Suriya Jai Bhim Movie: Prakash Raj Slapping Scene Creates Controversy - Sakshi
Sakshi News home page

Prakash Raj Slapping Scene: దుమారం రేపుతున్న ‘చెంపదెబ్బ’ సీన్‌

Published Wed, Nov 3 2021 5:04 PM | Last Updated on Wed, Nov 3 2021 6:24 PM

Prakash Raj slapping scene from Suriya Jai Bhim sparks debate - Sakshi

తమిళనాడులోని  రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జై భీమ్‌  మూవీలోని  విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ ఒక  సీన్‌పై  వివాదం  నడుస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: అమాయకులపై  కొందరు పోలీసులు, ముఖ్యంగా దొంగలుగా దళితులపై ముద్ర వేస్తూ పోలీసులు అక్రమ కేసులు, వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిన జై భీమ్‌ ఓటీటీలో హిట్‌ టాక్‌తో  దూసుకుపోతోంది. తమిళనాడులోని  రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సూర్య  చంద్రు పాత్రలో జీవించారు. అయితే  విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ మూవీలోని ఒక  సీన్‌పై  వివాదం  నడుస్తోంది.

హిందీలో మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్‌ రాజ్‌ 'చెంపదెబ్బ' సన్నివేశం చర్చకు దారి తీసింది. హిందీలో మాట్లాడినందుకే అలా అతగాడి చెంప చెళ్లుమనిపించాడని సోషల్‌మీడియాలో కొంతమంది విమర్శలకు దిగారు. అయితే నిర్దిష్ట పాత్ర (రైస్‌ మిల్లు యజమాని) జరిగిన నేరంలోని నిజాల్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహం తెలిసి హిందీలో మాట్లాడుతున్న  ఆ పాత్రను అలా కొట్టాడు తప్ప, హిందీ మాట్లాడే ఇండియన్స్‌కు  వ్యతిరేకంగా కాదు, తమిళ చిత్ర నిర్మాతలు హిందీ భాషకు వ్యతిరేకం కాదని కొంతమంది స్పందిస్తున్నారు. హిందీలో మాట్లాడినందుకు చెప్పుతో కొట్టడానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.  కాగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు  సూర్య, జ్యోతిక దంపతులు. నవంబరు 2, మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో  ఈ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement