‘మజిలీ’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మారాడా..? | Music Composer Gopi Sundar Walked Out of the Film Majili | Sakshi
Sakshi News home page

‘మజిలీ’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మారాడా..?

Published Wed, Mar 20 2019 12:00 PM | Last Updated on Wed, Mar 20 2019 12:00 PM

Music Composer Gopi Sundar Walked Out of the Film Majili - Sakshi

పెళ్లి తరువాత నాగచైతన్య, సమంతలు కలిసి నటిస్తున్న పిరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా మజిలీ. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

సంగీత దర్శకుడు గోపి సుందర్‌ మజిలీ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాటలకు సంబందించిన వర్క్‌ పూర్తి కాగా నేపథ్యం సంగీతం చేయాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి గోపి సుందర్‌ తప్పుకోవటంతో తమన్‌తో బ్యాక్‌ గ్రౌం‍డ్ స్కోర్‌ చేయించే ఆలోచనలో ఉన్నారట మజిలీ టీం. ప్రస్తుతానికి సంగీత దర్శకుడి మార్పుపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఫిలిం నగర్‌లో మాత్రం ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement