బిగ్‌బాస్‌ హౌజ్‌.. ఇంకొంచెం మసాలా | Srinivas Reddy And Vennela Kishore Are Participating In Bigg Boss2 Show | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 6:57 PM | Last Updated on Thu, Jun 21 2018 7:51 PM

Srinivas Reddy And Vennela Kishore Are Participating In Bigg Boss2 Show - Sakshi

తెలుగులో టాప్‌ షోగా దూసుకుపోతోంది బిగ్‌బాస్‌ రెండో సీజన్‌. ఏదైనా జరగవచ్చు, ఇంకొంచెం మసాలా అంటూ మొదలైన ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే మొదటి ఎలిమినేటర్‌గా బయటకు వచ్చిన సంజన, మిగతా పార్టిసిపెంట్స్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ప్రతిరోజు జరిగే పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగే బిగ్‌బాస్‌ కార్యక్రమంలో ‘జంబలకిడిపంబ’ టీమ్‌ కూడా పాల్గొనబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో శ్రీనివాస్‌ రెడ్డి, హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ ఈ రోజు షోలో కనిపించనున్నారు. వీరిద్దరు బిగ్‌బాస్‌ హౌజ్‌లో చేసే సందడి చూడాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే. ‘జంబలకిడిపంబ’ సినిమా రేపు (జూన్‌ 22) విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement