
తెలుగు హిట్ ‘నాంది’ (2021) హిందీలో రీమేక్ కానుంది. హిందీ నటుడు, దర్శక–నిర్మాత అజయ్ దేవగణ్‌తో కలిసి ఈ రీమేక్‌ను ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ‘‘చాలా ముఖ్యమైన ఓ కథను షేర్ చేసుకోవాల్సిన సమయం ఇది. అజయ్ దేవగణ్ ఫిలింస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ కలిసి తెలుగు హిట్ ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు అజయ్ దేవగణ్.
మరి.. ‘నాంది’ హిందీ రీమేక్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? నటీనటులు ఎవరు? అనే విషయాలను స్పష్టం చేయలేదు. ఇక ‘నాంది’ కథ విష యానికి వస్తే.. హాయిగా జీవిస్తున్న ఓ మధ్యతరగతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనూహ్యంగా హత్యారోపణలతో జైలుపాలవుతాడు. న్యాయం కోసం పోరాడే ఆ వ్యక్తి కథే ‘నాంది’ చిత్రం. కొంత గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ కెరీర్‌ని హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు.
చదవండి : ఆర్టిస్ట్‌లు లోకల్ కాదు.. యూనివర్సల్
మరో తెలుగు సినిమాకు సైన్ చేసిన హీరో ధనుష్