జై భీమ్‌తో గుర్తింపు.. తెలుగులో ఈ సినిమాతో ట్రెండింగ్‌ అయ్యారు | Lijomol Jose And Manikandan Got Movie Chance In Telugu | Sakshi
Sakshi News home page

జై భీమ్‌తో గుర్తింపు.. ఇప్పుడు తెలుగులో ట్రెండ్‌ సెట్టర్స్‌

Published Mon, Feb 12 2024 10:22 AM | Last Updated on Mon, Feb 12 2024 10:49 AM

Lijomol Jose And Manikandan Get Telugu Movie Chance - Sakshi

కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య నటించిన జై భీమ్‌ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఆ సినిమాలో 'చినతల్లి' పాత్రలో లిజోమోల్‌ జోసీ నటించగా ఆమె భర్త 'రాజ కన్ను' పాత్రలో మణికంఠన్‌ మెప్పించారు. ఈ చిత్రంలో వీరిద్దరూ కూడా  ఆదివాసీ దంపతులుగా నటించారు. ‘జై భీమ్‌’ సినిమాతో వీరిద్దరూ కూడా ఓవర్‌నైట్‌ స్టార్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా కేరళకు చెందిన లిజో చినతల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఏడిపించేసింది. అదే విధంగా మణికంఠన్‌ కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు వీరిద్దరూ కూడా తెలుగు సినిమాకు దగ్గరయ్యారు.

మణికంఠన్‌ నటించిన గుడ్ నైట్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఎప్పుడూ ఆయన గురక పెడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టే సీన్స్‌లలో మెప్పించాడు. ఈ చిత్రంలో మోటార్‌ మోహన్‌గా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఏమోషనల్‌ సీన్స్‌తో ఏడిపించాడు. తాజాగా ఆయన నటించిన ‘ట్రూ లవర్‌’ చిత్రాన్ని బేబీ నిర్మాత  ఎస్‌కేఎన్‌ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మణికంఠన్‌ మరోసారి ట్రెండింగ్‌ అవుతున్నాడు. ప్రస్తుతం మణికంఠన్‌ తెలుగులో మినిమమ్‌ హీరోగా ఎదగడం ఖాయం అని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో ఆయన సినిమాలకు మార్కెట్‌ కూడా ఉండే అవకాశం ఉంది.

లిజోమోల్‌ జోసీ కూడా తెలుగులో 'ఒరేయ్‌ బామ్మర్ది' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో మరో బిగ్‌ ఆఫర్‌ అందుకుంది. తమిళ్‌లో ప్రముఖ హీరో అయిన శశికుమార్‌కు జోడీగా ఒక సినిమా చేయనుంది. ఫ్రీడమ్‌ అనే మూవీతో ఆమె తెలుగులోకి మరోసారి రానుంది.

స్వతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే పిరియాడికల్‌ కథా చిత్రంగా తెరకెక్కనుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. శశికుమార్‌ నటుడే కాదు.. మంచి  దర్శకుడు, నిర్మాత కూడా.. గతంలో ఆయన కోలీవుడ్‌లో సుబ్రమణిపురం, నాడోడిగళ్‌, సుందర పాండియన్‌ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement