Gopi Sundar
-
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్(Gopi Sundar ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65)( Livi Suresh Babu)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గురువారం కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ.. ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్మలయాళం టాప్ సంగీత దర్శకుల్లో గోపి సుందర్ ఒకరు. మెలోడీస్కి కేరాఫ్ ఆయన. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ తో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేశారు. ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Gopi Sundar Official (@gopisundar__official) -
నాలుగోసారి ప్రేమలో పడ్డ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా గోపి.. అతడి భార్య, సింగర్ అమృత సురేశ్ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. గోపి సుందర్ ఈ మధ్య యూరప్‌లో సంగీత విభావరి (కన్సర్ట్)కి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోల్లో మయోని అలియాస్ ప్రియ నాయర్‌తో సన్నిహితంగా కనిపించాడు. న్యూజిలాండ్ ట్రిప్‌కు కూడా తనను వెంటేసుకుని వెళ్లాడు. దీపావళి కూడా ఆమెతోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. గోపి సుందర్- ప్రియ నాయర్ భార్యకు బదులుగా మరో అమ్మాయితో.. ఈ ఫోటోలను ప్రియ నాయర్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ఎలా ప్రేమించాలి? ఎలా జీవించాలి? అనే విషయాలను నేర్పిన వ్యక్తితో సంతోషకర క్షణాలు' అని సదరు పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. దీంతో వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని అభిమానులు అనుమానిస్తున్నారు. కాగా గోపి సుందర్ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్, యాదవ్ అని ఇద్దరు సంతానం. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. తర్వాత సింగర్ అభయ హిరణ్మయితో తొమ్మిదేళ్లకుపైగా సహజీవనం చేశాడు. కానీ ఈ రిలేషన్ కూడా ముక్కలైపోయింది. గోపి సుందర్- అమృత సురేశ్ ఏడాదికే ముక్కలైన రిలేషన్.. గతేడాది సింగర్ అమృత సురేశ్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు గోపి సుందర్. కానీ ఏడాది గడిచేలోపు పరిస్థితులు తారుమారయ్యాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. బయట కూడా ఎక్కడా కలిసి కనిపించలేదు. ఇద్దరూ విడివిడిగానే ట్రిప్పులకు వెళ్తున్నారు. దీంతో వీరు విడిపోయారని నెటిజన్లు ఫిక్సయిపోయారు. అటు విడాకుల వార్తలపై గోపి, అమృత సైతం ఇంతవరకు స్పందించనేలేదు. తాజాగా మరో అమ్మాయితో గోపి సుందర్ క్లోజ్‌గా కనిపించడంతో అతడు నాలుగోసారి లవ్‌లో పడ్డాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. గోపి సుందర్.. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఈయన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజ్ను, బ్రహ్మోత్సవం, ప్రేమమ్, నిన్ను కోరి, గీతా గోవిందం, మజిలి, 18 పేజెస్.. ఇలా ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. View this post on Instagram A post shared by Priya Nair (@_.mayoni._) View this post on Instagram A post shared by Priya Nair (@_.mayoni._) చదవండి: 21 ఏళ్ల కుమారుడున్న బాలీవుడ్ బ్యూటీతో రిలేషన్.. ట్రోలింగ్‌పై హీరో రియాక్షన్ ఇదే! -
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన సింగర్?
కోలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అమృతా సురేశ్, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. అమృత తన బర్త్‌డే రోజు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్‌లో గోపీ సుందర్‌ను భర్తగా అభివర్ణించింది. దీంతో వీరికి పెళ్లైపోయిందని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే గోపీసుందర్ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్, యాధవ్ అని ఇద్దరు పిల్లలు. కానీ తర్వాత పలు కారణాలతో వీరు విడిపోయారు. ఆ తర్వాత సింగర్ అభయతో ప్రేమలో పడిన గోపీ 2008 నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఇటీవలే వీరిమధ్య పొరపచ్చాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. మరోవైపు అమృతా సురేశ్ గతంలో నటుడు బాలాను పెళ్లాడింది. వీరికి కూతురు కూడా ఉంది. కొన్నేళ్లకు వారు విడిపోయారు. రీసెంట్గా జరిగిన బర్త్‌డే వేడుకలను సైతం అమృత తన కూతురు, ప్రియుడు సుందర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. View this post on Instagram A post shared by AMRITHA SURESSH (@amruthasuresh) View this post on Instagram A post shared by AMRITHA SURESSH (@amruthasuresh) చదవండి: ఆమిర్ ఖానా? ఆయనెవరు? నాకైతే తెలీదబ్బా.. షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన ప్రేమజంట!.. -
భార్యకు విడాకులు.. గాయనితో 9 ఏళ్లుగా
దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్. తన దైన శైలీలో బాణీలను అందిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో టాలీవుడ్లో మ్యూజిక్ కంపోజర్‌గా అరంగేట్రం చేసిన గోపీ ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారి మిగతా సంగీత దర్శకులకు తీవ్రమైన పోటీని ఇస్తున్నాడు. అయితే ఇప్పటివరకు గోపీ సుందర్ వృత్తిపరమైన జీవితం గురించే అందరికీ తెలుసు. కానీ తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్ చేసిని పోస్ట్‌తో అతడి వ్యక్తిగత జీవితం తెలసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపిస్తున్నారు. 2001లో గోపీసుందర్‌కు ప్రియ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మనస్పర్థలు తలెత్తడంతో గోపీసుందర్ తన భార్య నుంచి విడాకులు కావాలిన కోర్టును ఆశ్రయించాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు ఆయన భార్య ప్రియ కూడా సమ్మతంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువ గాయని అభయ హిరణ్మయితో గోపీ సుందర్ ప్రేమలో పడ్డాడు. గోపీ- హిరణ్మయిలు తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో వీరిద్దరూ అధికారికంగా తెలిపారు. ‘నా ఉనికికి నువ్వే కారణం’ అంటూ హిరన్మయితో కలిసి దిగన ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు గోపీ సుందర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక గోపీ సుందర్ స్వరపరిచిన అనేక పాటలను హిరణ్మయి ఆలపించిన విషయం తెలిసిందే. చదవండి: అప్పుడు దిమాక్ ఖరాబ్.. ఇప్పుడు డింఛక్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ View this post on Instagram You are the reason I exist ❤️ A post shared by Gopi Sundar Official (@gopisundar__official) on May 12, 2020 at 11:25pm PDT -
పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
సాక్షి, హైదరాబాద్: కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘క్లీన్ యూ’ సర్టిఫికేట్ లభించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సకుటుంబసపరివార సమేతంగా చూడదగ్గ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మరింత ప్రమోషన్ కల్పించేందుకు బుధవారం (8వతేదీన) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో ఉన్న సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో ప్రమోషన్లో దూసుకుపోతూ ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గెస్ట్‌గా ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద బాగా కలిసివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తుస్తున్నారు. కళ్యాణ్ రామ్, మెహరీన్‌తోపాటు, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. -
ఇక నుంచి కొచ్చి కాదు.. హైదరాబాద్‌లోనే
క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ హైదరాబాద్‌లో కొత్త మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటు చేశాడు. కేరళకు చెందిన గోపీ సుందర్ ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా మారాడు. సాంగ్ కంపోజ్ కోసం కొచ్చిలోని తన మ్యూజిక్ స్టూడియోకు వెళ్లాల్సి వస్తోంది. సమయం వృథాతో పాటు దర్శకనిర్మాతలతో మ్యూజిక్ సిట్టింగ్, పాటల రికార్డింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన గోపీ సుందర్ హైదరాబాద్‌లోనే స్టూడియే ఏర్పాటు చేశాడు. దీంతో ఇక నుంచి చేయబోయే కొత్త చిత్రాల సాంగ్స్‌ను ఇక్కడే కంపోజ్ చేయనున్నాడు. కాగా ప్రసుత్తం టాలీవుడ్లో అగ్ర సంగీత దర్శకులుగా మారినా దేవిశ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ థమన్‌లకు కూడా హైదరాబాద్‌లో మ్యూజిక్ స్టూడియోలు లేవు. వారు చెన్నైకి వెళ్లి సాంగ్ కంపోజ్ చేస్తుంటారు. అయితే గోపీ సుందర్ హైదరాబాద్‌లో స్టూడియో ఏర్పాటు చేయడం అతడి నిబద్దతకు అద్దం పడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. గత కొద్ది కాలంగా సినీ సంగీత ప్రియుల్ని తన మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు గోపీ సుందర్. ముఖ్యంగా గీతాగోవిందం సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... నీకై నువ్వే వచ్చి వాలావే.. ఇకపై తిరనాళ్లే..’ అంటూ సాగే సాంగ్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు మజ్ను, భలేభలే మగోడివోయ్ చిత్రాలతో ఆకట్టుకున్న గోపీ సుందర్ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్, ఎంత మంచి వాడవురాతో పాటు అఖిల్ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. -
అన్నకు హ్యాండిచ్చినా.. తమ్ముడు చాన్స్ ఇచ్చాడు!
అక్కినేని నటన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సక్సెస్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ తన నాలుగో సినిమా చేయనున్నాడు. మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్‌కు తొలి విజయాన్ని అందించేందుకు అల్లు అరవింద్ కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ను తీసుకోవాలని భావించినా బడ్జెట్‌ను వీలైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో దేవీని పక్కన పెట్టేశారు. తరువాత తమన్ పేరు వినిపించినా ఫైనల్ గా గోపిసుందర్ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమాకు గోపిసుందర్ సంగీతమందించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమాకు నేపథ్యసంగీతం పూర్తి చేయకుండానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అలా అన్న నాగచైతన్యకు హ్యాండిచ్చిన సంగీత దర్శకుడు గోపి సుందర్‌ను తమ్ముడు అఖిల్ ఇప్పుడు తన తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిగా తీసుకోవటం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
‘మజిలీ’ మ్యూజిక్ డైరెక్టర్ మారాడా..?
పెళ్లి తరువాత నాగచైతన్య, సమంతలు కలిసి నటిస్తున్న పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా మజిలీ. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ మజిలీ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాటలకు సంబందించిన వర్క్ పూర్తి కాగా నేపథ్యం సంగీతం చేయాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి గోపి సుందర్ తప్పుకోవటంతో తమన్‌తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించే ఆలోచనలో ఉన్నారట మజిలీ టీం. ప్రస్తుతానికి సంగీత దర్శకుడి మార్పుపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఫిలిం నగర్లో మాత్రం ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. -
ప్రియతమా..ఇష్టమైన సఖుడా
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలి. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట లిరికల్ వెర్షన్‌ను చిత్రం యూనిట్ సోమవారం విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను గాయని చిన్మయి శ్రీపాద చాలా హృద్యంగా ఆలపించారు. కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్న ఈ మూవీలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ స్వరాలను సమకూర్చారు. -
‘మజిలీ’.. ప్రేమ ఉన్న దగ్గరే బాధ ఉంటుంది..!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్ లైఫ్ జోడి సమంతతో కలిసి మరో సినిమలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చైతూ-సామ్‌లు భార్య భర్తలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. మజిలీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను కూడా సినిమా కాన్సెప్ట్ ఎంటో చూపించేలా డిజైన్ చేశారు. పోస్టర్ డిజైన్‌ను బట్టి చూస్తే సినిమా విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాను 2019 వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
మ్యూజికల్ రైడ్
ఈ ఏడాది అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి మంచి ఊపు మీద ఉన్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. అటు మాలీవుడ్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తున్న గోపీసుందర్ తాజాగా మరో తెలుగు సినిమాకు స్వరాలు సమకూర్చడానికి సిద్ధం అయ్యారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్కా, మాధవన్ ప్రధాన పాత్రలుగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘సైలెన్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది యూఎస్‌లో ప్రారంభం కానుంది. ‘‘తెలుగులో ఇప్పటికే గోపీ సుందర్ మంచి సంగీతం అందించారు. ఆయన మా సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీ. మంచి మ్యూజికల్ రైడ్‌గా ఉంటుందీ చిత్రం’’ అన్నారు కోన వెంకట్. -
చైతూ సినిమా వాయిదా!
కేరళలో కురుస్తున్న వర్షాలు టాలీవుడ్ ఇండస్ట్రీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. తెలుగులో మలయాళ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అయితే కేరళలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు షూటింగ్లలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో పాల్గొన లేకపోవటంతో సినిమాలు ఆలస్యమవుతున్నాయి. యంగ్ నాగచైతన్య నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాకు కూడా కేరళ వరదల షాక్ తగిలింది. ఆగస్టు 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేస్తున్న చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతమందిస్తున్నారు. అక్కడి పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. హీరో నాగచైతన్య ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. Due to the unfortunate situation in Kerala .. team #ShailajaReddyAlludu is not able to finish the re-recording of the film which is happening there and remaining post production on time .. the makers will fix on the next best possible date and announce shortly ..(1/2) — chaitanya akkineni (@chay_akkineni) 20 August 2018 I sincerely apologise for this delay and also urge everyone to do whatever best they can to help the people of Kerala My heart goes out to everyone there and pray for a quick recovery (2/2) — chaitanya akkineni (@chay_akkineni) 20 August 2018 -
మ్యూజిక్ డైరెక్టర్ టు హీరో!
‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, ప్రేమమ్, నిన్ను కోరి’ వంటి చిత్రాలకు పాటలు అందించి, తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్. మలయాళంలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన తమిళ, హిందీ సినిమాలకూ మ్యూజిక్ అందిస్తుంటారు. ఇప్పుడు ఆయన నటనపై దృష్టి సారించారు. హరికృష్ణన్ దర్శకత్వంలో గోపీసుందర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ‘టోల్ గేట్’. ‘టాలెంటెడ్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ గోపీ సుందర్ యాక్ట్ చేస్తున్న మొదటి సినిమాని అనౌన్స్ చేయడం ఆనందంగా ఉంది. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన గోపీ యాక్టింగ్‌తోనూ ఆడియన్స్‌ను మ్యాజిక్ చేస్తాడని నమ్ముతున్నాను’’ అంటూ గోపీ సుందర్ ఫస్ట్ లుక్‌ను హీరో దుల్కర్ రిలీజ్ చేశారు. ‘మిస్టర్ ఫ్రాడ్’, ‘సలాలా మొబైల్స్’ చిత్రాల్లో గెస్ట్ రోల్ చేసిన గోపీ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ‘టోల్ గేట్’. -
‘జంబలకిడి పంబ’ ట్రైలర్ విడుదల
-
ఆకట్టుకుంటున్న ‘జంబలకిడి పంబ’ ట్రైలర్
ఈవీవీ సత్యనారాయణ ‘జంబలకిడి పంబ’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, సీనియర్ నరేష్, కోట శ్రీనివాసరావు లాంటి దిగ్గజాలు చేసిన కామెడీని ఎప్పటికీ మరిచిపోలేము. మళ్లీ అలాంటి కాన్సెప్ట్‌తో, అదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. హీరో, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘జంబలకిడి పంబ’ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మగవారు ఆడవారుగా, ఆడవారు మగవారుగా మారితే ఎలా ఉంటుందో ఈవీవీ తన సినిమాలో చూపించినా.. మళ్లీ అదే నేపథ్యంతో డైరెక్టర్ జెబీ మురళీ కృష్ణ మరో వినూత్న కథనంతో మళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, జబర్దస్త్ కమెడియన్స్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
తేజ్.. ఐ లవ్ యూ
కరుణాకరన్ డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. తేజ్.. ఐ లవ్ యూ అన్న టైటిల్‌ను ఈ చిత్రానికి ఫిక్స్ చేసేశారు. అనుపమా పరమేశ్వరన్ ఈ చిత్రంలో తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మే 1వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. గత కొంత కాలంగా రోటీన్ ఫార్ములా చిత్రాలతో ఫెయిల్యూర్స్ చవిచూస్తున్న ఈ మెగా హీరోకు లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్.. హిట్ అందిస్తాడేమో చూడాలి. Thank you Karunakaran sir for designing this very special role that's very close to my heart.. Hope you all love it. 🙏 #Tejiloveyou #SDT10 pic.twitter.com/L8E7IX2gJV — Sai Dharam Tej (@IamSaiDharamTej) 28 April 2018 -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘2 కంట్రీస్’
దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘2 కంట్రీస్’. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ సాధించి డిసెంబర్ 29న విడుదలకు సన్నద్ధమవుతోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘2 కంట్రీస్’కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ‘జై బోలో తెలంగాణా, శ్రీరాములయ్యా, భద్రాచలం, జయం మనదేరా’ లాంటి సినిమాలతో తనదైన మార్క్ వేసిన శంకర్ ‘2 కంట్రీస్’తో మరోమారు ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శంకర్..‘ఈ సినిమాను గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కించాము. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరిగింది.సునీల్ కామెడీ టైమింగ్, స్టోరీ నేరేషన్ హైలైట్స్ గా నిలుస్తాయి. అలాగే.. 30 ఇయర్స్ పృధ్వీ, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక గోపీసుందర్ ఆర్.ఆర్ సినిమాలోని ఎమోషన్స్ ను హైలైట్ చేస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న పూర్తి నమ్మకం మాకుంది. సెన్సార్ పూర్తయ్యింది, డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు. -
కొత్త నియమం!
నయనతార లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మలయాళ హిట్ సినిమా ‘పుదియ నియమం’ను శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్ మోహన్ తెలుగులో ‘వాసుకి’గా అందిస్తున్నారు. ఎస్.కె షాజన్ దర్శకుడు. గోపీ సుందర్ సంగీత దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌కు రెడీ అయింది. ‘‘పుదియ నియమం అంటే కొత్త నియమం. ఈ సినిమాలో హీరోయిన్ ఎలాంటి నియమం పెట్టుకుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వేసవికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ఎస్.ఆర్. మోహన్. ఈ చిత్రానికి కెమెరా: వర్గీస్ రాజ్, పాటలు: భువన చంద్ర, వెన్నెలకంటి. -
మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాని
మన హీరోలు తమ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేస్తుండగా.. కొంత మంది హీరోలు మరో అడుగు ముందుకేసి బహుభాషా చిత్రాలు చేస్తున్నారు. అదే బాటలో నాచురల్ స్టార్ నాని కూడా మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ శుక్రవారం నేను లోకల్ అంటూ టాలీవుడ్లో సత్తా చాటిన యంగ్ హీరో నాన్ లోకల్ ఏరియాలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. నాని హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమాను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాలీవుడ్ నిర్మాత జీపీ సుధాకర్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే నాని కెరీర్లో ఇంతకన్నా పెద్ద హిట్స్ ఉన్నా ఈ సినిమానే రీమేక్ చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అను ఇమ్మాన్యూల్ మలయాళంలో స్టార్ హీరోయిన్, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసిన గోపిసుందర్ది కూడా మలయాళ ఇండస్ట్రీనే. అందుకే మాలీవుడ్‌కు ప్రేక్షకులకు ఈజీగా దగ్గరవుతుందన్న ఉద్దేశంతో మజ్ను సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి నేను లోకల్ అంటూ సక్సెస్ కొట్టిన లోకల్ బాయ్, నాన్‌లోకల్‌గా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న అనిరుధ్