UP Couple Slap Each Other Hard During Wedding, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: పెళ్లి తంతులో దంపతులు రచ్చ... షాక్‌లో బంధువులు

Published Sun, May 1 2022 11:15 AM | Last Updated on Sun, May 1 2022 1:37 PM

Wedding Couple Slap Each Other Goes Viral - Sakshi

Bride and Groom Slap Each Other: ఇటీవల కాలంలో వివాహాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వెడ్డిండ్‌ షూట్‌లంటూ విన్నూతన పద్ధతిలో వధువరులు వివాహతంతును ఆనందంగా జరుపుకుంటున్నారు. కొన్ని వివాహతంతుల్లో అపశృతులు చోటుచేసుకుని ఇబ్బందులు కొనతెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. ఐతే ఈ వివాహతంతు అందుకు భిన్నం ఆనందమయ క్షణాల్లో వధువరులు చేసిన పనికి బంధుజనులంతా నిర్ఘాంతపోయారు.

వివరాల్లోకెళ్తే...ఒక జంట చాలా అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఆ తర్వాత వధువరుల చేత చక్కటి ఆటపాటలు, స్వీట్లు తినిపించుకోవడం వంటి కార్యక్రమాలు చేయిస్తారు. ఇక్కడ వధువు వరుడికి స్వీట్‌ తినిపించేందకు యత్నిస్తుంటే ఆ వరుడు పట్టించుకోకుండా ఉంటాడు. ఎంతకి తనని పట్టించుకోకుండా అటూ చూస్తూ మాట్లాడుతున్నాడన్న కోపంతో ఆ స్వీట్‌ని అతని ముఖానికి రాసేస్తుంది. దీంతో ఆగ్రహం చెందిన వరుడు ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడు. పెళ్లికూతురు కూడా ఏ మాత్రం తగ్గకుండా కోపంతో వరుడి గూబ గుయ్యిమనిపిస్తుంది. ఇద్దరు అలా ఒకరినొకరు జుట్టు పీక్కునేంతలా కొట్టేసుకుంటారు. ఆ వివాహ వేదిక వద్ద ఉన్న బంధువులకు ఏం చేయాలో పాలుపోక అలా చూస్తుండిపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు సునీల్‌ గ్రోవర్‌ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: అత్యద్భుతమైన తెల్లటి నెమలి! వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement