అగి్నప్రమాదం జరిగిన ఫంక్షన్ హాల్ (ఇన్‌సెట్‌లో) కాలి బూడిదైన వేదిక, కురీ్చలు
మోసల్ (ఇరాక్): ఇరాక్‌లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇరాక్‌లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది.
ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్‌తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు.
అవి నేరుగా రూఫ్‌కి తాకాయి. సీలింగ్‌కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్‌విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్‌తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు.
Comments
Please login to add a commentAdd a comment