దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు | Jai Bheem, Naandhi Movies Won DadaSaheb Phalke Film festival Award | Sakshi
Sakshi News home page

Suriya-Allari Naresh: మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సూర్య, అల్లరి నరేశ్‌ చిత్రాలు

Published Wed, May 4 2022 12:50 PM | Last Updated on Wed, May 4 2022 1:06 PM

Jai Bheem, Naandhi Movies Won DadaSaheb Phalke Film festival Award - Sakshi

Suriya, Naresh Movies Won DadaSaheb Phalke Film festival Award: తమిళ స్టార్‌ హీరో సూర్య ‘జై భీమ్‌’, అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: వైరల్‌: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా..

తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేశ్‌ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును విజయ్ అందుకున్నారు. దీంతో నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్‌కి అభినందనలు తెలుపుతున్నారు.

చదవండి: విశ్వక్‌ సేన్‌ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement