‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ టీజర్‌ | Sai Dharam Tej Tej I Love You Teaser | Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 11:48 AM | Last Updated on Tue, May 1 2018 2:59 PM

Sai Dharam Tej Tej I Love You Teaser - Sakshi

కెరీర్‌ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇటీవల వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డాడు. యంగ్ డైరెక్టర్‌లనుంచి స్టార్‌ డైరెక్టర్ల వరకు ఎవ్వరూ తేజ్‌ కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయారు. దీంతో కాస్త రూట్‌ మార్చి ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సాయి ధరమ్‌. కరుణాకరన్‌ డైరెక్షన్‌లో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం తేజ్‌.. ఐ లవ్‌ యూ.

ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. తేజ్‌ ఫస్ట్‌ ఫీల్‌ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ టీజర్‌లో కరుణాకరన్‌ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అనుపమా పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్‌ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిన సాయి ధరమ్‌ కెరీర్‌ను గాడిలో పెడుతుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement