శుభకార్యానికి వెళ్లొస్తూ పరలోకానికి.. | Two killed in road accident | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్లొస్తూ పరలోకానికి..

Published Fri, Aug 22 2014 2:40 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

శుభకార్యానికి వెళ్లొస్తూ పరలోకానికి.. - Sakshi

శుభకార్యానికి వెళ్లొస్తూ పరలోకానికి..

  • రోడ్డు ప్రమాదంలోఇద్దరు మృతి
  •   జమీ గొల్వేపల్లి అడ్డరోడ్డు వద్ద ప్రమాదం
  •   మృతుల స్వస్థలం గుడ్లవల్లేరు మండలం పెంజెండ్ర
  • అడ్డాడ (పామర్రు) : బంధువుల ఇంట్లో వివాహ వేడుకలో పాల్గొని స్వగ్రామం తిరిగి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మండలంలోని అడ్డాడ పంచాయతీ పరిధిలోగల జమీ గొల్వేపల్లి అడ్డరోడ్డు వద్ద గురువారం ఈ ఘటన జరిగింది.

    వివరాల ప్రకారం.. గుడ్లవల్లేరు మండలం పెం జెండ్ర గ్రామానికి చెందిన బుడిమెల్లి రామ్మోహనరావు(36), పోలాబత్తిన నాగేంద్రరావు(46) బుధవారం రాత్రి మోటార్‌సైకిల్‌పై గుడివాడ వెళ్లారు. అక్కడ బంధువుల ఇంట్లో వివాహ వేడుకలో పాల్గొన్నారు. మరుసటిరోజు రిసెప్షన్‌లో కూడా పాల్గొని స్వగ్రామం తిరుగు ప్రయాణమయ్యారు. వీరితోపాటు స్నేహితుడు బొజ్జా రాజు కూడా ఉన్నాడు. మార్గమధ్యంలో గాంధీ ఆశ్రమం వద్ద కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం రాజును అక్కడే వదిలేసి రామ్మోహనరావు, నాగేంద్రరావు తిరిగి బయలుదేరారు.

    జమీగొల్వేపల్లి అడ్డరోడ్డు పరిధిలోకి రాగానే రబ్బీష్ లోడు టిప్పర్ ఎదురుగా వచ్చిం ది. ఆ సమయంలో బైక్‌ను నడుపుతున్న నాగేం ద్రరావు కంగారుపడి అటూ ఇటూ తిప్పాడు.  టిప్పర్ డ్రైవర్ కూడా కంగారుపడి వాహనాన్ని కుడివైపునకు పోనిచ్చాడు. దీంతో లారీ బైక్‌ను ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. రామ్మోహనరావు టిప్పర్ కింద పడి తీవ్ర గాయాలతో కాలువ గట్టున మరణిం చా డు. నాగేంద్రరావును బైక్‌తో సహా టిప్పర్ కా లువలోకి ఈడ్చుకుపోయింది. అతడు కూడా తీవ్ర గాయాలతో చనిపోయాడు.

    ఈ ఘటన అనంతరం టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. క్రేన్‌ను రప్పించి లారీని బయటకు లాగారు. తరువాత బైక్‌ను కూడా తీసి నాగేంద్రరావు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం సగానికి తెగిపోయి చూపరులకు భయంగొలిపే విధంగా ఉంది. గుడివాడ డీఎస్పీ నాగ న్న ఘటనాస్థలికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పామర్రు సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై విల్సన్‌బాబు ఆధ్వర్యంలో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  
     
    కుటుంబానికి శాశ్వతంగా దూరమైన నాగేంద్రరావు
     
    మృతుడు నాగేంద్రరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో ఉద్యోగి. బంధువుల ఇం ట్లో వివాహం కోసం స్వగ్రామం వచ్చాడు. ఇతనికి భార్య బేబి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడితో గొడవల కారణంగా వారు రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు నవీన్ విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. రెండో కుమారుడు నిఖిల్ చదువుకుంటున్నాడని సమాచారం.
     
    వీరిద్దరి మరణంతో పెంజెండ్ర వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదం గురించి తెలియగానే పలువురు ఘటనాస్థలికి వచ్చారు. రామ్మోహనరావు అందరితో స్నేహం గా ఉండేవాడని స్థానికులు తెలిపారు.  
     
    కుటుంబానికి అతడే ఆధారం

    ప్రమాదంలో మృతి చెందిన బుడి మెల్లి రామ్మోహనరావుకు తల్లి సుబ్బమ్మ, కుమారుడు దినేష్ ఉన్నారు. భార్య గతంలో చనిపోయింది. రామ్మోహనరావు బిస్కెట్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కుమారుడిని గుడివాడలోని పా లిటెక్నిక్ కళాశాలలో చదివిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడు మరణించడంతో బం ధువులతో కలిసి కుటుంబసభ్యులు ఘట నాస్థలికి వచ్చారు. ఉన్న ఒక్క ఆసరాను కో ల్పోయామని తల్లి, కుమారుడు రోదించడం చూపరుల కంట తడి పెట్టించింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement