Naandhi Movie Thanks Meet: ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు | Allari Naresh Naandhi Movie - Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు

Published Mon, Feb 22 2021 1:27 AM | Last Updated on Mon, Feb 22 2021 11:05 AM

Naandhi Movie Thanks Meet - Sakshi

సతీష్‌ వేగేశ్న, విజయ్, వరలక్ష్మి, ‘అల్లరి’ నరేశ్, నవమి

‘‘దాదాపు ఎనిమిదేళ్లుగా నన్ను హిట్స్‌ పలకరించడం మానేశాయి. ప్రతి ఏడాదీ హిట్‌ కోసం ఎదురు చూసేవాడిని. 2021లో ‘నాంది’తో హిట్‌ వచ్చింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా సతీష్‌ వేగేశ్న నిర్మించిన సినిమా ‘నాంది’. ఈ నెల 19న విడుదలైన సందర్భంగా ‘థ్యాంక్స్‌ మీట్‌’లో అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ – ‘‘మహరి’్ష తర్వాత ఏదైనా కంటెంట్‌ ఉన్న సినిమా చేద్దామని అనుకున్నాను. విజయ్‌ వచ్చి ‘నాంది’ కథ చెప్పినప్పుడు ‘ఫ్లాప్‌ హీరోతో సినిమా చేస్తున్నావేంటి’ అని అతన్నిఎవరో అడిగారట.

కథలో కంటెంట్‌ ఉండి... హీరోలో ప్రతిభ ఉంటే సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో పని లేదని విజయ్‌ అన్నాడట. కరోనా ప్రభావంతో ఇండస్ట్రీ రెండేళ్లు కోలుకోదని అన్నారు. కానీ ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు. మంచి హిట్స్‌ ఇస్తున్నారు. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా మంచి కథలను ఎంచుకుంటాను’’ అన్నారు. ‘‘నాంది’ మార్నింగ్, మ్యాట్నీ షోలు డల్‌గానే ఉన్నాయి. టాక్‌ బాగుంది కానీ కలెక్షన్స్‌ లేవని వేరే నిర్మాతలు చెప్పారు. వారే నైట్‌ షోకు హౌస్‌ఫుల్‌ బోర్డులు పడ్డాయని చెప్పడంతో సంతోషపడ్డాం’’ అన్నారు నిర్మాత సతీష్‌. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement