
షూటింగ్ స్పాట్‌లో సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్, దర్శకుడు కరుణాకరన్
ఇంటిలిజెంట్ సినిమాతో మరోసారి షాక్ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే కరుణాకరణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అన్న టాక్ వినిపిస్తోంది.
గతంలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా కథ కూడా హీరోయిన్ వైపు నుంచే నడుస్తుంది. ఇప్పుడు అదే తరహాలో సాయి ధరమ్ కొత్త సినిమా సాగనుందట. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సుప్రీం హీరో సక్సెస్ కోసం ఈ జానర్‌ను ఎంచుకున్నాడు. లవ్ స్టోరిలను తెరకెక్కించటంతో స్పెషలిస్ట్ గా పేరున్న కరుణాకరన్ అయినా సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను గాడిలో పెడతాడేమో చూడాలి.