
తెలుగులో ప్రేమకథా సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'తొలిప్రేమ', 'డార్లింగ్' కచ్చితంగా ఉంటాయి. వీటిని తీసిన దర్శకుడు కరుణాకరన్. కెరీర్ ప్రారంభం నుంచి తెలుగులోనే మూవీస్ చేశాడు. 2018 తర్వాత ఒక్క ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?)
ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇకపై కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తానని కొన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలోనే కరుణాకరన్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. తను ఎప్పుడూ తీసే ప్రేమకథా చిత్రమే ఇదని తెలుస్తోంది.
దిల్ రాజు వారసుడు ఆశిష్ నే హీరోగా పెట్టి ఈ సినిమా తీయబోతున్నారని టాక్. ఆశిష్ కథ విని ఓకే చెప్పాడని, ఇంకా దిల్ రాజు స్టోరీ ఓకే చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఒకవేళ దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు ఏడేళ్ల తర్వాత మరో తెలుగు సినిమా తీసినట్లు అవుతుంది. చివరగా మెగాహీరో సాయితేజ్ తో 'తేజ్ ఐ లవ్యూ' తీశాడు కరుణాకరన్. కానీ అది ఘోరంగా ఫెయిలైంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)