక్టుల నిర్వహణపై ఎప్ప టికప్పుడు ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా కమి షన్‌కు నాగేంద్రరావు వివరించారు. తమ తనిఖీల నివేదికలను కమిషన్‌కు అందజేశారు. డిఫెక్ట్ లయ బిలిటీ పీరియడ్‌లో బరాజ్‌లకు రక్షణ చర్యలు తీసు కోవాలని.. వర్షాకాలానికి ముందు, తర్వాత, మధ్య లో పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించాలని తాము కోరినా రామగుండం ఈఎన్సీ చేయలేదని వివరించారు. ఐఎస్ కోడ్, కేంద్ర జలసంఘం మా న్యువల్స్ను కూడా పాటించలేదని ఆరోపించారు. బరాజ్‌ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినట్టు నల్లా వెంకటేశ్వర్లు నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. గేట్ల నిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించినట్టు సమాచారం లేదని.. వరద ఉధృతితో దిగువన రక్షణ పనులు దెబ్బతినడానికి అది ఒక కారణం కావొచ్చని తెలిపారు. మరమ్మతులు చేయడం కోసం బరాజ్ లలో నీటి నిల్వలను తగ్గించాలని నిర్మాణ సంస్థలు కోరినా పట్టించుకోలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ దిశగా తమ కార్యాలయం ఆదేశాలేమీ ఇవ్వలేదని, అయితే నిల్వలను పెంచాలని నల్లా వెంకటేశ్వర్లు మౌఖిక ఆదేశాలిచ్చారని నాగేంద్రరావు వివరించారు.ఈఎన్సీ పోస్టు అలంకారానికా?‘బరాజ్‌ల వైఫల్యానికి నిర్వహణ వైఫల్యం ఓ కారణం కాదా? ఈఎన్సీ (ఓఅండ్ఎం) పోస్టు ఎందుకు ఉంది? అలంకారానికా?’ అని కమిషన్ నిలదీయగా.. నిర్వహణ బాధ్యత క్షేత్రస్థాయి సీఈలదేనని నాగేంద్రరావు బదులిచ్చారు. నిర్వహ ణ మాన్యువల్స్, సర్క్యులర్లు జారీచేసి వాటిని పాటించాలని కోరడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. నిరంతర నిల్వలతో బరాజ్‌ల ఎగువ భాగంలో మరమ్మతులు సాధ్యం కాలేదని, దిగువన అవకాశమున్నా మరమ్మతులు చేయలేదని వివరించారు. అయితే ‘నీటి నిల్వ అవసరాలకు బరాజ్‌లు పనికిరావని ఐఎస్ కోడ్‌లో ఉన్న విషయం మీకు తెలియదా? నిల్వ చేయాలని ఆదేశించినది ఎవరు? నిల్వలతోనే పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బరాజ్‌లు దెబ్బతిన్నాయా?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే నీళ్లు నిల్వ చేశా రని నాగేంద్రరావు వివరించారు. నిల్వలతో ఇసుక కొట్టుకుపోయి దెబ్బతినే అవకాశాలుంటాయని అంగీకరించారు. మూడు బరాజ్‌ల పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పనులు పూర్తయ్యా యని, మేడిగడ్డ బరాజ్‌లో నిబంధనల ప్రకారం పనులు జరగలేదని నాగేంద్రరావు తెలిపారు.నాణ్యతా పరీక్షలకు మనస్సాక్షి అంగీకరించలేదా?‘వరదల అనంతరం బరాజ్‌ల పరిస్థితి ఏమిటి? ఏమైనా దెబ్బతిన్నాయా? నిర్మాణం సరిగ్గా జరిగిందా? లేదా? అని పరిశీలించాలని మీ మనస్సాక్షి అంగీకరించలేదా?’ అని క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సీఈ అజయ్‌కుమార్‌ను పీసీ ఘోష్ కమిషన్ నిలదీసింది. అయితే నిర్మాణ దశలో, బిల్లుల చెల్లింపుల సమయంలోనే నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరం ఉండదని అజయ్‌కుమార్ బదులిచ్చారు. ఇక అసంపూర్తి పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నోటీసులిచ్చామని కమిషన్‌కు మాజీ ఈఈ సర్దార్ వివరించారు. గురువారం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. -
రైతు మార్కెట్లలో కోల్డ్ స్టోరేజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కూరగాయలు, పండ్ల హోల్‌సేల్ మార్కెట్లలో చిన్నపాటి శీతల గిడ్డంగుల ఏర్పాటుకు తాము సిద్ధమని చాంబర్ ఆఫ్ కోల్డ్ స్టోరేజెస్ ఇండస్ట్రీ వెల్లడించింది. ప్రభుత్వం స్థలం సమకూరిస్తే కోల్డ్ స్టోరేజీలను తాము సొంత ఖర్చుతో నిర్మిస్తామని చాంబర్ తెలంగాణ ప్రెసిడెంట్ గుబ్బ నాగేందర్ రావు చెప్పారు. ఇక్కడి హైటెక్స్‌లో నవంబరు 16–17 తేదీల్లో జరుగనున్న ఇండియా కోల్డ్ చైన్ ఎక్స్పో, ట్రేడ్ షో(ఐసీఈ) వివ రాలను సోమవారం మీడియాకు ఆయన వెల్లడిం చారు. ‘రైతు తీసుకొచ్చిన పంటను ఈ గిడ్డంగుల్లో నిల్వ చేయవచ్చు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పడే విక్రయించుకోవచ్చు. రైతులకు అతి తక్కువ ధరకే కోల్డ్ స్టోరేజ్ సేవలు అందుబాటులో ఉంటాయి’ అని వివరించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గిస్తే పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందన్నారు. కొత్త గిడ్డంగులొస్తున్నాయ్..: దేశవ్యాప్తంగా సు మారు 6,000 కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. వీటిలో 90% యూపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఉన్నాయి. తెలంగాణలో 150, ఆంధ్రప్రదేశ్‌లో 200 దాకా ఉన్నాయి. కొత్త గిడ్డంగికి రూ.1.5 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. 180 ప్రాజెక్టులు 2018–19లో సబ్సిడీ అందుకోనున్నాయని గ్లోబల్ కోల్డ్ చైన్ అలయన్స్ భారత ప్రతినిధి అతుల్ ఖన్నా వెల్లడించారు. మల్టీ కమోడిటీ స్టోరేజ్ సెంటర్లకు డిమాండ్ ఉంటోందని అలయాన్స్ మార్కెటింగ్ మేనేజర్ పూర్ణిమా రావత్ చెప్పారు. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ విస్తరణ ♦ పౌల్ట్రీ, ఫార్మాలకు గిడ్డంగులు ♦ 2019లో 5 కేంద్రాల ఏర్పాటు ♦ సంస్థ ఎండీ గుబ్బ నాగేందర్ రావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గుబ్బ కోల్డ్ స్టోరేజ్ భారీగా విస్తరిస్తోంది. పౌల్ట్రీ కోసం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో రెండు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది. ప్రముఖ పౌల్ట్రీ కంపెనీకోసం వీటిని నిర్మించనున్నట్టు గుబ్బ కోల్డ్ స్టోరేజ్ ఎండీ గుబ్బ నాగేందర్ రావు సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఒక్కొక్కటి రూ.9 కోట్ల వ్యయంతో 2 కోట్ల కోడిగుడ్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఇవి ఉంటాయన్నారు. ఫార్మా రంగాల కోసం ప్రత్యేకంగా వైజాగ్, గుజరాత్, మహారాష్ట్రలో నిల్వ కేంద్రాలను స్థాపిస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. సంస్థ ఇప్పటికే హైదరాబాద్ సమీపంలో ఫార్మా కోసం రెండు గిడ్డంగులు, సీడ్ కంపెనీల కోసం జెర్మ్‌ప్లాసం బ్యాంక్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. పెట్టుబడి పెడితే చాలు.. కమాడిటీ ట్రేడింగ్‌లో 139 ఏళ్లుగా ఉన్న గుబ్బ గ్రూప్ 1987లో తొలి గిడ్డంగిని నెలకొల్పింది. ప్రస్తుతం 17 సెంటర్లను నిర్వహిస్తోంది. ఇందులో 14 మల్టీ కమాడిటీ గిడ్డంగులు. వీటన్నిటి సామర్థ్యం 1,20,000 టన్నులు. సంఖ్య, సామర్థ్యం పరంగా దేశంలో గుబ్బ గ్రూప్ అతి పెద్దది. హైదరాబాద్ సమీపంలోని అన్నారం వద్ద 7,000 టన్నుల సామర్థ్యంతో రూ.7 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ కమాడిటీ స్టోరేజ్ సెంటర్ నవంబరులో ఆరంభమవుతుందని నాగేందర్ రావు తెలిపారు. ‘ఔత్సాహిక వ్యాపారులు పెట్టుబడి పెడితే చాలు. గిడ్డంగులను నిర్మించి మేమే నిర్వహిస్తాం. భాగస్వామికి ప్రతినెలా ఆదాయం సమకూరుతుంది’ అని చెప్పారు. పాత గిడ్డంగులను కొనుగోలు చేసేందుకూ సిద్ధమన్నారు. కంపెనీలో 230 మంది ఉద్యోగులున్నారు. -
టెక్ మహీంద్రా ఉద్యోగి దుర్మరణం
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామ వద్ద హైవేపై శనివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్పోర్ట్సు బైక్ ఇంజన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరు టెక్ మహీంద్రా ఉద్యోగస్తులు. కాగా హెల్మెట్ ఉన్నా బలంగా ఢీ కొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం కాగా వంశీకృష్ణది విజయవాడలోని కృష్ణలంక అని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
సెంట్రల్ ఎక్సైజ్ అధికారి నాగేంద్రరావుకు రాష్ట్రపతి అవార్డు
విజయవాడ బ్యూరో: గుంటూరు సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ వి.నాగేంద్రరావు (ఐఆర్ఎస్)కు జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవార్డు లభించింది. ఈ నెల 24న ఢిల్లీలో జరిగే సెంట్రల్ ఎక్సైజ్ డే వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నాగేంద్రరావుకు సమాచారం అందింది. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామానికి చెందిన నాగేంద్రరావు 1992లో సివిల్ సర్వీసెస్ పరీక్ష పాసై సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 2002లో అసిస్టెంట్ కమిషనర్‌గానూ, 2015లో అడిషనల్ కమిషనర్‌గానూ పదోన్నతులు పొందిన నాగేంద్రరావు మీరట్, చెన్నై, మంగళూర్ నగరాల్లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెంట్రల్ ఎక్సైజ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోన్న నాగేంద్రరావు మంచి అధికారిగా కేంద్రప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారు. ఈ నెల 24న ఢిల్లీలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోన్న సందర్భంగా ఈయనను రాష్ట్రపతి అవార్డుకు ఎంపికచేశారు. దేశవ్యాప్తంగా 17మందిని ఎంపిక చేయగా, మన రాష్ట్రం నుంచి ఎంపికైంది నాగేంద్రరావు ఒక్కరే. -
ఆరాధ్య చనిపోలేదు... ఊరెళ్ళింది..!
-
ఆరాధ్య చనిపోలేదు... ఊరుకెళ్లింది
ఒంగోలు : ముద్దులు మూటగట్టే తన పాప దారుణ హత్యకు గురైందన్న వార్త విని ...ఆరాధ్య తల్లి సాహితి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆరాధ్యా చనిపోలేదని... ఊరుకెళ్లిందంటూ ఆమె చెబుతున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటివరకూ తమ మధ్యే ఆడుకున్న చిన్నారి ... ఇకలేదనే విషయాన్ని...ఆరాధ్య కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరాధ్య బాబాయ్ లక్ష్మీనారాయణ ఎందుకిలా చేశాడో అంతు పట్టడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై చిన్నారి తాతయ్య నాగేంద్రరావు మాట్లాడుతూ ఆరాధ్యను తన చిన్నల్లుడు ఎందుకు హతమార్చాడో అర్థం కావటం లేదన్నారు. ఆరాధ్యను లక్ష్మీనారాయణ ముద్దు చేసేవాడని, ఎత్తుకుని ఆడించే వాడని అన్నారు. భార్యతో సన్నిహితంగా ఉండేందుకు పాప అడ్డుగా ఉందని చంపటం దారుణమన్నారు. ఇష్టం లేకుంటే వాళ్లు వేరే వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు. అంతేకానీ పాపను చంపేంతగా కక్ష కడతాడనుకోలేదన్నారు. ఏమి ఆశించి ఈ పని చేశాడో తెలియటం లేదన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి కుటుంబ విభేదాలు లేవని అన్నారు. పాప కనిపించకపోవటంతో పోలీసులు అందర్ని విచారించారని, అయితే తన చిన్నల్లుడిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే ఆరాధ్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని నాగేంద్రరావు తెలిపారు. కాగా ఆరాధ్య పిన్ని సింధు..లక్ష్మీనారాయణ ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందు పెద్దలకు ఇష్టం లేకపోయినా అనంతరం వారు అంగీకరించటంతో ...అందరూ కలిసే ఉంటున్నారు. -
శుభకార్యానికి వెళ్లొస్తూ పరలోకానికి..
రోడ్డు ప్రమాదంలోఇద్దరు మృతి జమీ గొల్వేపల్లి అడ్డరోడ్డు వద్ద ప్రమాదం మృతుల స్వస్థలం గుడ్లవల్లేరు మండలం పెంజెండ్ర అడ్డాడ (పామర్రు) : బంధువుల ఇంట్లో వివాహ వేడుకలో పాల్గొని స్వగ్రామం తిరిగి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మండలంలోని అడ్డాడ పంచాయతీ పరిధిలోగల జమీ గొల్వేపల్లి అడ్డరోడ్డు వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. గుడ్లవల్లేరు మండలం పెం జెండ్ర గ్రామానికి చెందిన బుడిమెల్లి రామ్మోహనరావు(36), పోలాబత్తిన నాగేంద్రరావు(46) బుధవారం రాత్రి మోటార్‌సైకిల్‌పై గుడివాడ వెళ్లారు. అక్కడ బంధువుల ఇంట్లో వివాహ వేడుకలో పాల్గొన్నారు. మరుసటిరోజు రిసెప్షన్లో కూడా పాల్గొని స్వగ్రామం తిరుగు ప్రయాణమయ్యారు. వీరితోపాటు స్నేహితుడు బొజ్జా రాజు కూడా ఉన్నాడు. మార్గమధ్యంలో గాంధీ ఆశ్రమం వద్ద కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం రాజును అక్కడే వదిలేసి రామ్మోహనరావు, నాగేంద్రరావు తిరిగి బయలుదేరారు. జమీగొల్వేపల్లి అడ్డరోడ్డు పరిధిలోకి రాగానే రబ్బీష్ లోడు టిప్పర్ ఎదురుగా వచ్చిం ది. ఆ సమయంలో బైక్‌ను నడుపుతున్న నాగేం ద్రరావు కంగారుపడి అటూ ఇటూ తిప్పాడు. టిప్పర్ డ్రైవర్ కూడా కంగారుపడి వాహనాన్ని కుడివైపునకు పోనిచ్చాడు. దీంతో లారీ బైక్‌ను ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. రామ్మోహనరావు టిప్పర్ కింద పడి తీవ్ర గాయాలతో కాలువ గట్టున మరణిం చా డు. నాగేంద్రరావును బైక్‌తో సహా టిప్పర్ కా లువలోకి ఈడ్చుకుపోయింది. అతడు కూడా తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఈ ఘటన అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. క్రేన్‌ను రప్పించి లారీని బయటకు లాగారు. తరువాత బైక్‌ను కూడా తీసి నాగేంద్రరావు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం సగానికి తెగిపోయి చూపరులకు భయంగొలిపే విధంగా ఉంది. గుడివాడ డీఎస్పీ నాగ న్న ఘటనాస్థలికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పామర్రు సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై విల్సన్‌బాబు ఆధ్వర్యంలో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబానికి శాశ్వతంగా దూరమైన నాగేంద్రరావు మృతుడు నాగేంద్రరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో ఉద్యోగి. బంధువుల ఇం ట్లో వివాహం కోసం స్వగ్రామం వచ్చాడు. ఇతనికి భార్య బేబి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడితో గొడవల కారణంగా వారు రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు నవీన్ విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. రెండో కుమారుడు నిఖిల్ చదువుకుంటున్నాడని సమాచారం. వీరిద్దరి మరణంతో పెంజెండ్ర వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదం గురించి తెలియగానే పలువురు ఘటనాస్థలికి వచ్చారు. రామ్మోహనరావు అందరితో స్నేహం గా ఉండేవాడని స్థానికులు తెలిపారు. కుటుంబానికి అతడే ఆధారం ప్రమాదంలో మృతి చెందిన బుడి మెల్లి రామ్మోహనరావుకు తల్లి సుబ్బమ్మ, కుమారుడు దినేష్ ఉన్నారు. భార్య గతంలో చనిపోయింది. రామ్మోహనరావు బిస్కెట్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కుమారుడిని గుడివాడలోని పా లిటెక్నిక్ కళాశాలలో చదివిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడు మరణించడంతో బం ధువులతో కలిసి కుటుంబసభ్యులు ఘట నాస్థలికి వచ్చారు. ఉన్న ఒక్క ఆసరాను కో ల్పోయామని తల్లి, కుమారుడు రోదించడం చూపరుల కంట తడి పెట్టించింది. -
సంక్షేమశాఖలో కొట్లాటపై సమగ్ర విచార ణ
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో గురువారం ఉద్యోగుల మధ్య జరిగిన బాహాబాహీకి సంబంధించి శుక్రవారం ఐదవ నగర సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై సోమయ్య కార్యాలయానికి చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు. అయితే పలువురు సిబ్బంది వివరా లు తెలిపేందుకు నిరాకరించారు. సమా ధానాలు చెప్పేవారు మాత్రమే కార్యాల యంలో ఉండాలని, మిగతా వారు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఆరుగురు సిబ్బంది మాత్రమే జరిగిన ఘటన వివరించేందుకు ముందుకు వచ్చా రు. వారందరినీ ఒకేసారి విచారించడంపై సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించి వ్యక్తిగతంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. సిబ్బందిని విచారించిన తర్వాత పోలీసు అధికారులు సోషల్ వెల్ఫేర్ డీడీ యు.ప్రసాదరావు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి సీహెచ్ నాగేంద్రరావులను కలిసి వివరాలు సేకరించారు. విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించిన తర్వాత తప్పు చేసిన వారిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
ఎంత కష్టం.. ఎంత నష్టం..
=హెలెన్ తుపానుతో కోలుకోలేని దెబ్బ = పొలంలోనే మొలకెత్తుతున్న ధాన్యం = చేష్టలుడిగిన అన్నదాత = పంట నష్టం అంచనాకు అధికారులు సిద్ధం శ్రమ చేసి.. చెమటోడ్చి.. నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట చేతికొచ్చే దశలో నేలపాలైతే.. ఆ రైతుకు ఎంత కష్టం! అప్పులు తెచ్చి.. పెట్టుబడులు పెట్టి.. ఎన్నో ఆశలతో చేసిన సాగు పొలంలోనే దెబ్బతింటే.. దిగుబడులు దారుణంగా పడిపోయే పరిస్థితి నెలకొంటే అన్నదాతకు ఎంత నష్టం!! ఆశలు అడియాసలవుతున్న వేళ.. ఉన్న పంటనైనా కాపాడుకునేందుకు రైతన్న నానా పాట్లు పడుతున్నాడు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లా రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. పంట చేతికొచ్చే సమయంలో బలమైన గాలులు, వర్షం ధాటికి నేలకొరిగిన పైరు లోలోపలే కుళ్లిపోతోంది. నేలవాలిన వరి కంకులు నీటిలో నానిపోతూ మొలకెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో బీపీటీ 5204 రకాన్ని అత్యధికంగా రైతులు సాగు చేశారు. ఈ రకం విత్తనానికి పై తోలు పలుచగా ఉండటంతో వర్షాలకు తడిచి నీటిలో పడిన ధాన్యం త్వరితగతిన మొలకెత్తేందుకు అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఆదివారం కొంతమేర జిల్లాలో వర్షం తగ్గినా పైరు నీటిలోనే నానుతుండటంతో రైతులు ఖరీఫ్ పంటపై ఆశలు వదులుకునే పరిస్థితి దాపురించింది. పంటలను రక్షించుకునేందుకు రైతన్న పాట్లు... తుపాను తాకిడికి నేలవాలిన వరిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. పొలంలో ఉన్న నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పడిపోయిన వరిని జుట్టుకట్టలు కట్టి నిలబెట్టే పనులు చేపట్టారు. నేలవాలిన వరి పైకి పచ్చగానే కనపిస్తున్నా నీటిలో నానుతూ పైరు కుళ్లిపోతోంది. పాలుపోసుకునే దశలో ఉన్న కంకులు నీటిలో రెండు, మూడు రోజులకు మించి మునిగి ఉంటే గింజ గట్టిపడదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో పొలాల్లో నిలిచిన నీటిని బయటికి తరలించేందుకు ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. మరికొన్నిచోట్ల కోతకొచ్చిన పైరును యంత్రాలను కోయిస్తున్నారు. మినుము విత్తనాలు చల్లేందుకు ఆటంకమే... జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. 5.50 లక్షల ఎకరాలకు పైగా వరికోతకు సిద్ధమైంది. హెలెన్ తుపాను ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో రెండో పంటగా మినుము (అపరాలు) సాగు చేస్తారు. పైరు నేలవాలటంతో మినుము విత్తనాలు చల్లేందుకు అవకాశం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. పొలంలో నీరు నిలిచి ఉండటంతో మినుము విత్తనాలు ఇప్పట్లో చల్లే అవకాశం లేదని పేర్కొంటున్నారు. మినుము సాగు చేసే 22 మండలాలకు నాలుగువేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పొలంలో నీరు తగ్గితేనే మినుము చల్లేందుకు అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. పంటను ఇలా కాపాడుకోండి... హెలెన్ తుపాను ప్రభావంతో కోత దశలో ఉన్న పైరు నీటమునిగిందని, ఈ పంటను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలని మచిలీపట్నం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పి.అనురాధ, నాగేంద్రరావు పలు సూచనలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పైరు నేలవాలితే పైరుపై లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి కంకుల మీద పిచికారీ చేయాలని తెలిపారు. వల్ల ధాన్యం మొలకెత్తకుండా, రంగు మారకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కోసిన వరి పనలపై ఉంటే లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. పనలను తరచూ తిప్పుతూ ఆరబెట్టాలన్నారు. తడిచిన పనలను కుప్పగా వేస్తే సిలీంద్ర వ్యాప్తి జరిగి ధాన్యం రంగుమారి ముక్కిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఎకరం పైరును కుప్పవేసే సమయంలో 40 నుంచి 50 కిలోల ఉప్పును కుప్పలో ప్రతి వరుసకు చల్లితే ధాన్యం మొలకెత్తకుండా ముక్కిపోకుండా ఉంటుందన్నారు. కల్లంలో ఉన్న ధాన్యం తడిస్తే క్వింటాలు ధాన్యానికి ఐదు కిలోల ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి పోగు పెట్టాలని సూచించారు. ఇలా చేస్తే తడిచిన ధాన్యం వారం రోజుల వరకు మొలకెత్తకుండా, దెబ్బతినకుంటే ఉండే అవకాశం ఉందన్నారు. హెలెన్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని విజయవాడలో జరిగిన మండల వ్యవసాయాధికారుల సమావేశంలో నిర్ణయించారు. పంట నష్టం అంచనాలను కచ్చితంగా తయారుచేయాలని వ్యవసాయ శాఖ జేడీ బాలునాయక్ ఏవోలకు సూచించారు.