Jai Bhim Movie: FIR Filed On Hero Suriya Wife Jyothika and Jai Bhim Director - Sakshi
Sakshi News home page

Suriya-Jyothika: జై భీమ్‌ వివాదం, సూర్య, జ్యోతికలపై ఎఫ్‌ఐఆర్‌

Published Wed, May 18 2022 3:42 PM | Last Updated on Wed, May 18 2022 6:33 PM

FIR Filed On Hero Suriya Wife Jyothika And Jai Bhim Director - Sakshi

FIR Filed On Hero Suriya Wife Jyothika And Jai Bhim Director: తమిళ స్టార్‌ హీరో సూర్యపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. జైభీమ్‌ మూవీ వివాదం నేపథ్యంలో హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టుకు సమర్ఫించాలని సైదాపేట మెజీస్ట్రేట్‌ ఆదేశించింది. కోర్డు ఆదేశాల మేరకు వేలచ్చేరి పోలీసులు హీరో సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే సూర్యపై వన్నియర్ సంఘం రూ. 5 కోట్ల పరువు నష్టం దాఖలు చేసింది.

చదవండి: 'సర్కారు వారి పాట' విజయంపై మహేశ్ బాబు స్పందన..

అయితే సూర్య బేషరుతుగా క్షమాపణ కోరితే.. పరువు నష్టం ఉపసంహరించుకుంటామని వారు తెలిపారు. కాగా జైభీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో వేలచ్చేరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పోలీసులు స్పందించకోవడంతో ఆయన సైదాపేట మెజీస్ట్రేట్‌ను ఆశ్రయించాడు. జైభీమ్‌ హీరో సూర్య, నిర్మాత జ్యోతికతో పాటు దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టలో సమర్పించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశాడు.

చదవండి: కంగనా చిత్రాలన్ని ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్‌

అయితే పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురిని కోరింది. కాగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement