Manikandan
-
ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ ‘ట్రూ లవర్’ మూవీ
గుడ్‌నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవర్’. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్తా వెనుకపడినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఎమోషనల్ లవ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు, ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'హాట్‌స్టార్'లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తాజాగా విడుదలైంది. హాట్‌స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. 'ట్రూ లవర్' కథ విషయానికొస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరిప్రియ).. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడే ప్రేమలో పడతారు. దివ్య సెటిల్ అయిపోగా, అరుణ్ మాత్రం అలానే ఉండిపోతాడు. ప్రతి విషయంలో దివ్యని అనుమానిస్తుంటాడు. మరొకరితో మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య.. బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అరుణ్ సారీ చెప్పగానే కరిగిపోతుంది. అలాంటి వీళ్లిద్దరి జీవితాల్లో ఓ టూర్ కలకలం రేపుతోంది. చివరకు ఏమైంది? అనేదే మూవీ. -
జై భీమ్‌తో గుర్తింపు.. తెలుగులో ఈ సినిమాతో ట్రెండింగ్ అయ్యారు
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సినిమాలో 'చినతల్లి' పాత్రలో లిజోమోల్ జోసీ నటించగా ఆమె భర్త 'రాజ కన్ను' పాత్రలో మణికంఠన్ మెప్పించారు. ఈ చిత్రంలో వీరిద్దరూ కూడా ఆదివాసీ దంపతులుగా నటించారు. ‘జై భీమ్’ సినిమాతో వీరిద్దరూ కూడా ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా కేరళకు చెందిన లిజో చినతల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఏడిపించేసింది. అదే విధంగా మణికంఠన్ కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు వీరిద్దరూ కూడా తెలుగు సినిమాకు దగ్గరయ్యారు. మణికంఠన్ నటించిన గుడ్ నైట్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఎప్పుడూ ఆయన గురక పెడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టే సీన్స్‌లలో మెప్పించాడు. ఈ చిత్రంలో మోటార్ మోహన్‌గా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఏమోషనల్ సీన్స్‌తో ఏడిపించాడు. తాజాగా ఆయన నటించిన ‘ట్రూ లవర్’ చిత్రాన్ని బేబీ నిర్మాత ఎస్కేఎన్ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మణికంఠన్ మరోసారి ట్రెండింగ్ అవుతున్నాడు. ప్రస్తుతం మణికంఠన్ తెలుగులో మినిమమ్ హీరోగా ఎదగడం ఖాయం అని చెప్పవచ్చు. టాలీవుడ్లో ఆయన సినిమాలకు మార్కెట్ కూడా ఉండే అవకాశం ఉంది. లిజోమోల్ జోసీ కూడా తెలుగులో 'ఒరేయ్ బామ్మర్ది' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో మరో బిగ్ ఆఫర్ అందుకుంది. తమిళ్లో ప్రముఖ హీరో అయిన శశికుమార్‌కు జోడీగా ఒక సినిమా చేయనుంది. ఫ్రీడమ్ అనే మూవీతో ఆమె తెలుగులోకి మరోసారి రానుంది. స్వతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే పిరియాడికల్ కథా చిత్రంగా తెరకెక్కనుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. శశికుమార్ నటుడే కాదు.. మంచి దర్శకుడు, నిర్మాత కూడా.. గతంలో ఆయన కోలీవుడ్‌లో సుబ్రమణిపురం, నాడోడిగళ్, సుందర పాండియన్ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. -
True Lover Movie Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ
టైటిల్: ట్రూ లవర్ నటీనటులు: మణికందన్.కె, గౌరీ ప్రియా రెడ్డి, కన్నా రవి, హరీశ్ కుమార్, నిఖిల శంకర్ తదితరులు రచన, దర్వకత్వం: ప్రభు రామ్ వ్యాస్ నిర్మాతలు: హరీష్, యువరాజ్ తెలుగు విడుదల: మారుతి, ఎస్కేఎన్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ ఎడిటింగ్: భరత్ విక్రమన్ విడుదల తేది: ఫిబ్రవరి 10, 2024 కథేంటంటే.. అరుణ్(మణికందన్), దివ్య(గౌరీ ప్రియ) ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాలీగా తిరుగుతూ.. కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తోటి ఉద్యోగులతో క్లోజ్ ఉండడంతో దివ్య ప్రేమ విషయంలో అరుణ్‌కి అభద్రతా భావం కలుగుతుంది. ప్రేమని వదిలి ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. దివ్య తన ఆఫీస్‌లో పని చేసే అబ్బాయిలతో మాట్లాడినా.. ఎక్కడికైనా వెళ్లినా సహించడు. ఆమెతో గొడవపడడం..మళ్లీ సారి చెప్పడం అరుణ్‌కి సర్వసాధారణం అయిపోతుంది. అరుణ్ ప్రవర్తన కారణంగా దివ్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అరుణ్ పొసెసివ్‌నెస్ దివ్యకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? చివరకు వీళ్లిద్దరు కలిశారా? విడిపోయారా? కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా?లేదా? అన్నది మిగతా కథ. ఎలా ఉందంటే.. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒక్కసారి ఒకరిపై అనుమానం మొదలైతే..వాళ్లు ఏం చేసినా అది తప్పులాగే అనిపిస్తుంది. ఇక ఇద్దరి ప్రేమికుల మధ్య ఆవగింజంత అనుమానం ఉన్నా..అది ఆకాశమంత శోకాన్ని మిగులుస్తుంది. అనుమానం, అభద్రతా భావం పెట్టే మానసిక క్షోభ వర్ణణాతీతం. ట్రూ లవర్ కూడా ఓ అనుమానపు ప్రేమ కథే. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనయింది? అనేది ఈ సినిమా కథ. నేటితరం ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. రొమాన్స్, ఎమోషన్..ఫన్ అన్ని రకాల సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. నేటితరం ప్రేమికుల ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా కథను తీర్చిదిద్దారు. కేవలం ప్రేమ కథనే కాకుండా.. అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. అక్కడ ఎమోషన్ పండించేందుకు అవకాశం దక్కింది. అరుణ్, దివ్యల మధ్య ప్రేమ సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు. దివ్య తోటి ఉద్యోగులతో మాట్లాడిన ప్రతిసారి అరుణ్ అనుమానం వ్యక్తం చేయడం..ఇద్దరి మధ్య గొడవలు.. మళ్లీ కలిసిపోవడం.. ఫస్టాఫ్ చాలా వరకు ఇలానే సాగుతుంది. అనుమానం కారణంగా దివ్య నిజాన్ని దాచేయడం.. ఆ విషయం అరుణ్‌కి తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్‌లో చాలావరకు రిపీట్ సన్నివేశాల్లో ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అరుణ్ అంత గొడవ చేస్తున్నప్పటికీ దివ్య ఎందుకు అతన్ని భరిస్తుందనే విషయాన్ని బలంగా చూపించలేకపోయాడు. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ మాత్రం ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఇంటర్వెల్ సీన్ ద్విదియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కూడా హీరో హీరోయిన్ల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. అరుణ్ అమ్మ నాన్న రిలేషన్లో వచ్చిన సమస్యకి ఈ ప్రేమ కథతో ముడిపెట్టి చెప్పడం బాగుంది. అరుణ్‌కి తన తల్లికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరోని ఎక్కువగా సిగరేట్ తాగుతూ..లేదా మద్యం సేవిస్తూ చూపించడం ఓ వర్గం ఆడియెన్స్‌కి ఇబ్బంది కలిగించొచ్చు. యూత్‌ని ఆకట్టుకోవడానికే హీరోని అలా చూపించారే తప్ప ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ట్రూలవర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి, బ్రేకప్ అయినవారికి నచ్చే అవకాశం ఉంది. . ఎవరెలా చేశారంటే.. అరుణ్ పాత్రలో మణికందన్ ఒదిగిపోయాడు. అనుమానపు ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దివ్య పాత్రకి గౌరీ ప్రియ వంద శాతం న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై మణికందన్, గౌరీ ప్రియల కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. స్నేహితుల పాత్రలు పోషించినవారంతా చక్కగా నటించారు. సాంకెతిక పరంగా సినిమా బాగుంది. సీన్ రోల్డన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలతో పాటు బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
అలాంటి వారి బాధే ఈ సినిమా: మారుతి
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న కోలీవుడ్ చిత్రం ‘ట్రూ లవర్’. ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ టాలీవుడ్ హక్కులను బేబీ నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి దక్కించుకున్నారు. వీరిద్దరు సంయుక్తంగా ట్రూ లవర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఎందుకు చూడమని చెబుతానంటే. ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో చూపించాడు. అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల తప్పుకాదు. తన ప్రియురాలిని ఎవరైనా ట్రాప్ చేస్తాడేమో అని ఆమె లవర్ భయపడుతూ ఉంటాడు. అతని బాధను తెరపై చూపించే ప్రయత్నమే ఈ సినిమా. సిన్సియర్‌గా లవ్ చేసే వారి బాధ వర్ణనాతీతం. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ఏం చేస్తాడనేదే కథ. ఈ కథను డైరెక్టర్ దాదాపు ఆరేళ్లు కష్టపడి రాశాడు. బేబీ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ అలానే రాసుకున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఎవరు మిస్సవరనేది నా నమ్మకం.' అని అన్నారు. కాగా.. మారుతి ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ఐదేళ్ల క్రితం అనుకున్న కథ.. ఇన్నాళ్లకు సినిమాగా రిలీజ్
గతేడాది అంచనాల్లేకుండా రిలీజై సూపర్ హిట్ అయిన సినిమా 'గుడ్‌నైట్'. ఆ చిత్ర నిర్మాతలు అదే హీరోగా తీసిన కొత్త మూవీ 'లవర్'. మణికందన్ హీరో కాగా గౌరిప్రియ హీరోయిన్గా నటించింది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. సీన్ రోల్డర్ సంగీతమందించాడు. తమిళంలో ఈనెల 9న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్' అనే పేరుతో విడుదల కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే) తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. హీరో మణికందన్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ''గుడ్‌నైట్' తర్వాత 'లవర్' చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు ఈ కథని నాకు 2019లోనే చెప్పాడు. అప్పుడు నేను చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుండటం వల్ల వేరే నటుడితో ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పాను. ఎలాగైనా లవర్ కథని సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే అంతగా నన్ను ఇంప్రెస్ చేసింది. ఈ చిత్రాన్ని అందరం ఇష్టంతో కష్టపడి చేశారు' అని ఇతడు చెప్పుకొచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒక్క రోజు తేడాతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగుకి వచ్చేసరికి 'బేబి' నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. వాలంటైన్స్ వీక్ కాబట్టి మన దగ్గర ఈ సినిమాకు ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) -
ప్రేమిస్తే తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
‘‘ప్రేమిస్తే’ అనే డబ్బింగ్ మూవీతో నా కెరీర్ ఆరంభమైంది. ‘ప్రేమిస్తే’ చూసి బాగుందనిపించి రిలీజ్ చేసి, హిట్ సాధించాం. ఇన్నాళ్లకు ‘ట్రూ లవర్’ చిత్రం చూడగానే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. ఈ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు.. ఇలా అందరూ చూడొచ్చు’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. మణికందన్, శ్రీ గౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ట్రూ లవర్’. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల మధ్య ఉంటున్న మోడ్రన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ‘ట్రూ లవర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. ‘ట్రూ లవర్’ చిన్న క్యూట్ సినిమా.. మా సినిమాని విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు మణికందన్. -
'బేబి' నిర్మాత నుంచి మరో సినిమా.. ఈసారీ అలాంటి ప్రేమకథే
రీసెంట్ టైంలో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ అంటే చాలామంది చెప్పే పేరు 'బేబి'. ప్రస్తుతం చాలామందికి తెలిసిన కథనే సినిమాగా తీస్తే బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. నిర్మాతకు మూడు నాలుగు రెట్ల లాభాలు తీసుకొచ్చిందని టాక్. ఇప్పుడు ఆ నిర్మాత నుంచి మరో క్రేజీ లవ్ స్టోరీ మూవీ రాబోతుంది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?) అయితే ఇది తెలుగు స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ ప్రేమకథ సినిమా. 'గుడ్ నైట్' చిత్రంతో గతేడాది హిట్ కొట్టిన మణికందన్.. ఇప్పుడు' ట్రూ లవర్'గా రాబోతున్నాడు. ఇందులో తెలుగమ్మాయి గౌరిప్రియ హీరోయిన్. తమిళంలో లవర్ పేరుతో తీసిన ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగులో ఫిబ్రవరి 9న రిలీజ్ కావొచ్చని అంటున్నారు. టీజర్ బట్టి చూస్తుంటే.. ఇంజినీరింగ్ చదివేటప్పుడు అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడతారు. కాకపోతే ఈ అబ్బాయి మరీ ఎక్కువగా ప్రేమించేయడంతో అసలు సమస్యలు మొదలవుతాయి. అమ్మాయి వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా సరే ఇతడు చిరాకుపడిపోతుంటాడు. కాస్త 'బేబి' పోలికలు కనిపిస్తున్న ఈ చిత్రాన్ని 'బేబి' ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు మారుతి కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇది మరో 'బేబి' అవుతుందా అనేది చూడాలి? (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) -
మరో సినిమాతో వస్తోన్న గుడ్ నైట్ హీరో!
జై భీమ్ చిత్రంతో ఫేమస్ అయిన హీరో మణికంఠన్. ఇటీవలే గుడ్ నైట్ సినిమాతో హిట్ అందుకున్నారు. చిన్న చిత్రంగా విడుదలై ఎంత మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఆయన కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. నటి శాన్వి మేఘన నాయకిగా నటిస్తున్న ఇందులో గురు సోమసుందరరాజన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కారం పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కోయంబత్తూర్‌లో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్వర్ కలిసామి మాట్లాడుతూ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొనే సవాళ్లను.. ఎదుర్కోవడానికి చేసే సాహసాలను చూపే కథంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. కోయంబత్తూర్‌లో ఫ్లెక్స్ అనే ముద్రణ కార్యాలయంలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక చిరు ఉద్యోగి ఇతి వృత్తంతో సాగే కథ కావడంతో ఈ చిత్రంలో చక్కని వినోదంతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇది కుటుంబ సమేతంగా ఆదరించే కథాచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను ప్రసన్న బాలచంద్రన్, రాజేశ్వర్ కాలిసామిలు, కథనం, సంభాషణలను ప్రసన్న బాలచంద్రన్ అందించారు. ఈ సినిమాకు సుజిత్ సుబ్రహ్మణ్యం ఛాయా గ్రహణం, వైసాగ్ సంగీతమందిస్తున్నారు. -
సూపర్ హిట్‌గా నిలిచిన గుడ్‌నైట్ మూవీ.. ఈ టీమ్ కలయికలో కొత్త చిత్రం
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం గుడ్‌నైట్. ఈ చిత్ర కథానాయకుడు మణికంఠన్, మిలియన్ డాలర్స్, ఎంఆర్పీ సంస్థలు మరో చిత్రానికి సిద్ధమయ్యారు. శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రేయాకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం ఉదయం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు విజయ్‌సేతుపతి విచ్చేసి ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలను తెలుపుతూ యువతీ యువకులు సమకాలీన ప్రేమ, తద్వారా ఏర్పడే సమస్యలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, గోవా సమీపంలోని గోకర్ణం ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్ర కథ జనరంజక అంశాలతోపాటు మంచి సందేశంతో కూడి ఉంటుందన్నారు. చదవండి: నాకు హద్దులు తెలుసు.. అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్ -
'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)
టైటిల్: గుడ్ నైట్ నటీనటులు: మణికందన్, మీరా రఘునాథ్, రమేశ్ తిలక్ తదితరులు నిర్మాణ సంస్థ: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్ఆర్పీ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: యువరాజ్ గణేశన్, మగేశ్ రాజ్, నజేరత్ పసిలియన్ దర్శకత్వం: వినాయక్ చంద్రశేఖరన్ సంగీతం: సీన్ రోల్డన్ సినిమాటోగ్రఫీ: జయంత్ సేతు మాధవన్ ఎడిటర్: భరత్ విక్రమన్ విడుదల తేదీ: 2023 జూలై 03 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సినిమా హిట్ అవ్వాలంటే భారీతనం, హంగులే అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా ఓ కథ-కథనం ఉంటే చాలు. కచ్చితంగా హిట్ అవుతుంది. భాషతో సంబంధం లేకుండా ఆదరణ సొంతం చేసుకుంటుంది. అలా మనందరికీ తెలిసిన 'గురక' అనే పాయింట్ తో తమిళంలో వచ్చిన సినిమా 'గుడ్ నైట్'. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే. కథేంటి? మోహన్ అలియాస్ మోటర్ మోహన్(మణికందన్)కు గురక సమస్య. నిద్రపోయాడంటే సౌండ్ రీసౌండ్ వస్తుంది. అమ్మ, అక్క-బావ, చెల్లితో కలిసుంటాడు. తన గురక గురించి అందరూ తిడుతున్నాసరే దానికి అలవాటు పడిపోతాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో అను (మీరా రఘునాత్) పరిచయమవుతుంది. మనుషుల్లో పెద్దగా కలవని ఈమె.. మోహన్ తో లవ్‌లో పడుతుంది. కొన్నిరోజులకే పెళ్లి చేసుకుంటుంది. ఫస్ట్ నైట్ రోజు.. భర్తకు గురక ప్రాబమ్ ఉందని ఈమెకు తెలుస్తుంది. మరి తర్వాత ఏమైంది? భార్యభర్తలు చివరకు ఒక్కటయ్యారా? లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? కొత్త ఫ్లాట్.. మోహన్-అనుకి ఫస్ట్ నైట్.. రాత్రంతా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. నిద్ర ముంచుకురావడంతో మోహన్ పడుకుంటాడు. తెలియకుండానే గట్టిగా గురక పెడతాడు. ఇబ్బందిపడుతూనే అను ఆ రాత్రి గడుపుతుంది. తన అసౌకర్యం గురించి భర్తకి చెప్పదు. ఉదయం లేచి, అతడు అడిగినా సరే పర్లేదు అని చెబుతుంది. ఇది ఓ సీన్. కాపురం మొదలైన కొన్నాళ్లకు భర్త గురక వల్ల అను ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒంటరిగా వేరే ఇంట్లోకి మారిపోతుంది. కానీ ఆమెకు నిద్ర పట్టదు. ఒంటరిగా ఉన్నాసరే రాత్రంతా భర్త గురించే ఆలోచనలు. దీంతో వాట్సాప్ ఓపెన్ చేసి, అందులో భర్త ఇంతకు ముందు తనకు సెండ్ చేసిన గురక రికార్డింగ్స్‌ని ఈయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ వింటుంది. ఇది మరో సీన్. మొదటి సీన్ చూస్తున్నప్పుడు మనకు నవ్వొస్తుంది. రెండో సీన్ చూస్తున్నప్పుడు అనుతో పాటు మనమూ ఎమోషనల్ అవుతాం. అదే ఈ సినిమాలో మ్యాజిక్. టైటిల్స్ పడకముందే మనకు గురక సౌండ్ వినిపిస్తుంది. కాసేపటికే మోహన్ ని చూపిస్తారు. ఇకు ఆలస్యం చేయకుండా నేరుగా స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటనేది డైరెక్టర్ చెప్పేశాడు. ఆ తర్వాత మోహన్ కుటుంబాన్ని, అతడు జీవితంలో ఉండే మనుషులు, వాతావారణాన్ని పరిచయం చేస్తూ వెళ్లాడు. గురక వల్లే తన ఆఫీసులోనే పనిచేస్తున్న ఓ అమ్మాయి మోహన్‌కి బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత అతడి ఇంటికొచ్చి ఏడవడం, అది చూస్తున్న మనకు నవ్వు రావడం లాంటి సీన్స్ వరసగా వస్తుంటాయి. మోహన్, అను.. ఇద్దరు జీవితాలు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. అలాంటిది ఓరోజు అనుకోకుండా వీళ్లిద్దరూ పరిచయవుతారు. స్నేహం.. ప్రేమ.. పెళ్లి.. ఇదంతా జరిగేసరికి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఫస్టాప్ మొత్తాన్ని ఎంటర్ టైనింగ్‌గా తీసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో ఎమోషన్స్ ని నమ్ముకున్నాడు. భర్తకు గురక సమస్య ఉందని తెలిసిన తర్వాత అను జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి? మోహన్ ఏం చేశాడు? ఫైనల్ గా ఏం జరిగిందనేది క్లైమాక్స్. ఈ సినిమాలోనే మోహన్ బావ-అక్క స్టోరీ కూడా ఉంటుంది. ఈ కాలం తల్లిదండ్రుల తీరుని క్వశ్చన్ చేసేలా అదంతా ఉంటుంది. దాదాపు రెండున్నర గంటలున్న ఈ సినిమాలో ఫస్టాప్ ని చకచకా నడిపించేసిన డైరెక్టర్.. సెకండాఫ్ లో కాస్త నిదానమే ప్రదానం అనే ఫార్ములా పాటించాడు. గురక తగ్గించుకోవడానికి మోహన్ పడే పాట్లు లాంటి సీన్స్.. రిపీట్‌గా అనిపిస్తాయి. కొన్నిచోట్లు మెలోడ్రామా ఎక్కువైంది. మోహన్, అను పాత్రలు.. తమకు వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. కానీ కలిసి ఉంటేనే ఏ బంధమైనా నిలుస్తుందని చెబుతూ సాగే క్లైమాక్స్ సీన్స్ మనల్ని ఎమోషనల్ చేస్తాయి. ఎవరెలా చేశారు? మోహన్ పాత్రలో మణికందన్ అదరగొట్టేశాడు. ఏ పాయింట్ లో కూడా ఓ నటుడిని చూస్తున్నాం, ఇది సినిమా అనే ఫీలింగ్ అస్సలు అనిపించదు. గురక పెట్టే సీన్స్ నుంచి అను దూరమవుతుందనే భయంతో బాధపడే సన్నివేశాల వరకు చాలా నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అను పాత్రలో మీరా రఘునాథ్ ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇంటర్వెర్ట్, అమాయకురాలిగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆ పాత్రతో పాటు జర్నీ చేసేలా చేసింది. మోహన్ బావ పాత్రలో నటించిన రమేశ్ తిలక్.. కనిపించిన ప్రతి సీన్ లో నవ్వించాడు. చివర్లో మాత్రం ఏడిపించేశాడు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాల్లో సీన్ రొల్డన్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. జయంత్ సేతు సినిమాటోగ్రఫీ నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ప్రతి సీన్ ని అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ భరత్ విక్రమన్.. సెకండాఫ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండాల్సింది. రైటర్ అండ్ డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్.. అందరికీ తెలిసిన గురక అనే సమస్యని తీసుకుని దాన్ని ఫన్నీ అండ్ ఎమోషనల్ వేలో భలే తీశాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే.. కుటుంబంతో కూర్చొని, నీట్ అండ్ క్లీన్ ఎంటర్టైనర్ చూద్దామనుకుంటే 'గుడ్ నైట్' సినిమా బెస్ట్ ఆప్షన్. - చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)) -
భారత్‌లో రెట్టింపు రేడియో థెరపీ మెషీన్లు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఏటా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020లో కొత్తగా 13.25 లక్షల కొత్త కేసులు రాగా 8.5 లక్షల మంది క్యాన్సర్ సంబంధ సమస్యలతో మరణించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సకాలంలో సరైన చికిత్స అందించేందుకు రేడియో థెరపీ మెషీన్ల సంఖ్య రెట్టింపు స్థాయికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎలెక్టా ఇండియా ఎండీ మణికందన్ బాలా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 650 పైచిలుకు మెషీన్లు ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం జనాభారీత్యా 1,400 వరకు అవసరమని ఆయన చెప్పారు. నివేదికల ప్రకారం తెలంగాణలో 2025 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 53,000 పైచిలుకు ఉండనుందన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు, చికిత్స వ్యయాలను తగ్గించి .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నామని బాలా చెప్పారు. ఎంఆర్–లినాక్ వంటి అధునాతన మెషీన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి దేశీయంగా తమ మెషీన్లు 500 పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ఎలెక్టాకు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
హీరోగా నటిస్తున్న జైభీమ్ నటుడు.. ఫస్ట్‌లుక్ రిలీజ్
తమిళసినిమా: జైభీమ్ చిత్రం ఫేమ్ మణికంఠన్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రానికి గుడ్‌నైట్ అనే పేరును నిర్ణయించారు. వినాయక్ చంద్రశేఖరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డాలర్ స్టూడియోస్ సంస్థ, ఎంఆర్పీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థల అధినేతలు నజ్రేద్ పసిలియాన్, మహేశ్‌రాజ్ పసిలియాన్, యువరాజ్ గణేషన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్పీ శక్తివేల్ క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నటి మితారఘునాథ్ నాయకిగా నటించగా రమేష్ తిలక్, దర్శకుడు, నటుడు బాలాజీ శక్తివేల్, బుక్స్, రేచ్చల్ రేబాకా ముఖ్యపాత్రలు పోషించారు. జయంత్ సేతుమాధవన్ చాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ షూటింగ్ పూర్తయిందని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు చెప్పారు. ఇది గురక ప్రధాన అంశంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. నిద్రలో ఒక వ్యక్తి గురక ఇతరులను ఏ విధంగా బాధిస్తుంది అన్న అంశాన్ని వినోదాన్ని జోడించి రూపొందించినట్లు తెలిపారు. చిత్రంలో కుటుంబ అనుబంధాలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దీన్ని చక్కని అర్థవంతమైన కథాంశంతో రపొందించినట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి, చిత్ర వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు తెలిపారు. -
జై భీమ్ హిట్ టాక్: ఆ సీన్‌పై దుమారం
సాక్షి, హైదరాబాద్: అమాయకులపై కొందరు పోలీసులు, ముఖ్యంగా దొంగలుగా దళితులపై ముద్ర వేస్తూ పోలీసులు అక్రమ కేసులు, వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిన జై భీమ్ ఓటీటీలో హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళనాడులోని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సూర్య చంద్రు పాత్రలో జీవించారు. అయితే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ మూవీలోని ఒక సీన్‌పై వివాదం నడుస్తోంది. హిందీలో మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్ రాజ్ 'చెంపదెబ్బ' సన్నివేశం చర్చకు దారి తీసింది. హిందీలో మాట్లాడినందుకే అలా అతగాడి చెంప చెళ్లుమనిపించాడని సోషల్‌మీడియాలో కొంతమంది విమర్శలకు దిగారు. అయితే నిర్దిష్ట పాత్ర (రైస్ మిల్లు యజమాని) జరిగిన నేరంలోని నిజాల్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహం తెలిసి హిందీలో మాట్లాడుతున్న ఆ పాత్రను అలా కొట్టాడు తప్ప, హిందీ మాట్లాడే ఇండియన్స్‌కు వ్యతిరేకంగా కాదు, తమిళ చిత్ర నిర్మాతలు హిందీ భాషకు వ్యతిరేకం కాదని కొంతమంది స్పందిస్తున్నారు. హిందీలో మాట్లాడినందుకు చెప్పుతో కొట్టడానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు సూర్య, జ్యోతిక దంపతులు. నవంబరు 2, మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. பணம் சம்பாதிக்க எல்லா மொழியிலும் படம் எடுப்பாணாம் இங்க இருக்குற குழந்தைகள் மட்டும் வேற மொழி படிக்க கூடாதாம் 😠#ஜெய்பீம் தமிழ் பதிப்பு ~என்னை ஏன் அடிக்கிறாய்? ~தமிழில் பேசுங்கள் #ஜெய்பீம் ஹிந்தி பதிப்பு ~என்னை ஏன் அறைந்தாய்? ~இப்போது உண்மையைச் சொல்.. #FraudsOfSurya pic.twitter.com/FXD2ve7dCW — Karthikeyan S 🚩🇮🇳ௐ🕉️🌷 (@karthikbjpkarur) November 2, 2021 He uses Hindi to obfuscate the truth about his involvement in a crime. He collaborates with Tamil criminals. This has nothing to do with being slapped for speaking in Hindi. https://t.co/vp5zPNAuGU — Udhav Naig (@udhavn) November 2, 2021 Hi, the scene is not against Hindi-speaking Indians. The particular character tries to get away by speaking in Hindi (so that Prakash Raj wouldn't understand) and knowing this strategy, he slaps and asks him to speak in Tamil.Tamil filmmakers are not against the language Hindi1/2 — Rajasekar (@sekartweets) November 2, 2021 -
జై భీమ్ మూవీ రివ్యూ
టైటిల్ : జై భీమ్ నటీనటులు : సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు నిర్మాతలు : సూర్య, జ్యోతిక దర్శకత్వం : టి.జె.జ్ణానవేల్ సంగీతం : షాన్ రొనాల్డ్ ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్ సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్.కాదిర్ విడుదల తేది : నవంబర్ 02, 2021(అమెజాన్ ప్రెమ్ వీడియో సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకే పెద్ద పీట వేస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. విభిన్నమైన కథలతో తెరకేక్కే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. కొత్త కొత్త గెటప్ లలో దర్శనం ఇస్తూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. తాజాగా ఈ స్టార్ హీరో చేసిన మరో ప్రయోగమే ‘జై భీమ్’.కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. దళితులపై అగ్ర కులాల ఆకృత్యాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. (Jai Bhim: దుమారం రేపుతున్న ‘చెంపదెబ్బ’ సీన్) కథేటంటే.. రాజన్న(మణికందన్), సినతల్లి(లిజోమోల్ జోస్) దళిత దంపతులు. పాములు పట్టుకుంటూ జీవనం సాగిస్తారు. ఒక రోజు ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు రాజన్న వెళ్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఈ కేసులో రాజన్నను అరెస్ట్ చేస్తారు పోలీసులు. పాములు పట్టే క్రమంలో అన్ని గమనించే రాజన్న ఈ చోరీకి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేస్తారు. నేరం ఒప్పుకోమని రాజన్నతో పాటు అతని కుటుంబ సభ్యులను సైతం వేధిస్తారు. అయితే చేయని తప్పుని ఒప్పుకోనని మొండికేస్తాడు రాజన్. కట్ చేస్తే.. జైలు నుంచి రాజన్న తప్పించుకుపోయాడని భార్య సినతల్లికి చెబుతారు పోలీసులు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. తన భర్త ఆచూకి కోసం లాయర్ చంద్రు(సూర్య)ను కలుస్తుంది సినతల్లి. ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కేసును టేకాప్ చేస్తాడు చంద్రు. ఈ క్రమంలో చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? రాజన్న కోసం చంద్రు వేసిన పిటిషన్ కారణంగా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి?ఇంతకీ రాజన్న ఏమయ్యాడు? అనేదే ‘జైభీమ్’కథ ఎవరెలా చేశారంటే..? లాయర్ చంద్రు పాత్రలో సూర్య ఎప్పటి మాదిరే అద్భుతంగా నటించాడు. కోర్టు సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. ‘ఆకాశం నీ హద్దురా’లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత.. అదే స్థాయి డెప్త్ ఉన్న రోల్ తనది. చంద్రు పాత్రలో సూర్య తప్ప మరొకరని ఊహించుకోలేం. ఇక గిరిజన దంపతులుగా మణికందన్, లిజో మోల్ జోసేలు అద్భుత నటనను కనబరిచారు. ముఖ్యంగా సినతల్లిగా నటించిన లిజోమోల్ జోస్ గురించి చెప్పాలి. సమాజంలోని దాష్టీకాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె నటన అభినందనీయం. డీజీపీ దగ్గర ఆమె చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్, రావు రమేశ్ తమదైన నటనతో మెప్పించారు. జై భీమ్ ఎలా ఉందంటే..? పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్’. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు జ్ణానవేల్. ఇటీవల తెలుగులో వచ్చిన వకీల్ సాబ్, నాంది, తిమ్మరుసు సినిమాల మాదిరే ‘జైభీమ్’ కూడా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఓ అమాయకుడు చేయని తప్పుకు జైలుపాలవ్వడం.. ఆ కేసును హీరో టేకప్ చేసి, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొడుతూ.. చివరకు న్యాయం జరిపించడం. దాదాపు కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాలన్ని ఇలానే సాగుతాయి. దర్శకుడు జ్ఞాన్వేల్ అలాంటి పాయింట్‌నే ఎంచుకుని ఉత్కంఠ భరితంగా ‘జై భీమ్’ను తెరకెక్కించాడు. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సఫలమయ్యాడు. అమాయకులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు పెట్టి, వారు నేరం ఒప్పుకునేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడతారనే విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. లాయర్ చంద్రుగా సూర్య ఎంట్రీ అయినప్పటి సినిమాపై ఆసక్తి పెరుగుతంది. అరెస్ట్ అయిన రాజన్న జైలులో కనిపించకపోవడం, అతను ఏమయ్యాడే విషయాన్ని చివరి వరకు చెప్పకపోవడంతో సినిమాపై ఉత్కంఠ పెరుతుంది. పోలీసులు అతడిని ఏం చేశారు? అసలు బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుడి మదిలో మొదలవుతాయి. చివరకు అసలు విషయం తెలిసి భావోద్వేగానికి లోనవుతారు. ఇక క్లైమాక్స్ అయితే అదుర్స్ అనే చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. కట్టిపడేసేలా కథనాన్ని నడిపించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. షాన్ రొనాల్డ్ సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు.ఎస్.ఆర్. కాదిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్టు సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. . ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
మాజీ మంత్రికి నటి షాక్.. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ
తమిళసినిమా: అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు నటి చాందిని షాక్ ఇచ్చారు. మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక బీసెంట్‌నగర్‌కు చెందిన మలేషియాకు చెందిన నటి చాందిని. అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్ పెళ్లి చేసుకుంటానని తనతో సహజీవనం చేసి మోసం చేశారని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మాజీ మంత్రి మణికంఠన్‌ను అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో మాజీమంత్రి మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అదే విధంగా తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో అందుకు తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా మాజీ మంత్రినే చెల్లించాలని ఆ పిటిషన్లో కోరారు. కాగా నటి చాందిని పిటిషన్ వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది. -
అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్
సాక్షి, చెన్నై: మాజీ మంత్రి మణికంఠన్ చిక్కారు. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకుని ఉన్న ఆయన్న చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆదివారం చెన్నై తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. మాజీ మంత్రి మణికంఠన్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, మూడుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఆరు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఆయన్ను విచారించేందుకు చెన్నై పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తూనే మరో వైపు ఆధారాల కోసం ఆయనకు పీఏగా, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారిని విచారించారు. ఆయన వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి పత్తా లేకుండా పోయాడు. అలాగే బలవంతంగా మూడుసార్లు చాందినికి అబార్షన్ చేసిన డాక్టరును విచారించేందుకు పోలీసులు కసరత్తు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అందిన రహస్య సమాచారం మేరకు ఒక బృందం శనివారం బెంగళూరు వెళ్లింది. అక్కడి శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో తలదాచుకుని ఉన్న మాజీ మంత్రిని అదుపులోకి తీసుకుంది. రాత్రికి రాత్రే చెన్నై తరలించిన పోలీసులు ఉదయాన్నే అడయార్ స్టేషన్లో ఉంచి తీవ్రంగా విచారణ చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి తీసుకునేందుకు సోమవారం పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. చదవండి: నటితో సహజీవనం: ఆమె ఎవరో తెలియదన్న మాజీ మంత్రి -
నటితో సహజీవనం: రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
చెన్నై: పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని నటి చాందిని మాజీ మంత్రి మణికంఠన్‌పై శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మణికంఠన్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్ల పాటు తనతో సహజీవనం చేసినట్లు తెలిపారు. తాను గర్భం దాల్చగా దానిని తొలగించమని బలవంతం చేసినట్లు చెప్పారు. అలా మూడుసార్లు గర్భాన్ని తీయించుకున్నట్లు తెలిపారు. తాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తన కుటుంబంపైనా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మణికంఠన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని..ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఎవరో నాకు తెలియదు– మాజీ మంత్రి నటి చాందిని ఫిర్యాదుపై మాజీ మంత్రి మణికంఠన్ స్పందించారు. చాందిని ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది తనను కలిశారన్నారు. అదే విధంగా నటి చాందిని కూడా తనను కలిసి ఉండొచ్చని తెలిపారు. అప్పుడు తనతో తీసుకున్న ఫొటోలు చూపించి తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులే చాందినిని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనిచేయిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి చాందినితో కలిసున్న ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అందుకు తాను అంగీకరించలేదన్నారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. చదవండి: గర్భవతిని చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ -
పెళ్లి పేరుతో మోసం చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నాడు : నటి చాందినీ
ప్రేమ-పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన ఓ మాజీ మంత్రి బాగోతం వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన చాందినీ.. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డాక్టర్ మణికందన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనతో సహజీవనం చేసి గర్భవతిని చేసిన మణికందన్.. ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె మీడియా ముందుకు వచ్చింది. చెన్నై: కోలీవుడ్ నటి చాందినీ అన్నాడీఎంకే నేత మణికందన్ మీద ఛీటింగ్, లైంగిక దాడి కేసులు పెట్టింది. గత ఐదేళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని, తాను గర్భవతిని అని తెలిశాక అబార్షన్ చేయించాడని ఆమె మీడియా ముందు వాపోయింది. పెళ్లి చేసుకోమంటే కుదరదని అన్నాడని, గట్టిగా మాట్లాడితే తన గుండాలతో చంపిస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ మేరకు మణికందన్‌తో జరిగినట్లుగా వాట్సాప్ ఛాటింగ్‌లను ఆమె మీడియాకు చూపించి పోలీసులకు సమర్పించింది. కాగా, 36 ఏళ్ల చాందినికి మలేషియా పౌరసత్వం ఉంది. ‘నడడిగల్, వాగి సూడా వా’ సినిమా లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ఇక మణికందన్ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. జయలలితకు ఆప్తుడిగా పేరున్న 41 ఏళ్ల మణికందన్.. అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పళనిస్వామికి వ్యతిరేకంగా టీవీవీ దినకరన్ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవిని పొగొట్టుకున్నాడు. కాగా చాందినీ ఆరోపణలపై మణికందన్ స్పందన తెలియాల్సి ఉంది. -
నిరాడంబరంగా నటుడి పెళ్లి
కొచ్చి : నటుడు, కేరళ ఫిల్మ్ అవార్డ్ విజేత మణికందన్ ఓ ఇంటివాడయ్యారు. ఆదివారం కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య లాక్డౌన్ నిబంధనలను గౌరవిస్తూ ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే మరదుకు చెందిన అంజలితో మణికందన్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 26న పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే పెళ్లి తేదీని మార్చటానికి మణికందన్ ఇష్టపడలేదు. కానీ, ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పెళ్లి ఘనంగా చేసుకోకూడదని మాత్రం నిర్ణయించుకున్నారు. పెళ్లి కోసం వెచ్చించాల్సిన డబ్బు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు. 2016లో వచ్చిన కమ్మటిపడ సినిమాతో మణికందన్ సినీరంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కేరళ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. -
ఇలాంటి పెళ్లికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలో..!!
నిన్నటి వాలంటైన్స్ డే మణిగంధన్‌కి, సురేఖకు ప్రత్యేకమైనది. ఈ భార్యాభర్తలకు నిన్న మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చింది! కోయంబత్తూర్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్లి ఓ సంతకంపెట్టి, పనిలో పనిగా అక్కడి అధికారులకు ఓ దండం పెట్టి బయటికి వచ్చింది ఈ జంట. రెండేళ్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు మణిగంధన్, సురేఖ. సరిగ్గా రెండేళ్ల క్రితం వాలంటైన్స్ రోజునే ఫిబ్రవరి 14న వాళ్ల పెళ్లి జరిగింది. చివరికి ఈ నెల మొదట్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీకు సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఎప్పుడొచ్చి తీసుకుంటారు?’’ అని. అచ్చం సినిమాల్లో చూపించినట్లే.. ఆనందంతో ఎగిరి గంతేశారు. వాలంటైన్స్ డే రోజు వచ్చి తీసుకుంటాం సార్ అని చెప్పారు. వెళ్లి తీసుకున్నారు. మణిగంధన్, సురేఖలకు మ్యారేజ్ సర్టిఫికెట్ రావడానికి ఇంత సమయం పట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది. మణిగంధన్ అబ్బాయి. సురేఖ అమ్మాయి లాంటి అబ్బాయి. ట్రాన్స్ ఉమన్! ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి.సమాజం కూడా ఒప్పుకుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్లకే ఒప్పుకోడానికి చట్టం అడ్డుపడింది. ఒక పురుషుడికి–స్త్రీకి మధ్య జరిగిన పెళ్లికైతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వగలం కానీ.. ఇలాంటి పెళ్లికి ఏ సెక్షన్ కింద వివాహ పత్రం ఇవ్వాలో తెలియడం లేదు అనేశారు. ‘‘లేదు, మాకు సర్టిఫికెట్ కావలసిందే’’ అని ఈ దంపతులు పట్టుపట్టారు. చట్టాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి కూడా సిద్ధమైపోయారు. చెన్నై వెళ్లి ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్) ని కలిశారు. ‘అవకాశం ఉందేమో చూస్తాను’ అని ఐజీ గారు వాళ్లు పంపించి, సిబ్బంది చేత చట్టాల పుస్తకాలు తెప్పించుకున్నారు. 2009 తమిళనాడు రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజస్ యాక్ట్‌లో సన్నటి దారం లాంటి ఆధారం దొరికింఇ. దాన్ని పట్టుకుని.. ఈ ఏడాది జనవరి 28న అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు నోటిఫికేషన్ పంపించారు. ట్రాన్స్‌జెండర్ పెళ్లిళ్లను చట్టబద్దం చేసే ఉత్తర్వు అది. ఆ ఉత్తర్వు కోయంబత్తూరు కూడా చేరింది. అక్కడి అధికారులు వెంటనే మిసెస్ అండ్ మిస్టర్ మణిగంధన్‌కి వర్తమానం పంపారు.. ‘వియ్ ఆర్ రెడీ టు గివ్ యు..’ అని. మొత్తానికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఈ ఆలూమగల చేతికి వచ్చింది. అయినా సర్టిఫికెట్ కోసం ఎందుకు ఇంతగా వీళ్లు పోరాడారు? ‘‘బిడ్డను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. ఇప్పుడు ఉంది. త్వరలో మేము అమ్మానాన్న కాబోతున్నాం’’ అన్నారు మణిగంధన్, సురేఖ.. చిరునవ్వులు చిందిస్తూ. -
నేను యస్.. ఆయన వి...
‘‘గీత గోవిందం’ సినిమా పూజ రోజు అల్లు అరవింద్‌గారు నాతో ‘మా లక్ష్మీ (పారితోషికం)ని మీరు తీసుకొని మీ సరస్వతి (కెమెరా వర్క్)ని మాకు ఇవ్వండి’ అన్నారు. ఎందుకో ఆ మాట నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. టెక్నీషియన్స్‌కు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ చాలా గొప్పది’’ అని కెమెరామేన్ యస్. మణికందన్ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఈ నెల 15న రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకెళ్తోందని చిత్రబృందం పేర్కొంది. మణికందన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్ స్టార్టింగ్‌లో కెమెరామేన్ శరవణన్, మనోజ్ పరమహంసలగారి వద్ద వర్క్ చేశాను. ‘రేసు గుర్రం’ సినిమాలో రెండు పాటలకు లైటింగ్ చేయడానికి వస్తే ‘ముకుంద’ సినిమాకు అవకాశం వచ్చింది. తమిళంలో ‘కుట్రమ్ కడిదల్, మగళిర్ మట్టుమ్’ అనే సినిమాలు చేశాను. ► ‘గీత గోవిందం’ పాయింట్ బావుంది.. ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ అవుతుందనుకోలేదు. అరవింద్‌గారి అనుభవం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకు ఏం కావాలో మాత్రమే ఆలోచిస్తారు. వరుసగా రెండు సార్లు ఆయన బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. పరశురామ్‌తో వర్క్ చేయడం బాగుంటుంది. ఫస్ట్ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ జర్నీ చాలా నచ్చడంతో సెకండ్ సినిమాకు కూడా అసోసియేట్ అయ్యాం. ► ‘బన్నీ’ వాసు గారు సినిమా స్టార్ట్ కాకముందు ఏం కావాలి? అని అడుగుతారు. అంత ఫ్రీడమ్ ఇస్తారు. విజయ్ దేవరకొండ సింప్లీ సూపర్. ‘అర్జున్ రెడ్డి’ సినిమా హిట్ అయినా కూడా తను మాత్రం సింపుల్‌గానే ఉన్నాడు. ► నా నెక్ట్స్ మూవీ సెప్టెంబర్‌లో ఆరంభమవుతుంది. పూరీగారు కాల్ చేశారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. తెలుగు ఆడియన్స్ అంటే ఇష్టం. వాళ్లు సినిమా మీద చూపించే అభిమానం ఆకట్టుకుంది. నా దృష్టిలో బెస్ట్ ఆడియన్స్ అంటాను. ‘‘చాలామంది నన్ను కెమెరామేన్ వి.మణికందన్ (ఓం శాంతి ఓం, రా.వన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫేమ్)తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇదే విషయాన్ని ఓసారి ఆయనతో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు నా ‘ఓం శాంతి ఓం’ నువ్వే చేశా వని చెప్పేయ్’’ అని సరదాగా అన్నారు. -
నటిపై అఘాయిత్యం: పక్కా స్కెచ్ వేసింది అతనే!
కోచి: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి కేసు నిందితుల్లో ఒకడైన మణికందన్ పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ నేరానికి పక్కా స్కెచ్ గీశాడని, పూర్తిగా అతని ప్లాన్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జరిగిందని అతను తెలిపాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సుని ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాధితురాలి మాజీ డ్రైవర్ అయిన అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నేరంలో పల్సర్ సునికి సహకరించిన మణికందన్‌ను సోమవారం రాత్రి పాలక్కడ్‌లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నటి కారులోకి ప్రవేశించి దాడి చేసేవరకు.. పల్సర్ సుని ప్లాన్ గురించి తమకు తెలియదని చెప్పాడు. 'ఒక పని ఉందంటూ పల్సర్ సుని కాల్ చేసి పిలిచాడు. ఎవరినో కొట్టేందుకు అతను పిలిచి ఉంటాడని నేను భావించాను. కానీ నటి మీద దాడి చేసేందుకు మమల్ని పిలిచాడని తర్వాత తెలిసింది. ఆమె కారులోకి మేం వెళ్లాక.. నేను మాత్రం తనపై దాడి చేయలేదు' అని అతను పోలీసులకు తెలిపినట్టు విశ్వనీయవర్గాలు తెలిపాయి. నటిపై దాడి తర్వాత డబ్బు కోసం ఈ నేరంలో పాల్గొన్న ఇతర వ్యక్తులు పల్సర్ సునితో గొడవ పడ్డారని, వారికి రూ. 30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి అతను తప్పించుకున్నాడని మణికందన్ పోలీసులకు చెప్పాడు. మణికందన్ చెప్పింది పూర్తిగా పోలీసులు విశ్వసించడం లేదని సమాచారం. అతన్ని మరింతగా విచారించిన అనంతరం ఆ రోజు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు అంటున్నారు. కాగా, నటిపై దాడి జరిగిన వాహనాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పోలీసులు అప్పగించారు. -
ఐటీ మంత్రికి షాక్!
సాక్షి, చెన్నై: ఐటీ మంత్రి మణిగండన్‌కు అమ్మ జయలలిత షాక్ ఇచ్చారు. ఆయన చేతిలో ఉన్న రామనాథపురం జిల్లా కార్యదర్శి పదవిని వెనక్కు లాగేసుకున్నారు. కొత్త కార్యదర్శిగా ఎంకే మునుస్వామిని నియమించారు. జిల్లా పదవి ఊడడంతో త్వరలో మంత్రి పదవి కూడా మణిగండన్ చేతి నుంచి జారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అన్నాడీఎంకేలో, అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఎవరి పదవులకు గ్యారంటీ లేదు. ఎవరి మీద ఎప్పుడు అమ్మ కన్నెర్ర చేస్తారో, పదవులు ఊడుతాయో చెప్పలేం. రాత్రి మంత్రిగా గుడ్ నైట్ చెప్పిన వాళ్లు గుడ్ మార్నింగ్ చెప్పేలోపే మాజీలు అయ్యే పరిస్థితి. మంత్రి వర్గంలో తరచూ మార్పులు జరగడం, పార్టీ పదవుల నుంచి నేతల్ని సాగనంపడం అమ్మకు పరిపాటే. కొత్త ప్రభుత్వంలో పలువురి చేతిలో ఉన్న అదనపు బాధ్యతల్ని మరి కొందరికి అమ్మ పంచి పెట్టారేగానీ, ఇంత వరకు ఏ మంత్రికీ ఉద్వాసన పలకలేదు. ఇందుకు సమయం ఆసన్నమైనట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో జిల్లా కార్యదర్శి పదవి ఓ మంత్రి చేతి నుంచి ఊడింది. ఈ పదవి ఊడిన పక్షంలో మంత్రి పదవి కూడా త్వరలో దూరం అయినట్టే. ఇందుకు గత అనుభవాలే నిదర్శనం. మంత్రికి షాక్: రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే వైద్య విభాగం నేత మణిగండన్ శాసన సభలో అడుగు పెట్టారు. ఎంఎంకే నేత జవహిరుల్లాను ఓడించిన మణిగండన్‌కు ఐటీ శాఖను అప్పగిస్తూ అమ్మ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. మణిగండన్ పార్టీ కోసం శ్రమిస్తున్నారని చెప్పడం కన్నా, ఆయన తండ్రి రామనాథపురం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మురుగేషన్ సేవలకు గుర్తింపుగా పదవులు దక్కాయని చెప్పవచ్చు. మంత్రిగా అవతరించిన మణిగండన్ తన నివాసాన్ని మదురైకు పరిమితం చేశారు. రామనాథపురం జిల్లా కార్యదర్శిగా కూడా పార్టీ పదవిలో ఉన్న ఆయన తనకు వ్యతిరేకంగాఎన్నికల్లో వ్యవహరించిన అధికారుల భరతం పట్టే విధంగా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది. పలువురు అధికారులు అమ్మ దృష్టికి తీసుకురావడం, అదే సమయంలో జిల్లా వైపుగా మంత్రి తొంగిచూడడం లేదన్న ఫిర్యాదులతో ఆయనకు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని గురువారం అమ్మ జయలలిత తీసుకున్నారు. జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా, ఆయన వెన్నంటి ఉన్న యూనియన్, జిల్లా యూనియన్ పదవుల్లో ఉన్న మీనాక్షి సుందరం, కె హేమ, సత్యమూర్తిలతో పాటు పలువురికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి చేతిలో ఉన్న జిల్లా పదవి ఊడినా, వైద్య విభాగం కార్యదర్శి పదవి మాత్రం అలాగే ఉంచారు. అయితే, జిల్లా పదవి ఊడిన దృష్ట్యా, త్వరలో ఆయన మంత్రి పదవిని సైతం కోల్పోయే అవకాశాలు ఎక్కువే. ఇక, రామనాథపురం జిల్లాకు కొత్త కార్యదర్శి గతంలో కార్యదర్శిగా పనిచేసిన మునుస్వామిని నియమించారు. అలాగే, మునుస్వామి సతీమణి కృతిక ముదగళత్తూరు నుంచి ఓటమి చవి చూశారు. ఓడినా ఆమెకు గుర్తింపు ఇస్తూ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం గమనార్హం. తనకు జిల్లా కార్యదర్శి పదవి మళ్లీ కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చెన్నై చేరుకున్న మునుస్వామి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు.