నువ్వు నా వాడివి, నేను నీ దానిని: సమంత | Samantha Wishes Husband Naga Chaitanya On Wedding Anniversary | Sakshi
Sakshi News home page

శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు: సమంత

Published Wed, Oct 7 2020 10:04 AM | Last Updated on Sat, Oct 2 2021 6:26 PM

Samantha Wishes Husband Naga Chaitanya On Wedding Anniversary - Sakshi

‘ఏ మాయ చేశావే’ సినిమాలో జంటగా నటించిన నాగ చైతన్య- సమంత 2017 అక్టోబరు 6న మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌గా పేరొందిన చై- సామ్‌ మంగళవారం నాడు మూడో వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేసిన సామ్‌.. ‘‘నువ్వు నా వాడివి. నేను నీ దానిని, ఎల్లవేళలా కలిసే ఉంటూ జీవితంలోని అన్ని మలుపులను కలిసి స్వాగతిద్దాం. శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు‌’’అంటూ నాగ చైతన్యపై ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా చై- సామ్‌లపై శుభాకాంక్షల వర్షం కురిసింది.

అదే విధంగా చైతూ కజిన్‌ రానా దగ్గుబాటితో పాటు వ్యాపారవేత్త ఉపాసన వంటి సెలబ్రిటీలు సైతం వారిని విష్‌ చేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా సామ్‌ నటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మరోసారి జంటగా నటించిన మజిలీ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు టైమ్‌ కేటాయించుకుంటూ.. వీలు చిక్కినప్పుడల్లా హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తూ ఇటు పర్సనల్‌ లైఫ్‌ను,  అటు ప్రొఫెషనల్‌ లైఫ్‌నూ సక్సెస్‌ఫుల్‌గా లీడ్‌ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చైసామ్‌లు.

.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement