తేజ్‌.. ఐ లవ్‌ యూ | Sai Dharam Tej Karunakaran Movie Title Revealed | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 4:52 PM | Last Updated on Sat, Apr 28 2018 6:16 PM

Sai Dharam Tej Karunakaran Movie Title Revealed  - Sakshi

కరుణాకరన్‌ డైరెక్షన్‌లో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. తేజ్‌.. ఐ లవ్‌ యూ అన్న టైటిల్‌ను ఈ చిత్రానికి ఫిక్స్‌ చేసేశారు. అనుపమా పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్‌ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా కరుణాకరన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మే 1వ తేదీన ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది. గత కొంత కాలంగా రోటీన్‌ ఫార్ములా చిత్రాలతో ఫెయిల్యూర్స్‌ చవిచూస్తున్న ఈ మెగా హీరోకు లవ్‌ స్టోరీల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌.. హిట్‌ అందిస్తాడేమో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement