
ఈవీవీ సత్యనారాయణ ‘జంబలకిడి పంబ’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, సీనియర్ నరేష్, కోట శ్రీనివాసరావు లాంటి దిగ్గజాలు చేసిన కామెడీని ఎప్పటికీ మరిచిపోలేము. మళ్లీ అలాంటి కాన్సెప్ట్‌తో, అదే టైటిల్‌తో తెరకెక్కిన సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది.
హీరో, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘జంబలకిడి పంబ’ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మగవారు ఆడవారుగా, ఆడవారు మగవారుగా మారితే ఎలా ఉంటుందో ఈవీవీ తన సినిమాలో చూపించినా.. మళ్లీ అదే నేపథ్యంతో డైరెక్టర్ జెబీ మురళీ కృష్ణ మరో వినూత్న కథనంతో మళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, జబర్దస్త్ కమెడియన్స్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment