Jai Bhim Movie
-
జై భీమ్‌తో గుర్తింపు.. తెలుగులో ఈ సినిమాతో ట్రెండింగ్ అయ్యారు
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సినిమాలో 'చినతల్లి' పాత్రలో లిజోమోల్ జోసీ నటించగా ఆమె భర్త 'రాజ కన్ను' పాత్రలో మణికంఠన్ మెప్పించారు. ఈ చిత్రంలో వీరిద్దరూ కూడా ఆదివాసీ దంపతులుగా నటించారు. ‘జై భీమ్’ సినిమాతో వీరిద్దరూ కూడా ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా కేరళకు చెందిన లిజో చినతల్లి పాత్రలో తన నటనతో అందరినీ ఏడిపించేసింది. అదే విధంగా మణికంఠన్ కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు వీరిద్దరూ కూడా తెలుగు సినిమాకు దగ్గరయ్యారు. మణికంఠన్ నటించిన గుడ్ నైట్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఎప్పుడూ ఆయన గురక పెడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టే సీన్స్‌లలో మెప్పించాడు. ఈ చిత్రంలో మోటార్ మోహన్‌గా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఏమోషనల్ సీన్స్‌తో ఏడిపించాడు. తాజాగా ఆయన నటించిన ‘ట్రూ లవర్’ చిత్రాన్ని బేబీ నిర్మాత ఎస్కేఎన్ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మణికంఠన్ మరోసారి ట్రెండింగ్ అవుతున్నాడు. ప్రస్తుతం మణికంఠన్ తెలుగులో మినిమమ్ హీరోగా ఎదగడం ఖాయం అని చెప్పవచ్చు. టాలీవుడ్లో ఆయన సినిమాలకు మార్కెట్ కూడా ఉండే అవకాశం ఉంది. లిజోమోల్ జోసీ కూడా తెలుగులో 'ఒరేయ్ బామ్మర్ది' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో మరో బిగ్ ఆఫర్ అందుకుంది. తమిళ్లో ప్రముఖ హీరో అయిన శశికుమార్‌కు జోడీగా ఒక సినిమా చేయనుంది. ఫ్రీడమ్ అనే మూవీతో ఆమె తెలుగులోకి మరోసారి రానుంది. స్వతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే పిరియాడికల్ కథా చిత్రంగా తెరకెక్కనుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. శశికుమార్ నటుడే కాదు.. మంచి దర్శకుడు, నిర్మాత కూడా.. గతంలో ఆయన కోలీవుడ్‌లో సుబ్రమణిపురం, నాడోడిగళ్, సుందర పాండియన్ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. -
అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తి.. ఏ సినిమాకో తెలుసా?
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో నిలిచాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించారు. (ఇది చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) 2021 ఏడాది అవార్డులకు గానూ తెలుగు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ అవార్డ్ అల్లు అర్జున్ను వరించగా.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆరు, ఉప్పెన చిత్రానికి అవార్డులు దక్కాయి. ఈ సందర్బంగా నాని కంగ్రాట్స్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్‌స్టాలో స్టోరీస్‌లో జై భీమ్ అంటూ లవ్ బ్రేకప్ అయిన సింబల్‌ను జోడించారు. అయితే 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నటుడి విభాగంలో సూపర్‌స్టార్ సూర్య, ఉత్తమ చిత్రం విభాగంలో జై భీమ్ చిత్రానికి వస్తుందని ఆయన అభిమానులు భావించారు. జై భీమ్ పట్ల నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్.. అట్టడుగు వర్గాలపై పోలీసుల దౌర్జన్యాలను చూపించారు. ఈ కథ ముగ్గురు గిరిజనుల చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రంలో మణికందన్, లిజిమోల్ జోస్, ప్రకాష్ రాజ్, రజిషా విజయన్, గురు సోమసుందరం, రావు రమేష్, జయప్రకాష్, ఇళవరసు, ఎలాంగో కుమారవేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!) #Nani's feel sad that #Suriya's #JaiBheem did not win a single #NationalFilmAwards2023 Shares Via Instagram Story.#FilmyBowl @SatishKTweets pic.twitter.com/rVk5xzskVF — Filmy Bowl (@FilmyBowl) August 25, 2023 -
'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా మెరిశాయి. అయితే సూర్య 'జై భీమ్' చిత్రానికి అవార్డ్ రాకపోవడం మాత్రం చాలామందిని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. కనీసం ఒక్కటైనా వచ్చుంటే బాగుండేదని వాళ్లు అభిప్రాయపడ్డారు. మరి 'జై భీమ్'కి అవార్డ్ ఎందుకు మిస్ అయింది? కారణాలు ఏంటి? (ఇదీ చదవండి: జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్) సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని.. నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసిన సినిమా 'జై భీమ్'. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ సాధారణ లాయర్ పాత్రలో సూర్య అదరగొట్టేశాడు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు ఏ విభాగంలోనూ అవార్డ్ రాలేదు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలవడం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. దానికి అతడి పూర్తి అర్హుడు. దీనికి సూర్య కూడా పోటీదారుడే కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. 2020లో సూరరై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా సూర్య.. జాతీయ అవార్డు అందుకున్నాడు. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'జై భీమ్' కూడా అదే సంస్థ నుంచి వచ్చింది. ఇన్నేళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో.. ఏ హీరోకి వరసగా రెండుసార్లు పురస్కారం వరించలేదు. అలానే 'పుష్ప' మూవీకి దేశవ్యాప్తంగా వచ్చినంత పాపులారిటీ 'జై భీమ్'కి రాలేదనేది మీకు తెలుసు! ఇలా అనుకుంటేపోతే.. గతంలోనూ చాలావరకు మంచి మంచి సినిమాలకు కొద్దిలో జాతీయ అవార్డులు మిస్ అయ్యాయి. అంతమాత్రన వాటిని తక్కువ చేసినట్లు కాదు. అవార్డుల వచ్చింది లేనిది కొన్నిరోజుల్లో మర్చిపోతారేమో గానీ ఓ మంచి సినిమాని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. 'జై భీమ్' ఈ లిస్టులో కచ్చితంగా ఉంటుంది. ఎంటర్టైన్ చేసే విషయంలో 'పుష్ప', మెసేజ్ ఇవ్వడంతోపాటు ఎమోషనల్ చేసే విషయంలో 'జై భీమ్'.. ఎప్పటికీ అలా నిలిచిపోతాయి అంతే! (ఇదీ చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్) -
రజనీ కొత్త సినిమా.. స్టార్ట్ అప్పుడే
‘జైలర్’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు హీరో రజనీకాంత్. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాల్లో కొంత సమయం గడిపారు రజనీ. అలాగే దేశంలోని మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నారాయన. అయితే రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందట. దీంతో ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమాపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని, సెప్టెంబరు రెండోవారంలో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్లో 170వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ఓ కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్, ప్రతినాయకుడి ఛాయలు ఉండే మరో కీలక పాత్రలో శర్వానంద్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది. -
'జై భీమ్' డైరెక్టర్‌తో రజనీకాంత్ సినిమా.. షూటింగ్ అప్పుడే
హీరో రజనీకాంత్ మే మొదటి వారంలో పోలీస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకోనున్నారుట. 'జై భీమ్' ఫేమ్ టీజే ఙ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మే మొదటివారంలో ప్రారంభం కానుందని, ఇందుకు తగ్గట్లుగా ఙ్ఞానవేల్ ప్రీ పొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారని కోలీవుడ్ టాక్. కొన్ని వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమాలో ఓ ముస్లిం పోలీస్ అధికారి పాత్రలో రజనీకాంత్ నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు రజనీకాంత్. అలాగే లాల్‌సలామ్ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర చేస్తున్నారు. -
మరో సంచలనమైన కొత్త కేసుతో జై భీమ్-2 ..!
-
Jai Bhim 2: సూర్య జై భీమ్ సీక్వెల్ ఉంటుందా? నిర్మాత ఏమన్నారంటే..
తమిళసినిమా: నటుడు సూర్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన చిత్రం జై భీమ్. ఆయన తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. 1993 ప్రాంతంలో విల్లుపురం సమీపంలోని గిరిజనుల జీవన విధానాన్ని, వారి కష్టాలను ఈ చిత్రంలో చూపించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహింన ఇందులో గిరిజనుల రక్షణ కోసం పోరాడిన న్యాయమూర్తి చంద్రు పాత్రలో సూర్య నటించారు. గిరిజనుల కోసం సర్య చేసిన న్యాయపోరాటమే జై భీమ్ చిత్రం. ఈ చిత్రం గత ఏడాది దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అంతేకాదు జై భీమ్ చిత్రం అకాడమీ అవార్డును గెలుచుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి సూర్యను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. ఈ చిత్రోత్సవంలో పాల్గొన్న దర్శకుడు జ్ఞానవేల్ జై భీమ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న మీడియా ప్రశ్నకు న్యాయమూర్తి చంద్రు వాదించిన అనేక కేసులు ఉన్నాయన్నారు. వాటిలో ఏదో ఒక అంశంతో జై భీమ్‌కు సీక్వెల్‌ను కచ్చితంగా చేస్తామని అందులోనూ సూర్య నటిస్తారని బదులిచ్చారు. ఇదే విషయాన్ని నిర్మాత రాజశేఖర్ సైతం ద్రువీకరించారు. దీంతో కాస్త ఆలస్యంగానైనా జై భీమ్‌కు సీక్వెల్‌ను ఎదురు చూడవచ్చన్నమాట. -
జై భీమ్ కాంబినేషన్ రిపీట్.. మరో యథార్థ సంఘటన ఆధారంగా సినిమా
సాక్షి, చెన్నై: సూర్య సినీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం జై భీమ్. జ్యోతిక, సూర్య కలిసి 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గిరిజన వాసుల జీవన విధానాన్ని, వారి సమస్యలను ఆవిష్కరించే యథార్ధ కథాంశంతో రూపొందింది. ఇందులో నటుడు సూర్య ప్రముఖ న్యాయవాది చంద్రు పాత్రలో నటించి గిరిజనుల తరఫున న్యాయం కోసం పోరాడిన విషయం తెలిసిందే. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 4వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుని, పలు అవార్డులను గెలుచుకుంది. కాగా ఆ చిత్ర కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. నటుడు సూర్య కథానాయకుడిగా దర్శకుడు జ్ఞానవేల్ మరోసారి జై భీమ్ చిత్రం తరహాలో ఒక యథార్థ సంఘటనను ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని సూర్య, జ్యోతికల నిర్మాణ సంస్థ 2 డి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుందని సమాచారం. చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్ ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు గురువారం మొదలైనట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించినట్లు సమాచారం. కాగా అంతకుముందు దర్శకుడు జ్ఞానవేల్ అమెజాన్ ప్రైమ్ టైం కోసం ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధమ వుతున్నారు. ఇది శరవణ భవన్ హోటల్ అధినేత దివంగత రాజగోపాల్ జీవితంలో జరిగిన సంచలన సంఘటనల ఇతివృత్తంతో ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనికి దోసె కింగ్ అనే టైటిల్‌ను కూడా నిర్ధారించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
జై భీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం
తమిళసినిమా: నటుడు సర్య కథానాయకుడిగా నటించి నిర్మించిన సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను, విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సూరరై పోట్రు చిత్రం సూర్యకు తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. ఇక జై భీమ్ 94వ అకాడమీ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుందీ చిత్రం. ఈ సినిమాను సౌత్ ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి వెల్లడించారు. నవంబర్ 20 నుం 28 వరకు గోవాలో ఈ చిత్రోత్సవాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రోత్సవాల్లో మొత్తం 45 చిత్రాలను ప్రదర్శించనున్నారు. అందులో 20 లఘు చిత్రాలు, 25 కమర్షియల్ చిత్రాలకు చోటు లభించాయి. అందులో సూర్య కథానాయకుడిగా నటించిన జై భీమ్ ఒకటి. ఈ చిత్రాన్ని నటుడు సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఇందులో సూర్య న్యాయమూర్తి కే.చంద్రు పాత్రలో నటించారు. గత ఏడాది నవంబర్ నెలలో అమేజాన్ ప్రైమ్ టైమ్‌లో విడుదలై విశేష ఆదరణను పొందింది. -
జైభీమ్ వివాదం: హైకోర్డులో సూర్య దంపతులకు ఊరట
హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభిచింది. జై భీమ్ చిత్రంలోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. గురువారం(ఆగస్ట్ 11) ఈ కేసుపై విచారించిన మద్రాస్ న్యాయస్థానం ఈ పటిషన్‌ను రద్దు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా గతేడాది సూర్య నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ అయితే కొన్ని సామాజిక వర్గాల మాత్రం ఈసినిమాను వ్యతిరేకించాయి. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజికవర్గానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి తమ మనోభావాలు దెబ్బతిసే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ సైదాపేట కోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ మేకర్స్ చెన్నై హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇది రిటైర్డ్ అడ్వకేట్ చందు నిజ జీవితం ఆధారం తీసిన సినిమా అని, ఓ కేసులో ఆయన ఎలా పోరాడో ఉన్నది ఉన్నట్లు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. అంతేకాని ఎవరి మనోభవాలను దెబ్బతీయాలనేది తమ ఉద్ధేశం కాదంటూ సూర్య కోర్టుకు వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు ఈ పటిషన్‌పై విచారించిన చెన్నై హైకోర్టు ఈ కేసును రద్దు చేసింది. -
జై భీమ్ వివాదం.. సూర్యపై హైకోర్టు కీలక ఆదేశం
సూర్యపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదని చెన్నై హైకోర్టు సోమవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. నటుడు సూర్య కథానాయకుడు నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకుడు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే కొన్ని సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజిక వర్గం తమ మనోభావాలు దెబ్బతినే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ సంతోష్ అనే వ్యక్తి స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయకుడు సూర్య, నిర్మాతల్లో ఒకరైన జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సూర్య తదితరులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెలచ్ఛేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ చిత్రం సూర్య తరపున చెన్నై హైకోర్టును కోరారు. ఈ కేసు సోమవారం విచారణకు రాగా.. న్యాయమూర్తి సతీష్ కుమార్ ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులను ఆదేశించారు. -
సూర్యను మరోసారి డైరెక్ట్ చేయనున్న ‘జై భీమ్’ డైరెక్టర్ !
చెన్నై సినిమా: జై భీమ్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటుడు సూర్య కథానా యకుడిగా నటించి తన 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించిన జై భీమ్ చిత్రం గత ఏడాది ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విష యం తెలిసిందే. ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. కాగా ఈయన సూర్యను మరోసారి డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కథ సూర్యకు నచ్చేయడంతో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కాగా ప్రస్తుతం సూర్య బాలా దర్శకత్వంలో ఓ చిత్రం, వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' చిత్రాలను చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: 👉🏾 'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు.. -
జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్
FIR Filed On Hero Suriya Wife Jyothika And Jai Bhim Director: తమిళ స్టార్ హీరో సూర్యపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జైభీమ్ మూవీ వివాదం నేపథ్యంలో హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్ఫించాలని సైదాపేట మెజీస్ట్రేట్ ఆదేశించింది. కోర్డు ఆదేశాల మేరకు వేలచ్చేరి పోలీసులు హీరో సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సూర్యపై వన్నియర్ సంఘం రూ. 5 కోట్ల పరువు నష్టం దాఖలు చేసింది. చదవండి: 'సర్కారు వారి పాట' విజయంపై మహేశ్ బాబు స్పందన.. అయితే సూర్య బేషరుతుగా క్షమాపణ కోరితే.. పరువు నష్టం ఉపసంహరించుకుంటామని వారు తెలిపారు. కాగా జైభీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో వేలచ్చేరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పోలీసులు స్పందించకోవడంతో ఆయన సైదాపేట మెజీస్ట్రేట్ను ఆశ్రయించాడు. జైభీమ్ హీరో సూర్య, నిర్మాత జ్యోతికతో పాటు దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టలో సమర్పించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. చదవండి: కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్ అయితే పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురిని కోరింది. కాగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు..
Suriya Jai Bhim Movie Got Indie Spirit Awards At Boston International Film Festival: కరోనా సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 'జై భీమ్'. సూర్య హీరోగా టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల 'దాదా సాహేబ్ పాల్కే ఫిలీం ఫెస్టివల్'లో రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 'ఉత్తమ చిత్రం'గా నిలవగా, మూవీలో నటించిన మణికందన్‌కు 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్' అవార్డు వచ్చంది. తాజాగా 'జై భీమ్' సినిమా మరో రెండు అవార్డులను సాధించింది. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో జై భీమ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటి లియోమోల్ జోస్‌కు 'ఇండీ స్పిరిట్ బెస్ట్ యాక్ట్రెస్' అవార్డు వరించగా, 'ఇండీ స్పిరిట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డును మూవీ కెమెరామెన్ ఎస్.ఆర్. కదీర్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సంస్థ పేర్కొంది. సూర్య, జ్యోతిక కలిసి '2డీ ఎంటర్టైన్మెంట్' పతాకంపై 'జై భీమ్' చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు The Director of #JaiBhim, @tjgnan Sir handed over #BostonInternationalFilmFestival's Award for the Indie Spirit Best Cinematography to @srkathiir Sir 🥳@Suriya_offl #Jyotika @rajsekarpandian @BostonInterFF pic.twitter.com/M4l6z0jDUT — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 6, 2022 #JaiBhim bags the Awards for Indie Spirit Best Actress & Indie Spirit Best Cinematography at the #BostonInternationalFilmFestival Congratulations @jose_lijomol & @srkathiir Sir on the Awards! Thank You @BostonInterFF for the honour@Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian pic.twitter.com/zyfjdo7Sn2 — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్కు కోర్టు ఆదేశం
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన 'జై భీమ్' చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, అతని భార్య జ్యోతిక(జై భీమ్ నిర్మాత) దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. -
దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు
Suriya, Naresh Movies Won DadaSaheb Phalke Film festival Award: తమిళ స్టార్ హీరో సూర్య ‘జై భీమ్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Suriya’s ‘Jai Bhim’ bags two awards at the Dadasaheb Phalke International Film Festival 2022 "The film won the award for the Best Film and actor Manikandan won the Best Supporting Actor awards at the film festival reportedly on May 3." - TOI #JaiBhim pic.twitter.com/DZ5iL493i6 — ♂️ ᴿᵃᵗᵉᵈ®️ˢᵘᵖᵉʳ ˢᵗᵃʳ🌟 ᵀʰᵃˡᵃᵖᵃᵗʰʸ🥇MSD7️⃣⚓ (@VIIJAYism) May 4, 2022 చదవండి: వైరల్: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును విజయ్ అందుకున్నారు. దీంతో నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్‌కి అభినందనలు తెలుపుతున్నారు. This is the proud moment for me and my Naandhi team about my Darling @vijaykkrishna receiving the Dadasaheb Phalke Film Festival 2022 Award as the best Debut Director. In this joy, the responsibility of all our friends is further increased more.. @allarinaresh @varusarath5 pic.twitter.com/zd7rxxEKoq — Brahma Kadali (@brahmakadali) May 1, 2022 చదవండి: విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Oscar 2022: ఆస్కార్స్ నుంచి జై భీం ఔట్!
-
ఆస్కార్‌కు నామినేట్ అయిన జై భీమ్, మరక్కార్ చిత్రాలు
Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022: ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల రేసులో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం కాగా, మరోకటి మోహన్ లాల్ నటించిన 'మరక్కార్' చిత్రం. ఆస్కార్ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో రెండు ఇండియన్ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్ 'జై భీమ్' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రానికి టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇక మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి27న అమెరికాలో జరగనుంది. -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్‌తో ప్రేమాయణం, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
Rewind 2021: కలిసొచ్చిన కరోనా.. ఓటీటీల బిజినెస్ 8000 కోట్లు!
మనదేశంలో ‘ఓవర్ ది టాప్ (ఓటీటీ)’ ప్రసారాలను మొదటగా 2008లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రారంభించింది ‘బిగ్ ఫ్లిక్స్’ పేరుతో. అయితే ఈ ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది మాత్రం కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్ పుణ్యంతోనే. 2020తో పాటు 2021 సంవత్సరాన్నీ ‘ఓటీటీ నామ సంవత్సరం’గా పేర్కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం నలభైకి పైగా ఓటీటీ ప్రొవైడర్స్ ఇంటర్నెట్ ఆధారంగా తమ ప్రసారాలను అందిస్తున్నాయి. వాటిలో నెట్‌ఫ్లిక్స్ (2016, జనవరిలో మన దేశంలో మొదలైంది), అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, సోనీలివ్, వూట్, మాక్స్ ప్లేయర్, హోయ్ చోయ్ (ప్రాంతీయ భాషల్లో తొలి ఓటీటీ) వంటివెన్నో ఉన్నాయి. వీటిలో ‘ఇరోస్ నౌ’ ఓటీటీ దాదాపు పన్నెండు వేలకు పైగా సినిమాల కంటెంట్‌తో అత్యధిక సినిమా సాఫ్ట్వేర్ ఉన్నసంస్థగా రికార్డ్ సృష్టించింది. తెలుగులో2020, ఫిబ్రవరిలో ‘ఆహా’ ప్రారంభమై తెలుగు ప్రేక్షకులలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వేదికగా నిలిచిందిప్పుడు. మనదేశంలో ఈ ఓటీటీ వ్యాపారం 2018లో 2150 కోట్ల రూపాయలు ఉండగా, 2019 నాటికి 3,500 కోట్ల రూపాయలకు పెరిగింది. 2020 నాటికి 6,500 కోట్ల రూపాయలకు, ఈ ఏడు అంటే 2021కి దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయలకు చేరుకుంది. అలాగే 2021లో ఓటీటీలో ప్రసారమైన సినిమాల్లో దేశం మెత్తం మీద అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా తమిళంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ‘జై భీమ్’ సినిమా నిలిచింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడై, 2021లో ప్రజలపై ఓటీటీ వేదిక చూపించన ప్రభావానికి తెర ఎత్తు ఉదాహరణగా మిగిలింది. ఈ వేదికపై ప్రసారం అవుతున్న సినిమాలు, ఇతర కార్యక్రమాల విషయంలో ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం 2021లో సెన్సార్షిప్ ప్రమాణాలను ప్రకటించింది. ఈ వేదిక ద్వారా ప్రసారం అవుతున్న కంటెంట్‌ను అయిదు కేటగరీలుగా నిర్ధారించింది. -
జైభీమ్ సినిమాలో కోర్టు సీను డైలాగులు నేనే రాశా
(ఎ. అమరయ్య, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి): ‘సత్వర న్యాయం కోసం పోరు కొనసాగాలి. దేశంలో కోర్టుల ద్వారా ప్రతి పౌరునికీ సత్వర న్యాయం అందాలి. జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే. వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులపై ఉంది’ అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జై భీమ్ సినిమా స్ఫూర్తిప్రదాత జస్టిస్ కె.చంద్రు అభిప్రాయపడ్డారు. పీడిత వర్గాలకు న్యాయం అందించాలన్న దిశగా వచ్చిందే జైభీమ్ సినిమా అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగులకు సత్వర న్యాయం అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. చట్టాలను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు చట్టాలను బాగా చదివి, అర్థం చేసుకుని అన్వయ, ఆచరణలకు పూనుకోవాలి. అప్పుడే గాలి, నీరు లభించినంత సహజంగా న్యాయాన్నీ అందుకోగలం. హక్కుల కోసం పోరాడినప్పుడు, అసమానతలను నిలదీసినప్పుడు చట్టం తనని తాను లోతుగా శోధించుకునేలా చేయాలి. ఇది కేసులు వేసిన వారికి మాత్రమే దక్కే విజయం కాదు. ప్రజలు చైతన్యం కావడానికి ఉపయోగపడుతుంది. ప్రజాభిప్రాయం చట్టాలను, కోర్టులను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం విజయం సాధించిన తీరు ఇదే చెబుతోంది. అణగారిన వర్గాలకు సత్వర న్యాయం కోసం అయినా పోరు కొనసాగాలి. అప్పుడే న్యాయమూర్తుల మైండ్‌సెట్ కూడా మారుతుంది. న్యాయవాదులు ఎంత తెలివిగా ప్రశ్నిస్తే తీర్పులు అంత ప్రభావవంతంగా వస్తాయి. 1999లో కోర్టు ధిక్కార చట్టానికి సవరణ జరిగింది. దాని ప్రకారం.. చేసిన వ్యాఖ్య నిజమైతే అది కోర్టు ధిక్కారం కిందకు రాదు. నేను జడ్జిగా ఉన్న ఆరేళ్లలో ఒక్క కోర్టు ధిక్కార కేసులో శిక్ష వేయలేదు. కులానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. కుల వివక్ష, క్రూరత్వాలను అరికట్టడానికి కోర్టులు చట్టాలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. జైభీమ్ సినిమా చెప్పిందదే ఇదో 28 ఏళ్ల నాటి ఘటన. నేను బాధితుల తరఫు లాయర్ని. తీర్పు ఇచ్చింది జస్టిస్ పీఎస్ మిశ్రా. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తెగువ చూపిన మనుషుల కథ అది. వాళ్లు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడమే కాదు.. సమాజంలో అందరి జీవితాలు మెరుగుపడటానికి తోడ్పడ్డారు. ఇలాంటి కేసుల్లో వాదోపవాదాలకు లాయర్లకు దొరికే అవకాశం తక్కువ. పాయింట్ సూటిగా, జడ్జిని తాకేలా క్లుప్తంగా ఉండాలి. అటువంటి అవకాశం నాకొచ్చింది. ఆ సినిమాలో హీరో కోర్టులో చెప్పే డైలాగులు తక్కువ. వేరే వాళ్లు రాస్తే పెడర్ధాలు వచ్చే అవకాశం ఉంటుందని నన్నే రాయమన్నారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి జస్టిస్ కృష్ణయ్యర్ బొమ్మ కోర్టు సీన్లో పెట్టించింది కూడా నేనే. జై భీమ్ ఈవేళ ఓ నినాదమైంది. కార్మికవర్గాన్నీ, మేధావి వర్గాన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చింది. ఈ సినిమా చూసిన వారందరి నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి.. ప్రస్తుత సమాజంలోనూ ఇంత దుర్భరంగా జీవించే జాతులున్నాయా? ఇందుకు సిగ్గుపడాలి. రెండు.. పోలీసులు ఇంత క్రూరంగా ఉంటారా? అని. గిరిజన జీవితాలపై తీసిన సినిమాను ఓటీటీ ప్లాట్‌పారాల మీద విడుదల చేస్తారా? పేదలు చూసే అవకాశం లేదా? అని అడుగుతున్నారు. అందుకే మార్చిలో థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో నటించకపోయినా చాలా మంది నన్నే హీరో అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. రెండేళ్ల కిందట విజయవాడలో ఓ సెమినార్‌కి వస్తే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈవేళ పరిస్థితి భిన్నంగా ఉంది. సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లేందుకు విమానం ఎక్కితే.. జై భీమ్ స్ఫూర్తిప్రదాత జస్టిస్ చంద్రు మన మధ్య ఉన్నారని ఎయిర్‌హోస్టెస్‌లు మైకుల్లో చెబుతున్నారు. ప్రస్తుతం నేనో సెలబ్రిటీని అయ్యా (నవ్వు). ఉత్తమ తీర్పులతోనే కోర్టుల ఔన్నత్యం ఉత్తమ తీర్పులతో కోర్టుల ఔన్నత్యం పెరుగుతుంది. కోర్టులేమన్నా శిలాశాసనాలా, రాజ్యంగమేమన్నా అంతిమ గ్రంథమా, అదో కాగితపు పులి, బంగాళాఖాతంలో విసిరి వేయండని 1975 దాకా చాలా మంది వాదించారు. జస్టిస్ చిన్నపరెడ్డి మీసా చట్టంపై ఇచ్చిన తీర్పు ఈ అభిప్రాయాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పుడు మళ్లీ 1975 నాటికన్నా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు నిదర్శనం అయోధ్య తీర్పు. రాజ్యాంగం పరిష్కారం కాదన్న వారే ఈవేళ తొలినాటి రాజ్యాంగ రాతప్రతుల్ని (సెక్యులరిజం, సోషలిజం పదాలు లేని ప్రతి. 42వ సవరణ ద్వారా అవి రాజ్యాంగంలో చేరాయి) పంచిపెడుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను అంబేడ్కర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారని ఆరోపించిన వాళ్లే ఈవేళ ఆయన్ను కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆ పదాలను బుద్ధిజం నుంచి తీసుకున్నట్టు అంబేడ్కర్ 1954లో ఆకాశవాణి ప్రసంగంలో చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతోంది గిరిజనులే... పర్యావరణాన్ని నిజంగా కాపాడుతోంది గిరిజనులే. అటువంటి వారిపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజానికి ఎస్టీలలో సామాజిక మండళ్లు ఉంటాయి. సొంత ప్రవర్తనా నియమావళి ఉంది. దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ ఇప్పటికీ డీనోటిఫైడ్ జాతుల పేరిట గిరిజనుల బతుకుల్ని బుగ్గి పాల్జేస్తున్నారు. అపరిష్కృత కేసుల్లో తిరిగి వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారు. -
న్యాయవ్యవస్థకూ పరిమితులున్నాయి
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ క్కూడా పరిమితులున్నాయని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జైభీమ్ సినిమా ఫేం జస్టిస్ కె.చంద్రు తెలిపారు. తనకున్న పరిమితులను న్యాయమూర్తులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజానికి మంచి న్యాయమూర్తులు, ప్రజల హక్కులను కాపాడే న్యాయమూర్తులు కావాలన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఏపీసీఎల్ఏ)–కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ కె.చంద్రు ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులతో పాటు తన అనుభవాలను కొన్నిటిని వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులు పరిధి దాటుతున్నారంటూ కొన్ని సందర్భాలను దాన్లో ప్రస్తావించానని తెలియజేశారు. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చునని ఈ సందర్భంగా చెప్పారాయన. అంతకు మించి ఉత్తర్వులివ్వటం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు అప్పగించటం, నిందితులను పట్టుకోవటానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపటం వంటి చర్యలను తప్పుబట్టారు. కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. ‘‘నేను కోరుకునేది ఒక్కటే. మానవ హక్కుల పరిరక్షణ. అది ఏ వ్యక్తికి సంబంధించినదైనా కావొచ్చు’’ అన్నారాయన. అంతకు ముందు ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేశ్ కుమార్ మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే పనులు అవుతున్నాయన్నారు. లాయర్లు హక్కుల కోసం పనిచేయాలి... అనంతరం విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)లో ‘మానవ హక్కులు– న్యాయవాదుల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్ చంద్రు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. న్యాయవాదులకు రాజ్యాంగమే ఆయుధమని, వారు డబ్బు కోసం కాకుండా హక్కుల కోసం పని చేయాలని జస్టిస్ చంద్రు చెప్పారు. బాధితుడికి న్యాయం చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చన్నారు. డబ్బులు ముఖ్యం కాదని, సేవ చేయాలనే దృక్పథంతో వృత్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరో అతిథి హైకోర్టు డిజిగ్నేటడ్ సీనియర్ అడ్వకేట్ వేములపాటి పట్టాభి మాట్లాడుతూ ఎన్నో కేసులలో తీర్పులతో పాటు గతంలో వాదించిన ఎన్నో కేసులతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జస్టిస్ చంద్రూని రోల్ మోడల్‌గా తీసుకుని యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలని సూచించారు. విశ్రాంత అదనపు జిల్లా జడ్జి ఎ.పార్థసారథి, ఏపీ ఏజీ ఎస్.శ్రీరామ్, బీబీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పి.రామకృష్ణ, బి.రవి మాట్లాడారు. -
నల్లగొండలో జైభీమ్ తరహా ఘటన.. వీడియో వైరల్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జై భీమ్ సినిమా తరహా సన్నివేశం చోటు చేసుకుంది. కేసు నిమిత్తం ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిచి.. అతడిని చితకబాదారు ఎస్సై, కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు) నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భూ వివాదానికి సంబంధించన కేసులో ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించాడు ఎస్సై నర్సింహులు. అనంతరం అతడిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం కాస్త పెద్దది కావడంతో ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్ నాగుల్ మీరాను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు.. -
‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?
జైభీమ్ సినిమా కలిగించిన సంచలనం సరే.. కానీ ఒక నిర్మాతగా తనకున్న స్వేచ్చని హీరో సూర్య దుర్వినియోగ పరచారు. డీఎంకే పార్టీ మద్దతు దారుడు, జైభీమ్ నిర్మాత, హీరో సూర్య అగ్ని(వన్ని) కులక్షత్రియుల భుజంపై గన్ పెట్టి, హిందూ మతంపై ఎక్కుపెట్టిన, మతపర వ్యాపారాత్మకమైన మూలకాన్ని నింపిన తూటాను పేల్చాడు. విలన్ పాత్రధారుడైన పోలీస్ అధికారి ఇంట్లో ఒక సన్నివేశంలో అగ్ని(వన్ని)కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను ప్రత్యేకించి కనిపించేటట్లు పెట్టడం సదుద్దేశం ఎలా అవుతుంది? (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో వహ్నికుల క్షత్రియులుగానూ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో అగ్నికుల క్షత్రియులుగానూ జీవో నంబర్ 297/తేదీ.13–06–1921 అనుసరించి అధికారికంగా ధ్రువీకరించబడుతున్న అగ్ని, వన్ని కులక్షత్రియులు, పవిత్రమైనదిగా ఆరాధించే తమ జాతి లోగోను ప్రతినాయకుడి ఇంట్లో పెట్టడం ద్వారా జాతి వివక్షదారులు వన్నియర్స్ అన్న అవాస్తవాన్ని చిత్రీకరించారు. ఈ అగ్ని, వన్ని కులక్షత్రియుల అగ్నికుండం లోగో ఉన్న క్యాలండర్ ప్రతినాయకుడి ఇంట్లోకి గాల్లో కొట్టుకు వచ్చి రాలేదు అన్నది వాస్తవం. ఇది తప్పు అని గొడవ చేస్తే, ఆ సన్నివేశంలో అగ్ని(వన్ని) కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను తొలగించి, జై భీమ్ సినిమాలో నిజ జీవితంలో గిరిజన రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరు వాస్తవానికి ఆంథోనిరాజు. కానీ, జై భీమ్ సినిమాలో రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరుని గురుమూర్తిగా మార్చారు. (చదవండి: జైభీమ్.. నాటి పోరాటం గుర్తొచ్చింది!) యధార్థ చరిత్ర అని చెప్పిన జై భీమ్ సినిమాలో హీరో తదితర కొన్ని ముఖ్యమైన పాత్రలకు నిజ జీవితంలోని పేర్లే పెట్టారు. కానీ, విలన్ పాత్రధారి పేరుని మాత్రం హిందూ పేరుగా మార్చి పెట్టారు. సినిమా కలెక్షన్స్ పెంచుకోవడానికి, పూర్తి వ్యాపారాత్మక కోణంలో ఆలోచించి సినిమా టైటిల్‌ను జైభీమ్ అని పెట్టిన చిత్ర నిర్మాణ బృందం, అదే వ్యాపారాత్మక కోణంలో ప్రతి నాయకుడిని హిందువుగా చూపించాలన్న అనైతిక చర్యకు పాల్పడింది. ఒక పవర్ఫుల్ సందేశాన్ని అందించే అవకాశాన్ని చిత్ర నిర్మాణ బృందం ముఖ్యంగా నిర్మాత, హీరో సూర్య స్వార్థానికి వాడుకోవడం సమర్థనీయం కాదు. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) – చింతా శ్రీకృష్ణ బాబు వ్యవస్థాపక అధ్యక్షులు దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ -
వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!
ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన ఈ సినిమా తమిళనాడులోని ఒక వర్గాన్ని మాత్రం ఆగ్రహానికి గురిచేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం మీద రాజకీయంగా శక్తిమంతులైన వణ్ణియర్ల కుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాల వల్ల... ఆదివాసీ ఇరుళ తెగ, ఇంకా అలాంటి సామాజిక వెలివేతకు గురవుతున్నవారి జీవితం గురించి చేయాల్సిన ఆలోచన పక్కదారి పడుతోంది. అది కీరపాక్కం గ్రామం. తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరికి దగ్గర ఒక గుడిసెల సముదాయం. గుడిసెలపై కప్పి ఉన్న పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు వాళ్ళ కటిక దారిద్య్రాన్ని విప్పి చెబుతున్నాయి. ఆ ఇళ్ళల్లోని ఒక ఇంట్లో నాగమ్మ అనే యాభై ఐదేళ్ళ మహిళ ఉంటున్నది. ఆ గూడెం ఊరిలో భాగం కాదు. అక్కడికి వెళ్ళ డానికి రోడ్డు పెద్ద మాట, ఎటువంటి దారీ తెన్నూ లేని వారి జీవితంలానే ఉంటుంది తొవ్వ. ఒక రోజు కొందరు వ్యక్తులు ఏడుపులు, పెడబొబ్బలతో ఒక మనిషిని మోసుకొచ్చారు. ఆ వ్యక్తి చావుకు దగ్గరవుతున్నట్టు వాళ్ళ ఏడుపులని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ గుంపు నాగమ్మ గుడిసె ముందు ఆగింది. నాగమ్మకు వెంటనే విషయం అర్థమైంది. మోసు కొచ్చిన వ్యక్తిని పట్టుకొని చూసింది. పాము కాటు వేసినట్టు గమనించింది. దగ్గర్లో ఉన్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తీసుకొచ్చింది. తన వద్ద ఉన్న కొన్ని వేళ్ళు, బెరడులు, ఆకుల్ని కలిపి నూరింది. పసరు పాము కాటు వేసిన చోట పిండింది. నూరిన ముద్దను గాయంపైన కట్టింది. అట్లా రెండు మూడుసార్లు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఈ వైద్యం చేసింది తమిళనాడులోని ఇరుళ ఆదివాసీ తెగకు చెందిన మహిళ. తమిళనాడులో ఉన్న ప్రాచీన ఆదివాసీ తెగలలో ఇది ఒకటి. తమిళనాడులో ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో రాణిస్తున్న సూర్య తీసిన ‘జై భీం’ చిత్రం ఇటీవల ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మానవత్వం ఉన్న ప్రతి మనిషీ ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఆ సినిమాలో ఒక ఆదివాసీ వ్యక్తిపై, దొంగతనం నేరం మోపి, పోలీ సులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే ఇది కథ కాదు. నిజంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు రాజాకన్నన్. ఆయన ఇరుళ తెగకు చెందిన వాడు. జై భీం చిత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యింది. కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు, పేర్లు తమ ప్రతిష్టను దెబ్బతీశాయనీ, ఐదు కోట్ల పరువునష్టం చెల్లించాలనీ కోర్టును ఆశ్ర యించారు. వాళ్ళే వణ్ణియర్ కుల సంఘం పెద్దలు. ఆ కుల సంఘానికి మరో పేరు పీఎంకే. పాట్టాళి మక్కళ్ కట్చి. దాని నాయకుడు ఎస్. రామదాసు. ఆయన కూడా ఈ చిత్రంపైన విరుచుకుపడ్డారు. వణ్ణియర్ కుల ప్రతిష్టకూ ఈ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? నిజానికి దీనిని ఎవ్వరూ అంతగా గమనించలేదు. సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు సినిమాలో గురుమూర్తి. ఆ పేరు పెట్టడమే వాళ్ళ తొలి అభ్యంతరం. గురుమూర్తి అనే పేరు వాళ్ల ఒక నాయకుడిని గుర్తు చేస్తుందన్నది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ నాయకుడి పేరు జె.గురు. ఆ ఇన్స్పెక్టర్ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల తమ నాయకుడి జ్ఞాపకాలు వస్తాయని ఆ సంఘం ఆరోపణ. జె. గురు అనే నాయకుడు రెండుసార్లు శాసనసభ్యుడు. అరియాబారు జిల్లా, జయకొండు నియోజకవర్గం నుంచి పీఏంకే నుంచి ఎన్నికయ్యారు. ఆయనది వణ్ణియర్ సంఘంలో కీలక భూమిక. వీళ్లు ఉత్తర తమిళనాడులో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం. జె.గురు అనే వ్యక్తి పదుల కొద్దీ దాడుల్లో పాల్గొన్నాడనడానికి ఆయన మీద నమోదైన కేసులే సాక్ష్యం. ఈ చిత్రంపై వణ్ణియర్ సంఘం చేసిన రెండో ఆరోపణ... సిని మాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గురుమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనుక ఒక క్యాలెండర్ ఉందనీ, అందులో తమ కుల చిహ్నమైన కలశం ఉన్నదనీ (దీన్ని ఇటీవల సినిమా నుంచి తొలగించారు). నిజా నికి ఈ రెండు విషయాలను ప్రేక్షకులను గమనించనే లేదు. కానీ ఈ సంఘం ఈ చిత్రాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే అందుకు తమిళనాడు కుల చరిత్రను తడిమి చూడాల్సిందే. తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు, దళితుల, ఆదివాసులపైన దాడులు చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఉత్తర తమిళనాడులో వణ్ణియర్లు సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగివున్నారు. వణ్ణియర్లు అధికంగా ఉన్నచోటే ఇరుళ ఆదివాసీ తెగ కూడా ఉంది. ఇరులు అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ. ఈ తెగ దేశానికీ, సమాజానికీ ఎంతో మేలు చేసిన విషయం ఎవరికీ తెలియదు. పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడానికి ప్రాథమికమైన ముడిపదార్థం పాము విషం. పామును పట్టుకొని, ప్రాణాలకు తెగించి పాము కోరల నుంచి పాము విషాన్ని తీసి ఇస్తే, దానిని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేసి, విషం విరుగుడు ఇంజక్షన్ తయారు చేస్తారు. అంతేకాకుండా, ఈ తెగ గొప్ప వైద్య సాంప్రదాయాన్ని ప్రకృతి నుంచి పుణికి పుచ్చుకుంది. దాదాపు 300 రకాల మందులను తయారు చేసే జ్ఞానం వీరి సొంతం. అయితే ఇప్పటికీ వీరు గ్రామాల్లో నివాసముండరు. నూటికి తొంభై మందికి చదువులేదు. సరైన జీతాలు లేని పద్ధతుల్లో, ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో పని చేస్తున్నారు. ఇవన్నీ పోను గ్రామాల్లో ఎక్కడ దొంగతనమైనా ముందు ఇరుళ సామాజిక వర్గం వారిని పట్టుకొచ్చి, హింసించడం తమిళనాడులో పాతుకు పోయిన కులాధిపత్యానికి తార్కాణం. ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు వీళ్ళ మీద నమోదవుతుంటాయి. మగ వాళ్ళ కోసం వచ్చిన పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అత్యా చారాలు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది జై భీం సినిమాలో కూడా చూశాం. ఇరుళ ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఒకవైపు పోలీసులు, రెండో వైపు పల్లెల్లోని ఆధిపత్య కులాలు ఇరుళ తెగ ప్రజలను పెడుతున్న హింస చెప్పనలవి కానిది. వణ్ణియర్ సంఘం నాయకులు ఎటువంటి భయ సంకోచాలు లేకుండా, చట్టాలను, రాజ్యాంగాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదేళ్ళ క్రితమే పీఏంకే అధ్యక్షుడు రామదాసు ‘కులాంతర వివాహాలను జరగనివ్వం. ఎవరైనా వణ్ణియర్ కులం పిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే తగిన శిక్ష అనుభవిస్తారు’ అని ప్రకటించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ పదవ తేదీన ఇరుళ తెగకు చెందిన రమేష్, వణ్ణియర్ కులానికి చెందిన మోహన ప్రేమ వివాహం చేసుకున్నారు. ధర్మపురి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకొని ఊరికి తీసుకొచ్చి, అబ్బాయి తండ్రిమీద ఆ ఊరిలోని ఆ కులపోళ్ళు బహిరంగంగా మూత్రం పోసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ధర్మపురి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే జై భీం చిత్రంలో మనం చూసింది ఒక్క ఘటన మాత్రమే. ఈ చిత్రం వల్ల తాము చేసిన ఎన్నో దురంతాలు ప్రజల మెదళ్లలోకి వెళతాయని భయపడిన కులోన్మాదులు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. నిజానికి తమిళనాడులో పంటలను దెబ్బతీస్తున్న ఎలుకలను, గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన పాములను పట్టుకొని తరతరాలుగా రైతులకు మిత్రులుగా ఉన్న ఇరుళ తెగ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు కుల మతోన్మాదాన్ని తుదముట్టించాలి. మానవీయతకు ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లంతా మరొక్కసారి దళితులు, ఆదివాసీలు ఈ దేశానికీ, సమాజానికీ చేసిన నిస్వార్థమైన సేవలను, అని తరసాధ్యమైన త్యాగాలను గుర్తించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు