wedding ceremony
-
నేడు సింధు వివాహ రిసెప్షన్... ప్రముఖులు హాజరయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకటదత్త సాయి వివాహ వేడుకల్లో భాగంగా నేడు మరో కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అన్వయ కన్వెన్షన్స్ వేదికగా మంగళవారం రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున క్రీడా, సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు సచిన్ టెండూల్కర్ తదితరులను సింధు ఆహ్వానించింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఆదివారం రాత్రి రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో సింధు పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితులైన కొందరు అతిథులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి హాజరైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వధూవరులను ఆశీర్వదించారు. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు సహా పలు గొప్ప విజయాలతో భారత అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా సింధు గుర్తింపు తెచ్చుకోగా... పొసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీకి దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఏం పెళ్లి రా అది..! ప్రస్తుతం ట్రెండ్..
ఇటీవల పారిశ్రామిక కుబేరుడు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక ఎంత ఆర్భాటంగా జరిగిందో అందరూ చూశారు. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాల వంటి అతిథులను పిలిపించారు. కానీ స్థానిక ధనవంతులు అంత స్థాయిలో కాకపోయినా అబ్బో అనిపించేలా తమ పిల్లల వివాహాలను జరిపిస్తున్నారు. సిలికాన్ సిటీలో ఇటువంటి పెళ్లిళ్ల పరిశ్రమ ప్రముఖంగా మారిపోయింది.సాక్షి, బెంగళూరు: గతంలో పెళ్లి అనేది చాలా శాస్త్రోక్తంగా జరగాలని భావించేవారు. అయితే నేటి రోజుల్లో తమ తమ ఆడంబరాలను చాటుకోవడానికి సంపన్నులు, ఆఖరికి మధ్య తరగతివారు కోట్ల రూపాయలు వెదజల్లి వైభవోపేతంగా చేసుకుంటున్నారు. డబ్బులు ఉంటే చాలు.. ఇంద్ర భవనం వంటి ఫంక్షన్‌హాల్స్, టూరిస్టు ప్రదేశాలలో మూడుముళ్ల వేడుకలు జరుగుతాయి. అందులోనూ వెడ్డింగ్ ప్లానర్ల పాత్ర పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాను తీసినట్లుగా పెళ్లి తంతును మహా ఆర్భాటంగా చేయడం సిలికాన్ సిటీలో ట్రెండ్ అయ్యింది.వెడ్డింగ్ ప్లానర్లుగతంలో పెళ్లి అంటేనే ముహూర్తం, ఆభరణాలు, బట్టల కొనుగోలు, ఆహ్వాన పత్రిక, ఫంక్షన్ హాల్, ఫోటో, వీడియో గ్రాఫర్లు తదితర ఎన్నో అంశాలు మదిలో మెదులుతాయి.. ఇలా హడావుడి పెళ్లిళ్ల ఒత్తిడిని వెడ్డింగ్ ప్లానర్లు తప్పిస్తున్నారు. పెళ్లి బాద్యతలను వెడ్డింగ్ ప్లానర్లకు అప్పగిస్తే పెళ్లి పనులు అన్నీ వారే చూసుకుంటారు. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్లు ప్రస్తుతం బెంగళూరు ఎంతో వేగంగా పెరిగిపోతున్నారు.అన్ని హంగులూ ఉండాలి మరిసాధారణంగా ధనవంతులు తమ కుటుంబంలోని పెళ్లిళ్ల ద్వారా తాము ఎంత శ్రీమంతులమో తెలియజేయాలని అనుకుంటారని, అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా పెళ్లిళ్లు జరిగిస్తారని కొందరు ప్లానర్లు తెలిపారు. ఈ గ్రాండియర్, రిచ్‌నెస్ కోసం భోజనాల దగ్గరి నుంచి అతిథులకు ఇచ్చే గిఫ్ట్‌ల వరకు రాజీ పడడం లేదు. కొంతమంది శ్రీమంతులు తమ పెళ్లిళ్లలో సెలబ్రెటీలు ఉండాలని కోరుకుంటారని ప్లానర్లు తెలిపారు. పెళ్లిలో సినిమా, టీవీ ప్రముఖ నటీనటులు, మోడల్స్ పాల్గొనేలా చూడమని కోరుతుంటారు. మధ్య తరగతి కుటుంబాల కోసం రూ. 15 లక్షల నుంచి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ఒకవేళ గ్రాండ్‌గా పెళ్లి జరగాలంటే ఫుల్ ప్యాకేజీ కింద కనీసం కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఎవరూ వెనుకాడకుండా లగ్జరీ పెళ్లిళ్లకు సరే అంటున్నారు.నెలరోజుల్లో రూ.900 కోట్లపైనే వివాహం ఎంతో గ్రాండ్‌గా జరగాలి... అందరూ మన పెళ్లి కూడా చర్చించుకోవాలి అనే క్రేజ్ కర్ణాటకలో పెరిగిపోతోంది. ఇతర జిల్లాల నుంచి బెంగళూరుకు విచ్చేసి ఘనంగా పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు. బెంగళూరులో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య సుమారు 13 వేలకు పైగా పెళ్లిళ్లు ఉన్నట్లు ప్లానర్లు తెలిపారు. ఈ సమయంలో డెకరేషన్, సెట్డిజైనర్, షామియానాలు, మేకప్ కళాకారులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యాండ్ సెట్, లైటింగ్, కేటరింగ్, ఆర్కెస్ట్రా, ఆభరణాల కొనుగోలు ఇలా తదితర అంశాల కోసం రూ. 900 కోట్ల మేర లావాదేవీలు జరిగే అవకాశం ఉందని వెడ్డింగ్ ప్లానర్లు అంచనా వేస్తున్నారు. ఇక కొందరైతే సముద్ర తీరం, రాజ ప్యాలెస్, అందమైన పరిసరాలు, ఖరీదైన స్టార్ హోటళ్లలో కొద్దిపాటి సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. బెంగళూరు చుట్టుపక్కల గడిచిన నెల రోజుల్లో సుమారు 9 డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరిగాయి. మరో 17 పెళ్లిళ్లు నిశ్చమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి డెస్టినేషన్ వెడ్డింగ్ సంఖ్య 10 శాతం పెరిగినట్లు ప్లానర్లు తెలిపారు. -
సాయిపల్లవి సిస్టర్ పూజకన్నన్ పెళ్లి వేడుక.. ఈ అరుదైన పిక్స్ చూశారా? (ఫొటోలు)
-
మోగనున్న పెళ్లి బాజాలు
పామర్రు/వత్సవాయి: వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అందుకే అందరూ మెచ్చుకునేలా, పదికాలాలూ గుర్తుండిపోయేలా వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటారు. మూఢం, ఆషాఢం ముగియడంతో మళ్లీ ముహూర్తాల సందడి మొదలైంది. మార్చి నెల వరకూ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగ ఉండటంతో ఆ నెలలో ముహూర్తాలు ఉండవు. మళ్లీ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు శుభకార్యాలకు మహూర్తాలు ఉన్నాయి. దీపావళి తర్వాత వద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, తదితర శుభకార్యాలతో ఊరూవాడా కళకళలాడనున్నాయి.షాపింగ్ సందడిపట్టణాల్లో పెళ్లిళ్ల షాపింగ్ ఊపందుకుంది. దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వధూవరుల కుటుంబ సభ్యులు షాపింగ్‌లు ప్రారంభించారు. పెళ్లి దుస్తుల కొనుగోలుకు రూ.లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. బంగారు ఆభరణాలను తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు. వస్త్ర, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. భోజనాలు, క్యాటరింగ్, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, డెకరేషన్ల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభ లేఖల ప్రింటింగ్, ప్లెక్సీ ఫ్రింటర్స్, ఫొటోగ్రాఫర్లు, టెంట్ హౌస్, వంట మేస్త్రిలు, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, భజంత్రీలు.. ఇలా పెళ్లి వేడుకతో ముడి పడిన ప్రతి ఒక్కరికీ చేతినిండా పని దొరుకుతోంది. ఆర్థికంగా స్తోమతు ఉన్నవారు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే వెడ్డింగ్ ప్లానర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సాధారణ, మధ్య తర గతి వారు కూడా తమస్థాయికి తగ్గట్లు పెళ్లి వేడు కలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.రాజీ లేకుండా..ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, రిసెన్షన్, పోస్టు వెడ్డింగ్ ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకలను శ్రీమంతులు రాజీ పడకుండా నిర్వహిస్తున్నారు. ఈ సీజన్లో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. కల్యాణ మండపాలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇటీవల పామర్రులో నిర్మించిన ఓ కళ్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమార్తె వివాహ వేడుకను సుమారు రూ.25 లక్షలు వెచ్చించి నిర్వహించారు.ఆధునిక సెట్టింగ్లుకల్యాణ మండపాల్లో కళ్లు చెదిరే సెట్టింగ్‌లు ఏర్పా టుచేస్తున్నారు. కల్యాణ మండపాల్లో రూ.లక్షల్లో అద్దెలు పలుకుతున్నా అక్కడయితే ఆ సంబరమే వేరని వధూవరుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా, ఎవరి స్థాయిలో వారికి రంగుల హరివిల్లులా మండపాలు తీర్చి దిద్దుతున్నారు. వీటికి డిమాండ్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు.ఫొటోగ్రఫీలో కొత్త పుంతలుముఖ్యంగా పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీకి నేడు అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫొటోలు, వీడియో షూటింగ్‌లకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇటీవలన పెళ్లిళ్లలో డ్రోన్ కెమెరాలు విరివిగా వాడుతు న్నారు. ఎంత ఎత్తు నుంచి, ఎంత దూరం నుంచి అయినా క్వాలిటీ ఫొటోలు, వీడియో వస్తుండ టంతో డ్రోన్‌కు మరింత డిమాండ్ ఏర్పడింది. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ ఘాట్ అని రకరకాలుగా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.మంగళవాయిద్యాలకు మంచి గిరాకీహిందూ సంప్రదాయంలో మంగవాయిద్యాలు లేకుండా పెళ్లి వేడుక ఉండదు. నూతన వధూవరులను సిద్ధం చేసే సమయం నుంచి పెళ్లి పూర్తయి ఇంటికి వచ్చే వరకు మంగళవాయిద్యాలు తప్పని సరి. బ్యాండు మేళాలు, ఆర్కెస్ట్రాలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా ఖర్చుచేస్తున్నారు. పెళ్లిళ్లో భోజనాల సంగతి సరేసరి. కొత్త కొత్త వైరెటీలకు ఎంత ఖర్చు పెట్టేందుకై నా వెనుకాడటం లేదు. రకరకాల బిరియానీలు, స్వీట్లు, కారా, కూరలు ఉంటాయి. ఎంచుకున్న మెనూ బట్టి ప్లేట్‌కు ఇంతని ధర నిర్ణయిస్తారు. వంటలు వడ్డిచ్చే వారికి కూడా డిమాండ్ ఉంది. పెళ్లిళ్లు చేయించే పురోహితులకు డిమాండ్ బాగా ఉంది.శుభ ముహూర్తాలు ఇవీ..అక్టోబర్ (ఆశ్వయుజ మాసం) : 26, 27నవంబర్ (కార్తిక మాసం) : 3, 7, 8, 10, 14, 16, 17, 20, 22, 27, 28డిసెంబర్ (మార్గశిర మాసం) : 4, 5, 6, 7, 8, 11, 12, 14, 15, 19, 20, 21, 26, 27, 28జనవరి (మాఘ మాసం) : 31ఫిబ్రవరి (మాఘ మాసం) : 2, 6, 7, 8, 9, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 26మార్చి (ఫాల్గుణ మాసం) : 2, 6, 9, 12, 15, 16 -
పెళ్లిలో ప్రియురాలి హల్చల్.. పెళ్లికొడుకుపై దాడికి యత్నం
అన్నమయ్య: తనకు తెలియకుండా మరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని ఓ ప్రియురాలు పెళ్లిలో హల్చల్ చేసింది. ఆగ్రహంతో పెళ్లి కొడుకుపై దాడికి దిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో ఈ రోజు వివాహం జరగుతున్న సమయంలో ప్రియురాలు రంగంలోకి దిగింది. సయ్యద్ భాషా.. తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సయ్యద్ భాషా తనను కాదని వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. షాదిఖానాలో పెండ్లి కొడుకు సయ్యద్ బాషాపై కత్తి, యాసిడ్‌తో దాడి యత్నించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో యాసిడ్ పడి ఒక్క మహిళలకు తీవ్రంగా, మరో మహిళలు స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అంతా ప్రేమ మయం అంటున్న హార్దిక్ పాండ్యా.. ఆ లాకెట్ స్పెషల్ (ఫొటోలు)
-
అనంత్ దంపతులను ఆశీర్వదించిన మోదీ
ముంబై: అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రిలయన్స్ సంస్థల అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రపంచ ప్రముఖులంతా తరలి రావడం తెలిసిందే. శనివారం జరిగిన వివాహ విందులో పాల్గొన్న మోదీకి ముకేశ్–నీతా అంబానీ దంపతులు స్వాగతం పలికారు. ‘శుభ్ ఆశీర్వాద్’ పేరిట జరిగిన విందు వేడుకకు కూడా తారాలోకంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, రాజకీయ తదితర రంగాల దిగ్గజాలు హాజరై సందడి చేశారు. -
పెళ్లి వేడుకలో కంగనా.. ఫ్యామిలీతో సంతోషంగా.. (ఫోటోలు)
-
ఏటా రూ.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వినియోగంలో భారత్‌లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్‌లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది. ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్‌లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్‌లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్‌లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్‌లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్‌కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్‌కు సైతం డిమాండ్‌ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్‌తో బ్యాండ్ బాజా బారాత్, షాన్‌దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్‌తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సాక్షి అసిస్టెంట్ ఎడిటర్ పోతుకూరు శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన రిసెప్షన్ కార్యక్రమంలో వరుడు దుర్గా చరణ్, వధువు హరిత సత్య రూపలను సీఎం జగన్ ఆశీర్వదించారు. -
తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. -
పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పోరంకి ఎం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వరుడు శ్రీధర్, వధువు అహల్యలను సీఎం ఆశీర్వదించారు. -
జోగి రమేష్ కుమార్తె పెళ్లి.. దంపతులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి జోగి రమేష్ కుమార్తె వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివరాల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకకు సీఎం జగన్ వెళ్లారు. ఈ సందర్బంగా వేడుకలో వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుత్తేదార్లను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. -
వరుణ్- లావణ్య పెళ్లి వేడుక.. వేదిక ఎక్కడో తెలుసా?
మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలవ్వుగా.. ఈ నెలలోనే పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మెగా ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్, ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. (ఇది చదవండి; మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) కాగా.. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుక కోసం అతిథులు, సన్నిహితుల ఆహ్వానాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉపాసన తన ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే వీరి పెళ్లి తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈనెలలో జరుగుతుందా లేదా వచ్చేనెలలోనా అనే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. (ఇది చదవండి: కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Iraq wedding fire: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
మోసల్ (ఇరాక్): ఇరాక్‌లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాక్‌లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్‌తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్‌కి తాకాయి. సీలింగ్‌కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్‌తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు. -
గ్రాండ్‌గా ప్రేతాత్మల పెళ్లి !! నోరూరించే నాన్‌వెజ్ వంటకాలు..
యశవంతపుర: తుళునాడులో జరిగే విభిన్నమైన పెళ్లి వేడుక ఇది. వధూవరులు ఎవరో కంటికి కనిపించరు. అటు, ఇటు పెళ్లిపెద్దలు చేరి వేడుక జరిపించి ఆశీర్వదిస్తారు. కొత్త జోడీ ఎవరి కంటికి కనిపించకుండా తంతు ముగిసిపోతుంది. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఏటా ఒకసారి ప్రేతాత్మలకు వివాహం చేయడం ప్రజలకు ముఖ్యమైన ఆచారం. కరావళిలో ప్రస్తుతం తుళు మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండా మరణించి ఉంటే వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేయడం ఇక్కడ సంప్రదాయం. తద్వారా మృతులకు పెళ్లి ముచ్చట తీరినట్లుగా భావిస్తారు. బంట్వాళ తాలూకా వగ్గ గ్రామం వధువు కుటుంబం, ఉళ్లాల తాలూకా కోణాజె సమీపంలోని చోళ్మ వరుని కుటుంబంగా ఏర్పడి ప్రేతాత్మలకు పెళ్లి చేశారు. వగ్గ గ్రామానికి చెందిన సంజీవ పూజారి కుతూరు విశాలాక్షి రెండేళ్ల క్రితం మృతి చెందింది. చోళ్మలో లక్ష్మణ కొడుకు ధరణేశ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. వీరిద్దరూ అవివాహితులు కావడంతో ఇరు కుటుంబాలవారు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఇక ఈ పెళ్లిలో నాన్‌వెజ్ కూడా వండుతారు. చికెన్, మటన్‌తో పాటు చేపల ఫ్రై కూడా ఉంటుంది. -
స్మశానంలో పెళ్లి బంధువుల ఫీలింగ్ చూడాలి
-
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్‌ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్‌సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. మండపంలో నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఇది కూడా చదవండి: సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు.. సీఎం జగన్‌ను ఎదుర్కోలేకే: సజ్జల -
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్‌గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి.. -
పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్
లక్నో: ఓ వధువు తన పెళ్లి వేడుకలో తుపాకీతో హల్చల్ చేసింది. వరుడి పక్కనే కూర్చొని గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ హథ్రాస్‌లోని సాలెంపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టేడీపై ఉన్న వధవు దగ్గరకు వెళ్లి తుపాకీ ఇచ్చాడు. దీంతో ఆమె దాన్ని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపింది. అనంతరం తుపాకీ తిరిగి ఇచ్చేసింది. ఈ సమయంలో వరుడు కూడా ఆమె పక్కనే ఉన్నాడు. కదలకుండా కూర్చున్నాడు తప్ప వద్దని గానీ, ఆపమని గానీ చెప్పలేదు. The video went #viral while firing pistol bride The bride fired joy at a guest house in Salempur of Thana #Hathras Junction area Bride's video of Harsh firing went viral on #socialmedia The bride is a resident of village Nagla Sekha of Hasayan police stn area.#UttarPradesh pic.twitter.com/neXrJexBik — Siraj Noorani (@sirajnoorani) April 8, 2023 అయితే వధువు తుపాకీ పేల్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. కాల్పులకు సంబంధించి విచారణ చేపట్టారు. చదవండి: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.. మాఫియా వణికిపోతోంది: సీఎం యోగి -
వైరల్ వీడియో: అతి చేశారు.. ముఖం కాల్చుకున్న పెళ్లికూతురు
-
వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యసాయిరెడ్డి (21) చైన్నె తురైపాక్కంలో ఉన్న హాస్టల్లో ఉంటూ శ్రీపెరంబుదూరులోని ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి కోయంబేడు నూరడుగుల రోడ్డులో ఉన్న వివాహ మండపంలో జరిగిన స్నేహితురాలి సహోదరి వివాహ రిసెప్షన్లో స్నేహితులతో కలిసి సత్యసాయి రెడ్డి పాల్గొన్నాడు. లైట్ మ్యూజిక్కు డ్యాన్స్ వేస్తున్న సమయంలో చెవి నుంచి రక్తం వచ్చింది. కొద్ది సేపటికే స్ఫృహ తప్పి కింద పడిపోయాడు. స్నేహితులు అతన్ని హుటాహుటిన అన్నానగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. స్నేహితుడి మృతదేహాన్ని చూసి స్నేహితులు బోరున విలపించారు. కోయంబేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. విచారనలో సాయికి ఫిట్స్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.