karunakaran
-
అశ్విని–తనీషాలకు డబుల్స్ టైటిల్
గువాహటి: సొంతగడ్డపై జరిగిన గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో చివరిరోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మూడు విభాగాల్లో భారత ప్లేయర్లు ఫైనల్ చేరుకోగా... రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కరుణాకరన్ విజేతగా అవతరించాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో సతీశ్ 21–17, 21–14తో చైనీస్ క్వాలిఫయర్ జు జువన్ చెన్పై అలవోకగా గెలిచాడు. 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి విజేతగా నిలిచాడు. సతీశ్‌కు 7500 డాలర్ల (రూ. 6 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మహిళల డబుల్స్ టైటిల్ పోరులో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) ద్వయం 21–18, 21–12తో లి హువా జౌ–వాంగ్ జి మెంగ్ (చైనా) జంటను కంగుతినిపించింది. తొలి గేమ్‌లో చైనా జోడీ నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ... రెండో గేమ్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా అశ్విని–తనీషా 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు. అశ్విని–తనీషా జోడీకి 7900 డాలర్ల (రూ. 6 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్మోల్ 21–14, 13–21, 19–21తో కాయ్ యన్ యన్ (చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలుచుకున్న భారత షట్లర్‌కు రెండో గేమ్ నుంచి సవాల్ ఎదురైంది. చైనా క్రీడాకారిణి పుంజుకొని రెండో గేమ్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడోగేమ్ హోరాహోరీగా జరిగింది. ఇద్దరు ప్రతీ పాయింట్ కోసం దీటుగా పోరాడారు. అయితే కీలకదశలో చైనీస్ ప్లేయర్ పాయింట్లు నెగ్గి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రన్నరప్ అన్మోల్కు 3800 డాలర్ల (రూ. 3 లక్షల 21 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పన్నికుట్టి
అందమైన ఫ్యామిలీ కథా చిత్రంగా వినోదభరితంగా సాగేలా పన్నికుట్టి చిత్రం ఉంటుందని దర్శకుడు అనుచరణ్ తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ టాకీస్ పతాకంపై సమీర్ భరత్‌రామ్ నిర్మించిన చిత్రం ఇది. యోగిబాబు, కరుణాకరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇందులో లక్ష్మీప్రియ నాయకిగా పరిచయం అవుతున్నారు. దిండుకల్ లియోని స్వామిజీగా ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి కే సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. జీవితంలో నిరాశతో కృంగిపోయి దాని నుంచి బయట పడటానికే కామిడీ కథా చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. రవి మురుగయ్యా రాసిన కథే ఈ చిత్రం అని తెలిపారు. నిర్మాతకు కథా చెప్పగా నచ్చేసిందని, దిండుకల్ లియోని నటించడం సంతోషకరంగా పేర్కొన్నారు. మూగజీవాలను నటింపజేయడం సాధారణ విషయం కాదనీ, చాలా అవరోధాలను ఎదుర్కొని, కొన్ని వ్యూహాలను ఉపయోగించి ఇందులో పందిపిల్లను నటింపజేసినట్లు చెప్పారు. చిత్రం చూసిన తరువాత నమ్మకమే జీవితం అని భావిస్తారని, ప్రేక్షకులు చిత్రం చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని దర్శకుడు తెలిపారు. -
‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!
సాక్షి, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు వారి కలలను పిల్లలపై రుద్దకూడదనే సందేశాన్ని తెలుపుతూ పూర్తి వినోదాత్మకంగా, మ్యూజికల్‌గా సాగిన చిత్రం ‘వాసు’ . విక్టరీ వెంకటేష్- భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. యూత్, ఫ్యామిలీ, మాస్ ఇలా అన్ని రకాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. సీసీ మీడియా ఎంటర్టైన్మెంట్పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నేటికి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు మీకోసం.. ‘వాసు’సినిమా పేరు మదిలో మెదలగానే అందరికి గుర్తొచ్చేవి పాటలు. ప్రతీ ఒక్క పాట ఆణిముత్యమే. ముఖ్యంగా ‘పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా...’, ’ఓ ప్రేమా.. ఓ ప్రేమా..’ అంటూ సాగే పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా ప్రేమికులను ఎంతగానో అలరించాయి. వెంకటేష్ నటన ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సంగీతంపై తన ఇష్టాన్ని తెలుపుతూనే దివ్య(భూమిక)పై ప్రేమ, తండ్రిపై భయం రెండింటిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు. అంతేకాకుండా సునీల్, అలీ, దర్మవరపు సుబ్రమణ్యంలతో వెంకీ చేసే కామెడీ మామూలుగా ఉండదు. అమ్మ, చెల్లితో వచ్చే సెంటిమెంట్ సీన్స్, ప్రేమను వ్యక్తపరిచే సమయంలో వచ్చే ట్విస్టులు ప్రతీ ఒక్కరి మనసులను కదిలించేలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హార్ట్ టచింగ్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. ‘వాసు’ వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ చిత్రం వస్తే ఛానల్ మార్చకుండా చూసేవారు అనేకమంది ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతీ సీన్‌ను చాల చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు కరుణాకరన్. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్నారు కదా.. కుటుంబసమేతంగా మ్యూజికల్ హిట్ ‘వాసు’ సినిమాను మరో చూసి ఎంజాయ్ చేయండి. చదవండి: పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా మరోసారి అక్షయ్ భారీ విరాళం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_761247569.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యస్ 25
ఇండియన్ స్క్రీన్‌పై టెక్నాల జీని, భారీ హంగును చూపించిన దర్శకుడు శంకర్. భారీ ఖర్చుతో భారీ చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరు. ఆయన ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మిస్కిన్ సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కోలీవుడ్ దర్శకులు మణిరత్నం, కరుణాకరన్, గౌతమ్ మీనన్, లింగుస్వామి, బాలాజీ శక్తివేల్, పాండీరాజ్, అట్లీ, వసంత్ బాలన్, పా. రంజిత్ పాల్గొన్నారు. అందరూ ‘యస్ 25’ అనే లోగో ముద్రించి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్స్‌ను ధరించారు. స్పెషల్‌గా డిజైన్ చేయించిన కేక్‌ను శంకర్ కట్ చేశారు. ∙మణిరత్నం, మిస్కిన్, శంకర్ -
‘ఆ నటుడి వల్ల ప్రాణహాని ఉంది’
నటుడు కరుణాకరన్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సినీ దర్శక, నిర్మాతలు నగర పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కరుణాకరన్, సంతోష్, సుభిక్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొదునలన్‌కరుది. ఈ చిత్రం గత 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్ర దర్శకుడు సియోన్, సహనిర్మాత విజయ్ ఆనంద్ శనివారం సాయంత్రం వెప్పేరిలోని పోలీస్‌కమిషనర్ కార్యాలయానికి వెళ్లి నటుడు కరుణాకరన్‌పై ఫిర్యాదు చేశారు. తాము నిర్మించిన పొదునలన్కరుత్తు చిత్రంలో కరుణాకరన్‌ను ఒక ప్రధాన పాత్రలో నటింపజేశామని, అందుకు ఆయనకు రూ.22లక్షలు పారితోషికం ఇవ్వనున్నట్లు ఒప్పందం చేసుకున్నామన్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తై డబ్బింగ్ జరుగుతుండగా తన పారితోషికాన్ని పూర్తిగా చెల్లిస్తేనే డబ్బింగ్ చెబుతానని కరుణాకరన్ అనడంతో మొత్తం చెల్లించామని పేర్కొన్నారు. కాగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమానికి పిలిచినా తను రాలేదన్నారు. దీంతో పాత్రికేయుల సమావేశంలో నటుడు కరుణాకరన్ పాల్గొనక పోవడం విచారకరం అని దర్శకుడు అన్నారన్నారు. ఇటీవల తాము చిత్ర ప్రీమియర్ షో ముగించుకుని కార్యాలయానికి వెళ్లగా అక్కడకు కరుణాకరన్ పంపిన కొందరు వ్యక్తులు వచ్చి కరుణాకరన్ గురించి తప్పుగా మాట్లాడతారా? అంటూ గొడవకు దిగి తమను కొట్టబోయారని తెలిపారు. అదే విధంగా గురువారం అర్ధరాత్రి నటుడు కరుణాకరన్ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తిట్టి బెదిరించారన్నారు. ఇప్పటికే తాము కందువడ్డీ ఇతి వృత్తంతో చిత్రం చేయడంతో కొందరు కందువడ్డీ వ్యాపారులు తమను బెదిరించారని.. ఇప్పుడు కరుణాకరన్ బెదిరించడంతో ఆయనకీ వాళ్లతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నామని కంప్లయింట్లో పేర్కొన్నారు. కరుణాకరన్‌తో ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో కోరారు. -
ప్రేక్షకుల ఈలలే గొప్ప కాంప్లిమెంట్స్
‘‘నా ప్రతి సినిమాలో ‘తొలిప్రేమ’ హ్యాంగోవర్ కనిపిస్తుంటుందని అంటుంటారు. ఎందుకంటే నేను కరుణాకరన్‌ని కాబట్టి. అది నా స్టైల్. జనాలకు ఏది నచ్చుతుందో అది చేయడం డైరెక్టర్ పని. ‘తొలిప్రేమ’ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటే భయంగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ నెక్ట్స్ మళ్లీ స్టేట్ ఫస్ట్ ఎందుకు రాలేదు? అని అడిగితే స్టూడెంట్స్‌కు ప్రెషర్గా ఉంటుంది. నాక్కూడా సేమ్’’ అన్నారు కరుణాకరన్. సాయిధరమ్ తేజ్, అనుపమ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ శుక్రవారం రిలీజైంది. శనివారం కరుణాకరన్ మీడియాతో మాట్లాడారు. ► ‘సినిమా బావుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంద’ని రిలీజైన రోజు నుంచి ఫోన్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఈలలే బెస్ట్ కాంప్లిమెంట్స్. ‘తేజ్’ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్ కాదు. నా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘ఎందుకంటే ప్రేమంట’, ఇప్పుడు ‘తేజ్’లో హీరోయిన్లు గతం మర్చిపోతారన్నది కావాలని రిపీట్ చేయలేదు. అది స్క్రీన్ ప్లేలో ఒక భాగం. ‘డార్లింగ్’లో ‘ఫస్ట్ హాఫ్ అబద్ధం’ అనే స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. అలా ఒక్కొక్క లవ్ స్టోరీని ఒక్కో స్టైల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంటా. ► లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇంపార్టెంట్. అందుకని నా సినిమాలో హీరోలకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా చూడటానికి ఆడియన్స్ వచ్చినప్పుడు మంచి విజువల్స్, మ్యూజిక్, రొమాన్స్ ఉంటేనే ఎంటర్టైన్ అవుతారు. ఆండ్రూ విజువల్స్ చాలా బాగా చూపించారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడ్డారు. వీళ్లంతా లేకపోతే నేను లేను. ► ఇప్పటివరకు ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకున్నది ‘తొలిప్రేమ’ వల్లనే. ఒక స్టాండర్డ్ సెట్ చేసింది ఆ సినిమా కాబట్టి నా ప్రతి సినిమాను అదే సినిమాతో కంపేర్ చేస్తుంటారు. వణుకు వచ్చేస్తుంటుంది. నేను కూడా ‘తొలిప్రేమ’ కంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాను. నా కథకు తగ్గట్టు సాయిధరమ్ తేజ్, అనుపమ అద్భుతంగా చేశారు. ► మా ఫ్యామిలీ మొత్తం 32మంది ఉంటారు. బాబాయిలు, మావయ్యలు, ఇలా చాలా మంది ఉంటాం. మా పిన్ని కూడా నన్ను కొడుకులానే చూస్తుంటారు. అదే నా సినిమాల్లో చూపిస్తాను. నా సినిమాకు వెళ్తే అందరూ ఎంజాయ్ చేయాలి. నా లైఫ్‌లో జరిగే బెస్ట్ మూమెంట్స్‌ని నా సినిమాలో వాడేస్తాను. అందులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ‘వద్దు సరోజా...’ ఎపిసోyŠ ఒకటి. మంచి మూమెంట్స్ అన్ని డైరీలో రాసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటాను (నవ్వుతూ). నా ఫస్ట్ లవ్ స్టోరీ డిజాస్టర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మేమిద్దరం లవ్‌లో ఉన్నాం. ► కేయస్ రామారావుగారు లెజెండ్. ఆయనతో సెకండ్ టైమ్ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 45 సినిమాలు చేశారు. ఎప్పటినుంచో సినిమాలు తీస్తున్నారు. కథ విని మంచి సలహాలు ఇస్తారు. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు. -
ఆమె టార్చర్ పెట్టింది : సాయిధరమ్
లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందిన చిత్రం ‘తేజ్’.. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్ రామారావు నిర్మించారు. ‘తేజ్’ మూవీలో హీరోయిన్ అనుపమా తనను టార్చర్ పెట్టిందని, ఇదిగో ప్రూఫ్ అంటూ సాయిధరమ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. కొంతసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 6న రిలీజ్‌కు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఆండ్రూ, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, సహ నిర్మాత: వల్లభ. -
హీరోయిన్ టార్చర్ పెట్టింది..ఇదిగో ప్రూఫ్
-
చిరంజీవి పోలికలు రావడం అదృష్టం..
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) : శ్రేయ మీడియా ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో సినీ నటుడు సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ‘తేజ్ ఐ లవ్యూ’ చిత్రం ఆడియో విజయోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు సాయిధరమ్‌తేజ, కధానాయకి అనుపమ పరమేశ్వరన్, నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు ఎ.కరుణాకరన్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తేజ్ ఐ లవ్యూ ఓ కలర్‌ఫుల్ లవ్ స్టోరీ అని దర్శకుడు కరుణాకరన్ చెప్పారు. సాయిధరమ్ తేజ్..: కలర్‌ఫుల్ లవ్ స్టోరీ మేనమామ చిరంజీవి పోలికలు రావడం అదృష్టం. ఆయనలా నటిస్తున్నానని అభిమానులు చెబుతున్నపుడు ఆనందంగా ఉంటుంది. ఆయన్ని అనుకరించకుండా నటిస్తున్నాను. చిత్రం సక్సెస్‌ను దేని ఆధారంగా నిర్ణయిస్తున్నారు.. యూ ట్యూబ్, ట్విట్టర్‌లోని సందేశాలు, సినిమాలోని పాటలను రింగ్ టోన్స్గా డౌన్లోడ్ చేసుకోవడం, వివిధ సెంటర్లలోని కలñక్షన్ వంటి పలు అంశాల ఆధారంగా చిత్ర విజయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. చిత్రంలో మీ పాత్ర.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ కళాశాల విద్యార్థిగా చదువుకునే పాత్ర. సకుటుంబ సమేతంగా సినిమా చూసి ఆనందించేలా దర్శకుడు చిత్రాన్ని నిర్మించాడు. దర్శకుడు, నిర్మాత నాకు మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు.. ప్రభాస్, వెంకటేష్‌లు నా అభిమాన హీరోలు. సమంత నా ఫేవరేట్ హీరోయిన్. సమంతకు వివాహం అయిపోయినా అభిమానానికి వివాహానికి సంబంధం లేనందువల్ల ఆమెను నా ఫేవరేట్ కథానాయికనే చెబుతాను. తరువాత చిత్రం.. మైత్రి మూవీ బ్యానర్ మీద త్వరలోనే కొత్త చిత్రం రాబోతుంది. విశాఖతో మంచి అనుబంధం : అనుపమ పరమేశ్వరన్.. విశాఖపట్నంతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడి సముద్రతీర అందాలంటే చాలా ఇష్టం. విశాఖ వచ్చినపుడల్లా చాలాబాగా ఎంజాయ్ చేస్తాను. ఆడియో విజయోత్సవ సభ సందర్భంగా విశాఖ రావడం ఆనందంగా ఉంది. తేజ్ ఐలవ్యూ చిత్రం అనుభవం తేజ్ ఐ లవ్యూ చిత్రం మంచి అనుభవాన్ని ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. కథానాయకుడు సాయిధరమ్‌తేజతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మంచి సినిమాను చూస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. కథానాయకుడు రామ్‌తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసరాల్లో జరుగుతోంది. ఆగస్టులో విడుదలవుతుంది. తొలిప్రేమ సమయంలో విశాఖ వచ్చా... : దర్శకుడు.. ఎ.కరుణాకరణ్ మెగా కుటుంబం తోటలో నేనొక చెట్టును మాత్రమే. నాకు ఆ కుటుంబంతో సాన్నిహిత్యం చాలా ఉంది. తొలిసారిగా పవన్ కల్యాణ్‌లో తొలిప్రేమ చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇప్పుడు సాయిధరమ్‌తేజ నటించిన చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇది నాకు పదో సినిమా.తొలి ప్రేమ చిత్రం షూటింగ్ సమయంలో లొకేషన్స్ చూసేందుకు విశాఖపట్నం తొలిసారిగా వచ్చాను. స్టీల్‌ప్లాంట్, రుషికొండ, భీమిలి వంటి ప్రాంతాలన్నీ తిరిగాను. చివరకు సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొంది. తేజ్ ఐ లవ్యూ కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం తేజ్ ఐ లవ్యూ సినిమా సకుటుంబంగా చూడగలిగే మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. కలర్‌ఫుల్ లవ్ స్టోరీ. తొలిప్రేమ చిత్రంలో కథానాయికతో ఎలా హైలైట్ సీన్స్‌ను క్రియేట్ చేశామో అదే విధంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అనుభూతినిస్తాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాను. ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : కరుణాకరన్ ఈ పేరు చెబితే ప్రేమికుల్లో వైబ్రేషన్స్ మొదలవుతాయని..ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ అని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం ఆడియో విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ వైజాగ్‌తో తెలియని అనుబంధం ఏర్పడిందన్నారు. నటనకు ఓనమాలు దిద్దుకున్నది ఇక్కడే. కె.ఎస్. రామారావు నిర్మాణ సారధ్యంలో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపిచంద్ర చాలా మంచి పాటలు అందించారన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ వైజాగ్‌కు సినిమా పరిశ్రమకు ఒక సెంటిమెంట్‌గా మారిందన్నారు. జాగ్లో షూటింగ్‌ల అనుమతులకు త్వరలోనే సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెట్టనున్నామన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రంతో వైజాగ్‌తో లవ్ పడ్డానని అన్నారు. డైరెక్టర్ కరుణకర్ మాట్లాడ్లుతూ మా సినిమా పాటలను ఆదరించిన ప్రేక్షకులకు «కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తేజ్‌కు విలువైన వాచ్‌ను నిర్మాత కేఎస్ రామారావు బహుమతిగా అందజేశారు. సింగర్ సింహా తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గోపి చంద్ర తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘తేజ్..’ అందమైన ప్రేమకవితలాంటి సినిమా!
సాక్షి, హైదరాబాద్ : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘తేజూ.. ఐ లవ్ యూ’. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ తాజాగా నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కేఎస్ రామారావు, దర్శకుడు కరుణాకరన్, హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడతూ.. ‘ఈ సినిమా కరుణాకరన్ బ్రాండ్ తగినట్టు ఉంటుంది. అందమయిన లవ్ స్టోరీ తీశాం. అందమయిన ప్రేమకవితలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ.. ‘క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్‌లా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. హీరో తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో బాగా సక్సెస్ అయ్యింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. జులై 6న ఈ సినిమా విడుదల అవుతుందని తెలిపారు. ఇది క్యూట్ సినిమా అని, తన లైఫ్‌లో ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. -
‘తేజ్..’ ఆడియోకి మెగాస్టార్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యు. ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేయస్ రామారావు, వల్లభలు నిర్మిస్తున్నారు. ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ సాయి ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా తన వయసు తగ్గ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. జూన్ 9న ఆడియో రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన తేజ్ ఐ లవ్ యు సినిమాను జూన్ 29న రిలీజ్ కానుంది. -
‘తేజ్’ ప్రీమియర్ క్రికెట్ లీగ్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో బిజీగా ఉన్నారు. గత కొంత కాలం నుంచి ఈ మెగా హీరో నటించిన సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించడం లేవు. మాస్ సినిమాలు తీసి ప్రేక్షకులకు బోర్ కొట్టించిన ఈ హీరో ప్రస్తుతం లవ్‌స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్స్‌పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కరుణాకరన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీని తన గత సినిమాల్లానే మంచి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా జూన్ 2న ఆర్జే ( రెడియో జాకీ) వర్సెస్ తేజ్ ఐ లవ్ యూ టీమ్ క్రికెట్ లీగ్ ఆడబోతోంది. గెలిచిన వారి చేతుల మీదుగా ఈ మూవీలోని మొదటి సాంగ్‌ను విడుదల చేయించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘అందమైన చందమామ’ అనే ఈ ఫస్ట్ సాంగ్‌ను ఎవరు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. A crazy movie, A crazy gang, A super crazy song launch! 🤟 TEJ Premier League 🏏🏏🏏 Our movie team vs RJ's team. Join the fun and be a part of the #TejILoveYou madddnesss... @IamSaiDharamTej @anupamahere pic.twitter.com/CFvsngfj9O — Creative Commercials (@CCMediaEnt) May 31, 2018 -
‘డార్లింగ్ కాదు తేజ్ ఐ లవ్ యు’
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో తేజ్ ఐ లవ్ యు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ గిటార్ తగిలించుకొని మైక్ పట్టుకొని పాట పాడుతున్న స్టిల్ ను రిలీజ్ చేశారు అయితే ఈ స్టిల్ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ స్టిల్ లా ఉందంటు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన సాయి ధరమ్ ‘కేవలం గిటార్ తగిలించుకొని మైక్ పట్టుకున్నంత మాత్రానా డార్లింగ్ కాదు.. ఇది తేజ్ ఐ లవ్ యు’అంటూ కామెంట్ చేశాడు. Just because I have a guitar and I hold a 🎤 doesn’t mean its darling..... and it’s Tej...I love you 😉 pic.twitter.com/aSzk8QDYnq — Sai Dharam Tej (@IamSaiDharamTej) 30 May 2018 -
తేజ్..ఐ లవ్ యూ టీజర్ విడుదల
-
‘తేజ్ ఐ లవ్ యూ’ టీజర్
కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డాడు. యంగ్ డైరెక్టర్‌లనుంచి స్టార్ డైరెక్టర్ల వరకు ఎవ్వరూ తేజ్ కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయారు. దీంతో కాస్త రూట్ మార్చి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సాయి ధరమ్. కరుణాకరన్ డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తేజ్.. ఐ లవ్ యూ. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. తేజ్ ఫస్ట్ ఫీల్ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్లో కరుణాకరన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అనుపమా పరమేశ్వరన్ ఈ చిత్రంలో తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిన సాయి ధరమ్ కెరీర్‌ను గాడిలో పెడుతుందేమో చూడాలి. -
తేజ్.. ఐ లవ్ యూ
కరుణాకరన్ డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. తేజ్.. ఐ లవ్ యూ అన్న టైటిల్‌ను ఈ చిత్రానికి ఫిక్స్ చేసేశారు. అనుపమా పరమేశ్వరన్ ఈ చిత్రంలో తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మే 1వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. గత కొంత కాలంగా రోటీన్ ఫార్ములా చిత్రాలతో ఫెయిల్యూర్స్ చవిచూస్తున్న ఈ మెగా హీరోకు లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్.. హిట్ అందిస్తాడేమో చూడాలి. Thank you Karunakaran sir for designing this very special role that's very close to my heart.. Hope you all love it. 🙏 #Tejiloveyou #SDT10 pic.twitter.com/L8E7IX2gJV — Sai Dharam Tej (@IamSaiDharamTej) 28 April 2018 -
తేజు చాలా ఎనర్జిటిక్ – కేయస్ రామారావు
‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. కరుణాకరన్ అద్భుతమైన కథని అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన అటూ ఇటూ తిరుగుతూ సెట్లోనే ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఇంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను కో–ఆర్డినేట్ చేసుకుంటూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘మా హీరో తేజు వింటర్లో డేట్స్ ఇవ్వమంటే సమ్మర్లో ఇచ్చారు (నవ్వుతూ). తేజు చాలా ఎనర్జిటిక్‌గా నటిస్తున్నాడు. ఈ నెల 11కి మేజర్ పార్ట్ పూర్తవుతుంది. 23, 24 తేదీల్లో విమానాశ్రయంలో షూటింగ్ జరపనున్నాం. మే మొదటి వారంలో ఫ్రాన్స్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. ‘డార్లింగ్’ స్వామి చక్కటి డైలాగులు రాశాడు’’ అన్నారు. ‘‘టైటిల్ అనుకోలేదు. ఓ మంచి టైటిల్ అనుకుని త్వరలో చెబుతాం’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ‘‘క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అన్నారు కరుణాకరన్. అనుపమా పరమేశ్వరన్, కెమెరామెన్ ఆండ్రూ, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహ నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ. -
‘దేవుడు వరమందిస్తే’
మెగా వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో సత్తా చాటిన సాయి ధరమ్, తరువాత కష్టాల్లో పడ్డాడు. రొటీన్ మాస్ ఫార్ములా సినిమాలు చేస్తూ అభిమానులకు బోర్ కొట్టించాడు. అందుకే కాస్త డిఫరెంట్ గా ఓ లవ్ స్టోరిలో నటిస్తున్నాడు సాయి ధరమ్‌తేజ్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను తెరకెక్కించే కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘దేవుడు వరమందిస్తే’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. 2001లో రోహిత్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘6టీన్స్’ సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవి దేవుడు వరమందిస్తే. ఇన్నేళ్ల తరువాత ఆ పల్లవిని టైటిల్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. -
వారి జీవితాలను రంగులమయం చేయండి : హీరో
దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరిలో సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ అవయవధానానికి సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి. ‘మీకు అంధ ప్రపంచాన్ని రంగులమయం చేయగలిగే శక్తి ఉంది. ప్రతిజ్ఞ చేయండి’ అన్న కామెంట్స్ ఉన్న పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. పండుగ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌పై అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంటిలిజెంట్ సినిమాతో నిరాశపరిచిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. Wishing everyone a very happy #holi #takeapledge 🙏🏼 pic.twitter.com/pgzXA38kDz — Sai Dharam Tej (@IamSaiDharamTej) 2 March 2018 -
లేడీ ఓరియంటెడ్ సినిమాలో మెగా హీరో..?
ఇంటిలిజెంట్ సినిమాతో మరోసారి షాక్ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే కరుణాకరణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా కథ కూడా హీరోయిన్ వైపు నుంచే నడుస్తుంది. ఇప్పుడు అదే తరహాలో సాయి ధరమ్ కొత్త సినిమా సాగనుందట. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సుప్రీం హీరో సక్సెస్ కోసం ఈ జానర్‌ను ఎంచుకున్నాడు. లవ్ స్టోరిలను తెరకెక్కించటంతో స్పెషలిస్ట్ గా పేరున్న కరుణాకరన్ అయినా సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను గాడిలో పెడతాడేమో చూడాలి. -
మనసున్న పోలీస్
పోలీసులను విమర్శించే వారు అతడి గురించి తెలుసుకుంటే మరోసారి నిందలేయరు. పోలీసు యూనిఫాం గర్వపడేలా అరుదుగా కనిపించేవారిలో చిత్తూరు నగరానికి చెందిన కరుణాకరన్ ముందు వరసలో ఉంటారు. అందరూ కందా అని పిలుచుకునే ఈయన పెద్ద మనసున్న పోలీసు. అనాథ శవాలను మోస్తుంటారు. అభాగ్యులకు అన్నం పెడుతుంటారు. అంత్యక్రియలకు షెడ్లు కట్టిస్తారు. నమ్మిన దైవం కోసం గుడి కట్టిస్తారు. సంపన్నుడేమీకాదు. ఓ సాధారణ కానిస్టేబుల్ మాత్రమే. చిత్తూరు అర్బన్: చిత్తూరులో కరుణాకరన్ పేరు చెబితే తెలియనివాళ్లు ఉండరు. ప్రభు త్వాస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, ఆశ్రమాల్లో, మున్సిపల్ కార్యాలయం, నాగాలమ్మగుడి వద్ద ఈయన పేరు చాలా ఫేమస్. చేసేది పోలీస్ ఉద్యోగమే. ఆర్ముడు రిజర్వు (ఏఆర్)లో పనిచేస్తుండడంతో జనరల్ డ్యూటీ, బందోబస్తు విధులే ఎక్కువగా ఉంటాయి. నగరంలో అనాథశవం కనిపించినా కరుణాకరన్ 9391665281కు ఫోన్ వస్తుంది. డ్యూటీ మధ్యలోనే వెళ్లాల్సి వస్తే ఏ ఒక్క అధికారీ అడ్డుచెప్పరు. చివరకు ఎస్పీ అయినా సరే భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. తాను తయారు చేయించిన బండిలో మృతదేహాన్ని ఉంచి డప్పుల వాయింపులు.. టపాసులు పేలుస్తూ ఆడుతూ పాడుతూ అంత్యక్రియలు చేసేస్తారు. 28 ఏళ్లుగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూనే ఉన్నాడు. తొమ్మిది నెలలుగా ప్రతిరోజూ మధ్యాహ్నం అనాథలు, అభాగ్యులకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఆయన తల్లి, భార్య వంటచేసి అనాథలకు కడుపునిండా అన్నం పెడతారు. పెట్టడమే కాదు వీరితో పాటు కూర్చుని కుటుంబం మొత్తం ఇదే భోజనం తింటారు. ఇక సంతపేటలో తాను నమ్మినదైవం నాగాలమ్మకు చిన్నపాటి గుడికట్టించడం, ఉత్తర క్రియలు (దినాలు) చేసుకోవడానికి ఓ షెడ్డును ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం కరుణాకరన్‌కు మాత్రమే సాధ్యమైన విజయాలు. తన సుదీర్ఘ పయనానికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మధుబాబు, గుప్త, ధనలక్ష్మి, దైవశిఖామణి, భద్ర, రవీంద్రారెడ్డి అండగా నిలు స్తున్నారు. ఇంట్లో అడ్డుచెప్పరు.. అమ్మ ఇంద్రాణి. నాన్న రాధాకృష్ణ. సంతపేటలో ఓ చిన్న టీ అంగడి పెట్టుకుని రాధాకృష్ణ తన ఐదుగురు పిల్లల్ని పోషించేవారు. ఇందులో కంద (కరుణాకరన్) చివరివాడు. నాన్న టీ వేస్తూ ఉంటే స్కూల్‌కు వెళ్లొచ్చిన తర్వాత టీ అంగడి వద్దే ఎక్కువ సమయం గడిపేవాడు. 1980వ దశకంలో చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తాకడానికి ఎవరూ ముందుకొచ్చేవారుకారు. ఎవరూ లేకుంటే మున్సిపాలిటీ వారొచ్చి చెత్త ట్రాక్టర్లో శవాన్ని వేసుకుని వెళ్లిపోయేవారు. కరుణాకరన్ అప్పట్లో చూసిన ఈ ఘటనలు మనసులో బలమైన ముద్ర వేశాయి. వయస్సు 20 ఏళ్లు చుట్టుపక్కల వాళ్లు ఎవరైనా చనిపోతే శ్మశానం వరకు వెళ్లి పిడికెడు మట్టివేయడం అలవాటయ్యింది. అలా చేస్తే ఏదో తెలియని ఆనందం. మృతదేహాన్ని మోస్తూ కాటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్న వారిలో మార్పు తీసుకురావాలనుకున్నాడు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఎక్కడ ఎవరు చని పోయినా మంచి బట్టలు వేసుకుని శుభ్రంగా రెడీ అయ్యి వెళ్లడం, అందరి కంటే ముందు మృతదేహాన్ని మోస్తూ వెళ్లడం చేశాడు. ఎవరో చదువుకున్న కుర్రాడిలా ఉన్నాడు.. చూడ్డానికి బాగానే ఉన్నాడు. ఇతనే శవాన్ని మోస్తుంటే మనకేంటీ అనే ఆలోచన ఒక్కొక్కరి నుంచి అందరికీ అనిపిస్తూ సామాజిక మార్పును తెచ్చింది. ఇంటర్ వరకు చదివి 24 ఏళ్లకే పోలీస్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు కంద. అమ్మా నాన్న చాలా ఆనందపడ్డారు. ఆ మరుసటి ఏడాది నాన్న చనిపోయాడు. ఏడాది తర్వాత దేవితో కందకు పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. అమ్మాయి జ్యోతిప్రియ డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ తనకొచ్చే జీతంలో 25 శాతం పేదల కోసం ఖర్చుచేయమని నాన్నకు పంపుతుంటుంది. కొడుకు సాయి ధనుష్. ఇతను నగరంలోని ఓ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.3 వేలు అక్కలాగే సేవా కార్యక్రమానికి ఇచ్చేస్తుంటాడు. తానూ ఇందులో భాగమై అభాగ్యులకు వంటచేసి పెట్టి, వారి ఆకలి తీరుస్తుండటం భార్య దేవికి సంతోషం కలిగి స్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం నాలుగు రూపాయలు దాచి ఉంచారా అని అడిగితే.. అందరికీ పెట్టడం మాత్రమే తెలిసిన తమకు ఎత్తిపెట్టుకోవాలనే ఆలోచన ఏనాడు రాలేదని చెబుతున్నాడీ మనసున్న పోలీసన్న. ఆ రోజు కంట నీళ్లు.. 18 ఏళ్ల క్రితం ఓ అనాథ శవానికి అంత్యక్రియలు చేయాలని కబురొచ్చింది. జేబులో రూపాయి కూడా లేదు. స్నేహితుడొకడి ఇంటికి వెళ్లాడు. రూ.400 అప్పు ఇమ్మన్నాడు. ఎందుకని అడిగితే విషయం చెప్పాడు. అప్పు ఇచ్చినా కరుణాకరన్ చర్యల్ని వ్యతిరేకించాడు. దీంతో మూడు రోజుల తర్వాత డబ్బులు తిరిగిచ్చేసి ఆ స్నేహానికి ఓ దండం పెట్టి మరీ వచ్చేశాడు. -
సాయి ధరమ్ తేజ్ , కరుణాకర్ చిత్రం
-
పి.కరుణాకరన్ (సీపీఎం)
రాయని డైరీ రోజూ లేచి లోక్‌సభకు వెళ్లాలంటే కష్టంగా ఉంటోంది. లేవడం, వెళ్లడం.. కష్టం కాదు. సభ లోపల ఉండడం కష్టంగా ఉంటోంది. కారిడార్‌లో నిన్న ఎవరో సడన్‌గా ఆపి అడిగారు – ‘మీరేమిటీ ఇలా ఉన్నారూ?’ అని! ‘‘నేను ఇలా ఉండడం ఏంటి?! నేను ఎలా ఉంటానని మీరు అనుకున్నారు? నేను ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?’’ అని అడిగాను. ‘‘మీరు కరుణాకరనే కదా?’’ అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యపడుతూ. ‘‘అవును నేను కరుణాకరన్నే’’ అన్నాను నేనూ ఆశ్చర్యపోతూ. ‘‘ఏం లేదు లెండి. మీరు నాకు తెలిసిన కరుణాకరనేమో అనుకున్నాను’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. ‘‘హలో.. హలో.. మీకు తెలిసిన కరుణాకరన్‌ది కూడా లోక్సభేనా? రాజ్యసభకు వెళ్లబోయి ఏదో ఆలోచిస్తూ ఇటు గానీ వచ్చేశారా!’’ అని వెనక్కు పిలిచి అడిగాను. ‘‘అయితే రాజ్యసభలో కూడా ఇంకో కరుణాకరన్ ఉన్నారా?’’ అని మళ్లీ ఎగ్జయిట్ అయ్యాడు ఆ వ్యక్తి. ‘‘ఉన్నాడో లేదో నాకూ తెలీదు. ఒకవేళ ఉండి ఉంటే, మీకు తెలిసిన కరుణాకరన్ అతడే అయ్యుండొచ్చు కదా..’’ అన్నాను. నిరాశగా చూశాడు. ‘‘అయితే మీరు కాదన్న మాట’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. నేను కాకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు! సభ లోపలికి వెళ్దామంటే భయమేసింది. అక్కడ ఇంకా చాలామంది ఉంటారు.. మెజారిటీ వ్యక్తులు! ధైర్యం చేసి వెళ్లాను. లోపల సుమిత్రా మహాజన్ మా వాళ్లను కోప్పడుతున్నారు. ‘‘ఇది కురుక్షేత్రం కాదు.. కర్మక్షేత్రం. వెళ్లి కూర్చోండి’’ అంటున్నారు. బీజేపీలో ఒక్కరూ భారతీయ భాషల్లో మాట్లాడ్డం లేదు. అంతా భారతంలోని క్యారెక్టర్స్‌లా ఉన్నారు. ఇంటికి వచ్చాక సి.ఎం.కి ఫోన్ చేశాను. ‘‘నా వల్ల కావట్లేదు కామ్రేడ్.. అది లోక్‌సభలా లేదు. మహాభారత్ టీవీ సీరియల్లా ఉంది’’ అన్నాను. ‘‘ఇప్పుడా సీరియల్ రావట్లేదు కదా’’ అన్నారు కామ్రేడ్ పినరయి విజయన్. ‘‘పాత క్యాసెట్లు దొరుకుతాయి కామ్రేడ్. అది కాదు సమస్య’’ అన్నాను. ఆయన నవ్వారు. లేక నవ్వినట్లు నాకు అనిపించిందో! ‘‘ఫ్లోర్ లీడర్‌వి.. నువ్వే అలా అంటే ఎలా కరుణా..’’ అన్నారు ఆపేక్షగా. ‘‘ఫ్లోర్ బయట ఉన్నారు. మీకేం తెలుస్తుంది కామ్రేడ్’’ అన్నాను నేను. పెద్దగా నవ్వారు పినరయి విజయన్. ‘‘ఫ్లోర్ బయట ఉన్నవాళ్లనైనా ఈ బీజేపీ వాళ్లు సుఖంగా ఉండనిస్తారని ఎందుకు అనుకుంటున్నావు కరుణాకరన్’’ అన్నారు. ఆయన కష్టం నాకు అర్థమైంది! అరుణ్‌జైట్లీ అదివారం ఉదయాన్నే కేరళలో ఫ్లైట్ దిగుతున్నారు. మాధవ్ శింగరాజు -
పవన్ డైరెక్టర్‌తో సాయి ధరమ్...!
డైరెక్టర్ కరుణాకరన్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే సినిమా తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ సినిమా, దర్శకుడిగా కరుణాకరన్ రేంజ్ ను కూడా పెంచింది. అయితే తొలి ప్రేమ తరువాత మరోసారి అంతటి భారీ విజయాన్ని నమోదు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు కరుణాకరన్. డార్లింగ్, ఉల్లాసంగా.. ఉత్సాహంగా లాంటి హిట్స్ ఉన్నా.. స్టార్ ఇమేజ్ తీసుకువచ్చే సినిమాలు మాత్రం ఇంత వరకు రాలేదు. మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కరుణాకరన్, త్వరలో మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం బివియస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ వినాయక్ తో ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తుండగా.. కరుణాకరన్ తోనూ సినిమా అంగీకరించాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ముందు స్టార్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది. -
మామతో తొలిప్రేమ... మేనల్లుడితో..!
పవన్‌కల్యాణ్ స్టార్డమ్కు పునాది వేసిన తొలి సినిమా ‘తొలిప్రేమ’. దీని తర్వాత ఆయన పలు హిట్ సినిమాల్లో నటించారు. కానీ, పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు ‘తొలిప్రేమ’ అంటే ఎంతో స్పెషల్. ఇప్పుడీ చిత్రదర్శకుడు ఎ. కరుణాకరన్‌తో పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. ఎందుకంటే... ప్రేమ కోసం ఏం చేయడానికైనా యువత రెడీ కాబట్టి’’ అనే థీమ్ బేస్ చేసుకుని హ్యూమర్ అండ్ యాక్షన్‌తో కూడిన ప్రేమకథను కరుణాకరన్ రెడీ చేశారట! దీనికి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ చేస్తున్న ఈ హీరో, ఆ తర్వాత కరుణాకరన్ సినిమా ప్రారంభిస్తారని సమాచారం. మామతో ‘తొలిప్రేమ’ వంటి హిట్ అందుకున్న దర్శకుడు, మేనల్లుడితోనూ హిట్ సినిమా చేస్తారని ఊహించవచ్చు!! -
రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో..?
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ ప్రస్తుతం ఆ ఫాంను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. ముఖ్యంగా కథల ఎంపికతో పాటు మేకింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తనకు కందిరీగ లాంటి సూపర్ హిట్ అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమా చేస్తున్నాడు, ఈ ఎనర్జిటిక్ స్టార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరువాత పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు రామ్. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి లవ్ స్టోరి స్పెషలిస్ట్ కరుణాకరన్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే ప్రేమంటే సినిమా చేసిన రామ్ ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయాడు. అయినా మరోసారి కరుణాకరన్ దర్శకత్వంలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. -
తమిళ నిర్మాతలు లేకుంటే రాజ్‌కుమార్ లేరు!
తమిళ నిర్మాతలు అవకాశం ఇవ్వకుంటే కన్నడ నటుడు రాజ్‌కుమార్ ఎక్కడుండేవారని సీనియర్ నిర్మాత వీసీ.గుహనాథన్ ప్రశ్నించారు.నటుడు కిశోర్, కరుణాకరన్ కథానాయకులుగా నటి స్తున్న చిత్రం గడియాగార మనిదర్గళ్. క్రిస్ట్ పి.ది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ పతాకంపై ప్రవీష్. కే.ప్రదీప్ జోష్ నిర్మిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన ప్రదీప్ జోష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా వైగరై బాలన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు శశికుమార్ శిష్యుడన్న విషయం గమనార్హం. అద్దె ఇళ్ల నివాసుల ఇతి బాధలను ఆవిష్కరించే చిత్రంగా తెరకెక్కుతున్న ఈ గడిగార మనిదర్గళ్ చిత్రంలో షెరీన్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో లతారావ్, వాసు విక్రమ్, బాలాసింగ్, సిజర్‌మనోహర్, పావా లక్ష్మణ్, సౌందర్, షీలాగోపి, మాస్టర్ రిషీ నటిస్తున్నారు. సీఎస్.శ్యామ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రచార చిత్రం, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కే.భాగ్యరాజ్, వీసీ.గుహనాథన్, కదిరేశన్, పీఎల్.తేనప్పన్ పాల్గొన్నారు. వీసీ.గుహనాథన్ మాట్లాడుతూ కులమతాలకు, భాషలకు అతీతం కళాకారులని పేర్కొన్నారు. అలాంటి కళాకారులు నీటి కోసం జరిగే పోరాటంలో జోక్యం చేసుకోరాదన్నారు. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ఇదే జరుగుతుందన్నారు. నిజం చెప్పాలంటే కన్నడ నటుడు రాజ్‌కుమార్ తమిళ నిర్మాతలు ఏవీ.మెయప్పన్, సీఆర్.బసవరాజు లాంటి వారు నిర్మించిన బేడర కన్నప్ప చిత్రం లేకపోతే ఎక్కడుండేవారని ప్రశ్నించారు.అలాంటి రాజ్‌కుమార్‌కు చెందిన వారు కావేరి నీటి విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శక నటుడు కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ వీసీ.గుహనాథన్ ఎప్పుడూ భావోద్రేకంతో మాట్లాడతారని, అయినా ఆయన మాటల్లో న్యాయం ఉంటుంద ని అన్నారు. ఇది భావోద్రేకాలకు గురైయ్యే పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ఇక ఈ గడిగార మనిద ర్గళ్ చిత్ర విషయానికి వస్తే మంచి విషయం ఉన్న దర్శకుడు శశికుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని భావించవచ్చునన్నారు.అదే విధంగా కిషోర్ నటిస్తున్నారంటే కచ్చితంగా కథలో కొత్తదనం ఉంటుందని అన్నారు. గడియార మనిదర్గళ్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు కిషోర్, నటి షెరీన్, ప్రదీప్ జోష్, నిర్మాత ప్రవీష్.కే, దర్శకుడు వైగరై బాలన్ పాల్గొన్నారు. -
భారీ వసూళ్లతో ఇరుముగన్
ఇరుముగన్ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకోవడంతో పాటు భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుముగన్. ఈయనతో అగ్రనాయకి నయనతార తొలిసారిగా జత కట్టిన ఈ చిత్రంలో నిత్యామీనన్ మరో నాయకిగా నటించారు. నాజర్, తంబిరామయ్య, కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు అరిమానంబి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహించారు. తమీన్స్ ఫిలింస్ పతాకంపై శిబుతమీన్ నిర్మించిన ఈ భారీ చిత్రంలో విక్రమ్ కథానాయకుడిగా, ప్రతికథానాయకుడిగా నటించడం విశేషం. హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇరుముగన్పై నిర్మాణ దశలోనే మంచి అంచనాలు నెలకొన్నాయి. గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. విక్రమ్, నయనతార కలయికలో రూపొందిన తొలి చిత్రం అన్న క్రేజ్, విక్రమ్ విలన్‌గా నటించారన్న ఆసక్తి చిత్రానికి చాలా ఆకర్షణగా మారాయి. ఇరుముగన్ చిత్రంలో విక్రమ్ పోషించిన లవ్ అనే విలన్ గెటప్ చాలా కొత్తగా ఉంది. గత చిత్రం 10 ఎండ్రదుక్కుళ్ చిత్రంతో చాలా నిరాశను చవిచూసిన విక్రమ్ ఈ చిత్రం నూతనోత్సాహాన్నిచిందని చెప్పవచ్చు. సాధారణంగా కొత్త చిత్రాలు శుక్రవారం రోజున విడుదలవుతుంటాయి. అలాంటిది ఎలాంటి సెలవు దినం కాకపోయినా ఇరుముగన్ చిత్రం గురువారం విడుదలై భారీ వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ చిత్రం తొలి రోజునే తమిళనాడులో ఐదు కోట్లు వసూల్ చేసిందని సినీ వర్గాలు గణాంకాలు చెబుతున్నాయి. చెన్నైలో మాత్రమే 58.73 ల క్షలు వసూలు చేసిందని సమాచారం. అదే విధంగా సెంగల్పట్టులో కోటీ 20 లక్షలు, కోయంబత్తూర్‌లో 80 లక్షలు అంటూ మంచి వసూళ్లను రాబట్టిందని సినీవర్గాలు చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే పెద్ద చిత్రాలేమీ లేక పోవడంతో వారాంతర రోజుల్లోనూ ఇరుముగన్ వసూళ్ల వేట కొనసాగుతుందంటున్నారు. -
రిస్క్ చేస్తున్న రామ్
చాలా కాలం తర్వాత ఇటీవల 'నేను శైలజ' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినా.. నెక్ట్స్ సినిమాల విషయంలో రిస్క్ చేస్తున్నాడు. ఇప్పటికే తనకు కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టాడు. అయితే కందిరీగ తరువాత రభస లాంటి భారీ ఫ్లాప్ ఇచ్చిన సంతోష్‌తో రామ్ సినిమా చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ సినిమా తరువాత కూడా మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్. గతంలో రామ్ హీరోగా 'ఎందుకంటే ప్రేమంట' లాంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. లవ్ స్టోరీస్ తెరకెక్కించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న కరుణాకరన్ రామ్ కోసం ఓ క్యూట్ లవ్ స్టోరీని రెడీ చేస్తున్నాడట. మరి రామ్ చేస్తున్న ఈ రిస్క్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
పట్టుకెళ్లి చంపేశారు!
⇒ ఎర్రచందనం కూలీల ‘ఎన్కౌంటర్’ బూటకమే? ⇒ ప్రభుత్వానికి ముందే తెలుసు.. పథకం ప్రకారమే అంతా జరిగిందన్న వాదనలు ⇒ మృతులందరినీ ముందు రోజే అదుపులోకి తీసుకున్నారంటున్న బంధువులు ⇒ మృతుల్లో ఏడుగురిని ముందు రోజు బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మృతుల బంధువుల వెల్లడి ⇒ మృతులందరూ కూలీలేనని గుర్తించిన వైనం.. మృతుల్లో స్మగ్లర్లు ఏరీ? ⇒ ‘ఎన్కౌంటర్’పై హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీల ఆగ్రహావేశాలు ⇒ మానవ హక్కుల కమిషన్, ఉమ్మడి హైకోర్టు సీరియస్.. నివేదికలకు ఆదేశాలు ⇒ దుంగలు మోస్తూ దాడులెలా చేశారు? కాల్పులు జరుగుతున్నా పారిపోలేదా? ⇒ పోలీసులు రంగులు వేసిన ఎర్రచందనం దుంగలు.. కూలీల వద్దకు ఎలా వచ్చాయి? ⇒ సమాధానం లేని సందేహాలెన్నో.. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు బలోపేతం అది ఎన్కౌంటర్ కాదు.. బూటకపు ఎన్కౌంటర్! అక్కడ జరిగింది ఎదురు కాల్పులు కాదు.. పోలీసుల ఏకపక్ష కాల్పులు! మృతిచెందిన కూలీలు అడవిలో తారసపడలేదు.. జనారణ్యం నుంచి పోలీసులే పట్టుకెళ్లారు! ఆ కూలీలు పోలీసులపై దాడి చేయలేదు.. తాము పట్టుకొచ్చిన వారిని పోలీసులే వరుసపెట్టి కాల్చిచంపారు! శేషాచలం అడవుల్లో మంగళవారం నాటి ‘ఎన్కౌంటర్’పై అందులో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీల మరణంపై.. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచే కాదు.. మృతుల బంధువుల నుంచీ వెల్లువెత్తుతున్న ఆరోపణలివి. ఘటనా స్థలాల్లో కనిపిస్తున్న దృశ్యాలు, మరణించిన కూలీల బంధువులు చెప్తున్న వివరాలు, పౌర హక్కుల సంఘాలు లేవనెత్తుతున్న సందేహాలకు.. పోలీసులు చెప్తున్న కథనాలకు ఏమాత్రం పొంతన కుదరకపోవటం.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన కూలీల్లో ఏడుగురు.. ఆ ముందు రోజే బస్సులో ప్రయాణిస్తుండగా పోలీసులు ‘విచారణ’ పేరుతో అదుపులోకి తీసుకున్నారని.. వారితో పాటే ప్రయాణిస్తూ పోలీసుల దృష్టి నుంచి యాధృచ్చికంగా తప్పించుకున్న మరో కూలీ తమిళనాడులోని తన స్వగ్రామంలో బయటపెట్టటం.. ఇది బూటకపు ఎన్‌కౌంటరే అనేందుకు నిదర్శనంగా చూపుతున్నారు. మృతులంతా పొట్టకూటి కోసం కూలీలుగా పనిచేసే వారేనని పోస్టుమార్టం తర్వాత గుర్తించి.. వారి బంధువులకు అప్పగించారు. మరి మృతుల్లో స్మగ్లర్లు ఏరీ అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పోలీసులు సోమవారం నాటికే దాదాపు 100 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారని.. వారిలో 20 మందిని సోమవారం రాత్రే అడవుల్లోకి తీసుకెళ్లి అదే రాత్రి కాల్చిచంపారని.. దానిని ఉదయం జరిగిన ‘ఎన్కౌంటర్’గా చిత్రీకరిస్తున్నారని మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు శేషాచలం అడవుల్లో ‘ఎన్కౌంటర్’ అంతా ప్రభుత్వ ముందస్తు పథకం ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అధికారం చేపట్టిన రోజు నుంచి సీఎం చంద్రబాబు పలు సమీక్షలు నిర్వహించి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్న నేపథ్యంలో.. 20 మంది కూలీల మరణానికి కారణమైన కాల్చివేత ఘటన చోటుచేసుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మృతుల బంధువుల నుంచీ, పౌర సమాజం నుంచీ, రాజకీయ పార్టీల నుంచీ, పొరుగు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి నుంచీ ఆరోపణలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటం.. మానవ హక్కుల కమిషన్, హైకోర్టులు సర్కారు తీరును ఆక్షేపిస్తూ ఘటనపై పూర్తిస్థాయి నివేదికలు కోరటం.. వంటి పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సీఎం ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకుని ‘నష్టనివారణ’ చర్యల్లో నిమగ్నమయ్యారు. అది ముమ్మాటికీ ‘నిజమైన ఎన్‌కౌంటరే’నని బలంగా చెప్పేందుకన్నట్లుగా.. అడవుల్లో కూలీల సంచారానికి సంబంధించి పాత వీడియో ఫుటేజీలు కొన్ని చానళ్లకు లీకయ్యాయి. మంత్రులు రంగంలోకి దిగి.. ‘ఎన్కౌంటర్’ను సమర్థించుకుంటూ మాట్లాడారు. వాళ్లు కూలీలే కదా? అంటే.. ‘కూలీలు అడవిలోకి రాత్రిపూట గడ్డికోయటానికి వచ్చారా? ఎర్రచందనం దొంగతనం చేస్తే సహించేది లేద’టూ మళ్లీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. కూలీల మృతదేహాలకు పటిష్ట భద్రత మధ్య రాత్రికి రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి.. వారి బంధువులకు అప్పగించారు. శేషాచలం ‘ఎన్కౌంటర్’లో మృతి చెందిన 20 మంది కూలీల్లో కొందరిని సోమవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందని మృతుల బంధువులు చెప్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు పుదూర్ గ్రామ సర్పంచ్ మూర్తి బుధవారం మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన 8 మంది కూలీలు సోమవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిని పుత్తూరు - నగరి మధ్యలో ఆంధ్రా పోలీసులు ఆపి.. వారిని అనుమానంతో ప్రశ్నించారు. ఇంకా విచారించాలంటూ ఏడుగురిని తమతో జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారి సహచరుడైన శేఖర్ అనే మరో కూలీ వారితో పాటే బస్సులో ఉన్నప్పటికీ.. అతడు మహిళల కోసం కేటాయించిన సీట్లో కూర్చొని ఉండటంతో పోలీసుల దృష్టిలో పడలేదు. అలా తప్పించుకున్న శేఖర్ తమిళనాడులోని తన స్వగ్రామం పడవేడు పుదూర్ చేరుకుని, పరిసర గ్రామాల్లోని మిగతా ఏడుగురి కుటుంబాలకు, సర్పంచ్ మూర్తికి ఈ విషయాన్ని వివరించాడు. అయితే.. పోలీసులు తీసుకెళ్లిన ఏడుగురు కూలీలు ‘నకిలీ ఎన్కౌంటర్’లో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న శేఖర్.. కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు మూర్తి పేర్కొన్నారు. బంధువులదీ అదే మాట.. తిరువణ్ణామలై జిల్లా మురుగంబాడి గ్రామానికి చెందిన మృతుడు మునస్వామి తల్లి పద్మ, వేటగిరి పాలెంకు చెందిన మృతుడు పళణి సోదరి లక్ష్మి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ పై విషయాన్ని నిర్ధరించారు. ఆ ఏడు మందిని పోలీసు జీపులో తిరుపతి వైపు తరలించారని చెప్పారు. ఆ రాత్రే కాల్చిచంపారు: ఎన్కౌంటర్’లో మృతిచెందిన కూలీలను సోమవారం సాయంత్రానికే తిరుపతికి తీసుకువచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలోనే శ్రీవారి మెట్టు సమీపంలోని శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లి.. వారిని కాల్చి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అలా కాల్చిచంపాక.. దానిని ‘ఎన్కౌంటర్’గా చిత్రీకరించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తరువాతే మంగళవారం మీడియాకు వెల్లడించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ముందే సీఎంతోపాటు, ఉన్నతాధికారులకు సైతం తెలుసునని, శేషాచలం అడవుల్లోకి కూలీలు వెళ్లకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే కూలీలను పొట్టనపెట్టుకున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. అదుపులో ఉన్న కూలీల అరెస్టులు దాదాపు 100 మందికి పైగా కూలీలను కొద్ది రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే వీరిలో 20 మందిని పోలీసులు ‘ఎన్కౌంటర్’లో కాల్చిచంపగా.. మిగిలిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు చర్చ సాగుతోంది. అదే సమయంలో.. చిత్తూరులో బుధవారం మీడియా ముందు ముగ్గురు స్మగ్లర్లు, వారి అనుచరులు 11 మందితో పాటు 48 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా అదుపులో ఉన్నవారిని దశలవారీగా మీడియా ముందు ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం తరవాత అధికారులు ప్రణాళికాబద్ధంగా లీక్ చేసిన వీడియో ఫుటేజ్‌లు చూస్తే పోలీసుల కథనంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. వారం రోజుల కిందటే ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు శేషాచలం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు, వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారనేది అనధికారిక కథనం. లీకేజ్ ద్వారా బయటకు వచ్చిన విజువల్స్‌లో గత గురువారం నాటివీ ఉన్నాయి. వీరు వారం కిందటే శేషాచలంలోకి ప్రవేశించారని సమాచారం ఉంటే.. సోమవారం రాత్రి వరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎందుకు రంగంలోకి దిగలేదన్నది సమాధానం లేని ప్రశ్న. మరోపక్క నిఘా కెమెరాలో 3 రోజుల పాటు రికార్డయిన విజువల్స్‌ను పరిశీలించిన అధికారులకు.. స్మగ్లర్లు, కూలీలు ఎంత మంది ఉన్నారనేది అంచనా వేయలేకపోయారా? ఇలాంటి సందేహాలు మరెన్నో వ్యక్తమవుతున్నాయి. - సాక్షి ప్రతినిధి, తిరుపతి ‘బూటకపు ఎన్కౌంటర్’ను నిర్ధారిస్తున్న అంశాలివీ.. అడవుల్లో వందల సంఖ్యలో కూలీలు మారణాయుధాలతో ఉన్నారని తెలిసినప్పుడు ఒక్కో బృందంలో కేవలం 12 మంది పోలీసులు, ముగ్గురు అటవీ శాఖ అధికారులతోనే కూంబింగ్‌కు ఎందుకు వెళ్లినట్టు? కూలీలను పట్టుకోవడానికి అనువుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి అదనపు బలగాలను ఎందుకు తెప్పించుకోలేదు? రూ. 20 లక్షల వ్యయంతో అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ ఆధునిక రహస్య కెమెరాలు చీకట్లో కూడా దృశ్యాలను రికార్డు చేయగలవు. ఏదైనా బృందం అడవిలోకి కూబింగ్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ నిఘా కెమెరాల ఏర్పాటు ఉంటేవాటిని ఇతర ప్రాంతాల్లో ఉన్న అధికారులు అనునిత్యం పరిశీలిస్తుంటారు. అలాంటప్పుడు కూలీల వద్దకు చేరిన ఆయుధాల విషయం వారికి తెలుస్తుంది. దీన్ని గమనిస్తే ముప్పును ముందే ఊహించి అదనపు బలగాలను అడవిలోకి పంపడమో, ఉన్న వాటిని వెనక్కు రప్పించడమో చేసి కూలీలు బయటకు రాకుండా చుట్టూ దిగ్భందించడమో ఎందుకు చేయలేదు? ఇవేవీ లేకుండా కేవలం 15 మందితో కూడిన బృందాలు రెండు చోట్ల తమకు ఎదురైన, హఠాత్తుగా దాడి చేసిన వంద మందికి పైగా ఎర్రచందనం కూలీల్లో 20 మంది కాల్చిచంపడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న కూలీలకు పోలీసులు ఎదురైతే వారంతా చెల్లాచెదురవుతారు. ఆపై తమ వద్ద ఉన్న ఆయుధాలతో కనిపించిన వారిపై, రాళ్ళతో దూరంగా ఉన్న పోలీసులపై దాడులు చేస్తారు. అయితే శేషాచలంలో ‘ఎన్కౌంటర్’ జరిగినట్లు చెప్తున్న రెండు చోట్లా కేవలం 10 నుంచి 16 మీటర్ల విస్తీర్ణంలోనే 20 మంది ఎర్రచందనం కూలీల మృతదేహాలూ పడున్నాయి. ఎన్కౌంటర్ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఒక్కో కూలీ 25 నుంచి 30 కేజీల బరువున్న దుంగల్ని మోసుకుపోతున్నట్టు స్పష్టమవుతుంది. అలా మోసుకుపోతున్న వారికి ఒక్కసారిగా పోలీసులు ఎదురైతే బరువు మోస్తూ దాడికి పాల్పడగలరా? దుంగలను పడేసి దాడి చేశారంటే.. సాధారణంగా దుంగలను పడేసి పారిపోతూనో.. లేదా ముందుకొచ్చి దాడికి పాల్పడినట్టో కనిపించాలి? కాని ఒక్కొక్కరు ఒక్కో దుంగ పక్కన ఒరిగి పడిపోయి ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీసులు కాల్పులు జరిపినప్పుడు ప్రాణ భయంతో తప్పించుకుని పారిపోయేందుకు కొంతదూరమైనా పరుగెత్తే ఆస్కారముంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని మృతులు అటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. చూస్తే అక్కడికి ఎర్రకూలీలను తీసుకెళ్ళి వారిని కాల్చిచంపి వారిపక్కన దుంగలను వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మృతదేహాల వద్ద లభించిన దుంగలపై పెయింట్ రంగులు ఎలా వచ్చాయి? పోలీసులు రికవరీ చేసిన దుంగలను యార్డుల్లో భద్రపరిచేప్పుడే రంగులు వేస్తారు. కూలీల వద్ద పడివున్న దుంగలు కొత్తగా నరికినవి కాదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కూలీలు దాడులకు దిగారని పోలీసులు చెప్తున్నారు. యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిలో ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడం అనుమానాస్పదంగా ఉంది. రెండు బృందాలు శేషాచలం అడవుల్లోకి సోమవారం రాత్రి 7 గంటలకు వెళితే మంగళవారం ఉదయం 5, 6 గంటల మధ్యలోనే కిలోమీటరు దూరంలోనే ఒకేసారి సచ్చినోడిబండ, చీకటీగలకోనలో ఎర్ర కూలీలు పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లతో దాడిచేశారని పోలీసులు చెప్తున్నారు. వందలాది మంది కూలీలు పోలీసులపై దాడిచేస్తే ఒక్క కూలీనీ ప్రాణాలతో పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు చెప్తున్న ప్రకారం ‘ఆత్మరక్షణకే కాల్పులు’ జరిపితే.. ఒక్క కూలీ అయినా గాయాలతో బతికి ఉండే అవకాశం లేదా? పోలీసులు ఎర్ర కూలీలనే అనుమానంతో పుత్తూరు సమీపంలో అదుపులోకి తీసుకుంటే మంగళవారం ఉదయం శేషాచలం కొండల్లో పోలీసులపై వారు ఎదురుదాడికి ఎలా పాల్పడతారు? దీనికి తోడు సోమవారం రాత్రే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీపంలో ని గ్రామాల్లో తుపాకుల శబ్దం వినబడినట్లు ప్రచారం జరగడంతో ఆ ఘటన బూటకపు ఎన్కౌంటర్ అనేదానికి ఊతమిస్తోంది. -
'ఆ ఎన్కౌంటర్లన్నీ బూటకం'
చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకమంటూ కరుణాకరణ్ అనే వ్యక్తి ఘాటుగా విమర్శించాడు. పోలీసుల జరిపిన కాల్పుల్లో తిరువన్నామళైకు చెందిన మునిస్వామి అనే కూలీ మృతిచెందాడు. సోదరుడి మృతిపై స్పందించిన కరుణాకరణ్ బుధవారం విలేకరులతో మాట్లాడాడు. కూలీ కోసం తమ సోదరుడు ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాడనీ, కూలీ కోసం చిత్తూరు జిల్లా నగరికి వెళ్లిన తన సోదరుడు ఇలా విగతజీవిలా కనిపించాడంతో తమ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయిందని వాపోయాడు. సోదరుడి మృతిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పాడు. సోదరుడు మునిస్వామితో పాటు తమ గ్రామం నుంచి 8మంది కూలీలు వెళ్లారనీ, వారిలో ఏడుగుర్ని చిత్తూరు జిల్లా నగరి వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా చెప్పాడు. అయితే వారిలో ఒకరు తప్పించుకున్నట్టుగా కరుణాకరణ్ అన్నాడు. పోలీసుల అదుపులో ఉన్న ఏడుగురు ఇప్పడు శవాలుగా కనిపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరేనని కరుణాకరణ్ మండిపడ్డాడు. -
ప్రాణాలతో బయటపడిన హీరోయిన్
తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అది కూడా ఎవరో కాదు.. హాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దిగొచ్చిన భామ ఎమీ జాక్సన్‌ని. ఇటీవల 'ఐ' చిత్రంలో నటించిన ఎమీ తాజాగా మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి తిరుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కరుణాకరన్ హాస్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను కేరళలో షూటింగ్ చేస్తున్నారు. చిత్రీకరణలో భాగంగా ఓ కొండపై బైక్ రైడింగ్ సీన్లో నటిస్తున్న ఎమీ ఒక్కసారిగా బైక్‌పై నుంచి జారిపడి కొండమీద నుంచి కిందపడబోయిందట. సరిగ్గా అదే సమయంలో వెనకాలే మరో బైక్‌పై ఉన్న కరుణాకరన్ ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించి అసలైన హీరోగా మారాడట. -
మరో ప్రేమకథతో...
ప్రేమకథల వైపు అడుగులేయడం నితిన్ ఎప్పుడు మొదలుపెట్టారో... అప్పట్నుంచి ఆయన్ను విజయాలు వరించడం మొదలుపెట్టాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్... విజయాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న మరో ప్రేమకథ ‘చిన్నదాన నీ కోసం’. ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి మాట్లాడుతూ-‘‘కరుణాకరన్ మార్క్ స్టోరీ ఇది. నితిన్ గత విజయాలకు దీటుగా ఈ సినిమా ఉంటుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ నెల 27న పాటల్నీ, డిసెంబర్ 19న సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మిస్తీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఐ.ఆండ్రూ, సమర్పణ: విక్రమ్ గౌడ్. -
మాఫియా డాన్ ప్రేమకథ
ఓ అనాథ శరణాలయంలో సేవలందించే ఆమె, ఓ మాఫియా డాన్‌తో ప్రేమలో పడుతుంది. అయితే తాను ప్రేమిస్తున్నది ఓ మాఫియా డాన్ని అని ఆ అమ్మాయికి తెలియదు. ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘తేజాభాయ్’. పృథ్వీరాజ్, అఖిల జంటగా సుమన్, తలైవాసల్ విజయ్ కీలక పాత్రల్లో కరుణాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎం. రంగారెడ్డి, ఎస్. రామచంద్రారెడ్డి ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మాటలు: మల్లూరి వెంకట్, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి. -
చిన్నదాన నీకోసం...
గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు... ఒక్కసారి హైవే ఎక్కితే ఎలా ఉంటుంది? అచ్చంగా నితిన్ కెరీర్ అలాగే ఉంది. వరుస విజయాలతో విమాన వేగంతో దూసుకుపోతున్నాడు నితిన్. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఈ విజయాలను ఇలాగే కొనసాగించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు నితిన్. అందుకే తన ఇమేజ్‌కు తగ్గట్టుగా చక్కని ఫీల్‌గుడ్ లవ్స్టోరీలనే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘చిన్నదాన నీకోసం’ అనే పేరును ఖరారు చేశారనేది తాజా సమాచారమ్. తను నటించిన ‘ఇష్క్’ చిత్రంలోని ‘చిన్నదాన నీకోసం...’పాట పల్లవిలోని తొలి పదాన్నే తన సినిమా టైటిల్‌గా చేసుకోవడం విశేషం. నితిన్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం రూపొందుతోంది. -
నితిన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం
-
ముంబయ్ భామతో ప్రేమాయణం
ప్రేమకథా చిత్రాలకు నప్పే హీరో నితిన్. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే నైపుణ్యం ఉన్న దర్శకుడు కరుణాకరన్. ఈ ఇద్దరి కలయికలో ఓ సినిమా వస్తే.. అది కూడా వారి తరహా ప్రేమకథా చిత్రమైతే?... చెప్పడానికేముంటుంది? ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టే సినిమా ఇస్తారని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్లో శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. నితిన్‌తో ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’వంటి రెండు విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిఖితారెడ్డి, సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్‌గౌడ్ సమర్పకుడు. బాలీవుడ్ భామ మిస్తీ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సదానంద్ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే నెల 2న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ షూటింగ్ చేయనున్నామని నిఖితారెడ్డి తెలిపారు. -
ఫుల్ రొమాన్స్...
మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా, ప్రేమకథల వైపు ఎప్పుడైతే దష్టి సారించారో... అప్పట్నుంచీ నితిన్ కెరీర్ సూపర్స్పీడ్ అందుకుంది. వరుస విజయాలు ఆయన ఖాతాలో చేరుతున్నాయి. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ఎటాక్... ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నారు నితిన్. త్వరలో రాబోతున్న ఆయన సినిమా.. ‘కొరియర్‌బోయ్ కల్యాణ్’ కూడా ప్రేమకథే కావడం గమనార్హం. ఇప్పుడు అదే ఊపుతో మరో ప్రేమకథకు పచ్చజెండా ఊపారు నితిన్. ప్రేమకథలు తీయడంలో సిద్ధహస్తునిగా పేరుగాంచిన కరుణాకరన్ దర్శకత్వంలో ఫుల్ రొమాన్స్ చేయబోతున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలీవుడ్ కథానాయిక మిస్తీ ఇందులో హీరోయిన్. ఈ నెల 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంచనంగా జరుగనున్నాయి. ఇష్క్, గుండెజారి... తర్వాత తాము నిర్మిస్తున్న మూడో సినిమా ఇదని, జూన్ 2న చిత్రీకరణ మొదలుపెట్టి మన దేశంలోనూ, విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతామని, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, కళ: రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌గౌడ్. -
సోనంపై రహస్య చిత్రీకరణ
తమిళ చిత్ర రంగానికి వచ్చిన పంజాబీ నటి సోనం ప్రీత్ నటించిన సన్నివేశాన్ని రహస్యంగా కెమెరా దాచి చిత్రీకరణ జరిపారు. దీని గురించి ఁకప్పల్రూ. చిత్ర దర్శకుడు కార్తిక్ జి.గిరీష్ మాట్లాడుతూ ఁముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా అనే పాటలో మూళ్గాదా షిష్పే ఫ్రెండిప్పా అనే వాక్యం వస్తుందని, అందులో స్నేహాన్ని ఒక ఓడతో గీత రచయిత పోల్చినట్లు వివరించారు. ఈ చిత్రంలో ఓడ ఎక్కడా కనిపించదన్నారు. ఇందులో హీరోగా వైభవ్, హీరోయిన్గా సోనం ప్రీత్ బజ్వా నటిస్తున్నారని చెప్పారు. ఈమె పంజాబీలో బెస్ట్ ఆఫ్ లక్ అనే చిత్రంలో నటించారని తెలిపారు. ఈమె ఉత్తరాఖండ్‌కు చెందినదన్నారు. ఈ చిత్రంలో విడివి గణేష్, కరుణాకరన్, ఆర్జునన్, నందకుమార్, శంకర్ నటిస్తున్నట్లు తెలిపారు. దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నట్లు తెలిపారు. నటరాజన్ శంకరన్ సంగీతం సమకూరుస్తున్నారన్నారు. ఈ చిత్రం షూటింగ్ చెన్నై నొచ్చికుప్పం, సెంట్రల్ రైల్వే స్టేషన్ వంటి చోట్ల జరిగిందన్నారు. అక్కడ షూటింగ్ జరిగినట్లు ఎవరికీ తెలియదన్నారు. మినీ కెమెరాను దాచి చిత్రీకరణ జరిపామన్నారు. -
ఆయన్ని కలిశాకే కథ మొదలైంది!
తొలియత్నం ప్రేమ... యవ్వనపు వీధుల్లో భావోద్వేగాలు నేర్చుకునే తొలి భాష. హృదయపు గోడలపై ఊహలు రాసుకునే తొలి కవిత. తొలిప్రేమ... ఒక జీవితకాలపు అనుభవం. ఒక జీవితానికంతా గుర్తుండిపోయే జ్ఞాపకం. కనే ప్రతి కలనూ, కదిలే ప్రతి కదలికనూ అందంగా జన్యుపటంలో నిక్షిప్తం చేసే వర్ణ రసాయనం. మనసుకు కాలమిచ్చే ఈ కానుకను ఒక కథలా మలిచి వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన కవి... కరుణాకరన్. విశ్వజనీనమైన ఈ ‘తొలిప్రేమ’ చుట్టూతా అల్లుకున్న ఆయన అనుభవాలే ఈవారం ‘తొలియత్నం’ క్లుప్తంగా కథేంటి... అడిగారు పవన్. కథ అడిగితే నేను కవిత చెప్పా. ‘నేను ప్రేమించిన అమ్మాయి నా పక్కనే ఉంది కానీ బాధగా ఉంది. ఎందుకంటే ప్రేమ లేదు. ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్లిపోయింది. కానీ బాధ లేదు. ఎందుకంటే ప్రేమ ఉంది.’ ఒక్క క్షణం తనేం మాట్లాడలేదు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తేరుకుని ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్, మనం సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నాం అన్నారు. ఆ క్షణం నాకు మాటలు రాలేదు. అక్కడి నుంచి సరాసరి ట్యాంక్‌బండ్‌కు వెళ్లిపోయాను. ఒక బెంచ్ మీద కూర్చుని మనసులో గడ్డకట్టిన బాధ కరిగిపోయేవరకు కసిదీరా ఏడ్చాను. నా కళ్లలో నిండిన నీళ్లతో ఎదురుగా హుస్సేన్ సాగర్ ప్రవాహం మసకబారింది. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర దేవకొట్టైలో నా ప్రయాణం మొదలైంది. చదువు లేకపోతే ఏమీ లేదని అమ్మ ఎప్పుడూ చెప్పేది. పాలిటెక్నిక్ తరువాత సినిమా మీద ఇష్టంతో చెన్నైకి వచ్చేశాను. అప్పటికి సినిమాకు సంబంధించి నాకే పరిచయాలూ లేవు. ఎలా మొదలుపెట్టాలి, ఎక్కడ మొదలుపెట్టాలి. ఈ ఆలోచనలతోనే మూడేళ్లు గడిచిపోయాయి. తరువాత ఎన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసినా, అవి ఏదో ఒక రకంగా మధ్యలోనే ఆగిపోయేవి. నేను పనిచేసిన ఏ సినిమా పూర్తి కాలేదు. దాంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యాను. మద్రాసులో ఉన్నంత కాలం రోజూ పొద్దున్నే కొడంబాకం బ్రిడ్జి మీదకు నడుచుకుంటూ వెళ్లేవాణ్ని. సరిగ్గా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు 3335 కార్లో ఇళయరాజాగారు, ఏడు గంటలకు హోండా కార్ నం.1లో చిరంజీవిగారు వెళ్లేవాళ్లు. వాళ్ల కార్లు వెళ్లేదాకా అలా చూస్తూ, అప్పుడు నా రోజును మొదలుపెట్టేవాణ్ని. మద్రాస్ జీవిత పోరాటంలో నేను అలిసిపోకుండా నిరంతరం స్ఫూర్తి నింపినవాళ్లు ఆ ఇద్దరూ. జీవితం అలా సాగుతున్నప్పుడు ఒకరోజు మా నాన్నగారు పిలిచారు. అమ్మ నీ గురించి చాలా బెంగపడుతోంది. మా మున్సిపల్ ఆఫీస్‌లో నీకో ఉద్యోగం పెట్టిస్తాను అన్నారు. సినిమా తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాను. అప్పుడు మా నాన్న, చూడు కరుణా! ఇప్పటికీ నీ జీవితంలో ఐదేళ్లు ఎలాంటి ఉపయోగం లేకుండా, అవెలా గడిచాయో తెలీకుండా పోయాయి. నిజంగా సినిమా నీ జీవిత గమనమైతే, ఇప్పటినుంచీ ప్రతిరోజూ ఎలా గడిచిందో రాసుకో. అప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది అన్నారు. ఆ మాటలు నాపై తీవ్ర ప్రభావం చూపించాయి. కదిర్గారు ‘ప్రేమదేశం’ తీస్తున్నారని తెలిసి నేను మీ దగ్గర పనిచేస్తానని అడిగాను. ఎన్నోసార్లు తిరిగితే చివరకు ఆయన దగ్గర క్లాప్‌బాయ్‌గా అవకాశం దొరికింది. ఆయనకు నా పని, క్రమశిక్షణ నచ్చి అదే సినిమాకు నన్ను కో-డెరైక్టర్ని చేశారు. అది నాపై నాకు ఆత్మవిశ్వాసం కలిగించిన క్షణం. ‘ప్రేమదేశం’ సంచలన విజయం తరువాత కూడా నా దగ్గర ఎలాంటి కథ లేదు. ఒకరోజు దీపావళి పండుగకు బస్సు దిగి మా ఊళ్లోకి నడుస్తున్నప్పుడు ఆ చీకట్లో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. చీకట్లో మతాబులు కాలుతున్నప్పుడు ఆ వెలుగు రవ్వల మధ్య ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ క్షణం ఒక అద్భుతమైన కవితలా నా మనసులో గాఢంగా ముద్రించుకుంది. దాని చుట్టూతా నా జీవితంలో, నా స్నేహితుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను తీసుకుని కథ అల్లుకున్నాను. మొదటినుంచీ నా మిత్రుల ప్రేమకు సంబంధించి నేను ఇన్వాల్వ్ అయ్యేవాణ్ని. అవన్నీ గుర్తు చేసుకుని స్క్రిప్ట్ రాసుకున్నాను. కథ పూర్తయిన తరువాత మద్రాస్‌లో వందమంది నిర్మాతలకు పైగా కథ వినిపించాను. రెండున్నర గంటలపాటు ప్రతి సీన్ వివరంగా చెప్పేవాణ్ని. అందరూ చేద్దాం, చూద్దాం అన్నారే తప్ప అడుగు ముందుకు పడలేదు. ఒకరోజు పాండీ బజార్లో సినిమా మ్యాగజైన్లో పవన్ కల్యాణ్ ఫొటో చూశాను. చూడగానే నా కథకు అతనే కరెక్ట్ అనిపించింది. అతనెవరని ఆరా తీస్తే, చిరంజీవిగారి తమ్ముడని తెలిసింది. మద్రాస్‌లో ఉన్న వాళ్ల బంధువు ద్వారా ప్రయత్నిస్తే చాలా రోజులకు ఆయన అపాయింట్మెంట్ దొరికింది. ఆ క్షణంతో నా పదేళ్ల పోరాటానికి ఒక ముగింపు దొరికింది. సినిమా ముందురోజు ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చి, ‘‘కరుణాకర్! సినిమాకు చాలా ఖర్చు పెడుతున్నాం. మొదటిరోజు నువ్వు సరిగ్గా తీయకపోతే వేరే డెరైక్టర్‌ను పెట్టుకుంటా’’నన్నారు. దాంతో నేను కంగారు పడిపోయాను. కో-డెరైక్టర్ రంగరాజ్గారు మాత్రం ‘‘కరుణాకర్ టెన్షన్ పడకు. తాజ్‌మహల్ ఒక్కరోజు కట్టలేదు. మొత్తం సినిమా కూడా ఒకే రోజులో తీయలేం. మొత్తం స్క్రిప్ట్ మనసులో పెట్టుకోకుండా ఈ రోజేం తీయాలో అదే ఆలోచించు’’ అన్నారు. మొదటి సీన్ పవన్ కల్యాణ్ మంచంలో పడుకున్నప్పుడు, ముఖం మీద నుంచి తల్లి దుప్పటిలాగే షాట్ తీశాను. ఆ షాట్‌నే మొదటి సీన్‌గా తీయాలని పట్టుబట్టి తీశాను. ఎందుకంటే శివాజీ గణేశన్ మొదటి సినిమా మొదటి షాట్ కూడా ఇలాగే తీశారనే సెంటిమెంట్‌తో నేనూ అలాగే చేశాను. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేశాయి. సినిమా మొత్తంలో చివరి వరకు ఒకరిని ఒకరు ఎక్కడా ముట్టుకోకుండా, ప్రేమను వ్యక్తీకరించుకోకుండా చాలా హృద్యంగా కథ నడుస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు పవన్ దగ్గరికెళ్లి, హీరోయిన్ మీ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని ఎమోషనల్‌గా ఏడుస్తుందని చెప్పాను. కీర్తిరెడ్డి దగ్గరకు వెళ్లి మీరు ఏడుస్తూ పవన్ దగ్గరకు వెళ్లి నుదుటి మీద ముద్దు పెట్టుకోండని చెప్పాను. ఈ విషయం పవన్‌కు తెలిస్తే, అతను కొంచెం ఇబ్బందిపడతాడు, కాబట్టి చెప్పకుండా చేస్తున్నామని చెప్పాను. ఆ సీన్లో కీర్తిరెడ్డి సడన్‌గా తన నుదుటిమీద ముద్దుపెట్టుకోవడంతో పవన్‌కు ఏమీ అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆశ్చర్యంలో ఉండిపోయారు. తరువాత విషయం అర్థమయ్యాక, ఎంత గొప్పగా తీశావ్ కరుణా అని మెచ్చుకున్నారు. ఒకసారి ‘ఏమి సోదరా’ పాట పూర్తయ్యాక, మాంటేజ్ షాట్స్ చూడటానికి పవన్ కల్యాణ్‌ను పిలిచాను. చూసి ఆయన నన్ను గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి డిన్నర్‌కు తీసుకెళ్లారు. ఈ కథకు ఉత్ప్రేరకంగా నిలిచిన దీపావళి సీన్‌ను ఛోటా కె.నాయుడు చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాకు పనిచేసిన మహిదర్గారు బిజీగా ఉండటంతో ఈ సీన్‌ను ఛోటా కె.నాయుడుగారు చిత్రించారు. కొడెకైనాల్లో కార్ యాక్సిడెంట్ సీన్ తీస్తున్నప్పుడు రోప్ తెగిపోయి లోపల ఉన్న హీరో హీరోయిన్ల డూప్‌లు చిన్న లోయలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు పవన్ వెంటనే కిందకు దూకి లోపల ఉన్న వాళ్లను రక్షించారు. అలా ఏ విషయంలోనైనా ఆయన ముందుండి నన్ను నడిపించారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, కారణం కేవలం పవన్ కల్యాణ్. ‘నా మనసే’ పాట తీస్తున్నప్పుడు ఒకరోజు మాకు మ్యూజిక్ అందుబాటులో లేదు. నేను నోటితో రిథమ్స్ పాడుతుంటే, పవన్ అప్పటికప్పుడు భరతనాట్యం స్టెప్స్ వేశారు. కె.క్రాంతికుమార్‌రెడ్డి