Naandhi
-
దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు
Suriya, Naresh Movies Won DadaSaheb Phalke Film festival Award: తమిళ స్టార్ హీరో సూర్య ‘జై భీమ్’, అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాలకు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాయి. ప్రతి ఏడాది జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. 12వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ప్రస్తుతం 2022లో జరగగా ఈ సారి జై భీమ్, నాంది సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇప్పటికే చాలా అవార్డులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. Suriya’s ‘Jai Bhim’ bags two awards at the Dadasaheb Phalke International Film Festival 2022 "The film won the award for the Best Film and actor Manikandan won the Best Supporting Actor awards at the film festival reportedly on May 3." - TOI #JaiBhim pic.twitter.com/DZ5iL493i6 — ♂️ ᴿᵃᵗᵉᵈ®️ˢᵘᵖᵉʳ ˢᵗᵃʳ🌟 ᵀʰᵃˡᵃᵖᵃᵗʰʸ🥇MSD7️⃣⚓ (@VIIJAYism) May 4, 2022 చదవండి: వైరల్: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సినిమాగా జై భీమ్ నిలిచింది. అంతే కాక ఈ సినిమాలో నటించిన మణికందన్ కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వరించింది. దీనిపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక అల్లరి నరేశ్ నటించిన నాంది సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కించారు. ఈ సినిమాకి కాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును విజయ్ అందుకున్నారు. దీంతో నాంది చిత్ర యూనిట్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు విజయ్‌కి అభినందనలు తెలుపుతున్నారు. This is the proud moment for me and my Naandhi team about my Darling @vijaykkrishna receiving the Dadasaheb Phalke Film Festival 2022 Award as the best Debut Director. In this joy, the responsibility of all our friends is further increased more.. @allarinaresh @varusarath5 pic.twitter.com/zd7rxxEKoq — Brahma Kadali (@brahmakadali) May 1, 2022 చదవండి: విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నాంది రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో
తెలుగు హిట్ ‘నాంది’ (2021) హిందీలో రీమేక్ కానుంది. హిందీ నటుడు, దర్శక–నిర్మాత అజయ్ దేవగణ్‌తో కలిసి ఈ రీమేక్‌ను ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ‘‘చాలా ముఖ్యమైన ఓ కథను షేర్ చేసుకోవాల్సిన సమయం ఇది. అజయ్ దేవగణ్ ఫిలింస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ కలిసి తెలుగు హిట్ ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు అజయ్ దేవగణ్. మరి.. ‘నాంది’ హిందీ రీమేక్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? నటీనటులు ఎవరు? అనే విషయాలను స్పష్టం చేయలేదు. ఇక ‘నాంది’ కథ విష యానికి వస్తే.. హాయిగా జీవిస్తున్న ఓ మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూహ్యంగా హత్యారోపణలతో జైలుపాలవుతాడు. న్యాయం కోసం పోరాడే ఆ వ్యక్తి కథే ‘నాంది’ చిత్రం. కొంత గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ కెరీర్‌ని హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు. చదవండి : ఆర్టిస్ట్‌లు లోకల్ కాదు.. యూనివర్సల్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసిన హీరో ధనుష్ -
అల్లరి గతం.. పేరు మార్చేయ్...!
సాక్షి,హైదరాబాద్ : నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో అల్లరి నరేష్‌ని టాలీవుడ్ నేచురల్ స్టార్ నానీ పొగడ్తల్లో ముంచెత్తారు. భవిష్యత్తంతా బంగారుబాటే అన్న సంకేతాలిస్తూ.. నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ.. ”మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను..” అని నాని పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. (ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్) కాగా గమ్యం సినిమాలోని గాలి శ్రీను క్యారెక్టర్‌తో తన నటనను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అల్లరి నరేష్ తాజా చిత్రం నాంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో నాని చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. Finally got to watch #Naandhi రేయ్ రేయ్ రేయ్..@Allarinaresh పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం భవిష్యత్తుకి ఇది నాంది Super happy for you ra .. hope to see you exploring the artist in you more and more here after 🤗 — Nani (@NameisNani) February 28, 2021 -
నాంది టీం గుంటూరు సక్సెస్ టూర్ ఫోటోలు
-
‘నాంది’ థ్యాంక్స్ మీట్
-
ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు
‘‘దాదాపు ఎనిమిదేళ్లుగా నన్ను హిట్స్ పలకరించడం మానేశాయి. ప్రతి ఏడాదీ హిట్ కోసం ఎదురు చూసేవాడిని. 2021లో ‘నాంది’తో హిట్ వచ్చింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా సతీష్ వేగేశ్న నిర్మించిన సినిమా ‘నాంది’. ఈ నెల 19న విడుదలైన సందర్భంగా ‘థ్యాంక్స్ మీట్’లో అల్లరి నరేశ్ మాట్లాడుతూ – ‘‘మహరి’్ష తర్వాత ఏదైనా కంటెంట్ ఉన్న సినిమా చేద్దామని అనుకున్నాను. విజయ్ వచ్చి ‘నాంది’ కథ చెప్పినప్పుడు ‘ఫ్లాప్ హీరోతో సినిమా చేస్తున్నావేంటి’ అని అతన్నిఎవరో అడిగారట. కథలో కంటెంట్ ఉండి... హీరోలో ప్రతిభ ఉంటే సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో పని లేదని విజయ్ అన్నాడట. కరోనా ప్రభావంతో ఇండస్ట్రీ రెండేళ్లు కోలుకోదని అన్నారు. కానీ ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు. మంచి హిట్స్ ఇస్తున్నారు. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా మంచి కథలను ఎంచుకుంటాను’’ అన్నారు. ‘‘నాంది’ మార్నింగ్, మ్యాట్నీ షోలు డల్‌గానే ఉన్నాయి. టాక్ బాగుంది కానీ కలెక్షన్స్ లేవని వేరే నిర్మాతలు చెప్పారు. వారే నైట్ షోకు హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయని చెప్పడంతో సంతోషపడ్డాం’’ అన్నారు నిర్మాత సతీష్. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్
-
దూసుకెళ్తున్న‘నాంది’.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..
‘వరుస అపయజయాలు.. కామెడీ ఇమేజ్‌ని పక్కనపెట్టి సీరియస్ సినిమా చేస్తున్నాడు. ఇలాంటి మూవీస్ ఈ హీరోకి సెట్ అవుతుందా లేదా? నరేశ్ ఈ ఏడాదైనా హిట్ కొడుతాడా లేదా?’ ఇలా ఎన్నో అనుమానాల నడుమ శుక్రవారం విడుదలైన అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాకి అద్భుత స్పందన వచ్చింది. మార్నింగ్ షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నరేశ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ ‘అల్లరోడి’లో మంచి నటుడు ఉన్నాడని సినిమా చూసిన ప్రేక్షకులంతా మెచ్చుకుంటున్నారు. ఇక చాలా కాలం తర్వాత నరేశ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ‘నాంది’ ఊహించని రీతిలో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 49 లక్షలు షేర్, రూ. 72 లక్షల గ్రాస్ రాబట్టింది. నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5.5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5.1 లక్షలు, వెస్ట్‌లో రూ. 2.2 లక్షలు, గుంటూరులో 3.5 లక్షలు, కృష్ణాలో 3.2లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలు, ఓవర్సీస్లో రూ.2 లక్షలు రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ మూవీ రూ. 2.70 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. మొదటి రోజు రూ. 49 లక్షలు వసూలు కావడంతో.. టార్గెట్‌ను చేరుకోవాలంటే మరో రూ. 2.51 కోట్లు కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ కావడం, సినిమాకు పాజిటివ్ రావడంతో మరో రెండు రోజుల్లో నాంది కలెక్షన్లు భారీగా ఉండోచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి : ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ కంటతడి ‘నాంది’ మూవీ రివ్యూ -
ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ కంటతడి
ఒకప్పుడు వరుస కామెడీ చిత్రాలతో హిట్లు కొట్టిన అల్లరి నరేశ్ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. దీంతో తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగంగా ‘నాంది’ సినిమా చేశాడు. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. నరేశ్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్ పాత్రలను కూడా చేయగలడని ‘నాంది’తో నిరూపించుకున్నాడు. ఇక చాలా కాలం తర్వాత సక్సెస్‌ని చూడడంతో నరేశ్ సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేశ్‌ఎమోషనల్ అయి కనీళ్లు పెట్టుకున్నాడు. తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకుని ఏడ్చేశాడు. ‘2012 ఆగస్టులో ‘సుడిగాడు’ విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయానికి ఎనిమిదేళ్లు పట్టింది. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. కామెడీ సినిమాలు చేస్తూ.. ఫ్లాపుల్లో ఉన్న నన్ను నిర్మాత సతీష్ వేగేశ్న నమ్మి ప్రోత్సహించారు. సక్సెస్ అవుతుందో కాదో అనే భయం ఉండేది. నా కామెడీ ఇమేజ్ సినిమాకు ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందో అనే టెన్షన్ ఉండేది. కానీ ప్రేక్షకులు అవేవి పట్టించుకోలేదు. సినిమా బాగుందని చాలా మంది ఫోన్ల్ చేసి మెచ్చుకుంటున్నారు’అని నరేశ్ ఎమోషల్ అయ్యారు. డైరెక్టర్ విజయ్ తనకు సెకండ్ బ్రేక్ ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదవండి: సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్దం! దిశా పటానీ ఫోటోకు స్టార్ హీరో కామెంట్ -
‘నాంది’ మూవీ రివ్యూ
టైటిల్ : నాంది జానర్ : ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : అల్లరి నరేశ్,వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రవీన్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తదితరులు నిర్మాణ సంస్థ : ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ నిర్మాత : సతీష్ వేగేశ్న దర్శకత్వం : విజయ్ కనకమేడల సంగీతం : శ్రీచరణ్ పాకల సినిమాటోగ్రఫీ : సిద్ విడుదల తేది : ఫిబ్రవరి 19, 2021 అల్లరి నరేశ్ అంటే ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో. వరుస కామెడీ సినిమాలతో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టేవాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇటీవల ఆయన తీసిన సినిమాలు డిజాస్టర్ట్స్ అయ్యాయి. దీంతో ఈ ‘అల్లరి’హీరో సీరియస్‌గా మారి 'నాంది' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో శుక్రవారం (ఫిబ్రవరి 19)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా 'నాంది'లో అల్లరి నరేశ్ నగ్నంగా నటించడం, సీరియస్ రోల్ పోషించడంతో ప్రతి ఒక్కరిలో ఆసక్తినెలకొంది. ఇక వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నరేశ్ కూడా నాందిపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. మరి నరేశ్ ప్రయోగం ఫలించి విజయం సాధించాడా? అల్లరోడి కెరీర్లో 57వ సినిమాగా రాబోతున్న ‘నాంది’ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ బండి సూర్యప్రకాశ్ అలియాస్ సూర్య( అల్లరి నరేశ్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తల్లిదండ్రులంటే అతనికి ఎనలేని ప్రేమ. తన చదువు కోసం తల్లిదండ్రులు ఎలాంటి సుఖాలను వదులుసుకున్నారో.. ఉద్యోగం వచ్చాక వాటన్నింటినితిరిగి ఇస్తాడు. ఇక కొడుకుకు ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అమ్మాయిని కూడా చూస్తారు. ఇలా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సూర్యప్రకాశ్ అనుకోకుండా పౌరహక్కుల నేత రాజగోపాల్ హత్యకేసులో అరెస్ట్ అవుతాడు. చేయని నేరాన్ని బనాయించి సూర్యని టార్చర్ పెడతాడు ఏసీపీ కిషోర్ (హరీష్ ఉత్తమన్). కేసుల మీద కేసులు పెట్టి ఐదేళ్ల పాటు సూర్యని బయటకు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో జూనియర్లాయర్ ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) ఈ కేసును టేకప్ చేసి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయంపై ఏరకంగా పోరాడాడు? అసలు పౌరహక్కుల నేతను ఎవరు,ఎందుకు చంపారు? ఈ కేసులో సూర్యని ఏసీపీ కిషోర్ ఎందుకు ఇరికించాడు? జైలులో ఉన్న సూర్యకి, లాయర్ ఆద్య మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్యకు జరిగిన అన్యాయంపై లాయర్ ఆద్య ఏరకంగా పోరాటం చేసిందనేదే మిగతా కథ నటీనటులు కేవలం నవ్వించడమే కాదు.. ఏడిపించడం కూడా తెలుసు అని మరోసారి నిరూపించాడు అల్లరి నరేశ్. నేను, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాలతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్న నరేశ్.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. కేవలం కామెడీ పాత్రలే కాదు భావోద్వేగ పాత్రలను కూడా చేయగలడని మరోసారి నిరూపించుకున్నాడు. సూర్య అనే మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో జీవించేశాడు. ప్రతి సన్నివేశాన్ని ప్రాణంపెట్టి చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. ఇక అడ్వకేట్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒదిగిపోయింది. ఈ సినిమాకు నరేశ్ పాత్ర ఎంత ముఖ్యమో..వరలక్ష్మీ పాత్ర కూడా అంతే. తన అద్భతమైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరోలెవల్‌కి తీసుకెళ్లింది. ఏసీపీ కిషోర్ అనే నెగెటివ్ పాత్రలో హరీష్ ఉత్తమన్ మెప్పించారు. ప్రవీన్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ తమ పరిధి మేరకు నటించారు. చదవండి: ('చక్ర' మూవీ రివ్యూ!) విశ్లేషణ ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 211కు సంబంధించిన కథే ‘నాంది’ సినిమా. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన కథ,కథనాలు సినిమాకు ఊపిరిపోశాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా భ్రస్టు పట్టిస్తున్నారనే అంశాలను ఎక్కడా లోపాలు లేకుండా చక్కగా తెరపై చూపించాడు. ‘ఆవేశం సమస్యని సృష్టిస్తుంది.. ఆలోచన దాన్నిపరిష్కరిస్తుంది’, ‘దేవుడు.. మంటలు ఆర్పడానికి నీళ్లు ఇస్తే.. గుండె మంటల్ని ఆర్పడానికి కనీళ్లు ఇచ్చాడు’ లాంటి డైలాగ్స్ గుండెల్ని హత్తుకుంటాయి. ప్రీక్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ‘నాంది’ నరేశ్ కెరియర్లో అద్భతమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక శ్రీచరణ్ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సిధ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ చోటా కే ప్రసాద్ పనితీరు చాలా బాగుంది. ఎక్కడా సాగతీత లేకుండా సినిమాను చకచకా నడించాడు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ఓ మంచి సందేశాత్మక చిత్రం లభించిందని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ నరేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన కథ, కథనం ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ భావోద్వేగ సన్నివేశాలు మైనస్ సెకండాఫ్‌లో కథ రోటీన్‌గా సాగడం కొన్ని సన్నివేశాలు రియాల్టీ నుంచి సినిమాటిక్ జోన్లోకి వెళ్లడం - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే రూట్ మార్చాను
‘‘నరేశ్ చేసే కామెడీ సినిమాలు చాలా బాగుంటాయి అంటారు కానీ, కామెడీ సినిమాలో నరేశ్ బాగా చేశాడని ఎవరూ చెప్పరు. ‘నేను, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి’ సినిమాల్లో నరేశ్‌లో ఓ నటుణ్ణి గుర్తించారు. నరేశ్ కామెడీ ఒక్కటే కాదు అన్ని పాత్రలు చేయగలడని పేరు తెచ్చుకోవాలని ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘మీ కామెడీ డ్రై అయిపోతోంది.. కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేయండి’ అని కొందరు నాతో చెప్పారు.. అందుకే రూట్ మార్చాను. మలయాళ సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ‘నాంది’ అలాగే ఉంటుంది. నా వద్దకు వచ్చే పది మంది దర్శక–నిర్మాతల్లో తొమ్మిది మంది కామెడీ కథలతోనే వస్తున్నారు. నాతో ప్రయోగాత్మక సినిమాలు చేయండని వారికి చెప్పలేను కదా! ‘నాంది’ కథని దర్శక–నిర్మాతలు నమ్మారు. ఈ సినిమా హిట్ అయితే నా నుంచి మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు వస్తాయి. ‘ఎవడిగోల వాడిది’లాంటి కథ విన్నాను. అంత మంది ఆర్టిస్టులతో కరెక్టుగా తెరకెక్కించే డైరెక్టర్ కావాలి. పాత్ర నచ్చితే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి రెడీ. ఈ విషయంలో నాకు విజయ్ సేతుపతిగారే స్ఫూర్తి. ఎన్ని సినిమాలు చేశామన్నది కాకుండా ఎన్ని హిట్ సినిమాలు చేశామన్నదానిపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను’’ అన్నారు. -
'నాంది' ఫేమ్ నవమి గాయక్ ఫోటోలు
-
'నాంది' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
అదే నా బలం: విజయ్ కనకమేడల
‘‘ఒక మనిషి తప్పు చేశాడో? లేదో? తెలియకుండానే ఐదేళ్లుగా విచారణ ఖైదీగా ఉంటాడు. బయటికొచ్చాక సమాజం అతన్ని విలన్ గా చూస్తుంటుంది. అప్పుడు ఏం చేశాడు? అనేదే ‘నాంది’ సినిమా’’ అని దర్శకుడు విజయ్ కనకమేడల అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. నవదీప్ ‘మొదటి సినిమా’ చేస్తున్నప్పుడు హరీష్ శంకర్‌గారు పరిచయమయ్యారు. ఆ చిత్రానికి ఆయన ఘోస్ట్ రైటర్. అక్కడి నుంచి మా ప్రయాణం ప్రారంభమై ‘డీజే’ వరకూ కొనసాగింది. ‘మహర్షి’ చూశాక ‘నాంది’లో నరేశ్‌గారు చేస్తేనే బాగుంటుందనిపించింది. కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. ఓ సీన్లో న్యూడ్‌గా నటించారు. ‘మా నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) తర్వాత అంత కంఫర్టబుల్‌గా ఫీలయింది మీతోనే’ అని నరేశ్‌గారు అనడం సంతోషంగా అనిపించింది. సేఫ్ జోన్ లో చాలా కథలు రెడీ చేసుకుని నిర్మాతలను కలిశాను.. కానీ కుదరలేదు. ‘నాంది’ కథ విని, సతీష్‌గారు ఓ మంచి సినిమాతో నిర్మాతగా మారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భావోద్వేగంతో కూడిన కథలే నా బలం.. అలాంటి సినిమాలే తీస్తాను. నా తర్వాతి సినిమా కూడా నరేశ్గారితోనే ఉంటుంది’’ అన్నారు.