‘మజిలీ’.. ప్రేమ ఉన్న దగ్గరే బాధ ఉంటుంది..! | Naga Chaitanya Samantha Combination Majili First Look | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 30 2018 10:24 AM | Last Updated on Sun, Dec 30 2018 10:25 AM

Naga Chaitanya Samantha Combination Majili First Look - Sakshi

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్‌ లైఫ్‌ జోడి సమంతతో కలిసి మరో సినిమలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చైతూ-సామ్‌లు భార్య భర్తలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. మజిలీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్‌ను కూడా సినిమా కాన్సెప్ట్‌ ఎంటో చూపించేలా డిజైన్‌ చేశారు. పోస్టర్‌ డిజైన్‌ను బట్టి చూస్తే సినిమా విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌ లో సాగుతుందని తెలుస్తోంది. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ డ్రామాను 2019 వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement