Bride and groom
-
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..
‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్‌కు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది. దీంతో బ్రైడల్ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్‌కు ముందుగానే ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ ‘స్మార్ట్ థింకింగ్’... ఇలాంటి రకరకాల కామెంట్స్ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
Iraq wedding fire: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
మోసల్ (ఇరాక్): ఇరాక్‌లోని ఒక పెళ్లి వేడుకల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతిథులతో కిక్కిరిసిపోయిన హాలులో వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి 114 మంది మరణించారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. ఆస్పత్రితో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాక్‌లోని నినెవెహ్ ప్రావిన్స్ ఖరఖోష్ పట్టణంలో పెళ్లి వేడుకలో హాలులో బాణాసంచా కాల్చడంతో ఒక్కసారి డెకరేషన్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ హాలు నిర్మాణంలో ఉపయోగించిన సామాగ్రి, పెళ్లి కోసం చేసిన డెకరేషన్ కూడా మండించే స్వభావాన్ని కలిగి ఉండడంతో అగ్ని కీలలు త్వరితగతిన విస్తరించాయి. కళ్ల ముందే షాండ్లియర్లు, సీలింగ్ నుంచి పెచ్చులు కింద పడడంతో పెళ్లికి హాజరైన అతిథులు అటూ ఇటూ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో వధూవరులు తీవ్రంగా గాయపడినా వారి ప్రాణాలకు ప్రమాదం లేదని స్థానిక మీడియా వెల్లడించింది. పెళ్లి వేడుకలు అంబరాన్నంటుతున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న అతిథులు ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో హాహాకారాలు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెళ్లి వేడుకలు జరిగే మండపం అంతా ప్లాస్టిక్‌తో డెకరేషన్ చేశారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా హాలులోనే బాణాసంచా కాల్చారు. అవి నేరుగా రూఫ్‌కి తాకాయి. సీలింగ్‌కి మంటలు అంటుకోవడంతో అవి విస్తృతంగా వ్యాపించాయి. ఆ ఫంక్షన్ హాలుని శాండ్విచ్ ప్యానెల్స్, వినిల్ షీట్స్, ఫ్యాబ్రిక్‌తో నిర్మించడంతో మంటలు ఎగిసెగిసి పడ్డాయి. దీంతో పై నుంచి డెకరేషన్ సామాగ్రి కింద పడి ఎవరూ కదలడానికి వీల్లేకుండా పోయింది. అతిథుల సంఖ్య భారీ స్థాయిలో 1,000 నుంచి 1100 మంది ఉండడంతో అటూ ఇటూ వెళ్లాడానికి దారి లేక అందరూ అక్కడే చిక్కుకుపోయి మంటలకి ఆహుతైపోయారు. -
ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..
చాలామంది తమ వివాహాన్ని చాలా డిఫెరెంట్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టేందుకు వెనకడుగు వేయడం లేదు. పైగా ఆ పిచ్చితో ఎంతటి సాహాసానికైనా రెడీ అవుతున్నారు కూడా. అలానే ఇక్కడొ కొత్త జంట తమ వివాహ వేడుకు ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు. అందుకోసం వారి చేసిన సాహసం వింటే వామ్మో! అనకుండ ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇక అంతే సంగతులు. ఇంతకీ వారేం చేశారంటే.. ప్రిసిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లి రోజు ఎప్పటికీ తమకు గుర్తుండిపోయేలా స్వీట్ మెమరీలా ఉండాలని ఓ భయానక సాహాసానికి ఒడిగట్టారు. పెళ్లి అయిన తదనంతరమే ఈ సాహాసానికి దిగారు. వివాహ వేడుకకు విచ్చేసిన బంధువుల సమక్షంలోనే ఈ సాహసానికి సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఆ ఇద్దరూ స్కైడైవింగ్ చేస్తూ.. ఆనందంగా తమ వివాహ రోజుని జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్న ప్రకారమే ఆ జంట నిపుణుల పర్యవేక్షణలో కొండ అంచున నిలబడి దిగ్విజయంగా స్కైడైవింగ్ చేసేందుఉ రెడీ అయ్యారు. గుండెల పగిలే ఉత్కంఠ మధ్య ఆ దంపతులు గాల్లో చక్కర్లు కొడుతూ తమ వివాహాన్ని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ జంట 'అతి' చేస్తున్నారని విమర్శించగా మరికొందరూ మాత్రం నేను నా పెళ్లి టైంలో ఇలాగే చేస్తా.. అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) (చదవండి: 'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్లోనే తిందాం!) -
నిజమైన ప్రేమ ముందు..విధిసైతం తలవంచింది
అన్ని అనుకున్నట్లు జరిగిపోవు. ఒక్కోసారి ఏవిధంగా ప్రమాదం ముంచుకొస్తుందో కూడా తెలియదు. ఒకవేళ మనం మళ్లీ కోలుకోలేనంత ప్రమాదంలో చిక్కుకుపోయి ఆగమ్యం గోచరంలా మన జీవితం ఉన్నప్పుడే.. మన వాళ్లేవరో మనకు తెలుస్తుంది. ఆ సమయంలోనే ఎవరు మనవాళ్లో తెలుస్తుంది. మన కోసం తపించే వాళ్లెవరో అర్థమవుతుంది. అలాంటి ఘటనే ఓ వ్యక్తి లైఫ్‌లో చోటు చేసుకుంది. ఇరాన్‌కి చెందిన ప్రిస్టన్ కాబ్కి సెప్టెంబర్ 2022 తనేషా అనే ఆమెతో యంగేజ్మెంట్ అయ్యింది. జులై 22, 2023లో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఇంకా ఒక్క నెలలో పెళ్లి ఉందనంగా అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు ప్రిస్టన్. సరిగ్గా ప్రిస్టన్ విధి నిర్వహణలో ఉండగా సడెన్‌గా ఫ్యాక్టరీలో కెమికల్ వెదచెంది.. అతనిపై పడిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో కెమికల్ దాదాపు 1500ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉంది. ఆ దుర్ఘటనలో ప్రిస్టన్ శరీరీం సుమారు 32 శాతం కాలిపోయింది. మోచేతి చర్మం తన కళ్ల ముందే ఊడిపోయి ఎముకలు రావడం చూశాడు. ఇక ఆ రోజుతో తన జీవితం ముగిసిపోయిందనకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా ప్రిస్టన్‌కి తెలియదు. కళ్లు తెరిచి చూసేటప్పటికీ ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాడు. గాయాలు చాలా తీవ్రంగా అవ్వడంతో అతడిని ఆస్పత్రికి విమానంలో తరలించారు అధికారులు. ఆ ప్రమాదంలో ప్రిస్టన్ కాలి వేళ్లలో తొమ్మదిటిని, కుడి చేతి నాలుగు వేళ్లు, ఎడమ చేతి నేలుగువేళ్లను కోల్పయాడు. ఇక తనని తనేషా పెళ్లి చేసుకోదని అనుకున్నాడు. అసలు ఆ ఆలోచన తనలోకి రాకూడదని స్ట్రాంగ్‌గా అనుకున్నాడు. సడెన్‌గా ఆస్పత్రిలో ఉండే ఓ నర్సు వచ్చి కంగ్రాట్స్ మీరు అనుకున్న తేదినే పెళ్లి చేసుకుంటున్నారు అని చెబుతుంది. ఒక్కసారిగా ప్రిస్టన్‌కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. తనేషా ఆస్ప్రతి యాజమాన్యంతో మాట్లాడి ప్రిస్టన్ ట్రీట్మెంట్ తీసుకున్న రూమ్‌నే వెడ్డింగ్ రూమ్‌గా మార్చేస్తుంది. అక్కడే అతడిని పెళ్లి చేసుకోవాలనే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. ఆమె అనుక్నునట్లుగా అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసుకుంది. ప్రిస్టన్ సర్ప్రైజ్ చేస్తూ..నిన్ను పెళ్లి చేసుకోకుండా నన్ను ఏది ఆపలేదు అని ప్రిస్టన్తో భావోద్వేగంగా చెబుతోంది. ఇంత ప్రతికూలత నుంచి మృత్యుంజయుడివై బయటకు వచ్చినందుకు ఇదే నేను నీకు ఇచ్చే విలువైన గిఫ్ట్ అని సంతోషంతో ముంచెత్తుంది. ఆ జంటను కుటుంబ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి సమస్యలు ఎదురైనా..ఇదే స్ఫూర్తితో ఇద్దరు కలసి ఎదుర్కొండి అని ఆశ్వీరదించారు. (చదవండి: ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..) -
ఈ తల్లులు ప్రకృతే మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునేలా జరగాలి పెళ్లంటే మరి!’ అంట అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటితరం పెళ్లిళ్లు. ఏమాత్రం పర్యావరణ స్పృహలేకుండా హంగు, ఆర్భాటాలు చేస్త తెగ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. దీనివల్ల ప్రకృతమ్మ ఎంత తల్లడిల్లిపోతుందో కూడా పట్టడం లేదు. ఒకతల్లి మనసు మరో తల్లికే తెలుస్తుందేవె! అందుకే బెంగళూరుకు చెందిన ఇద్దరమ్మలు కలిసి తమ పిల్లల పెళ్లిని ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఎంతో ఘనంగా, ప్రకృతి మురిసేలా జరిపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగుళూరుకు చెందిన అనుపమ కువరుడికి, చారులత కూతురుతో వివాహం నిశ్చయమైంది. రెండు కుటుంబాలకు అన్ని విషయాల్లో సఖ్యత కుదిరింది. కానీ ‘పెళ్లిలో ప్లాస్టిక్‌ను అస్సలు వాడకడదు’ అని అనుపమ కండిషన్ పెట్టింది. ఇది చారులతకు నచ్చడంతో మరింత సంతోషంతో ఒప్పుకుని ‘‘ఇద్దరం కలిసి ప్లాస్టిక్ రహిత పెళ్లి చేద్దాం వదినా!’’ అని ఒక నిర్ణయానికి వచ్చారు. తమ పిల్లల పెళ్లిని మూడురోజులపాటు అంగరంగా వైభవంగా ప్లాస్టిక్ లేకుండా జరిపేందుకు నామమాత్రపు పెళ్లిపత్రికలను కొట్టించారు. కొంతమందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు ఇచ్చి, మిగతా వారిని నేరుగా పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిచేటప్పుడే.. ‘‘ఎవరూ బొకేలు, బహుమతులు వంటివి తీసుకు రావద్దు’’ అని మనవి చేశారు. అరిటాకులు.. స్టీల్ ప్లేట్లు... వచ్చిన వెయ్యిమంది అతిథులకు వడ్డించేందుకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్స్‌ను ఎంచుకున్నారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ స్థానంలో స్టీల్ సామాన్లు వాడారు. తాజా పువ్వులు, లైట్లతో పెళ్లిమండపాన్ని అలంకరించారు. పంతొమ్మిదేళ్లనాటి పేపర్‌తో... అనుపమ కొడుకుకు 2004లో ఉపనయనం జరిగిన సందర్భంగా జరిపిన వేడుకలో బటర్పేపర్ను వాడారు. అప్పుడు మిగిలిన పేపర్ తో పెళ్లికి వచ్చిన అతిథులకు రిటన్ గిఫ్ట్స్ ఇచ్చారు. సహజసిద్ధ పద్ధతుల్లో రంగులద్దిన జాకెట్ ముక్కలు, కాగితం పొట్లాల్లో పసుపు, కుంకుమను పేరంటాళ్లకు పంచారు. స్టీల్ ప్లేటులు, గ్లాసులతో పెళ్లిలో డెకరేషన్ల కోసం వాడిన తాజా పువ్వులను వేడుక ముగిసిన తరువాత ముంబైలోని సహజ రంగుల తయారీ స్టూడియోకి పంపించారు. వెయ్యికేజీల వేస్ట్ నుంచి ... ప్లాస్టిక్ వాడకపోయినప్పటికీ, కొన్ని సహజసిద్ధ వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటికోసం క్యాటరింగ్ సిబ్బంది తడి, పొడి చెత్తను విడివిడిగా డ్రమ్స్లో వేసేవాళ్లు. ఈ వ్యర్థాలను కోకోపీట్ నింపిన డ్రమ్స్లో వేసేది. కాగితాలను, పువ్వులను కలెక్షన్ సెంటర్‌కు పంపించారు. డ్రమ్‌లలో వేసిన వెయ్యికేజీల వ్యర్థాల నుంచి మూడు వందల కేజీల సేంద్రియ ఎరువును తయారు చేశారు. ‘‘పెళ్లిలో ప్లాస్టిక్ వాడకుండా చేయడం మాకు చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ ఇద్దరం కలిసి విజయవంతం చేశాం. మా అమ్మ, అమ్మమ్మల కాలంలో పెళ్లిళ్లకు ఇలానే స్టీల్ సామాన్లు వాడేవారు. మేము అలాగే మా పిల్లల పెళ్లి చేయాలనుకున్నాం. అందుకు అందర సహకరించడం సంతోషం’’ అని అనుపమ, చారులతలు చెప్పకొచ్చారు. (చదవండి: గూగుల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జార్ గ్రామ్ గ్రామంలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడైనా విందు భోజనం వాసన వస్తే చాలు ఇట్టే పసిగట్టి క్షణాల్లో వాలిపోయి మొత్తం ఆహారాన్ని లాగించేస్తున్నాయి. తాజాగా జార్ గ్రామ్ లో ఓ పెళ్ళిలో ఏనుగులు ఇలాగే హల్ చల్ చేయడంతో అతిథులంతా చెల్లాచెదురు కాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం బైక్ పైన ఉడాయించారు. ఇటీవలి కాలంలో జార్ గ్రామ్ గ్రామ సరిహద్దుల్లో ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఊళ్ళో ఎక్కడ భోజనం వాసన వచ్చినా వెంటనే వెళ్లి ఆవురావురుమంటూ లాగించేస్తున్నాయి. అందుకే స్థానికంగా ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేయాలన్నా వణికిపోతున్నారు. ఆదివారం జార్ గ్రామ్ సమీపంలోని జోవాల్ భంగా గ్రామంలో తన్మోయ్ సింఘా, మంపి సింఘా వివాహం జరుగుతుండగా వివాహ కార్యక్రమం అప్పుడే పూర్తై అతిధులు భోజనాలకు సిద్ధమవుతున్నారు. అంతలో రొయ్యలు, ఉలవచారు, బంగాళాదుంపల కుర్మాలతో కూడిన మెనూ వాసనలు వెదజల్లుతూ ఏనుగులను స్పృశించాయి. ఇంకేముంది ఆహ్వానం లేకుండానే పెళ్ళికి వచ్చి అతిధుల కంటే ముందే విందునారగించేందుకు తయారయ్యాయి. కళ్యాణ మండపంలో అవి చేసిన రాద్ధాంతానికి అతిథులంతా భయభ్రాంతులకు గురై చెల్లాచెదురుగా పారిపోయి చుట్టుపక్కల ఇళ్లలో నక్కారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం ఎలాగోలా బైక్ ఒకటి సంపాదించి దానిపైన పారిపోయారు. చాలా రోజులుగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు ఏనుగులకు భయపడి ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇక్కడి అభ్యర్థులు ఏనుగుల గుంపులు భయపడి ఆర్భాటాలు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఇది కూడా చదవండి: తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి.. -
పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి..
పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో మర్చిపోలేని ఒక మధురాను ఘట్టం. అలాంటి వాటిల్లో ఏదైన్న అనుకోనిది జరిగితే ఎవరికైనా కాస్త బాధగానే ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మానవుని ఊహకు కూడా అందని విధంగా జరుగుతుంటాయి. అచ్చం అలాంటి ఘటనే ఈ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఓ పెళ్లి వేడుకలో వధువరులు ఆనందంగా పెళ్లి చేసుకుటున్నారు. పెళ్లి కూడా అంగరంగ వైభవంగా నిరాటంకంగా జరుగుతోంది. సరిగ్గా ఆ జంట తలంబ్రాలు వేసుకుంటూ ఉల్లాసంగా ఉన్న సమయంలో.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి నేరుగా మండంపంలోకి వచ్చేసింది. అంతే ఒక్కసారిగా అక్కడున్న వరుడు తలపై అటాక్ చేసి కొన్ని అక్షంతలు తీసుకుంది. దీన్ని చూసి వధువు షాక్‌తో ఉండిపోయింది. క్షణాల్లో ఆమె నెత్తిపై కూడా దాడి చేసి వెళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్నవారందరూ కంగుతిన్నారు. అయితే ఆ కోతి వారిని ఆశీర్వదించేందుకు వారిపైకి అలా దూకిందేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by ⓉⒺⓁⓊⒼⓊ.ⒷⒺⒶⓉⓈ_①_④_③//50k🔵 (@telugu.beats_1_4_3) (చదవండి: హాట్ టబ్‌లో సేద తీరుతున్న జంటపై సడెన్‌గా మౌంటైన్ లయన్ దాడి..ఆ తర్వాత..) -
ఏదో చేద్దామనుకుంటే.. ఏదో జరిగింది.. వైరల్ వీడియో
-
వైరల్ అవుదామని పెళ్లిలో అతి చేశారు.. వధువు రియాక్షన్ చూడాల్సిందే..
మన దేశంలో పెళ్లి కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పెళ్లి ఫిక్స్ అవగానే వధవరులిద్దరూ ఫొటో షూట్స్, ఫొటోలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఫొటోలకు ఫోజులు ఇచ్చే సందర్బగా జరిగిన తప్పిదాల కారణంగా నవ్వు తెప్పించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు, వరుడు ఇద్దరు ఎదురుగా ఉన్న ఫొటోగ్రాఫర్‌కు స్టిల్స్ ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ వినూత్నంగా ఫొటోలు తీసే క్రమంలో వారితో కొత్త స్టిల్స్‌కు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఒక్కనొకరు హత్తుకునే క్రమంలో వరుడు బ్యాలెన్స్ కోల్పోయి వధువుపై పడిపోతాడు. ఫొటోలు దిగుతున్న క్రమంలో వధువు.. కిందపడిపోతుంది. అప్పటి వరకు నవ్వుతూ గింగిరాలు తిరిగిన జంట.. ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో, కిందపడిన వధువు షాక్‌కు గురైంది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ సారీ.. సారీ.. అంటూ కామెంట్స్ చేయడం వినిపిస్తుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
ఇదెక్కడి వింత.. ఫొటోల కోసం ఫైటింగ్.. వరుడికి తిక్కరేగి..
విందులో మాంసం పెట్టలేదని పెళ్లి రద్దు చేసుకునేదాకా వచ్చిన ఘటన ఇటీవలే చూశాం. పెళ్లి తరువాత ఫొటోల కోసం ఇరుపక్షాల బంధువులు కొట్లాడుకుని గాయాలపాలైన సంఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. యూపీ, డియోరియా జిల్లాలోని మాధవ్‌పూర్ గ్రామంలో అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది. వరమాల పూర్తవ్వగానే ‘మేం మొదట ఫొటోలు దిగుతాం’ అని అబ్బాయివారు, ‘లేదు మేమే ముందు దిగుతాం’ అని అమ్మాయి వాళ్ల మధ్య వాదన మొదలైంది. అసలే రాత్రిపూట పెళ్లి... విందులో మద్యం లేకుండా ఉండదు కదా! తాగి ఉన్న అబ్బాయి బంధువులు ‘మేమే ముందు తీసుకుంటా’మంటూ పట్టుబట్టారు. వాదన కాస్త భౌతిక దాడుల దాకా వెళ్లింది. కొందరు పెద్దలు వారించేందుకు ప్రయతి్నంచినా.. ‘తగ్గేదేల్యా’ అన్నారు బంధువులు. ఫలితం ఇరుపక్షాల వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. అబ్బాయి సోదరి కూడా గాయపడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి అయితే వచ్చింది కానీ.. ఈ ఘటనలతో విసుగు చెందిన అబ్బాయి మాత్రం తాళి కట్టేందుకు ససేమిరా అన్నాడు. చివరకు మనసు మార్చుకుని తాళి కట్టడంతో కథ సుఖాంతమైంది. ఆ తరువాత ఫొటోలు ఎవరు ముందు దిగారో?. -
సోషల్ మీడియాను షేక్ చేసిన జంట.. వరుడికి బంపరాఫర్ ఇచ్చిన వధువు
మానవ జీవితంలో వివాహ బంధం అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివాహ బంధంలో ఎన్నో ఆనందాలు, సమస్యలు, ఒడిదుడుకులు, సర్దుకుపోవడం వంటివి సర్వసాధారణం. ముఖ్యంగా నూరేళ్ల వివాహం బంధంలో ఇద్దరూ సమయాన్ని బట్టి సర్దుకుపోవాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. అయితే, ప్రస్తుత జనరేషన్లో పెళ్లికి ముందే వధువరులిద్దరూ తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. పెళ్లి తరువాత ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే ఒప్పందానికి వస్తున్నారు. కాగా, తాజాగా కేరళకు చెందిన ఓ పెళ్లి జంట.. వివాహం సమయంలో చేసుకున్న ఓ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పెళ్లి సమయంలో వారిద్దరి మధ్య జరిగిన బాండ్ పేపర్ ఒప్పందం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ వారు ఏం చేశారంటే..? కేరళకు ఓ వధువు.. తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడిపేందుకు అంగీరిస్తానని, ఆ సమయంలో అతనికి ఫోన్ కాల్స్ చేయనని ఒప్పంద పత్రంపై సంతకం చేసింది. ఈ మేరకు వారికి నమ్మకం కుదిరేలా.. 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఒప్పంద నియమాలు రాసి మరీ సంతకాలు చేసుకున్నారు. ఈ బాండ్ పేపర్‌పై సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు. వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు పెద్దలు వివాహం నిశ్చయించారు. ముహుర్తం ప్రకారం వీరద్దరికీ నవంబర్ 5వ తేదీన పాలక్కాడ్‌లోని కంజికోడ్‌లో వివాహం జరిగింది. అయితే, పెళ్లి సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన ఒప్పందం జరిగింది. పెళ్లి అయిన తర్వాత తన భర్త రఘు.. రాత్రి 9 గంటల వరకు తన స్నేహితులతో బయట తిరిగేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు అన్నది ఒప్పందం. ఆ సమయంలో ఆమె తన భర్తకు ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా చేయరాదు అని కూడా అగ్రిమెంట్లో ఉంది. దీనికి వధువు అర్చన ఓకే చెప్పింది. అంతేకాకుండా 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఆమె సంతకం కూడా పెట్టింది. అనంతరం.. ఈ బాండ్ పేపర్‌ను వరుడు రఘు స్నేహితులు.. కొత్త జంటకు బహుమతిగా అందించారు. కాగా, ఈ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. #Kerala groom's friends came up with the idea of making his bride sign the wedding contract.https://t.co/vzWtB7Fw8l pic.twitter.com/OAOmj6eL80 — News18.com (@news18dotcom) November 12, 2022 -
క్రికెట్‌కు అంగీకరిస్తేనే పెళ్లి.. వరుడి స్నేహితులు డీల్!
సేలం: పెళ్లయిన తర్వాత కూడా తమతో క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని వరుడి స్నేహితులు వధువుతో ఒప్పందం చేసుకున్న సంఘటన ఉసిలంపాటిలో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్ తేనిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు క్రికెట్లో కూడా రాణించారు. ఈయనకు, తేనీకి చెందిన పూజతో ఉసిలంపాటిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో శుక్రవారం పెద్దల సమక్షంలో పెళ్లికి నిశ్చయించారు. ఈ పెళ్లి సందర్భంగా అక్కడికి వచ్చిన వరుడి స్నేహితులు పెళ్లి తర్వాత కూడా హరిప్రసాద్‌ను క్రికెట్ ఆడడానికి అనుమతి కల్పించాలని వధువును పట్టుబట్టారు. శని, ఆదివారాల్లో పెళ్లికొడుకు క్రికెట్ ఆడేందుకు ఒప్పుకోవడంతో అది రాతపూరంగా ఉండాలని కోరారు. దీంతో పెళ్లికూతురు అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత వారి పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక వరుడి క్రీడల్లో పాల్గొనకుండా భార్యలు అడ్డుకునే సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా వరుడి స్నేహితులు వధువు చేత చేయించిన అంగీకార ఒప్పందం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: IND-W vs ENG-W: భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం! -
పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్
పాట్నా: కొన్ని పెళ్లిళ్లు సినిమా కథకు ఏమాత్రం తీసిపోవు. డ్రామా, సస్పెన్స్, విషాదం వంటి అన్ని అంశాలు అందులో కనిపిస్తాయి. అలాంటి వివాహమే ఒకటి బిహార్‌లోని నవాడా ప్రాంతంలో జరిగింది. భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో పెళ్లి వద్దు బాబోయ్ అంటూ పరారైన ఓ వరుడిని వధువు వెంబడించి పట్టుకుంది. వరుడి వెంట వధువులు పరుగులు పెడుతున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే? ఇరువురికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్ ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడి ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో శివంగిలా మారిన వధువు.. అతడిని వెంబడించింది. తగ్గేదేలే అంటూ ఛేజింగ్ చేసి మరీ పట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయినా.. ఒప్పుకోకపోవటంతో పోలీస్ స్టేషన్‌కు చేరింది వ్యవహారం. ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరకు వధువును పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు యువకుడు. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఓ గుడిలో ఇద్దరికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. एक शादी ऐसा भी जब शादी करने से भाग रहा था लड़का, तब लड़की ने उसे खुद पकड़कर रचाई शादी मामला #बिहार के #नवादा का है। लड़की ने कहा कि पैसा और बाइक लेकर शादी करने से भाग रहा था लड़का#ExclusivePost#xclusivepost pic.twitter.com/LSpch8Sp5a — Exclusive Post (@xclusivepost) August 28, 2022 ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్.. తునాతునకలైన బైక్! -
‘వెడ్డింగ్ కాంట్రాక్ట్’ బాగుందబ్బా.. కాకపోతే అదే టూ మచ్
‘‘నెలకోసారే పిజ్జా తినాలి.. ఇంట్లో వంటనే తినాలి.. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి.. ప్రతిరోజూ చీర కట్టుకోవాలి.. 15 రోజులకోసారి మాత్రమే షాపింగ్ చేయాలి.. ప్రతి పార్టీలో మంచి ఫొటోస్ తీసుకోవాలి..’’ ఇదేంటి న్యూఇయర్ రిజల్యూషన్స్లా ఉన్నాయి అనుకుంటున్నారా. రిజల్యూషన్స్ అన్నమాట నిజమే కానీ.. న్యూ ఇయర్‌కు తీసుకున్నవి కాదు. అస్సాంకు చెందిన నూతన వధూవరులు శాంతి, మింటూ పెళ్లి తరువాత చేసుకున్న కాంట్రాక్ట్లోనివి. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు, ప్రీవెడ్డింగ్ షూట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు సంప్రదాయాలను బ్రేక్ చేస్తున్నారు... ఇంకొందరు వింత పద్ధతుల్లో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ జంట పెళ్లి తరువాత ఉండాల్సిన పద్ధతులపై కాంట్రాక్ట్ చేసుకున్నారన్నమాట. ఎర్రని లెహంగాలో వధువు, తెల్లని పెళ్లి దుస్తుల్లో వరుడు కాంట్రాక్ట్ పేపర్‌పై సంతకం పెడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ సంస్థ వెడ్లాక్... పోస్ట్ చేసిన ఆ వీడియోకు నెటిజన్స్ మామూలుగా స్పందించలేదు. ‘వెడ్డింగ్ కాంట్రాక్ట్’ బాగుందని కొందరంటే.. ‘ఇదేం పద్ధతి’ అంటూ కొందరు చిరాకు పడ్డారు. ‘అది పెళ్లి కాదు... షేర్వానీలో చేసుకున్న కాంట్రాక్ట్’ అంటూ ఓ నెటిజన్, ‘కండీషన్స్ ఓకేనబ్బా... కానీ ప్రతిరోజూ చీర అంటే టూ మచ్’ మరొకరు, ‘ఇండియాలో ఇంకా అసమానతలు కొనసాగడం బాధాకరం’ అని ఇంకొకరు స్పందిస్తూనే ఉన్నారు. -
పెళ్లి తంతులో దంపతుల రచ్చ.. వరుడికి చేదు అనుభవం
Bride and Groom Slap Each Other: ఇటీవల కాలంలో వివాహాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వెడ్డిండ్ షూట్లంటూ విన్నూతన పద్ధతిలో వధువరులు వివాహతంతును ఆనందంగా జరుపుకుంటున్నారు. కొన్ని వివాహతంతుల్లో అపశృతులు చోటుచేసుకుని ఇబ్బందులు కొనతెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. ఐతే ఈ వివాహతంతు అందుకు భిన్నం ఆనందమయ క్షణాల్లో వధువరులు చేసిన పనికి బంధుజనులంతా నిర్ఘాంతపోయారు. వివరాల్లోకెళ్తే...ఒక జంట చాలా అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఆ తర్వాత వధువరుల చేత చక్కటి ఆటపాటలు, స్వీట్లు తినిపించుకోవడం వంటి కార్యక్రమాలు చేయిస్తారు. ఇక్కడ వధువు వరుడికి స్వీట్ తినిపించేందకు యత్నిస్తుంటే ఆ వరుడు పట్టించుకోకుండా ఉంటాడు. ఎంతకి తనని పట్టించుకోకుండా అటూ చూస్తూ మాట్లాడుతున్నాడన్న కోపంతో ఆ స్వీట్‌ని అతని ముఖానికి రాసేస్తుంది. దీంతో ఆగ్రహం చెందిన వరుడు ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడు. పెళ్లికూతురు కూడా ఏ మాత్రం తగ్గకుండా కోపంతో వరుడి గూబ గుయ్యిమనిపిస్తుంది. ఇద్దరు అలా ఒకరినొకరు జుట్టు పీక్కునేంతలా కొట్టేసుకుంటారు. ఆ వివాహ వేదిక వద్ద ఉన్న బంధువులకు ఏం చేయాలో పాలుపోక అలా చూస్తుండిపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) (చదవండి: అత్యద్భుతమైన తెల్లటి నెమలి! వీడియో వైరల్) -
వరుడు షాక్.. ఇది వధువు చేసిన పనే!?
వివాహ వేడుకల్లో కొన్ని పనులు సంతోషాన్ని రెట్టింపు చేస్తే మరికొన్ని సంఘటనలు మాత్రం కోపాన్ని.. చికాకును తెప్పిస్తుంటాయి. అయితే వధూవరులను ఒక్కసారిగా చికాకు తెప్పిన ఘటన ఇటీవల ఓ వివాహ వేడుకలో జరిగింది. అయితే వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఇర్వాత గ్రాండ్‌గా పెళ్లి కేక్ కట్ చేసే సందర్భం. ఇంతలో వేదిక వద్దకు హోటల్ సిబ్బంది వివాహ కేక్‌ను తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తూ అది కిందపడిపోయింది. కేక్ కోసం చూస్తున్న వధూవరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హోటల్ సిబ్బంది.. కొద్ది నిమిషాల తర్వాత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అయితే సిబ్బంది చేతుల నుంచి పడిపోయింది నిజమైన వివాహ కేక్ కాదు! అసలు వెడ్డింగ్ కేక్‌ను నిమిషాల్లో వారి ముందుకు తీసుకువచ్చారు. నూతన వధూవరులు ఆశ్చర్యపోయారు. అయితే వధూవరులను హోటల్ సిబ్బంది చిలిపిగా ప్రాంక్ చేశారు. అయితే ఈ కేక్ కిందపడిపోతున్న సమయంలో వధూవరులిద్దరూ.. అయ్యో! కేక్ కిందపడిపోయిందే అన్నట్లు ఫీలయ్యారు. ప్రపోజల్, వెడ్డింగ్, ఎంగేజ్మెంట్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ‘దేవునికి ధన్యవాదాలు ఇది ఒక చిలిపి పని!! దాదాపు మాకు కన్నీళ్లు వచ్చాయి’ అని కామెంట్ కూడా జత చేశారు. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 2 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అనంతరం వధూవరులు సంతోషంతో కేక్ కట్ డ్యాన్స్ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మొత్త కేక్ వృథా చేశారు?!’.. ‘వరుడు షాక్ అయ్యాడు. ఇది వధువు చేసిన పనే!?’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Proposal~Wedding~Engagement (@she_saidyes) -
వధువరుల గ్రాండ్ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్ వీడియో..
-
వధువరుల గ్రాండ్ ఎంట్రీ.. షాక్‌కు గురైన బంధువులు.. వైరల్ వీడియో..
వివాహ వేడుకను ప్రతి ఒక్కరు తమ జీవితకాలమంతా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. ప్రీవెడ్డింగ్ షూట్ మొదలుకొని.. అప్పగింతల వరకు ప్రతి కార్యక్రమాన్ని వీడియో రూపంలో భద్రపరుచుకుంటున్నారు. వివాహన్ని ట్రెండ్‌కు తగ్గట్టుగ నిర్వహించుకోవడానికి యువత ఎంత ఖర్చుకైన వెనకాడటం లేదు. పెళ్లికి సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ..ఈ కోవకు చెందిన ఒక పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేటి యువత తమ పెళ్లిలో ఏదో ఒక కొత్తదనం ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఈ వివాహంలో.. వధువరులు ప్రత్యేకంగా తమ పెళ్లిమండపానికి చేరుకోవాలనుకున్నారు. దీనిలో భాగంగా.. ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ఆ బల్లను గాలిలో ఒక వాహనం సహయంతో పైకి ఎత్తేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో.. అందంగా ముస్తాబైన.. వధువరులు బల్లపై కూర్చుని మండపం వైపు వస్తున్నారు. వేడుకకు హజరైన బంధువులు, స్నేహితులు వారి రాకను ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు కూడా మండపాన్ని, బంధువుల వైపు ఆనందంగా చూస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఊహించని సంఘటన జరిగింది. పాపం.. వధువరులు ప్రయాణిస్తున్న బల్ల ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో వారు.. కింద పడిపోయారు. మండపంలో ఉన్న.. బంధువులంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని వధువరులను పైకి ఎత్తారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వివాహం ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం.. బ్రైడ్స్ స్పెషల్ అనే ట్వీటర్ ఖాతాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం ఎంట్రీరా బాబు..’, ‘పాపం.. దెబ్బలేం తగల్లేవు కదా..’, ‘ ఇవేం.. ట్రెండీ ఆలోచనలు.. ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
పాపం కొత్త జంట.. ఆమె పాటకు సిగ్గుతో గోడకు అతుక్కుపోయారు!
‘వామ్మో ఇదేం పాటరా నాయానో జుట్టు పీక్కోవాలనిపిస్తోంది’ అని ఈ పెద్దావిడ పాడిన పాట విన్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఎందుకంటే కొత్తగా పెళ్లైన జంటకు స్వాగతం పలుకుతూ సరదాగా పాట పాడమని అడిగినందుకు వాళ్లకు చుక్కలు చూపించింది. ఆ కొత్త జంటను సిగ్గు, వికారంతో గోడకు అతుక్కు పోయేలా చేసింది. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ’ అంటూ అదో రకమైన గొంతుకతో ఆ పాటను ఆ మహిళ ఖూనీ చేసింది. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. అచ్చం నాలాగే ఉన్నాడు! ఆమె పాటకు కోరస్ కూడా ఇవ్వడంతో అక్కడ ఉన్నవారికి మూర్చ వచ్చినంత పనైంది. ఆమె స్వరం వింటూ ఏం చేయాలో పాలుపోక మనస్సు కకావికలమై బంధువులు పడిన అవస్థ వర్ణనాతీతం. రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కొత్త కోడలికి ఇంతకు మించి స్వాగతం ఏముంటుంది. ఎవరినీ తొందరపడి పాడమని అడగకండి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: "నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!" -
పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో కొందరు యువతీయువకులు తమ వివాహాలను భిన్నంగా.. కొత్త తరహాలో చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ యాసలో అద్భుతంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాట వివాహాల్లో మార్మోగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట పెళ్లిపీటలపై కూర్చుని ఫోన్లో గేమ్ ఆడడం వింతగా ఉంది. ఇద్దరు తమ తమ ఫోన్లలో ఆడుకుంటూ బిజీగా ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: తాలిబన్ల అరాచకం.. జర్నలిస్టులకు చిత్రహింసలు వారి వివరాలు తెలియరాలేదు. కానీ వారి వస్త్రధారణ చూస్తుంటే పశ్చిమబెంగాల్‌కు చెందిన వధూవరులుగా కనిపిస్తున్నారు. ఈ వీడియోను నిరంజన్ మహాపాత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఆ ఇద్దరు దంపతులు తమ మొబైల్ ఫోన్లలో పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘ఫ్రీ ఫైర్’ ఆడుకుంటూ కనిపించారు. శత్రువులను చంపుతూ నవ్వుకుంటూ.. మాట్లాడుకుంటూ వారు ఆడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వారిని తిట్టి పోస్తున్నారు. ఫోన్లు ఎంతటి దారుణ పరిస్థితులకు తీసుకువచ్చిందోనని ఓ పెద్ద మనిషి కామెంట్ చేశారు. జై పబ్జీ లవర్స్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ‘అది పబ్జీ కాదురా అయ్య ఫ్రీ ఫైర్’ మరికొందరు వివరణ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
మర్యాదలు సరిగా జరగలేదని వెళ్లిపోయిన పెళ్లికుమార్తె
-
8 కేజీల వెడ్డింగ్ లెహంగాతో వధువు పుష్ అప్స్.. వీడియో వైరల్
పెళ్లి అంటేనే సందండి. అందంగా రెడీ అవ్వడం, ఫోటోలు దిగడం, సంతోషంగా గడపడం ఇదంతా సర్వసాధారణమే.. అదే వివాహంలో వర్కౌట్స్ చేస్తే ఎలా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది కదూ.. సరిగ్గా ఇలాగే తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా రొటీన్‌కు భిన్నంగా ఆలోచించింది ఓ జంట. పెళ్లి మండపాన్ని జిమ్‌గా మార్చి, వేదికపైనే వధూవరులిద్దరూ పుషప్స్ చేశారు. పెళ్లి దుస్తుల్లోనే వర్కౌట్స్ చేయడం నెటిజన్లను సర్ప్రైజ్ చేస్తోంది. వరుడు కాస్త నెమ్మదిగా పుష్ అప్స్ చేస్తన్నప్పటికీ వధువు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తూ వారెవ్వా అనిపించింది. ఇంతకీ కొత్త జంట పేర్లు చెప్పలేదు కదూ.. వధువు అరోరా వరుడు ఆదిత్య మహాజన్.. వీరిద్దరూ ఫిట్నెస్ కోచ్‌లు. చదవండి: వైరల్: అదిరిపోయే స్టెప్పులతో మాధురి దీక్షిత్‌ను దించేసిన బామ్మ ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ..ఈ వీడియోను వధువు అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘కలిసి ఎత్తే జంట చివరికి వివాహంతో ఏకమైంది’ అంటూ షేర్ చేయగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ఎన్ని సెట్లు, రరేపెటిషన్స్ అని అడగ్గా.. ‘8 కిలోల లెహంగాతో 1సెట్ 10 రెప్స్ లోడ్ చేసిన పుషప్స్’ అని వధువు రిప్లై ఇచ్చింది. దీంతో 8 కిలోల బరువైన వెడ్డింగ్ లెహంగాను ధరించి ఈ విధంగా అందరూ చేయలేరని పెళ్లి కూతురిని నెటిజనులు అభినందిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి. చదవండి: బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా.. View this post on Instagram A post shared by Akshita Arora Mahajan | Coach (@fit.arora) -
శోభనం రాత్రి వధువు ప్రశ్నకి బిత్తరపోయిన వరుడు!
పెళ్లి రెండు జంటలను కలుపుతుంది. కొన్ని కుటుంబాలను బంధంతో ముడివేస్తుంది. అలా ఏర్పడిన బంధాలు జీవితంలో ఓ భాగంగా మారిపోతాయి. పండుగలకు.. వేడుకలకు ఇల్లంతా చుట్టాలతో నిండిపోతుంది. ఇలాంటి సన్నివేశాలు భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే బాధ వచ్చినా.. సంతోషమైనా పంచుకునే బంధాలు, అనుబంధాలు ఉండాలి అంటారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధువు అడిగిన ప్రశ్న బంధువులను అయోమయంలో పడేసింది. ఆ తరువాత అందరినీ నవ్వులతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ పెళ్లి వేడుకకు చాలా మంది అతిథులు వచ్చారు. పెళ్లి వేడుక పూర్తైనది. వధూవరులను ఆశీర్వదించిన బంధవులు ఇంటికి పయనమయ్యారు. అంతా అనుకున్నట్లే జరిగింది. ఆ రాత్రికి జరగాల్సిన కార్యానికి అంతా సిద్దం చేశారు. మంచాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. వరుడు మంచం మొత్తం గులాబీ రేకులతో కప్పేశాడు. అయితే శోభనం గదిలో అడుగుపెట్టిన పెళ్లి కూతురు ‘‘సోయెంగే కహా పె( మనం ఎక్కడ నిద్రపోవాలి)’’ అని అడిగిన ప్రశ్న బంధువులకు తెగ నవ్వు తెప్పించింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘పడక గదిని పబ్లిక్ చేశారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు నవ్వుతూ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ ఈ వీడియోను దుల్హనియా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Dulhaniyaa.com-Indian Weddings (@dulhaniyaa) -
ఊరంతా వరద నీరే.. తగ్గేదే లే! అని పెళ్లితో ఒక్కటైన ప్రేమ జంట
ముంబై (కొల్హాపూర్): మహారాష్ట్రలోని పలు నగరాలను వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వరదలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే క్రమంలో సాంగ్లి నగరాన్ని కూడా వరదలు వదల్లేదు. అయితే వరద నీరు పోటెత్తడంతో పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఓ ప్రేమికుల జంటకు ఈ నెల (జూలై) 23న నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికి ముహూర్తం ఖరారు చేసే సమయానికి ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాయిదా వేయడం ఎందుకని ఆ ప్రేమ జంట, వారి కుటుంబ సభ్యులు అడుగు ముందుకేవేశారు. వరద నీటిలో బోట్లతో పరిమిత సంఖ్యలోనే బంధువులను తరలించారు. మిగతా పనులనూ చక్కబెట్టారు. ఇక అనుకున్న ముహూర్తానికి జులై 26న జరిగిన ఈ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. వధూవరులు బోట్లలో వెళ్తున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై పెళ్లి కొడుకు రోహిత్ సూర్య వంశీ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి వేడుక కోసం ఇంటి దగ్గర ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేశాం. కానీ వర్షం వల్ల మరో చోటుకి మార్చాం. కొద్దిమంది అతిథులతో సోనాలి (పెళ్లి కూతురు) ఇంట్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనికోసం ఓ పడవను ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి మళ్లీ తిరిగి ఇంటికి రావాలి. అందువల్ల మళ్లీ పడవలో తిరిగి ఇక్కడికి చేరుకున్నాం. అంతే కాకుండా కోవిడ్‌కు సంబంధించిన అన్ని రకాల నిబంధనలను పాటించి, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఇప్పటికే పెళ్లి వేడక కోసం అన్ని రకాల సామాగ్రిని కొనుగోలు చేశాం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెళ్లి తేదీని వాయిదా వేసే ప్రసక్తి లేదని నిర్ణయించుకుని ముందుకు సాగాం. ఇక పెళ్లి తర్వాత బరాత్ కార్యక్రమం ఉంటుంది. కానీ దాన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది.’’ అని తెలిపాడు. దీనిపై నెటిజనులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీ పట్టుదలకు వందనాలంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకు సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
పెళ్లిలో తలపాగ నేలకేసి కొట్టిన వరుడు.. వైరల్ వీడియో..
న్యూఢిల్లీ: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, ఈ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ వివాహం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. తాజాగా, ఈ పెళ్లి కూడా ఒక వెరైటీ సంఘటనతో వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ వివాహంలో మండపాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. బంధువుల మధ్య సిందూర్ అనే కార్యక్రమం ప్రారంభమైంది. సాధారణంగా, ఈ వేడుకలో వరుడు, వధువు నుదుట.. తల కొప్పులో కుంకుమ పెట్టడం ఆచారం. అయితే, వధువు వేదిక మీద కూర్చోని ఉంది. ఈ క్రమంలో వరుడు, పెళ్లికూతురికి బొట్టు పెట్టడానికి వేదిక దగ్గరకు చేరుకున్నాడు. కుంకుమ పెట్టాడానికి సిద్ధమయ్యాడు.. అయితే, ఇంతలోనే వధువు ఒక్కసారిగా కిందపడి పోయింది. దీంతో వరుడు షాక్ గురయ్యాడు. పాపం.. అతనికి ఏంజరిగిందో అర్థం కాలేదు. కాసేపటికి, వధువు ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన అతను.. వెంటనే తన తలపాగను తీసిపాడేశాడు. అంతటితో ఆగకుండా కోపంతో.. మెడలోని పూలమాల తీసి నెలకేసి కొట్టాడు. ఈ క్రమంలో వరుడిని ఆపటానికి బంధువులు ప్రయత్నించారు. అయినా.. వరుడు ఎవరిమాట లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. వధువుకి ఏమయ్యిందో..’, ‘ఆ యువతికి పెళ్లి ఇష్టంలేదు కాబోలు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
ఆషాఢ ఎడబాటు వెనుక.. ఆచారం.. ఆంతర్యం ఇవే..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభకార్యాలు చేయకూడదని పెద్దలు విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. కొత్త దంపతులకు ఆషాఢం విరహ మాసం. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన తరుణం. చూసుకోవడానికి కూడా వీల్లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే దుష్పరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. మారిపోయిన ప్రస్తుత కాలంలో నెల రోజుల ఎడబాటు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త దంపతుల ఎడబాటు అనివార్యం అనే సంప్రదాయం సడలింపు దిశగా సాగిపోతోంది. ఫార్మాలిటీ కోసం ఓ 5 రోజులపాటు పుట్టింటికి వెళ్లి వస్తే చాలు అనే భావన కొందరు వెలిబుచ్చుతున్నారు. పెద్దల నియమం కూడా మంచికే అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే ఎడబాటు కూడా మంచికే అన్నది పెద్దల నిశ్చితాభిప్రాయం. ఆచారం.. ఆంతర్యం ఇవే.. ఆషాఢ మాసం నవ దంపతులను దూరంగా ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి కొత్త కోడలు అత్తగారి ముఖం చూడకూడదు. అలాగే కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదు అనే ఆచారం తరతరాలుగా వస్తోంది. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీ లేవు. మృగశిర నుంచి మొదలయ్యే చినుకుల ఆగమనం.. క్రమంగా ఆషాఢ మాసం ప్రవేశించే సరికి సమృద్ధిగా వర్షాకాలం అవుతుంది. సాగు ప్రధాన వృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాది అదే పనుల్లో తలమునకలవుతారు. దీంతో కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. పని ఆధారిత ప్రాంతాల్లో చేసే వృత్తిని కాదని మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం విధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరిస్తున్నారు. సంప్రదాయం వెనక శాస్త్రీయత నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండటం అంత మంచిది కాదంటారు. ఈ సమయంలో గర్భధారణ జరగడం తల్లీబిడ్డలకు అంత క్షేమం కాదు. ఆషా«ఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా జలాశయాలు, పరిసరాల్లోని నీళ్లు కలుషితం అవుతాయి. ఈ నీటి వినియోగం అనారోగ్యాలకు కారణమవుతుంది. చలిజ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చీడపీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్ర వచనం. ప్రత్యామ్నాయాలు బోలెడు ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఆ భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాల ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. దూరంగా ఉండటమే శ్రేయస్కరం ఆషాఢ మాసంలో విడిగా ఉండటం శ్రేయస్కరమే. ఈ సమయంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో అవుతుంది. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శిశువు జన్మిస్తే బాహ్య పరిసరాలను భరించడం కష్టమవుతుంది. ఆషాఢ మాసంతోపాటు పూజలు, నోముల పేరుతో శ్రావణంలో ఎడబాటు కొనసాగిస్తే సంతానోత్పత్తి› సమయాన్ని జూలై, ఆగస్టు వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సుఖ ప్రసవానికి అనువుగా ఉంటుంది. – డాక్టర్ గీతావాణి, గైనకాలజిస్టు వివాహ బంధం బలోపేతం ఆషాఢ మాసం కొత్త దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో ఈ నియమం చాలా బాగా పని చేస్తుంది. ఆషాఢ మాసంతో పరస్పర అభిప్రాయాలను పంచుకునే వీలు కలుగుతుంది. తద్వారా వివాహ బంధం బలోపేతం అవుతుంది. – బోయిని గౌతమ్, హారిక సంప్రదాయాన్ని పాటిస్తున్నాం పెద్దవాళ్లు ఏ నియమం పెట్టినా అది పిల్లల మంచి కోసమే. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించడం వల్ల సమస్యేమీ లేదు. పైగా ఇప్పుడు సెల్‌ఫోన్ లాంటి సాంకేతిక పరికరాలు మనుషులను కలిపే ఉంచుతున్నాయి. పెద్దవాళ్లు వి«ధించిన నియమ నిబంధనలు శాస్త్రీయ కోణంలోనే చూడకుండా, ఆరోగ్యం దృష్ట్యా పాటిస్తే మేలు కలుగుతుంది. అందుకే మేము ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. – గూడెల్లి సురేశ్, వాసవి, సాఫ్ట్వేర్ దంపతులు 5 రోజులు తీసుకెళ్లారు పిల్లలు బాగుండాలనే పెద్దలు అనేక నియమాలను వి«ధించారు. టైమ్‌తో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకునే కాలంలో ఇలాంటి ఇవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి సంప్రదాయం కోసం ఐదు రోజులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఎడబాటుతో అన్యోన్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆషాఢ నియమం మంచిదే. – గోవిందు భరత్‌కుమార్ (ప్రైవేట్ ఉద్యోగి), పద్మజ -
గుండెపోటుతో కుప్పకూలిన వధువు; శవాన్ని పక్కనే ఉంచి.. చెల్లెలితో పెళ్లి
లక్నో: మరో ఐదునిమిషాల్లో పెళ్లి. మంగళ వాయిద్యాల్ని సిద్ధం చేశారు. చుట్టాలు, అతిథులతో పండగ వాతావరణం నెలకొంది. బాజాభజంత్రీల నడుమ కాబోయే దంపతుల్ని ఆశీర్వదించేందుకు పెళ్లి పెద్దలు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే విషాదం. పెళ్లి పందింట్లో పెళ్లికొడుకు ఒడిలోనే వధువు తనువు చాలించింది. దీంతో పెళ్లి మండపంలో పెళ్లి కుమార్తె మృతదేహాన్ని ఉంచి.. వరుడికి బాధితురాలి చెల్లెలితో వివాహం జరిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో పెళ్లి కొడుకు మంజేష్ పెళ్లి కుమార్తె సురభి మెడలో తాళికట్టాల్సి ఉంది. అదే సమయంలో వధువు సురభి పెళ్లి పీఠలపై కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే డాక్టర్‌కు సమాచారం అందించారు. పెళ్లి మండపంలోనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ .. బాధితురాలు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. దీంతో అదే పెళ్లి మండపంలో వరుడికి మృతురాలు చెల్లెలు నిషాతో వివాహం జరిపించారు. ‘‘ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్ధం కాలేదు. నా పెద్ద చెల్లెలు సురభి డెడ్ బాడీని పెళ్లిమండంలో ఉంచాం. ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో నా చిన్న చెల్లెలు నిషాను మంజేష్ కి ఇచ్చి వివాహం జరిపించాం. అనంతరం సురభి అంత్యక్రియలు నిర్వహించాం’’ అని సురభి సోదరుడు మీడియాకి తెలిపాడు. చదవండి: వరుడు మిస్సింగ్.. వధువు షాకింగ్ నిర్ణయం -
‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు
స్టాక్‌హోమ్: పెళ్లి అనేది నూరేళ్ల పంట. వివాహం అనేది ప్రతి జంట జీవితంలో ప్రత్యేకమైన రోజు. అయితే కొంతమంది కాబోయే దంపతులకు ప్రణాళిక ప్రకారమే అన్నీ జరుగుతాయా అనే ఆందోళన ఉంటే..మరికొందరు ఆనందంగా ఉంటారు. అయితే తాజాగా స్వీడన్‌కి చెందిన ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడుకలో పెళ్లి కొడుకు ‘క్యూబూల్ హై’( నేను అంగీకరిస్తున్నాను) అని చెప్పిన వెంటనే వధువు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆనందంతో ఎగిరి గంతేసింది. వరుడిని హత్తుకుని ముద్దు పెట్టుకుంది. కాగా ఈ వీడియోలో వివాహానికి వచ్చిన అతిథలు చుట్టూ వరుసలో కూర్చున్నారు. అయితే వధువు మొదట తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి సంశయించినా...బంధువుల ప్రోత్సాహంతో తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను ‘‘నిత్యం సంతోషంగా ఉండే భార్య’’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..15 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వధువు ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నూతన వధూవరులు సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "మీ ఇద్దరికీ అభినందనలు" అంటూ వ్యాఖ్యానించారు. అయితే మరో నెటిజన్ "ఇప్పుడు రక్తం పీల్చడానికి లైసెన్స్ పొందండి." అంటూ చమత్కరించారు. View this post on Instagram A post shared by |~|@m€€[) (@romantic_cute_prince) (చదవండి: ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?) -
పెళ్లి బృందానికి తప్పిన ప్రమాదం
-
పెళ్లి బృందానికి తప్పిన ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనానికి పెనుప్రమాదం తప్పింది. కళ్యాణదుర్గం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకళ్తే.. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు కళ్యాణదుర్గం సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అయితే బస్సు హైటెన్షన్ విద్యుత్ తీగలకు సమీపంలోకి వెళ్లి నిలిచిపోవడంతో.. పెద్ద ముప్పు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి స్వల్ప గాయాలు కాగా.. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యచికిత్స అందిస్తున్నారు. ('అనంత'లో అదుపు తప్పిన వోల్వో బస్సు) -
భారత ప్రజలమైన మేము..!
ఈ ఫోటో చూడండి. ఇందులో పెళ్లి కొడుకున్నాడు. పెళ్లి కూతురు ఉంది. ఒకరిద్దరు పెద్దలు ఉన్నారు. స్పష్టంగా మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. వాళ్లు పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకున్నారు. ఫొటోలు వద్దనుకున్నారు. ఈ ఫొటో అయినా ఎవరో తీసిన వీడియోలోంచి బయటికి వచ్చింది. ఇద్దరూ ఒకే మతం వారు. అయితే మూడు మతాల పెద్దలు పెళ్లి జరిపించారు. మంత్రాలు లేవు. అక్షింతలు లేవు. వచ్చిన వారు వధూవరులపై పూలు మాత్రం చల్లారు. ఒక ‘ప్రియాంబుల్’ను చదివించారు. ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ ప్రవేశిక. ‘భారత ప్రజలమైన మేము..’ అనే వాక్యంతో ఈ ప్రవేశిక మొదలౌతుంది. ‘కలిసుంటాం’ అనే భావంతో ముగుస్తుంది. కర్ణాటక గదగ్ జిల్లా గదగ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఈ పెళ్లి జరిగింది. శాంతలింగ స్వామీజీ, మౌల్వీ షబీర్ మౌలానా, ఫాదర్ ఎబినజర్.. మూడు మతాల సాక్షులుగా ఉండి పెళ్లి జరిపించారు. ప్రియాంబుల్‌ని కానుకగా ఇచ్చింది ఈ ముగ్గురే. తర్వాత సన్మానం జరిగింది. ఎవరికనుకున్నారూ? పౌర కార్మికులకు. అంటే పారిశుద్ధ్య కార్మికులు. ఎంత మంచి పెళ్లి కదా! బసవరాజు, సంగీతలను మెచ్చుకోవాలి. వాళ్లెవరు? ఇంకెవరూ.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ట్రాన్స్ జెండర్లమైన మేము..! స్వప్న గురించి గతంలో మీరు వినే ఉంటారు. మదురై అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయి కాదు. అమ్మాయిలా మారిన అబ్బాయి. ట్రాన్స్‌జెండర్. తాజాగా స్వప్నకు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల్లో 228వ ర్యాంకు వచ్చింది. తమిళనాడు గ్రూప్ వన్‌లో విజేతగా నిలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా కూడా ఈ విజయం స్వప్నకు గుర్తింపు తెచ్చింది. ప్రభుత్వంలో పరీక్ష రాసి ర్యాంక్ సాధించారు స్వప్న! మొదట్లో ట్రాన్స్జెండర్లు సర్వీస్ కమిషన్ రాసేందుకు వీల్లేకపోయేది. స్వప్నే తమిళనాడు ప్రభుత్వంతో పోరాడి హైకోర్టు నుంచి పరీక్ష రాసే యోగ్యతకు ఆదేశాలు తెచ్చుకున్నారు. అది మిగతా ట్రాన్స్‌జెండర్లకూ మేలయింది. తొలిసారి 2013లో ‘యోగ్యత’ కేసు వేశారు స్వప్న. తనను మహిళ కేటగిరీలో గుర్తించాలని 2015లో మరో కేసు. గెలిచే వరకు పోరాడారు. 2018లో గ్రూప్ 2లో పాసై అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అఫీసర్‌గా మదురైలోనే పని చేశారు. ఇప్పుడు ఏకంగా పెద్ద ర్యాంకు, పెద్ద పోస్టు. డిఎస్పీగా గానీ, కమర్షియల్ టాక్స్‌లోనే అసిస్టెంట్ కమిషనర్‌గా గానీ! నిర్ణయం ఆమెదే. ఈ రోజు చెన్నైలో కౌన్సెలింగ్. -
నవంబ్రాలు
భూమిపై పడ్డ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవలసిందే. ఇందులో ఏదైనా దురర్ధం ధ్వనిస్తుంటే మీరు మరీ సున్నిత మనస్కులైనట్లు! పెళ్లి చేసుకోబోయేవారు ప్రతి దాన్నీ తేలిగ్గా తీసుకునే తత్వాన్ని అలవవరచుకోవాలి. పెళ్లి అనేది భూతం ఏమీ కాదు. అలాగని భూతలం మీది అత్యున్నత సౌఖ్యమూ కాదు. బేసిగ్గా పెళ్లి అంటే బాధ్యత. బాధ్యతలను మీద వేసుకోడానికి ఈ నవంబరులో బలమైన ముహుర్తాలు చాలానే ఉన్నాయి. కార్తీకం ఆరంభం అయింది కదా! ఏయే తేదీలు, తిథులు ఈ నెలలో పెళ్లికి దివ్యంగా ఉన్నాయో పంచాంగం తిప్పే ముందు.. పెళ్లిళ్లు, భార్యాభర్తల విశేషాలు కొన్ని తెలుసుకోవడం వల్ల నూతన వధూవరులకు కొంత ఉపయుక్తంగా ఉండొచ్చు. ►తొలిచూపులోనే ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న దంపతులలో 75 మంది విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కంగారు పడకండి. మిగతా 25 మంది సక్సెస్ఫుల్ కపుల్స్‌లో మీరు ఉండొచ్చు కదా! ►‘బ్రైడ్’ అంటే వధువు. బ్రైడ్కి ‘గ్రూమ్’ని కలిపితే వరుడు. (బైడ్ గ్రూమ్). సరే, ఈ నాలెడ్జికేంగానీ, బ్రైడ్ అంటే అసలు అర్థం తెలుసా! ‘వంట చేయడం’ అని!! ప్రాచీన జర్మన్ భాషల నుంచి బ్రైడ్ అనే పదం పుట్టుకొచ్చింది. ►భర్తగానీ, భార్యగానీ రోజుకి కనీసం 45 నిముషాలు ప్రయాణంలోనే గడుపుతుంటే వాళ్ల పెళ్లి పెటాకులయ్యే ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అట. మీ ఇష్టం మరి. ►ఆ మధ్య 99 ఏళ్ల ఓ భర్త తన 96 ఏళ్ల భార్యకు పెళ్లయిన 77 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. నైంటీన్ ఫార్టీస్లో ఆమెకు ఎవరితోనో అఫైర్ ఉందని ఆయనకు తెలిసిందట! అదీ విడాకులకు కారణం. ►పెళ్లికి ముందు దీర్ఘకాలం కలిసి ఉన్నవారు, పెళ్లయ్యాక అంతకన్నా తక్కువ సమయంలోనే విడిపోతారట! ఇదింకో అధ్యయనంలో తేలిన విషయం. ►పెళ్లయిన మూడో ఏడాది.. ఏ దంపతుల జీవితంలోనైనా అత్యంత ఆనందకరమైన సంవత్సరంగా ఉంటుందట! మీరిప్పుడు పెళ్లి చేసుకుంటే అత్యంత ఆనందకరమైన ఆ ఏడాది కోసం రెండేళ్లు ఎదురు చూడాలన్నమాట. పెళ్లి ఖర్చు తక్కువగా ఉంటే ఎక్కువ కాలం, పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉంటే తక్కువ కాలం దంపతులు కలిసి ఉంటారట! ఇది ఇంకో అబ్జర్వేషన్. ►పెళ్లంటే ఉండే భయాన్ని ‘గామోఫోబియా’ అంటారు. మరి ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటే గామోఫోబియా రాదా అని మీరు అనుకుంటుంటే ఈ టాపిక్‌ని ఇక్కడితో ఆపేద్దాం. అనుకోకపోతే ఇంకో రెండు విషయాలు చెప్పుకుని ముగిద్దాం. ►ఒకటి: ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఏ ఫోబియాలూ మీ దరి చేరవు. ►రెండు: ముహూర్త బలం ఎంత బలమైనదో.. దాంపత్య ఫలం అంతే బలమైనది. భార్యాభర్తల్లోని ఇచ్చిపుచ్చుకునే సర్దుబాటు ధోరణి పెళ్లిని పదికాలాల పాటు పదిలంగా ఉంచుతుంది. ముహూర్తానికే వన్నె తెస్తుంది. భలే మంచి ముహూర్తము 8 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: మధ్యాహ్నం 12.24 నుంచి నవంబర్ 9 తెల్లవారుఝాము 06.39 వరకు; నక్షత్రం: ఉత్తరాభాద్ర; తిథి : ద్వాదశి 9 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉదయం 06.30 నుంచి నవంబర్ 10 ఉదయం 06.39 వరకు. నక్షత్రం: ఉత్తరాభాద్ర, రేవతి; తిథి: ద్వాదశి, త్రయోదశి. 10 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: ఉదయం 06.39 నుంచి 10.44 వరకు; నక్షత్రం: రేవతి; తిథి: త్రయోదశి 14 నవంబర్ 2019 గురువారం ముహూర్తం: ఉదయం 09.15 నుంచి నవంబర్ 15 ఉదయం 06.43 వరకు; నక్షత్రం: రోహిణి, మృగశిర; తిథి: విదియ, తదియ 22 నవంబర్ 2019 శుక్రవారం ముహూర్తం: ఉదయం 09.01 నుంచి నవంబర్ 23 ఉదయం 06.50 వరకు; నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, హస్త; తిథి: ఏకాదశి 23 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: ఉ. 06.50 నుంచి మధ్యాహ్నం 02.46 వరకు; నక్షత్రం: హస్త; తిథి: ద్వాదశి 24 నవంబర్ 2019 ఆదివారం ముహూర్తం: మధ్యాహ్నం 12.48 నుంచి నవంబర్ 25 అర్ధరాత్రి 01.06 వరకు; నక్షత్రం: స్వాతి; తిథి: త్రయోదశి 30 నవంబర్ 2019 శనివారం ముహూర్తం: సాయంత్రం 06.05 నుంచి డిసెంబర్ 1 ఉదయం 06.56 వరకు; నక్షత్రం: ఉత్తరాషాఢ; తిథి: పంచమి. ►(నవంబర్ 15, 19, 20, 21, 22 తేదీలలో పెళ్లి ముహూర్తాలు అతి స్వల్ప నిడివిలో మాత్రమే ఉండగా.. 27, 28, 29 మంచి ముహూర్తాలు లేవనే చెప్పాలి). -
అర్థం చేసుకోండి పెళ్లి
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. ఇల్లంతా పచ్చటి తోరణాలు, బంధువుల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల రెపరెపలు, చిన్నారుల అల్లరితో పెళ్లి ఇంట సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతి ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం. వీటిలో కులాలవారీగా, ప్రాంతాల వారీగా తేడాలు ఉండవచ్చు కానీ, ఇంచుమించు అన్ని వివాహాలలో ఉండే ప్రధాన ప్రక్రియలు ఇవి. నిశ్చితార్థం/ తాంబూలాలు వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది నిశ్చితార్థం– లేదా నిశ్చయ తాంబూలం. ఒక శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లితండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చు కుంటారు. దైవజ్ఞులు నిశ్చయించిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి ఆచారానుసారం ‘శుభలేఖలు’ ముద్రించుకుంటారు. అంకురార్పణ పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం–అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకు ను–పెళ్ళికూతురును చేయడం ఆచారం. తెల్లవారక ముందే, ముత్తయిదులు పెళ్ళి కూతురుకు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళస్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’ అంటారు. స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకెళ్లి స్నాతకం చేసుకుంటారు. బాసికం పెళ్లిలో వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో వధూవరులు నొసట ధరిస్తారు. బాసికం కట్టగానే పెళ్లికళ వచ్చేస్తుంది. దృష్టి దోష నివారణకు బాసికాన్ని కడతారు. ఎదురుకోలు మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికోసం ఎదురు చూస్తున్న ఆడపెళ్లి వారు, ‘ఎదురు కోలు’ పలికే ఆచారం సరదాగా– సందడిగా జరుపుకునే మరో వేడుక. మేళ– తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. గౌరీపూజ... వరుడి కాళ్లు కడగటం గౌరీ పూజ దగ్గర గోత్ర–ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చోబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియజెబుతుంది. కొబ్బరి బోండాం మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని–సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, మరో ముఖ్యమైన ఘట్టం. వధూవరుల మధ్యలో తెర ముహూర్త సమయం వరకు వధూవరుల మధ్యలో ఉంచే తెరకు అర్థం ఉంది. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలో చూస్తారు. ఇలా వాళ్ల బంధం బలపడుతుందని అర్థం. జీలకర్ర, బెల్లం జీలకర్ర, బెల్లం జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. జీలకర్ర, బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలనీ మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందన్న మాట! ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిల్చిపోతుందట. కన్యాదానం దేనినైనా దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని పంచ భూతాల సాక్షిగా, పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రుల సాక్షిగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు. కొంగుముడి... బ్రహ్మముడి బ్రహ్మముడి వధువు చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం వారు కలకాలం అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండాలని దంపతుల కొంగులకు ముడివేస్తారు. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు. ఈ కొంగుముళ్లతోనే పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు వధూవరులు. ఉంగరాలు తీయటం పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది ఈ ఆచారం. మంగళసూత్రం సూత్రం అంటే దారం. మంగళప్రదమైంది కనుక మంగళ సూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వేదమంత్రాల సాక్షిగా వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు. మూడు ముళ్లే ఎందుకు ? త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం. మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది. మాంగల్య తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే తంజీవ శరదాం శతమ్. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగల్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగల్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవన గమనం ఈ మాంగల్యం పైనే ఆధారపడి ఉందని అర్థం. తలంబ్రాలు తలంబ్రాలు వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు. పాణిగ్రహణం కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి, పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయిపైకి ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం. ఏడు అడుగుల పరమార్థం భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు. నల్ల పూసలు ఎందుకు? మంగళసూత్రంతో పాటు నల్లపూసలు ధరించడం సాంప్రదాయం. నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. సప్తపది తర్వాత నాగవల్లి–సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలిమట్టెలు తొడిగిస్తారు. గృహ ప్రవేశం కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టడాన్నే గృహప్రవేశం అంటారు. అలా ఇంటిలో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశాన్ని గడపపై ఉంచుతారు. దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తు్తందని నమ్మకం.గృహప్రవేశం అనంతరం సకల శుభదాయకమైన సత్యనారాయణ స్వామి వ్రతం వరుని ఇంట జరగడం ఆచారం. – డి.వరలక్ష్మి -
వధూవరుల ఎస్కేప్.. ఒంటరైన పురోహితుడు
సాక్షి, కర్ణాటక : పెళ్లి మంటపంలో వధూవరులు కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన ఆదివారం కోలారు జిల్లా, మాలూరులోని పద్మావతి కళ్యాణ మంటపంలో చోటు చేసుకుంది. వివరాలు... తాలూకాలోని చన్నకల్లు గ్రామానికి చెందిన గురేష్, బంగారుపేట తాలూకా నేర్నహళ్లి గ్రామానికి చెందిన ఎన్. సౌమ్యలకు వివాహం జరగాల్సి ఉంది. శనివారం రిసెప్షన్, ఆదివారం వివాహం నిశ్చయించారు. పెళ్లికి వంటలతో పాటు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. బంధువులు, వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే శనివారం రాత్రి నిశ్చితార్థ సమయానికి వధువు సౌమ్య కళ్యాణ మండపానికి రాలేదు. రాత్రి 10 గంటలు గడిచినా కల్యాణ మంటపానికి పెళ్లి కూతురు వారి తరుపు వారు రాకపోవడంతో ఆగ్రహించిన వరుడి తాలూకా వారు ఇదే ముహూర్తానికి వధువు సౌమ్య చిన్నాన్న కూతురు వెంకటరత్నమ్మతో గురేష్ వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈమేరకు నిశ్చితార్థం ఇతర శాస్త్రాలను ముగించారు. అంతా సుఖాంతం అనుకుంటున్న సమయంలో ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఉదయం వరుడు పెళ్లి మంటపంలో నుంచి కనిపించకుండా పోయాడు. షేవింగ్ చేసుకుని వస్తానని బయటకు వెళ్లినవాడు తిరిగి రాలేదు. తన మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో కల్యాణ మండపంలో తిరిగి గందరగోళం నెలకొంది. ఎంతకీ వరుడు తిరిగి రాకపోవడంతో పెళ్లికి వచ్చిన వారు తిరుగుముఖం పట్టారు. పెళ్లికి చేసిన పిండి వంటలు అలాగే ఉండి పోయాయి. -
పెళ్లి వ్యాన్ బోల్తా
► 35 మందికి గాయూలు ► రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తలమడుగు(తాంసి)/ఆదిలాబాద్ రిమ్స్ : తాంసి మండలం దన్నోర గ్రామీపంలోని వాగు మూలమలుపు వద్ద గురువారం పెళ్లి వ్యాన్(ఏపీ 01 ఎక్స్ 8216) బోల్తాపడింది. అందులో ప్రయూణిస్తున్న 35 మంది గాయపడ్డారు. వీరికి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంసి మండలంలోని పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన పిట్లా అశోక్ కూతురు సరిత వివాహం దన్నోర గ్రామానికి చెందిన వికాష్‌తో గురువారం జరిగింది. పిప్పల్‌కోఠి గ్రామంలోని వారి బంధువులు పెళ్లికి హాజరై వ్యాన్‌లో 35 మంది తిరుగు ప్రయూణమయ్యూరు. దన్నోర గ్రామ సమీపంలోని మూలమలుపు వాగు వద్ద వ్యాన్ అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో వ్యాన్‌లో ప్రయూణిస్తున్న వారంతా గాయపడ్డారు. డ్రైవర్ ప్రవీణ్‌తోపాటు పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన మసూద్, భోజమ్మ, భూమక్క, గంగమ్మ, ప్రేమల, మౌనిక, సాగర్ తదితరులు గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రలోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్ తెలిపారు. వధూవరులకు తప్పిన ప్రమాదం పెళ్లి కుమారుడు వికాష్, పెళ్లికూతురు సరిత ఇదే వ్యాన్‌లో రావాల్సి ఉండగా.. పెళ్లి కుమారుడి ఇంట్లో బోనాలు వేయడానికి వెళ్లారు. అక్కడ ఆలస్యం కావడంతో మరో వాహనంలో వచ్చారు. దీంతో వధూవరులకు ప్రమాదం తప్పింది.