slapping
-
దీపక్ చాహర్ ని కొట్టిన ధోని..!
-
అమ్మాయిని కొడతావా? నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
యంగ్ హీరో నాగశౌర్య రియల్ హీరో అనిపించుకున్నారు. నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు చేయి చేసుకోగా, ఎందుకు కొట్టావంటూ నాగశౌర్య నిలదీశాడు. అంతేకాకుండా అమ్మాయిని కొట్టడం తప్పు అని ఆమెకు క్షమాపణలు(సారీ)చెప్పాల్సిందే అని శౌర్య సదరు యువకుడితో గొడవకు దిగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోడ్డు మీద ఇద్దరు ప్రేమికులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అదే సమయంలో అట్నుంచి కారులో వెళుతున్న నాగశౌర్య ఇది గమనించి 'ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అంటూ నిలదీశాడు. దీనికి అతను ఆమె నా లవర్, నా ఇష్టం అంటూ ఓవర్యాక్షిన్ చేయగా అబ్బాయిని గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ శౌర్య వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శౌర్య చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. -
నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
-
మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...
బెంగళూరు: ఒక మంత్రి తీవ్ర అసహనంతో బహిరంగంగా ఒక మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే....కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి వి సోమన్న చామరాజనగర్ జిల్లా హంగల గ్రామంలో సుమారు 175 మందికి భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో ఒక మహిళ తనకు భూమి పట్టా రాలేదన్న కోపంతో ఆయన మీదకు వచ్చింది. దీంతో సదరు మంత్రి ఆ మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఐతే ఆ మహిళ తర్వాత సదరు మంత్రి పాదాలను తాకి మరీ ఆశీర్వాదం తీసుకుంది. తదనంతరం ఆ మంత్రి కూడా సదరు మహిళకు క్షమాపణాలు చెప్పారు. వాస్తవానికి మంత్రిగారు ఆ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా చేరుకున్నారు. మరోవైపు ఆమెకు భూమి పట్టా అందకపోవడం, వారందర్నీ ఎదురుచూసేలా చేయడం తదతర కారణాల రీత్యా ఆయన ఇలాంటి సంఘటనను ఎదుర్కోవల్సి వచ్చింది. అచ్చం అలానే ఇటీవల ఒక జనతాదళ్(సెక్యులర్) నాయకుడు శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్‌పై ఇలానే చేతివాటం చూపి కెమెరాకు చిక్కిన సంగతి తెలిసింది. (చదవండి: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు) -
వైరల్ వీడియో.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.. ఎందుకో తెలుసా!
ముంబై: మహారాష్ట్రలో ఇద్దరు మహిళలు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. నాసిక్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ.. మాటమాట పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. టోల్ సిబ్బంది, కారులోని మహిళ రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. టోల్ ఫీజు చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా కారులోని మహిళ బయటకు దిగి టోల్గేట్ సిబ్బంది చెంప చెళ్లుమనిపించింది. అంతటితో ఆగకుండా ఉద్యోగి చేతులను మెలితిప్పి దాడి చేసింది. దీంతో సిబ్బంది కూడా మహిళపై ఘర్షణకు దిగింది. ఇద్దరూ మరాఠీలో తిట్టుకుంటూ ఘోరంగా కొట్టుకున్నారు. నడిరోడ్డుపై ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని చెంపలు వాయించుకున్నారు. ఇంత జరుగుతుంటే అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీస్తున్నారే గానీ ఆపేందుకు ప్రత్నించలేదు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. नासिक में कल शाम एक टोलबूथ पर हुआ हंगामा। टोल भरने को लेकर हुए विवाद पर 2 महिला आपस में भिड़ गई। @iamvinodjagdale #maharastra #WATCH pic.twitter.com/mAEHARg33l — News24 (@news24tvchannel) September 15, 2022 -
వృద్ధుడనే కనికరం లేకుండా సొంత మావపై దాడికి పాల్పడ్డ మహిళా పోలీసు
న్యూఢిల్లీ: ఒక మహిళా పోలీసు సొంత మావపై బౌతిక దాడికి దిగింది. ఐతే ఈ ఘటనను మరొక పోలీసు వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీ నగరంలో నివాసం ఉంటున్న బాధిత వృద్ధుడి ఇంట్లో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక మహిళా పోలీసు పదేపదే తన మామాగారి చెంప చెళ్లుమనిపిస్తుంది. పైగా అందుకు ఆమె తల్లి కూడా మద్దతిచ్చింది. ఈ ఘటన జరగడానికి ముందు ఆమె తన తల్లితో కలిసి వృద్ధుడైన తన మావతో గొడవకు దిగింది. ఇద్దరి మద్య పెద్ద వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మరొక పోలీసు జోక్యం చేసుకునేలోపే ఆ మహిళా పోలీసు పదే పదే ఆ వృద్ధుడి చెంపపై కొట్టింది. సదరు మహిళా పోలీసు ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఘటన పై సీరియస్ అయిన పోలీసు అధికారులు సదరు మహిళా పోలీసుపై కేసు నమోదు చేయడమే కాకుండా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. #WATCH | Case registered under section 323/427 IPC after a video of Sub-Inspector thrashing her in-laws in Delhi's Laxmi Nagar went viral. Info shared with concerned authority to take suitable departmental action against the erring police official: Delhi Police (CCTV Visuals) pic.twitter.com/VUiyjVtZQl — ANI (@ANI) September 5, 2022 (చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో) -
రక్షించినందుకు చెంపదెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు
ఇటీవలకాలంలో చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులంటే చిన్న చూపో ఏంటో తెలియదు. వారిపట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఐనా మనుషులన్నాక తప్పులు అనేవి సహజం. మందలించి వదిలేయాలి గానీ చేయి జేసుకోవడం అనాగరికం. ఇక్కడొక వ్యక్తి కూడా సెక్యూరిటి గార్డు పట్ల అలానే అనుచితంగా ప్రవర్తించాడు. వివరాల్లోకెళ్తే...గుర్గావ్లోని వరుణ్ నాథ్ అనే వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై ఆ వ్యక్తిని రక్షించి బయటకు వచ్చేలా చేశాడు. ఐతే ఆ వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటపడి వచ్చిన వెంటనే అదే పనిగా సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బలు కొడతాడు. ఆ తర్వాత ఆ లిఫ్మ్యాన్ని కూడా గట్టిగా కొడతాడు. #WATCH | Haryana: A resident of The Close North Apartments in Gurugram thrashed security guards after being briefly stuck in lift; FIR filed I helped him get out of the lift within 3-4 minutes. As soon as he got out, he started beating me up: Guard Ashok Kumar (CCTV visuals) pic.twitter.com/mtcXOy8zTh — TOI Gurgaon (@TOIGurgaon) August 29, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో అపార్ట్మెంట్ గార్డులు వరుణ్‌నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. అంతేగాదు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల నోయిడాలో ఒక మహిళ గేట్ ఆలస్యంగా తీసినందుకు సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలైన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...) -
Viral Video: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం అంటే ఇదేనేమో!
న్యూఢిల్లీ: మనం చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. చేసిన కర్మకు వెంటనే ప్రతిఫలం వస్తుందంటుంటారు. అందుకు ఈ యువకుడు చేసిన పనే నిదర్శనంగా నిలుస్తోంది. గాడిదను కొడుతూ.. కాళ్లతో తంతూ తీవ్రంగా హింసించిన వీడియో చూస్తే మీరూ అవుననక ఉండలేరు. ఆ యువకుడి వీడియోను శక్తి కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై నెటిజన్లు సంతృప్తి చెందారు. కర్మకు తక్షణ ఫలితం ఉంటుందని యువకుడిపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఓ యువకుడు గాడిదను తాడుతో కట్టి పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. ఆ తర్వాత దానిపైనే ఎక్కి అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించాడు. యువకుడి దాడితో సహనం కోల్పోయిన గాడిద ఎదురుదాడికి దిగింది. కింద పడేసి ఆ కిరాతకుడి కాలు పట్టుకుని చుట్టూ తిప్పుతూ కాళ్లతో తన్నుతూ దాడి చేసింది. ఈ వీడియోకు రెండు రోజుల్లోనే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. గాడిద ప్రతీకారాన్ని సూచిస్తూ.. కర్మకు ప్రతిఫలం తప్పదంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. ‘రెండోభాగంలో వీడియో సూపర్.. సంతృప్తిగా ఉంది’ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. మంచిపని అయింది.. నీకు అదే కావాలి అంటూ మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Shakti Kapoor (@shaktikapoor) ఇదీ చదవండి: పావురం బ్యాక్ జంప్!.. చూస్తే అవాక్కవ్వాల్సిందే: వీడియో వైరల్ -
పెళ్లి కూతురి బదులుగా.. చెంప పగలకొట్టిన మరదలు
వైరల్: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు ఎంతో ప్రత్యేకమైనవి. వాటి వైరల్ హడావిడి మామూలుగా ఉండదు. అందునా.. వధువు, వరుడితో ముడిపిన ప్రత్యేకత ఏదైనా ఉంటే మాత్రం ఆదరించేస్తుంటారు నెటిజన్స్. తాజాగా పెళ్లిలో స్టేజ్‌పైనే బావ చెంప పగలకొట్టిన మరదలు అంటూ.. ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. తప్పతాగిన వరుడు.. తూలుతూనే స్నేహితుడి సాయంతో స్టేజ్‌పై నిల్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా పెళ్లి కూతురు ఉంటుంది. ఇద్దరూ దండలు మార్చుకోవాల్సిన టైంలో.. వధువు వంతు పూర్తి అవుతుంది. ఈలోపు వధువు చెల్లి హరతి, అక్షింతల పళ్లెంతో స్టేజ్ మీద ప్రత్యక్షమవుతుంది. అయితే తాగిన మైకంలో వధువుకి బదులుగా...... కింద వీడియో చూసేయండి.. बिहार में शराबबंदी बा ... 🤔😅🤣😂🥃 pic.twitter.com/MiWYfF2N2T — Vikki1975 (@Vikki19751) June 21, 2022 ఈ వీడియో ఇది కొత్తదా? పాతదా?.. ఏదైనా షార్ట్ ఫిల్మ్‌లో భాగమా? అసలు ఎక్కడ జరిగింది? కావాలనే తీశారా? నిజంగా జరిగిందా? అనే విషయాలపై ఎక్కడా క్లారిటీ లేదు. కేవలం వాళ్ల సంభాషణల ఆధారంగా అది బీహారీ వీడియో అని స్పష్టం అవుతోంది. వధువు చెల్లి బాదుతుంటే.. అడ్డుకునే ప్రయత్నాలు పెద్దగా కనిపించవు. పైగా తాగుబోతు తూలే నటన కూడా అంత బాగాలేదన్న కామెంట్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌లో మాత్రం తెగ వైరల్ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అందుకే ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. -
ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే!
ముఖ నిగారింపుని మరింతగా పెంచుకునేందుకు కొరియన్లు స్లాప్ థెరపీని వాడతారు. స్లాప్ థెరపీ అంటే చెంప మీద పెళ్లున కొట్టడం.రెండు చేతులతో ముఖానికి ఇరువైపులా కొట్టడం వల్ల ముఖచర్మం గ్లోగా కనిపిస్తుంది. ►ముందుగా ముఖాన్ని వేడినీటితో కడిగి, తడిలేకుండా శుభ్రంగా తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఇప్పుడు మెల్లగా కొట్టడం ప్రాంభించి క్రమంగా పెద్దగా కొట్టాలి. ఇలా ఏడు నిమిషాలు పాటు చేస్తే స్లాప్ థెరపీ అయిపోయినట్లే. ►రోజూ క్రమం తప్పకుండా ఈ స్లాప్ థెరపీ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, సహజసిద్ధంగానే చర్మం రేడియంట్ నిగారింపుని సంతరించుకుంటుంది. ►ఈ థెరపీతో నిగారింపే కాకుండా చర్మం మీద ముడతలు త్వరగా రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. అందుకే దీనిని యాంటీఏజింగ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ►రక్తప్రసరణ పెరగడం వల్ల టాక్సిన్స్ బయటకు పోయి ముఖం మీద మొటిమలు కూడా రావు. ఇంకెందుకాలస్యం... ఏ మాత్రం శ్రమలేని స్లాప్ థెరపీతో మీ ముఖాన్ని మెరిపించండి. -
పెళ్లి తంతులో దంపతుల రచ్చ.. వరుడికి చేదు అనుభవం
Bride and Groom Slap Each Other: ఇటీవల కాలంలో వివాహాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వెడ్డిండ్ షూట్లంటూ విన్నూతన పద్ధతిలో వధువరులు వివాహతంతును ఆనందంగా జరుపుకుంటున్నారు. కొన్ని వివాహతంతుల్లో అపశృతులు చోటుచేసుకుని ఇబ్బందులు కొనతెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. ఐతే ఈ వివాహతంతు అందుకు భిన్నం ఆనందమయ క్షణాల్లో వధువరులు చేసిన పనికి బంధుజనులంతా నిర్ఘాంతపోయారు. వివరాల్లోకెళ్తే...ఒక జంట చాలా అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. ఆ తర్వాత వధువరుల చేత చక్కటి ఆటపాటలు, స్వీట్లు తినిపించుకోవడం వంటి కార్యక్రమాలు చేయిస్తారు. ఇక్కడ వధువు వరుడికి స్వీట్ తినిపించేందకు యత్నిస్తుంటే ఆ వరుడు పట్టించుకోకుండా ఉంటాడు. ఎంతకి తనని పట్టించుకోకుండా అటూ చూస్తూ మాట్లాడుతున్నాడన్న కోపంతో ఆ స్వీట్‌ని అతని ముఖానికి రాసేస్తుంది. దీంతో ఆగ్రహం చెందిన వరుడు ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడు. పెళ్లికూతురు కూడా ఏ మాత్రం తగ్గకుండా కోపంతో వరుడి గూబ గుయ్యిమనిపిస్తుంది. ఇద్దరు అలా ఒకరినొకరు జుట్టు పీక్కునేంతలా కొట్టేసుకుంటారు. ఆ వివాహ వేదిక వద్ద ఉన్న బంధువులకు ఏం చేయాలో పాలుపోక అలా చూస్తుండిపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sunil Grover (@whosunilgrover) (చదవండి: అత్యద్భుతమైన తెల్లటి నెమలి! వీడియో వైరల్) -
ఏ.. నా కొడుకూ విన్పించుకోడు అన్న యువకుడు.. లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే
పావగడ (కర్ణాటక): స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణప్ప ఓ యువకున్ని చెంప దెబ్బ కొట్టడం దుమారం రేపింది. ఈ నెల 19 న ఎమ్మెల్యే తాలూకాఫీసులో ఓ సమావేశంలో పాల్గొని బయటికి వస్తుండగా నాగేనహళ్ళికి చెందిన నరేంద్ర అనే యువకుడు హుసేన్‌పురం, ర్యాపిట, నాగేనహళ్ళి గ్రామాలకు చెందిన రోడ్లను ఎప్పుడు వేస్తారని ఎమ్మెల్యే ని ప్రశ్నించాడు. మీ గ్రామాలకు రూ 3.50 కోట్లను మంజూరు చేశామని, వారం లోగా పనుల్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బదులిచ్చారు. ఆ యువకుడు... ఏ .... నా కొడుకూ విన్పించుకోడు అని కోపంగా అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఆ యువుకున్ని చెంప దెబ్బ కొట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెంప దెబ్బ వీడియో వైరల్ అయ్యింది. In Karnataka, Venkataramanappa, Congress MLA from Pavagada, slaps a youth who asked for road in his village. After Siddaramaiah and DKS slapping Congress workers in public, this is a new low. Reminds us of Amethi, where Rahul asked a young man demanding road to join the BJP. pic.twitter.com/XhYeldhZII — Amit Malviya (@amitmalviya) April 21, 2022 ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తాలూకాపీసు ఎదుట బీజేపి నాయకులు గురువారం ఆందోళన చేశారు. రోడ్డు వేయాలని కోరితే దాడి చేస్తారా?, ప్రజలను రక్షించాల్సిన ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టడం అమానుషమన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: (ఘనంగా మంత్రి కుమారుడి వివాహం) -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు !
Will Smith Fast And Loose On Hold After Slapping Chris Rock Oscars 2022: ఆస్కార్ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌కు టైం సరిగా లేనట్లే ఉంది. తన భార్య జాడా పింకెట్ అనారోగ్యంపై ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ జోక్ వేశాడన్న కారణంతో విల్ అతని చెంపచెల్లుమనించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అందుకంటూ ఈ సంఘటనపై అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు క్షమాపణలు కూడా చెప్పాడు విల్ స్మిత్. అనంతరం సోషల్ మీడియా వేదికగా క్రిస్ రాక్‌ను కూడా క్షమించమని కోరాడు. దీంతో ఈ వివాదం సద్దుమణగకుండా విల్ స్మిత్ రాజీనామా చేసేదాకా వెళ్లింది. హాలీవుడ్ ఫిల్మ్ అకాడమీకి విల్ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు. చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్ రాజీనామా.. ఇదిలా ఉంటే ఈ చెంపదెబ్బ వ్యవహారం విల్ స్మిత్ క్రమశిక్షణ చర్యల పరంగా కాకుండా తన సినీ కెరీర్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. విల్ హీరోగా రాబోయే చిత్రం 'ఫాస్ట్ అండ్ లూజ్'. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఆ మూవీని హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ ఆస్కార్ సంఘటనకు కొన్ని వారాల ముందు డైరెక్టర్ డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ చిత్రాన్ని వదిలి 'ఫాల్ గాయ్' సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వినికిడి. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని చూస్తోందట. దీనంతటికి కారణం క్రిస్‌రాక్‌పై విల్ చేయిచేసుకోవడమే అని హాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. చదవండి: వీడియోతో దొరికిపోయిన విల్ స్మిత్.. ఇప్పుడేం అంటాడో మరి? అయితే 'ఫాస్ట్ అండ్ లూజ్' హోల్డ్‌లో ఉన్నప్పటికీ విల్ స్మిత్ చేతిలో ఎమాన్సిపేషన్, యాపిల్ టీవీ ప్లస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే 'బ్యాడ్ బాయ్స్ 4' కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ, ఆస్కార్ వ్యవహారంతో ఈ ప్రాజెక్ట్‌ను కూడా సోనీ హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. చదవండి: ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే.. -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్ రాజీనామా..
Will Smith Resigns: హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (అకాడమీ అవార్డ్స్)కు రాజీనామా చేశాడు. ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడంపై విల్ స్మిత్ శుక్రవారం (ఏప్రిల్ 1) ఈ విధంగా తెలిపాడు. క్రిస్ రాక్‌ను చెంప దెబ్బ కొట్టండ అనేది 'షాకింగ్, బాధాకరమైనది, క్షమించరానిది' అని పేర్కొన్నాడు. 'నేను అకాడమీ నమ్మకానికి ద్రోహం చేశాను. ఈ వేడుకను అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఇతర నామినీలు, విజేతలు సంతోషంగా జరుపుకునే అవకాశాన్ని నేను కోల్పోయేలా చేశాను, నేను పోగొట్టుకున్నాను. నా గుండె ముక్కలైంది (హార్ట్ బ్రోకేన్). కాబట్టి, నేను అకాడమీ అవార్డ్స్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే. తదుపరి పరిణామాలను అంగీకరిస్తాను.' అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపాడు. చదవండి: ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే.. అంతేకాకుండా 'మార్పుకు సమయం పడుతుంది. హింసను అనుమతించకుండా, అందుకు కారణమయ్యే పరిస్థితులను అధిగమించేలా నా పనికి నేను కట్టుబడి ఉంటాను.' అని విల్ చెప్పుకొచ్చాడు. విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించినట్లు అకాడమీ అవార్డ్స్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ తెలిపారు. క్షమశిక్షణా చర్యలో భాగంగా అదనపు ఆంక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 18న జరిగే గ్రూప్ బోర్డు సమావేశంలో ఈ విషయం గురించి చర్చించనున్నారు. అయితే గత ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకలో కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? 'అలోపేసియా' వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌ను ఉద్దేశించి జోక్ చేశాడు వ్యాఖ్యాత క్రిస్ రాక్. దీంతో ఆగ్రహానికి లోనైనా విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప చెల్లుమనించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆస్కార్ అందుకునే సమయంలో అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు, తర్వాతి రోజు ఇన్‌స్టా గ్రామ్‌లో క్షమాపణలు కూడా తెలిపాడు విల్. అకాడమీ చర్యల్లో భాగంగా విల్ స్మిత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. #WillSmith resigns from the #Academy for slapping #ChrisRock at the #Oscars His statement pic.twitter.com/3sDhcAkDuZ — Ramesh Bala (@rameshlaus) April 2, 2022 -
వీడియోతో దొరికిపోయిన విల్ స్మిత్.. ఇప్పుడేం అంటాడో మరి?
Will Smith Old Video: సోమవారం ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఫలానా సినిమాకి అవార్డు రావాల్సిందనో, ఫలానా స్టార్‌కి ఆస్కార్ రాకపోవడం అన్యాయమనో, ఫంక్షన్ బాగా జరిగిందనో... ఇలాంటి చర్చలు జరుగుతాయి. కానీ అలోపేసియా వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జడా పింకెట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యాత క్రిస్ రాక్ వేసిన జోక్ గురించి, విల్ స్మిత్ అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన గురించీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 30 ఏళ్ల క్రితం అలోపేసియాతో బాధపడుతున్న జాన్ విల్లియమ్స్ బట్టతలపై ‘ది అర్సెనియా హాల్ షో’లో విల్ స్మిత్ వేసిన జోక్‌కి సంబంధించిన వీడియో అది. ‘అతనికో రూల్ ఉంది. అదేంటంటే అతను ప్రతి రోజూ తన తలను వ్యాక్స్ (కవర్ చేయాలనేది ఉద్దేశం) చేయాల్సిందే. అదే రూల్’ అంటూ జోక్ చేసి, ‘ఇది జస్ట్ జోక్’ అని కూడా అన్నాడు విల్ స్మిత్. ఆ వీడియోను ఇప్పుడు ఎవరో బయటపెట్టారు. మరి.. ఇప్పుడు క్రిస్ చేసింది కూడా జోక్‌లో భాగమే కదా అంటున్నారు నెటిజన్లు. ‘క్రిస్ చేస్తే తప్పు... నువ్వు చేస్తే ఒప్పా?’ అంటూ విల్ స్మిత్‌ని విమర్శిస్తున్నారు. 15 రోజుల్లోపు విల్ వివరణ ఇవ్వాలి క్రిస్‌పై విల్ దాడి పట్ల ఆస్కార్ కమిటీ చాలా ఆగ్రహంగా ఉంది. అదే వేదిక సాక్షిగా కమిటీకి, వీక్షకులకు క్షమాపణలు చెప్పాడు విల్. అయితే క్రిస్‌కి చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రిస్‌కి క్షమాపణలు చెప్పాడు విల్. తన భార్యపై జోకులు వేయడంతో ఆగ్రహం పట్టలేకే అలా చేశానని కూడా అన్నాడు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకల్లో విల్ ఇలా దాడి చేయడంపై ఆస్కార్ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటోంది. ఈ విషయంపై చర్చించడానికి కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు కూడా. క్రిస్ పై దాడి చేశాక విల్ స్మిత్‌ని వేడుక నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినా అతను వెళ్లకపోవడంపై కూడా కమిటీ తీవ్ర ఆగ్రహంగా ఉందట. అందుకే తన ప్రవర్తనపై విల్ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించిందట. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఏప్రిల్ 18న కమిటీ మరోసారి సమావేశం కానుందని సమాచారం. “He gotta wax his head every morning.” Now this is a video of Will Smith saying a joke about someone with Alopecia. One reason I love the internet, it never forgets. pic.twitter.com/4OGlgSrcjA — Peter O.K.H (@Peter_OKH) March 28, 2022 -
ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే..
Why Did Will Smith Slapping Chris Rock In Oscar Awards Reason Is Here: ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకలో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 92వ అకాడమీ అవార్డుల వేదికపై విల్ స్మిత్, అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో హాలీవుడ్ సినీ లోకం షాక్‌కు గురైంది. పలువురు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వారి ఇరువురి స్థానాల్లో వారు ఉంటే ఏం చేశారో చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఘటనపై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. విల్ స్మిత్‌పై త్వరలోనే తగిన చర్యలు తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు విల్ స్మిత్.. క్రిస్ రాక్‌ను కొట్టడానికి గల కారణం ఏమైంటుంది ? విల్ భార్య జాడా పింకెట్‌కు ఏమైంది ? ఎందుకు ఆమె గుండుతో కనిపించింది ? చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకకు అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆయన ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించేందుకు ఓ చిన్న కామెడీ ట్రాక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె జుట్టు పూర్తిగా తొలగించుకొని గుండుతో ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. ఆమెను చూసిన క్రిస్ 'జీఐ జేన్' సినిమాలో 'డెమి మూర్' యాక్ట్ చేసిన పాత్రతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమాలో 'డెమి మూర్' పూర్తి గుండుతో కనిపిస్తుంది. 'జీఐ జేన్' సీక్వెల్లో కనిపించబోతున్నారా ? అని క్రిస్ రాక్ నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: 63 ఏళ్ల వయసులో ఎనిమిదోసారి తండ్రి కాబోతున్న నటుడు ఈ మాటలతోనే ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ కోపోద్రిక్తుడయ్యాడు. నిజానికి జాడా పింకెట్ 'అలోపిసియా' అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న వారిలో జుట్టు ఊడిపోతు ఉంటుంది. అయితే తన భార్య అనారోగ్యంపై జోకులు వేయడాన్ని సహించలేకపోయాడు విల్ స్మిత్. ఆగ్రహంతో నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్ దవడ పగలకొట్టి వెనుదిరిగాడు విల్ స్మిత్. తర్వాత తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై విరుచుకుపడ్డాడు. 'నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు' అంటూ గట్టిగా అరుస్తూ క్రిస్ రాక్‌ను హెచ్చరించాడు విల్. ఈ ఘటనతో ప్రేక్షకులు, అకాడమీ నిర్వాహకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. చదవండి: ఆమెకు ముద్దు పెట్టారా?.. పిల్లాడి ప్రశ్నకు తడబడ్డ స్టార్ హీరో, వీడియో వైరల్ ఈ ఇన్సిడెంట్ తర్వాత 'కింగ్ రిచర్డ్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకునేందుకు విల్ స్మిత్ వేదికపైకి వచ్చాడు. ఘటనపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు తెలిపాడు. తర్వాత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి క్షమాపణలు కోరాడు. ఈ ప్రపంచంలో హింసకు చోటులేదని, తన ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదని పేర్కొంటూ.. తనను క్షమించమని క్రిస్ రాక్‌ను కోరాడు విల్ స్మిత్. 'అలోపిసియా' లక్షణాలు: వయోజన మహిళల్లో ఎక్కువగా వస్తుంది 50% శాతం వరకు జుట్టు రాలిపోతుంది చర్మం రాలిపోతూ ఉంటుంది మానసిక ఒత్తిడి విటమిన్లు, మైక్రో ఎలిమెంట్లు ఉన్న పరిమిత ఆహారం తీసుకోవాలి ధీర్ఘకాలిక చికిత్స చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ -
ఆస్కార్ వేడుకల్లో కమెడియన్‌పై చెంపదెబ్బ.. విల్ స్మిత్‌పై చర్యలు !
Academy Will Take Action Against Will Smith Slap In Oscars: 92వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవంలో జరిగిన చెంపదెబ్బ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయం చెబుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా చర్చనీయాంశమైంది. అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో విల్ స్మిత్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విల్ స్మిత్‌పై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే విల్ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఎమ్పీఏఎస్) అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ అకాడమీ సభ్యులకు తాజాగా ఓ లేఖ పంపారు. విల్ చేయి చేసుకోవడంపై అకాడమీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు అందులో తెలిపారు. 2021 సినీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన అనేక మంది వ్యక్తులను సత్కరించేందుకుగానూ ఆదివారం 94వ ఆస్కార్ వేడుకలు నిర్వహించాం. కానీ ఇలాంటి వేదికపై ఓ నామినీ ఆమోదయోగ్యం కానీ, హానికరమైన ప్రవర్తనతో మేము కలత చెందాం. విల్ స్మిత్ చేయి చేసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. విల్ హద్దు మీరి ప్రవర్తించారు. నియమనింబంధనల్లో భాగంగా అకాడమీ గవర్నర్ల బోర్డు విల్ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి. అని అధ్యక్షుడు డేవిడ్ ఆ లేఖలో పేర్కొన్నారు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ -
అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Reaction On Will Smith Slapping Chris Rock: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తుంది. ఏ అంశంపైనైనా ఆమె చేసే కామెంట్స్ సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. ఈ వ్యాఖ్యలతో వివాదాలు ఎదుర్కొన్న ఈ బ్యూటీకు అభిమానులు కూడా ఎక్కువే. హిందీ పాపులర్ హీరోయిన్లలో ఒకరైనా కంగనా రనౌత్ తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ అవార్డు గ్రహిత విల్ స్మిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతను తన లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేసింది. కంగనా అలా అనడానికి కారణం ఆస్కార్ 2022 అవార్డు ఫంక్షన్లో విల్‌స్మిత్ చేసిన పనే. ఆస్కార్ అవార్డు వేదికపై అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా స్పందించింది కంగనా. 'కొంతమంది మూర్ఖులను నవ్వించడానికి మా అమ్మ లేదా సోదరిల అనారోగ్యాన్ని ఉపయోగించినట్లయితే నేను కూడా విల్ స్మిత్‌లానే చెంప పగులకొడతాను. ఇలాంటి ప్రవర్తన కనబర్చిన (బ్యాడ్ యాస్ మూవ్) విల్ స్మిత్ తప్పకుండా నా లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నాను.' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కంగనా రనౌత్. కాంట్రవర్సీ రియాలిటీ షో 'లాకప్'కు కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ముఖంపై పిడిగుద్దు ఘటన.. విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా? ఇదిలా ఉంటే ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా బెస్ట్ డ్యాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇచ్చేందుకు అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పైకి ఎక్కాడు. అప్పుడు ఏదో మాట్లాడుతూ అనారోగ్యంతో గుండు చేయించుకున్న విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఆగ్రహంతో క్రిస్ రాక్ దవడ పగలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 -
ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్
Shocking Video In Oscars 2022: నటుడు విల్ స్మిత్(53)కు ఎట్టకేలకు ఆస్కార్ దక్కింది. 94వ ఆస్కార్ వేడుకల్లో ‘కింగ్ రిచర్డ్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడాయన. అయితే.. ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ ఘటన సినీ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆస్కార్స్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్ స్మిత్, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ ఎక్కిన క్రిస్.. ఏదో మాట్లాడుతూ విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా.. ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు. స్టేజ్ మీదకు సీరియస్‌గా నడ్చుకుంటూ వెళ్లిన స్మిత్.. క్రిస్ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా.. అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమంటూ క్రిస్‌కు సూచించాడు విల్ స్మిత్. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 ఆపై క్షమాపణలు ఇదంతా లైవ్ రికార్డులో ప్లే కాలేదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో స్పష్టత లేదు. కానీ, క్రిస్ వ్యక్తిగతంగా కలిసి ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.] అంతేకాదు నిర్వాహకులు విల్ స్మిత్‌ను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పినట్లుగా ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఇక ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్న టైంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విల్ స్మిత్.. క్రిస్ పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణలు తెలియజేశాడు కూడా. Here's Will Smith's tearful acceptance speech at the #Oscars. https://t.co/ulvT7fsB57 pic.twitter.com/Uq2krBbBld — Variety (@Variety) March 28, 2022 మూడుసార్లు నామినేట్! అమెరికన్ నటుడు అయిన విల్ స్మిత్(విలియర్డ్ కారోల్ స్మిత్ 2).. మెన్ ఇన్ బ్లాక్, ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, హ్యాంకాక్, ఐ యామ్ లెజెండ్ లాంటి సినిమాలతో విల్ స్మిత్ ఇండియన్ ఆడియొన్స్‌కు సుపరిచితుడే. ఇప్పటిదాకా ‘అలీ’, ‘ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’, ‘కింగ్ రిచర్డ్’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్ ప్రిన్స్‌గా పేరున్న విల్ స్మిత్‌కు ఆస్కార్ 2022లో అవార్డు ముచ్చట తీరింది. కింగ్ రిచర్డ్‌లో వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి పాతర రిచర్డ్ విలియమ్స్ రోల్లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్ దక్కించుకున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Oscars 2022.. విజేతల పూర్తి లిస్ట్ ఇదే -
ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి
మ్యాచ్‌లో క్యాచ్ డ్రాప్ చేస్తే..'' ఏం కాదులే.. బౌండరీ వెళ్లకుండా ఆపావు అంటూ'' ఎంకరేజ్ చేసే బౌలర్లను చూసుంటాం.. లేదంటే క్యాచ్ వదిలేశాడన్న కోపంతో బౌలర్ సదరు ఆటగాడిని బూతులు తిట్టడం చూసుంటాం.. కానీ ఇక్కడ మనం చెప్పుకునే బౌలర్ అంతకుమించి అని చెప్పొచ్చు. క్యాచ్ డ్రాప్ చేశాడనే కోపంతో బౌలర్ ఏకంగా ఆటగాడికి చెంపదెబ్బను బహుమతిగా ఇచ్చాడు. ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి. ఈ ఘటన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చోటుచేసుకుంది. సోమవారం పెషావర్ జాల్మి, లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. పెషావర్ ఇన్నింగ్స్ సమయంలో హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో హజ్రతుల్లా జజయి పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కమ్రాన్ గులామ్ ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి హారిస్ రౌఫ్ మహ్మద్ హారిస్‌ను ఔట్ చేశాడు. మహ్మద్ హారిస్ ఫైన్‌లెగ్ దిశగా షాట్ ఆడగా.. పవాద్ అహ్మద్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన హారిస్ రౌఫ్.. కమ్రాన్ గులామ్‌ను చూడాగానే క్యాచ్ వదిలేశాడన్న సంగతి గుర్తొచ్చినట్టుంది. చదవండి: Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ అంతే.. అందరూ చూస్తుండగానే హారిస్.. కమ్రాన్ గులామ్‌పై చేయి చేసుకొని పక్కకు నెట్టేశాడు. అయితే కమ్రాన్ దీనిని సీరియస్‌గా తీసుకోకుండా అభినందించగా.. హారిస్ మాత్రం అతన్ని సీరియస్‌గానే చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉద్దేశపూర్వకంగానే హారిస్ రౌఫ్ తోటి ఆటగాడిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పీసీబీ హారిస్‌పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా రావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 158 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక సూపర్ ఓవర్లో పెషావర్ జాల్మీ విజయం సాధించింది. చదవండి: 2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్ 2022) అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అలెక్స్ హేల్స్, పాల్ స్ట్రింగ్‌లు వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కాగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ ఆర్దికపరమైన సమస్యలతో లీగ్ నుంచి అర్థంతరంగా వైదొలిగాడు. తనకు ఇస్తానన్న డబ్బులు మొత్తం ఇవ్వకుండా మ్యాచ్‌లు ఆడించిందని.. పీఎస్ఎల్లో అంతా అవినీతే జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే పీసీబీ ఫాల్కనర్ వార్తల్లో నిజం లేదంటూ కొట్టిపారేసింది. Wreck-it-Rauf gets Haris! #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/wwczV5GliZ — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 -
వైరల్ వీడియో: స్టేజీపైనే ఆటగాడి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ
రాంచీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ బహిరంగంగా ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించారు. స్టేజ్‌పైనే ఆటగాడికి రెండు చెంపలు వాయించడంతో వేదికపై ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో చోటుచేసుకుంది. షహీద్ గణ్‌పత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీ భూషణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ యువకుడికి15 ఏళ్లు దాటడంతో అండర్ -15 ఈవెంట్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతించాలని స్టేజ్ మీదకు వెళ్లి ఎంపీ సింగ్‌ను పదే పదే ఇబ్బంది పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ వేదికపై ఉన్న రెజ్లర్‌ను అందరిముందే చెంప దెబ్బ కొట్టాడు. యువ రెజ్లర్ వేదిక నుంచి కిందకు దిగుతుండగా రెండు సార్లు అతనిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటగాడిపై ఎంపీ చేయి చేసుకోవడంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎంపీ సింగ్ ప్రస్తుతం లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. BJP सांसद व भारतीय कुश्ती संघ के अध्यक्ष बृजभूषण शरण सिंह ने रांची में अंडर-15 नेशनल कुश्ती चैंपियनशिप के दौरान मंच पर एक युवा पहलवान को थप्पड़ जड़ दिया। वीडियो वायरल… pic.twitter.com/Tlm6LpXSHG — Ashraf Hussain (@AshrafFem) December 17, 2021 -
జై భీమ్ హిట్ టాక్: ఆ సీన్‌పై దుమారం
సాక్షి, హైదరాబాద్: అమాయకులపై కొందరు పోలీసులు, ముఖ్యంగా దొంగలుగా దళితులపై ముద్ర వేస్తూ పోలీసులు అక్రమ కేసులు, వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిన జై భీమ్ ఓటీటీలో హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళనాడులోని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సూర్య చంద్రు పాత్రలో జీవించారు. అయితే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ మూవీలోని ఒక సీన్‌పై వివాదం నడుస్తోంది. హిందీలో మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్ రాజ్ 'చెంపదెబ్బ' సన్నివేశం చర్చకు దారి తీసింది. హిందీలో మాట్లాడినందుకే అలా అతగాడి చెంప చెళ్లుమనిపించాడని సోషల్‌మీడియాలో కొంతమంది విమర్శలకు దిగారు. అయితే నిర్దిష్ట పాత్ర (రైస్ మిల్లు యజమాని) జరిగిన నేరంలోని నిజాల్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహం తెలిసి హిందీలో మాట్లాడుతున్న ఆ పాత్రను అలా కొట్టాడు తప్ప, హిందీ మాట్లాడే ఇండియన్స్‌కు వ్యతిరేకంగా కాదు, తమిళ చిత్ర నిర్మాతలు హిందీ భాషకు వ్యతిరేకం కాదని కొంతమంది స్పందిస్తున్నారు. హిందీలో మాట్లాడినందుకు చెప్పుతో కొట్టడానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు సూర్య, జ్యోతిక దంపతులు. నవంబరు 2, మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. பணம் சம்பாதிக்க எல்லா மொழியிலும் படம் எடுப்பாணாம் இங்க இருக்குற குழந்தைகள் மட்டும் வேற மொழி படிக்க கூடாதாம் 😠#ஜெய்பீம் தமிழ் பதிப்பு ~என்னை ஏன் அடிக்கிறாய்? ~தமிழில் பேசுங்கள் #ஜெய்பீம் ஹிந்தி பதிப்பு ~என்னை ஏன் அறைந்தாய்? ~இப்போது உண்மையைச் சொல்.. #FraudsOfSurya pic.twitter.com/FXD2ve7dCW — Karthikeyan S 🚩🇮🇳ௐ🕉️🌷 (@karthikbjpkarur) November 2, 2021 He uses Hindi to obfuscate the truth about his involvement in a crime. He collaborates with Tamil criminals. This has nothing to do with being slapped for speaking in Hindi. https://t.co/vp5zPNAuGU — Udhav Naig (@udhavn) November 2, 2021 Hi, the scene is not against Hindi-speaking Indians. The particular character tries to get away by speaking in Hindi (so that Prakash Raj wouldn't understand) and knowing this strategy, he slaps and asks him to speak in Tamil.Tamil filmmakers are not against the language Hindi1/2 — Rajasekar (@sekartweets) November 2, 2021 -
యువతిని కొట్టిన పోలీస్
-
యువతిని కొట్టిన పోలీస్, సీఎం ఆగ్రహం
రాంచీ: పోలీసులు అంటే ప్రజలని రక్షించే వారు. అందుకే వారిని రక్షక భటులు అంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం కొంత మంది పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉంటారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతుంటారు. అలా రెచ్చిపోతే ఏం జరుగుతుందో జార్ఖండ్‌లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. నడిరోడ్డుపై ఓ యువతి చెంపను చెళ్లుమనిపించడంతో పాటు, ఆమె జుట్టు పట్టుకుని లాగిన ఓ పోలీసు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రే స్పందించి, ఆ పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటన జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డుపై బందోబస్తులో ఉన్న ఓ పోలీసు, ఆ దారిలో వచ్చిన ఓ యువతిని ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. ఆపై చెంపమీద ఒక్కటిచ్చాడు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకుని మరీ లాగాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా అది సోషల్ మీడియాకు చేరడంతో వైరల్‌గా మారింది. సదరు పోలీసు తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో కాస్త జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లగా, దాన్ని చూసిన ఆయన, రాష్ట్ర డీజీపీ ఎమ్ వీ రావుకు ట్యాగ్ చేస్తూ, వీడియోను షేర్ చేశారు. ఇటువంటి నీచమైన, అనుచిత ప్రవర్తనలను ఎంత మాత్రం భరించరాదని ట్వీట్ చేశారు. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సదరు పోలీసును సస్పెండ్ చేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: 11 మంది పోలీసులకు జీవిత ఖైదు -
ఏడుసార్లు చెంపదెబ్బ తిన్నా
ఆర్టిస్టుల తప్పిదం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, దర్శకుడు సంతృప్తి చెందకపోవడం వల్లో కొన్నిసార్లు చేసిన సన్నివేశాన్నే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. ‘తప్పడ్’ సినిమా షూటింగ్లో అలాంటి సందర్భమే ఒకటి ఎదురైందట తాప్సీకి. ఒక సన్నివేశం కోసం ఆమె సుమారు ఏడుసార్లు చెంపదెబ్బ తిన్సాలి వచ్చిందట. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తాప్సీ నటించిన తాజా చిత్రం ‘తప్పడ్’ (చెంపదెబ్బ అని అర్థం). ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తాప్సీ చెంపదెబ్బ తినాలి. సినిమాలో చాలా కీలకమైన సన్నివేశం అది. కథను మలుపు తిప్పే చెంపదెబ్బ అది. కరెక్ట్‌గా రావడం కోసం సుమారు ఏడు టేక్‌లు చేశారట తాప్సీ, నటుడు పావైల్ గులాటీ. అంటే... ఏడుసార్లు చెంప దెబ్బ తిన్నారట తాప్సీ. ‘‘చెంపదెబ్బ కొట్టడానికి నా కోస్టార్ పావైల్ సంకోచించారు. చాలా టెన్షన్ పడ్డారు. ఆరు టేక్‌లు పూర్తయ్యాయి. సరిగ్గా రావడం లేదు. ‘ఏం ఆలోచించకు. లాగిపెట్టి కొట్టేయ్’ అన్నాను. ఏడో టేక్ సరిగ్గా వచ్చింది’’ అని ఆ సీన్ తీయడానికి వెనక జరిగిన స్టోరీ చెప్పారు తాప్సీ. ‘తప్పడ్’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. -
చెంప దెబ్బల ఛాంపియన్ షిప్
-
చెంపదెబ్బలను తట్టుకునే సామర్థ్యం ఉంటే చాలు..
వినడానిక వింతగా ఉన్నా చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమేనండి. చెంపదెబ్బలకూ ఒక ఛాంపియన్షిప్ ఉంది. అన్ని ఆటల పోటిల్లానే దీనికి రూల్స్ ఉంటాయి. గెలిచిన వారికి బహుమతులుంటాయి. విజేతలు పొందే బహుమతులు కూడా చిన్నవేం కాదు. వేల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. మూడే మూడు చెంపదెబ్బలు నిర్ణయిస్తాయి. ఓడెదెవెరో గెలిచేదెవరో. మరి ఈ ఛాంపియన్షిప్ విశేషాలేంటో తెలుసుకుందామా..తల్లిదండ్రులైన, సోదరులైనా, స్నేహితులైనా, బంధువులైనా....చెంప మీద ఒక్క దెబ్బ కొడితే చాలు ఎవరికైనా కోపం నషాళానికంటుతుంది. ముక్కూ మొహం తెలియనివారైతే ఇంక చెప్పేందుకేముంది. మరుక్షణం వాళ్ల చెంపకూడా ఛెళ్లుమంటుంది. కానీ రష్యాలో నిర్వహించే చెంపదెబ్బల పోటీలో మాత్రం ఎదుటివాళ్లు చెంపమీద చాచిపెట్టికొట్టినా, బాధనీ, కోపాన్నీ పంటిబిగువున ఒత్తిపెట్టి అలాగే నిలబడాలి. అలా నిలబడిగలిగినవాళ్లే ఈ టోర్నమెంట్ విజేతలుగా నిలిచి ఔరా అనిపించుకుని ఆశ్చర్యపరుస్తారు. వారాంతాల్లో ఆటవిడుపు ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారంటే ఎవరైనా ఏంచేస్తారు?వాళ్ళెవరో తమకు తెలీకపోయినా తలా ఓ పక్క చేరి నచ్చజెప్పేందుకు, సమాధానపరిచేందుకు ప్రయత్నిస్తారు. రష్యా ప్రజలు మాత్రం ఎదురుగా ఇద్దరు వ్యక్తులు చెంపలు వాయించుకుంటుంటే సరదాగా తలా ఒక్కరిని బలపరుస్తూ వారి అభిమాన పోటీదారుణ్ణి ఈలలతో, చప్పట్లతో ఉత్సాహపరుస్తారు. వారాంతపు రోజుల్లో ఆటవిడుపుకోసం ఇలా చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌ని నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వింత టోర్నీ రష్యాలోని క్రాస్నోయార్క్ పట్టణంలో నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి వారాంతపు రోజుల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. టోర్నమెంట్ అనేసరికి కంగారు పడుతుంటారు. చాలామంది పోటీదారులు. కానీ ఈ టోర్నీ మాత్రం వాటన్నింటికీ భిన్నం. పెద్దగా కసరత్తు చేయాల్సిన పని ఉండదు. ప్రత్యర్థిని చాచికొట్టేందుకు చేతుల్లో బలం, ప్రత్యర్థి కొంటే చెంపదెబ్బలను తట్టుకునే సామర్థ్యం ఉంటే చాలు, ఎవరైనా విజేతలుగా నిలవచ్చు. ఈ టోర్నమెంట్లో పాల్గొని, తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. పోటీదారులు. సైబీరియన్ పవర్ షో స్పోర్ట్స్ ఫెస్టివల్లో భాగంగా ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఏదైనా కొత్తగా వింతగా ఏ ఆట అయినా ఆడినకొద్దీ, చూసినకొద్దీ ఎప్పుడో ఒకప్పుడు బోర్‌గా అనిపిస్తుంది. ఏదైనా కాస్త భిన్నంగా ఉండేదాన్ని ఆదరిస్తారు అందరూ. అందుకే ఈ ఛాంపియన్షిప్ నిర్వాహకులు కొత్తగా జనాలను ఆకర్షించేందుకు ఏంచేయాలా అని చర్చించగా స్ఫురించిందే చెంపదెబ్బలాట. బాక్సింగ్ రింగ్‌లో ఒకరినొకరు కొట్టుకోవడం మాములే. కానీ కేవలం చెంపదెబ్బలు మాత్రమే అయితే కొత్తదనం. అందుకే రష్యాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ వింత టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఎలా కొనసాగుతుందంటే వేదిక మీద ఓ టేబుల్ ఉంటుంది. దానికి చెరో పక్క ఇద్దరు పోటీదారులు నిల్చుంటారు. ఓ కామెంటేటర్ కమ్ అంపైర్ ఉంటారు. ఈ పోటీదారులు ఇద్దరూ పరస్పరం ఒకరి చెంపను ఒకరు పగులుగొట్టాల్సి ఉంటుంది. ఎంత గట్టిగా కొట్టగలిగితే అంతగా టైటిల్‌కు చేరువవుతారు. మూడు సార్లు మాత్రమే ఛాన్స్ ఈ మూడు ఛాన్స్‌లో ఎదురుగా ఉన్న వారి చెంపను పగులుగొట్టాల్సి ఉంటుంది. ఈ మూడు చెంపదెబ్బలతో ప్రత్యర్థిని పడగొట్టేయాల్సిందే. అలా చేసిన పోటీదారుడిని విజేతగా ప్రకటిస్తారు. ఓడినా, గెలిచినా ఈ పోటీలో పాల్గొన్న అందరి గాయాలకీ ఉచితంగానే వైద్యం అందిస్తారు. ఒక్కరోజులో సెలెబ్రిటీ! సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఒక్కరోజులో ఎంతోమంది సెలెబ్రెటీలుగా మారిపోతున్నారు. పక్కింటివాళ్లకి కూడా తెలియనివాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు. అదేవిధంగా ఈ చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి వాసిలీ కామోట్క్సీ అనే 28 ఏళ్ల వ్యక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఇందులో గెలిచినందున బహుమతిగా రష్యన్ కరెన్సీలో ముప్పె వేల రూబుళ్లు అనగా మన రూపాయల్లో ముప్పైరెండు వేలను సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ టోర్నమెంట్ వీడియోలు వైరల అవడంతో ఓవర్ నైట్ స్టారయ్యాడు వాసలీ. రూల్స్ నచ్చట్లేదట! ఈ వింత పోటీగురించి సోషల్ మీడియాలో చర్చబాగానే జరుగుతోంది. ఈ ఆట రూల్స్ అందరికీ నచ్చడంలేదు. ఇంతకీ ఆ రూల్సేంటంటే ..ఇద్దరు పోటీదారులు మూడుసార్లు ఒకరి చెంప ఒకరు వాయించుకోవాలి. ఈ మూడుసార్లలో కిందపడినా, తట్టుకోలేక తుళ్లిపడినా ఎదుటివ్యక్తి గెలిచినట్టే. కొట్టడానికీ రూల్ ఉంది. కొట్టేటప్పుడు చేతివేళ్లతో పాటు కొంత మాత్రమే అరచేతిని ఉపయోగించాలి. పూర్తిగా అరచేతితో కొట్టకూడదు. అయితే ఈ సంవత్సరం విజేతగా నిలిచిన వాసిలీ బరువు 168 కిలోలు. అతని బరువే అతణ్ణి విజేతను చేసిందని కొందరి అభిప్రాయం. అన్ని ఆటల్లోలానే ఇందులోనూ బరువు కేటగిరీలు ఉంటే మరింత బాగుంటుందని కొంతమంది సలహా. -
‘అందుకే హార్దిక్ చెంప చెళ్లుమనిపించా’
అహ్మదాబాద్: ‘పటీదార్ ఉద్యమం నడుస్తున్నపుడు నా భార్య గర్భవతి. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాను. ఆ సమయంలో పటీదార్ ఉద్యమం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. హార్దిక్ పటేల్‌పై దాడి చేయాలని అప్పుడే అనుకున్నాను. ఎలాగైనా అతడికి తగిన గుణపాఠం చెప్పాలని గట్టిగా భావించాను’.. ఇవి హార్దిక్ పటేల్‌ను చెంప దెబ్బ కొట్టిన తరుణ్ గజ్జర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో శుక్రవారం ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా హార్దిక్ పటేల్‌పై తరుణ్ గజ్జర్ హఠాత్తుగా దాడి చేశాడు. ఊహించని పరిణామంతో హార్దిక్ బిత్తరపోయారు. దాడికి పాల్పడిన తరుణ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకుపోయారు. గాయాలపాలైన అతడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హార్దిక్ పటేల్‌పై దాడి చేయడానికి గల కారణాలను మీడియాకు వివరించాడు. తరుణ్ గజ్జర్ సామాన్య పౌరుడని, అతడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సురేంద్రనగర్ ఎస్పీ మహేంద్ర బాఘేదియా తెలిపారు. చట్టప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: హార్దిక్ పటేల్ చెంప చెళ్లు!) -
పోలీసులు చూస్తుండగానే..
-
పోలీసులు చూస్తుండగానే మరో దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ఓ ముస్లిం యువకుడి ఇంటికి వెళ్లిందన్న కారణంగా పోలీసు జీపులో ఓ మహిళా పోలీసు, 20 ఏళ్ల విద్యార్థినిని పట్టుకొని చెంప చెళ్లుమనిపించడం, ‘నీ చుట్టూరా ఎంతో మంది హిందువులుంటే నీకో ముస్లిం యువకుడే కావాల్సి వచ్చిందే’ అంటూ పక్కనే ఉన్న మరో మహిళా పోలీసు వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు జీపులో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీడియోను రికార్డు చేసినట్లు భావిస్తున్న హోం గార్డుపై యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మీరట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీకి చెందిన నర్సింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, తనతోపాటే చదువుతున్న 22 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఉంటున్న జాగృతి విహార్‌కు ఆదివారం నాడు వెళ్లింది. జాగృతి విహార్, వారు చదువుతున్న నర్సింగ్ కాలేజీకి ఎదురుగానే ఉంది. మీరట్ వైద్య యూనివర్శిటీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఆ జాగృతి విహార్లోనే ఉంటారు. అందులో కిరాయి తీసుకొని ఉంటున్న ముస్లిం యువకుడి వద్దకు ఆ విద్యార్థిని వెళ్లడం గమనించిన స్థానికులు విశ్వ హిందూ పరిషత్‌కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి ఆ జంటను పట్టుకొని కొట్టారు. ఈ విషయాన్ని ఎవరో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా, మహిళా పోలీసులు వచ్చి మహిళను రక్షించి జీపులో తీసుకెళ్లారు. తాము జాగృతి విహార్‌పై దాడి చేసినప్పుడు ఆ యువ జంట ప్రేమించుకుంటున్నారని, వారిని హెచ్చరించి పోలీసులకు అప్పగించామని, వారిపై చేయి చేసుకోలేదని వీహెచ్‌పీ స్థానిక నాయకుడు బలరాజ్ దూంగర్ తెలిపారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి హెపూర్‌లో ఉంటున్న విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు వీహెచ్‌పీ కార్యకర్తలు వెళ్లి, ముస్లిం యువకుడిపై కేసు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. వారు క్లాస్మేట్స్ మాత్రమేనని, వారి మధ్య మరెలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి తండ్రి చెబుతూ వస్తున్నారు. బుధవారం రాత్రి వరకు విద్యార్థిని తండ్రి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే విద్యార్థినిగానీ, ముస్లిం యువకుడుగానీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆదివారం ఈ సంఘటన జరిగిన నాటి నుంచి నర్సింగ్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సంఘటనపై కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ శర్మను మీడియా ప్రశ్నించగా, తమది కో ఎడ్యుకేషన్ కాలేజని, విద్యార్థిని, ముస్లిం యువకుడు క్లాస్మేట్స్ అని తెలిపారు. నర్సింగ్ కాలేజీ అవడం వల్ల ల్యాబుల్లో కూడా ఆడ, మగ కలిసే పనిచేయాల్సి వస్తుందని, కలుసుకోవద్దని, పరిచయాలు పెంచుకోవద్దని వారికి తాము చెప్పలేమని అన్నారు. త్వరలోనే వారిద్దరు మళ్లీ కళాశాలకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. యూనివర్శిటీలో హిందూత్వ సంస్థల ఉనికి పెరిగినప్పటి నుంచి అశాంతి పరిస్థితులు పెరుగుతున్నాయని అధ్యాపకులు తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించడం శోచనీయమని, అందుకే మహిళా పోలీసులపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని సబ్ ఇనిస్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మరో వీడియో బయటకు వచ్చింది. పోలీసుల సమక్షంలోనే ముస్లిం యువకుడిపై గూండాలు దాడి చేసిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి చర్యలను సహించబోమని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని యూపీ డీజీపీ ట్వీట్ చేశారు. -
లైవ్ షోలో మహిళపై మౌలానా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌పై ఓ న్యూస్ చానెల్ చేపట్టిన చర్చ తీవ్ర గొడవకు దారితీసింది. ప్రత్యక్ష ప్రసారంలో విచక్షణ కోల్పోయిన ఓ ప్రతినిధి.. ఏకంగా మహిళా లాయర్‌పై చేయి చేసుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగానే మహిళపై దాడి చేసిన సదరు ప్రతినిధిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు పొందాలనే అంశం అసలు ఖురాన్లో లేనేలేదని ఓ మహిళ న్యాయవాది వాదించగా.. సహనం కోల్పోయిన ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఆమెపై దాడి చేశాడు. ట్రిపుల్ తలాక్ అంశంపై ఓ టీవీ ఛానల్ మంగళవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. లైవ్‌గా ప్రసారమైన ఈ చర్చలో భాగంలో సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరాహ్ ఫైజ్ మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందడం ఖురాన్లో లేదని, ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు విరుద్ధమని వ్యాఖ్యనించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలానా ఇజా అర్షద్ ఖ్వాసి.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఖ్వాసి ఆమెపై అసభ్య పదాజాలంతో లైవ్ షోలోనే దాడికి దిగారు. ఫరాహ్ గత కొంతకాలంగా ముస్లిం మహిళల తరఫున ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. టీవీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎఐఎంపీఎల్బీ సభ్యుడు మహిళ న్యాయవాదిపై దాడి చేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. A Maulana Amir Kasmi who is a member of AIMPLB hit a woman on a live TV debate. If he does ths on TV, imagine what these people would be doing behind closed doors. The Maulana even used abusive words for women on the panel... Shamefull !!!!#MaulanaSlapsWoman #TalkToAMuslim pic.twitter.com/wXs8fcJqPD — Sourish Mukherjee (@me_sourish) July 17, 2018 -
మంత్రిపై చేయిచేసుకున్న మరో మంత్రి
జైపూర్ : ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్నానీతో చర్చించేందుకు శుక్రవారం బన్షీధర్ బజియా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన బజియా మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందింయేందుకు దేవ్నానీ నిరాకరించగా, బజియా మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. మరో వైపు ఈ ఘటనపై బీజేపీ మీడియా విభాగం ఇంఛార్జి అనంద్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో ఇరు మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. తాజా అంశంపై వసుంధర రాజే ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు సంధిస్తోంది. -
సరదాగా మొదలై..చివరకు ప్రాణం తీసేసింది
-
ప్రాణం తీసిన చెంప దెబ్బలు
లాహోర్ : సరదాగా మొదలైన ఆట.. చివరకు ఓ విద్యార్థి ప్రాణం తీసేసింది. పాకిస్థాన్ పంజాబ్ ప్రొవిన్స్‌లోని మియాన్ ఛన్ను ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ విరామ సమయంలో ఆరో తరగతి చదువుతున్న బిలాల్, అమీర్ అనే ఇద్దరు విద్యార్థులు తప్పర్ కబడ్డీ(చెంప దెబ్బల ఆట.. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఆట ప్రాచుర్యంలో పొందింది)కి సిద్ధమయ్యారు. టీచర్లు, విద్యార్థుల సమక్షంలో వారు దెబ్బల వర్షం కురిపించుకున్నారు. అమీర్ దెబ్బలకి తాళలేక బిలాల్ కుప్పకూలిపోగా.. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకుని కొన ఊపిరితో ఉన్న బిలాల్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే మెడపై బలమైన దెబ్బలు పడి.. నరాలు చిట్లిపోయాయని, ఆలస్యంగా తీసుకురావటం వల్లే అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన బిలాల్ తల్లిదండ్రులు తమ కొడుకు చావు దైవాజ్ఞ అని చెప్పటం గమనార్హం. ఈ ఘటన ఈ నెల మొదట్లో చోటుచేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి గత రెండు రోజులుగా కొన్ని మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
బాలికకు చెంపదెబ్బ.. మహిళానేతపై కేసు
-
బాలికకు చెంపదెబ్బ.. మహిళానేతపై కేసు
అలీఘడ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చున్న బాలికను కొట్టిన కేసులో స్థానిక బీజేపీ మహిళా విభాగం నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తండ్రి సవేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ మహిళా నేత సంగీత వర్షిణిపై గాంధీపార్క్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తన కుమార్తెపై అందరూ చూస్తుండగా చేయి చేసుకోవడంతో తమ ప్రతిష్ట దెబ్బతిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ పేరుతో మోరల్ పోలీసింగ్ చేయడం, బెదిరింపులకు దిగే వారిపై చర్య తీసుకోవాలన్నారు. సంగీతపై ఐపీసీ సెక్షన్ 323, 504 కింద కేసు నమోదు చేసినట్టు గాంధీపార్క్ పోలీసుస్టేషన్ సీఐ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చొని ఉందనే నెపంతో బాలికపై సంగీత వర్షిణి బహిరంగంగా చేయిచేసుకుంది. ‘హిందువు ఎవరో, ముస్లిం ఎవరో తెలుసుకోకుండానే ప్రేమిస్తావా. నేను మర్యాదగా చెప్పినా వినవా’ అంటూ బాలికను ఆమె హెచ్చరించింది. చేయి కూడా చేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి కెమెరాతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది సంచలనంగా మారింది. సంగీత వర్షిణి చర్యపై మహిళా హక్కుల పరిరక్షణ సంఘం కార్యకర్త కల్పనా గుప్తా మండిపడ్డారు. -
ఉద్యోగి చెంపచెళ్లుమనిపించిన మంత్రి తండ్రి
ముంబై : మహారాష్ట్ర మంత్రి రంజిత్ పాటిల్ తండ్రి వీఎన్ పాటిల్ ఓ స్కూల్ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపచెళ్లుమనిపించారు. స్కూల్ తనిఖీ చేయడానికి వచ్చానని చెప్పి ఉద్యోగి పైచేయి చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీఎన్ పాటిల్ గతంలో శాసనమండలి సభ్యులుగా కూడా చేశారు. ఈ సంఘటన అకోలా జిల్లాలోని మూర్తిజాపుర్లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. వీఎన్ పాటిల్‌కు చెందిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ స్కూల్ ఉంది. అదే మండలపరిధిలోని మరో స్కూల్లో విద్యార్థులను ఎక్కువగా ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారని స్కూల్ సిబ్బందిపై వీఎన్ పాటిల్ మండిపడ్డట్టు సమాచారం. అదే సమయంలో తనను అసభ్యపదజాలంతో తిడుతూ చేయిచేసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రంజిత్ పాటిల్ చెప్పారు. అయితే తన తండ్రి ఎవరినీ కొట్టలేదని తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటికొస్తాయన్నారు. -
తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత
-
తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుపై ఉద్యోగులు చేయిచేసుకున్నారు. అతడిని సీట్లో నుంచి బయటకు లాక్కొచ్చి ఆందోళన చేశారు. అవినీతికి పాల్పడటమే కాకుండా తమను వేధిస్తున్నాడని, అటెండర్ నుంచి పై స్థాయి ఉద్యోగులపైనా అతడి వేధింపులు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. సర్వీసులు, సెలవులకు సంబంధించి కూడా ఆయన వేధిస్తున్నాడని చెప్పారు. గత కొద్ది రోజులుగా పద్దతి మార్చుకోవాలని చెబుతున్నా అతడు తీరు మార్చుకోకపోవడంతో తాము నేడు చేయిచేసుకున్నామని వారు అంటున్నారు. అయితే, ఉద్యోగుల విభజన అంశమే వివాదానికి దారి తీసిందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. శ్రీనివాసరావుది ఆంధ్రప్రదేశ్ స్థానికత అని చెప్తున్నారు. -
కలెక్టర్ చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే
-
డిప్యూటీ కలెక్టర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే
ముంబయి: మహారాష్ట్రలో ఓ ప్రజా ప్రతినిధి డిప్యూటీ కలెక్టర్‌పై చేయి చేసుకున్నాడు. ఆయన చెంప చెల్లు మనిపించారు. ఓ ఆయిల్ పైప్ లైన్ వేయడంతో భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయమై డిప్యూటీ కలెక్టర్ అభయ్ కల్ గుద్కర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్ లాడ్ హాజరయ్యారు. ఇదే సమయంలో నష్టపరిహారం అంశంపై చర్చిస్తుండగా వాదోపవాదాలు తలెత్తాయి. భూమికి నష్టంగా భూమే ఇవ్వాలని పలువురు రైతులు పట్టుబట్టారు. ఈ క్రమంలో తోపులాట జరగగా అదే సమావేశంలో ఉన్న సురేశ్ లాడ్ గబాల్లున లేచి డిప్యూటీ కలెక్టర్, మరో అధికారిని చొక్కాలు పట్టి దగ్గరకు లాగి గట్టిగా చెంపలు వాయించాడు. అయితే, దీనిపై సదరు అధికారిగానీ, ఇతర అధికారులుగానీ ఫిర్యాదు చేయలేదు. కాగా, ఈ ఘటనపై స్పందన కోరగా సురేశ్ లాడ్ కొట్టిపారేశారు. -
చెంప దెబ్బకు అయిదు లక్షలు
ముంబై: బాలీవుడ్ నటుడు గోవింద 2008లో ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన కేసు తీర్పును సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించింది. బాధితుడు సంతోష్ రాయ్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాను దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సంతోష్ రాయ్ ని కలిసి ముఖాముఖిగా క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం గోవిందాకు రెండు వారాల గడువు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే... 2008లో ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్‌లో 'మనీ హైతో హానీ హై' అనే సినిమా షూటింగ్ సందర్భంగా సంతోష్ రాయ్ అనే వ్యక్తి చెంపను గోవిందా చెళ్లుమనిపించాడు. ఒక పాట చిత్రీకరణ సందర్భంగా అనుమతి లేకుండా స్పాట్ లోకి చొచ్చుకు రావడం, అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆగ్రహంతో గోవిందా అతనిపై చేయి చేసుకున్నట్టు సమాచారం. దీంతో గోవిందా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను ఐదారు లక్షలను ఖర్చు చేశానని సంతోష్ రాయ్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో ఉన్నత ధర్మాసనం సంతోష్ రాయ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంతోష్ రాయ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాకు ఆదేశాలు జారీ చేసింది. -
మంత్రికి చెంపదెబ్బ : సింగ్‌కి ఘన సత్కారం
అమృతసర్ : పంజాబ్ పంచాయితీ శాఖ మంత్రి సికిందర్ సింగ్‌ని చెంపదెబ్బ కొట్టి సంచలనం సృష్టించిన జర్నైల్ సింగ్ (55)ని రాడికల్ సిక్కు గ్రూప్ శిరోమణి అకాలీ దళ్ (అమృతసర్) ఘనంగా సన్మానించింది. శుక్రవారం అమృతసర్‌లో జర్నైల్ సింగ్ నివాసానికి ఆ సంస్థ ప్రతినిధులు చేరుకున్నారు. అనంతరం జర్నైల్ సింగ్‌కు రూ. 2.20 లక్షల నగదు చెక్కును అందజేశారు. ఆ తర్వాత ఆ సంస్థ అధ్యక్షుడు సిమ్రజిత్ సింగ్ మాన్ మాట్లాడుతూ... మంత్రి సికిందర్‌ను ప్రశ్నించడమే కాకుండా చెంపదెబ్బ కొట్టిన జర్నైల్ సింగ్ నిజమైన సిక్కు అని అభివర్ణించారు. జర్నైల్ సింగ్ ధైర్యవంతుడు అని పేర్కొన్నారు. రాజకీయాల కోసం అధికారంలోని అకాలీ దళ్ (బాదల్) పార్టీ మతాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. అమాయక ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆ పార్టీని సిమ్రజిత్ సింగ్ విమర్శించారు. నవంబర్ 20వ తేదీన బటిండాలోని హమిగఢ్ గ్రామంలో అకాలీ దళ్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పంజాబ్ పంచాయితీ శాఖ మంత్రి సికిందర్ సింగ్ ముల్కా పాల్గొన్నారు. అయితే ఆయన్ని జర్నైల్ సింగ్ చెంప దెబ్బ కొట్టాడు. దాంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జర్నైల్ సింగ్‌పై చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అతడిని పోలీసులు ఫరీద్ కోట్ ఆసుపత్రికి తరలించారు. కాగా జర్నైల్ సింగ్‌పై ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సీబీఐకు అప్పగించింది. జర్నైల్ సింగ్ మాత్రం ఈ కేసులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వృద్ధ దంపతులపై అమానుష దాడి
చండీగఢ్: పంజాబ్ లోని చండీఘఢ్ లో మొబైల్ షాపు యజమానులపై ఓ యువకుడు దారుణంగా దాడిచేశాడు. సుమారు 60 ఏళ్లకుపై బడ్డ భార్యాభర్తలపై వృద్ధులన్న కనికరం లేకుండా విరుచుకుపడి పిడి గుద్దులు కురిపించాడు. ఈ అమానుష దాడి కెమెరా కంటికి చిక్కింది. తను కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ విషయంలో ఆవేశానికి లోనయ్యాడా యువకుడు. దంపతులతో వాగ్వాదానికి దిగి, దాడికి పాల్పడ్డాడు. సమయానికి వీరి కుమారుడు షాపులో లేకపోవడంతో మరింత రెచ్చి పోయి దాడి చేశాడు. ఇరువురిపైనా విచక్షణా రహితంగా పదే పదే దాడి చేస్తోంటే చుట్టుపక్కల ఉన్నవారెవరూ పట్టించుకోలేదు. భర్తపై అమానుషగా దాడి చేస్తోంటే... రోదిస్తూ రక్షణగా ఆ పెద్దావిడ నిలబడ్డం స్పష్టంగా రికార్డయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు చెప్పారు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో వృద్ధ దంపతుల్లో భర్తకి చేయి విరగ్గా, భార్యకు గాయాలయ్యాయని తెలిపారు. -
డబ్బులిచ్చి.. చెంపదెబ్బలు తిన్నాడు..
నవ్వుతూ చెంప వాయించేందుకు చేయి లేపిన ఈ అమ్మాయి ఉద్యోగి. అతను బాస్. అవును.. ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా చెంపదెబ్బ కొట్టేందుకే ఆమెను ఉద్యోగంలో పెట్టుకున్నాడు మనీశ్ సేథీ అనే ఈ భారతీయ అమెరికన్. కొన్నాళ్లు చెంపదెబ్బలు తిన్నతర్వాత ఈయన ఫేస్‌బుక్‌ను అతిగావాడే అలవాటును మానుకున్నాడట కూడా. రెండేళ్ల క్రితం ఈ సంగతి తెలిసి ఇంటర్నెట్లో ఈయన తెగ పాపులర్ కూడా అయిపోయారు. అయితే మనుషులకు కాస్త హెచ్చరికగా కొట్టడం లేదా షాక్లివ్వడం చేస్తే కొన్నాళ్లకు అలవాట్లను మార్చుకుంటారని సేథీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడట. అందుకే.. ఇప్పుడు షాక్‌లిస్తూ మనుషుల్ని దారిలోపెట్టే సరికొత్త రిస్ట్‌బ్యాండ్‌ను తయారుచేశారు. పొద్దున్నే వాకింగ్‌కు వెళ్లాలనుకుని.. తీరా అలారం మోగేసరికి దాని బటన్ నొక్కేసి ముసుగుతన్నేసే వారిని ‘పావ్లోక్’ అనే ఈ రిస్ట్‌బ్యాండ్ షాక్‌లిచ్చి మరీ నిద్రలేపుతుందట. తొలుత రెండుసార్లు వైబ్రేషన్లు ఇచ్చిన తర్వాత ఇది షాక్ కొడుతుందట. బద్దకిస్టులు, ఫేస్బుక్, ఇతర సైట్లను ఎక్కువగా చూసేవారు దీనిని ధరిస్తే షాక్‌లిస్తూ దారికి తెస్తుందట. వివిధ అలవాట్లు, ఇతర సమాచారాన్ని మొబైల్ యాప్‌లో నిక్షిప్తంచేస్తే.. దానికి అనుగుణంగా ఈ బ్రేస్లెట్ పనిచేస్తుందంటున్నారు. సుమారు రూ.15 వేల ఖరీదైన ఈ చేతిపట్టీ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. -
చెంప చెళ్లుమనిపించిన నగ్మా
హీరోయిన్లు బయట అడుగు పెడితే....... అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆ హీరోయిన్లే రాజకీయాల్లోకి వచ్చి ప్రచార రంగంలోకి దూకితే జనాభిమానికి హద్దే ఉండదు. అయితే ఒక్కోసారి ఈ అభిమానం వెర్రితలలు వేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రముఖ సినీ నటి నగ్మా విషయంలో అదే జరిగింది. ఇటీవలి కాంగ్రెస్‌లో చేరి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న నగ్మాకు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నామినేషన్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను మరిచిపోకముందే నగ్మాకు మరో చేదు అనుభవం ఎదురైంది. మీరట్‌లో ప్రచారానికి వచ్చిన నగ్మా పట్ల కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. నగ్మా చుట్టూ చేరిన అల్లరిమూక ఆమెను అడ్డుకుంది. ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూ విపరీత చేష్టలకు పాల్పడింది. ఈ చర్యలతో నివ్వెరపోయిన నగ్మా... అల్లరి మూకపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ఆకతాయి యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆమె తన చేతికి పనిచెప్పింది. అందరి ముందే నగ్మా అతగాడి చెంప చెళ్లుమనిపించింది. ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా నివ్వెరబోయారు. స్థానిక పెద్దల జోక్యంతో అక్కడి నుంచి బయటపడిన నగ్మా... అనంతరం ప్రచారం సాగించింది. -
హాంగ్‌కాంగ్ నడిరోడ్డు పై లవర్స్ గొడవ