'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు.. | Suriya Jai Bhim Movie Got Indie Spirit Awards At Boston International Film Festival | Sakshi
Sakshi News home page

Jai Bhim Movie: 'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు..

Published Sat, May 7 2022 5:02 PM | Last Updated on Tue, May 24 2022 9:05 AM

Suriya Jai Bhim Movie Got Indie Spirit Awards At Boston International Film Festival - Sakshi

Suriya Jai Bhim Movie Got Indie Spirit Awards At Boston International Film Festival: కరోనా సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 'జై భీమ్‌'. సూర్య హీరోగా టీజే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల 'దాదా సాహేబ్‌ పాల్కే ఫిలీం ఫెస్టివల్‌'లో రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 'ఉత్తమ చిత్రం'గా నిలవగా, మూవీలో నటించిన మణికందన్‌కు 'బెస్ట్‌ సపోర్టింగ్ యాక్టర్‌' అవార్డు వచ్చంది. తాజాగా 'జై భీమ్‌' సినిమా మరో రెండు అవార్డులను సాధించింది. 

ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో జై భీమ్‌ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటి లియోమోల్‌ జోస్‌కు 'ఇండీ స్పిరిట్ బెస్ట్‌ యాక్ట్రెస్' అవార్డు వరించగా, 'ఇండీ స్పిరిట్ బెస్ట్‌ సినిమాటోగ్రఫీ' అవార్డును మూవీ కెమెరామెన్‌ ఎస్‌.ఆర్‌. కదీర్‌ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌' సంస్థ పేర్కొంది. సూర్య, జ్యోతిక కలిసి '2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌' పతాకంపై 'జై భీమ్‌' చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు.

చదవండి: దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement