Bigg Boss 2 Telugu
-
బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం
బిగ్‌బాస్ పలువురు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో నూతన్ నాయుడు ఒకరు. వైజాగ్‌కి చెందిన ఇతడు ఒకటి అరా సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ 2వ సీజన్లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. కుటుంబం గురించి మాట్లాడొద్దు అని కౌశల్‌తో గొడవపెట్టుకున్నది ఇతడే. ఇప్పుడు ఈయన ఇంట్లోనే విషాదం చోటుచేసుకుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత ఎలిమినేట్)గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన నూతన్ నాయడు తండ్రి సన్యాసి రావు నాడు.. పండగపూట అంటే శనివారం ఉదయం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. ఉత్తరాంధ్ర తరఫున కాంగ్రెస్ సీనియర్ నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన సంతాపాన్ని తెలియజేశారు.బిగ్‌బాస్ షోలో వచ్చిన గుర్తింపుతో కమెడియన్, విలన్‌గా ఛాన్సులు అందుకున్నాడు. కానీ వాటి ద్వారా పెద్ద ఫేమ్ తెచ్చుకోలేకోయాడు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.(ఇదీ చదవండి: మణి హగ్గుల పిచ్చి.. ఈ చెండాలం చూడలేకున్నాం సామీ!) -
ఘనంగా ‘స్వామిరారా’ నటి సీమంతం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
ప్రముఖ నటి పూజా రామాచంద్రన్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఆమె సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కనుల పండుగగా జరిగిన ఈ సీమంత వేడుకలో పూజా దంపతుల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా పూజా భర్త జాన్ కూడా నటుడనే విషయం తెలిసిందే. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ వన్.. నేనొక్కడినే, కేజీఎఫ్ చాప్టర్ 1, బాహుబలి బిగినింగ్ సినిమాల్లో అతడు విలన్ పాత్రలు పోషించాడు. కాగా పూజా తెలుగులో స్వామి రారా, ఎంత మంచివాడవురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. కాగా పూజా రామ చంద్రన్- జాన్ కొకెన్ల వివాహం 2019లో జరిగింది. పూజాకి ఇది రెండో పెళ్లి. అంతకు ముందు 2017లో విజె క్రెగ్‌తో పూజా వివాహం జరిగింది. చదవండి: ‘యశోద’ లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
అలా ఏడిస్తే హౌజ్ నుంచి ముందుగా వచ్చేది నువ్వే: కౌశల్
ఈ సారి బిగ్‌బాస్ హౌజ్‌లో తొలి రోజే గొడవలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు తలెత్తాయి. ఒకరి నెగిటివిటి ఒకరూ బయటపెట్టడంతో రచ్చ రచ్చ జరిగింది. ఆదివారం బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో నామినేట్ చేసే సభ్యులను ఎందుకు చేస్తున్నామో వివరించే క్రమంలో వారితో అయిన మిస్ కమ్యూనికేషన్ వల్ల హౌజ్‌మెట్స్ మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఎక్కువ మంది ఇంటి సభ్యులు జస్సీని నామినేట్ చేశారు. చదవండి: బిగ్‌బాస్ 5: నాగార్జున రెమ్యునరేషన్ మామూలుగా లేదుగా! కాగా జస్సీ మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో హౌజ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా జస్సీ ఓ సందర్భంలో మాట్లాడిన తీరు తమకు నచ్చలేదంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. నామినేషన్ సమయంలో విశ్వకు, జస్సీకి మధ్య జరిగిన చిన్నపాటి డిస్కషన్లో జస్సీ బాధపడ్డాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా జస్సీని నామినేట్ చేస్తూ ‘చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేస్తున్న’ అంటూ లిన చెప్పడంతో వెంటనే జస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. చదవండి: Bigg Boss 5 Telugu: వీడియోతో దొరికిపోయిన లోబో..నెటిజన్ల ట్రోల్స్ దీంతో అందరూ అతడి ఓదార్చడం జరిగింది. దీనిపై బిగ్‌బాస్ సీజన్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తోటి మోడల్‌గా జస్సీకి మద్దతుగా నిలిచాడు. అతడిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేస్తూ.. ‘నా తర్వాత, సీజన్ 3లో అలీ రేజా తర్వాత మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది నువ్వే. మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు. తమ యాటిట్యూడ్‌లో ప్రేమని గెలుచుకోవాలి. అలా ఏడిస్తే మొదటగా హౌజ్ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు. జాగ్రత్తగా ఆడు. ఆల్ ది బెస్ట్’ అని సూచించాడు. కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో కాజల్, హమీదా, జెస్సీ, రవి, మానస్, సరయూలు ఈ వీకెండ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లే సభ్యులుగా డేంజర్ జోన్లో ఉన్నారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ రెండో వివాహం
నటుడు, బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అంజనా శ్రీ లిఖిత అనే యువతి మెడలో బుధవారం మూడు ముళ్లు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. కోవిడ్ కారణంగా ఎలాంటి హడావిడి లేకుండా కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు బిగ్‌బాస్‌లో తన స్నేహితులైన తనీష్, దీప్తీ సునాయనా కూడా హాజరయ్యారు. సామ్రాట్ పెళ్లి వార్త తెలిసిన నెటిజన్లు, అభిమనులు నటుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించిన వీడియోను సామ్రాట్ సోదరి, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ శిల్పా రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: నటుడు సామ్రాట్ సోదరికి కరోనా ఇక క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్రాట్.. వైఫ్ ఆఫ్ రామ్, పంచాక్షరి వంటి సినిమాల్లో లీడ్ రోల్లో నటించారు. ఆ తర్వాత హీరో నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొని మరింత పేరు సంపాదించాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఆట మీద దృష్టి పెడుతూ టాప్ 5కు చేరాడు. ఇదిలా ఉండగా సామ్రాట్‌కు ఇది రెండో పెళ్లి అన్న విషయం తెలిసిందే. ఇంతకముందు హర్షితా రెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2018లో కట్నం కోసం వేధిస్తున్నాడని, తనపై హత్య ప్రయత్నం చేశాడని సామ్రాట్‌పై హర్షిత కేసు నమోదు చేసింది. అనంతరం ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. చదవండి: నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ -
ఆ గళంలో...నాగలి
ర్యాప్ సింగర్‌గా సుపరిచితుడైన రోల్‌రైడా బిగ్‌బాస్ సీజన్–2తో అందరికీ మరింత దగ్గరయ్యాడు...! ఎన్నో ర్యాప్, హిప్హాప్ పాటలతో శ్రోతలను అలరించిన రైడా, ర్యాప్ సాంగ్స్‌కి సందేశాత్మకతను జోడించి ప్రత్యేకమైన మార్క్‌ను ఏర్పరచుకున్నాడు. సామాజిక అంశాలను ముడిసరుకుగా తీసుకొని ఆల్బమ్స్ చేసే రోల్‌రైడా.., ఈ సారి రైతుల కథాంశంతో సమస్త మానవాళికి రైతే ఫ్రంట్వారియర్ అంటూ ‘నాగలి’ ర్యాప్‌తో వస్తున్నాడు...! సాక్షి,సిటీబ్యూరో: మ్యూజిక్‌లో ర్యాప్ సాంగ్స్ అనేవి విభిన్నమైనవి. అంతర్జాతీయంగా దానికంటూ ప్రత్యేకంగా మ్యుజిషియన్స్ ఉన్నారు. ఎన్నో పాశ్చాత్య సంగీత శైలుల్ని అందిపుచ్చుకోగలిగినా.. తెలుగులో ర్యాప్సింగర్స్ మాత్రం కొందరే ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేకించిన ర్యాప్ పాటలతో యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు రోల్‌రైడా. ‘అరుపు’..ఓ పిలుపు... విభిన్నమైన కాన్సెప్టులతో పలు ర్యాప్, హిప్హప్ సాంగ్స్ చేశాడు రైడా. ముఖ్యంగా మహిళలపైన, చిన్నారులపైన జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను ప్రతిస్పందిస్తూ ‘అరుపు’ పేరుతో చేసిన ర్యాప్‌సాంగ్ విశేషమైన ఆదరణ పొంది కోట్ల సంఖ్యలో వీక్షకుల్ని సొంతం చేసుకుని, ఎంతోమందిని ఆలోచింపజేసింది. అతిసున్నితమైన అంశాలని హృదయానికి హత్తుకునేలా మ్యూజిక్‌ని, సాంగ్ వెర్షన్‌ని రోల్‌రైడా ఎంచుకుంటాడు. రైడా ర్యాప్ సింగర్ మాత్రమే కాకుండా మంచి రైటర్ కూడా. తన ర్యాప్స్‌తో సినిమాల్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రముఖ టాలివుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల కోసం పలు సినిమాలకి సైతం ర్యాప్ సాంగ్స్ పాడాడు. రైతులే ఫ్రంట్వారియర్స్... కరోనా లాక్డౌన్లో ప్రపంచ జీవన విధానమే మారిపోయింది. కానీ మనిషి ఆకలి మాత్రం మారలేదు. ఏది లేకపోయినా సర్దుకున్నాం కానీ ఆకలికి ఓర్చుకోలేకపోయాం. ‘‘ఆహారం లేకపోతే మనిషికి మనుగడే లేదు. మనిషికి అంత ముఖ్యమైన ఆహారాన్ని, అదీ మట్టి నుండి పండిస్తున్న∙రైతుకు మాత్రం సానుభూతి తప్ప తగినంత గుర్తింపు రాలేదు’’ అంటున్నాడు రైడా. గుర్తింపు అటుంచితే సగటు మనిషి సామాజిక, ఆర్థిక జీవనానికి ఎంతో దూరంలో బ్రతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. అసలు రైతే లేకుంటే ఏంటి పరిస్థితి., రైతుకు కోపమొస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచనతోనే ‘నాగలి’ని రూపొందించానన్నారు. ‘‘ఇది ‘అరుపు టీం’ నుండి వస్తున్న మరో సందేశాత్మక ప్రయోగం. సమాజానికి రైతులే ఫ్రంట్వారియర్స్ అని, వారి స్థితిగతులను, మానవీయ కోనాలను, మానసిక వేదనలను ఇందులో పొందుపరిచామని’’ రైడా తెలిపారు. ఈ ‘నాగలి’లో రైడాతో పాటు బిగ్‌బాస్‌లో అలరించిన ‘అమిత్ తివారి’ కూడా లీడ్‌రోల్‌గా చేశాడు. దీనికి రైడా లిరిక్స్ రాసి, ర్యాప్ పాడగా హరికాంత్ దర్శకత్వం చేశాడు. దీనంతటికి ఆత్మ అయినటువంటి మ్యూజిక్‌ని ప్రవీణ్ లక్కరాజు సమకూర్చాడు. నాగలి ట్రైలర్‌ని శనివారం రిలీజ్ చేయగా.., ఈ ర్యాప్సాంగ్ని స్వాతంత్ర దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల కోసం రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తుందని రైడా చెప్పారు. -
ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం
‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-2’తో కౌశల్ మందకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తన అటిట్యూడ్, గేమ్ ప్లానింగ్, ఇమేజ్‌తో ఆ సీజన్ మొత్తం రఫ్పాడించాడు. ఇక విజేతగా కౌశల్ పేరును ప్రకటించిన తర్వాత ఆయన అభిమానులు చేసిన కార్యక్రమాలు, కౌశల్ ఆర్మీ పేరిట చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నంత సేపు కౌశల్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి అతడికి వరుస సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. బోయపాటి శ్రీను, సుకుమార్ వంటి స్టార్ దర్శకుల సినిమాల్లో కౌశల్‌కు సినిమా అవకాశం లభించినట్లు అనేక వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే కౌశల్, అయన అభిమానులు ఊహించని విధంగా సీన్ రివర్సయింది. టాలీవుడ్లో ఎక్కడా కూడా అతడి ఊసే లేదు. దీంతో తన యాడ్ ఏజెన్సీకే పరిమితమయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత కౌశల్‌కు ఒక సినిమా అవకాశం లభించింది. సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కౌశల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చాలా కీలకమైందిని తెలుస్తోంది. జీబీ క్రిష్ణ దర్వకత్వం వహిస్తున్న ఆది 16వ చిత్రంలో కౌశల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం కౌశల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుందనీ, కెరీర్‌కు మరింత హెల్ప్ అవుతుందని కౌశల్‌తో పాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కౌశల్ నుంచి గాని చిత్రబృందం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కౌశల్‌కు సినిమా అవకాశం వార్త నిజమా కాదా అని తెలియాలంటే కొంత కాలం వేచిచూడాలి. చదవండి: సల్మాన్ పేరుతో మోసం! బాలయ్య కోసం భారీగా శత్రు గణం View this post on Instagram Here's the first look poster of mine from my upcoming movie........... Sending my heartfelt thanks to my director @krishna_kitti123 , producer @diwakargaru n my dear hero @aadipudipeddi for releasing my first look on my b'day.Thank you so much for this surprise gift & also thank you for all the support that i receive from you guys on the sets. So guys hope you all love the first look poster of mine. A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) on May 13, 2020 at 7:33am PDT -
మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన
సాక్షి, హైదరాబాద్ : పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంజన బుధవారం మరోసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే పోలీసులు సంజనను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచారా లేక, కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌కు వెళ్లిన తనను.. ఆశిష్ చెప్పలేని రీతిలో దూషించినట్టు సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ తమపైకి ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడని.. ఆ ప్రమాదం నుంచి తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని ఆమె తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆశిష్ ఖండించారు. తను నోవాటెల్‌కు వెళ్లిన విషయం వాస్తమమేనని.. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశిష్ చెప్పారు. చదవండి : నందీశ్వర్ గౌడ్ కుమారుడిపై కేసు నమోదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
నన్నే గుర్తు పట్టలేదా అంటూ వీరంగం..
సాక్షి, హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్ బాస్ –2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్ బాస్–2 కాంటెస్టెంట్ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్ వద్ద ఉండగా కింది ఫ్లోర్లో ఉన్న అశిష్ గౌడ్ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్ గౌడ్ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు. వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది. సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితుడు రమేష్ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్ అజార్ పట్టించుకోకపోవడంతో అశీష్ మరింత రెచ్చిపోయాడు. 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్ గౌడ్ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాటిళ్లు విసిరి, తోసేశాడు... గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్ యాజామాన్యానికి కాల్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాస్ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని అశిష్ గౌడ్ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ పబ్‌కు నిబంధనలు వర్తించవు... నోవాటెల్ వీకెండ్లో పబ్‌లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్‌లోని అర్టిస్ట్రీ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్వో టీ పోలీసులు పబ్‌లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు మైనర్ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లా ఖాన్ తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్ రాయల్ డిమ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహ్మద్ వాహిదోద్దిన్ (43) హరియంత్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్ వాహిదోద్దీన్ ఖాన్‌కు పంకజ్‌తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్ తరచుగా ఇసామియా బజార్లో ఉంటున్న పంకజ్ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్ చదువుతున్న పంకజ్ కూతురు (17)తో వాహీదోద్దీన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్ ఖాన్‌లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు వాహిదోద్దిన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. -
కౌశల్ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్ గెస్ట్!
బిగ్‌బాస్ రెండో సీజన్‌తో మోస్ట్ పాపులర్ అయిన కంటెస్టెంట్ కౌశల్. తన ఆటతో అందరి అభిమానాన్ని సంపాదించుకుని విన్నర్‌గా నిలిచాడు. అయితే అంతవరకు మంచి పేరున్న కౌశల్.. బయటకు వచ్చాక చేసిన కొన్ని పనులతో నవ్వులపాలయ్యాడు. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఓ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ పట్టా ఇస్తామన్నారంటూ ప్రచారం చేసుకునే సరికి అతనికి కొంత నెగెటివిటీ ఏర్పడింది. హౌస్‌లో ఉన్నంత సేపు ఎవ్వరితోనూ అంతగా కలవకుండా సొంతంగా గేమ్ ఆడిన కౌశల్.. బయటకు వచ్చాక కూడా తన హౌస్‌మేట్స్‌తో ఎక్కువ కలిసిమెలిసి ఉన్నట్లు కనిపించలేదు. అయితే మిగతా కంటెస్టెంట్లు అందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఎవరి పుట్టినరోజు వేడుకలు అయినా, పండగలు వచ్చినా కలిసి ఎంజాయ్ చేస్తారు. అయితే శుక్రవారం (సెప్టెంబర్ 20) నాడు కౌశల్ కూతురు లల్లీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు తనీష్, గీతా మాధురి, అమిత్, రోల్ రైడా, గణేష్ ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు చాలామంది హాజరైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరంతా లల్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవ్వడం మరో ఎత్తు. ఈ సందర్భంగా సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. -
బ్రేకింగ్ న్యూస్‌తో హీరోయిన్గా..
సినిమా: బ్రేకింగ్ న్యూస్‌తో నటి భానుశ్రీ హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో–2 ద్వారా పాపులర్ అయిన నటి అన్నది గమనార్హం. యువ నటుడు జై హీరోగా నటిస్తున్న చిత్రం బ్రేకింగ్ న్యూస్. నాగర్ కోవిల్‌కు చెందిన తిరుక్కడల్ ఉదయం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆండ్రూ పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర విషయాలను నటి భానుశ్రీ తెలుపుతూ ఇందులో తాను నటుడు జైకు ప్రేయసిగా నటిస్తున్నానని చెప్పింది. ఆయన అమాయకత్వం చూసి ప్రేమలో పడతానని, అది పెళ్లికి దారి తీస్తుందని తెలిపింది. అయితే ఆ తరువాత ఈగో, విభేదాల కారణంగా విడిపోతామని చెప్పింది. ఆరంభంలో తాను సంసారపక్షంగా ఉండే యువతిగా, చాలా చలాకీగా ఉంటానని, వివాహనంతరం సంప్రదాయ బద్ధంగా, ప్రశాంతంగా ఉండే అమ్మాయిగా మారిపోతానని చెప్పింది. తాము విడిపోవడానికి కారణం మాత్రం అడగకండి. ఎందుకంటే ఆ విషయాలను ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చూస్తారు అని అంది. ఒక సాధారణ యువకుడు సమాజ శ్రేయస్సు కోసం సూపర్ హీరోగా మారే ఇతి వృత్తంతో సాగే చిత్రం బ్రేకింగ్ న్యూస్ అని చెప్పింది. ఇది ఫాంటసీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. గ్రాఫిక్స్ ఉన్నా, ఇది గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రం కాదని, చాలా ఎమోషన్స్‌తో కూడిన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. నటుడు జై గురించి చెప్పాలంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైనా చాలా నిరాడంబరంగా ఉంటారని చెప్పింది. సహ నటీనటులకు ఎంతగానో సహకారం అందించే నటుడు జై అని పేర్కొంది. దర్శకుడు ఆండ్రూ పాండియన్ చాలా సమర్థుడని అంది. కథను చెప్పింది చెప్పినట్లు తెరకెక్కిస్తున్నారని తెలిపింది. చిత్ర షూటింగ్ ఇప్పటికే 15 రోజులు పూర్తి అయ్యిందని, షెడ్యూల్‌ను చెన్నైలో చిత్రీకరించబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. చిత్రంలో సీజీ వర్క్ 90 నిమిషాలు ఉంటుందని, అదేవిధంగా వీఎఫ్ఎక్స్ వర్క్ అధికంగా ఉంటుందని తెలిపారు. -
‘కౌశల్‌ను నమ్మొద్దు.. అతనొక మోసగాడు’
బిగ్‌బాస్ కౌశల్.. ఈ పేరు ఒకానొక టైమ్‌లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి యుద్దమే జరిగింది. సేవా కార్యక్రమాలు, 2కే రన్లు చేస్తూ.. కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్‌కు మద్దతుకు నిలిచారు. మొత్తానికి బిగ్‌బాస్2 సీజన్ విజేతగా కౌశల్ నిలిచాడు. అటు తరువాత కౌశల్ ఇంటర్వ్యూలు, సన్మాన సభలు, విదేశాల్లో కూడా సభలు నిర్వహించడం, డాక్టరేట్‌ను ప్రధానం చేయడంలాంటి వ్యవహారాలు హల్చల్ చేశాయి. దీంతో ఒక వర్గం కౌశల్‌పై కుట్ర చేసేందుకు రెడీ అవుతోందని కౌశల్ అభిమానులు ఆరోపణలు చేశారు. అయితే రీసెంట్గా మళ్లీ ఇలాంటి ఆరోపణలే వైరల్ అయ్యాయి. కౌశల్‌ను నమ్మొద్దని, అతనొక మోసగాడంటూ, కౌశల్ చెప్పేదానికీ, చేసేదానికీ పొంతన వుండదని, అభిమానులతో డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటాడే తప్ప తన జేబులోంచి రూపాయి బయటకి తీయడని ఆరోపిస్తోస్తున్నారు. ఎక్కడికి అతడిని రమ్మన్నా కూడా అందులో తనకేంటి లాభమని చూసుకుంటాడని, ప్రతి చిన్న ఈవెంట్‌కి కూడా డబ్బులు ఆశిస్తున్నాడని కౌశల్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఈ ఆరోపణలపై కౌశల్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఇలా ప్రతీసారి తనపై ఆరోపణలు చేయడం అలవాటైందని, అయినా ప్రతీ దానికి సమాధానం చెప్పుకుంటూ పోవడం తనకేం అవసరం లేదని కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇలా వచ్చే ప్రతీ దానిపై స్పందించేంత సమయం కూడా తనవద్ద లేదంటూ.. కావాలనే తనను కించపరచాలని ఇదంతా చేస్తున్నారని విమర్శించాడు. కాలమే వీటన్నంటికి సమాధానం చెబుతుందని, కొంత సమయం ఆగితే నిజాలు అవే బయటకు వస్తాయన్నాడు. -
‘మీ టూ’ కంటే ముందే.. మనీషా
అవును.. వారి ‘అరుపు’లో నిజాయితీ ఉంది.. ఎమోషన్ ఉంది.. ఒక బృందం కష్టంతో పాటు చిత్తశుద్ధి ఉంది. అందుకే ఆ తెలుగు వీడియో అంతర్జాతీయ వేదికపై కేక పుట్టించింది. చూసిన వారందరినీ కంట తడి పెట్టించింది. శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ అవార్డుని దక్కించుకుంది. ‘అరుపు’ వీడియో టీమ్‌ని పలకరించినప్పుడు తమ వీడియో ప్రారంభం నుంచి అవార్డు వరకు జర్నీ విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘అరుపు’ అలా మొదలైంది..రోల్‌రైడా ‘ఆసిఫా’ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. ఆడ శిశువనే కారణంతో ఆరునెలల బిడ్డని తల్లిదండ్రులే కర్చిఫ్ నోట్లో కుక్కి చంపేశారని ఫ్రెండ్ చెబితే కలవరపడ్డాను. వెంటనే పాట రాశాను. తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటే చెప్పమన్న ప్రొడ్యూసర్స్‌కి సాంగ్ పంపించాం. వారికి నచ్చింది. డైరెక్టర్ హరికాంత్ని వారికి కలిపించాను. లిరిక్స్ రికార్డ్ చేసి, నా వరకు వీడియో రికార్డ్ చేసి నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లిపోయాను. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాన్సెప్టే డిఫరెంట్‌గా చేశారు.. నిజరూపానికి ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తాం. అలా మనకు కళ్లకు కనిపించేది వాస్తవం కాదు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. కంటికి చాలా మాములుగా కనిపించే ఎన్నో విషయాల వెనుక ఎన్నో భయంకర విషాదాలు ఉండవచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్‌ని ఇలా రెడీ చేశాం. కమరాన్ చాలా కష్టపడ్డాడు. మనీషా బాగా పాడింది. తర్వాత మేం షూట్ కోసం అడిగాం. ఆమె ఒప్పుకుంది. కానీ ఆమెకు షూట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. వీడియో పూర్తయ్యాక మెచ్చుకుంది. ప్రాజెక్ట్ విలువ రూ.27 లక్షలు.పోస్ట్ ప్రొడక్షన్‌కి, వీఎఫెక్ట్కి ఎక్కువ సమయం పట్టింది. తర్వాత ఏం జరిగింది..కమరాన్, మ్యూజిక్ కంపోజర్ సీరియస్ ఇష్యూస్‌ని తీసుకుని ర్యాప్ వీడియోలు చేయాలని ముందు నుంచే ఉంది. కానీ స్టార్టింగ్‌లోనే ఇలాంటి పాట చేసి ఉంటే మమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ఇప్పుడు మాకు ఒక లిజనర్షిప్ ఉంది. అది రైడా ఫీలై రాసేసరికి ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. రైడా డెమో ట్రాక్ పాడించి పెట్టాం. తర్వాత తను బిగ్‌బాస్‌కి వెళ్లిపోయాడు. దాని మీదే రైడా షూట్ కూడా జరిగింది. మనీషా యూఎస్ నుంచి రావడానికి 20 రోజుల టైం ఉండే. అప్పుడు ఈ ఎఫెక్ట్స్ చేసి పెట్టాను. ఆమె ఇంగ్లిష్‌లో పాడుతుంది, డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. సినిమాకి మ్యూజిక్ స్క్రిప్ట్ పరంగా చేయాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఉన్న పవర్ ఏంటంటే,ఆర్టిస్ట్‌కి నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంటుంది.. నిజాయితీగా చేస్తారు. దాంతో వినే వారు కనెక్ట్ అవుతారు. అందుకే చేస్తున్నప్పుడు జనాల్లోకి వెళుతుందా లేదా అనే డౌట్ రాదు. ఈ వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్ వచ్చింది. ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. పతంగ్ తర్వాత మళ్లీ అంత రెస్పాన్స్ ఇంది. ప్రొడ్యూసర్లు కూడా ఒక్క ప్రశ్న వేయకుండా సపోర్ట్ చేశారు. ‘మీ టూ’ కంటే ముందే.. మనీషా ఇది రోల్‌రైడా ఐడియా. అమ్మాయిలపై లైంగిక హింస, వేదింపులు అనేక అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మన దగ్గర ‘మీ టూ’ కంటే ముందే ఈ వీడియో విడుదలైంది. ‘మీ టూ’ వంటి మూమెంట్ వల్ల మార్పు వెంటనే వస్తుందని చెప్పలేం. కానీ అందరూ దీని గురించి మాట్లాడతారు.. ఆలోచిస్తారు. అవగాహన పెరుగుతుంది. మార్పుకి మార్గం ఏర్పడుతుందని భావిస్తాను. మీ గురించి... వీడియో గురించి.. ‘నేను లోకల్, మహానుభావుడు, సవ్యసాచి, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో పాడాను. మాషప్స్ చేస్తుంటాను. అది చూసి రోల్, కమరాన్ ఏదైనా ప్లాన్ చేద్దామన్నారు. నేను పాడిన లిరిక్స్, కోరస్ కృష్ణకాంత్ రాశారు. మిగతాది రోల్‌రైడా రాశారు. ఈ పాటను యూఎస్ నుంచి వచ్చి పాడాను. తర్వాత వీడియోలో కూడా ఉంటే బాగుంటందన్నారు. గంటలో షూటింగ్ అయిపోయింది. చాలా మంచి రివ్యూస్, ఫీడ్‌బ్యాక్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియో చూసి మాకు ఏడుపొచ్చింది అని మెసేజ్ చేశారు. అంతకంటే గొప్ప రివ్యూ ఏం ఉంటుంది? ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణమిదీ..సునీల్ గడ్డమేడి,వీడియో ప్రొడ్యూసర్ నేను ఓ ఈవెంట్లో రైడాను కలిసినప్పుడు తెలుగులో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలు వేడుకలు, పండుగలు, సంబురాల మీదనే ఉన్నాయి. అలా కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్‌లో సీరియస్ ఇష్యూస్‌ని.. ముఖ్యంగా స్త్రీల సమస్యలను చూపవచ్చు కదా అని సూచించా. అయితే, అలాంటివి చేయాలని తనకున్నా ప్రొడ్యూసర్లు ముందుకు రారని రైడా అన్నారు. స్త్రీ సాధికారతపై వీడియో ప్లాన్ చేస్తే చెప్పమన్నాం. తను ఈ రికార్డింగ్ పంపితే విన్నా.. బాగా నచ్చింది. వెంటనే ప్రాజెక్టుకు ఓకే చెప్పాం. ముప్పైవేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. శ్రీని శ్రీగద నా ఫ్రెండ్. ఈ ప్రాజెక్ట్‌కి ఎక్కువ బడ్జెట్ అవసరం కావడంతో తనని అడిగాను. వెంటనే ఏ వివరాలు అడగకుండా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. మూడు నెలల్లో పూర్తి చేశాం. ఎక్కువ ప్రమోషన్ చేయకుండానే వీడియో పాపులర్ అయింది. ఇకపై కూడా అర్థవంతమైన ప్రొడక్షన్స్ చేస్తాం. పరిచయం లేనివారు కూడా వివరాలు తెలుసుకొని ఫొన్ చేసి చక్కటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఒక్కటే బాధ, యాదృచ్ఛికంగా ‘మీ టూ’ సమయంలో ఈ వీడియో విడుదలైంది. అయినా ఫెమినిస్టులు, సెలబ్రిటీలు ఈ వీడియో గురించి మాట్లాడ్డం గానీ, ట్వీట్ కానీ చేయలేదు. అదే కొంచెం వెలితి. అంతర్జాతీయ పురస్కారం.. ‘అరుపు’ మ్యూజిక్ వీడియోలో రోల్‌రైడా, మనీషా పాడడంతో పాటు నటించారు. హరికాంత్ గుణమగరి దర్శకత్వం వహించిన ఈ వీడియోకి మ్యూజిక్ స్కోర్ అందించింది కమరాన్. ఈ వీడియోని యూ–ట్యూబ్‌లో 50 లక్షల మందికి పైగా వీక్షించారు. శాన్ఫ్రాన్సిస్కో న్యూ కాన్సెప్ట్ ఫిలిం ఫెస్టివల్ యూఎస్ఏ అవార్డు దక్కించుకుంది. భారత్ నుంచిఎంపికైన ఏకైక చిత్రం ‘అరుపు’ మాత్రమే. ప్రొడ్యూసర్స్ సునీల్ గడ్డమేడి, శ్రీని శ్రీగదని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానించారు. ఈ వీడియో ‘ది బెస్ట్’గా అవార్డు అందుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదంటోంది ఈ వీడియో బృందం. -
ఓటు వేస్తేనే రెట్టింపు ఆనందం: కౌశల్
హైదరాబాద్: ఓటు వేయడం ద్వారా సంతృప్తి లభించడమే కాదు మనం ఓటు వేసిన నాయకుడు గెలిస్తే ఆ తృప్తి రెండింతలవుతుంది. మనం ఓటు వేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధి పనులు చేయకపోతే ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. పని చేస్తే ప్రశంసించేందుకు అవకాశం దక్కుతుంది. దేశ భవిష్యత్ గురించి మన భవిష్యత్ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన నాయకులను మనమే ఎన్నుకున్నామన్న తృప్తి మిగలాలి. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు లభిస్తుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓటు విషయంలో అందరూ ఒక్కటే. ప్రతి ఒక్కరూ లైన్లో నిలబడి తప్పనిసరిగా ఓటు వేయాలి. నేను ప్రతిసారీ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకుంటాను.– కౌశల్, నటుడు, బిగ్‌బాస్– 2 విజేత -
శ్రీవారి సేవలో నటుడు సామ్రాట్
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల: సినీ నటుడు, బిగ్‌బాస్–2షో కంటెస్టెంట్ సామ్రాట్‌రెడ్డి బుధవారం చినవెంకన్న క్షేత్రాన్ని సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు సినిమాల్లో తాను హీరోగా, ప్రతినాయకుడిగా నటించానన్నారు. మూడు నెలలపాటు బిగ్‌బాస్ షోలో పాల్గొన్నట్టు చె ప్పారు. షో తనకు మరింత గుర్తింపును తేవడంతో పాటు జీవితంలో మలుపుగా నిలిచిందని చెప్పారు. సామ్రాట్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. -
ఏడ్చి చాలా మందిని బాధ పెట్టా ..
గల్లీల్లో లొల్లిలొల్లి చేసే తెలుగు ర్యాపర్ రోల్‌రైడా, సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే అమిత్ తివారీ బిగ్‌బాస్ షోలో కలుసుకున్నారు. రూపంలో, స్వభావాల్లో వీరిద్దరికి అస్సలు సంబంధం లేదు. కానీ వీరి మధ్య బంధం అల్లుకోవడానికి అంత సమయమేం పట్టలేదు. షో తొలి రోజు రాత్రి రైడా మాటలు విన్న అమిత్ రోల్ అయిపోయాడు. అమిత్ వేసిన జోకులకు రైడా కనెక్ట్ అయిపోయాడు. పరిచయమే లేని వారిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ‘బిగ్‌బాస్’ లైఫ్‌టైమ్ ఫ్రెండ్‌ని ఇచ్చిందంటూ చెబుతున్న వీరిద్దరి ‘షో’ జర్నీ విశేషాలు వారి మాటల్లోనే... రోల్ రైడా .. షో ప్రిపరేషన్ ‘బిగ్‌బాస్’లో అవకాశం వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను. ప్రేక్షకులు మన వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేసే అధికారమిచ్చి ఆ షోలోకి వెళ్తాం. హౌస్‌లో ఎలాంటి సందర్భంలో అయినా మనం మనలాగా ఉండడం ముఖ్యం. రెండు మూడు వారాల్లో బయటకు వచ్చినా... పబ్లిక్‌లో మనం కనిపిస్తే గుసగుసలు పెట్టుకోకుండా, దగ్గరికొచ్చి ఒక సెల్ఫీ అడగాలి. ఇదే హౌస్‌మేట్స్‌కి చెప్పేవాణ్ణి. నేను బయటకు వచ్చాక అంతకుమించిన అభిమానం పొందుతున్నాను. ‘షో’ తర్వాత సర్ప్రైజ్ అభిమానం. ఈ షోకి ముందు నా వీడియోలు చూసిన వాళ్లు చాలా తక్కువ. షో తర్వాత తెలుగు రాష్ట్రాల వాళ్లే కాకుండా... ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లంతా నా వీడియోలు చూసి విషెస్ పంపిస్తుండ్రు. రోడ్ మీద కనిపిస్తే బండి ఆపేసి రోల్‌రైడా అని మాట్లాడుతున్నరు. ఏం మిస్సవుతున్నారు? పొద్దున్నే అమ్మ నిద్ర లేపుతుంది. అదేంటి పాట రావాలి కదా! నిద్రపోతే కుక్కలు మోరుగుతలేవ్? మాట్లాడుతున్నప్పుడు మైక్, ఏదీ చేయాలన్నా... ఇంకా బిగ్‌బాస్ చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నాను. చెప్పాలంటే ఇంకా బిగ్‌బాస్ హ్యాంగోవర్లోనే ఉన్నాను. బిగ్‌బాస్ వాయిస్ బాగా మిస్ అవుతున్నాను. గిల్టీ ఫీలింగ్ టెంట్ టాస్క్‌లో దీప్తికి దెబ్బ తగిలింది. అది తెలియకుండానే జరిగినప్పటికీ, నావల్లే తలిగిందని చాలా బాధ పడ్డాను. మళ్లీ నాకోసం గణేశ్ ఒక వీక్ మొత్తం ఫ్రూట్స్ తిన్నాడు. తట్టుకోలేకపోయాను. తర్వాత గణేశ్ కోసం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పుడు గిల్టీ ఫీలింగ్ తగ్గింది. ఆ వారం ఎలిమినేట్ అయినా ఫర్వాలేదని అనుకున్నాను. రిగ్రెట్ కౌశల్ ఒక మాట అన్నప్పుడు ఎమోషనల్‌గా బస్ట్ అయ్యాను. కానీ అలా కాకుండా ఉండాల్సింది. ఏడ్చి చాలా మందిని బాధ పెట్టానని అనిపించింది. అసలు ఎందుకు అలా అయిందంటే... చెల్లి రావడం, అమిత్గాడు వెళ్లి పోవడంతో నాలో ఎమోషనల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఒంటరినైపోయాను. అప్పుడే కౌశల్ అలా అన్నారు. కెప్టెన్సీ వచ్చేది కాస్త పోయింది. ఇలా ఒక్కసారే చాలా ఫ్యాక్టర్స్, నేను ఎమోషనల్‌గా బ్రేక్‌డౌన్ కావడం, ఎగ్స్ సామ్రాట్‌కి ఇచ్చేయడం నా ఎలిమినేషన్‌కి కారణం కావచ్చు. ఎగ్స్ టాస్క్‌లో గెలిచే అవకాశం ఉంటే గివప్ చేసేవాడిని కాదు. నేను గెలవలేదని, ఇంకొకరు గెలవొద్దనే మెంటాలిటీ కాదు నాది. ‘హౌస్’లో మీ స్ట్రెంత్ బాండింగ్.. నేను ఒంటరిగా ఉండలేను. గొడవలున్నా ఇంటికి రాగనే మంచిగ పలకరిస్తే రిఫ్రెష్ అయిపోతం. అలా నాకు తోడున్నది అమిత్. చాలా మాట్లాడుకునేవాళ్లం. హౌస్‌లో అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటెయిన్ చేశాను. అందరినీ ఎంటర్టైన్ చేసేవాడిని. ఆ ఎమోషనల్ బాండ్తోనే ఆ ఇంట్లో నేను ఉండగలిగాను. నా క్యారెక్టర్ కూడా అదే. అది ప్రేక్షకులకు నచ్చిందనుకుంటాను. ఏం నేర్చుకున్నారు? హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ ఎంత ముఖ్యమో అర్థమైంది. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫోన్‌తోనే గడుపుతుంటాం. ఇంట్లో వాళ్లకి టైమ్ ఇవ్వం. ఇంటికి రాగానే మన గురించి అడిగే వాళ్ల విలువ అక్కడ తెలిసొచ్చింది. బయట కొట్లాడితే మాట్లాడుకోం. కానీ బిగ్‌బాస్‌లో గొడవ అయినవాళ్లతో కలిసి టాస్క్ చేయాల్సి ఉంటుంది. మెంటల్, ఫిజికల్, బిహేవియర్... ఇలా అన్నింటికీ బిగ్‌బాస్ ఓ పరీక్ష. బిగ్‌బాస్ జర్నీ మనల్ని మనం పరీక్షించుకునేందుకు ఒక అవకాశం. అది కొనుక్కుంటే వచ్చేది కాదు... లక్కుండాలి. ఇంతకముందు వరకు నాకు మొహమాటం, స్టాండ్ తీసుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు నా ఇంటెన్షన్ బయటకు చెబుతున్నాను. నచ్చని విషయాలు బయటకు చెప్పడంతో మనసు తేలికవుతుంది. అమిత్ .. ఫ్రెండ్షిప్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి, సరదాగా ఉండాలి. నాది, రోల్రైడాది ఇదే మైండ్‌సెట్. వాడు అదే విషయం ఫస్ట్ డే చెప్తుంటే విని కనెక్ట్ అయ్యాను. తర్వాత వాడు ఏ జోక్ వేసినా నేను పడిపడి నవ్వేవాణ్ణి. నేను ఏ జోక్ వేసినా వాడికి బాగా నవ్వు వచ్చేది. వాడికి నాకు ఒకటే తేడా... వాడికి జుట్టుంది, నాకు లేదంతే (నవ్వుతూ). బిగ్‌బాస్ షో నాకు లైఫ్‌టైమ్ బ్రదర్‌ని ఇచ్చింది. ‘లఫంగ్ గిరిగిట్టా ఫిలిం మేకింగ్’ టాస్క్ చాలా ఎంజాయ్ చేశాను. రోలి జోక్స్ మరిచిపోలేను. ‘షో’ తర్వాత సర్ప్రైజ్ ఇంటికొచ్చాక నా వైఫ్ సోషల్ మీడియాలో వచ్చిన లవింగ్ మెసేజెస్ చూపించింది. అలాంటి అభిమానం కోసమే షోకి వెళ్లాను. ఆ మెసేజెస్ చూసి నేను విన్ అయ్యానని అనుకున్నాను. బిగ్‌బాస్‌కి ముందు పబ్లిక్‌లోకి వెళ్లినప్పుడు దగ్గరికి వచ్చి ఎవరూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. అది మారాలి... నేను మామూలుగా ఎలాంటి వాడినో తెలియాలని ఉండేది. ఈ షో ద్వారా నేనేంటో చాలా మందికి తెలిసింది. ఈ షో తర్వాత దిగినన్ని సెల్ఫీలు నా లైఫ్‌లో ఎప్పుడూ దిగలేదు. సెల్ఫీలు అడిగిన వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ (నవ్వుతూ). ‘హౌస్’లో మీ స్ట్రెంత్ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. దాంతో హౌస్‌లో ఉండగలననే నమ్మకం ఉండేది. ఇంకా మా వైఫ్, ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసి పంపించారు. మేం బాగా ఉంటామని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండగలిగాను. హౌస్‌మేట్స్‌కి, ఆడియన్స్‌కి కూడా నేను ఎలా ఉన్నానో... అలానే నచ్చాను. కాబట్టే అన్ని రోజులు హౌస్‌లో ఉండగలిగానని అనుకుంటున్నాను. షో ప్రిపరేషన్ లైఫ్‌లో ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని ఉండేది. అదే ఆలోచనతో ఉన్నప్పుడు బిగ్‌బాస్ నుంచి కాల్ వచ్చింది. ఇంతకన్నా డిఫరెంట్‌గా చేయడానికి ఇంకా ఏం ఉంటుందని నా వైఫ్ ఎంకరేజ్ చేసింది. అంతకుమించి ప్రిపరేషన్ ఏమీ లేదు. ఏం మిస్సవుతున్నారు? అక్కడ ఒక సుప్రీం పవర్‌లా మమ్మల్ని గైడ్ చేసే బిగ్‌బాస్ వాయిస్‌ని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా అక్కడి కెమెరాలను కూడా. ఇంట్లోవాళ్ల పేర్లు పెట్టి వాటితో మాట్లాడేవాడిని. రిగ్రెట్ నేను రిగ్రెట్ అయ్యే విషయాలేమీ లేవు. చెరుకు రసం టాస్క్ ఫిజికల్‌గా చాలా కష్టమనిపించింది. ఫ్రీజింగ్ టాస్క్ మెమరబుల్. ఇక వేరే ఏ విషయాలు నాకు ఎక్కువ గుర్తులేవు. దాదాపు 100 రోజులు హౌస్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం నేర్చుకున్నారు? నాకు ఫుడ్, నిద్ర, టీవీ అంటే చాలా ఇష్టం. 20 ఏళ్లుగా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైనా కంట్రోల్ చేసుకోవడం అలవాటైంది. నేను ఓవర్కం చేయగలిగాను. ‘సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేస్తడు. మరి ఇక్కడ కూడా కొట్లాటలు పెట్టుకుంటాడేమో’ అని అమిత్ తివారీ గురించి అనుకున్నాడు రోల్‌రైడా. ‘తలకు రంగు, చూడ్డానికి వింతగా ఉన్నాడు. ఈ ఇంట్లో ఎలా ఉంటాడో’ అని రోల్‌రైడా గురించి అనుకున్నాడు అమిత్ తివారీ. బిగ్‌బాస్ హౌస్ ఎంట్రీలో ఒకరినొకరు చూసి వీరు మనసులో అనుకున్న మాటలివీ... -
డబ్బులిచ్చి బిగ్‌బాస్ విజేత కాలేదు: కౌశల్
సాక్షి, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్–2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ మండ అన్నారు. అంత కోటీశ్వరుడినే అయి ఉంటే తన తండ్రి బీహెచ్‌పీవీలో ఉద్యోగం చేసే వారే కాదన్నారు. తన అభిమానుల ఓటింగ్ వల్లే విన్నర్ అయ్యానని తెలిపారు. కౌశల్ ఆర్మీని దుషించేవారిని మట్టికరిపిస్తానని హెచ్చరించారు. భెల్ (హెచ్‌పీవీపీ) మైదానంలో బుధవారం రాత్రి తన అభిమానులు నిర్వహించిన సభలో కౌశల్ పాల్గొన్నాడు. తొలుత తన తల్లి లలిత కుమారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. (బిగ్‌బాస్ విజేత కౌశల్) తాను బీహెచ్‌పీవీ ప్రాంతంలో పుట్టి, విద్యాభ్యాసం అంతా టౌన్షిప్ క్వార్టర్స్‌లోనే కొనసాగించానని గుర్తుచేశారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు, ఆటలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుతెచ్చుకున్నారు. కళాకారుడిగా తన తండ్రి సుందరయ్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని అందువల్లే సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. ఆ తరువాత ఫ్యాషన్‌పై మక్కువతోనే హైదరాబాదు వెళ్లిపోయినట్టు చెప్పారు. అనంతరం అనేక సంఘాలు, వివిధ పార్టీలు, అసోసియేషన్ సభ్యులు కౌశల్‌ను ఘనంగా సన్మానించారు. కౌశల్ ఆర్మీని విస్తరిస్తా.. పెదవాల్తేరు(విశాఖతూర్పు): కౌశల్ ఆర్మీని మరింత విస్తరిస్తానని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ పేర్కొన్నారు. ఆయన పెదవాల్తేరులోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో పర్యటించి కౌశల్ ఆర్మీ సభ్యులను కలుస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కౌశల్‌ఆర్మీ తరపున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో పడిన బాధ వర్ణణాతీతమన్నారు. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలతోపాటు క్యాన్సర్ రోగుల వైద్యానికి తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని కౌశల్ వెల్లడించారు. చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా.. బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్! -
బిగ్‌బాస్–2 కౌశల్ మనోడే
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు బుల్లితెర నటుడు కౌశల్ మండ. ఈ షో ద్వారా ఎందరో అభిమానులను ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన్ని అభిమానించే వాళ్లలో మహిళల శాతమే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేసి తమ ప్రేమను చాటుకున్నారు. బిగ్‌బాస్–2 విజేతగా కౌశల్ నిలవడంతో ముఖ్య పాత్ర పోషించారు. ఇంతకీ కౌశల్ ప్రస్తావన ఇక్కడ ఎందుకంటే.. ఆయన మన విశాఖ వాసే. గాజువాక ప్రాంతంలో పుట్టి పెరిగాడు. ఆయన తండ్రి మండ సుందరయ్య బీహెచ్‌పీవీ విశ్రాంత ఉద్యోగి. కౌశల్ గెలుపులో గాజువాక ప్రాంత వాసుల భాగస్వామం ఉంది. కౌశల్‌తో తమకున్న జ్ఞాపకాలను ఆయన బాల్య స్నేహితులు, కుటుంబ సన్నిహితులు ‘సాక్షి’తో పంచుకున్నారు. కౌశల్ తల్లిదండ్రులు లలిత కుమారి, సుందరయ్యలు గాజువాక ప్రాంతంలో నివసించేవారు. ఐదేళ్ల వయసులోనే కౌశల్ బెస్ట్ హెల్తీ బాయ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడని సుందరయ్య తెలిపారు. బీహెచ్‌పీవీ కళావేదికపై కౌశల్ ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. బీహెచ్‌పీవీ పాఠశాలలోనే 10వ తరగతి, గాజువాక ప్రాంతంలోని కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత మెటలర్జీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ దశలోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడని కౌశల్ తండ్రి తెలిపారు. 2000లో సినీ రంగ ప్రవేశం చేసిన కౌశల్ ఇప్పటి వరకు 70 సినిమాల్లో నటించాడని వివరించారు. ప్రముఖ హీరోల సరసన నటించాడని, మూడు సినిమాల్లో ప్రధాన భూమిక వహించాడని చెప్పారు. పలు సీరియళ్లలో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడని, మోడలింగ్ రంగంలో విశేషంగా రాణించాడని సుందరయ్య వివరించారు. కౌశల్‌ను సన్మానించేందుకు టౌన్షిప్ ప్రాంత వాసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌశల్ ఎంతో మందికి ప్రేరణ కౌశల్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. చిన్నతనం నుంచి నటనలో రాణించాడు. నాటక, బుల్లి తెర, వెండితెరలో మంచి స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్–2 విజేతగా అవతరించడం ఆనందంగా ఉంది. కౌశల్ నాకు బాల్య మిత్రుడు. ఆయనతో గడిపిన క్షణలు ఇప్పటికీ గుర్తున్నాయి. – రాంజానే, షార్ట్‌ఫిల్మ్ మేకర్, భెల్ ఉద్యోగి మంచి స్నేహితుడు కౌశల్ మంచి స్నేహితుడు కౌశల్. స్నేహితులను ఆప్యాయంగా పలకరిస్తాడు. కౌశల్ నగరానికి వచ్చిన ప్రతిసారి తమను కలుస్తాడు. ఆ రోజు మాకు పండగే. ప్రతి క్షణాన్ని పండగలా జరుపుకుంటాం. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ అంటే కౌశల్‌కు ఎంతో ఇష్టం. – ప్రశాంత్, బాల్య స్నేహితుడు నటన వారి కుటుంబంలోనే ఉంది కౌశల్ తండ్రి సుందరయ్య బీహెచ్‌పీవీ ఉద్యోగిగా ఉన్న సమయంలో అసోసియేషన్ ఏర్పాటు చేసి నాటికలు వేసేవారు. కౌశల్ కూడా నటన రంగంలో రాణిస్తున్నాడు. అందివచ్చిన మంచి అవకాశాన్ని కౌశల్ సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పవచ్చు. కౌశల్ నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. – శ్యాం, స్నేహితుడు చెప్పలేనంత ఆనందంగా ఉంది బీహెచ్‌పీవీ టౌన్షిప్లో మా అందరితో కలసి మెలసి తిరిగిన కౌశల్ ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఎంతో ఆనందంగా ఉంది. కౌశల్ కోసం బిగ్‌బాస్ షో క్రమం తప్పకుండా చూశాను. చాలా మంది ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఆయన ఇక్కడకు విచ్చేస్తే ఘన స్వాగతం పలుకుతాం. – శ్రీదేవి, కౌశల్ కుటుంబ సన్నిహితురాలు -
అదే పెద్ద విక్టరీ అనుకుంటున్నా: దీప్తి
‘బిగ్‌బాస్ 2’లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇన్ని రోజులు ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నాననే బాధ అనిపించిందా? కచ్చితంగా బాధగానే ఉంది. దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసే ‘బిగ్‌బాస్ 2’లో అడుగుపెట్టాను. మా అమ్మ, భర్త శ్రీకాంత్, కొడుకు సిద్ధార్థ్.. ఇలా మా కుటుంబ సభ్యులందరి సపోర్ట్‌తో బిగ్‌బాస్‌కి వెళ్లగలిగాను. జనరల్‌గా అమ్మాయిలకు పెళ్లయితే కొన్ని ఆంక్షలు ఉంటాయి. కానీ, నాకు అలాంటివేం పెట్టలేదు. ఇంత మంచి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు. నాకు బాధ అనిపించినప్పుడల్లా వారి మాటలు నన్ను చాలా మోటివేట్ చేశాయి. ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని గట్టిగా ఉన్నా. మా కుటుంబ సభ్యులను చూశాక కన్నీళ్లు ఆగలేదు. నాకే కాదు. బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందరి పరిస్థితి ఇంతే. వందరోజుల్లో కనీసం నాపేరు 100 సార్లైనా తలచుకున్నావా? అని మా అబ్బాయి సిద్ధార్థ్ అడిగాడు.100కంటే ఎక్కువ సార్లు తలచుకున్నా. మీరెందుకు గెలవలేకపోయారు? ఏ ఆటలో అయినా విజేత అనేవాడు ఒక్కడే ఉంటాడు. షో నుంచి బయటికొచ్చాక చాలా మంది నన్ను కలిసి ‘విజేతగా మిమ్మల్ని కూడా మేము ఊహించుకున్నాం. కనీసం రన్నరప్లో అయినా ఉంటారనుకున్నాం’ అంటుంటే వారి మనసులను గెలుచుకున్నామనే హ్యాపీ ఉంది. ఆట ఆడటానికొచ్చినప్పుడు గెలిచినా.. ఓడినా, ఎలిమినేట్ అయినా స్పోర్టివ్‌గా ఉండాలనుకున్నా, ఉన్నాను. గెలవాలనే తాపత్రయం మా 17 మందిలో ఉండేది. కౌశల్ కూడా మాలో ఒక్కడే కదా? తను గెలిస్తే ఏంటి? సంతోషమే కదా? ‘బిగ్‌బాస్ 1’లో శివబాలాజీ విజేతగా నిలిచారు. ‘బిగ్‌బాస్ 2’లో కౌశల్ గెలిచారు. రెండు సీజన్స్‌లోనూ అబ్బాయిలే గెలిచారు. అమ్మాయిలను అణిచేశారనే భావన ఏమైనా ఉందా? అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ‘బిగ్‌బాస్’ టాస్క్‌లు ఇచ్చేటప్పుడు అబ్బాయిలకు ఒకలా.. అమ్మాయిలకు మరోలా ఇవ్వలేదు కదా? అందరికీ ఒకే టాస్క్‌లు ఇచ్చారు. ఎవరైనా ఒక్కటే అని ప్రేక్షకులు కూడా ఆటని ఆటలా చూశారు. అందుకే కదా ఫైనల్ వరకూ వెళ్లా. విజేత ఎవరన్నది చివరకు ప్రేక్షకులే నిర్ణయించారు. కౌశల్ ఎందుకు గెలిచారనుకుంటున్నారు? గేమ్ పరంగా ఆయన ఫోకస్ ప్లస్ అయింది. ఆయన గెలవడానికి అన్ని కారణాలు కలిసొచ్చాయి. అన్ని వర్గాలు ఆయన విజయానికి హెల్ప్ అయ్యాయి. కౌశల్ గెలవడానికి పూర్తి అర్హత ఉందని మీ నమ్మకమా? ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్న 17 మందికి గెలిచే అర్హత ఉంది. అయితే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలించవు.. మరికొన్ని సార్లు అనుకూలిస్తాయి. ‘బిగ్‌బాస్ 2’లో పాల్గొన్నందుకు ఏమైనా అసంతృప్తి ఉందా? లేదు. ప్రతి టాస్క్‌లో నేను ఎంత బెస్ట్ ఇవ్వగలనో అంత ఇచ్చాను. అందరితో మంచి స్నేహం కుదిరింది. గీతామాధురి అక్కతో కలిసి ఒకటో రెండో షోలు చేశా. ఓ రోజు విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాజువల్‌గా మాట్లాడాను. గీత అక్కతో తప్ప షోలో పాల్గొన్నవారిలో ఎవరితోనూ కనీసం ముఖ పరిచయం కూడా లేదు. నేనూ, గణేశ్ ఇంచుమించు ఒక్కటే అని చెప్పొచ్చు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంతవరకూ వెళ్లి ఫైనల్ వరకూ నిలవడమే ఓ విక్టరీగా భావిస్తున్నా. -
బిగ్ ఫ్యాన్ బేస్
లైట్స్ ఆఫ్ అయ్యాయి... బిగ్‌బాస్ తలుపులు మూసుకున్నాయి. షో ముగించుకుని కోట్లాది అభిమానుల హృదయాలలో తలుపులు తెరుచుకుంటూ నాని బయటకు వచ్చారు. చేయగలనో లేదో.... సక్సెస్ అవుతుందో లేదో... సీజన్ 1తో పోల్చి చూస్తారో ఏమో... వీటన్నింటి మధ్యా షో పెద్ద హిట్ అయ్యింది. ఇంటింటి టీవీని ‘నా...నీ’... టీవీగా మార్చుకున్న నానితో స్పెషల్ ఇంటర్వ్యూ. ∙‘బిగ్‌బాస్’ ముగిసింది. ఇక ‘నా.. నీ... టీవీలో’ అంటూ చిన్నితెరపై కనిపించరు... బిజీ తగ్గి రిలాక్స్ అవుతున్నారా?నాని: అవును. నా లోపల నుంచి ఏదో పెద్ద బరువు బయటకు వెళ్లిపోయినట్టు అనిపించింది. చాలా లైట్‌గా ఫీల్ అవుతున్నాను. ‘బిగ్ బాస్’ అయిపోయింది అని కాదు. గత నాలుగు నెలల్లో ఒక్క పూట కూడా సెలవు తీసుకోలేదు. చిన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్‌లో చివరి పరీక్ష అయిపోతే ‘ఏయ్ .. సమ్మర్ హాలీడేస్’ అని గంతులేస్తాం కదా. నా పరిస్థితి అలా ఉంది. శనివారం, ఆదివారం రెండు రోజులే కనిపించినా హౌస్‌మేట్స్‌ను ఫాలో అవుతూ షోకు ప్రిపేర్ అవుతూ అదంతా పెద్ద పని. ఎట్టకేలకు ముగిసింది. అందుకే ఆనందం. బుల్లితెరకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నారా? దూరంగా ఉండటమేమీ లేదు. ఒకవేళ ఏదైనా షో కమిట్ అయితే ఆ టైమ్‌లో వేరే సినిమా లేకుండా చూసుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ టైమ్ అస్సలు ఉండటం లేదు. మా బుడ్డోడు ఎదుగుతున్నాడు. ఈ టైమ్‌లో ఫ్యామిలీని మిస్ అవ్వకూడదు. ఇలాంటి టైమ్ తిరిగి రాదు కదా. బిగ్ బాస్ ప్లెజర్‌గా అనిపించిందా... ప్రెషర్గా అనిపించిందా? ప్రెషరే. ఆ గేమ్ ఫార్మాటే అలాంటిది. అందర్నీ ఆనందపరచలేం. ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరేట్ ఉంటారు. మనమేమో పక్షపాతం చూపించకూడదు. హోస్ట్‌కి నచ్చినవాళ్లంటూ స్పెషల్‌గా ఉండకూడదు. అందరూ సమానమే. అది కొంచెం ప్రెషర్గా ఉంటుంది. ఈ మధ్య ‘దేవదాస్’ ప్రమోషన్ కోసం ఎక్కడికి వెళ్లినా ‘బిగ్ బాస్’ గురించి అడిగేవాళ్లు. కొత్త ఫ్యాన్ బేస్ వచ్చిందని అర్థమైంది. ప్రతి వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాలి. ‘మీరు ఎలిమినేట్ అయ్యారు..’ అని చెప్పేటప్పుడు బాధగా ఉండేదా? కొంచెం బాధ ఉంటుంది. ఎలిమినేట్ అయ్యేవాళ్ల ‘బిగ్ బాస్ జర్నీ వీడియో’ బ్యూటిఫుల్‌గా ఉండాలి. వాళ్లు ఇంటికి వెళ్తున్నారు కాబట్టి పాజిటివ్‌గా ఉండాలి. నెగటివ్‌గా ఉండకూడదని చెబుతుండేవాణ్ని. ఎలిమినేట్ అయ్యారు అనే మాట చెప్పే ముందు సంఘర్షణ అనిపించేది. హోస్ట్‌గా కాకుండా మిమ్మల్ని ఆ హౌస్‌లో ఉండమంటే ఉండగలుగుతారా? అన్ని రోజులు. లేదు. ఇంపాజిబుల్. ఆడియన్స్‌కు బిగ్ బాస్ హౌస్ చూపించడానికి షూటింగ్ కోసం మూడు గంటలు ఉన్నాను. ఆ రెండు మూడు గంటలే చాలా ఎక్కువ అనిపించింది. రెండు సీజన్స్‌లో అబ్బాయిలనే గెలిపించారు. అమ్మాయిల్ని తక్కువ చేశారా? (నవ్వేస్తూ) గెలిపించింది మేం కాదు. ప్రేక్షకులే. వాళ్లని అడగాలి ఈ ప్రశ్న. ఇదంతా ఓటింగ్ విధానం. ఓటింగ్ పారదర్శకంగానే జరుగుతుందా అనే అనుమానాలు బయటి వాళ్లకు ఉంటాయి? అంతా పారదర్శకంగా జరిగింది. హిందీ, తమిళం, తెలుగు ‘బిగ్ బాస్’.. అన్ని భాషల ఓటింగ్స్ ఒకే ఏజెన్సీ చూసుకుంటుంది. షూటింగ్ జరిగే 3–4 గంటల ముందు రిజల్ట్ మాకు చెబుతారు. వెంటనే ఎలిమినేట్ అయ్యేవాళ్ల వీడియోలు రెడీ చేయాలి. ఎవరెళ్తున్నారో తెలియదు కాబట్టి అందరి వీడియోలు రఫ్‌గా కట్ చేసి పెట్టుకుంటాం. మాకు రిజల్ట్ తెలిశాక వీడియో ఫైనల్ చేసి అప్లోడ్ చేయాలి. కొన్ని షోస్‌కి ప్రైజ్‌మనీ అది ఇదీ అంటారు. ఇది మాత్రం అలాంటి షో కాదు. పూర్తి పబ్లిక్ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సీజన్ 3 చేయమంటే చేస్తారా? ఇదే నా లాస్ట్ సీజన్. నిన్ననే ట్విట్టర్లో అనౌన్స్ చేశాను కూడా. మొదట్లో ఎన్టీఆర్‌తో పోల్చారు అప్పుడు ఎలా అనిపించింది? పోలికలు ఉంటాయి అని ముందే తెలుసు. సీజన్ 2కి వచ్చే సరికి టాస్క్‌లు కొన్ని అగ్రెసీవ్‌గా ఉన్నాయి. ఈ సీజన్ బ్లాక్‌బస్టర్. మొదట్లో కొంచెం నెగటివిటీ వచ్చింది. ఆకాశానికి ఎత్తేసిన ఆర్టికల్స్ చూశాను. కిందకి దించేసినవీ చూశాను. అప్స్ అండ్ డౌన్స్ రెండూ ఉంటాయి. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సక్సెస్ అనేది బోనస్. ఈ హోస్టింగ్ కూడా చాలెంజ్‌గా తీసుకున్నాను. నా బెస్ట్ ఇచ్చాను. ‘దేవదాస్’ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది ‘దేవదాస్’ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను పర్సనల్‌గా ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేశాను. ఇంతకు ముందు మల్టీస్టారర్స్ చేస్తారా అని అడుగుతుంటే స్క్రిప్ట్ వస్తే చేస్తాను అని చెప్పేవాణ్ణి. ప్రతిసారి ఇలా చెప్పడమే తప్పితే చేసే చాన్స్ వస్తుందా? అనుకున్నాను. నిజంగా మంచి స్క్రిప్ట్ వచ్చింది. డాన్, డాక్టర్ కాంబినేషన్ సెట్ అయితేనే ఈ కథ సెట్ అవుతుంది. అలా కాకపోతే ఆ సినిమా చేసి ఉపయోగం లేదనిపించింది. లక్కీగా నాగ్ సార్‌కి కూడా స్క్రిప్ట్ నచ్చింది. చేసేటప్పుడే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో లేకుండా చేశాం. ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో కూడా మంచి స్క్రిప్ట్ వస్తే మల్టీస్టారర్ సినిమా తప్పకుండా చేస్తాను. సినిమాలో మీ కళ్లద్దాలు, బాడీ లాంగ్వేజ్ బావుంది. పాత్ర కోసం డాక్టర్స్‌ని పరిశీలించడం లాంటివి ఏవైనా చేశారా? మా కజిన్స్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో డాక్టర్స్ చాలామందే ఉన్నారు. అమ్మ చాలా కాలం డాక్టర్స్‌తో వర్క్ చేశారు. సో కొంచెం ఐడియా ఉంది. అది నా యాక్టింగ్‌లోకి ట్రాన్స్ఫామ్ అయింది అని అనుకోను. యాక్టింగ్ అనేది డిఫరెంట్ గేమ్. యాక్టింగ్ అంతా మన అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది. అలానే మా సినిమాలో డాక్టర్ హీరోలా కనబడకూడదు. డాక్టర్ డాక్టర్లా కనబడాలి. లుక్ ట్రైల్స్ చాలా చేశాం. అందరికీ ఈ లుక్ నచ్చింది. నాని ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తాడు అని మీ మీద ఆడియన్స్‌లో ఓ అభిప్రాయం ఏర్పడింది. అలాంటివి మీకు భయం కలిగిస్తాయా? భయం కంటే కూడా బాధ్యత అనిపిస్తుంది. ఓహో మన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు జాగ్రత్తగా చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఏ అంచనాలు లేకపోతే ఫర్లేదు.. బానే ఉందిలే అనుకుంటాం. కానీ ఇలాంటి అంచనాలు ఉన్నపుడు మనల్ని మనమే ఇంకా పుష్ చేసుకుంటాం మంచి అవుట్‌పుట్ కోసం. ఒక రకంగా అది యాక్టర్‌కి మంచిది. మనకి అభినందనలు వచ్చాయి అని ఎగరకుండా మనల్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటుంటాను. యాక్టర్‌గా ఎదుగుతున్నాను అని అంటున్నారంటే అది ప్రేక్షకులు చూపిస్తున్న నమ్మకమే. నాని ‘ఈ ఇమేజ్ ఉన్న హీరో’ అని ఓ బ్రాండ్ లేకపోవడంతో మీరు ఏ స్క్రిప్ట్ అయినా ఎంచుకోవచ్చు. మీకున్న అడ్వాంటేజ్ అది అని భావిస్తారా? అవును. దాని వల్లే పూర్తి కమర్షియల్ సినిమాల్లో కనిపించగలుగుతున్నాను. అసలు కమర్షియల్ ఎలిమెంట్ అనేది లేని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా కథలు చెప్పాలి అనుకోవడం, వరుసగా అన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం వల్ల స్క్రిప్ట్స్ వినడానికి కూడా సమయం దొరకడం లేదు. ఈ ప్రాసెస్‌లో కొన్ని మిస్ అవుతూనే ఉన్నాను. నెక్స్ సినిమాలు ‘జెర్సీ’ ఒక్కటే ఫిక్స్ అయ్యాను. 4 సినిమాల వరకూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏది ఫస్ట్ పట్టాలెక్కుతుందో మాత్రం చెప్పలేను. హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్లున్నారు? అవును. ప్లేస్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఈ నెల 18 వరకూ హాలీడే. 18కి తిరిగి వచ్చేస్తాను. ఆ తర్వాత ‘జెర్సీ’ షూటింVŠ స్టార్ట్ చేస్తాను. -
బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 తెలుగు టైటిల్‌ను కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. ఆయన విజయంలో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. గెలిపించడమే కాదు దాదాపు ఈ రియాల్టీ షోను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. సోషల్ మీడియా వేదికగా వీరు చేసిన హంగామ అంత ఇంత కాదు. తమ అభిమాన కంటెస్టెంట్ జోలికి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఆఖరికి హోస్ట్ నానిని కూడా. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. నిజానికి ఈ సీజన్ బిగ్‌బాస్‌ను సోషల్ మీడియానే శాసించింది. మూడు భాషల్లో తమ అభిమాన కంటెస్టెంట్స్ పేరిట ఏర్పాటైన ఆర్మీలే గేమ్ ఆడించాయి. (చదవండి: బిగ్‌బాస్ విజేత కౌశల్) తెలుగులో కౌశల్ ఆర్మీ.. మళయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీలే పై చేయి సాధించాయి. మూడు భాషల్లో ఫైనల్ ఆదివారమే జరగగా.. మూడింట్లో ఈ ఆర్మీలే అంతిమ విజయం సాధించాయి. మలయాళంలో సబుమోన్ అబ్దుసమద్ టైటిల్ గెలవగా.. తమిళంలో రిత్వికా విజయం సాధించింది. ఇక ఫైనల్లో ఈ మూడు ఆర్మీ గ్రూప్‌లు ఒకరికి ఒకరు మద్దతుగా ప్రచారం చేసుకున్నాయి. భాషతో సంబంధం లేకుండా మీ అభిమాన కంటెస్టెంట్స్‌కు మేం ఓట్లేస్తున్నాం.. మీరు మాకేయ్యండి అని ఈ మూడు గ్రూప్‌లు క్యాంపెన్ నిర్వహించాయి. (చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..) గత తమిళ బిగ్‌బాస్ సీజన్లో ఓవియా కంటెస్టెంట్‌కు మద్దతుగా తొలిసారి ఓవియా ఆర్మీ ఏర్పాటైంది. అక్కడి నుంచి తొలిసారి దక్షిణ భారత దేశంలో ఈ ఆర్మీ సంస్కృతి పుట్టుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓవియా ఆర్మీ ఆమెను గెలిపించలేకపోయింది. కానీ ఈ సారి ఏర్పాటైన ఆర్మీలు మాత్రం విజయవంతంగా తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను గెలిపించాయి. (చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) #BiggBossTamil2 - #Riythvika #RiythvikaArmy #Biggbossmalayalam - #Sabu #SabuArmy #BiggBossTelugu -#Kaushal #KaushalArmy pic.twitter.com/ptTe5pjPcC — Shanu (@shanum8) September 26, 2018 #KaushalArmy #SabumonArmy Sabumon army is voting for Kaushal ✌️✌️💪💪💪💪💪💪💪#BiggBoss2Telugu pic.twitter.com/cAXFfn6gKT — VD7 (@Vishnu7dev) September 27, 2018 -
ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-2 సీజన్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో మునిగిపోయాడు కౌశల్. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఫ్యాన్స్‌తో తన విన్నింగ్స్ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. తొలుత అతని కోసం బయటవేచి ఉన్న అభిమానులను చూసిన కౌశల్ ఉప్పొంగిపోయాడు. ఈ క్రమంలోనే కారుపైకి ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. ఇక్కడ కౌశల్‌ను ఫొటోలు తీయడానికి ఫ్యాన్స్ పోటీ పడగా, వారిని అలానే చూస్తూ ఉండిపోవడం అతని వంతైంది. ‘మాటల్లేవ్’అన్న ఫీలింగ్ మాత్రమే ఇక్కడ కౌశల్ ముఖంలో కనిపించింది. ఒకింత ఆనంద బాష్పాలతో మురిసిపోయాడు కౌశల్. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో భాగంగా టాప్ ఐదుగురు కంటెస్టెంట్లో ముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. బిగ్‌బాస్ విజేత కౌశల్ -
టైటిల్‌ను గెలిచిన ఆనందంలో ఫ్యాన్స్‌తో కలిసి ఇలా..
-
బిగ్‌బాస్ విజేత కౌశల్
బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్ నిలిచాడు. తుది పోరుకు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తి, తనీష్, సామ్రాట్లు చేరిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధిక ఓటింగ్‌తో కౌశల్ విజేతగా అవతరించాడు. కౌశల్ అందరికీ కంటే ఎక్కువ ఓట్లతో టాప్‌లో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కౌశల్ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. దాదాపు 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఓవరాల్ కంటెస్టెంట్లకు రాగా, ఇందులో దాదాపు 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్ కే పడినట్లు తెలిసింది. బిగ్‌బాస్ షో ఫైనల్ పోరులో టాప్ ఐదుగురు కంటెస్టెంట్లోముందుగా సామ్రాట్ ఇంటి నుంచి బయటకు రాగా, ఆ తర్వాత దీప్తి నల్లమోతు బయటకొచ్చారు. దాంతో టాప్-3లో కౌశల్, గీతా మాధురి, తనీష్‌లు నిలిచారు. కాగా, అటు తర్వాత తనీష్ కూడా నిష్క్రమించడంతో కౌశల్-గీతా మాధురిలు మాత్రమే తుది పోరులో నిలిచారు. అయితే అంతా ఊహించినట్లుగానే కౌశల్‌నే టైటిల్ వరించింది. ఈ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నాడు కౌశల్. కౌశల్ ఓ సాధారణ మోడల్‌గా, సీరియల్స్ నటుడిగా బిగ్‌బాస్ హౌస్‌లోనికి అడుగుపెట్టాడు. కానీ.. అసాధారణ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ప్రధానంగా తన ముక్కుసూటితనం అతనికి కలిసొచ్చింది. అదే సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చే టాస్క్‌ల్లో కూడా కౌశల్ తనదైన ముద్ర వేశాడు. బిగ్‌బాస్ సుదీర్ఘ జర్నీలో ఆది నుంచి చివరి వరకూ ఒంటరి పోరాటం చేస్తూ.. బిగ్‌బాస్ గేమ్ షోకే ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడనడంలోఎలాంటి అతిశయోక్తి లేదు. కౌశల్ పేరు దేశవిదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నోటివెంట గత వంద రోజులుగా పలుకుతూనే ఉంది. కౌశల్ ఆర్మీ పేరుతో ప్రత్యేక ఫ్యాన్స్ సంఘం కూడా ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి లాంటి అనేక ప్రాంతాల్లో కౌశల్ ఆర్మీ 2కే రన్ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. కేవలం కౌశల్ ఆర్మీ అనేది సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రమే ఉన్న పెయిడ్ గ్రూపంటూ బిగ్‌బాస్ హౌస్ నుంచి ముందుగానే వెళ్లిపోయిన కొంతమంది కంటెస్టెంట్స్ ప్రచారం చేశారు. దీనికి కౌశల్ ఆర్మీ ధీటుగానే బదులిచ్చింది. కొంతమంది తాము కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. వాస్తవ ప్రపంచంలో ఉన్నామని నిరూపించడానికి ఈ ర్యాలీలను చేపట్టారు. బిగ్‌బాస్‌లో ఏకంగా 11సార్లు నామినేట్ అయి కూడా సేఫ్ జోన్‌లోనికి వెళ్లాడు. ప్రధానంగా తన పట్టుదల, ఎలాంటి పరిస్థితులకూ తగ్గని నైజం, నిజాయతీ, కష్టపడే తత్వం, ఎన్ని అవరోధాలు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యం.. ఇవన్నీ కౌశల్‌లో జనానికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ బిగ్‌బాస్ సీజన్లో కౌశల్ పేరే ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. తొలుత సాధారణ వ్యక్తిలా మాత్రమే అభిమానులు చూసినా క్రమేపీ అతనిపై అభిమానం పెంచుకుంటూ వచ్చారు. ఇలా ఫ్యాన్స్ చూపిన అభిమానమే కౌశల్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. -
బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2కు మరి కొన్నిగంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. సోషల్ మీడియాలో అత్యంత హైప్ క్రియేట్ అయిన ఈ రియాల్టీ షో విన్నర్ ఎవరో ఈ రోజే తెలియనుంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ 110 రోజులు సాగిన ఈ షో తెలుగు టీవీ చరిత్రలోనే ఓ ట్రెండ్ సృష్టించింది. హౌస్‌లో అనేక గొడవలు, ఆటలు, పాటలు, ఎలిమినేషన్స్.. హౌస్మేట్స్ రిలేషన్స్‌లతో తెలుగు ప్రజలు ఈ రియాల్టీ షోను తెగ ఎంజాయ్ చేశారు. తమే గేమ్ ఆడుతున్నట్లు ఇన్వాల్వ్ అయ్యారు. (చదవండి: కిరీటి ఇది మగతనమా?: నాని ఫైర్) ఇప్పుడు ఎక్కడ చూసిన విన్నర్ ఎవరు.. రన్నర్ ఎవరనే చర్చ. అయితే కౌశల్‌కు మద్దతుగా నిలిచే కౌశల్ ఆర్మీ బిగ్‌బాస్ సెట్ ముందు హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ బిగ్‌బాస్ సెట్ ముందు శనివారం రాత్రి సుమారు మూడువందల మంది కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్.. కౌశల్ అని అరుస్తూ హల్చల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్ షూట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కౌశల్ ఆర్మీ సెట్ చుట్టూ అనేక పోస్టర్లు అంటించారు. భారీ బందోబస్తు మధ్య ఫైనల్ షూట్‌ను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం. విన్నర్ కౌశల్.. మరోవైపు హౌస్‌లో తనదైన స్టైల్లో విభిన్నంగా గేమ్ ఆడిన కౌశలే బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్‌గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మంది సెలబ్రిటీలు సైతం కౌశల్ విన్నర్ అయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి మాధవిలత తన ఫేస్బుక్లో కౌశల్ ఆర్మీ అభినందనలు.. కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్ చేశారు. ఆమెనే కాక చాల మంది కౌశల్ విన్నర్ అయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కౌశల్ ఆర్మీ అయితే విన్నర్ కౌశలే కానీ రన్నరప్ ఎవరనీ పోస్టులు పెడుతున్నాయి. ఫైనల్ ట్రోఫీ అందించడానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఫైనల్‌కు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తీలు చేరినట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ అందుకోనున్నారు. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు) View this post on Instagram A post shared by Harika Innamuri (@harika_innamuri) on Sep 29, 2018 at 10:35am PDT Patience , hardworking , focused many of them inspired congratulations #Kaushal anna bb2 title ❤❤❤❤❤😎😎#kaushalbbt2sensation #KaushalArmy #Kaushal #BiggBossTelugu2 #KaushalBB2Winner #KaushalManda pic.twitter.com/5UGzyjRWXc — Abhi (@AbhiSai008) September 30, 2018 -
తమిళ బిగ్‌బాస్‌లో తెలుగు హీరో
ఇప్పటికే తెలుగు బిగ్ బాస్‌లో సందడి చేసిన టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌లో అడుగు పెడుతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ద్విభాష చిత్రం ‘నోటా’ ప్రమోషన్ కోసం విజయ్ తమిళ బిగ్‌బాస్ షోకు వెళ్లాడు. లోకనాయకుడు కమల్ హాసన్ అక్కడి బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోకు వెళ్లి.. అక్కడ స్టేజ్ పై తన సినిమాను ప్రమోట్ చేసుకునే అవకాశం విజయ్ దేవరకొండకే దక్కింది. అక్టోబర్ 5న విడుదల కానున్న ‘నోటా’ సినిమాను తమిళ బిగ్‌బాస్ లో ప్రమోట్ చేసుకున్నాడు ఈ సెన్సెషన్ స్టార్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
బిగ్‌బాస్ నుంచి దీప్తి ఎలిమినేషన్ అంటూ ప్రచారం..
హైదరాబాద్ : దాదాపు మూడున్నర నెలల నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 తుది అంకానికి చేరుకుంది. ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 2 విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటి వరకు 14 మంది ఎలిమినేషన్స్ జరిగి, టాప్ 5 కంటెస్టెంట్లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న తెలిసిందే. అందులో గీతా మాధురి, కౌశల్, తనీశ్, సామ్రాట్, దీప్తి నల్లమోతు ఉన్నారు. అయితే గురువారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతున్నట్టు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. మాములుగా శని, ఆది వారాల్లో మాత్రమే బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ, ఈ సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లో జరిగే ప్రతి అంశం కూడా ముందుగానే బయటికి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రోజునే బిగ్‌బాస్ హౌజ్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నేడు బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ పక్రియ జరగనుందని.. అందులో భాగంగా దీప్తి హౌజ్ నుంచి బయటకు వెళ్లనున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. అంతేకాకుండా గ్రాండ్ ఫినాలేలో నలుగురు మాత్రమే పోటీ పడనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ అవి కేవలం పుకార్లేనని తేలిపోయింది. కాగా, ఈ సీజన్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు పోలవుతున్న ఓట్ల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొందరు కంటెస్టెంట్ల పేరిట భారీగా ఫేక్ ఓటింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ.. బిగ్‌బాస్ విజేత ఎవరనేది ఈ వీకెండ్లో తేలిపోనుంది. -
బిగ్‌బాస్: రోల్‌రైడా ప్యాకప్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ షో క్లైమాక్స్‌కు వచ్చేసింది. మిగిలింది ఈ ఒక్క వారమే. ఇప్పటికే సామ్రాట్ హౌస్మెట్స్ మద్దతుతో డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఫైనల్‌కు వెళ్లే వారు ఎవరని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే అందరూ ఊహించినట్టే రోల్‌రైడా ఈ వారం హౌస్‌ను వీడాడు. ఇన్ని రోజులైనా హౌస్మేట్స్ ఇంటి రూల్స్ సరిగ్గా పాటించకపోవడంతో బిగ్‌బాస్ ఈ వారం అందరిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. నామినేట్ అయిన వారిలో సామ్రాట్, రోల్రైడాలకే ప్రేక్షకుల నుంచి తక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సామ్రాట్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో రోల్‌రైడా హౌస్‌ను వీడక తప్పలేదు. రైడా ఎలిమినేషన్‌కు కారణం.. నిజానికి రోల్‌రైడా తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు. షో ఆరంభం నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన రైడా ఎంత సేపు హౌస్ మేట్స్ మద్దతు కోసమే ప్రయత్నించాడే తప్పా ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయాడు. ఎక్కువ సార్లు నామినేషన్‌కు రాకపోవడం కూడా రైడాకు ప్రతికూలం అయింది. ఇక ఫైనల్‌కు వెళ్లే సదవకాశాన్ని కూడా రైడా పొగట్టుకున్నాడు. ఎగ్స్ టాస్క్‌లో కౌశల్ మినహా రైడాకు ఎవరు మద్దతివ్వలేదు. దీంతో రైడా ఈ టాస్క్‌లో ఓడిపోవడంతో సామ్రాట్ తంతే బూరేల బుట్టలో పడ్డట్లు ఫైనల్‌కు చేరాడు. నిజానికి సామ్రాట్ కేవలం రెండు సార్లు మాత్రమే నామినేషన్లోకి వచ్చాడు. అప్పుడు కూడా చాలా తక్కువ ఓటింగ్‌తోనే గట్టెక్కాడు. రోల్‌రైడా సామ్రాట్‌ను కూడా ఫైనల్‌కు వెళ్లకుండా అడ్డుకుని ఉంటే అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కౌశల్‌తో గొడవ కూడా రోల్రైడాపై మరింత వ్యతిరేకతను పెంచింది. సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తూ గొడవ పెద్దదయ్యేందుకు మరింత ఆజ్యం పోశాడు. ఇది కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. పైగా గల్లీ పోరడు అని చెప్పుకునే రైడా ఆ గొడవ సందర్భంగా కౌశల్ కాళ్లు పట్టుకోవడం, ఏడ్వడం వారందరికి వెగటు పుట్టించింది. ఇదే అంశంపై శనివారం హోస్ట్నాని సైతం రైడాను మందలించాడు. (చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) బిగ్‌బాస్‌కు కింగ్ నాగార్జున.. నేటి ప్రోమోను చూస్తే బిగ్‌బాస్ సెట్లో దేవదాస్ యూనిట్ సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ షో హోస్ట్ నాని, కింగ్ నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన ‘దేవదాస్’ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా కింగ్ నాగర్జునతో పాటు హీరోయిన్స్ రష్మికా మండన్నా, ఆకాంక్షసింగ్లు బిగ్‌బాస్ సెట్లో సందడి చేశారు. చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు -
బిగ్‌బాస్ : ‘కుక్క’ అంటే వింత అర్థం చెప్పిన కౌశల్!
బిగ్‌బాస్ షో క్లైమాక్స్‌కు వచ్చేసింది. మిగిలింది ఇక ఒక్క వారమే. ఇక షో మరింత నాటకీయంగా మారే అవకాశం ఉంది. మిగిలిన ఆరుగురిలో ఈ ఆదివారం హౌస్‌లోంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. సామ్రాట్ మాత్రమే డైరెక్ట్‌గా ఫైనల్‌కు వెళ్లగా, మిగిలిన ఐదుగురు ఎలిమినేషన్లో ఉన్నారు. అయితే ఎప్పటిలాగే బయటకు వచ్చిన లీకుల ద్వారా రోల్‌రైడా బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక నిన్నటి షోలో నాని అందరినీ ఓ రౌండ్ వేసేసుకున్నాడు. ఈ వారం జరిగిన కుక్క ఎపిసోడ్ మొత్తం తనకు అసంతృప్తిని మిగిల్చిందని తెలిపాడు. అందరూ ఒకేసారి అరవడమేంటని, ఎవరికి ఎదురైన సమస్యను వారే పరిష్కరించుకోవాలని హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఈ వారం బాగా ఎమోషన్ అయిన రోల్ రైడాను ఉద్దేశించి.. తాను అలా చేయడంతో అది పాజిటివ్‌గా గాకుండా నెగెటివ్‌గా వెళ్లిందని తెలిపాడు. అంతగా ఎమోషనల్ కావడానికి గల కారణాలేంటని అడగ్గా.. ఇంట్లో వారు గుర్తొచ్చారని, అమిత్ లేకపోయే సరికి ఇంకొంచెం ఎమోషనల్ అయ్యానని ఏదో తన కారణాలు వెల్లిబుచ్చాడు. ఇక తనీష్‌ను ఈసారి నాని గట్టిగానే వేసేసుకున్నాడు. సెలబ్రెటీలు అని మిమ్మల్ని లోపలికి పంపిస్తే.. మీరు చేయాల్సిందే ఇదేనా అంటూ ఫైర్ అయ్యాడు. ‘ఇక్కడ కాబట్టి బతికిపోయావ్.. అదే బయట అయితే సంగతి చూపిస్తానంటూ అన్నావ్.. ఇక్కడ ఇలాంటివి చేస్తే హౌస్‌లోంచి బయటకు పంపిస్తారు. అదే బయటైతే లోపలేసేస్తారం’టూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్నుంచీ తనకు సూచించేది అదేనని.. టెంపర్ తగ్గించుకోవడం లేదని.. అదే తనీష్‌కు మైనస్ అవుతోందని నాని సూచించాడు. ఇక ఇదే చివరి శనివారం అని, అటుపైన తాను చెప్పడానికి ఏమీ ఉండదని ఇంటిసభ్యులకు తెలిపాడు. కుక్క అనే మాట వినేసరికి తాను భరించలేకపోయానని అందుకే అంతలా రియాక్ట్ కావాల్సివచ్చిందని సామ్రాట్ తెలిపాడు. దీప్తి గ్రాఫ్ వారంవారం పెరుగుతోందని, టాస్క్‌ల్లో కూడా బాగా ఆడుతోందని అభినందించాడు. క్లారిటీగా మాట్లాడటం లేదంటూ, అందరూ కలిసి ఒకేసారి అరవడం వల్ల అక్కడి వాతావరణం చెడిపోతోందని చూసే ప్రేక్షకులకి కూడా విసుగుతెప్పించేలా ఆ ఎపిసోడ్ ఉందంటూ.. గీతనుద్దేశించి అన్నాడు. మళ్లీ వింత సమాధానం చెప్పిన కౌశల్.. బిగ్‌బాస్ కంటే పాపులర్ అయిన కంటెస్టెంట్ కౌశల్. బయట తనకు పెరిగిపోతోన్న పాపులారిటీతో ఓట్ల వర్షం కురుస్తోంది. అయితే ఎప్పుడూ వింత జవాబులు చెబుతూ.. తనను తాను డిఫెన్స్ చేసుకుంటూ.. తనకు మాత్రమే అర్థమయ్యేలా ఏవో కారణాలు చెప్పే కౌశల్.. నిన్నటి ఎపిసోడ్లో చెప్పిన కారణం చూస్తే జాలేస్తుంది. ఎందుకు కుక్క అని అరిచావు అని నాని అడిగితే.. ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాను అంటే సరిపోయేదానికి.. తన స్టైల్లో రీజన్స్ చెప్పే ప్రయత్నం చేశాడు. కుక్క అంటే.. కూర్చొని ఉండక కెవ్వు కెవ్వు అని అరిచేవాడనే అర్థంలో అలా అన్నానని, తనీష్‌ని క్యాట్ అని.. అంటే సిగరెట్ అపురూపంగా తాగేవాడు.. పోకిమాన్ అంటే గారాబాలు చేసే వ్యక్తి అని.. బిగ్‌బాస్‌లో ఇన్ని రోజులు మాతో ట్రావెల్ చేసింది కుక్క అని మేము పడుకుంటే కుక్క అరుస్తుందని.. ఇలా ఏదో తనకు తోచిన, నచ్చిన, వింత సమాధానాలు చెబుతుంటే.. సామ్రాట్ మధ్యలో కలగజేసుకుని.. ఏం మాట్లాడుతున్నారు? కౌశల్.. అని అన్నాడు. కౌశల్ సమాధానానికి అసహనానికి లోనైన నాని.. ఇదంతా ఎందుకు చెబుతున్నావు? ఫస్ట్రేషన్లో ఉండి అలా అన్నానని చెబితే సరిపోతుందని, దాన్నికూడా సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కౌశల్‌పై ఫైర్ అయ్యాడు. ఇక ప్రతీవారం ఎలిమినేషన్ నుంచి కాపాడడానికి ఓట్లు వేసే ప్రేక్షకులు.. ఈ వారం మాత్రం ఏ ఇంటి సభ్యుడు ఫైనల్ విన్నర్ కావాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేయండి అని నాని సూచించాడు. కేవలం ఓట్లు మాత్రమే ప్రాతిపదిక అయితే ఎవరు గెలుస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ బిగ్‌బాస్ మైండ్‌లో ఏముందో? ఫైనల్ విన్నర్ ఎవరు కానున్నారు? బయటినుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడా? చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్! -
బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ హంగామా
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-2 పేరు వింటే చాలు అందరికీ ఇపుడు కౌశల్ ఆర్మీ పేరే వినిపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ క్రియేట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరైనా కౌశల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే వెంటనే వారిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది. సెప్టెంబర్ 20వ తేదీన కౌశల్ కూతురు లల్లి పుట్టినరోజును పురస్కరించుకుని.... బిగ్‌బాస్ హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ బయట కౌశల్ మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. బుధవారం రాత్రి గం. 12ని.లకు మొదలైన ఈ క్రాకర్స్ వెలుగులు కొన్ని గంటల పాటు జిగేల్ మన్నాయి. లల్లీ పుట్టిన రోజు సందర్భంగా ఈ క్రాకర్స్‌ను కాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా కౌశల్ ఆర్మీ సభ్యుల్లోని కొందరు తెలిపారు. మరొకవైపు లల్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్, కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. over night crackers at @BiggBosstelugu2 sets by @Kaushal_Army wishing his daughter lally #hbdlittleprincesslally pic.twitter.com/02b2mLk3nF — samba (@samba21830145) 20 September 2018 కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్? -
కౌశల్‌ను సాగనంపేందుకు స్కెచ్?
హైదరాబాద్: తెలుగు రాష్టాల్లో దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్‌బాస్-2. ఈ సీజన్ షోకు అత్యధిక ఆదరణ రావడానికి కారణమైన కంటెస్టెంట్‌ల్లో కౌశల్ ఒకడు. ఇక్కడ కౌశల్ గురించే షో చూస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కౌశల్ ఆర్మీ పేరుతో రెండు భారీ ర్యాలీలు నిర్వహించడం అతనికి షోలో ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఒక ర్యాలీ హైదరాబాద్ వేదికగా జరిగితే, మరొకటి విజయవాడ వేదికగా జరిగింది. ఈ రెండు ర్యాలీల్లో కౌశల్ అభిమానులు ఎక్కువగానే పాల్గొనే తమది ఫేక్ ఆర్మీ కాదని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే కౌశల్‌కు పడుతున్న ఓటింగ్ కూడా అత్యధికంగానే ఉంది. ప్రధానంగా కౌశల్ హౌస్‌లో కొనసాగాలనే ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదిలా ఉంచితే, బిగ్‌బాస్ షో ఫైనల్ ఫేజ్‌కు చేరుకున్న తరుణంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వారం చివరి ఎలిమినేషన్ రౌండ్ కావడంతో ఎవరు బయటకు వెళతారు.. ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరు అనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కాగా, ఆఖరి ఎలిమినేషన్‌గా కౌశల్‌ను హౌస్ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఓటింగ్ సంగతి పక్కను పెట్టి, కౌశల్‌ను సాగనంపేందుకు నిర్వాహకులు స్కెచ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతీవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లబోయేది లీక్‌ల ద్వారా ముందుగా తెలిసినట్లే, ఈ వారం ఇంటి నుంచి వెళ్లబోయే వ్యక్తి కౌశల్‌గా తెలుస్తోంది. ఒక స్క్రిప్ట్ ప్రకారమే కౌశల్‌ను వెళ్లగొట్టడానికి బిగ్‌బాస్ యాజమాన్యం ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసిందని, దానిలో భాగంగానే హౌస్‌లోని కంటెస్టెంట్లు మూకుమ్మడిగా కౌశల్‌పై ఎదురుదాడికి దిగి అతన్ని రెచ్చగొడుతున్నారని సోషల్ మీడియా వేదికగా టాక్ నడుస్తోంది. ఒకవేళ నిజంగానే కౌశల్‌కు ఓటింగ్ శాతం తక్కువ వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోతే ఇబ్బంది ఉండదు.. కానీ కావాలనే అతన్ని బయటకు పంపే యత్నం కానీ, పంపడం కానీ జరిగితే మాత్రం బిగ్‌బాస్ షోకు ఉన్న ఆదరణ తగ్గిపోవడం ఖాయమని అంటున్నారు కౌశల్ అభిమానులు. అదే సమయంలో బిగ్‌బాస్ షోపై ఉన్న విశ్వసనీయత కూడా సన్నగిల్లుతుందనేది కౌశల్ ఆర్మీ వాదనగా ఉంది. ‘ఇసుక’ టాస్క్‌లోనూ కౌశలే టార్గెట్.. ప్రతీవారం కనీసం ఒక టాస్క్‌ను నిర్వహించడం బిగ్‌బాస్ హౌస్‌లో ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈ వారం కూడా టాస్క్‌ను నిర్వహించారు. అది ‘ఇసుక’ టాస్క్. ప్రస్తుతం ఉన్న ఆరుగురి కంటెస్టెంట్లకు కలిపి రేస్-1, రేస్-2గా ఈ టాస్క్ నిర్వహించారు. ఇందులో తలో ముగ్గురు రెండు భాగాలుగా విడిపోయి టాస్క్‌లో పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా కంటైనర్‌లో ఉన్న ఇసుకను కాపాడుకోవడమే ఆయా కంటెస్టంట్లు చేసే పని. అయితే ఈ టాస్క్ లో కూడా కౌశలే టార్గెట్ అయ్యాడు. కౌశల్‌ను గెలవకుండా చేయడంలో మిగతా కంటెస్టెంట్లు సక్సెస్ అయితే, రోల్ రైడాను, సామ్రాట్లు విజయం సాధించడంలో హౌస్ మేట్స్ సహకరించారు. ఈ ఇద్దరికీ ఇవ్వబడిన గుడ్లు టాస్క్‌లో విజయం సాధించే అభ్యర్థి ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అంటే రోల్ రైడా, సామ్రాట్‌లలో ఒకరు నేరుగా ఫైనల్‌కు వెళతారు. నా మీద కుక్కల్లాగ పడుతున్నారు.. ఈ టాస్క్ జరిగే క్రమంలో కౌశల్ నోరు జారాడు. హౌస్‌మేట్స్‌తో జరిగిన వాగ్వాదంలో కౌశల్ తన సహనాన్ని కోల్పోయాడు. అంతా కలిసి తనపై కుక్కల్లాగ పడుతున్నారంటూ వ్యాఖ్యానించాడు. దాంతో ఆ వాగ్వాదానికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది. ఇక్కడ కౌశల్ తన అన్న మాటను డిఫెన్స్ చేసుకునే పనిలో పడ్డా, మొత్తంగా చూస్తే సదరు హౌస్మేట్స్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎప్పుడూ కూల్‌గా ఉండే సామ్రాట్ కూడా కౌశల్ అన్న అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘మమ్మల్ని కుక్కలు అంటావా’ అని సామ్రాట్ నిలదీయగా, దానికి మిగతా వారి నుంచి మద్దతు లభించడంతో కౌశల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. తాను ఎవర్నీ ప్రత్యేకించి కుక్కలు అనలేదని, కుక్కల్లాగా పడుతున్నారనే వ్యాఖ్యానించానని సర్దిచెప్పుకునే యత్నం చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే, బిగ్‌బాస్ షోకు ఏదైనా జరగొచ్చు అనేది ఉప శీర్షిక. దానికి తగ్గట్టే ఈ వారం ఏమి జరుగుతుందనే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కౌశల్‌ను పంపేందుకు ముందుగానే స్కెచ్ సిద్ధం చేశారా.. లేక ఓటింగ్ ప్రకారమే ఒకరు బయటకు వెళతారా అనేది త్వరలో తేలనుంది. ఏం జరుగుతుందో చూద్దాం. చదవండి: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ -
బిగ్‌బాస్ : కౌశల్ టాప్ త్రీ లో ఉండడట!
బయట కౌశల్ ఆర్మీ విజృంభిస్తుంటే.. లోపల మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. గత వారం ఎలిమినేట్ అయిన శ్యామలను నాని.. టాప్ త్రీలో ఎవరు ఉంటారని అడిగితే.. కౌశల్ పేరు చెప్పలేదు. అసలే కౌశల్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు. ఇక తమ అభిమాన కంటెస్టెంట్ పేరును చెప్పలేదని శ్యామలను విపరీతంగా ట్రోల్చేశారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన అమిత్ కూడా ఇదే బాటలో సాగుతూ.. రోల్‌రైడా, గీతా, సామ్రాట్ టాప్ త్రీలో ఉంటారని.. రోల్, సామ్రాట్ ఇద్దరిలో ఏవరైనా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. సోషల్ మీడియాలో కౌశల్‌కు సపోర్ట్‌గా భారీగానే మద్దతు లభిస్తోంది. అయితే అది పెయిడ్ క్యాంపెన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి పెయిడ్ క్యాంపెయిన్ల గురించి చాలానే చర్చ జరుగుతుంది. దీప్తి తరపున కూడా పెయిడ్ క్యాంపెన్ నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే రీసెంట్గా కౌశల్ ఫాలోవర్స్ నిర్వహించిన 2కే రన్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపైనా.. పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కౌశల్ విన్నర్ కావాలని, అవుతాడని సోషల్ మీడియా కోడై కూస్తుంటే.. హౌజ్‌మేట్స్ మాత్రం కౌశల్ పేరు అసలే ప్రస్తావించడం లేదు. వాళ్లు కావాలని అలా అంటున్నారో, ఏదైనా పథకం ప్రకారం మాట్లాడుతున్నారో తెలియదు కానీ కౌశల్ మాత్రం టాప్త్రీలో గాని, ఫైనల్లోగానీ ఉంటాడని పొరపాటున కూడా చెప్పడం లేదు. బయట జరిగే టీవీ షోల్లో... పాల్గొనే వ్యక్తులు మాత్రం కౌశల్ విన్నర్ అవుతాడని చెప్పుకొస్తున్నారు. మాధవీలత, సంజన, యాంకర్ రష్మీ ఇలా ఎంతోమంది కౌశలే బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తాడని చెప్పుకొచ్చారు. నూతన్ నాయుడికి ఓట్లు ఎక్కువ వచ్చాయని, అయినా సరే కావాలనే నూతన్‌ను ఎలిమినేట్ చేశారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రజల ఓట్లకు వ్యతిరేకంగా బిగ్‌బాస్ నిర్ణయం తీసుకున్నాడని.. బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఈ షోలో బిగ్‌బాస్ చెప్పిందే జరుగుతుంది.. చెయ్యాలనుకున్నదే చేస్తాడు.. కాబట్టి ఏదైనా జరుగొచ్చు. బయటి విషయాలతో సంబంధం లేకుండా బిగ్‌బాస్ వ్యవహరిస్తాడేమో చూడాలి. అయినా ఈ కార్యక్రమం కూడా చివరి అంకానికి చేరుకుంది కాబట్టి... ఇంకా షో లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. చివరకు ఎవరు మిగులుతారో.. ఎవరు టైటిల్ కొడతారో చూడాలి. -
బిగ్‌బాస్ : అమిత్ కథ ముగిసింది
బిగ్‌బాస్ సీజన్-2 తుది అంకానికి చేరింది. మరో రెండు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడనుంది. ఇంకా హౌస్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ వారం ఒకరి ఎలిమినేషన్‌తో ఇంకా ఆరుగురు సభ్యులు మిగిలారు. మరో వారంలో మరొకరు హౌస్‌ను వీడనున్నారు. చివరకు ఐదుగురు కంటెస్టెంట్స్ డైరెక్ట్‌గా ఫైనల్‌కు చేరనున్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పటివరకు హౌస్‌లో పరిస్థితులను బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. కానీ గత రెండు వారాలుగా బిగ్‌బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. దానికి తోడు శనివారం నాని కౌశల్‌పై సీరియస్ అవ్వడం.. రెడ్ ఫిష్ స్టోరీ చెప్పడం పలు అనుమానాలకు దారితీసింది. గత రెండు వారాలు బిగ్‌బాస్ నిర్ణయంతో గట్టెక్కిన అమిత్ ఈ సారి హౌస్‌ను వీడారు. ఈ వారం అమిత్‌తో పాటు ఎలిమినేషన్ జాబితాలో కౌశల్, దీప్తి, రోల్‌రైడా, గీతామాధురిలు ఉన్నా.. వారంత సేఫ్ అయ్యారు. షో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమిత్ సేఫ్ గేమే ఆడాడు. కంటెస్టెంట్స్‌తో ప్రేమగా ఉంటూ నామినేషన్ ప్రక్రియలోకి రాకుండా జాగ్రత్తపడ్డాడు. దీనికి తోడు హీరో కమల్‌హసన్ రెండు వారాలు నామినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం అమిత్‌కు కల్పించాడు. దీంతో గత రెండు వారాలుగా నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన అమిత్‌కు తక్కువ ఓట్లే నమోదయ్యాయి. అందరూ అమితే హౌస్‌ను వీడుతాడని భావించారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ అతన్ని రెండు వారాలు సేవ్ చేశాడు. ఈ సారి మాత్రం అమిత్‌ను బిగ్‌బాస్ కాపాడలేకపోయాడు. అమిత్ ఎలిమినేషన్‌కు కారణం.. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అమిత్‌కు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. సినిమాల్లో విలన్ అయినా హౌస్‌లో అతని ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉండేది. కొన్నిసార్లు అది కాస్త ఫన్నీగా ఉన్నా మరికొన్నిసార్లు చికాకు పుట్టించేది. ఈ విషయం హౌస్మేట్స్ కూడా చాలా సార్లు చెప్పారు. ఎప్పుడూ సీరియస్ డిస్కషన్ ఇన్వాల్వ్ కాకపోవడం.. ఓ విషయంపై స్టాండ్ తీసుకోని మాట్లాడకపోవడం.. ప్రతి దానికి అతిగా ప్రవర్తించడం జనాలకు చికాకు పుట్టించింది. ఇక కెమెరాల ముందు వచ్చిరాని తెలుగులో మాట్లాడటం నస పుట్టించేలా ఉండేది. ఈ విషయం హోస్ట్ నాని కూడా చెప్పి మందలించాడు. ఇవే అమిత్‌కు ప్రేక్షకుల నుంచి ఓట్లు తెప్పించలేకపోయాయి. టాస్క్‌ల్లో సరిగ్గా ఆడక.. వాటికి ఎవేవో కారణాలు చెబుతూ సమర్ధించుకోవడం కూడా జనాలకు నచ్చలేదు. -
బిగ్‌బాస్ : శ్యామలపై కౌశల్ ఆర్మీ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్-2 రియాల్టీ షో నుంచి ఎలిమినేట్ అయిన యాంకర్ శ్యామలపై కౌశల్ ఆర్మీ తీవ్రంగా మండిపడుతోంది. దీనికి గల కారణం కౌశల్ బిగ్‌బాస్-2 విన్నర్ అవుతాడని చెప్పకపోవడమే. ఈ వారం ఎలిమినేట్ అయిన శ్యామలను టాప్ త్రీ కంటెస్టెంట్స్‌లో ఎవరుంటారని అనుకుంటున్నారని నాని అడగారు. శ్యామల సమాధానం చెబుతూ.. గీతామాధురి, తనీష్, రోల్ రైడా పేర్లను సూచించింది. ఆ ముగ్గురిలో కౌశల్ పేరును చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. శ్యామల సమాధానం కౌశల్ ఆర్మీకి ఏమాత్రం నచ్చలేదు. ఇంకేముంది సోషల్ మీడియాలో శ్యామలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రీఎంట్రీ సమయంలో తాము ఓట్లు వేస్తేనే లోపలకి వెళ్లిన శ్యామల ఇప్పుడు కనీసం విన్నర్లలో కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన వారి పేర్లు చెబుతారా..? అంటూ శ్యామలపై మండిపడుతున్నారు. బిగ్‌బాస్ టీం స్క్రిప్ట్ ఇస్తే శ్యామల మాట్లాడిందని కొందరు, నాని చెప్పమంటేనే వారి పేర్లు చెప్పిందని మరికొందరు ఫేస్బుక్లో శ్యామలపై విరుచుపడ్డారు. ‘కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో మీకు బాగా తెలుసు. అయినప్పటికి కౌశల్ పేరు చెప్పలేదు. బిగ్‌బాస్-2 విన్నర్‌పై నీ గెస్సింగ్ తప్పు. నిన్న కౌశల్ ఆర్మీ చేసిన 2-కెరన్ చూసి అయినా నీ ఆలోచన మారాలి’, ‘బైబై మేడమ్. వచ్చే వారం మీ స్నేహితులను కూడా నీ దగ్గరకు పంపిస్తాం. కూర్చొని కబుర్లు చెప్పుకోండి’ అంటూ వ్యంగ్య కామెంట్లతో శ్యామలను విమర్శిస్తున్నారు. ఇది చదవండి బిగ్‌బాస్: శ్యామల ఔట్ బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ -
బిగ్‌బాస్: శ్యామల ఔట్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 తుది అంకానికి చేరింది. మరో మూడు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడునుంది. దీంతో ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరో అని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఈ వారం శ్యామల ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నఅమిత్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. గతవారమే అమిత్ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించగా బిగ్‌బాస్ నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్‌బాస్ కావాలనే నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారని, ఇదొక అన్‌ఫెయిర్ గేమ్ అని కొందరు సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్ నిర్వాహకులు, హోస్ట్ నానిపై మండిపడ్డారు. దీనికి హోస్ట్ నాని ట్వీట్‌తో ప్రేక్షకులకు సమాధానం కూడా ఇచ్చాడు. (చదవండి:ట్రోల్స్‌పై స్పందించిన నాని) అలా బతికిపోయిన అమిత్ ఈ సారి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ మళ్లీ అతను సేవ్ అయిపోయాడు. రీఎంట్రీ ఇచ్చిన శ్యామల, నూతన్ నాయుడులా హౌస్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ ఎలిమినేషన్ విషయం కూడా ఎపిసోడ్‌కు ముందే(ఆదివారం ఉదయమే) తెలిసిపోయింది. బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ విషయంలో ఎంత జాగ్రత్తపడ్డా ఎలిమినేట్ అయ్యింది ఎవరో ముందే తెలిసిపోతోంది. శ్యామలకు, అమిత్‌కు ఓట్లలో స్వల్ప తేడా వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ ఓట్లపై ఎలాంటి చర్చలేకుండా శ్యామల ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాని ప్రకటించారు. ఈ ఆదివారం ఎపిసోడ్లో ‘సిల్లీఫెలోస్’ హీరోలు అల్లరి నరేశ్, సునీల్‌లు హౌస్‌లో సందడి చేశారు. హౌస్ మేట్స్‌తో రెండు గ్రూపులుగా విడిపోయి హోస్ట్ నాని ఇచ్చిన ఓ గేమ్ ఆడుతూ నవ్వులు పూయించారు. (చదవండి: బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ) శ్యామల ఎలిమినేషన్ అందుకేనా? గతవారం కొంచెం తెలివిగా ప్రవర్తించి నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్న శ్యామలకు.. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా పోయింది. బిగ్‌బాస్ పోలీస్- కిల్లర్ టాస్క్‌లో గీతామాధురి సిక్రెట్ టాస్క్‌కు బలై నామినేషన్ ప్రక్రియలోకి వచ్చిన శ్యామలపై చాలా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా బయటి వ్యవహారాలు ఇంట్లో చెప్పి.. నూతన్ నాయుడిని నామినేట్ చేసేలా చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే విషయాన్ని నాని కూడా గత శనివారం ప్రస్తావిస్తూ మందలించాడు. ఇది చాలా మంది ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఇక హౌస్‌ను దాదాపు తమ ఆదీనంలోకి తెచ్చుకున్న కౌశల్ ఆర్మీ ఆమెపై అగ్రహంగా ఉండటం.. కౌశల్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఉండటం ఆమె ఎలిమినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. రీఎంట్రీ అనంతరం ఆమె ప్రవర్తనలో తేడా రావడం కూడా కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. మొత్తానికి రీఎంట్రీతో హౌస్ అడుగుపెట్టిన శ్యామల ఫైనల్ లిస్ట్‌లో ఉండకుండానే వెనుదిరిగింది. వెళ్తూ వెళ్తూ బిగ్‌బాస్ ఇంటికి సేవకుడిగా ఉండాలనే బిగ్‌బాంబ్‌ను రోల్ రైడాపై వేసింది. ఇక తన అంచనా ప్రకారం టాప్ రోల్‌రైడా, గీతా మాధురి, తనీశ్లని చెప్పింది. ఇది కౌశల్ ఆర్మీకి ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడుతున్నారు. మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ
హైదరాబాద్: బిగ్‌బాస్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ. నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. ఇంకా ఫైనల్ అంకానికి కొన్ని ఎపిసోడ్లు మాత్రమే మిగిలి ఉండటంతో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు వాక్‌ను ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లో నిర్వహించిన ఈ వాక్కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొన్ని రోజుల క్రితం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా ర్యాలీలో పాల్గొనాలని అభిమానులు పిలుపునిచ్చింది. దీనికి ఊహించని మద్దతు లభించింది. సగటు ప్రేక్షకుడే కాదు.. బిగ్‌బాస్ కూడా ఆశ్చర్యపోయేలా ఈ వాక్కు విశేషమైన మద్దతు దక్కడం ఇక్కడ విశేషం. ఇందుకోసం ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ముద్రించిన టీ షర్ట్‌లను, పోస్టర్స్ విడుదల చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని టార్గెట్ చేయడం.. ఒంటరిని చేసి గ్రూపులు కట్టడంతో కౌశల్‌కు అండగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ కౌశల్ ఆర్మీ పెరిగిపోయింది. హైదరాబాద్‌లో నిర్వహించిన 2కె వాక్కు స్థానిక అభిమానులు ఈ రేంజ్లో హాజరైతే... రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఆర్మీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక కంటెస్టెంట్‌కి సపోర్ట్‌గా నిలుస్తూ.. బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె వాక్ నిర్వహిస్తున్నారు కౌశల్ అభిమానులు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఎపిసోడ్ ప్రారంభమైంది మొదలు ఆయనకు అనుకూలంగా ప్రత్యర్థి కంటెస్టెంట్స్‌కు వ్యతిరేకంగా వరుస పోస్ట్‌లు కుప్పలుతెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది.. నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుందంటే.. కౌశల్ ప్రభావం బిగ్‌బాస్ షోలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో ఏకాకిగా మారారు. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోతేనేం.. కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు. బిగ్‌బాస్ అంటే కౌశల్.. కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్లో తోటి కంటెస్టెంట్స్ కుళ్లుకుని నువ్ బిగ్ బాస్వా? అని తింగరి మొహం వేసేలా డిక్టేటర్‌గా మారి టైటిల్ రేస్‌లో టాప్ 1 ప్లేస్‌లో ఉన్నారు కౌశల్. కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. కౌశల్ ఎఫెక్ట్‌తో.. కిరీటి, భాను శ్రీ, బాబు గోగినేని, దీప్తి సునయన, తేజస్వి, గణేష్, నందిని ఇలా వరుసగా ఎలిమినేషన్‌కి వెళ్లారంటే కౌశల్‌తో గొడవ పెట్టుకోవడమే ప్రధాన కారణం అని ఆయన ఫ్యాన్స్ భావన. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇస్తున్నాయి. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. -
కౌశల్ ఆర్మీ భారీ ర్యాలీ
-
బిగ్‌బాస్: ట్రోల్స్‌పై స్పందించిన నాని
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్ 2 రియాల్టీ షో తుది అంకానికి చేరుకుంది. సోషల్ మీడియాలో తొలి నుంచి ఈ షో పై హైప్ క్రియేట్ అయింది. దీంతో హౌస్‌లో జరిగే ప్రతి విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. గత వారం నూతన్ నాయుడు ఎలిమినేషన్ సరిగ్గా జరగలేదని, ఓట్లు ఎక్కవ వచ్చినా కావాలనే ఎలిమినేట్ చేశారని షో నిర్వాహకులు, హోస్ట్ నానిపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. అంతా స్క్రిప్టెడ్ గేమ్ అని తనీష్ లేక గీతామాధురిల్లో ఒకరిని విజేతగా ప్రకటించడానికే బిగ్‌బాస్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఎలిమినేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ చేయాలని కానీ తమ ఓట్లు అడిగి అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. షోపై నమ్మకం పోయిందని, హోస్ట్ నాని కూడా వారి పక్షాన నిలుస్తూ మద్దతు తెలుపుతున్నారని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే నాని మూవీ ‘దేవదాసు’ ను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఇంకొందరు తమ అభిమాన హీరో నానియే తమని మోసం చేస్తున్నాడని, అతనిపై ఉన్న గౌరవం పోయిందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్‌పై హోస్ట్ నాని ట్విటర్లో స్పందించారు. తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వారికి క్లారిటీ ఇస్తూ ఓ లేఖను పోస్ట్ చేశాడు. దీనికి క్యాప్షన్‌గా.. ‘బిగ్‌బాస్‌కు సంబంధించిన కొన్ని రిప్లయ్‌లను చూశాను. వీటికి నేను సమాధానం చెప్పనని బిగ్‌బాస్ టీమ్ భావించింది. కానీ చెప్పకుండా ఎలా ఉంటా’ అని పేర్కొన్నాడు. ఆ లేఖలో ఏముందంటే.. ‘క్షమించండి.. మీలో కొంత మంది బాధపడ్డారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. షో చూస్తున్న మీరు మీ అభిమాన కంటెస్టెంట్‌ను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. కానీ నేను ఓ హోస్ట్‌గా అలా చేయలేను. అందరిని సమానంగా చూస్తాను. దీంతో మీరు నేను ఒకరికి వత్తాసు పలుకుతున్నానని అనుకుంటున్నారు. కానీ నాకు ప్రతి ఒక్కరు సమానమే. ఈ విషయంలో నాపై నమ్మకం ఉంచండి. అలాగే మీ మద్దుతుతోనే ఒకరు విజేతగా నిలుస్తారు. ఓటింగ్, ఎలిమినేషన్స్ అన్ని మీ ఓట్లతోనే జరుగుతాయి. ఓ హోస్ట్‌గా, నటుడిగా.. నా నుంచి బెస్ట్ ఇస్తాను. మీరు నన్ను ఇష్టపడ్డా.. ఇష్టపడకపోయినా మీరంతా నా ఫ్యామిలీయే. మీరు చేసేది ఏదైనా నాపై ప్రభావం చూపుతుంది. మీరైతే నన్ను కిందపడేయాలని చూడరు. మీ ప్రేమను పొందేందుకు నా సాయశక్తుల ప్రయత్నిస్తా.- మీ నాని’ అని ఆ లేఖలో వివరించాడు. Logged in to share something nice with all of you and I saw few of ur replies regarding BB .. the team believes that I need not reply but how can I not :) So here’s my last and only reply regarding the show pic.twitter.com/xmnGTyf0Wx — Nani (@NameisNani) 4 September 2018 చదవండి : బిగ్‌బాస్ ఇంటి ముచ్చట్లు -
బిగ్‌బాస్: పూజా ఔట్
సాక్షి, హైదరాబాద్: ఈ వారం కాస్త బోర్ కొట్టిన బిగ్‌బాస్.. వారంతంలో ప్రేక్షకులకు కావాల్సిన మజా ఇచ్చింది. తనీష్-కౌశల్ మధ్య జరిగిన గొడవ, శనివారం నాటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు హోస్ట్ నాని పీకిన క్లాసులు, ఆదివారం రాఖీ పండుగ స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా నాని హౌజ్‌లోకి వెళ్లడం ఇంట్రెస్టింగ్ అనిపించాయి. హౌజ్‌లోకి వెళ్లిన నాని వారితో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. కంటెస్టెంట్లకు స్పెషల్ ఐటమ్స్ దగ్గర ఉండి మరి వడ్డించి.. వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత హౌజ్‌లో ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాల్ని వారితో పంచుకున్నారు. ఎపిసోడ్ చివర్లో పూజా ఎలిమినేట్ అయిన విషయాన్ని నాని హౌజ్‌లోనే ప్రకటించారు. ఎలిమినేట్ అయిన పూజా బిగ్‌బాంబ్ గీతపై వేసింది. దీని ప్రకారం గీత ఈ శనివారం వరకు జైల్లోనే పడుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న కౌశల్, పూజా రాంచంద్రన్, తనీష్, దీప్తిల్లో ఎవరు ప్రొటెక్ట్జోన్లోకి వెళతారనే అంశంపై నాని శనివారం నాటి ఎపిసోడ్లో కాసింత ఆసక్తి క్రియేట్ చేశారు. కానీ ప్రతి ఎలిమినేషన్ సోషల్ మీడియా వేదికగా తెలుస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా పూజా ఎలిమినేట్ అయిన విషయం ముందుగానే తెలిసిపోయింది. అంతా అనుకున్నట్లే ఈ వారం హౌస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రాంచంద్రన్ ఎలిమినేట్ అయ్యారు. లీకుల విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంత కట్టడి చేసినా లాభంలేకపోయింది. దీంతో వారు కూడా చేసేదేమి లేక సైలెంట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన పూజా గతవారమే దీప్తి సునయనతో గట్టెక్కిన పుజాకు ఈ సారి నిష్క్రమణ తప్పలేదు. ఆమె నామినేట్ కాగానే ఈ సారి ఎలిమినేషన్ అయ్యేది పూజానే అని ప్రేక్షకులు అంచనా వేశారు. అయితే ఆమె ఎలిమినేషన్‌కు కారణం మాత్రం తెలుగు రాకపోవడం.. ఇక్కడి అమ్మాయి కాకపోవడం, తొలి వారంలో ఉన్నంత ఉత్సాహం కొనసాగించకపోవడమని అర్థం అవుతోంది. అంతేకాకుండా టాస్క్‌ల్లో ఆమె సహనం కోల్పోతూ అరవడం.. సంచాలకురాలిగా తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోవడం ప్రేక్షకులకు చికాకు పుట్టించాయి. దాదాపు బిగ్‌బాస్‌ను తమ ఆదీనంలోకి తీసుకున్న కౌశల్ ఆర్మీ.. దీప్తి సునయనను టార్గెట్ చేయడంతో పూజా తక్కువ ఓటింగ్‌తో గతవారం గట్టెక్కింది. (చదవండి: అనుకోని సంఘటన.. దీప్తికి షాక్!) #Biggbosstelugu2 #KaushalArmy #PoojaRamachandran back to 🏠 Source found it in twitter Randomly while searching Malli adakakandi source ani 😂😂😂 Once again pics leaked If not great photoshop by someone🙏🙏 pic.twitter.com/0Nl0eeTBkP — Pathan Usif (@Pathan4141) August 26, 2018 ఈ రియాల్టీ షో పూర్తికావడానికి ఇంకా కొంత సమయమే ఉండటంతో ఈ వారం డబుల్ ధమాకా ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. పూజాతో దీప్తి సైతం ఎలిమినేట్ అవుతుందని, అందుకే ఆమె కెప్టెన్సీ తొలిగించారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం జరగలేదు. కేవం ఒక పూజా మాత్రమే ఎలిమినేట్ అయింది. (చదవండి: మరిన్ని బిగ్‌బాస్ ముచ్చట్లు) Follow us :- @biggboss_telugu_season_2 . . . . #biggboss2telugu #biggbosscontestant #biggboss11 #biggboss @kaushalmanda #biggbossofficial #biggbosshouse #biggbosstelugu2 #biggbosstelugu @kaushal_fan_army @kaushal_force @kaushal_fan_army_ #biggbossnews #biggboss2 #biggbosslivefeeds #biggbossjourney #biggbossupdates #biggbosstamil #biggbossseason2 #biggbossteluguvote #teluguactress #telugubiggboss #teluguhotactress #telugu #hotactress #deepthisunainaarmy #deepthisunainatroller #deepthi #sunaina #trolls A post shared by Biggboss season 2 telugu (@biggboss_season_2_telugu) on Aug 24, 2018 at 8:41pm PDT -
బిగ్‌బాస్ : అనుకోని సంఘటన.. దీప్తికి షాక్!
బిగ్‌బాస్ షో ఈ వారం మొత్తం మజా ఇవ్వకపోయినా.. శనివారం షోలో జరిగిన సంఘటనలు మాత్రం ప్రేక్షకులకు కావల్సినంత కిక్కునిచ్చేశాయి. ఎంతో ఆశపడి కెప్టెన్సీ బాధ్యతను చేపట్టిన దీప్తికి బిగ్‌బాస్ గట్టి షాకే ఇచ్చాడు. కౌశల్-తనీష్‌ల గొడవతో హౌస్ వేడెక్కిపోయింది. అమిత్ వేసే వేశాలను నాని ఎండగట్టేశాడు. హౌస్‌లో ఒంటరిగా ఏవేవో మాట్లాడుకుంటున్న వీడియోలు చూపించి గణేష్ గాలి మొత్తం తీసేశాడు నాని. ఇలా ఒకటేమిటి షో మొత్తం అదిరిపోయింది. అసలేం జరిగిందో ఓ లుక్కేద్దాం. హౌస్‌లో ఇన్ని రోజులుగా హెచ్చరిస్తున్నా... మైక్‌లు ధరించకుండా మాట్లాడటం, పగటి పూట నిద్ర పోవడం, కెప్టెనే స్వయంగా మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో విసుగు చెందిన బిగ్‌బాస్ దీప్తిని కెప్టెన్ బాధ్యత నుంచి తొలగించాడు. దీంతో హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. లేకలేక వచ్చిన కెప్టెన్ పదవిని ఇలా సంబరపడేలోపే పోగొట్టుకుంది దీప్తి. ఇక బిగ్‌బాస్ కెప్టెన్‌గా తొలగించినప్పటికీ.. తానే కెప్టెన్ అని తాను చెప్పిందే వింటానని ఇది తన అభిప్రాయమని తనీష్ చెప్పడం ప్రేక్షకులకు విడ్డూరంగా అనిపించింది. డైనింగ్ టేబుల్ వద్ద మొదలైన జగడం... బిగ్‌బాస్ ఇలా ఆదేశించిన తరవాత.. కౌశల్ తన వాదనను వినిపించాడు. అది మాటామాటా పెరిగి పెద్ద యుద్ధం లాంటిదే జరిగింది. టాపిక్ ఎక్కడికో వెళ్లి.. కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఎందుకు పడుకున్నావంటూ తనీష్‌ను ప్రశ్నించేసరికి.. అంతెత్తుకు లేచి కౌశల్‌పై మండిపడ్డాడు. గొడవ మొదలైందే.. గణేష్ నిద్రపోవడం, రోల్ రైడా, దీప్తి మైక్‌లు ధరించకపోవడం వల్ల అయితే వీరిద్దరు మాటల యుద్దానికి దిగగా.. మిగతా వారంతా వీరిద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించారు. బట్టబయలైన అమిత్ రంగు... మొదట్నుంచీ సేఫ్ గేమ్ ఆడుతూ.. ఎవరిని నొప్పించకుండా.. ఆడే అమిత్ ఈసారి దొరికిపోయాడు. కెప్టెన్సీ టాస్క్‌లో కౌశల్‌కు సపోర్ట్ చేసి.. కొద్దిసేపట్లోనే అదంతా పోగొట్టేసుకున్నాడంటూ నాని పాయింట్ అవుట్ చేశాడు. అయితే కౌశల్‌కు సపోర్ట్ చేసి.. మళ్లీ ఆ రాత్రే వాటి మీద జోక్‌లు వేసుకోవడంతో తాను చేసిన సపోర్ట్‌కు ఎలాంటి ఉపయోగం ఉండకుండాపోయిందని అమిత్‌కు సలహా ఇచ్చాడు. అయితే అమిత్ మాత్రం.. ఎప్పుడు మాట్లాడనంటూ బుకాయించాడు.. వీడియో చూపించడం ఎందుకులే.. మీరు ఒకరి దగ్గర ఏం మాట్లాడుతుంటారు.. మళ్లీ వేరొకరి దగ్గర ఆ మనిషి గురించి ఏం మాట్లాడుతుంటారో ఆ మనిషికి తెలియకపోవచ్చు.. కానీ మాకు తెలుస్తుందంటూ నాని కౌంటర్ వేశాడు. అలా మాటలు మార్చే వారినే జడ్జ్ చేస్తామంటూ అమిత్‌ను హెచ్చరించాడు. తనీష్‌ను హెచ్చరించిన నాని డైనింగ్ టేబుల్ వద్ద మొదలైన గొడవను మళ్లీ నాని లేవనెత్తాడు. కౌశల్, తనీష్‌లు తమ వాదనలు వినిపించారు. మళ్లీ అక్కడ కూడా వారి వ్యవహారం శృతిమించడంతో నాని హెచ్చరించాడు. తనకు లాజిక్ లేనప్పుడు, ఆన్సర్ చేయలేనప్పుడే.. అలా కోపంతో ఉవ్వెత్తున లేస్తాడంటూ తనీష్‌ను హెచ్చరించాడు. రూల్స్ బ్రేక్ చేస్తాం.. పనిష్మెంట్స్ వస్తే.. ఫేస్ చేస్తామనే యాటిట్యుడే కరెక్ట్ కాదంటూ.. తనీష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మాట్లాడాల్సిన వారు మాట్లాడకుండా.. అవసరం లేని వాళ్లు అనవసరంగా మాటల యుద్ధానికి దిగారంటూ.. అనవసరమైన చోట మాట్లాడకుండా ఉంటే మంచిదని కౌశల్‌కు సలహా ఇచ్చాడు. గీతకు నాని సలహా.. తాను గేమ్‌ను లైట్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తోందని.. బిగ్‌బాస్ రూల్స్ అంటే లెక్కలేనితనం పెరిగిపోయిందంటూ గీతకు వార్నింగ్ ఇచ్చాడు. అది సరైన ప్రవర్తన కాదంటూ సలహా ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న ఫ్రస్ట్రేషన్‌తో అలా అన్నానని, కౌశల్నుంచి తప్పించుకోలేక.. అతను నన్ను ప్రభావితం చేస్తున్నట్టుగా అనిపిస్తోందని.. ఆయన ప్రతీసారి నా దగ్గరికి వచ్చి ఏదోటి చెప్పడంతో నాలో నెగెటివిటి పెరిగిపోతున్నట్టు అనిపిస్తోందంటూ... ఇలా తన కారణాలను చెప్పుకుంది. ఫోన్ కాల్.. ఆనందంతో కౌశల్ కంటతడి ప్రతీవారం ఒక కాలర్ హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతుండగా.. ఈసారి కౌశల్‌కు కాల్ వచ్చింది. కౌశల్‌కు ఫోన్ ఇవ్వగానే కాలర్ మాట్లాడటంతో కంటతడి పెట్టుకున్నాడు. కౌశల్ అన్నకు ఫోన్ ఇవ్వమని కాలర్ అడగడం.. కౌశల్ ఆశ్చర్య పడటం.. కౌశల్ ఆర్మీ గురించి వివరించడం.. భరోసా ఇవ్వడం..కౌశల్ ఒంటరి కాదు.. తనకు బయట ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పడం... నీ ఆట నువ్వు ఆడుకో.. మిగతాది ఆర్మీ చూసుకుంటుందని చెప్పడం.. బిగ్‌బాస్ విజేతగా నిలవాలని కోరుకోవడం.. తాను కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని బదులివ్వడం.. ఇలా ఆనందంతో కౌశల్ కళ్లు తడిశాయి. ఇక కాల్ కట్ అవడంతో.. బయట జరిగేదంతా చెప్పేశాడని.. చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పాడని అన్నాడు. ఒంటరి వాడని బాధపడకంటూ.. బయట ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో అర్థమైంది కదా అంటూ కౌశల్‌కు ధైర్యం చెప్పాడు. తనకు ఇన్ని సలహాలు ఇస్తూ.. ప్రోత్సహిస్తున్న నానికి కౌశల్ ధన్యవాదాలు తెలిపాడు. మైక్ తీసి పిచ్చిపిచ్చిగా మాట్లాడిన గణేష్ గణేష్ ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ.. తన ఆరోగ్యం కూడా చూసుకోలేని వాడు..బిగ్‌బాస్ టైటిల్ ఏం గెలుస్తాడంటూ గణేష్‌ను మందలించాడు. ఎప్పుడూ నిద్ర ఎందుకు పోతున్నావంటూ ప్రశ్నించంగా.. అలసిపోవడం వల్ల అప్పుడప్పుడు పడుకుంటున్నానని సమాధానమివ్వగా.. గణేష్ ఒంటరిగా ఉండి.. ఏదో తనలో తాను మాట్లాడుకోవడం.. మైక్ తీసేసి ఏదో తిట్టినట్టు మాట్లాడుకుంటున్న వీడియో ప్లే చేసేసరికి హౌస్‌లో నవ్వులు పూశాయి. జిమ్ ఏరియాలో మాట్లాడుతూ అలసిపోతున్నావా? అంటూ గణేష్‌ను మందలించాడు. తనను ట్రీట్ చేసే డాక్టర్ కూడా రావడానికి ఇష్టపడటం లేదంటూ.. తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదంటూ.. కేవలం కామన్ మ్యాన్అనే ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు హౌస్‌లో ఉన్నావని, ఇదే సెలబ్రిటీ అయితే ఈపాటికే ఇంట్లోంచి పంపించేసేవారని గణేష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇక అసలైన ఎలిమినేషను మాత్రం సస్పెన్స్‌లో ఉంచేసిన నాని.. కనీసం ప్రొటెక్షన్ జోన్లో ఎవరున్నారనే విషయాన్ని కూడా ప్రకటించకుండా ఉత్కంఠరేగేలా చేశాడు నాని. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం పూజ, దీప్తిలు ఎలిమినేట్ అయినట్టు కనిపిస్తోంది. దీప్తికి తక్కువ ఓట్లు రావడంతో.. తనను ఎలిమినేట్ చేసే భాగంలోనే కెప్టెన్ బాధ్యతలనుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఒక్కరే ఎలిమినేట్ అయ్యారా? లేక ఇద్దరు ఎలిమినేట్ అయ్యారా?చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు కదా.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్. చదవండి.. బిగ్‌బాస్ : ప్రేక్షకుల సహనానికి పరీక్ష -
బిగ్‌బాస్ : ప్రేక్షకుల సహనానికి పరీక్ష
బిగ్‌బాస్ ఏదైనా జరుగొచ్చు. అంటే ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించరు. ఈవారం అంతా ప్రేక్షకులకు అసహనం కలిగించేలా షోను నడిపించారు నిర్వాహకులు. మళ్లీ ఆ ప(స)ని లేని పెళ్లి టాస్క్‌లో ఇచ్చిన సీక్రెట్స్ విరక్తి పుట్టించేలా ఉన్నాయి. ఈ వారం జరిగిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. బిగ్‌బాస్‌లో ఈ వారం ఓ బొమ్మల పెళ్లి జరిగింది. కాదు కాదు బిగ్‌బాస్ ఆదేశాల మేరకు హౌస్మేట్స్ జరిపించారు. మెహందీ, సంగీత్, పెళ్లి, శోభనం అంటూ ప్రేక్షకులకు చిర్రెత్తించేలా చేశారు హౌస్మేట్స్. ఏ ఒక్కరూ తగ్గకుండా అందరూ తమ అతితో నటించేశారు. ఈ వారం గీతా మాధురిపై పెరిగనంత వ్యతిరేకత మిగతా ఏ కంటెస్టెంట్‌పై పెరిగి ఉండకపోవచ్చు. వీరు చేసే ఈ అతిలో కాస్త ఉపశమనంగా హౌస్‌లో అనసూయ, నీవెవరో టీమ్ కనిపించి కనువిందు చేశారు. మెహింది కార్యక్రమానికి హాజరైన అనసూయ హౌస్మేట్స్ అందరికీ మెహిందిని పెట్టారు. ఒక్కొక్కరు తమకిష్టమైన పేర్లను చేతిపై వేయించుకున్నారు. అనసూయ ఉన్నంత సేపు హౌస్ కాస్త కలర్ఫుల్గా ఉంది. అటు తరువాత సంగీత్ కార్యక్రమం అంటూ హౌస్ మేట్స్ డ్యాన్సులతో చిందేశారు. గీతా మాధురిని ముద్దు పెట్టుకోవాలంటూ రోల్ రైడాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. సామ్రాట్ కూడా పనిలో పనిగా ముద్దు పెట్టేశాడు. ఇక దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా గీతపై నెటిజన్లలో వ్యతిరేకత తీవ్రస్థాయి కి చేరుకున్నట్టు కనిపిస్తోంది. సామ్రాట్, రోల్, తనీష్‌లో నందు కనిసిస్తున్నాడని చెప్పిన గీతపై నెటిజన్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. సందులో సడేమియా అన్నట్లు ఈ టాస్క్‌లో గణేష్ కూడా రెచ్చిపోయాడు. పెళ్లి పంతులు క్యారెక్టర్లో లీనమయ్యాడు. మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చేసి కంటెస్టెంట్లతోనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌తో మాట్లాడే తీరే మారిపోయింది. ఈ విషయంపై తనీష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై కౌశల్, తనీష్ ఇద్దరు చర్చించుకున్నారు. గణేష్ డల్‌గా ఉండటం చూసి మిగతా కంటెస్టెంట్లు జాలి పడటం.. ఏం జరిగిందో అడగటం... తనీష్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడం ఇలా జరిగిపోయింది. ఈ పెళ్లి టాస్క్ ముగిసిన తరువాత నీవెవరో టీమ్ బిగ్‌బాస్‌లో ఆర్జేలుగా మారి అల్లరి చేశారు. గణేష్-అమిత్-దీప్తిలు చేసిన గుడ్డు టాస్క్, కౌశల్-గీత చేసిన టాస్క్‌లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ పాత్రలో కౌశల్, అతని ప్రేయసిగా గీత చేసిన ఫన్ బాగుంది. ఇక్కడ కూడా రోల్ తన ర్యాప్‌ను ప్రదర్శించేశాడు. రోల్ ర్యాప్‌లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ సంగతి తెలిసిందే. ఇక ఈ సారి కెప్టెన్ టాస్కులో భాగంగా.. కన్ఫెషన్ రూమ్‌లోకి ముందుగా వెళ్లిన ఇద్దరు సభ్యులను అర్హులని బిగ్‌బాస్ ప్రకటించారు. ఎప్పటినుంచో కెప్టెన్సీ పోటీదారుగా పాల్గొని వెనుదిరిగిన దీప్తి ఈ సారి కెప్టెన్ అవ్వాలని పట్టుదలగా ఉంది. దీప్తి మొదట వెళ్లి కూర్చోగా.. కౌశల్, పూజల మధ్య వాగ్వాదం జరిగింది. చివరగా పూజ లేచి వెళ్లిపోగా.. దీప్తి, కౌశల్ కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించారు. తమకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయాలని మిగతా హౌస్‌మేట్స్‌ను అడగడం మొదలెట్టారు. ప్రేక్షకులందరికి తెలిసిందే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారని.. కౌశల్‌కు అమిత్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఈ టాస్క్‌పై తనీష్ సహాయాన్ని కోరగా.. దీప్తికి తాను మాటిచ్చానని, తనకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అందరూ తననే సపోర్ట్ చేస్తే ఇక టాస్క్ ఎందుకు ఏకగ్రీవంగా ప్రకటించొచ్చుకదా అని కౌశల్ తనీష్‌తో చెప్పుకొచ్చాడు. తాను ముందు నుంచీ అదే చెబుతున్నానని, హౌస్‌లో అందరితో కలిసి ఉండటం ముఖ్యమని ఎన్నో సార్లు చెప్పానని కౌశల్‌తో తనీష్ అన్నాడు. కౌశల్‌కు బయట సపోర్ట్ ఉంది గానీ, ఇంటి లోపల ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఒక రకంగా ఇదే ప్రేక్షకుల్లో కౌశల్‌పై సానుభూతిని కలిగేలా చేసింది. అయినా ఇంటి సభ్యుల మద్దతు లేకుండా ఇంట్లో నెగ్గుకురావడం చాలా కష్టమే. ఇద్దరు కెప్టన్సీదారులకి మద్దతుగా.. హౌస్మేట్స్ తమ వస్తువులు, వాటి బరువుతో కెప్టెన్‌ను కొనుక్కోవాలని బిగ్‌బాస్ తెలిపాడు. కౌశల్‌కు సపోర్ట్‌గా ఎవరూ ఏ వస్తువును వేయలేదు. ఈ విషయంలో కౌశల్‌కు మద్దతుగా అమిత్ ఒంటరిపోరాటం చేశాడు. చివరికి ఈ టాస్క్‌లో దీప్తి గెలిచింది. బిగ్‌బాస్‌లో తన చిరకాల కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా కనిపించింది. అనూహ్యంగా నూతన్ నాయుడు మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. నూతన్ ఎంట్రీతో ముందు సంబరపడినా.. మళ్లీ అతనిపై చర్చ జరిగింది. గత వారం ఎలిమినేషన్లో లేడు, ఈ వారం నామినేషన్లో లేడు అంటూ ఏవెవో లెక్కలు వేసేసి మిగతా వారికి వివరిస్తున్నాడు తనీష్. ఈ వారం కష్టపడిందంతా వృథానేనా అంటూ తనీష్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈవారం షో మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పటి వరకు షో ఎలా జరిగినా.. ఎలిమినేషన్లో మాత్రం ఈ సారి దీప్తి వెళ్లిపోతుందని అనుకున్నా.. కెప్టెన్‌గా మారడంతో ఈ సారి పూజ వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. అయినా ఈ సస్పెన్స్ కూడా ఎక్కువసేపు ఉండదు కదా.. ఎందుకంటే శనివారం రాత్రికల్లా ఎవరూ ఎలిమినేట్ కానున్నారో లీకుల ద్వారా బయటకు వస్తుంది. మరి చూద్దాం.. ఎవరు బయటకు వెళ్లనున్నారో.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్.. ఏదైనా జరుగొచ్చు!. -
'టాస్క్‌ల పేరుతో వెకిలి చేష్టలు'
సాక్షి, హైదరాబాద్ : బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. ఓ టీవీ చానల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో టాస్క్‌ల పేరుతో వెకిలి చేష్టలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా ఈ షో ఉందని ఆయన ఆరోపించారు. బిగ్‌బాస్ ప్రోగ్రాం పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి సమాజానికి ఉపయోగపడని, అనవసరమైన వెకిలి చేష్టలను ప్రసారం చేస్తున్నారన్నారు. ఈ షోతో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని రాపోలు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వ్యాపార సంస్థలతో కలిసి యాజమాన్యం తమ లాభాలు, టీఆర్పీల కోసం బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎవరికీ కనపడని బిగ్ బాస్ బాత్రూమ్లు కడగాలని, తాను చెప్పినట్టు చేయాలని 16మంది పోటీదారులను బానిసల్లా పరిగణిస్తూ ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. షోలో పాల్గొన్నవారిని బయటకు పోనివ్వకుండా ఒకే ఇంట్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. టాస్కుల పేరుతో చెడు సంప్రదాయాలను చూపించి సమజానికి నష్టం చేస్తున్నారని విమర్శించారు. చిలిపి టాస్కులు, సహజీవనం కాన్సెప్టుతో ఉన్న ప్రోగ్రాములు సమాజానికి నష్టం చేస్తాయన్నారు. ఇలాంటి ప్రోగ్రాములు చూసిన వాళ్లు మానసిక వేదనకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. -
ప్రేమికులను విడదీసిన బిగ్‌బాస్
చెన్నై : తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ బిగ్‌బాస్ మెహతా - ప్రాచీ అనే ప్రేమ జంటను విడదీసి, మెహతా - యషికా అనే మరో నూతన ప్రేమ జంటను తయారు చేసింది. ఆసక్తికరమైన ఈ ఎపిసోడ్ నిన్న ప్రసారం అయ్యింది. నిన్నటి ఎపిసోడ్లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే మెహతా బిగ్‌బాస్ హౌస్‌కు రాకమునుపే ప్రాచీ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ షోకు వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి చెప్తూ తాను ప్రాచీని బాగా మిస్ అవుతున్నానని తెలిపాడు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మెహతా, హౌస్‌లో మరో కంటెస్టెంట్ అయిన యషికాకి దగ్గరయ్యాడు. నిన్నటి ఎపిసోడ్లో మెహతా, యషికాను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు మెహతా ఇలా చెప్పడంతో యషికా అభిమానులు ప్రాచీకి తమ సానుభూతిని తెలుపుతూ సోషల్‌మీడియాలో మెసెజ్‌ల మీద మెసెజ్‌లు పెడుతున్నారంట. దాంతో ప్రాచీ, మెహతాతో తన బంధం గురించి క్లారిటీ ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లేఖను షేర్ చేసింది. ఈ లేఖలో ప్రాచీ ‘నేను ఎంతో ప్రేమించిన వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాను. మేమిద్దరం కలిసి మా భవిష్యత్ గురించి, బిగ్‌బాస్ షో గురించి ఎన్నో ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం పబ్లిక్‌గా మారిపోయింది. ప్రస్తుతం మెహతా యషికాని ప్రేమిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం నన్ను బాధపెట్టింది. అయితే ఇప్పుడు నేను మెహతాతో బ్రేకప్ చేసుకుంటున్నాను. అతను హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ విషయం గురించి అతనితో మాట్లాడతాను. ఇప్పుడు మీ అందరికి నా విన్నపం ఒక్కటే.. ఇక మెహతా గురించి నన్ను అడగడం ఆపేయండి’ అంటూ నెటిజన్లను కోరారు. గతంలో కమల్‌హసన్ మెహతా, యషికాల బంధం గురించి అడగ్గా మెహతా అలాంటిది ఏం లేదని చెప్పడంతో, యషికా కన్నీళ్లు పెట్టిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ హౌస్‌లో ‘రంగమ్మత్త’
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ గొడవలతో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించింది ఈ రియాల్టీ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్ ఎంట్రీలతో బిగ్‌బాస్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. సోమవారం అంతా ఎలిమినేషన్ ప్రక్రియ.. ఇంటి సభ్యులపై అభిమానుల నెగటీవ్ కామెంట్స్.. వాటికి వారి సమాధానంతోనే సాగింది. ఇక ఎపిసోడ్ చివర్లో హౌస్‌లో పెళ్లి సందడి నెలకొందని హింట్ ఇస్తూ.. ఓ ప్రోమోతో బిగ్‌బాస్ ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ హౌస్‌లో సందడి చేస్తోంది. పెళ్లి సందడి టాస్క్‌లో భాగంగా ఆమె సెలబ్రిటీ హోదాలో ముఖ్య అతిథిగా హాజరైనట్లు అర్థమవుతోంది. సూయ..సూయ అనసూయ సాంగ్‌తో బిగ్‌బాస్ ఆమెకు ఘనస్వాగతం పలకగా.. ఇంటి సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో అనసూయను రీసివ్ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే నేటి ఎపిసోడ్లో రంగమ్మత్త అలరించనున్నారు. తుది అంకానికి చేరుకున్న ఈ రియాల్టీ షోకు మరో నాలుగు వారాలే మిగిలిఉంది. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందించేలా టాస్క్‌లు రూపొందిస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్లో హీరో విజయ్ దేవరకొండతో గేమ్‌ను రక్తికట్టించిన విషయం తెలిసిందే.(మరిన్నీ బిగ్‌బాస్ ముచ్చట్లు) చదవండి: దీప్తి ఎలిమినేషన్ ఖాయం! -
బిగ్‌బాస్ : దీప్తి ఎలిమినేషన్ ఖాయం!
బిగ్‌బాస్ షో చివరి అంకానికి రాబోతోంది. ఇక మిగిలింది కొన్ని రోజులే. దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సాగిన బిగ్‌బాస్ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్ అయిన దీప్తీ, పూజ, తనీష్, కౌశల్‌లో మరి తనీష్, కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఎలిమినేషన్ అంటే చాలు తెగ టెన్షన్ పడిపోయి, గాబర పడిపోయే దీప్తి గతవారం ఆ ప్రక్రియలో లేకపోయేసరికి కాస్త ప్రశాంతంగా కనిపించింది. కానీ ఈ సంబరం ఎంతో సేపు లేదు. ఈ వారం మళ్లీ నామినేషన్లోకి వచ్చాక.. తనలో మళ్లీ అదే టెన్షన్. అందరితో కలిసి ఉన్నానని, ఎవరు తనను నామినేట్ చేసుంటారా అని గణేష్‌తో తన గోడును వెల్లిబుచ్చుకుంటుంటే.. కౌశల్ మధ్యలో వచ్చి.. ‘తనను ఎవరు నామినేట్ చేసుంటారో తనకు ఐడియా ఉంద’ని.. నామినేషన్లోకి రావాలంటే మినిమమ్ నాలుగు ఓట్లైనా రావాలని.. మరి ఎవరు వేశారో ఆలోచించుకోండంటూ దీప్తితో చెప్పుకొచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజ రామచంద్రన్ మళ్లీ ఈ సారి కూడా నామినేషన్లోకి వచ్చింది. మరి ఈ సారి ప్రేక్షకులు పూజను సేవ్ చేస్తారో లేదో చూడాలి. లేక బిగ్‌బాస్ ఏదైనా ట్విస్ట్ అని చెప్పి ఇద్దరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా చూసుకుంటే ఈ సారి దీప్తి, పూజలపై వేటు పడే అవకాశమే ఎక్కువ. ఎందుకుంటే కౌశల్ ఎలాగూ సేవ్ అయిపోతాడు అది వేరే విషయం.. తనీష్‌పై సోషల్ మీడియాలో నెగెటివిటి ఉన్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి.. దీప్తి చేసే చేష్టలకు, అతికి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సారి మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. పూజకు మరీ అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి తను కూడా వెళ్లే అవకాశమూ ఉంది. ఈ వారాంతానికి షోలో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో? ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.. ఏదైనా జరుగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్. -
బిగ్‌బాస్ : ఐ లవ్యూ చెప్పిన దీప్తి సునయన
బిగ్‌బాస్ షో అంటే ఏదైనా జరుగొచ్చు. కానీ, ఆ జరిగేదేదో ముందే బయటకు వచ్చేస్తోంది. దీంతో బిగ్‌బాస్ కార్యక్రమానికి పెట్టిన ట్యాగ్‌కు.. ప్రస్తుతం జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోతోంది. గత కొన్ని వారాలుగా ఎలిమినేషన్లో ఎంతో సస్పెన్స్ కొనసాగిద్దామనుకున్న బిగ్‌బాస్ ఆశలు నెరవేరడం లేదు. ఎలిమినేషన్ ఎవరు కానున్నారో ఆదివారం ఉదయానికే తెలిసిపోవడం.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం జరుగుతున్నదే. అయితే నిన్నటి ఎలిమినేషన్ విషయం కూడా ముందే బయటకు రావడం.. దీప్తి సునయనే బయటకు వెళ్లిపోతోందని తెలిసినా.. షో మాత్రం రక్తికట్టించేలా నడిపించారు. ఇన్నాళ్లు హౌస్‌లో ఉన్న దీప్తి సునయనకు ఎటువంటి సీక్రెట్ టాస్క్‌లు ఇవ్వని బిగ్‌బాస్.. నిన్న ఇచ్చిన టాస్క్‌తో షోలో ఫన్ క్రియేట్ అయింది. గీత గోవిందం ప్రమోషన్స్‌లో భాగంగా షోకి అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ ను చూసి దీప్తి సునయన తెగ సంబరపడిపోయింది. తనకు ఇష్టమైన హీరో విజయ్ అని ఐ లవ్యూ అంటూ చెప్పేసింది. దీనికి బదులుగా విజయ్ కూడా ఐ లవ్యూ అనేశాడు. అనంతరం.. విజయ్, నాని కలిసి దీప్తి సునయను సీక్రెట్ టాస్క్ పేరిట బాగానే ఆడుకున్నారు. ఫోన్లో చెప్పినట్టుచెయ్యాలని నాని ఆదేశించాడు. దీప్తి సునయనకు ఓ బ్లూటూత్‌ను ఇచ్చి చెవిలో పెట్టుకుని, కనబడకుండా తన జుట్టుతో కవర్ చేసుకోవాలని చెప్పాడు. వారు బయట నుంచి ఫోన్లో చెప్పినట్టుగా తాను హౌజ్‌లో చేయాలని మధ్యలో కాల్ డిస్ కనెక్ట్ అయితే వెంటనే బాత్రూమ్కు వచ్చి కాల్ కనెక్ట్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇక నాని, విజయ్‌లు ఇద్దరు కలిసి దీప్తి సునయని ఆడుకోవడం మొదలుపెట్టారు. మొదటగా తన అక్క పెళ్లి అని చెప్పి అందరికి లడ్డూలు పంచమని చెప్పారు. తరువాత కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్లినట్టు యాక్ట్ చేయమని చెప్పగా.. ఏదో జరిగిపోయిందని అనుకుని రోల్ రైడా, తనీష్‌లు దీప్తి సునయను హత్తుకుంటుండగా.. బయట నుంచి నాని, విజయ్‌లు చేసే కామెంట్స్ నవ్వును తెప్పించాయి. తనీష్‌ను, రోల్ రైడాను స్విమ్మింగ్ పూల్‌లో తోసేయడానికి దీప్తి సునయను చేసిన పనులు నవ్వును తెప్పిస్తాయి. అయితే తాను సీక్రెట్ టాస్క్‌లు చేస్తున్నట్టుగా ఇంటి సభ్యులు ఇట్టే గ్రహించారు. ఇది తన ఎలిమినేషన్ కోసమని చెప్పగా.. వెంటనే తనీష్ స్విమ్మింగ్ పూల్‌లో దూకేశాడు. ఇక ఇంటి సభ్యులను లడ్డులతో కొడుతూ.. డైనింగ్ టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేయడం, పాట పాడటం, ఇంటి సభ్యులతో పాటలు పాడించడం.. ఇలా సరద సరదాగా సాగిపోయింది. ఇక నిద్రిస్తున్నప్పుడు నీళ్లు పోయడంతో అమిత్ కాస్త సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా టాస్క్‌ను కొనసాగిస్తుండగా.. నాని, విజయ్‌లు అకస్మాత్తుగా హౌస్‌లోని టీవీ స్క్రీన్ మీద కనిపించారు. ఇక ఈ సీక్రెట్ టాస్క్ గురించి హౌస్‌మేట్స్‌కు నాని చెప్పేశాడు. అనంతరం విజయ్, డైరెక్టర్ పరుశురామ్‌లు ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటించారు. వారు వెళ్లిపోయాక ఎలిమినేషన్ ప్రక్రియ షురు అయింది. అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారో ముందే తెలిసిపోయింది కాబట్టి.. ప్రేక్షకులకు అంత ఉత్కంఠభరితంగా ఏం అనిపించకపోవచ్చు. దీప్తి సునయన ఎలిమినేట్ అయిందని వెంటనే హౌస్ నుంచి బయటకు రావాలని నాని ఆదేశించాడు. ఈ ప్రకటనతో తనీష్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. హౌస్మేట్స్ అందరికి వీడ్కోలు చెప్పి బయటకు వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ.. రోజు ఉదయాన్నే పాట మొదలవగానే స్విమ్మింగ్ పూల్‌లో దూకి డ్యాన్స్ చేయాలనే బిగ్‌బాంబ్‌ను తనీష్‌పై వేసింది. ఇక సోమవారం నాటి కార్యక్రమంలో ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మరి ఎవరు నామినేషన్లోకి వెళ్తారో? బిగ్‌బాస్ ఈవారం హౌస్‌మేట్స్‌తో ఎలాంటి ఆటలు ఆడిస్తాడో? చివరగా హౌస్‌లోంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారో చూడాలి. చదవండి.. బిగ్‌బాస్ : దీప్తి సునయన ఔట్ -
బ్యాంకాక్‌లో దేవదాస్
హైదరాబాద్ టు బ్యాంకాక్ మధ్య చెక్కర్లు కొడుతున్నారట హీరో నాని. ఇటు బిగ్‌బాస్ సీజన్ 2 షూటింగ్ కోసం హైదరాబాద్‌లో, ‘దేవదాస్’ సినిమా కోసం బ్యాంకాక్‌లో బిజీ బిజీగా ఉన్నారాయన. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. డాన్ దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్ దాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. శాంతాభాయ్ మెమోరియల్ హస్పిటల్ చుట్టూ కథనం సాగుతుందట. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యేందుకు నటుడు మురళీ శర్మ కూడా బ్యాంకాక్ వెళ్లారు. రీసెంట్గా రిలీజైన ఫస్ట్ లుక్కు విశేష స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
బిగ్‌బాస్‌లో ‘అర్జున్ రెడ్డి’
బిగ్‌బాస్‌లో సెలబ్రెటీలు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్మేట్స్, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ‘వైఫ్ ఆఫ్ రామ్’ ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మి హౌస్‌లోకి ఎంట్రీ చేసిన సందడిని చూశాం. లోక నాయకుడు కమల్ హాసన్ బిగ్‌బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యపరిచాడు. ఈ యూనివర్సల్ హీరోతో కలిసి ఇంటి సభ్యులు చేసిన హంగామాను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. ‘గీత గోవిందం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్‌తో కలిసి బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి వేదిక దొరికినా తన మాటలతో మాయ చేసే అర్జున్ రెడ్డి.. ఇక ఇంటి సభ్యులతో ఎంత హంగామా చేశాడో తెలియాలంటే.. ఆదివారం షో చూడాల్సిందే. విజయ్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. -
బిగ్‌బాస్ : దీప్తి సునయన ఔట్
బిగ్‌బాస్ షో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్లతో ట్రెండ్ అవుతోంది. కంటెస్టెంట్ల అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగేలా షో వార్తల్లో నిలుస్తోంది. ఇక శనివారం నాటి కార్యక్రమం నాని క్లాసులు పీకడం మామూలుగానే ఉన్నా... కంటెస్టెంట్లతో ఆడించిన ర్యాపిడ్ ఫైర్ ఆకట్టుకుంది. ఆదివారం షోకు హీరో విజయ్ దేవరకొండ, డైరక్టర్ పరుశురామ్‌లు గెస్ట్లుగా వచ్చారు. నానితో పాటు విజయ్ దేవరకొండ కూడా దీప్తి సునయనతో ఓ ఆట ఆడుకున్నారు. వారిద్దరీ ఆదేశాల మేరకు సునయన చేసిన సీక్రెట్ టాస్క్ హౌజ్‌లో నవ్వుల వర్షం కురిపించింది. తను చేస్తుంది సీక్రెట్ టాస్క్ అని హౌజ్‌మెట్స్ గుర్తించగలిగారు. తనీశ్ మాత్రం సునయన కోసం స్విమ్మింగ్ ఫూల్లో దూకాడు. తన అక్క ఎంగేజ్మెంట్ పేరుతో టాస్క్‌లో భాగంగా అమిత్‌పై నీళ్లు పోయడం, కౌశల్‌ను బయటకు రా చూసుకుందాం అని అనడం, వాళ్ల అక్క ఎంగేజ్మెంట్ సందర్భంగా హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడటం ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్, పరుశురామ్‌లు హౌజ్మెట్స్తో సంభాషించారు. కంటెస్టెంట్ల కోరిక మేరకు నాని హౌజ్‌లో గీత గోవిందం సాంగ్ ప్లే చేశారు. ఈ సాంగ్‌కు గణేశ్ అభినయం ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్, పరుశురామ్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎలిమినేషన్ రౌండ్లో భాగంగా అందరూ ఊహించినట్టే దీప్తి సునయన ఎలిమినేట్ అవుతున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతకుముందు ఏం జరిగింది... సోమవారం నుంచి శుక్రవారం వరకు కంటెస్టెంట్లు చేసే హంగామాతో నడిచే షో.. వారాంతంలో నాని చేసే సందడితో బాగానే ఆకట్టుకుంటోంది. ఒక్కో కంటెస్టెంట్ ఈ వారం చేసిన పర్ఫామెన్స్పై సమీక్ష జరిపి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేశాడు. మొదటగా తనీష్ గురించి మాట్లాడిన నాని.. తన కెప్టెన్సీపై సంతృప్తి చెందలేదంటూ.. కెప్టెన్ అయి ఉండి స్టోర్ రూమ్‌లో నిద్రపోవడం ఏంటంటూ తనీష్‌ను మందలించాడు. సోమవారం ఎలిమినేషన్లో తనీష్ పోషించిన పాత్ర బాగుందని.. ఆ ఒక్క చోట మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడని చెప్పుకొచ్చాడు. దీప్తి సునయన, శ్యామల ఎలిమినేషన్లో తన నిర్ణయం ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నించాడు. అంటే బిగ్‌బాస్ ఇచ్చిన బాధ్యతను కూడా వదిలేస్తావా? అంటూ తనీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్‌లో సామ్రాట్‌ను సేవ్ చేసి దీప్తి సునయను ఎలిమినేట్ చేస్తానని తనీష్ బదులిచ్చాడు. కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన రోల్ రైడాను అభినందించిన నాని.. తన ఆటను మెచ్చుకున్నాడు. గల్లి సెంటిమెంట్, రాజకీయ నాయకుడంటూ నూతన్ నాయుడిని బోల్తా కొట్టించావంటూ.. నాని పొగిడాడు. గణేష్‌ను ఎలిమినేట్ చేసి దీప్తి సునయను సేవ్ చేయాలని ర్యాపిడ్ ఫైర్‌కు ఆన్సర్ చేశాడు. ఇక రెండు వారాలు ఎలిమినేషన్ గ్యాప్ వచ్చిందని గేమ్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని అమిత్‌ను హెచ్చరించాడు. ఇప్పటికిప్పుడు హౌస్‌లోంచి ఎవరిని బయటకు పంపాలనుకుంటున్నావు? అని ప్రశ్నించగా.. కౌశల్ అని సమాధానం చెప్పాడు. కౌశల్‌ను మందలించిన నాని... హౌస్‌లో ఒంటరిగా ఉంటున్నానని, కార్నర్ చేస్తున్నారని ఇంకా అంటున్నావంటే ఎవరిది తప్పంటూ కౌశల్‌ను మందలించాడు. మనం ఎలా ఉంటే ఇతరులు మనతో అలా ఉంటారు అంటూ కౌశల్‌కు సూచించాడు. స్నేహంగా ఉండాలని మాటల్లో చెబుతున్నావు.. కానీ చేతలు మాత్రం అలా కనిపించడం లేదంటూ ఫైర్ అయ్యాడు. హౌస్‌లో ఏదో ఒక సందర్భంలో ఎవరోకరి గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంటానని, దాంతో వారంతా తనకు వ్యతిరేకంగా మారుతున్నారని కౌశల్ తనను తాను సమర్దించుకున్నాడు. టాస్కులో గణేష్ తన సహనాన్ని పరీక్షించాడని, అతను బాగా ఆడాడని కౌశల్ చెప్పుకొచ్చాడు. గణేష్‌ను ఎలిమినేట్ చేసి దీప్తి సునయనను సేవ్ చేయాలని ర్యాపిడ్ఫైర్కు జవాబిచ్చాడు. ఈ వారం విజృంభించాడని, ఎలిమినేషన్లో లేకపోవడం ఇది రెండో సారి అంటూ.. గణేష్‌ను ఆటపట్టించాడు. కౌశలే తనను మెచ్చుకున్నాడని.. సీరియస్‌గా చెప్పాల్సిన మాటలను సిల్లీగా చెప్పాడని.. ఐ వాంట్ మర్యాద అంటూ నాని వెక్కిరిస్తూ.. నవ్వులు పూయించాడు. సామ్రాట్‌ను సేవ్ చేసి, గీతను ఎలిమినేట్ చేయాలని ర్యాపిడ్ఫైర్కు గణేష్ బదులిచ్చాడు. దీప్తి సునయన టాస్కులో సరిగా ఆడలేదని, కనీసం టాస్క్ రూల్స్ కూడా పాటించలేదని ఫైర్ అయ్యాడు. ఓ వైపు టాస్క్ నడుస్తుంటే నిద్ర పోతుందంటూ మందలించాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్లో ఉన్న రోల్ రైడా, పూజ, దీప్తి సునయన, శ్యామల, గీత, నూతన్ నాయుడులో.. గాయం అయినందున నూతన్ ఎలిమినేషన్ ప్రక్రియను పక్కన పెట్టేశారు. శ్యామల, గీతా మాధురిలు ప్రొటెక్షన్ జోన్లో ఉన్నట్టు నాని ప్రకటించాడు. -
బిగ్‌బాస్ : గాయంతో నూతన్ ఔట్!
ఏదైనా జరుగొచ్చు అంటే ఏంటో శుక్రవారం నాటి బిగ్‌బాస్ కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది. అంతా సరిగానే ఉందనకునే సమయానికి టాస్క్‌లో నూతన్ నాయుడికి గాయం అవడం.. అతన్ని హౌస్ నుంచి బయటకు పంపేస్తున్నట్లు బిగ్‌బాస్ తెలపడం.. హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలేం ఏం జరిగిందో చూద్దాం.. పబ్లిక్ కాలర్స్ వర్సెన్ బిగ్‌బాస్ హౌస్ కాల్ సెంటర్ టాస్క్‌లో బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్లుగా కౌశల్, రోల్ రైడాలను హౌస్మేట్స్ ఎంచుకున్నారు. అనంతరం వీరిద్దరికి కెప్టెన్సీ టాస్క్‌ను వివరించాడు బిగ్‌బాస్. ‘గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు టేబుల్స్‌పై రెడ్, గ్రీన్ బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులతో పిరమిడ్ నిర్మించాలి. ఆ క్రమంలో మిగతా హౌస్మేట్స్ వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బజర్ మోగే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ బాక్సులు, పిరమిడ్ ఆకారంలో పేర్చి కాపాడుకుంటారో వారే విజేతలు. ఈ టాస్కుకు పూజ సంచాలకులుగా వ్యవహరిస్తార’ని టాస్క్‌ను వివరించాడు. ఇక ఈ ఆటలో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయం తెలిసిందే. బజర్ మోగగానే.. కౌశల్ గ్రీన్ బాక్సులున్న టేబుల్‌ను ఎంచుకుని పిరమిడ్‌ను నిర్మిస్తుండగా.. గణేష్, తనీష్, సామ్రాట్, అమిత్‌లు అందరూ కలిసి కౌశల్‌ను చుట్టుముట్టేశారు. ఏకధాటిగా బంతుల వర్షం కౌశల్‌పై కురిపించారు. మరో వైపు రోల్ రైడాను టార్గెట్ చేస్తూ... గీత, దీప్తి, శ్యామల బంతులను గురి పెట్టారు. కానీ, వారి ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న రోల్‌రైడా పిరమిడ్‌ను నిర్మించేసి.. గట్టిగా పట్టుకుని కాపాడుకుంటూ ఉన్నాడు. కౌశల్ పిరమిడ్‌ను నిర్మించడం సంగతేమో కానీ, కనీసం ఆ బాక్సులను కూడా కాపాడుకోలేకపోయాడు. ఇక కౌశల్ మద్దతుదారులైన గీత, శ్యామల, నూతన్‌ల సలహా మేరకు ఆడుతూ.. కిందపడిపోయిన బాక్సులను తీసుకుంటూ.. వాటిని పిరమిడ్‌లా పేర్చుతూ ఉన్నాడు. ఇక రోల్ రైడాను ఏమాత్రం టార్గెట్ చేయని తనీష్, సామ్రాట్, గణేష్, అమిత్‌లు.. కౌశల్‌ను మాత్రం గట్టిగానే రౌండప్ చేశారు. కౌశల్ స్నేహితుడైన నూతన్.. రోల్ రైడా నిర్మించి, కాపాడుకుంటున్న పిరమిడ్‌ను కూల్చే ప్రయత్నం చేశాడు. రోల్ రైడాపై ధాటిగా బంతులతో దాడి చేశాడు. నూతన్ ఈ క్రమంలో పూజతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మళ్లీ రోల్ రైడాను టార్గెట్ చేసి బంతులు విసురుతుండగా.. నూతన్ భుజానికి గాయమైంది. అంతకు ముందే అతని భుజానికి గాయమైందని తెలిపిన నూతన్‌ను.. తనీష్, గణేష్‌లు కన్ఫెషన్ రూమ్‌కు తీసుకెళ్లారు... వైధ్యుల బృందం వచ్చి పరీక్షించసాగారు. ఈ సమయంలో కౌశల్‌కు కొంత సమయం దొరికింది కానీ.. సామ్రాట్, అమిత్‌ల ధాటికి వాటిని కాపాడుకోవడం కష్టమైంది. ఇక టాస్క్ ముగిసే సమయానికి కౌశల్ 69, రోల్ రైడా 76 బాక్సులతో పిరమిడ్‌ను నిర్మించారు. ఈ టాస్క్‌లో రోల్ రైడా విజయం సాధించినట్లు పూజ బిగ్‌బాస్‌కు తెలిపింది. అనంతరం.. కన్ఫెషన్ రూమ్‌లో ఉన్న నూతన్‌కు.. తీవ్రగాయమైనందువల్ల, వైద్యుల సలహా మేరకు తనను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపి వైద్యం అందించాలనుకుంటున్నామని బిగ్‌బాస్ తెలిపాడు. కౌశల్‌ను కన్ఫెషన్ రూమ్‌కు రావాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తనను హౌస్‌లోంచి బయటకు వెళ్లమంటున్నారని నూతన్ కౌశల్‌కు తెలిపాడు. అనంతరం ఇంటి సభ్యులందరికి...నూతన్ భుజానికి తీవ్ర గాయమైనందున నూతన్‌ను హౌస్ నుంచి బయటకు పంపేస్తున్నామని బిగ్‌బాస్ తెలిపాడు. ఒకవైపేమో.. నూతన్‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచారని.. మళ్లీ ఇంటిలోకి వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వారం ఎలిమినేషన్ జాబితాలో ఉన్న నూతన్ నాయుడు, దీప్తి సునయన, రోల్ రైడా, పూజా రామచంద్రన్, శ్యామల, గీతా మాధురి,లో ఎవరు ఎలిమినేట్ కానున్నారో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. దీప్తి సునయన ఎలిమినేట్ కానుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనపై పెరిగిన నెగెటివిటినే ఇందుకు కారణం కావొచ్చని తెలుస్తోంది. మరి ఇంతకి ఎవరు ఎలిమినేట్ కానున్నారో, ఏం జరుగనుందో చూడాలి. ఎందుకంటే ఇది బిగ్‌బాస్.. ఏదైనా జరుగొచ్చు. -
బిగ్‌బాస్‌లో నా అంచనా తప్పింది : బాబు గోగినేని
బిగ్‌బాస్ హౌజ్‌లోంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిన బాబు గోగినేని.. ఆ షోలో జరిగిన సంఘటనలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బయటకొచ్చాక చేసే కామెంట్స్ వివాదాస్పదం అవుతుండటం మామూలే. ఇక గత వారం ఎలిమినేట్ అయిన బాబు గోగినేని బిగ్‌బాస్ హౌజ్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. బిగ్‌బాస్ షోలోకి ఎందుకు వెళ్లారని కొందరు అడుగుతున్నారని.. తనకు నచ్చడం వల్లే షోలోకి వెళ్లానని చెప్పుకొచ్చారు. చివరి వరకు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరు ఉంటారో కూడా అంచనా వేశారు. బిగ్‌బాస్ ఒక పిచ్చివాళ్ల స్వర్గమని అందరూ అంటున్నారని .. అందులో ఉండటం అదో రకమైన అనుభవమంటూ చెప్పుకొచ్చారు. షోలో మొదట్నుంచీ కౌశల్‌తో విబేధించే బాబు.. అతను ఫైనల్ లిస్ట్‌లో ఉండే అవకాశముందని చెప్పుకొచ్చారు. కౌశల్‌కు ఇంటా, బయటా సపోర్ట్ ఉందని.. అతను గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని.. అభిప్రాయపడ్డారు. అయితే మొదటగా తేజస్వీ గెలుస్తుందని అంచనా వేశానని.. కానీ తాను ఎలిమినేట్ అయి వెళ్లిపోయిందని చెప్పారు. దాంతో తన అంచనా తప్పిందని తెలిపారు. కౌశల్ నచ్చలేదు కాబట్టి తనను వ్యతిరేకించానని, అంతేకాని టార్గెట్ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత విషయాలను, ఎప్పుడో బయట జరిగిన విషయాలను బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రస్తావించడం.. కరెక్ట్ కాదంటూ అందుకే అలా చేశానని చెప్పుకొచ్చారు. ఈ వారం బిగ్‌బాస్ షో ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. హౌజ్‌మేట్స్ పబ్లిక్ కాలర్స్, బిగ్ బాస్ హౌజ్ కాల్‌సెంటర్‌గా విడిపోయి చేస్తున్న టాస్క్‌కు విశేష స్పందన వస్తోంది. ఇక ఈ వారం దీప్తి సునయనకు ఎలిమినేషన్ తప్పేట్టు లేదనిపిస్తోంది. చదవండి.. బిగ్‌బాస్ : సునయన ఎలిమినేషన్ తప్పదా? -
బిగ్‌బాస్ : సునయన ఎలిమినేషన్ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-2 మరింత రసవత్తరంగా మారింది. గతవారం కాస్త చప్పగా సాగిన ఈ రియాల్టీ షో మళ్లీ వేడెక్కింది. బాగ్‌బాస్ సూపర్ టాస్క్‌తో గేమ్‌ను రక్తికట్టించాడు. భావోద్వేగాలతో సాగే ఈ గేమ్‌ను ఆ దిశగా నడిపించాడు. ఇంటి సభ్యుల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను బయటకు తీశాడు. ఇలా మంగళవారం ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులను రెండు జట్లుగా వీడదీసిన బిగ్‌బాస్.. టెలికాలర్స్ Vs పబ్లిక్ కాలర్స్ అనే టాస్క్‌ను ఇచ్చాడు. బిగ్‌బాస్ టెలికాలర్స్ జట్టులో కౌశల్, సామ్రాట్, నూతన నాయుడు, అమిత్, శ్యామల, దీప్తిలు ఉండగా.. గీతా మాధురి, తనీశ్, దీప్తీ సునయన, గణేశ్, రోల్‌రైడా, పూజా రాంచంద్రన్‌లు పబ్లిక్ కాలర్స్‌గా వ్యవహరించారు. బిగ్‌బాస్ టెలికాలర్స్‌ను విసుగెత్తించి కాల్ కట్ చేసేలే చేస్తే పబ్లిక్ కాలర్స్‌కు ఓ పాయింట్ లభిస్తోంది. దీనికోసం వారు ఏదైనా మాట్లడొచ్చు. ముగ్గురు టెలికాలర్స్ షిఫ్ట్ బజర్ మోగేంత వరకు ఏమైనా అక్కడి నుంచి లేవకూడదు. ఈ బజర్ మోగేలోపు పబ్లిక్ కాలర్స్ షిప్ట్‌లో ఉన్న ముగ్గురికి కాల్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ కౌశలే టార్గెట్.. ఈ టాస్క్‌లో ఎప్పటిలానే మళ్లీ కౌశలే టార్గెట్ అయ్యాడు. ఇంటి సభ్యులు మరోసారి సూటి పోటి మాటలతో దాడి చేశారు. ఎంత పర్సనల్‌గా దాడి చేసినా కౌశల్ మాత్రం అదే రితీలో బదులిచ్చాడు. ఇప్పటి వరకు కొంత స్నేహంగా ఉన్న గీతా-కౌశల్‌ల మధ్య ఉన్న మనస్పర్థలు ఈ టాస్క్ ద్వారా బయటపడ్డాయి. తొలుత కాల్ చేసిన గీతా మాధురి ఈ వారం నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. అతన్ని విసిగించసాగింది. అబద్దాలు ఆడుతున్నావని, గేమ్ కోసం ఏమైనా చేస్తావా? అని ఘాటుగా ప్రశ్నించింది. ఇక టాస్క్‌కు ముందు కొంత ఎమోషన్ అయిన గీతా ఇంటి సభ్యుల అందరి దగ్గరకు వచ్చి టాస్క్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసింది. తీరా ఆమె కౌశల్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తనీశ్ Vs శ్యామల సెకండ్ కాల్ చేసిన తనీశ్ సైతం శ్యామలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె రీఎంట్రీని సహించని అతను పలుసంధర్భాల్లో ఆవిషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిదే. గత టాస్క్‌లో దీప్తి సునయన వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశాడు. ఎలిమినేషన్‌కు గురించి ఆమెకు ఆగ్రహం తెప్పించేలా ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె ఓపికగా సమాధానం చెప్పింది. దీంతో తనీష్ ఏం చేయలేక ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత రోల్‌రైడా సేఫ్‌గా స్మార్ట్ గేమ్ ఆడాడు. ఎవరిని మాటలతో నొప్పించకూడదనుకున్న రైడా.. సామ్రాట్‌కు కాల్ చేసి కౌశలా? అని అడిగాడు. దానికి రైడా ఫోన్ పెట్టేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి సామ్రాట్‌ను బోల్తా కొట్టించాడు. ఇది గ్రహించని సామ్రాట్ ఫోన్ పెట్టేసి పప్పులో కాలేసాడు. దీంతో పబ్లిక్ కాలర్స్‌కు ఓ పాయింట్ లభించింది. కౌశల్.. జనాలు తూ.. దీప్తి సునయన సైతం మళ్లీ కౌశల్‌కే కాల్ చేసింది. షో ఆరంభం నుంచే అతనంటే గిట్టని సునయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. కౌశల్ ఫోన్ ఎత్తగానే అసభ్య పదజాలంతో మొదలు పెట్టింది. దీనికి స్టన్ అయిన కౌశల్ తేరుకోని అదే రీతిలో బదులిచ్చాడు. ఒక దశలో వీరి సంభాషణ హద్దులు దాటింది. ముఖ్యంగా సునయన కౌశల్‌ను కించపరిచేలా మాట్లాడుతూ అతని సహనాన్ని పరీక్షించింది. ‘అసలు నువ్వు హౌస్‌లోకి ఎందుకొచ్చావ్.. షోను 24 గంటలు జనాలు చూస్తే తూ అంటారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె మాటలకు దగ్గట్టే జవాబిచ్చాడు. పాటలు పాడమని, స్టోరీలు చెప్పమని విసగించడంతో కౌశల్ అటాకింగ్ గేమ్ ఆడాడు. ఓ దశలో హద్దులు దాటి ప్రవర్తించాడు. బయటి వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ ఆమె మాటల దాడికి కౌంటర్ ఇచ్చాడు. స్టోరీలు చెప్పమంటే హౌస్‌లో ఆమె ప్రేమాయణం చెప్పాడు. పాట పాడమంటే ఆమెకు సంబంధించే పాడాడు. దీంతో సునయన కన్నీటి పర్యంతమైంది. దాదాపు కొన్ని గంటల పాటు సునయన విసిగించింది. కనీసం వాష్ రూం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టీం సభ్యుల సాయంతో కౌశల్ అక్కడే కానిచ్చాడు. ఇక గణేశ్ కూడా కౌశల్‌నే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సునయనపై ట్రోలింగ్.. సునయన మాటలు, కౌశల్‌తో వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ ఆమెను టార్గెట్ చేసింది. దాదాపు బిగ్‌బాస్ హౌస్‌ను తమ ఆదీనంలో తీసుకున్న కౌశల్ ఆర్మీ.. ప్రతివారం ఒకరిని టార్గెట్ చేస్తూ బయటకు పంపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కౌశల్ పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరీటీ, భానుశ్రీ, తేజస్వీ, బాబుగోగినేనిలు బయటకు వెళ్లేలా చేశారు. ఇన్ని రోజులు నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్న దీప్తి సునయన ఈ వారం నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎన్నో రోజులుగా చూస్తున్న వారు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఈ సారి సునయన నిష్క్రమణ దారితీయనున్నాయా? అంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే అది బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు! చదవండి: అసలు ఎలిమినేషన్ మజా ఈ వారమే! -
బిగ్‌బాస్ : అసలు మజా ఈ వారమే!
బిగ్‌బాస్ అంటేనే ఏదైనా జరుగొచ్చు. అది హౌజ్‌మేట్స్ పిచ్చితనం వల్ల కావచ్చు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల వల్ల కావచ్చు. ఎందుకంటే సోమవారం కార్యక్రమంలో ఏదో అనుకుంటే ఇంకెదో జరిగింది. కెప్టెన్ అయినందుకు తనీష్, కమల్ హాసన్ ఇచ్చిన స్పెషల్ పవర్ దృష్ట్యా అమిత్ ఈసారి కూడా ఎలిమినేషన్ పక్రియలో చోటు లేదు. మిగతా ఇంటి సభ్యులందరిని ఇద్దరి చొప్పున ఓ జట్టు కట్టారు. ‘వారిలోంచి ఒకరు సేవ్ అవుతారు. మరొకరు డేంజర్‌జోన్‌లోకి వెళ్లి ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతారు. అయితే ఇందులో ఎవరి కారణాలు వారు విన్నవించుకోవచ్చు. ఆ కారణాలను పరిగణలోకి తీసుకుని తనీష్, అమిత్‌లు ఎవరిని సేవ్ చేయాలో, ఎవరిని డేంజర్ జోన్లో ఉంచాలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదీ ఈ వారం నామినేషన్ ప్రక్రియ’ అంటూ బిగ్‌బాస్ తెలిపాడు. అయితే బిగ్‌బాస్ ఇచ్చింది ఒకటి. అక్కడ జరిగిందొకటి. ఎలిమినేషన్‌లోంచి సేవ్ అయి బయటకు వచ్చిన వారు కూడా తనీష్, అమిత్‌లతో పాటుగా నిర్ణయం తీసుకున్నారు. సరే అదంతా వదిలేద్దాం.. వారంతా ఏం చేసినా అంతిమ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. సేవ్ అయి బయటకు వచ్చిన వారు, డేంజర్ జోన్లోకి వెళ్లి నామినేట్ అయిన వారి కథ ఓ సారి చూద్దాం. బిగ్‌బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న ఐదు డేంజర్ ప్లేసుల్లో ఐదు జంటలు నిలబడ్డాయి. సామ్రాట్-పూజ, గీతామాధురి-కౌశల్, నూతన్ నాయుడు-దీప్తి, శ్యామల-దీప్తి సునయన, రోల్ రైడా-గణేష్‌లు ఐదు జంటలుగా నిలబడ్డారు. మొదటి బెల్ మోగగానే సామ్రాట్, పూజలు వచ్చి వారు హౌజ్‌లో ఎందుకు ఉండాలనే కారణాలను చెప్పుకొచ్చారు. మొదట్నుంచీ నెగెటివ్‌గా ఉంటూ ఈ మధ్యే కొంచెం మారుతు.. పాజిటివ్ వైపు వస్తున్నానని, నా మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఇంకాస్త సమయం కావాలంటూ.. సామ్రాట్ తన కారణాలను వెల్లడించాడు. నేను వచ్చింది మధ్యలోనే ఇంకాస్త సమయం కావాలి అందరిని అర్థం చేసుకోవడానికి,అందరితో కలిసిపోవడానికి అంటూ పూజ చెప్పుకొచ్చింది. ఇక తనీష్, అమిత్‌లు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి.. పడుతూ, లేస్తూ.. ఎత్తు పల్లాలు చూసి .. ఇప్పుడిప్పుడే తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడని.. సామ్రాట్‌ను సేవ్ చేసి పూజను డేంజర్ జోన్లోకి పంపాడు. ఇక బయటకు వచ్చిన సామ్రాట్ వారిద్దరు కలిసి తీసుకునే నిర్ణయాల్లో తలదూర్చాడు. రెండో జంటగా.. కౌశల్, గీతా మాధురిలు వచ్చారు. తాను హౌజ్‌లో మొదటునుంచీ, ఒంటరి పోరాటం చేస్తున్నానని, బిగ్‌బాస్ ఇచ్చే ఏ టాస్క్లోనైనా.. మానసికంగా, శారీరకంగా తన వంతు కృషి చేస్తున్నాని, ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని కౌశల్ తన కారణాలను తెలిపాడు. హౌజ్‌లో తాను ఉండటం వల్ల ఎవరికి ఇబ్బంది కలగదని, ప్రశాంత వాతావరణం ఉంటుందని, అందరితో కలిసి బాగుంటాను కాబట్టి నేను ఇంట్లో ఉండాలనుకుంటున్నాని గీత తన కారణాలను తెలిపింది. తనీష్, సామ్రాట్, అమిత్‌లు చర్చించుకుని.. గత వారం ఎలిమినేషన్ తనను డిస్సాప్పాయింట్ చేసిందని గీత అన్నారని.. హౌజ్‌లో ఇక ముందు టాస్క్‌లు అలానే ఉంటాయని తనీష్ చెప్పి.. కౌశల్‌ను సేవ్ చేశాడు. గతంలో తన కోసం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడని.. ఇప్పుడు గణేష్ కోసం రోల్ రైడా తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానని చెప్పి గణేష్‌ను సేవ్ చేశాడు. ఇక నూతన్ నాయుడు, దీప్తిలది మరో విచిత్రం. దీప్తి తాను హౌజ్‌లో ఉండడానికి గల కారణాలను తనేదో తన భాషలో చెప్పుకొచ్చింది. ఇక నూతన్ నాయుడు మాత్రం మిత్ర ధర్మం అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. కానీ, తాను ఉండటానికి గల కారణాలను చెప్పలేకపోయాడు. ఇక అంతిమ నిర్ణయం తీసుకోవడానికి అమిత్, తనీష్, సామ్రాట్ , కౌశల్‌లు చర్చించుకుని.. గత కొన్ని వారాలుగా టాస్కుల్లో బాగా చేస్తుందని, ఎంతో కష్టపడుతోందని దీప్తిని సేవ్ చేశారు. ఇక శ్యామల, దీప్తి సునయనలది మరో గాథ. తాను మొదట్నుంచీ అందరితో బాగున్నాని, మొదటి వారంలో కెప్టెన్ లేకపోయినా అందరి బాగోగులు చూసుకున్నానని, తానుంటే ఎవరికి ఇబ్బంది ఉండదని, అందరిని ఎంటర్టైన్ చేస్తుంటానని శ్యామల తన కారణాలను చెప్పుకొచ్చింది. మొదట్లో గేమ్‌ను సీరియస్‌గా తీసుకోలేదనీ, ఇప్పుడిప్పుడే బాగా ఆడుతున్నానని, హౌజ్‌లో ఉంటే ఇంక ఎంతో నేర్చుకుంటానని తన కారణాలను వివరించింది. అయితే ఈ అంతిమ నిర్ణయంలో.. తనీష్ రాకుండా.. అమిత్, సామ్రాట్, కౌశల్‌ను ముందుకు పంపాడు. తాను కూడా ఉంటే నిర్ణయం వేరే లాగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక్కడే తనెంత బలహీనుడో తెలిసేలా చేశాడు. ఈ నిర్ణయంలో కూడా పాల్గొని ఇద్దరి కారణాలను, వారి ప్రతిభను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటే.. ప్రేక్షకుల దృష్టిలో ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యేవాడు. కానీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. దీప్తి సునయన హౌజ్‌లో ఉండేందుకు గల కారణాలను చెబుతుండగా.. కౌశల్ మధ్యలో కలగజేసుకుని శ్యామల కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నావా? అని అడిగితే.. కాదని ఒప్పుకుంది. అయితే వీరిద్దరిలో ఎవరిని సేవ్ చేయాలని అమిత్, కౌశల్, సామ్రాట్లు చర్చించుకుని.. తనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని ఒప్పుకోవడం వల్ల.. అందరం ఓ ఏకాభిప్రాయానికి వచ్చి.. శ్యామలను సేవ్ చేయాలనుకుంటున్నామని కౌశల్ తెలిపాడు. అయితే ఇలా ఐదు గురు డేంజర్ జోన్లోకి వెళ్లాక.. కెప్టెన్ అయిన కారణంగా స్పెషల్ పవర్‌తో.. ఇప్పటిదాకా సేవ్ అయిన కంటెస్టెంట్లోంచి ఒకరిని నామినేట్ చేయాలని తనీష్‌పై పిడుగును పడేశాడు బిగ్‌బాస్. ఇక్కడైనా తను సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తే... సేవ్ అయిన ఐదుగురిలో వీక్ కంటెస్టెంట్ ఎవరా? అని ఆలోచించకుండా.. అరవై మూడు రోజులు మాతో కలిసి ఆ నలుగురు ప్రయాణించారు.. శ్యామల వెళ్లిపోయి మధ్యలో వచ్చింది.. తనను నామినేట్ చేస్తున్నానని బిగ్‌బాస్‌కు తెలిపాడు. గీతా మాధురి, శ్యామల, నూతన్ నాయుడు, రోల్ రైడా, పూజా రామచంద్రన్, దీప్తి సునయనలు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు మజా మొదలైంది. బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన గీత ఎలాగూ ఎలిమినేట్ కాదని మెజారిటీ అభిప్రాయం. ఇటీవలె శ్యామల, నూతన్ నాయుడు ఇద్దరు గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. కాబట్టి వీరు కూడా వెళ్లే అవకాశం లేదనే చెప్పవచ్చు. పూజ వచ్చికొద్ది రోజులే అయినా... మంచి పేరే తెచ్చుకుంది. తనకు చాలానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక మిగిలిన వారిలో దీప్తి కంటే రోల్ రైడా కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా.. సోషల్ మీడియాలో దీప్తి సునయన హవానే ఉంటోంది. మరి వీరందరిలోంచి ఎవరు వెళ్తారో చూడాలి. ఆట మొదలైంది ఇప్పుడే కాబట్టి ఏదీ చెప్పలేం... ఈ వారం టాస్క్‌లు ఏముంటాయో.. వాటిని ఎలా నెట్టుకొస్తారో... చూద్దాం.. బిగ్‌బాస్ అంటే.. ఏదైనా జరుగొచ్చుగా! చదవండి... బిగ్‌బాస్: బాబు గోగినేని ఔట్ -
బిగ్‌బాస్: బాబు గోగినేని ఔట్
అందరూ అనుకున్నదే జరిగింది.. బిగ్‌బాస్ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బాబుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు కౌశల్ ఆర్మీ ఉండనే ఉంది. అసలే కౌశల్‌కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.. కౌశల్ ఫాలోవర్స్‌కు బాబుపై వ్యతిరేకత చూపించారు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు వెళ్లాలి? అని డిసైడ్ చేసే కౌశల్ ఆర్మీ ఈ సారి బాబును బయటకు పంపేసింది. హౌజ్‌లో అందరితో కలిసి ఉన్నట్లు కనిపించే బాబు.. కౌశల్ విషయం వచ్చేసరికి మాత్రం అమాంతం ఎగిరిపడేవారు. కౌశల్‌తో ఢీ అంటే ఢీ అనేవారు. ఇక ఈ వారం జరిగిన షోలో మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు రగిలింది. అమ్మాయిలకు రావాల్సిన డబ్బును దొంగలించాడని కౌశల్‌ను దొంగ అంటూ నిందించారు. గత వారాలన్నింటిలో కౌశల్‌ను టార్గెట్ చేసిన బాబు గోగినేని .. ఒకానొక దశలో కౌశల్ అయినా ఉండాలి నేనైనా ఉండాలి అంటూ ఆవేశపూరితంగా చెప్పుకొచ్చాడు. ఒక వేళ తాను వెళితే .. కౌశల్‌ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ విషయంలో బిగ్‌బాస్ హోస్ట్ నాని మందలిస్తూ.. ఎవరు ఎవరిని బయటకు పంపలేరని, అది ప్రేక్షకుల చేతిలో ఉందంటూ.. బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారమే బాబు హౌజ్ నుంచి బయటకు వెళతారని పలువురు భావించారు. అయితే గతవారం నందిని రాయ్ బయటకు వెళ్లడంతో బాబు గోగినేని ఎలిమినేట్ కావడానికి వారం మాత్రమే ఆలస్యమైంది. ఇక ఎలిమినేషన్ విషయాన్ని పక్కనపెడితే.. ఆదివారం షో ఆద్యంతం వినోదభరితంగా జరిగింది. హౌజ్ మేట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టిన నాని.. వారితో సరదాగా ఆట ఆడించాడు. మధ్యలో నాని కూడా వాళ్లతో కలిసి ఆడాడు. వారి ముందు ఓ రెండు చీటిల డబ్బాను పెట్టారు. ఒక గ్రూపులోని సభ్యుడి వచ్చి దాంట్లోంచి ఒక్కో డబ్బాల్లోంచి ఒక్కో చీటి తీసి అందులో ఉన్న దాన్ని.. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై బొమ్మను గీసి వారి మిగతా సభ్యులతో ఆ చీటిలో వచ్చిందేమిటో చెప్పించాలి. ఇక ఆట పేరు బొమ్మను గీస్తే.. అంటూ నాని ఆటను మొదలుపెట్టారు. ఈ ఆటలో హౌజ్‌మేట్స్ తమ చిత్రకళను ప్రదర్శించారు. ఒక్కొక్కరు సంబంధం లేని చిత్రాలను గీసి ప్రేక్షకులను నవ్వించారు. వారికి వచ్చిన సామెతలకు, సినిమా పేర్లకు వారు గీసిన బొమ్మలకు పొంతన లేకపోయినా.. మిగతా సభ్యులు అతి కష్టం మీద వాటిని గుర్తించారు. ఈ క్రమంలో హౌజ్ అంతా నవ్వులు పూశాయి. కౌశల్‌కు గంగోత్రి అనే చీటి రాగా.. దానికోసం ఏదో ఒక మనిషి బొమ్మ గీసి... నీటి అలలను గీస్తే.. వాటితో అన్ని నదుల పేర్లు చెప్పుకుంటూ వచ్చి.. చివరకు గంగోత్రి వద్ద ఆగారు. ఇక అమిత్‌కు తెలుగు సరిగా చదవడం రాకపోయే సరికి.. తనకు వచ్చిన చీటికి, గీసిన బొమ్మకు సంబంధం లేకుండాపోయింది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు.. అని వస్తే.. చూసి రమ్మంటే కలిసి వచ్చాడు అని పొరపడి తనకు ఇష్టం వచ్చినట్లుగా బొమ్మను గీసేసరికి.. మిగతా సభ్యులు అదెంటో కనిపెట్టలేకపోయారు. ఇక దీప్తి సునయనకు వచ్చిన కాకి పిల్ల కాకికి ముద్దు, ఆవిడా మా ఆవిడే.. లాంటి వాటికి దీప్తి సునయన గీసిన బొమ్మలకు సంబంధం లేకపోయినా.. వాటిని ఎలాగోలా కష్టపడి చెప్పేశారు. ఆవిడా మా ఆవిడే.. అనే దానికి నాని హెల్ప్‌ను కూడా ఆశ్రయించింది. నాని చెప్పిన క్లూతో కాకుండా ఏవో బొమ్మలు వేయగా.. శ్యామల మాత్రమే సరైన సమాధానాన్ని చెప్పగా.. హౌజ్‌మేట్స్‌తో పాటు నాని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఆస్కార్ ఇవ్వాలంటూ శ్యామలను ఆటపట్టించాడు. బొమ్మరిల్లు, ఇల్లు అలకగానే పండుగ కాదు, మాంగళ్య బలం ఇలా ఇంటరెస్టింగ్‌గా వచ్చిన చీటిలతో హౌజ్‌మేట్స్ చేసిన సందడితో హౌజ్‌తో పాటు ప్రేక్షకులకు కావల్సినంత మజా వచ్చేసింది. ఇక నాని గీసిన హౌజ్‌మేట్స్ బొమ్మలను మాత్రం వారు ఇట్టే గుర్తు పట్టేశారు. పొడుగ్గా బొమ్మను గీయగానే.. అది సామ్రాట్ అని చెప్పేశారు. బట్టతలను గుర్తుగా గీయగా అది అమిత్ అని, స్టైల్‌గా షేవ్ చేసుకున్న బొమ్మను కౌశల్ అని, వెరైటీ హెయిర్‌స్టైల్‌తో గీయగా అది రోల్‌రైడా అని ఇలా ఒక్కొక్కరిని వారి ప్రత్యేకతలను హైలెట్ చేస్తూ నాని బొమ్మలు గీయడంతో సరదాగా సాగిపోయింది. ఇలా సరదాగా సాగుతున్న సమయంలో ఎలిమినేషన్‌ను గుర్తు చేశాడు నాని. ఇక హౌజ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కానీ ప్రేక్షకుల్లో మాత్రం అంత ఆసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలిమినేట్ కాబోతున్నది ఎవరో ముందే లీకైపోయింది. ఎప్పటిలాగే ఎలిమినేషన్ కాబోతున్నది ఎవరనేది ముందే బయటకు రావడం ఆనవాయితీగా మారింది. అయినా సరే.. బాబు గోగినేని ఏ మాట్లాడాడు.. ఈ సారి బిగ్‌బాంబ్ ఏంటి? అది ఎవరి మీద వేసి ఉంటాడు? అనేవి కొంత ఆసక్తికరంగా మారాయి. బయటకు వచ్చిన బాబు గోగినేని.. తనకు బిగ్‌బాస్ హౌజ్‌లోకి రావడం గొప్ప అనుభూతి అని.. ఈ ఇంట్లో సరదాగా ఉన్నాను, అల్లరి చేశాను, కోపడ్డాను, నేర్చుకున్నాను... నా కంటే వయసులో చిన్నవాళ్లతో ఇన్ని రోజులు ఇలా గడపడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ హౌజ్‌మేట్స్‌తో మాట్లాడే అవకాశం నాని ఇవ్వగా.. బయటక రండి ఇక్కడ ప్రోమోలను చాలా బాగా వేశారు. తొందరగా వచ్చి మీరు కూడా మీ ప్రోమోలను చూసుకోండి అని సరదాగా అనడంతో హౌజ్‌లోని వారంతా నవ్వుకున్నారు. ఈ వారం అంతా బాత్రూమ్స్ను శుభ్రంగా ఉంచాలనే బిగ్‌బాంబ్‌ను.. సామ్రాట్ పేరు చెబుతూ.. తనకు వద్దులే ఎలాగూ బాగానే చేస్తాడు కాబట్టి.. రోల్‌రైడాకు ఇచ్చేద్దామంటూ.. అతనిపై బిగ్‌బాంబ్ వేశాడు. వారం మొత్తం గుర్తురాని రోల్.. బిగ్‌బాంబ్ అనే సరికి మాత్రం గుర్తొస్తున్నాడంటూ నాని అనగానే హౌజ్‌లో నవ్వులు పూశాయి. ఇక పదో వారం హౌజ్‌లో ఏ జరుగుతుందో వేచి చూడాలి. ఎదైనా జరుగొచ్చు.. ఎందుకంటే బాస్.. ఇది బిగ్‌బాస్! చదవండి... బిగ్‌బాస్: తనీష్ నువ్వెలా బెస్ట్ ప్లేయర్? -
బిగ్‌బాస్: ప్రపోజ్ చేసిన కంటెస్టెంట్!
చెన్నై: తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లానే తమిళ బిగ్‌బాస్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ సామ్రాట్-తేజస్వీ, తనీష్-దీప్తి సునయనల బంధం స్నేహమా లేక అంతకు మించా అనే విషయం అర్థం కాలేదు. వాళ్లేమో స్నేహమే అంతకు మించి ఏమిలేదని చెబుతున్నారు. కానీ వారి ప్రవర్తన అలా అనిపించడం లేదు. ఇక తమిళ బిగ్‌బాస్‌లో యషికా-మెహతాల మధ్య బంధం మాత్రం ఈ రెండు జోడిలను మించింది. శుక్రవారం ఎపిసోడ్లో హౌస్‌కు అతిథులుగా వచ్చిన తొలి సీజన్ కంటెస్టెంట్స్ హరీష్ కల్యాణ్, రైజా విల్సన్‌లు వారి బంధంపై ఓ క్లారిటీ తీసుకొచ్చారు. వారి డెబ్యూ చిత్రం ‘ప్యార్ ప్రేమా కాదల్’ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ఈ మాజీ కంటెస్టెంట్స్ హౌస్‌మేట్స్‌ను యషికా-మెహతాల బంధం స్నేహానికి మించి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా అని ప్రశ్నించారు. దీనికి కంటెస్టెంట్స్ అంతా అంగీకరించగా.. మెహతా మాత్రం తప్పుబట్టాడు. దీంతో ఒక్కసారిగా యషికా గుండె బద్దలైంది. ఆరోజంతా ఆమె ఏడుస్తూ బాధపడింది. ఇక ఈ వ్యవహారంపై హోస్ట్ కమల్ హాసన్ శనివారం ఆరాతీశాడు. తొలుత మెహతాను ప్రశ్నించగా.. తనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని, తాను ఇప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నానని తెలిపాడు. ఆమె బయట నాకోసం వేచిచూస్తోందని ఆమెను బాధపెట్టే పని తను చేయనని సమాధానమిచ్చాడు. ఇక 19 ఏళ్ల యషిక మాట్లాడుతూ.. 50 రోజులుగా కలిసి ఉండటంతో అతని ప్రేమలో పడిపోయానని, కానీ అతని పరిస్థితి అర్థం చేసుకున్నానని తెలిపింది. అతని పరిస్థితిని గౌరవిస్తానని, కానీ తన వైఖరిని మాత్రం మార్చుకోలేనని పేర్కొంది. ఆమె నిజాయితికి కమల్ మురిసిపోయి ప్రశంసించాడు. ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని సూచించాడు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక గత సీజన్లో ఓవియా సైతం ఇలానే ప్రేమ వ్యవహారాలతో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్: తనీష్ నువ్వెలా బెస్ట్ ప్లేయర్?
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్-1 కన్నా హౌజ్ మేట్స్ గొడవలు, సోషల్ మీడియా ట్రోల్స్‌తో ఈ సీజన్ వేడెక్కింది. శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన పరిణామాలపై ఆరాతీశాడు. ఈ సందర్భంగా ఇంటిసభ్యుల ప్రవర్తనపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశాడు. చెప్పిందే చెప్పి తనకే బోర్ వస్తుందని, హౌస్ మేట్స్ మాత్రం మారడం లేదన్నాడు. కాస్త సీరియస్‌గానే సాగిన ఈ ఎపిసోడ్లో ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరికింది. రజనీకాంత్ ‘నరసింహా’ సినిమా స్టోరీని పిట్టకథగా చెబుతూ షోను ప్రారంభించిన న్యాచురల్ స్టార్.. డబ్బు ఏమైనా చేస్తుందని, దానితో జాగ్రత్త ఉండాలని, హౌస్‌లో కూడా ఇదే నిరూపితమైందని తెలిపాడు. శుక్రవారం హౌస్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర ఘటనలను నాని చూపించాడు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌తో నెలకొన్న బంధం గురించి సరదాగా ముచ్చటించారు. ఇక కౌశల్ కొందరి ఇంటిసభ్యులను ఇమిటేట్ చేస్తుండగా నూతన్ నాయుడు వారి పేర్లు చెప్పాడు. నామినేషన్లో ఉన్న కారణంగా ఇంటి సభ్యులతో ముచ్చటిస్తూ.. తన దగ్గరకు వచ్చిన దీప్తిపై నూతన్ నాయుడు ఫైర్ అయ్యాడు. (చదవండి: బిగ్‌బాస్-2.. అదే అసలు సమస్య!) తనీష్‌కు క్లాస్... తొలుత నామినేషన్లో ఉన్న ఒక్కక్కరితో నాని ముచ్చటించారు. ముఖ్యంగా తనీష్‌కు గట్టిగానే క్లాస్ పీకాడు. టాస్క్‌లో దీప్తి సునయన కోసం తప్పుకోవడం ఏమిటని మందలించాడు. దీనికి తనీష్ కాలునొప్పితో అలా చేశానని, సునయన కోసం కాదని ఎదో సాకు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నాని కన్విన్స్ కాలేదు. ఇక ఏ టాస్క్‌లో పాల్గొని నువ్వు బెస్ట్ ప్లేయర్ ఎలా అయ్యావని ప్రశ్నించాడు. కబడ్డీ టాస్క్, క్రైయింగ్ టాస్క్, బాక్స్ టాస్క్‌ల్లో పాల్గొనలేదు మరీ ఎలా బెస్ట్ పర్ఫార్మర్ అయ్యావు అని నిలదీశాడు. ఈ ప్రశ్నకు తనీష్, అతని మద్దతుదారులకు దిమ్మతిరిగింది. సమాధానం చెప్పడంలో తనీష్ తడబడ్డాడు. ఇక కౌశల్ కాయిన్స్ తీసుకెళ్లడం వ్యతిరేకించిన తనీష్ పూజా విసిరిన కాయిన్స్ ఎలా తీసుకుంటావని ప్రశ్నించాడు. ఎదో ఒకవైపు ఉండాలి అని మందలించాడు. గణేష్ మళ్లీ హౌస్‌లో కనబడటం లేదని, సమోసాలు, వర్షం అంటూ ఎదో చెప్పాడు. అయినా వేడివేడి వర్షం ఏంటీరా నాయనా అని ప్రశ్నించాడు. దీంతో నవ్వులు పూసాయి. బాబు డబుల్ గేమ్.. బాబుగోగినేని నుంచి ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని, ప్రతీసారి ఇదే చెబుతున్నాని, కానీ తను మాత్రం లైట్ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక కాయిన్స్ టాస్క్‌లో కౌశల్ కాయిన్స్ ఎత్తుకెళ్లడాన్ని మహిళా కంటెస్టెంట్స్ వద్ద తప్పుబట్టడం, మళ్లీ కౌశల్ వద్ద సమర్ధించడం ఎంటని ప్రశ్నించాడు. దీనికి బాబు తనదైన సమాధానంతో నాని ట్రాప్‌లో పడే ప్రయత్నం చేశాడు. కానీ నాని వీడియో క్లిప్ ప్లే చేసి బాబు డబుల్ గేమ్‌ను బయటపెట్టాడు. దీనికి బాబుగోగినేని సైతం తన తప్పును అంగీకరించాడు. ఎలాగోలా బతికే చేపలు.. హౌస్‌లో అమిత్, రోల్‌రైడాలు ఎలాగోలా బతికే చేపలని నాని కామెంట్ చేశాడు. వీరు మంచితనం అనే ముసుగులో గేమ్ ఆడుతున్నారని, ఇంకా అది పనిచేయదని సూచించాడు. అమిత్ డబుల్ గేమ్‌ను సైతం వీడియో క్లిప్‌తో బట్టబయలు చేశాడు. కౌశల్‌తో కాయిన్స్ తీయడాన్ని సమర్ధించడం.. మళ్లీ ఆ విషయమే తనే తీయాలని రోల్రైడాతో చర్చించడం.. చివర్లో ఎవరికి చెప్పావని కౌశల్‌ను ప్రశ్నించడం ఏమిటని నాని నిలదీశాడు. ఏదో ఒకనిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నాడు. ఆ విషయంలో నచ్చావ్ కౌశల్.. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా దీప్తి సునయన సంచాలకులుగా వ్యవహిరంచడం ఏమిటని నాని ప్రశ్నించాడు. తనీష్‌కు క్లోజ్‌గా ఉండే తను న్యాయంగా ఉన్నా అలా అనిపించడం లేదన్నాడు. దీనికి సునయన ఎప్పుడు చేయలేదు కదా అని చేశా.. నిజాయితీగానే చెప్పా అని సమాధానమిచ్చింది. దీనికి ఎలిమినేష్న్ ఎప్పుడు కాలేదు కదా అని అయితావా ఏంటీ అని పంచ్ ఇచ్చాడు. ఇదే ఎవరి గొయ్యి వారు తవ్వుకోవడం అని బదులిచ్చాడు. ఈ టాస్క్ వ్యవహారంలో కౌశల్ ఓ స్టాండ్ తీసుకోని తన అభిప్రాయాన్ని వెల్లడించడం నచ్చిందని నాని మెచ్చుకున్నాడు. అయితే ఆ టాస్క్‌లో నేనైతే ఇలా చేశావాడినని, తోసేవాడినని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. దానికి నేనైతే ఇలా ఆడేవాడినని మాత్రమే చెప్పానని కౌశల్ బదులిచ్చాడు. ఇక కాయిన్స్ టాస్క్ మొత్తం మార్చేశావని, అయితే ఆ పని మీ జట్టు సభ్యులకు చెప్పి చేస్తే బాగుండేదని నాని అభిప్రాయపడ్డాడు. ఇక సామ్రాట్ బాగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. గీతాగారు మీరు ఇన్ఫ్లూయెన్స్.. గత వారం నుంచి ఓ ఇంటి సభ్యుడితో ఓ లక్కీ అభిమాని ఫోన్ మాట్లాడే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా వరంగల్ నుంచి గీతామాధురి అభిమాని మాట్లాడారారు. ముందుగా నాని న్యాచురల్‌గా హోస్ట్ చేస్తున్నాడని కితాబిచ్చి.. గీతా మాధురితో మాట్లాడారు. ‘ తొలి రోజుల్లోని మీ ప్రవర్తనకు ఇప్పటికి తేడా వచ్చిందని, మీరు దీప్తి, శ్యామల మాటలకు ప్రభావం అవుతున్నారని ప్రశ్నించారు. మీరు మీలానే ఉండాలని సూచించారు’. దీనికి గీతా సైతం అలానే ఉండటానికి ప్రయత్నిస్తానని సమాధానిమచ్చింది. చివర్లో కౌశల్ నాని టాస్క్‌ల్లో హౌజ్ మేట్స్ నిజాయితీగా బెస్ట్ పర్ఫార్మర్ పేరు చెప్పడం లేదన్నాడు. దీనికి వారు నిజాయితీగా లేకుంటే ప్రేక్షకులున్నారు. నీకు ప్రేక్షకులు కావాలా కంటెస్టెంట్స్ కావాలా అని ప్రశ్నించాడు. దీనికి కౌశల్ ప్రేక్షకులేనని సమాధానమిచ్చాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న గీతా మాధురి, శ్యామల ప్రొటెక్ట్ అయ్యారని నాని తెలిపాడు. మిగిలిన తనీష్, బాబుగోగినేని, గణేష్, దీప్తిల్లో ఎవరూ ప్రొటెక్ట్ అవుతారు? ఎవరూ ఎలిమినేట్ అవుతారో తెలియాంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. -
సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు?
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ తేజస్వి స్నేహసామ్రాజ్ఞిలా ఉన్నారు. హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా ఆ సామ్రాట్‌ని– ఈ సామ్రాజ్ఞినీకలిపి చూడటం మానడం లేదు టీవీ వీక్షకులు!అసలు తేజస్వి–సామ్రాట్ల మధ్య ఉన్నది జస్ట్.. క్లోజ్ ఫ్రెండ్షిప్పా? అంతకన్నా ఎక్కువేనా?!ఎలిమినేట్ అయినవారిని మర్చిపోతాం. తేజస్వి మాత్రం ‘ఎలివేట్’ అయ్యారు!! ఎందుకు? చదవండి. తేజస్వితో సాక్షి ఇంటర్వ్యూ. ‘‘నేనసలు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కే వెళ్లాల్సి ఉండింది. కుదరలేదు. తర్వాత ‘మా’ అవార్డ్స్ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ –2 కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అలా సెకండ్ సీజన్లో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యాను. నాతో పాటు ఇంకెవరెవరు హౌజ్‌లోకి వస్తున్నారో అప్పటికి హాడ్ నో ఐడియా ఎబౌట్ దట్. వెళ్లాకే తెలిసింది ఎవరెవరెవరు ఉన్నారో! ఏడ్చేశాను నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నకు ఆల్కహాల్ ప్రాబ్లమ్. దాంతో పదిహేడేళ్లకే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేశా. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. పదేళ్ల నుంచి ఒంటరిగా ఉండటం వల్లేమో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలా నడుచుకోవాలో తెలీలేదు. చుట్టూ కెమెరాలున్నాయి అనే ధ్యాస లేకుండా నా స్వభావానికి తగ్గట్టే బిహేవ్ చేశాను. హౌజ్‌లోకి ఎంటర్ అవగానే అందరితో కలిసిపోయా. కాని అదే తప్పని తర్వాత తెలిసింది. నాకు కన్నింగ్‌గా ఉండటం రాదు. టీవీలో అందరూ చూస్తుంటారు అన్న స్పృహ లేకుండా పక్కనున్న మనిషి గురించి హౌజ్‌లో కొంతమంది ఏదిపడితే అది మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చేది. దాంతో అరిచేశా. ఒకసారి నానీ నన్ను తిట్టాడు.. చాలా బాధనిపించిఏడ్చాను కూడా. ఫోన్ వెదుక్కున్నా.. ఫోన్, టీవీ, ఫ్రెండ్స్ .. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా.. లిమిటెడ్ సోర్సెస్‌తో.. పగలు, రాత్రి తేడా తెలియకుండా.. సగం ఆకలి, సగం నిద్రతో హౌజ్‌లో గడపడం.. యు కాంట్ ఇమాజిన్. అయినా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఏం జరిగినా వెంటనే ఫోన్ చేసి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం అలవాటు కదా. ఆ అలవాటుతోనే ఫస్ట్ టూ డేస్ ఫోన్ కోసం చాలా వెదుక్కున్నా. తర్వాత గుర్తుచేసుకుంటే నవ్వొచ్చేది. అప్పటిదాకా మా ఇంట్లో నేను చేయని పనులన్నీ హౌజ్‌లో చేశాను. బట్టలు ఉతికాను. వంట చేశాను. నా వంటలను అందరూ మెచ్చుకున్నారు. తెలుగులో పొలైట్‌గా ఎలా మాట్లాడాలో హౌజ్‌లోనే తెలుసుకున్నా. ప్రాబ్లం వస్తే అందరూ కలిసి ఎలా సాల్వ్ చేసుకోవాలి? పదిమందితో ఎలా సర్దుకుపోవాలి? ఎక్కడ తగ్గాలి? ఎక్కడ నెగ్గాలి? పట్టూవిడుపులు అన్నీ నేర్చుకున్నా. సామ్రాట్.. ట్రోలింగ్.. నిజానికి సామ్రాట్ నాకు ఎనిమిదేళ్ల కిందటే పరిచయం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా. అంత క్లోజ్ కాదు అప్పుడు. అసలు సామ్రాట్‌కి పెళ్లి అయిందని, అది ప్రాబ్లమ్‌లో ఉందని హౌజ్‌లో అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది. సామ్రాట్ చాలా జోవియల్‌గా ఉంటాడు.ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. దాంతో అతనితో కనెక్ట్ అయ్యా. క్లోజ్ ఫ్రెండ్‌గా మారాడు. అంతమాత్రాన నన్ను ట్రోల్ చేయడమేనా? మైగాడ్ నా క్యారెక్ట్నే అసాసినేట్ చేసేలా బూతులు..! ఒక అమ్మాయి.. ఒక అబ్బాయితో ఎమోషనల్‌గా అటాచ్ కావడం తప్పా? అది కంప్లీట్ పర్సనల్ థింగ్! నేను ఎవరితో మాట్లాడాలి? నా ఫ్రెండ్స్లిస్ట్లో ఎవరుండాలి? ఎవరితో ఎంత మేరకు స్నేహం చేయాలి.. ట్రోలర్స్ డిసైడ్ చేస్తారా? నా పర్సనల్ స్పేస్ నాకు ఉండదా? హౌజ్‌లో ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు. బయటకు వచ్చాక తెలిసింది. ట్రోలింగ్స్ చాలా ఫ్రస్టేట్ అయ్యా. కుంగిపోయా. అయితే నన్ను ఎంకరేజ్ చేస్తూ కూడా అంతకన్నా ఎక్కువ పోస్టింగ్స్వచ్చాయి. ‘‘తేజా.. నువ్వు లేని బిగ్ బాస్ చూడాలనిపించట్లేదు. నువ్వు మా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తావ్.. బ్లెస్ యూ.. వుయ్ లవ్ యూ’’అంటూ చాలా కాంప్లిమెంట్స్.. యూకే, యూఎస్ నుంచి. ఇక్కడి వాళ్లూ చాలామంది మోరల్‌గా సపోర్ట్ చేస్తూ మెస్సేజెస్ పెట్టారు. వాటితోనే తేరుకున్నా. ట్రోలింగ్స్‌ను పట్టించుకోవడం మానేశా. ఇప్పుడు.. నేనే ధైర్యం చెప్పే స్థితిలో ఉన్నా. కొంతమందైతే సామ్రాట్‌తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక మనిషితో ఉన్న క్లోజ్‌నెస్‌ను పెళ్లితో ముడిపెడతారా? వండర్! సామ్రాట్ నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటికీ. డౌటే లేదు. హౌజ్ మేట్స్ తనీష్, బాబుగోగినేని గారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. లైఫ్ పట్ల బాబుగోగినేని గారికి ఎలాంటి అభిప్రాయాలున్నాయో నాకూ అలాంటివే ఉన్నాయి. నేను ఆయనకు అభిమానినైపోయా. తనీష్‌కు కోపం ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చేసుకున్నాడు. వాళ్లమ్మ చాలా టెన్షన్ పడ్తుంటే నేను చెప్తున్నా.. డోంట్ వర్రీ ఆంటీ అని. బాబుగోగినేని గారిలాగే వాళ్లావిడ కూడా చాలా స్మార్ట్ (నవ్వుతూ) ఆవిడ, వాళ్ల బాబు చాలా కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. హౌజ్‌లో ఉన్న వాళ్లందరికీ కెమెరా ముందు ఎలా ఉండాలో తెలిసిపోయింది. అందుకే అందరూ యాక్షన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఎదిగిన ఫీలింగ్ బిగ్ బాస్ హౌజ్‌లో చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మళ్లీ వెళ్లే అవకాశం వస్తే వెళ్తా. ఈ ఎక్స్‌పీరియెన్స్‌తో హౌజ్‌లో బాగా ఓవరాక్షన్ చేస్తా. నా విషయంలో నా ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. నేనేంటో వాళ్లకు తెలుసు. ‘‘ షోలో గెలిచొస్తావని పంపిస్తే..ఇలా వచ్చేశావ్’’ అని ఆటపట్టిస్తుంటారు. బేసిగ్గా నేను కొంచెం లౌడ్‌గా ఉంటా. ఒంటరిపోరాటమే కాబట్టి..అలా అలవాటైంది. పైగా మేల్‌డామినేటెడ్ సొసైటీ.. మేల్‌డామినేటెడ్ ఫీల్డ్.. లౌడ్‌గా లేకపోతే అంతే సంగతి. మొదటి నుంచే స్ట్రాంగే.. బిగ్ బాస్ హౌజ్, ట్రోలింగ్స్ లాంటి అనుభవాలు నన్ను ఇంకా స్ట్రాంగ్ చేశాయి. ఎదిగిన ఫీలింగ్. ఇది కరెక్ట్ .. ఇది రాంగ్ అని నాకు ఎవరూ చెప్పలేదు. సిట్యుయేషన్సే అన్నీ నేర్పాయి. కాబట్టి అవే నాకు పేరెంట్స్. ఫ్రెండ్సే నాకు అన్నీ. డాన్స్ అండ్ వర్క్‌తో నా లోన్లీనెస్‌ను ఓవర్‌కమ్ చేసుకుంటా. నా వెంట నిలిచిన వాళ్లందరికీ థ్యాంక్స్. ఫ్యూచర్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వస్తే అన్నీ చేశాను. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్.. ఇంకా అలాంటి చానల్స్‌కు ట్రావెల్ షో చేయాలనే థింకింగ్ ప్రాసెస్లోఉన్నా. తమిళ్, తెలుగు సినిమా చాన్సెసూ కొన్ని ఉన్నాయి. కథలు వింటున్నా’’ అని తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకున్నారు తేజస్వి.. బిగ్‌బాస్ స్టార్. చూపిస్తున్నది కొన్నే హౌజ్‌లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. 24 గంటలూ కెమెరాల ముందే కదా.. అంతా టెలికాస్ట్ అవుతుందేమో అనుకుంటాం. కాని కావట్లేదు. నా విషయమే తీసుకుంటే.. నేను అరిచినవి మాత్రమే చూపించారు. దానికిముందు కౌశల్ చేసినవి చూపించలేదు. కౌశల్ చేసిన వాటికి కోపమొచ్చి నేనలా అరిచా. అదే హైలైట్ అయింది. సామ్రాట్ విషయంలోనూ అంతే. ముందూవెనకా చూపించకుండా.. జనాలు దేనికి ఎంటర్టైన్ అవుతారో దాన్నే చూపిస్తున్నారు. ఈవెన్ ప్రోమోస్ కూడా అంతే. దీని వల్లే చాలామంది స్క్రిప్టెడ్ షో అనుకుంటున్నారు. టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని ఎడిట్ చేస్తున్నారు. 45 నిమిషాల ఎడిటెడ్ వెర్షన్లో అదే నిజమనుకుంటే ఎలా? దానికి ముందు ఏం జరిగిందో.. ఎవరు దేనికి.. ఎందుకు అలా రెస్పాండ్ అవుతున్నారో చూపించకుండా కేవలం రెస్పాన్సెస్నే చూపిస్తున్నారు. న్యాయంగా అనిపించట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలేవీ హౌజ్‌లో ఉన్నవాళ్లకు తెలియవు. బయటకు వస్తే కాని అర్థంకాదు జరుగుతున్నదేంటో! – శరాది -
బిగ్‌బాస్-2.. అదే అసలు సమస్య!
బిగ్‌బాస్... విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ రియాల్టీ షో మన దగ్గర తొలుత బాలీవుడ్లో బాగా క్లిక్ అయ్యింది. ఆ ప్రేరణతో మిగతా భాషల్లోనూ ఈ షోలను తెరకెక్కిస్తుండగా.. అక్కడ కూడా మంచి రేటింగ్‌లనే రాబడుతున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులోనూ బిగ్‌బాస్-1 కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే అంచనాలకు అందని పేరున్న ఈ షో.. సెకండ్ సీజన్లో మాత్రం అందుకు అతీతంగానే సాగుతోంది. అందుకు ప్రధాన కారణం లీకేజీలు. (తేజస్వీ సంచలన వ్యాఖ్యలు) తొలి సీజన్ పుణే(మహారాష్ట్ర)లో ప్రత్యేకమైన సెట్ వేసి, బయటి టెక్నీషియన్లతో నిర్వహించటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. కానీ, బిగ్‌బాస్-2ని మాత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి కానిచ్చేస్తున్నారు. ఇదే అసలు తలనొప్పిగా మారింది. సాధారణంగా షోకి సంబంధించిన ఎపిసోడ్లను ఒకరోజు ముందుగానే చిత్రీకరిస్తుంటారు. దీంతో షో కోసం పని చేస్తున్న సిబ్బందికి ఏం జరుగుతుందన్న సమాచారం ముందే తెలిసిపోతుంది. కనుక తమకు కావాల్సిన వారికి ఆ సమాచారాన్ని ముందుగానే చేరవేస్తున్నారు. ఈ దశలో తమకు తెలిసినంత మేర సమాచారాన్ని పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. లీక్‌లు చేసేది సిబ్బంది అని తెలిసి కూడా ఏం చేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండిపోయారు. దీనికితోడు కంటెస్టెంట్లు కూడా బయటకు వచ్చేసిన క్రమంలో అత్యుత్సాహంతో వెనువెంటనే తమ సమాచారాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసేసుకుంటున్నారు. వెరసి సమాచారం మొత్తం షో టెలికాస్టింగ్ కంటే కాస్త ముందే మీడియాకి, జనాల్లోకీ చేరిపోతోంది. ఈ పరిణామాలతో ఉత్కంఠంగా సాగాల్సిన ఈ దఫా సీజన్.. ఎలాంటి మసాలా లేకుండా చప్పగా సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
బిగ్‌బాస్ : అనుకున్నదే నిజమైంది.. నందిని ఔట్!
అనూహ్య పరిణామాలతో బిగ్‌బాస్ అలా దూసుకెళ్తోంది. 50 రోజులు దాటిన ఈ కార్యక్రమం జనాల్లోకి బాగానే ఎక్కేసింది. సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల ఫ్యాన్స్ రచ్చ మరీ పెరిగిపోతోంది. చివరకు బిగ్‌బాస్ షో మొత్తం వన్ సైడ్గేమ్లా వచ్చేట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఉండే కౌశల్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్‌కు సపోర్ట్‌గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అయ్యాయి. వీరంతా కలిసి గేమ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. వీరు ఆడిందే ఆటా పాడిందే పాట అనే స్థాయికి వచ్చేశారు. ఇదివరకే ఈ విషయం ఎన్నో సార్లు బహిర్గతం అయింది. కిరీటీ, భాను, తేజస్వీలను ఎలిమినేట్ అయ్యేలా చేసింది వీరే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి హడావిడే కనిపిస్తోంది. గత రెండు వారాల ఎపిసోడ్స్‌లో చాలానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాబు గోగినేని, గీతా మాధురి, కౌశల్, నందిని, దీప్తి వీరందరి మధ్య జరిగిన గొడవలతో ప్రేక్షకులకు కావలిసినంత మజా దొరికేసింది. ఈ గొడవలపై గత వారం నాని వీరికి క్లాస్ కూడా పీకేశాడు. ఇదంతా గతం. కానీ శనివారం నాటి ఎపిసోడ్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. హౌజ్‌మేట్స్‌లో ప్రత్యేకంగా ఉండే కౌశల్.. నిన్న నాని చేతికి అడ్డంగా దొరికిపోయాడు. టాస్క్‌లో భాగంగా కౌశల్, నందిని మధ్య జరిగిన సంభాషణను మళ్లీ ప్లే చేశాడు. దీంతో కౌశల్ తెల్లబోయాడు. అప్పటి వరకు తనకు తాను సమర్దించుకుంటూ చెప్పిన మాటలకు.. వీడియోలో చూపించిన దానికి భిన్నంగా ఉండటంతో కౌశల్ మాటమార్చేశాడు. ఇలా కౌశల్ అడ్డంగా దొరికేసరికి.. నాని కాస్త మందలించాడు. తనకు బయట చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని, చాలా సపోర్ట్ చేస్తున్నారని, అలా గేమ్ ప్లే చేసి.. ఫ్లిప్ అవుతూ ఉంటే.. బయట ఫ్యాన్స్ కూడా ఫ్లిఫ్ అవుతారంటూ కౌశల్‌ను హెచ్చరించాడు. కౌశల్ నిజాలే మాట్లాడుతాడని, ధైర్యంగా ఏదైనా చెప్పగలడని, తన వ్యక్తిత్వానికి సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే షో దశాదిశను నిర్ణయించేది కౌశల్ ఫాలోవర్సే అనేంత వరకు వచ్చింది. ఎలిమినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్లను తిరిగి ఇంటిలోకి పంపించే అవకాశం వస్తే.. యాక్టివ్‌గా ఉండే తేజస్వీ, ఎందరినో ఆకట్టుకున్న భాను శ్రీలు కాకుండా రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడును ఇంటిలోకి తిరిగి పంపారు. ఎందుకంటే భాను, తేజస్వీలు తరుచూ గొడవ పడుతుంటారు. కౌశల్ అంటేనే గిట్టదన్నట్టుగా వ్యవహరించేవారు. దీంతో కౌశల్ ఫాలోవర్స్.. ఆయనతో సన్నిహితంగా ఉండే నూతన్ నాయుడిని ఇంట్లోకి పంపించారు. ఎలాంటి ఫాలోయింగ్ లేని నూతన్ ఎలా రీఎంట్రీ ఇచ్చాడని ఇంటి సభ్యులు కూడా మాట్లాడుకోవడం మనం చూశాం. కానీ వారికి తెలీదు కదా.. బయట ఒక ఆర్మీ ఉందని. సో.. ఇక ఆదివారం ఉదయం నుంచే నందిని ఎలిమినేట్ కాబోతోంది అని ప్రచారం సాగింది. ఈ మధ్య నందిని డబుల్ గేమ్‌ప్లే చేస్తోందని, కావాలనే కౌశల్‌ను టార్గెట్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివిటీ ఎక్కువైంది. తనీష్‌తో క్లోజ్ అవడం.. వారిద్దరు కలిసి చేసే ఎక్సాట్రాలు.. నాని కూడా ఈ విషయంపై తరచూ అడగడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో నందినిపై పెరుగుతోన్న నెగెటివిటీ కూడా ఎలిమినేషన్‌కు కారణమైంది. ఎలిమినేట్ అయిన నందినికి.. హౌజ్‌లోని ఓ ఇద్దరితో మాట్లాడడానికి నాని అవకాశమిచ్చాడు. గీతా మాధురి, దీప్తిలతో తను మాట్లాడిన అనంతరం.. బిగ్ బాంబ్ వేయాల్సిన సమయం వచ్చిందంటూ.. గార్డెన్ ఏరియాలో రాబోయే వారంపాటు ఓ మసాజ్ పార్లర్ ఉంటుందని.. హౌజ్ మేట్స్ అందరికీ హెడ్ మసాజ్ చేస్తూ.. ఇంట్లో ఉండే సమస్యల గురించి మాట్లాడలని ఇదే ఈ వారం బిగ్‌బాంబ్ అంటూ నాని పేల్చేశాడు. ఇక ఈ బిగ్‌బాంబ్‌ను రోల్ రైడాపై నందిని వేసింది. సోమవారం జరిగే షోలో.. ఎలిమినేషన్ ప్రక్రియ షురూ అయింది. మరి తొమ్మిదో వారం బిగ్‌బాస్ కార్యక్రమంలో ఏం జరుగనుందో.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.. చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు! ఎందుకంటే...ఇది బిగ్‌బాస్. -
బిగ్‌బాస్ : అమిత్‌కు బంపర్ ఆఫర్!
లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చేసరికి హౌజ్‌మేట్స్ సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్లు అయింది. ఈ యూనివర్సల్ హీరో తమ ముందు దర్శనమిచ్చేసరికి ఇంటి సభ్యులు తమ ఇష్టాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు. అందరూ కాళ్ల మీద పడి నమస్కరించారు. వారందరిని కమల్ హాసన్ ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. కొంతమంది హౌజ్‌మేట్స్‌కు అది కలో నిజమో గుర్తించలేనంత ఆశ్యర్యానికి లోనయ్యారు. విశ్వరూపం2 ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చానని, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చానంటూ కమల్ హాసన్ హౌజ్‌మేట్స్‌కు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో ప్లే చేయించారు. అనంతరం సినిమాకు పనిచేసిన మరికొంతమందిని కూడా హౌజ్‌లోకి విచ్చేశారు. హీరోయిన్ పూజా కూడా వచ్చారు. ఇంటి సభ్యులందరికి కమల్ హాసన్ విశ్వరూపం2 టీషర్ట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. తన టీమ్ సభ్యులైన మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, సినిమాటోగ్రఫర్ దత్, హీరోయిన్ పూజలను పరిచయం చేశారు. అమిత్ తనకిష్టమైన ట్యూన్‌ను కమల్‌కు వినిపించాడు. రోల్‌రైడా తన స్టైల్లో ర్యాప్ పాడి హోరెత్తించాడు. గీతా మాధురి కూడా కమల్ హిట్ సాంగ్‌ను పాడి వినిపించారు. కౌశల్ కోరిక మేరకు.. భారతీయుడు సినిమాలోని ‘అదిరేటి డ్రేస్సు’ సాంగ్‌ను ఇంటి సభ్యులు ఆలపిస్తుండగా.. తనదైన శైలీలో కమల్ హాసన్ నడుస్తూ ఇంటి సభ్యులను ఆనందపరిచారు. బిగ్‌బాస్ ప్రోగ్రామ్ గురించి కమల్ వ్యాఖ్యానిస్తూ.. కొంతమంది ఈ ప్రొగ్రామ్‌పై విమర్శలు చేస్తున్నారంటూ.. బయట జరిగేదే ఇక్కడ కూడా జరుగుతుందని.. ఇందులో తప్పేం లేదంటూ.. మరికొన్ని విషయాలను ఇంటి సభ్యులతో పంచుకున్నారు. అమిత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కమల్ బిగ్‌బాస్ హౌజ్‌మేట్స్ అందరిలోంచి ఒక్కరికి మాత్రం.. ఓ రెండు వారాలు ఎలిమినేషన్ కాకుండా ఉంటే పవర్‌ను ఇస్తానని కమల్ హాసన్ చెప్పారు. బాగా ఫేమస్, కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్‌కు మాత్రం ఆ చాన్స్ ఇవ్వనని, ఎవరైతే కొంచెం వెనుకబడి ఉన్నారో వారికే ఇస్తానని చెప్పుకొచ్చారు. తన నిర్ణయం సరైనది కావచ్చు కాకపోవచ్చు అంటూ.. ఆ చాన్స్‌ను అమిత్‌కు ఇచ్చేశారు కమల్. దీంతో అమిత్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ చాన్స్‌తో అమిత్ ఓ రెండు వారాలు సేఫ్ అయ్యాడు. ఇలా శుక్రవారం కార్యక్రమం కమల్ హాసన్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌజ్ అంతా కోలాహలంగా మారింది. -
జూనియర్ హోస్ట్‌తో సీనియర్ హోస్ట్
సాక్షి, హైదరాబాద్ : న్యాచురల్ స్టార్, బిగ్‌బాస్ సీజన్ 2 హోస్ట్ నాని తన అభిమాన హీరోను కలిసాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘ఓ అభిమాని తన అభిమాన హీరోను కలుసుకున్నాడు.. జూనియర్ హోస్ట్.. సీనియర్ హోస్ట్‌ను కలిసాడు. అవును ఇది జరిగింది’ అనే క్యాప్షన్‌తో కమల్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. విశ్వరూపం 2 ప్రమోషన్స్‌లో భాగంగా కమల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా హోస్ట్ నాని తన అభిమాన హీరోను కలిసాడు. ఎన్నో ఇంటర్వ్యూల్లో తన అభిమాన హీరో అని చెప్పుకున్న నాని.. తను హోస్ట్ చేసే షోకు అతిథిగా రావడంతో పులికించిపోయాడు. నిజానికి నాని శని, ఆదివారాల్లోని కనిపిస్తాడు. కానీ లోకనాయకుడి కోసం నాని ప్రత్యేకంగా బిగ్‌బాస్ సెట్‌కు హాజరయినట్లు తెలుస్తోంది. ప్రోమోలో సైతం లోకనాయకుడు.. భారతీయుడు హౌస్‌లోకి వస్తున్నాడని ఇంటి సభ్యులకు తెలియజేశాడు. ఇక తమిళ బిగ్‌బాస్‌కు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. Fan meets his Favourite actor . Junior Host meets senior Host . Yes ... This happened :)) pic.twitter.com/p5I6SF7tRf — Nani (@NameisNani) August 3, 2018 -
బిగ్‌బాస్ హౌస్‌లో లోకనాయకుడు!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. గురువారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులు రచ్ఛరంభోలా చేశారు. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా జరిగిన డీజే టాస్క్‌లో చిందేసారు. అత్యంత ఆహ్లాదకరంగా.. ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్‌లో ఇది ఓ బెస్ట్ ఎపిసోడ్‌గా చెప్పొచ్చు. హౌస్‌లోకి నూతన నాయుడు, శ్యామల సైతం రీఎంట్రీ ఇచ్చారు. వీరి రాకతో హౌస్ మేట్స్ రెట్టించిన ఉత్సాహం ప్రదర్శించారు. కెప్టెన్ పోటీదారులైన పూజా రామచంద్రన్, సామ్రాట్, రోల్‌రైడాలు డీజేలుగా వ్యవహరించగా.. వారికి మద్దతుగా ఇంటి సభ్యులు వారి ముందు డ్యాన్స్ చేశారు. సరిసమానంగా సామ్రాట్, పూజా డీజేల మందు ఇంటి సభ్యులు డ్యాన్స్ చేయగా టై అయింది. మళ్లీ బిగ్‌బాస్ మరో సాంగ్ ప్లే చేయడంతో మేజారిటీ సభ్యులు పూజాకు మద్దతివ్వడంతో ఆమె తదుపరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి సభ్యులు చిందేశారు. ముఖ్యంగా దీప్తి సునయన, శ్యామల, గీతా మాధురి, గణేశ్‌లు అదరగొట్టారు.. ఆఖరికి బాబుగోగినేని సైతం డ్యాన్స్ చేశాడు. ఇక ఎపిసోడ్ చివర్లో హౌస్‌లోకి లోక నాయకుడు.. భారతీయుడు వస్తున్నాడని హోస్ట్ నాని హౌస్ మేట్స్‌కు తెలియజేస్తున్న ఓ ప్రోమోను చూపించారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన ఇంటి సభ్యులు తమ అభిమాన హీరోను చూసి పులకించిపోయారు. కాళ్ల మీద పడుతూ తమ అభిమానం చాటుకుంటూ ఘనస్వాగతం పలికారు. అయితే ఇది ఈ ఎపిసోడ్లో ప్రసారం కానుంది. ఇక విశ్వరూపం 2 ఆడియో రిలీజ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన కమలహాసన్.. ఆ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఈ లోకనాయకుడు బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమిళ బిగ్‌బాస్‌కు కమలహాసన్ హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ హోస్ట్‌గా.. అగ్ర హీరోగా కమల్ ఇంటిసభ్యులతో ఎలా గడుపుతారో చూడాలి మరి! చదవండి: నేషనలిజానికి అర్థం నాకు తెలుసు: కమల్ -
బిగ్‌బాస్: మళ్లీ కౌశల్ Vs నందినీ
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన రియాల్టీ షో. హౌస్‌లో గత వారం జరిగిన పరిణామాలతో ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే వారి ఆసక్తిని అందుకోవడంలో బిగ్‌బాస్ టీం దారుణంగా విఫలమవుతోంది. ఎన్నో అంచనాలతో టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకు నిరాశే మిగులుతోంది. మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా నిరాశజనకంగా సాగింది. ఒక టాస్క్‌ను రెండు సార్లు చేయించడం బిగ్‌బాస్ వైఫల్యానికి నిదర్శనం. హౌస్ మేట్స్‌కు పైరేట్స్ Vs సర్వైవర్స్ .. అనే ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించిన బిగ్‌బాస్ ఒక జట్టు సర్వైవర్స్‌గా.. మరో జట్టు పైరేట్స్‌గా వ్యవహరించాలని సూచించాడు. సర్వైవర్స్ గార్డెన్లో ఏర్పాటు చేసిన చెక్కబల్లలపై ఉండాలని, వారిని పైరేట్స్ కిందికి దింపాలని ఆదేశించాడు. సర్వైవర్స్ ఒక్కసారి బల్లను ఎక్కితే ఏ అవసరానికి దిగవద్దని తెలిపాడు. ఇలా ఇరుజట్లు తమ రోల్స్ మార్చుకోవాలని, ఏ జట్టు తక్కువ సమయంలో దింపుతారో ఆ జట్టు ఈ టాస్క్ విజేత అని పేర్కొన్నాడు. అయితే తొలుత సర్వైర్స్గా గీతామాధురి, దీప్తి సునయన, రోల్‌రైడా, పూజా రామచంద్రన్, దీప్తి, సామ్రాట్లుండగా.. పైరేట్స్‌గా కౌశల్, నందనీ, తనీష్, బాబుగోగినేని, గణేశ్, అమిత్లున్నారు. తొలుత పైరేట్స్ ఆమాంతం చెక్కబల్లలను ఎత్తి సర్వైర్స్‌ను కిందికి దింపేశారు. ఈ సమయంలో నందినీ, కౌశల్.. దీప్తి బల్లను ఎత్తే ప్రయత్నంలో ఆమె కాలు నలిగిపోయింది.. ఆ బాధను తట్టుకోలేక దీప్తి ఏడ్చేసింది. దీంతో కౌశల్-నందినీల మధ్య గొడవ జరిగింది. నీవల్లనే అంటే నీవల్లే అనే ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ బల్లలను ఎత్తి వేయవద్దని, టాస్క్ మళ్లీ కొనసాగించాలని తనీష్‌కు సూచించాడు. మళ్లీ ప్రారంభమైన టాస్క్ తాళ్లతో, ఆయిల్స్ సాయంతో సర్వైర్స్‌ను పైరేట్స్ దింపేశారు. ఈ టాస్క్‌లో పూజా రామచంద్రన్ ఆకట్టుకుంది. పైరేట్స్ సహనానికే పరీక్షగా నిలిచింది. ఎదోలా తాళ్ల సాయంతో ఆమెను కష్టంగా దించేశారు. అయితే ఈ టాస్క్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. చాలా బోరింగ్‌గా ఉందని ఇవేమి టాస్క్‌లంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌పై మండి పడుతున్నారు. కౌశల్‌పై టిష్యూ.. టాస్క్ పూర్తి అయిన అనంతరం దీప్తికి మరోసారి క్షమాపణలు చెప్పింది నందినీ. అంతా నీవల్లే జరిగిందంటూ.. పక్కనే ఉన్న కౌశల్‌ను నిందిస్తూ టిష్యూ పేపర్ విసిరేసింది. దీనికి కౌశల్ గట్టిగానే బదులిచ్చాడు. ‘నేను నీలా చేస్తే తట్టుకోలేవని’ వార్నింగ్ ఇచ్చాడు. అయితే జోవియల్‌గా చేసిన పని అని బాధపెట్టాలని కాదని నందినీ చెప్పింది.దీంతో ఆ గొడవ అక్కడితో ముగిసింది. అయితే నందినీ ఈ పని జోవియల్‌గా చేసినట్లు అనిపించలేదు. గతంలో కూడా వీరి మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. బెస్ట్ ఫొటో తనీష్.. రీక్రియేషన్ టాస్క్‌లో కంటెస్టెంట్స్ ఫొటోలను బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌కు మరోసారి చూపించాడు. ఈ టాస్క్‌లో తనీష్‌ది బెస్ట్ పిక్‌గా ఎంపికచేసి కేకును పంపించాడు. కంటెస్టెంట్స్ అంతా సరదాగా నవ్వుకుంటూ కేకును ఆస్వాదించారు. ఇక టాస్క్‌లో రోల్స్ మార్చుకోనున్న కంటెస్టెంట్స్.. తమ వ్యూహాలను అప్పుడే మొదలు పెట్టారు. కొబ్బరి నూనే, తాళ్లు దొరక్కుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఎలిమినేటై ప్రేక్షకుల మద్దతుతో మరో అవకాశం దక్కించుకున్న నూతన్ నాయుడు, శ్యామలను ఇంకా హౌస్‌లోకి పంపివ్వలేదు. ఇది కూడా ప్రేక్షకులకు బిగ్‌బాస్‌పై ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం ఈ రోజైనా వారు హౌస్‌లోకి వస్తారో లేదో చూడాలి మరి! చదవండి: బిగ్‌బాస్: నిష్క్రమించేది ఆ ఇద్దరేనా? -
బిగ్‌బాస్: నిష్క్రమించేది ఆ ఇద్దరేనా?
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 రసవత్తరంగా మారింది. హౌస్ మేట్స్ కుట్రలు, కుతంత్రాలు అంటూ పెట్టుకునే గొడవలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిత్తించాయి. అయితే ఈ రియాల్టీ షో సాంప్రదాయానికే విరుద్దంగా ఎన్నడూ.. ఎక్కడా లేని విధంగా బిగ్‌బాస్.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు మరో అవకాశం ఇచ్చాడు. అది కూడా ప్రేక్షకుల ఓట్ల ద్వారా అని చెప్పి కావాల్సిన హైప్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రేక్షకులు వారి అభిమాన కంటెస్టెంట్‌ను హౌస్‌లోకి పంపించడానికి ఓట్లతో పోటీపడ్డారు. దీంతో ఏకంగా ఎన్నడూ లేనివిధంగా 11 కోట్ల పై చిలుకు ఓట్లు నమోదయ్యాయి. ఈ ఓట్లన్ని ఆరుగురు కంటెస్టెంట్స్‌కు రాగా.. మేజార్టీ సాధించిన ఇద్దరికి మాత్రం స్పల్ప తేడా ఉండటంతో ఎవరూ ఊహించని విధంగా ఏదైనా జరగొచ్చు అన్నట్లు ఆ ఇద్దరికి అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ ఇద్దరు కామన్ మ్యాన్ నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల అన్న విషయం ముందే తెలిసిపోయినా.. ఆదివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని రివీల్ చేశాడు. కానీ హౌస్‌లోకి ఎప్పుడు వెళ్లాలనేది మాత్రం బిగ్‌బాస్ నిర్ణయిస్తాడని ప్రకటించాడు. అయితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని మాత్రం చెప్పలేదు. నిజానికి ఏ వారం ఎలిమినేషన్లో కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ఈ ఇద్దరు హౌస్‌లోకి వెళ్లే అంశంపై ఈ రోజు ఎపిసోడ్లో స్పష్టత రానుంది. ఇద్దరు ఎంట్రీ.. మరో ఇద్దరు ఔట్! ఏదైనా జరుగొచ్చు అన్నట్లు ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు.. అయితే వీరి రాకతో ఈసారి ఎలిమినేషన్లో డబుల్ ధమాకా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్ చివర్లో ఈ విషయంపై నాని కొంత స్పష్టతను ఇచ్చి.. ఇవ్వనట్లు వదిలేశాడు. ఆ మాటలను బట్టి చూస్తే ఈ సారి కచ్చితంగా హౌస్ నుంచి ఇద్దరు నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ రియాల్టీ షో 50 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. ఇంకా మరో 50 రోజుల సమయం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పుజా రామచంద్రన్‌తో కలిపి 12 మంది సభ్యులున్నారు. తాజాగా మరో ఇద్దరు చేరనున్నారు. మొత్తం ఆ సంఖ్య 14కు చేరనుంది. చివరి వారానికి ఐదుగురు మిగులుతారు. ఇలా వారానికి ఒక్కరిని వేసుకున్నా 7గురు మాత్రమే బయటకి పోతారు. కాబట్టి ఈ లెక్కన ఓ రెండు వారాలు ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అనుకున్నది ఒకటి అయినది ఒకటి.. ఇక సోమవారం ఎపిసోడ్లో గార్డెన్లో ఏర్పాటు చేసిన 1-12 ర్యాంక్స్ బోర్డుల వద్ద కంటెస్టెంట్స్ హౌస్‌లోని తమ ర్యాంకు ఏంటో నిర్ణయించుకోని ఆ ర్యాంకు వద్ద నిలబడాలని, ఒక ర్యాంకు దగ్గర ఒక్కరే నిలబడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తనీష్-1, రోల్‌రైడా-2, కౌశల్, దీప్తి-3, సామ్రాట్-4, అమిత్-5, దీప్తీ సునయన-6, గణేశ్-7, బాబుగోగినేని-8, గీతామాధురి-9, నందిని-10, పుజారామచంద్రన్-12 ర్యాంకుల వద్ద నిలబడ్డారు. ఇక తమకు తాము ఎక్కువ ర్యాంకు ఇచ్చుకున్న కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు డైరెక్ట్‌గా నామినేట్ చేశాడు. కెప్టెన్ అయినందుకు గీతా మాధురి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పుజాలను ఎలిమినేషన్ నుంచి తప్పించాడు. ఇక మూడో ర్యాంకు కోసం గొడవ పడ్డ కౌశల్, దీప్తీలను ఏకాభిప్రాయానికి రానందుకు ఇద్దరినీ బిగ్‌బాస్ నామినేట్ చేశాడు. తను ఎలాగైన నామినేట్ అయ్యేదని, కానీ ఆమెతో కౌశల్‌ను కూడా నామినేషన్లోకి తీసుకొచ్చిందని హౌస్ మేట్స్ పడిపడి నవ్వుకున్నారు. ఈ వారం ఇద్దరైతే..? ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటే బాబుగోగినేని, దీప్తిలకు ఎలిమినేషన్ తప్పేట్టు లేదు. బాబుగోగినేని గత వారం మొత్తం ఆయన ప్రవర్తించిన తీరు ప్రేక్షకుల్లో చాలా వ్యతిరేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా కౌశల్, గీతా మాధురిలతో ఆయన ప్రవర్తించిన తీరు రాజమౌళీపై కామెంట్స్.. హౌస్‌లోనే కాకుండా టీవీల ముందున్న వారికి చికాకు తెప్పించింది. మరో వైపు ఆయన కేసుల వ్యవహారం కూడా బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పోలీసులు నోటీసులు కూడా అందజేశారు. ఈ పరిస్థితుల్లో ఆయనను హౌస్‌లో కొనసాగించి బిగ్‌బాస్ రిస్క్ తీసుకోలేడని అర్థమవుతోంది. ఇక రెండో వ్యక్తిగా నందినీ, దీప్తీలకు ముప్పు ఉంది. అయితే ఈ ముగ్గురిలో దీప్తీ ఎలిమినేషన్ తప్పెట్టు లేదు. నిజానికి ఆమె భాను శ్రీ సమయంలోనే ఆమె బయటకు వెళ్లాలి.. కానీ పరిస్థితులు అనుకూలించి ఉండిపోయింది. మంచి-చెడు టాస్క్‌లో జరిగిన గొడవ దీప్తీని రెండు వారాలు రక్షించింది. ఆమె ర్యాంకింగ్ టాస్క్‌లో ప్రవర్తించిన తీరు కొంత అభ్యంతరకరంగానే ఉంది. అయితే ఇది ప్రేక్షకులు పాజిటీవ్‌గా? లేక నెగటీవ్‌గా తీసుకుంటారా అన్న విషయంపైనే ఆమె ఎలిమినేషన్ ఆధారపడి ఉంది. ఇక నందినిది కూడా బాబు పరిస్థితే. ఆమె ఒకరి విషయాలు మరొకరి వద్ద ప్రస్తావించడం.. అర్ధరాత్రి తనీష్‌తో రోమాన్స్ చేయడం.. ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అయితే తాజా ఎపిసోడ్ దీప్తీ ప్రవర్తన నందినికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహరంతో కామన్ మ్యాన్ గణేశ్ ఈ వారం బతికిపోయినట్టే. ఇప్పటికే ఈ ఎలిమినేషన్ల వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ముఖ్యంగా బాబుగోగినేని, దీప్తీ, నందినిలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. రీక్రియేషన్.. బిగ్‌బాస్ షో మొత్తం కమర్షియల్ అన్న విషయం తెలిసిందే. స్పాన్సర్ బ్రాండ్స్ ప్రచారం కోసమే టాస్క్‌లు సైతం నిర్వహిస్తున్నారు. ఇది తొలి వారంలోనే స్పష్టమైంది. సోమవారం ఎపిసోడ్‌ను సైతం బిగ్‌బాస్ అలానే ప్లాన్ చేశాడు. హౌస్ మేట్స్ బాల్యం ఫొటోలు చూపించి వాటిని రీక్రియేషన్ చేయాలని ఓ టాస్క్ ఇచ్చాడు. దీనికి ఈ షోకు స్పాన్సర్‌గా ఉన్న ఓ కంపెనీ మొబైల్ ఫోన్స్‌ను వాడుకోవాలని సూచించాడు. అయితే హౌస్ మేట్స్ ఫొటోలు కొంత ఆకట్టుకున్నా.. ఈ టాస్క్ పూర్తిగా యాడ్‌లా అనిపించింది. అందరు కంటెస్ట్ంట్స్ తమ చిన్నానాటి ఫొటోలను రిక్రియేట్ చేశారు. అయితే ఎలిమినేషన్ అనేది హౌస్‌లో జరిగే పరిణామాలను బట్టే ఉంటుంది. అయితే ఈ వారంలో బిగ్‌బాస్ ముందే చెప్పినట్లు ఏదైనా జరగొచ్చు.! చదవండి: బిగ్‌బాస్ : శ్యామల, నూతన్ నాయుడు రీఎంట్రీ బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం -
బిగ్‌బాస్ : శ్యామల, నూతన్ నాయుడు రీఎంట్రీ
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నాడు. సీజన్-1 కన్నా సీజన్-2పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎపిసోడ్లు ప్రసారం కాకముందే హౌస్‌లో విషయాలు ముందే లీకైపోతున్నాయి. ఇది కొంత బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారినా.. వారికి కావాల్సిన హైప్ మాత్రం క్రియేట్ అవుతోంది. అయితే శనివారం ఎపిసోడ్లో హోస్ట్‌గా నాని ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు కొంత నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. చివర్లో ‘ఎన్నడూ రాని విధంగా ఈ వారం ఓట్లు పోటెత్తాయి.. ఇవి హౌస్‌లో ఉన్నవారి కోసం కాదు.. బయట ఉన్న మీ ఫేవరేట్ కంటెస్టెంట్ కోసం మీరు వేసిన ఓట్లు’ అని నాని ప్రకటించాడు. అయితే గత వారం రోజులుగా హౌస్‌లోకి ఎవరు వెళ్తారని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. కంటెస్టెంట్స్ కూడా తమకు అనుకూలంగా ఓటెయ్యాలని క్యాంపయిన్ నిర్వహించారు. ఇక ఆదివారం ఉదయం నుంచే నూతన్ నాయుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని అధికారికంగా తెలిసిపోయినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే.. ఆయనతో పాటు యాంకర్ శ్యామల సైతం హౌస్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూ రాని విధంగా ఓట్లు వచ్చాయని, నూతన్ నాయుడు, శ్యామలకు స్వల్ప ఓట్ల తేడా ఉండటంతో బిగ్‌బాస్ ఇద్దరికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం ముందే లీకైంది. దీంతో ఆదివారం షోలో సస్పెన్స్ లేకుండానే ముగిసింది. నూతన్ నాయుడుకి కౌశల్ ఆర్మీ మద్దతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క శ్యామల సైతం తను ప్రేక్షకుల వల్ల ఎలిమినేట్ కాలేదని, హౌస్ మేట్స్కున్న ప్రత్యేక అధికారాల వల్లే అయ్యాననే విషయాన్ని ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకు మద్దతు లభించింది. సో బయటకు లీకైన రూమర్స్‌నే నిజం చేస్తూ.. బిగ్‌బాస్‌లోకి శ్యామల, నూతన్ నాయుడు ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిద్దరు హౌజ్‌లో ఎప్పటినుంచి పాల్గొనబోతున్నారో బిగ్‌బాస్ డిసైడ్ చేయనున్నట్లు నాని తెలిపాడు. నాని హోస్టింగ్‌పై నెటిజన్లు ఫైర్.! ఇక హోస్ట్ నానిపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ముఖ్యంగా బాబుగోగినేని మాయలో నాని పడిపోయాడని నెటిజన్లు మండిపడుతున్నారు. హౌస్‌ను ఆర్డర్లో పెట్టాల్సిన నానియే శనివారం ఆర్డర్ తప్పాడని విమర్శిస్తున్నారు. హౌస్‌లో నెలకొన్న గొడవలపై నాని స్పష్టత ఇవ్వలేకపోయాడని, ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టేసాడని కామెంట్ చేస్తున్నారు. ఇక కౌశల్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నాడని.. కొందరంటే.. కౌశల్‌ను నెగెటివ్‌గా చూపించాలని ప్రయత్నించాడని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. #NaniUnfitForBB2Host అనే యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అది కేవలం రియాల్టీ షో అని స్క్రిప్ట్ ప్రకారమే హోస్ట్ చేస్తాడని ఇది అర్థం చేసుకోవాలని మరికొందరు నానికి మద్దతు పలుకుతున్నారు. ఏదిఏమైనా.. ట్రోల్స్ మాత్రం కంట్రోల్ కావడం లేదు.. మరీ వీరి ఎంట్రీతో ఈ వారం అన్న హౌస్ ఆర్డర్‌లోకి వస్తుందో లేదో చూడాలి! చదవండి: బిగ్‌బాస్: నెక్ట్స్ బాబేనా! బాబు గోగినేనిపై నాని ఫైర్ -
బిగ్‌బాస్ : బాబు గోగినేనిపై నాని ఫైర్
బిగ్‌బాస్‌లో శుక్రవారం జరిగిన రచ్చే మళ్లీ రిపీటైంది. ఈ వారం జరిగిన కార్యక్రమంపై నాని సమీక్ష జరిపారు. సిల్లీ రీజన్స్‌ను చెప్పి నామినేట్ చేయడంపై సభ్యులను హెచ్చరించాడు. కౌశల్, బాబు గోగినేనిలపై నాని విరుచుకుపడ్డారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ, లగ్జరి బడ్జెట్ అనంతరం జరిగిన పరిణామాలు హైలెట్‌గా నిలిచాయి. ఇవే విషయాలు నాని వచ్చాక కూడా శనివారం జరిగిన షోలో కూడా మల్లి చర్చకు వచ్చాయి. ఈ విషయాలపై నాని ఇంటి సభ్యులందరిని హెచ్చరించాడు. తనీష్‌కు టాస్క్ ఇచ్చిన నాని.. గతవారం కెప్టెన్‌గా చేసిన తనీష్‌కు కంగ్రాట్స్ చెప్పి, కెప్టెన్‌గా ఎలా ఉందంటూ నాని అడిగాడు. అనంతరం మైక్ ధరించడంలో తనీష్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు. లాలించడం, బుజ్జగించడం ఆపమంటే.. ఇంకొకరితో స్టార్ట్ చేయమని కాదంటూ నాని మందలించాడు. మైక్ సరిగా ధరించనందుకు ఆదివారం జరిగే షోలో చున్నిని నోటికి చుట్టుకోవాలని ఎవరితో మాట్లాడకూడదంటూ.. ఆదేశించాడు. కౌశల్, దీప్తిల విషయంలో నాని అసహనం చెందారు. లగ్జరి బడ్జెట్ గురించి అడిగాడు కౌశల్ కానీ, బిగ్‌బాస్‌తో స్కిన్ ఎలర్జీ గురించి మాట్లాడతానంటూ చెప్పాడని దీప్తి తెలిపారు. రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికైనందుకు గీతా మాధురికి కంగ్రాట్స్ తెలిపాడు. కెప్టెన్సీ టాస్క్ అనంతరం బాబు , గీతల మధ్య జరిగిన గొడవపై నాని బాబు గోగినేనిని మందలించాడు. మీకు దీప్తి గెలవడం ఇష్టం లేదనే విషయమే మాకు అర్థమవుతుందని, అది మీ యాక్షన్స్ వల్ల కనిపించిందని, బయటకు కూడా ఇదే ప్రొజెక్ట్ అయిందని నాని తెలిపాడు. ఇదే విషయం అక్కడ గీతా మాధురి చెబుతూ ఉంటే ఎందుకంతా ఫైర్ అయ్యారని బాబుపై మండిపడ్డాడు. గ్రూపులు కట్టి అందరిని ప్రభావితం చేస్తున్నారంటూ బాబును విమర్శించాడు. ఇక నామినేషన్ విషయంలో కౌశల్, బాబును నాని మందలించాడు. బాబును నామినేట్ చేసిన కారణాలు సరిగా లేవంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో కౌశల్ సమర్దించుకుంటూ.. మూవీ టాస్క్‌లో బాబు గోగినేని తనీష్‌కు ఎక్కువ డబ్బులిచ్చాడని కావాలనే తనకు తక్కువగా ఇచ్చాడని ఇలా చాలా కారణాలున్నాయంటూ, కానీ ఆ రోజు సమయం లేక చెప్పలేదంటూ తెలిపాడు. లాజిక్కుతో ఇరుక్కున్న బాబు రాజమౌళి నాస్తికుడని చెప్పుకుంటూ గుడికి వెళ్లాడని బాబు గతంలో చెప్పాడని.. రాజమౌళిపై అనవసర వ్యాఖ్యలు చేయడం తనకు నచ్చలేదని అందుకోసమే బాబును కౌశల్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ టాపిక్‌పై నాని మాట్లాడుతూ.. ఆయన నాస్తికుడైనంత మాత్రానా గుడికి వెళ్తే తప్పేంటంటూ నాని ప్రశ్నించాడు. రాజమౌళి తన ఫ్యామిలీ గురించి వెళ్లి ఉండొచ్చు అది ఆయన ఇష్టమంటూ బాబు గోగినేనిపై ఫైర్ అయ్యాడు. తాను చర్చికి కూడా వెళ్తాను అంటూ.. అమ్మమ్మను సంతోష పెట్టడానికి వెళ్తానని తన విషయాన్ని కూడా ప్రస్తావించాడు నాని. కౌశల్, గీతను హౌజ్‌లోంచి బయటకు పంపించడమే తన లక్ష్యమని చెప్పడంపైనా నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరు ఎవరిని బయటకు పంపించలేరని నాని చెప్పుకొచ్చాడు. నాయకత్వ లక్షణాలు నేర్పించడం. నాయకుల్ని తయారుచేయడమే నా వృత్తి అంటూ చెప్పుకొచ్చిన బాబుకు.. కానీ నాయకుల్ని చేసేది మేమే.. ప్రజలే నాయకుల్ని చేయగలరు అంటూ నాని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అయితే తాను ఎవరికి బయపడనని, తనకు హౌజ్‌లో ఉండాలని ఉందని, కానీ పంపించాలనుకుంటే తను సిద్దమే అన్నట్టుగా బాబు గోగినేని తేల్చిచెప్పాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో కుతంత్రం జరుగుతోందిని, కౌశలే గేమ్ ప్లే చేస్తున్నాడంటూ కౌశల్‌పై విరుచుకపడ్డాడు. ప్రబుద్దుడు అంటూ కౌశల్‌ను సంభోదిస్తూ... గతంలో తనకు కౌశల్‌కు మధ్య జరిగిన సంభాషణలు వివరిస్తూ.. సామాన్యుడైన గణేష్‌తో కూడా స్థాయి గురించి మాట్లాడాడని కౌశల్‌పై నిప్పులు చెరిగాడు. ఇక ఈ వారం ప్రొటెక్షన్ జోన్లోకి వెళ్లేవారెవరో తెలుపకుండా సస్పెన్స్‌లోనే ఉంచాడు. అయితే ఈ వారం ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ హౌజ్‌మేట్స్‌కు నాని తెలిపాడు. అయితే అవి వారి ఎలిమినేషన్‌కు కాదు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భాను శ్రీ, తేజస్వీలను తిరిగి మళ్లీ ఇంటిలోకి పంపించేందుకు బాగానే ఓట్లు పడ్డట్లు నాని తెలిపాడు. అయితే వీరందరిలో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారన్న సస్పెన్స్‌కు తెరపడనుంది. -
బిగ్‌బాస్ : తారాస్థాయికి చేరిన రచ్చ
ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో. చిన్న మాట పెద్ద చర్చకు దారి తీసి రచ్చ రచ్చ అయింది. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. ఈ వారం లగ్జరి బడ్జెట్ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ను మూడు టీమ్స్‌గా విడిపోయి ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ టాస్క్‌లో కౌశల్, దీప్తి, నందిని టీమ్ గెలిచారు. అయితే ఈ విజయానికి కానుకగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఈ సభ్యులకు వచ్చాయి... వీటిని మిగతా ఇంటి సభ్యులకు కూడా ఇవ్వొచ్చా అంటూ బిగ్‌బాస్‌ను అడుగుతుండగా విన్నానని అది తనకు నచ్చలేదని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గీతా మాధురికి తనీష్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరిని కూర్చోబెట్టి సభాముఖంగా కౌశల్, దీప్తి, నందినిలను అడిగారు గీతా మాధురి. దీప్తి, నందినిలు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పగా.. కౌశల్ మాత్రం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మా టీమ్ గెలిస్తే... ఇంటిలోని ఓ ఇద్దరు సభ్యులు మా టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పలేదంటూ వింత సమాధానం చెబుతూ.. ఇంటిలోని అందరు సభ్యులు మంచిగా ఉండాలని అందరం కలిసే లగ్జరి బడ్జెట్ పంచుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మధ్యలో గీత కలగజేసుకుంటూ ఆ ఇద్దరి సభ్యులెవరో చెప్పండి అనగా .. ఒకరు బాబు గోగినేని అని కౌశల్ చెప్పగా.. రెండో వ్యక్తి నేనేనంటూ తనీష్ చెప్పాడు. ఈ తతంగం అంతా జరుగుతుంటే ... బాబు గోగినేని స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ.. నేను కంగ్రాట్స్ చెప్పలేదు కాబట్టి.. నాకు లగ్జరీ బడ్జెట్ వచ్చిన ఐటమ్స్ వద్దు అని చెబుతుండగా.. నాకు కూడా వద్దంటూ తనీష్, సామ్రాట్లు తెలిపారు. బాబు గోగినేని నాన్ సెన్స్ పదం వాడటంతో గీత హర్ట్ అయ్యారు. కెప్టెన్ పదవిపై గౌరవం ఉంటే.. కెప్టెన్ మాట్లాడుతుంటే మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఇంటి సభ్యులందరికి గీత సూచించారు. ఇక్కడ మాట్లాడేది నాన్ సెన్స్ కాదంటూ.. ఏదో ఎమోషనల్‌గా ఇష్టమొచ్చినట్లు ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దంటూ బాబు గోగినేనిని గీత కోరారు. తనకు నాన్సెన్స్ అనిపిస్తే మాట్లాడుతానని, తన పేరు వచ్చిన తరువాతే తాను మాట్లాడనంటూ బాబు ఫైర్ అయ్యారు. తనకు కంగ్రాట్స్ చేయలేదంటూ కౌశల్ అనడంతో మొదలైంది ఈ గొడవ. అయితే తన ఉద్దేశ్యం మాత్రం అందరూ కలిసి ఉండాలని, ఒకరు గెలిచినప్పుడు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెబితే బాగుంటుందని ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. కంగ్రాట్స్ చెప్పలేదు.. కాబట్టి వారికివ్వను.. అని అన్నట్లు ఉందంటూ... ఏదో గీతా మాధురి బలవంతంగా ఒప్పించినట్లు ఉందని అందుకే తనకు లగ్జరి బడ్జెట్‌ను తీసుకోవాలని లేదంటూ.. తనీష్ ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. టాస్క్ గెలిచిన తరువాత తన వద్దకు వచ్చి నేషనల్ స్విమ్మర్ కదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడని అందుకు తనకు కూడా లగ్జరి బడ్జెట్ వద్దని సామ్రాట్ తెలిపాడు. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నేను క్యాజువల్‌గానే అన్నానని తప్పుంటే క్షమించమని కౌశల్ కోరాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందరూ నెగిటివ్‌గా ఆలోచించడం వల్లే అలా అనిపిస్తోందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మంచి గానే కనిపిస్తుందని, అందరూ అలా ఆలోచించాలని సూచించగా.. బాబు గోగినేని, తనీష్ ఫైర్ అయ్యారు. మాటా మాటా పెరిగి మంచిగా మాట్లాడలంటూ కౌశల్ కూడా ఫైర్ అవుతుండగా... బెదిరిస్తున్నావా అంటూ బాబు కూడా రివర్స్ అటాక్ చేశాడు. ఇలా గొడవంతా తారాస్థాయికి చేరుతుండగా.. కెప్టెన్‌గా గీతా మాధురి అందరిని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. తనే చేజేతులా చేసుకుంటున్నాడని, అడిగి మరి కంగ్రాట్స్ చెప్పించుకోవడం బాలేదని దీప్తి, గీతా మాధురి మాట్లాడుకున్నారు. ఇక కౌశల్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి గీతా మాధురి, దీప్తి, రోల్ రైడా, నందిని, పూజలతో మాట్లాడారు. ఇదిలా వుండగా.. ఈ వారం నామినేషన్లో ఉన్న బాబు గోగినేనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కౌశల్, గీతా మాధురిలను ఎలాగైనా బయటకు పంపించడమే తన ధ్యేయమంటూ ఇంటి సభ్యులతో అంటున్నాడు. ఈ వారం నేను వెళతానేమో.. వెళ్లాక చేసే మొదటి పని కౌశల్‌ను బయటకు పంపడమే, ఆ తరువాత గీతా మాధురిని అంటూ చెప్పుకొచ్చాడు. గత ఎపిసోడ్స్‌లో తనతో పెట్టుకుంటే హౌజ్‌లోంచి బయటకు వెళతారని కౌశల్ అన్నాడని.. అది నిజం కాదంటూ దాన్ని బ్రేక్ చేయడానికి కౌశల్‌తో పెట్టుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. -
బిగ్‌బాస్: నెక్ట్స్ బాబేనా!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ప్రేక్షకులకు కావాల్సిన అసలు సిసలు మజా లభిస్తోంది. తొలుత కొంత డల్‌గా సాగిన ఈ రియాల్టీ షో సోషల్ మీడియా ట్రోల్స్‌తో వేడెక్కింది. ప్రేక్షకులు కంటెస్టెంట్స్ అభిమానులుగా విడిపోవడంతో నెట్టింట్లో ఈ రియాల్టీ షో గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. దీంతో హౌస్‌లో ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక రసవత్తరంగా సాగిన గురువారం ఎపిసోడ్ ఆకట్టుకుంది. చివర్లో గీతా మాధురి Vs బాబు గోగినేని మధ్య సాగిన చర్చ హైలైట్‌గా నిలిచింది. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కోల్పోయిన గణేశ్, నందిని, దీప్తి సునయనలకు బిగ్‌బాస్ మరో అవకాశమిచ్చాడు. కానీ దానికి ఓ మెలిక పెట్టడంతో వారు ఒప్పుకోలేదు. అనంతరం ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ టాస్క్ నిర్వహించాడు. ఓ పాన్ షాప్ సెట్‌ను వేసి దానికి యజమానిగా ఇటీవల హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణా రామంచంద్రన్‌ను నియమించాడు. హౌస్ మేట్స్ తమ ఆటపాటలతో ఆమెను మెప్పించి కిల్లీలు తీసుకోవాలని సూచించాడు. ఈ టాస్క్‌లో అపరిచితుడు రాము వేశంలో అమిత్ ఆకట్టుకున్నాడు. ఇక పూజా.. అమిత్, సామ్రాట్, గీతా మాధురి, దీప్తిలు తనను ఆకట్టుకున్నారని బిగ్‌బాస్‌కు సూచించింది. ఈ నలుగురు తదుపరి కెప్టెన్ పోటీదారులుగా ప్రకటిస్తూ.. పెయింట్ వేసుకోని పెడెస్టెల్స్ మీద విగ్రహంలా నిలబడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అంతేకాకుండా నచ్చని పోటీదారున్ని కిందికి దిగేలా ఏమైనా చేయవచ్చని మిగతా సభ్యులుకు సూచించాడు. కౌశల్ Vs తనీష్.. కెప్టెన్ పోటీదారులను ఇతర సభ్యులు తమ తోచిని రీతిలో ఇబ్బంది పెట్టసాగారు. ఈ సందర్భంగా కౌశల్, తనీష్ మధ్య తీవ్ర చర్చ జరిగింది. కౌశల్ కొబ్బరి నూనేను వారిపై పోస్తుండగా నందిని రాయ్, తనీష్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తన ఒక్కడిపైనే పసుపు కొట్టారని, తాను కేవలం కొబ్బరి నూనెను ఎవరికి మద్దతివ్వకుండా అందరిపై పోస్తున్నానని, కౌశల్ పేర్కొన్నాడు. దీంతో తనీష్ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అనంతరం అమిత్, సామ్రాట్‌లను నెట్టేద్దామని పూజా, కౌశల్ చర్చించుకున్నారు. కానీ అప్పటికే బాబుగోగినేని బకెట్‌తో దీప్తిని దించేశాడు. ఆ వెంటనే కౌశల్ స్టిక్‌తో అమిత్, సామ్రాట్‌లను నెట్టేయడంతో గీతా మాధురి ఒక్కరు మిగిలిపోయారు. దీంతో గీతా మాధురినే తదుపరి కెప్టెన్‌గా బిగ్‌బాస్ ప్రకటించాడు. గేమ్ ఆడిన కౌశల్.. తన సహజ శైలితో హౌస్‌లో ఒంటరి వాడైన కౌశల్ అసలు సిసలు గేమ్ ఆడాడు. ముఖ్యంగా పీకలదాక తన మీద కోపం పెంచుకున్న బాబుగోగినేని వ్యూహంపై దెబ్బకొట్టాడు. అంతో ఇంతో హౌజ్‌లో చనువుగా ఉండే గీతా మాధురి, దీప్తిలను కెప్టెన్ కాకుండా అడ్డుకోవాలనే బాబు, తనీష్, సామ్రాట్ల ప్లాన్‌ను విజయవంతంగా అడ్డుకున్నాడు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న బాబు దీప్తిని కిందపడేసి.. అనంతరం గీతా మాధురిని తోసేయాలనుకున్నాడు. దీంతో అమిత్, సామ్రాట్‌లో ఎవరు కెప్టెన్ అయినా తన మాట చెల్లుతుందని భావించాడు. కానీ కౌశల్ ఈ వ్యూహాన్ని అడ్డుకున్నాడు. బాబు VS గీతా మాధురి.. తన ప్లాన్ విఫలమవడంతో బాబు గోగినేని ఒకింత అసహనానికి గురయ్యాడు. దీంతో కొత్త కెప్టెన్ గీతా మాధురితో తగువు పెట్టుకున్నాడు. దీప్తి, సామ్రాట్‌లలో ఒకరిని కెప్టెన్ చేద్దామనుకున్నాం.. అంత గొడవ జరుగుతున్నా మీరెందుకు సైలెంట్‌గా ఉన్నారని గీతాను ప్రశ్నించాడు. దీప్తిని కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు కిందపడేశారని ఆమె ప్రశ్నించడంతో ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ‘మీరు కెప్టెన్‌గా హౌస్‌కు నాయకత్వం వహించాలి. కూర్చొని గ్రూప్‌లు చేయకండి’ అంటూ ఫైర్ అయ్యాడు. ‘డిస్కషన్లో నిజాయితీ లేని మీతో నేను చర్చ జరపను. ఆకతాయి మాటలతో ఎదుటి వారి ఉద్దేశాలు మాట్లాడటానికి వీల్లేదు’ అని మండిపడ్డాడు. ‘నాకు మాట్లాడాలని లేకపోయిన మీ వయస్సుకు విలువ ఇచ్చి మాట్లాడుతున్నానంటూ’ గీతా కౌంటర్ ఇచ్చింది. కెప్టెన్సీ మొదట్లోనే గ్రూప్‌తో మొదలు పెట్టారని.. ఎలా కొనసాగిస్తారో చూస్తానని, మీ ఉద్యోగం మీరు చేసుకుంటే మంచిదని సూచించాడు. దీనికి గీతా సైతం తన బాధ్యతను పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నాని, మీకు నచ్చకపోతే నామినేట్ చేయండి అంటూ బదులిచ్చింది. వీరి సంభాషణలో కౌశల్ తల దూర్చగా.. సామ్రాట్, తనీష్‌లు వాళ్లిద్దరిని మాట్లాడుకోనివ్వండి అంటూ సూచనలిచ్చారు. బాబుపై నెటిజన్ల ఫైర్.. ఎలిమినేషన్లో నామినేట్ అయినప్పటి నుంచి.. ముఖ్యంగా కౌశల్ రాజమౌళి విషయం ప్రస్తావించడంతో బాబు గోగినేని తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు కనపడుతోంది. తనే బిగ్గర్ బాస్‌నని చెప్పుకునే బాబు.. హుందాగా వ్యవహరించడం లేదని, ఇగోయిస్ట్‌గా ప్రవర్తిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్ తప్పించుకున్నా.. వచ్చే వారం బాబు హౌస్ వీడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ‘ఇన్ని రోజులు బాబుపై ఎంతో గౌరవం ఉండేది.. కానీ ఈ చర్యతో అది పోయింది’ అని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నేటి ఎపిసోడ్ ప్రోమోలో గీతా మాధురి కన్నీటి పర్యంతమైంది. ఆమెను తనీష్ ఓదార్చాడు.. మరో వైపు బాబు గోగినేని మాత్రం ఈ వారం తాను ఎలిమినేట్ అయితే.. కౌశల్, గీతా మాధురిలను బయటకు వచ్చేలా చేయడం తన పనిగా పెట్టుకుంటానని తెలిపాడు. దీంతో నేటి ఎపిసోడ్లో ఎం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది. చదవండి: బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం -
బిగ్‌బాస్ : సామ్రాట్‌ను హెచ్చరించిన తల్లి
గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా సినిమాలతో ఫేమస్ అయిన పూజా రామచంద్రన్ అర్దరాత్రి దాటాక బిగ్‌బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. సోమవారం ఎపిసోడ్‌లోనే ఈ విషయం స్పష్టమైన విషయం తెలిసిందే. అయితే ఆమె వైల్డ్ కార్డా లేక యాంకర్ ప్రదీప్‌లా గెస్టా.. అనే సందేహం కలిగింది. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని స్పష్టమైంది. ఇంటి సభ్యులను సర్ప్రైజ్ చేయడం కోసం.. కౌశల్ సలహా మేరకు డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నారు. మొదటగా గణేష్, దీప్తి సునయనలు పూజను గమనించారు. అనంతరం ఆమె ఇంటి సభ్యులందరిని పరిచయం చేసుకున్నారు. బిగ్‌బాస్ షోపై బయట జనాల అభిప్రాయం, ఇంట్లో తీసిన సినిమా గురించి టాక్ ఎలా ఉందో ఇంటి సభ్యులకు వివరించారు. ఎమోషనల్‌గా సాగిన కార్యక్రమం... ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. ఇలా ఫోన్ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్ చేసి.. వారిచ్చే హింట్స్‌ను గుర్తుపట్టి సరైన హౌజ్‌మేట్‌కు ఫోన్‌ను ఇచ్చేయాలి. ఇలా గుర్తుపట్టని యెడల ఆ ఫోన్ కట్ అయిపోతుంది. ఆ హౌస్ మేట్‌కు తన వాళ్లతో మాట్లాడే అవకాశం కోల్పోతారు. మొదటి కాల్ కౌశల్‌కు.. మొదట వచ్చిన కాల్‌ను గీత లిఫ్ట్ చేయగా.. మిష్టర్ ఫర్ఫెక్ట్, మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు అని చెప్పగా.. కౌశల్‌కు ఫోన్ ఇచ్చారు. కౌశల్ పిల్లలు మాట్లాడగానే కన్నీరు పెట్టుకున్నాడు. తన బిజినెస్, పిల్లల స్కూల్ వివరాల గురించి అడిగాడు. కౌశల్ భార్య మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్రెండ్స్‌గా భావించి మాట్లాడే వారే నీ గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని, బయట తనకు ఫాలోయింగ్ ఉందని కౌశల్ చెప్పారు. నందిని, దీప్తిల విషయాన్ని కూడా ప్రస్తావించారు. తనకు సోషల్ మీడియాలో భారీగా సపోర్ట్ లభిస్తోందని, గేమ్ జాగ్రత్తగా ఆడాలంటూ సలహా ఇచ్చారు. రెండో కాల్ రోల్ రైడాకు.. మొదటగా ఫోన్ మాట్లాడిన కౌశల్.. రెండో కాల్‌ను లిఫ్ట్ చేసిన వెంటనే.. అటునుంచి గల్లీ పోరగాడు.. బిర్యానీ తిండిబోతు అని హింట్స్ ఇవ్వగా... రోల్ రైడా అని గుర్తుపట్టి ఫోన్ అందజేశాడు. రోల్ ఫోన్ తీసుకోగా.. తన చెల్లెలితో మాట్లాడాడు. హౌస్‌లో చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడనీ, రోల్‌కు బయట చాలా మంది ఫ్యాన్స్ అయ్యారని చెప్పారు. ఎవరినీ సెల్ఫ్ నామినేట్ చేసుకో అని చెప్పకూడదని, నీ ఆట నువ్వు ఆడాలి అంటూ సలహా ఇచ్చారు. మూడో కాల్ దీప్తి సునయనకు.. రెండో కాల్ రోల్ మాట్లాడగా.. తరువాతి ఫోన్ రింగ్ అయ్యాక.. అవతలి వ్యక్తి తమ పేరును చెప్పేయడంతో కాల్ కట్ అయింది. అవతలి వ్యక్తి ఇచ్చిన హింట్స్‌తో దీప్తి సునయనకు ఫోన్ వచ్చిందని గుర్తుపట్టాడు రోల్. కానీ ముందే పేరు చెప్పేయడంతో కాల్ కట్ అయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో దీప్తి సునయన చిన్నబోయింది. మళ్లీ తరువాత వచ్చే ఫోన్ కూడా రోల్ రైడానే గుర్తుపట్టాలని ఆదేశించాడు. ఈ సారి సామ్రాట్‌కు సంబంధించిన వారు ఫోన్ చేశారు. వారిచ్చిన హింట్స్‌తో సామ్రాట్‌ను గుర్తుపట్టిన రోల్.. తనకి ఫోన్ అందజేశాడు. ఫోన్లో సామ్రాట్ అమ్మ మాట్లాడారు. ఎలిమినేషన్ నుంచి తప్పించిన ప్రేక్షకులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సామ్రాట్‌ను బిగ్‌బాస్ ఎందుకు వచ్చావని, నువ్వు నీలా ఉండాలని, అందరితో కలవాలంటూ, అనవసరమైన ట్యాగ్స్‌ను తగిలించుకోవద్దని, అర్దరాత్రి స్విమ్మింగ్ చేయద్దంటూ సలహాలు ఇస్తూ.. ‘నీపై చాలా నెగటివ్ ఉంది నాన్నా.. దానిని నేను తట్టుకోలేను.. జాగ్రత్తా’ అని హెచ్చరించారు. తరువాతి ఫోన్ ఎవరికి వస్తుందో.. వారిచ్చిన హింట్స్‌ను గుర్తుపడతారో లేదో మిగతా హౌస్ మేట్స్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వస్తుందో లేదో చూడాలి. -
బిగ్‌బాస్ : మరోసారి కౌశల్ టార్గెట్
ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్ అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో ఆసక్తి పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ వారం నామినేషన్లో భాగంగా ఒక ఇంటి సభ్యుడు తనకు ఇష్టంలేని మిగతా సభ్యుడిని ఎంచుకుని అందుకు గల కారణాలు తెలిపి అనంతరం వారి నెత్తిపై గుడ్డు పగలగొట్టాలని ఆదేశించాడు. తనీష్ కెప్టెన్ అయినందున అతని పేరును ఎవరూ చెప్పకూడదనీ బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక ఎవరి నెత్తిపై అధిక గుడ్లు పగులుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ కౌశలే టార్గెట్ అయ్యాడు. అమిత్, రోల్ రైడా, తనీష్, నందిని, బాబు గోగినేని, గణేష్‌లు కౌశల్‌పై గుడ్లు పగలగొట్టారు. కౌశల్ వంతు వచ్చినప్పుడు నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు. సోమవారం షోలో నందిని వర్సెస్ కౌశల్ హైలైట్‌గా నిలిచింది. తనకు అనవసరంగా అడ్వైజ్ చేస్తున్నాడని, ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసానని ఎప్పటికీ గుర్తు చేస్తున్నాడంటూ కౌశల్ గురించి ఇంటి సభ్యులతో చెప్పుకుంటూ వచ్చింది. నామినేషన్ టైమ్‌లో కూడా నందిని ఇదే విషయం ప్రస్తావించి కౌశల్‌పై గుడ్డు పగలగొట్టింది. కాగా.. నందిని ఫ్రెండ్షిప్ విషయంలో మోసం చేసిందని, బాబు గోగినేని రాజమౌళి విషయంలో తప్పుగా మాట్లాడాడని, అందుకే నామినేట్ చేస్తున్నాని వారిద్దరిపై గుడ్లు పగలగొట్టాడు. అయితే దీనిపై బాబు గోగినేని ఇంటి సభ్యులతో చర్చిస్తూ.. అదంతా నటనా అని, రాజమౌళి అభిమానులు తనకు సపోర్ట్ చేయాలని అలా చేశాడని చెప్పుకొచ్చాడు. అనూహ్య ఎంట్రీ.. అర్దరాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి అనూహ్యంగా ఓ కొత్త వ్యక్తి ప్రవేశించారు. ఆమె ఎవరో కాదు స్వామిరారా ఫేం పూజా రామచంద్రన్. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేక యాంకర్ ప్రదీప్‌లా గెస్ట్ అన్న విషయం మంగళవారం ఎపిసోడ్లో రివీల్ కానుంది. ఈవారం ఎలిమినేషన్ లేదు.. అయితే ఈ వారం హౌస్ మేట్స్ ఎలిమినేషన్ లేదని ఎపిసోడ్ చివర్లో బిగ్‌బాస్ ప్రకటించాడు. ‘ఇన్ని వారాలు మీ పేవరేట్ హౌస్ మేట్స్‌ను సేవ్ చేయడానికి ఓట్లేశారు. కానీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.. సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీ ఇందులో ఎవరినైనా మీ ఓట్లతో బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించవచ్చు. ఛాయిస్ ఈజ్ యువర్స్! ఏదైనా జరగొచ్చు’ అని నాని ప్రేక్షకులకు మరో అవకాశం ఇచ్చాడు. ఎలిమినేట్ అయిన వారి కోసం ఓటింగ్ లైన్‌ను ప్రారంభించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే తేజస్వీని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకునేందుకే మళ్లీ ఇలా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు తేజస్వీ సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్‌లోకి వచ్చి తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇక ఈ సందర్భంలో కొందరు తేజస్వీపై మండిపడగా, మరికొందరు సపోర్ట్‌గా నిలిచారు. పరిస్థితి కౌశల్ ఆర్మీ వర్సెస్ తేజస్వీ ఫ్యాన్స్‌గా మారిపోయింది. మరి ఇదంతా దాటుకుని తేజస్వీ ఇంట్లోకి అడుగుపెడుతుందా? లేక మరెవరైనా అడుగుపెడతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.. అసలే బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు. బిగ్‌బాస్ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు! -
బిగ్‌బాస్ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా చేస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-2 హౌస్ నుంచి తాజాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తేజస్వీ మడివాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్‌లో కంటెస్టెంట్లు ఏం చేస్తారన్నది కేవలం గంటసమయం చూపిస్తారని, అందులో తన గురించి చూపించింది నిజాలు కాదని ఆరోపించారు. అది చూసిన అభిమానులు తాను తప్పు చేసినట్లుగా భావించమే తన ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమన్నారు. కేవలం తాను అరిచిన విషయాలే బిగ్‌బాస్‌లో చూపించారని, ఎన్నోసార్లు కౌశల్‌కు సారీ చెప్పినా ఎందుకు చూపించలేదో అర్థం కావడం లేదన్నారు. అసలు కౌశల్‌తో తాను గొడవ పడలేదని, కౌశల్ వేరు అమ్మాయిపై చెయ్యి వేస్తే తాను అడిగానని, అందుకే కౌశల్ ఆర్మీ తనను టార్గెట్ చేసిందన్నారు. ఈ మేరకు నటి తేజస్వి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నన్ను మిస్ జడ్జ్ చేశారు నా లైఫ్‌లోనే బిగ్‌బాస్ హౌస్ లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోలేదు. బిగ్‌బాస్ ఇంటికి హ్యాపీగా వెళ్లాను. తొలుత ఇంట్లో ఎవరూ నచ్చలేరు. కాస్త డిఫరెంట్‌గా ఉన్నారు. తనీష్, సామ్రాట్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. నిన్న బయటకు వచ్చే వరకు చాలా ఎంజాయ్ చేశా. బయటకు వచ్చి చూస్తే నాకు కౌశల్ ఆర్మీ హేటింగ్ గురించి తెలిసింది. బిగ్‌బాస్ హౌస్‌లో 24 గంటలు ఉంటే.. కేవలం మీరు గంట చూసి నాపై నిర్ణయాన్ని తీసుకోకూడదు. మొత్తం 24 గంటలు చూస్తే మీకు తెలుస్తుంది. ఏదైనా జరిగితే నేను కౌశల్ మీద అరిచి ఉంటాను. కానీ ముందు జరిగినది బిగ్‌బాస్ వాళ్లు చూపించలేదు. తలాలోకా లేనివి టీవీల్లో చూసి కౌశల్ ఆర్మీ నాపై విరుచుకు పడుతోంది. కౌశల్ ఆర్మీ ఒకవేళ 24 గంటలు హౌస్ లోపల ఉంటే మీరే అతడిని చంపి బటయకు తీసుకొస్తారు. నాకు సపోర్టు చేసిన హౌస్‌లోని లేడీస్ అందరికీ థ్యాంక్స్. 24 గంటలు ప్రసారం చేస్తే.. కౌశల్ ఆర్మీ వల్ల నాకు మంచే జరిగింది. వారి కోపం వల్ల వేరే వైపు నుంచి నాకు మద్దతు లభిస్తోంది. మీ కౌశల్ అన్నను ఎవ్వరూ ఏం అనలేదు. మీ అన్న అందరూ నిద్రపోయాక లేచి మొత్తం ఫుడ్ తినేస్తాడు. హౌస్ నుంచి బయటకొచ్చాక చూస్తే గీతా అక్క, దీప్తి, రోల్‌రైడా.. ఇలా అందరు లోపల నేను ఉన్నప్పుడు ఉన్నట్లు బయటకు వచ్చాక వాళ్లు అలా లేరు. 24 గంటలు షో ప్రసారం చేస్తే కౌశల్ ఏం చేస్తున్నాడో అందరికీ తెలుస్తుంది. బూతులు మాట్లాడుతున్నారు.. ఎందుకండీ. నేను ఒక్క బూతు మాట అన్నందుకు మీరు వంద అంటున్నారు. అలా అయితే మీకు నాకు తేడా ఏంటీ. హౌస్‌లోకి మళ్లీ పంపించండి.. ప్లీజ్! నేనేంటో మీకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నాకు ప్రేమను ఇస్తే.. నేనేం చేయగలనో మీకు తెలియాలంటే నాకు మరో అవకాశం ఇవ్వండి. నన్ను మళ్లీ చూడాలనుకుంటే నాకు ఓటింగ్ చేయండి. కేవలం షోలో చూపించింది చూసి ఏమాత్రం ఆలోచించకుండా ఓట్లు వేయడం వల్లే నేను ఎలిమినేట్ అయ్యాను. మీరు ఇప్పుడైనా విశ్లేషించుకోండి. అక్కా, చెల్లి, ఫ్రెండ్ ఇలా ఏమనుకున్నా సరే.. నాకు ఓటింగ్ చేయండి. నేను పైకి రావాలన్నా, ఏం సాధించాలన్నా అభిమానుల మద్దతు తప్పకుండా కావాలి. ఈరోజు రాత్రి షో చూడండీ. ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్ అయినా మళ్లీ ఎంట్రీ ఇవ్వొచ్చు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి : నెటిజన్ల ట్రోలింగ్ తనకు మరో అవకాశం ఇవ్వాలని తేజస్వీ కోరగా.. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నీ మనసు గెలిచింది సామ్రాట్, తనీష్.. కానీ కౌశల్‌కు ఆర్మీ ఉంది’, ‘మీ యాటిట్యూడ్ మాకు నచ్చదు. కౌశల్‌ని చాలా బాధపెట్టారు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు’, ‘మేడం.. మీ బూతులు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాయి. మీరు లేనిలోటు తెలుస్తోంది. మళ్లీ హౌస్‌లోకి వెళ్లాలి’, ‘అక్కా.. ఎందుకక్కా మాపై కక్ష .. మళ్లీ బిగ్ బాస్ కి వెళ్లకు.. మమ్మల్ని హ్యాపీగా బిగ్ బాస్ ని చూడనివ్వు అక్క..’, అని, ‘ఇప్పుడు హౌస్ చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు హౌస్‌లో ఉంటే మేం కుటుంబం మొత్తం కలిసి ఇన్ని రోజులు షో చూడలేకపోయాం’, అంటూ నెటిజన్లు తేజస్వీనిని ట్రోల్ చేశారు. తేజస్వీ వీడియోకు వచ్చిన కామెంట్లు స్క్రీన్‌షాట్ -
బిగ్‌బాస్ మరో అవకాశం.. ఛాయిస్ ఈజ్ యువర్స్!
సాక్షి, హైదరాబాద్ : ‘బిగ్‌బాస్ సీజన్ 2 ఏదైనా జరగొచ్చు’ అన్నట్లే ఊహించిన విధంగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు హోస్ట్ నాని. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎవరైన కొత్తవారు వస్తారని అందరూ భావించారు.. ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని పటా పంచల్ చేస్తూ బిగ్‌బాస్ ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. ‘ఇన్ని వారాలు మీ పేవరేట్ హౌస్ మేట్స్‌ను సేవ్ చేయడానికి ఓట్లేశారు. కానీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.. సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీ ఇందులో ఎవరినైనా మీ ఓట్లతో బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించవచ్చు. ఛాయిస్ ఈజ్ యువర్స్! ఏదైనా జరగొచ్చు’ అని నాని ప్రేక్షకులకు మరో అవకాశం ఇచ్చాడు. ఓటింగ్ లైన్స్ ఈ రోజు 11 గంటలకు ప్రారంభమవుతాయని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమకు అనుకూలంగా ప్రేక్షకులు ఓటేసేలా ప్రచారం మొదలుపెట్టారు. ఇక తొలి వారం సంజనా, రెండో వారం నూతన నాయుడు, మూడో వారం కిరీటీ, నాలుగో వారం శ్యామల, ఐదో వారం భానుశ్రీ, ఆరోవారం తేజస్వీలు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తేజస్వీ రీఎంట్రీ కోసమే.. ఈ బిగ్‌బాస్ అవకాశాన్ని కొందరు స్వాగతిస్తుండగా మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తేజస్వీ రీఎంట్రీ కోసమే ఈ అవకాశం కల్పించారని పలువురు ఆరోపిస్తుండగా.. ఆమె అభిమానులు మాత్రం తెగ సంతోషడుతున్నారు. ‘స్టార్ మా’ ఫెస్బుక్ పేజీ కామెంట్ సెక్షన్లో అభిమానుల కౌశల్ Vs తేజస్వీలుగా విడిపోయారు. తేజస్వీకి ఓటేయండి.. ఇదో సువర్ణవకాశమని ఆమె అభిమానులు కోరుతున్నారు. కౌశల్ అభిమానులు మాత్రం.. నూతన్ నాయుడు, శ్యామలకు ఓటేయ్యాలని పిలుపునిస్తున్నారు. ఈ విషయంలో వారు కొంత బిగ్‌బాస్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తేజస్వీ ఔట్ -
బిగ్‌బాస్ : నెటిజన్లపై మండిపడ్డ నాని
ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం ముందే లీకైంది. శనివారం జరిగిన షూటింగ్‌లోంచి వచ్చే లీకులు, బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసే ఫోటోల ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈజీగా తెలిసిపోతోంది. బిగ్‌బాస్ ఇంత కష్టపడి సస్పెన్స్ మెయింటెన్ చేయాలని చూస్తోన్నా.. ఈ లీకులు మాత్రం ఆగడం లేదు. ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్ కాబోతోందన్న వార్త ముందే బయటకు వచ్చింది. సందడి చేసిన మంచు లక్ష్మి.. ప్రతివారం ఎలిమినేషన్ ప్రకటించే నాని.. ఈసారి మాత్రం ఆ బాధ్యతను మంచు లక్ష్మికి ఇచ్చారు. వైఫ్ ఆఫ్ రామ్ ప్రమోషన్లో భాగంగా ఇంట్లోకి ఎంటరైన మంచు లక్ష్మి.. హౌజ్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. ఇంటిలో హంగామా చేస్తున్న మంచు లక్ష్మికి టాస్క్ ఇచ్చారు. నాని బిగ్‌బాస్ ఇంట్లోని సభ్యుల మాదిరిగా ఇమిటేట్ చేస్తూ ఉంటే.. తను గుర్తు పడుతూ ఉండాలి. ఈ టాస్క్‌లో మంచి లక్ష్మి దాదాపుగా అందరిని గుర్తుపట్టారు. రోల్‌రైడా తనకోసం ఓ పాటను ఆలపించాడు. గణేష్ కూడా ఆర్జేగా మారి అక్కడి వాతావరణాన్ని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. చివరగా మంచు లక్ష్మి.. ఆరో వారం ఎలిమినేషన్ కానున్న కంటెస్టెంట్ తేజస్వీ అని ప్రకటించారు. నెటిజన్లపై మండిపడ్డ నాని బిగ్‌బాస్ ఇంటి సభ్యులపై సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌పై నాని మండిపడ్డారు.‘మీకు ఒకరు నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు.. హౌజ్‌లో ఓ సభ్యుడు ఉండొచ్చు.. ఉండకూడదు.. బాబోయ్ ఈ హౌజ్‌మేట్ మాకొద్దు అని చెప్పొచ్చు. కానీ అసభ్యకరమైన పదాలతో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తేజస్వీ విషయంలో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి ఇలాంటి మనుషులు బయట ఉన్నారా అని అనిపిస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్, జుగుప్సాకరమైన పదాలతో కామెంట్స్ చేసే వారిపై నాని మండిపడ్డారు. గణేష్ పై బిగ్‌బాంబ్.. ఇంటి నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి నాని ఓ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులందరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పి మార్కులు వేయాలని చెప్పారు. ఈ టాస్క్‌లో సామ్రాట్, తనీష్, బాబు గోగినేనికి పదికి పది మార్కులివ్వగా.. కొందరికి 8 మార్కులు ఇచ్చింది. కౌశల్‌కు 5 మార్కులు ఇచ్చి.. కౌషల్ తనకు బయట కూడా తెలుసని, తను ఎలాంటి వాడో తెలుసంటూ.. కౌశల్ విషయంలో తనెప్పుడూ తప్పు కాదు అంటూ వివరించింది. అమిత్‌ను దొంగ మై కొడుకు.. గణేష్‌ను లడ్డేశ్, బ్రెడ్డేష్, హౌలేష్ .. దీప్తి సునయను అలక రాణి.. తనీష్ కోపంలోనే బాగుంటాడు.. అని తెలిపింది. ఈ వారం బిగ్ బాంబ్‌ను కాస్త వెరైటీగా ప్లాన్ చేశారు. ముందు ఒక ఇంటి సభ్యుడిని ఎంచుకున్న తరువాత బిగ్‌బాంబ్ ఏంటి అనేది రివీల్ చేశారు. తేజస్వీ గణేష్‌ను ఎంచుకోగా.. తరువాతి వారం మొత్తం పాలసీసాతో నీటిని తాగడమే ఈవారం బిగ్‌బాంబ్ అంటూ నాని తెలిపారు. తేజస్వీ వెళ్తూ వెళ్తూ... కౌశల్ నువ్వు గేమ్‌లో విన్నర్ అవుతామో కానీ నేను హౌజ్‌మేట్స్ అందరి మనసు గెలుచుకున్నాను అంటూ పేర్కొంది. చదవండి : బిగ్‌బాస్: తేజస్వీ ఔట్ -
బిగ్‌బాస్: తేజస్వీ ఔట్
సాక్షి, హైదరాబాద్ : అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్ హౌస్ నుంచి తేజస్వీ మడివాడ ఎలిమినేట్ అయింది. అదేంటీ ఎపిసోడ్ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్ ఒక రోజు ముందు షూటింగ్ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి తేజస్వీయే ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించినదే.. ఓ టాస్క్‌లో కౌశల్‌తో ప్రవర్తించిన తీరు.. ఆమెపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతను తీసుకురాగా.. కౌశల్‌ను హీరో చేసింది. ఈ దెబ్బతోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భాను శ్రీ గతవారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక హౌస్ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వీ హౌస్‌మెట్స్‌కు క్లారిటీ ఇచ్చింది. కౌశల్ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుని శిక్షించారని, ఇప్పుడు తనువంతు వచ్చిందని, హౌస్ నుంచి నిష్క్రమించడానికి లక్ష కారణాలున్నాయని పేర్కొంది. ఈ విషయం శనివారం ఎపిసోడ్లో కనిపించింది. ప్రస్తుతం తేజస్వీ ఎలిమినేట్ అయిన విషయం సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె బయటకు వచ్చిన అనంతరం అభిమానులు దిగిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. తేజస్వీ ప్రేమలో పడ్డా.. ఇక అర్థరాత్రి లైట్స్ ఆఫ్ అయినా పడుకోకుండా ఎలిమినేషన్ జాబితాలో ఉన్న రోల్‌రైడా దీప్తి, తనీష్‌లు, సామ్రాట్, తేజస్వీలు హౌస్‌లోకి ఎందుకు వచ్చామో ఒక్కొకరు తెలిపారు. ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. 100 రోజుల్లో 50 లక్షలు గెలుచుకోవచ్చని, సినిమాలు చేసిన ఇంత సంపాదించలేనని అందుకే బిగ్‌బాస్‌కు వచ్చినట్లు పేర్కొంది. నిజానికి తాను ఎవరిని ప్రభావితం చేయలేదని, సామ్రాట్‌ను అనుసరించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. ఈ చర్చ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు బిగ్‌బాస్ హౌస్‌కు రావాలని లేదు. నా జీవితంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేనేంటో నిరూపించుకోవడానికి వచ్చా. ఇక్కడికి వచ్చాక నాకు తేజస్వీ నుంచి స్వచ్చమైన ప్రేమ దొరికింది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వీరి బంధం బయట కూడా కొనసాగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఆకట్టుకున్న నాని.. శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాని తనదైన శైలితో అలరించాడు. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అందరి నటనను సమీక్షించాడు. ఇక ఈ వారంలో హైలైట్‌గా నిలిచిన అంశాలపై ఇంటి సభ్యులతో మాట్లాడాడు. అమిత్‌కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్, గణేష్ నెత్తిన గుడ్డు పగలగొట్టడం , గణేష్ ఏడ్వడం.. దీప్తి, గణేష్‌లు నామినేషన్ గురించి చేసిన హంగామా.. నందిని, కౌశల్ మధ్య జరిగిన సంభాషణలపై చర్చించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తనీష్‌కు అభినందనలు తెలిపాడు. ఎలిమినేషన్ జాబితాలో ఉన్న రోల్‌రైడా, దీప్తీ, తనీష్‌లను ప్రోటెక్ట్ అయ్యారని చెప్పి.. బిగ్‌బాస్ ప్రేమజంటలో ఒకరు నిష్క్రమించక తప్పదు అని పేర్కొన్నాడు. అయితే ఈ సస్పెన్స్‌తో రేటింగ్స్ రాబట్టుకోవాలనుకున్న బిగ్‌బాస్ వ్యూహానికి గట్టి దెబ్బ తగిలింది. తొలి వారం సంజన ఎలిమినేషన్ తప్ప అన్నీ వారాలు ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం ముందే తెలిసిపోయింది. బయటకు వచ్చిన అనంతరం తేజస్వీతో ఓ అభిమాని సెల్ఫీ.. -
బిగ్‌బాస్ : ఆ జంట వేరు కాబోతోంది!
బిగ్‌బాస్ ఇంట్లో ఆరోవారం సరద సరదాగా గడిచిపోయింది. ఇంటి సభ్యులంతా కలిసి నిర్మించిన సినిమాపై నాని రివ్యూ ఇచ్చారు. అందరి నటనపై రివ్యూపై ఇస్తూ... రేటింగ్‌ను ఇచ్చారు. ఇక ఈ వారంలో హైలెట్‌గా నిలిచిన అంశాలపై ఇంటి సభ్యులతో మాట్లాడారు నాని. అమిత్‌కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్, గణేష్ నెత్తిన గుడ్డు పగలగొట్టడం , గణేష్ ఏడ్వడం.. దీప్తి, గణేష్‌లు నామినేషన్ గురించి చేసిన హంగామా.. నందిని, కౌషల్ మధ్య జరిగిన సంభాషణలపై నాని చర్చించారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తనీష్‌కు అభినందనలు తెలిపారు నాని. అయితే ఆరో వారం ఎలిమినేషన్ జాబితాలో ఉన్న దీప్తి, తనీష్‌లు ప్రొటెక్షన్ జోన్లో ఉన్నట్లు నాని ప్రకటించారు. ఇక మిగిలిన ఇద్దరి గురించి అందరికి తెలిసిందే. తేజస్వీ, సామ్రాట్ల జంట గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తేజస్వీ చేసే చేష్టలతో విసిగి ఉన్న ప్రేక్షకులు ఆమెని పంపిస్తారో లేక తేజస్వీ చుట్టు తప్పా ఇంకేం పట్టదన్నట్లు ఉండే సామ్రాట్‌ను పంపిస్తారో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం తేజస్వీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. నెటిజన్లు తేజస్వీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజస్వీ ప్రవర్తన, ఇంట్లో వీరిద్దరు చేసే అతిని చూడలేక ప్రేక్షకులు చివరికి వీరిద్దరిని విడదీయాలని ఫిక్స్ అయినట్టున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌ను చూస్తే తేజస్వీ బయటకు వేళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో... ఎందుకంటే బిగ్‌బాస్‌లో ఏమైనా జరుగొచ్చు. -
బిగ్‌బాస్ : కన్నీటి పర్యంతమైన నందిని..
ఆరో వారం బిగ్‌బాస్ షో సరదాగా సాగిపోతోంది. బిగ్‌బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా కలిసి తెరకెక్కించిన సినిమాకు ప్రశంసలు దక్కాయి. సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందుకు బిగ్‌బాస్ నిర్మాత బాబు గోగినేని, దర్శకుడు అమిత్‌కు కొంత డబ్బును ఇవ్వగా... దానిని సినిమా కోసం పనిచేసిన మిగతా బృందానికి నటీనటులు, సాంకేతిక బృందానికి తగిన పారితోషకం ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించారు. సభ్యులందరిలో ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారే విజేతలని బిగ్‌బాస్ చెప్పగా.. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్న బాబు గోగినేని, తనీష్, అమిత్‌లను ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హులుగా ప్రకటించారు. కెప్టెన్‌గా తనీష్.. టమాటలను తొక్కుతూ.. వాటి నుంచి జ్యూస్ తీయాలని టాస్క్‌ను ఇవ్వగా.. ఎవరు ఎక్కువ రసం తీస్తే వారే విజేతలని బిగ్‌బాస్ తెలిపాడు. ఈ టాస్క్‌లో ఎవరైనా ఒక ఇంటి సభ్యుడి సహాయం తీసుకోవచ్చు అని చెప్పగా...అమిత్.. రోల్ రైడా, బాబు గోగినేని.. తేజస్వీ, తనీష్.. సామ్రాట్ల సహాయాన్ని తీసుకొన్నారు. ఈ టాస్క్‌లో తనీష్ చురుగ్గా పాల్గొనగా.. ఎక్కువ రసాన్ని తీసి కెప్టెన్‌గా బాధ్యతను తీసుకున్నారు. బిగ్‌బాస్ ఏర్పాటుచేసిన క్విజ్‌పోటీలు.. ఈ క్విజ్‌పోటీల్లో.. ఇచ్చిన స్టేట్మేంట్లు ఇంటిసభ్యుల్లో ఎవరికి సరిపోతుందో.. సరైన సమాధానం చెబితే వారికిష్టమైన ఫుడ్‌ను బిగ్‌బాస్ అందిస్తాడు. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అన్న దానికి సమాధానంగా ఇంటి సభ్యులు నందిని పేరును సజెస్ట్ చేయగా.. సరైన సమాధానమంటూ నందినికీ ఇష్టమైన ఫుడ్‌ను ఇచ్చాడు. ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసు.. కానీ బిగ్‌బాస్ హౌజ్ గురించి తెలియదు అనే ప్రశ్నకు బాబు గోగినేని పేరును చెప్పారు. కొండంత మనిషి.. కానీ మనసు వెన్న అనే దానికి అమిత్.. అసలు దాన్ని వదిలేసి కొసరును పట్టుకుని వేలాడుతుంది అనే దానికి గీతా మాధురి, ప్రేమ పూజారి అనే దానికి తనీష్, కొంచెం మంచి కొంచెం చెడుగా కౌశల్, ఎలిమినేషన్ అంటే భయపడే వ్యక్తిగా దీప్తి, లడ్డుబాబుగా గణేష్, అలరిస్తూ..ఆనందించే వాడుగా రోల్ రైడా, చిన్నదానిలా వచ్చి ఘాటు మిర్చిగా మారింది అనే దానికి దీప్తి సునయన పేర్లను కరెక్ట్‌గా చెప్పిన ఇంటి సభ్యులు సామ్రాట్, తేజస్వీ విషయాల్లో సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. కన్నీరు పెట్టిన నందిని.. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే స్టేట్మేంట్ తనకు ఇచ్చినందుకు నందిని రాయ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి సభ్యులందరూ ఓదార్చసాగారు. ఇంటి సభ్యులకు స్టేట్మెంట్స్ను ఊరికే ఇవ్వలేదని.. ఇంట్లో సభ్యులు ప్రవర్తించే తీరును గమనించే ఇచ్చాడని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా యాంకర్ ప్రదీప్
బిగ్‌బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వ్యాఖ్యాత నేచురల్ స్టార్ నాని శని, ఆది వారాల్లో చెబుతున్న పిట్టకథలు, హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాని ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అన్నది నిజమే అనిపిస్తోంది. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త సెలబ్రిటీల ఎంట్రీ ఉండటంతో బిగ్ బాస్ హౌస్‌కి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సీజన్ వన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్‌లు హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హీరోయిన్ హెబ్బా పాటేల్ వస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్‌బాస్ హౌస్‌కి లగేజ్‌తో సహా దిగిన ఓ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్‌ను చూసిన కంటెస్టెంట్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రదీప్ రాగానే అందరూ హత్తుకుని అతనికి ఆహ్వానం పలికారు. ప్రదీప్ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే.. వారం రోజుల్లో పంపించేస్తాం అని ఆటపట్టించగా.. రాగానే మొదలు పెట్టారా అని ప్రదీప్ సమాధానం ఇచ్చారు. మీ వాడిని మీలో ఒడిని కాబట్టి మీలాగ ఇక్కడికి ఖాళీ చేతులతో రాదలచుకోలేదని చెప్పి, ఒక్కొక్కరి గురించి చెబుతుండగా.. కంటెస్టెంట్లు అందరూ కంటతడి పెట్టుకున్నారు. పోను పోను నేను పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు. అయితే 16 మందితో మొదలైన బిగ్ బాస్ షో ను ఇప్పటికే ఐదు మంది (సంజన, నూతన్ నాయుడు, కిరిటీ, శ్యామల, భానుశ్రీ) హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ప్రదీప్ హౌజ్‌లో ఎన్ని రోజులు ఉంటారో వేచిచూడాల్సిందే. అయితే ఆయన గెస్ట్‌గా మాత్రమే హౌజ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. . @impradeepmachi makes a Grand Entry to the Bigg House 😉#BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/mXZVXMnjCl — STAR MAA (@StarMaa) July 19, 2018 -
బాబు గోగినేనిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆయనకు నోటీసులు జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. నేడో, రేపో బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో నిర్వాహకుల చేతికి నగరంలోని మాదాపూర్ పోలీసులు అందుకు సంబంధించిన నోటీసులు అందజేయనున్నారు. నోటీసులు అందుకున్నాక వివరణ ఇచ్చుకునేందుకు 48 గంటలు సమయం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇటీవల బాబు గోగినేనిపై కేసు నమోదైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈనెల 25వ తేదీలోగా బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. బాబు గోగినేనిపై గత నెలలో తీవ్రమైన నేరారోపణలతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని పిటిషనర్ కేవీ నారాయణ తన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని వారు ఫిర్యాదులో తెలిపారు. దీంతో దేశ ద్రోహం, మత విశ్వాసాలను అవమానించడం, అనుచిత ప్రచారంతో పాటు, ఆధార్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
బిగ్‌బాస్ ఎంట్రీపై హీరోయిన్ క్లారిటీ
బిగ్‌బాస్ సీజన్ 2కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది. హోస్ట్ నాని శని, ఆది వారాల్లో బెబుతున్న పిట్టకథలు, హౌస్‌మేట్స్‌తో జరుపుతున్న సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముందుగా చెప్పినట్టుగానే ఏమైనా జరగవచ్చు అనేలా ఉంది హౌస్‌లో పరిస్థితి. సీజన్ వన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా దీక్షా పంత్, నవదీప్‌లు హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి ఈసారి ప్రముఖ హీరోయిన్, కుమారి 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై హెబ్బా స్పందించారు. దీనిపై ఆమె ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడారు. తను ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన లేదని.. తనను దీనిపై ఎవరు సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యమేస్తుందన్నారు. ప్రస్తుతం తను చేయాల్సిన సినిమాలతో బిజీగా ఉన్నానని హెబ్బా తెలిపారు. ఇక బిగ్‌బాస్ హౌస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సంజన, నూతన నాయుడు, కిరిటీ దామరాజు, యాంకర్ శ్యామల, భాను ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనీష్‌లు నామినేట్ అయ్యారు. సోమవారం జరిగిన ఎపిసోడ్లో కామన్‌మ్యాన్ గణేశ్ కంటతడి పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
బిగ్‌బాస్ : వెక్కి వెక్కి ఏడ్చిన గణేశ్
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-2 ఏమైనా జరుగొచ్చు అన్న ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టే సోమవారం ఎపిసోడ్ కొంత ఆసక్తికరంగా.. మరికొంత నిరుత్సాహంగా సాగింది. కామన్‌మ్యాన్ గణేశ్ కంటతడి పెట్టాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ చిన్నపిల్లాడిలా బాధపడ్డాడు. ‘నేను వెళ్తా.. ఇలా అయితే ఈ హౌజ్ నాకు అవసరం లేదు.. నన్ను ఎలిమినేట్ చేసేయండి.. కొట్టించుకోవడానికి రాలేదు’ అంటూ బోరుమన్నాడు. ఇంతకీ జరిగిందేమిటంటే.. వారం ప్రారంభ ఎపిసోడ్ కావడంతో బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టాడు. తొలుత కంటెస్టెంట్స్‌ను హౌస్‌లో ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదో ఆ ఒకరి పేరును ఏకాభిప్రాయంగా సూచించాలని ఆదేశించాడు. దీనికి హౌస్ మేట్స్ వారిలో వారు చర్చించుకోని ఓటింగ్ నిర్వహించి అమిత్ పేరును సూచించారు. అయితే ఇక్కడ అమిత్ పేరును తొలుత గణేశే ప్రస్తవించాడు. దీంతో బిగ్‌బాస్, అమిత్ ఇప్పటి నుంచి హౌస్‌లో అదృశ్యవాసి అని అతనితో ఎవరు మాట్లాడవద్దని ఆదేశించాడు. అమిత్ ఎలిమినేషన్‌కు డైరెక్ట్‌గా నామినేట్ అయినట్లు కూడా తెలిపాడు. ఇక్కడ అతనికి బిగ్‌బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే ఎలిమినేషన్ నుంచి తప్పిస్తానన్నాడు. బేడీలు..నామినేషన్లు.. కంటెస్టెంట్స్‌లను వారికి ఇష్టమైనవారితో జోడీలుగా విడిపోమ్మని బిగ్‌బాస్ సూచించాడు. దీనికి హౌస్ మేట్స్ గణేశ్-దీప్తి, తనీష్-దీప్తి సునయన, నందిని రాయ్-తేజస్వీ, కౌశల్-సామ్రాట్, బాబు గోగినేని-రోల్ రైడాలుగా విడిపోయారు. బజర్లు మోగగానే జంటగా ఉన్న ఇద్దరు చర్చించుకోని ఒకరు విడుదలవ్వాలని, ఇలా విడుదల అయిన వారు సేఫ్ అయినట్లు మిగిలినవారు డైరెక్ట్‌గా ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయినట్లు అని పేర్కొన్నాడు. అయితే విడుదల చేసే ముందు కారణం తెలపాలని కూడా చెప్పాడు. అమిత్‌కు ఇచ్చిన ఆ టాస్క్ ఏమిటంటే.. 1. ఏదైన వంటను చెడగొట్టాలి. 2. ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డు కొట్టాలి 3. దీప్తి సునయనను ఏడిపించాలి. 4. ఓ కంటెస్టెంట్ ప్యాంట్, షర్ట్, షూస్ స్విమ్మింగ్‌పూల్‌లో వేయాలి. 5. ఓ హౌస్‌మేట్‌ను డైనింగ్ టేబుల్‌పై డ్యాన్స్ చేసేలా చేయాలి. ఇవన్నీ ఎవరికి తెలియకుండా.. కంటపడకుండా బజర్స్ మోగడం పూర్తి అయ్యేలోపు చేయాలి. అయితే ఇందులో అమిత్ నాలుగు పనులను విజయవంతంగా పూర్తి చేశాడు. గీతా మాధురి ఏదో జ్యూస్ చేస్తుండగా ఎవరికీ తెలియకుండా దానిలో ఉప్పు వేసి చెడగొట్టాడు. ఈ జ్యూస్‌లో ఉప్పు ఎక్కువైందనీ బాబు గోగినేని తెలిపినా తనే కావాలని వేసినా అని గీతా చెప్పడం ఇక్కడ విశేషం. తనీష్, టీషర్టు, ప్యాంట్ స్విమ్మింగ్ పూల్‌లో వేయడం, దీప్తి సునయను ఏడిపించే ప్రయత్నం, గణేశ్‌పై గుడ్డు కొట్టడం వంటి పనులను అమిత్ పూర్తి చేశాడు. ఓవైపు నామినేట్ ఎవరు కావాలని జుట్టు పీక్కుంటున్న గణేశ్-దీప్తిల వద్దకు వచ్చిన అమిత్.. ఆకస్మాత్తుగా గుడ్డుతో గణేశ్‌పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ‘నా పేరే తొలుత నీవే చెప్పావు. నా కోపం చూడవద్దన్నా కానీ చూశావు’ అంటూ నటిస్తూ బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనతో హౌస్ మేట్స్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గణేశ్ అయితే బిత్తర పోయాడు. అప్పటికి దీప్తి ఏదైనా సిక్రెట్ టాస్క్ అయి ఉండవచ్చని కూడా గణేశ్‌కు సర్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ గణేశ్ మాత్రం బాత్రూంలోకి వెళ్లి మరీ గట్టిగా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అందరితో బాగుండే అమిత్ ఇలా చేయడం ఏమిటీ.. టాస్క్ అయితే మాత్రం ఇలా ఓ వ్యక్తిపై దాడి చేయడం అవసరమా అని హౌస్ మేట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గణేశ్ చిన్నపిల్లాడిలా మరింత ఏడ్వసాగాడు. మరో వైపు కెమెరాల ముందుకొచ్చి అమిత్ కంటతడి పెట్టుకున్నాడు. వీళ్లంతా నన్ను అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు టాస్క్ ఓడిపోయినా పర్వాలేదని, గణేశ్ దగ్గరకు వెళ్లి హౌస్మేట్స్ అందరికి ఉన్న విషయం చెప్పాడు. నామినేట్ అయింది.. ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనీష్‌లు నామినేట్ అయ్యారు. సామ్రాట్, కౌశల్‌ను సేవ్ చేయగా.. తేజస్వీ,..నందును, రోల్‌రైడా.. బాబుగోగినేనిని, తనీష్.. దీప్తి సునయనలను కాపాడారు. ఇక సీక్రెట్ టాస్క్‌లో ఎక్కువ పనులు అమిత్ పూర్తి చేయడంతో నామినేషన్ తప్పించుకున్నాడని బిగ్‌బాస్ అనౌన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పనులు పూర్తి చేసినా అతను టాస్క్ గురించి చెప్పేశాడని, అయినా బిగ్‌బాస్ విజయవంతమయ్యాడని ప్రకటించడం ఏమిటని, ఈ విషయంలో బిగ్‌బాస్ ఘోరంగా విఫలమయ్యాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కామన్ మ్యాన్ అన్న విషయంతో గణేశ్‌కు మద్దతినిస్తుంటే అతనేమో చిన్న పిల్లాడిలా ఏడ్వడం ఏమిటని, ఇవన్నీ బిగ్‌బాస్‌లో ఉంటాయనే విషయం తెలియదా అని మండిపడుతున్నారు. ఇంకొందరమే గుడ్లతో దాడిచేయడం ఏమిటని పాపం గణేశ్ అంటూ.. అతనికి మద్దతు తెలుపుతున్నారు. ఇలా అమిత్ సీక్రెట్ టాస్క్.. నామినేషన్ ప్రక్రియ కొంత ఆసక్తికరంగా ఉండగా.. గణేశ్ సిల్లీగా ఎడ్వడం, బిగ్‌బాస్ టాస్క్ ప్లాన్ గాడితప్పడం నిరుత్సాహ పరిచింది. చదవండి: టార్గెట్ దీప్తీ.. గణేశ్ అత్యుత్సాహం! -
నోటికి అడ్డూ అదుపూ లేదా? : నాని
బిగ్‌బాస్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు అని హోస్ట్ నాని అంటే... ఏంటో గతవారం జరిగిన ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. మంచి, చెడు టీమ్‌ల మధ్య సాగిన టాస్క్‌లో రెచ్చిపోయారు ఇంటి సభ్యులు. వాగ్వాదాలు, ఆరోపణలు, క్షమాపణలు, బుజ్జగింపులు, త్యాగాలు, కోపాలు, తాపాలు ఇలా అన్నింటిని ఐదో వారం బిగ్‌బాస్‌లో చూపించేశారు. ఆసక్తికరమైన పిట్టకథతో నాని అనగనగా రెండు గాడిదలు. ఒకదానిపై ఉప్పు మూట, మరో దానిపై దూది మూట. ఆ గాడిదలు ఒక కాలువను దాటాలి. అలా దాటుతుండగా మధ్య మధ్యలో ఉప్పు మూట ఉన్న గాడిద నీటిలో మునుగుతూ ఉంది. ఇలా ఎందుకు చేస్తున్నావని రెండో గాడిద అడిగే సరికి.. నేను అలా చేసినప్పుడల్లా మూటలోని ఉప్పు కరిగి.. బరువు తగ్గుతోందని చెప్పగానే రెండో గాడిదకు కూడా ఆలోచన వచ్చి అది కూడా మధ్యమధ్యలో నీటిలో మునిగింది. చివరకు దూది బరువెక్కి మోయలేకపోయిందంటూ ఇది ఎవరికి వర్తిస్తుందో చివరకు చెబుతానంటూ నాని ముగించేశాడు. సభ్యులను మందలించిన నాని ఈ వారం సభ్యులు చేసిన పనులన్నింటిపై నాని విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా తేజస్వీపై కోపం ప్రదర్శించాడు నాని. నోటికి అడ్డూ అదుపూ లేదా ఎంతొస్తే అంత మాట్లాడుతావా? వాడు, వీడు, వెదవ, తూ.. ఇలా ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నావు.. నోటిని అదుపులో పెట్టుకోమని మందలించాడు. దీంతో తెల్లబోయిన తేజస్వీ క్షమించమని అడిగింది. ఇదే విధంగా భానును కూడా మందలించాడు. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా.. కౌశల్‌పై ఆరోపణలు చేయడం సరికాదంటూ చెప్పాడు. కౌశల్‌పై ఉన్న ద్వేషమే ఇందుకు కారణమని చెప్పాడు. టాస్క్‌లో భాగంగా అమ్మాయిలతో ఆడేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ.. ఇంటిలోని సభ్యులకు సలహా ఇచ్చాడు. దీప్తి సునయన విషయంలో తనీష్ చేస్తున్న పనిని తప్పుబట్టాడు. ఆమె కెప్టెన్సీ టాస్క్ విషయంలో తనీష్ తలదూర్చడంపై నాని ఆగ్రహించాడు. ఇక సామాన్యుడైన గణేష్ సెల్ఫ్ నామినేట్ చేసుకోవడంపై మందలించాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావని, కొత్తిమీర కట్టలు తిని బాబు గోగినేని చేసిన టాస్క్‌ను వృథా చేశావని గణేష్ చేసిన తప్పిదాన్ని వివరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తనకిష్టమైన అమిత్ ఈసారి నిరాశ పరిచాడని నాని అన్నాడు. ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వచ్చిన పేరంతా ఒక్కసారిగా కొట్టుకుపోయిందంటూ చెప్పుకొచ్చాడు. భానుకు ఇచ్చిన మాటను.. తేజస్వీ, సామ్రాట్లు ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసరికి మాటమార్చావని, సరిగా ఆలోచించడం చేతకాదంటూ అమిత్‌పై ఆగ్రహించాడు. గీతామాధురిని మెచ్చుకున్న నాని తేజస్వీ, భానులు కౌశల్‌పై ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న తరుణంలో గీతామాధురి వాటికి అడ్డుకట్ట వేసింది. కౌశల్ తప్పుగా ప్రవర్తించలేదని, అనవసరంగా గొడవ చేయొద్దని, టాస్క్‌ను టాస్క్‌లా ఆడాలంటూ.. క్యారెక్టర్ల జోలికి వెళ్లొద్దని హితవు పలికింది. ఇదే విషయాన్ని నాని ప్రస్తావిస్తూ.. సమాజంలో కూడా మీలాంటి వాళ్లు ఉంటే బాగుంటుందని, అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించడాన్ని నాని మెచ్చుకున్నారు. గత వారం కార్యక్రమం వివరంగా.. ఈసారి విభిన్నంగా బిగ్‌బాసే ఇంటి సభ్యులను నామినేట్ చేసి.. అది తప్పించుకోవాలంటే.. వారికిచ్చిన టాస్క్‌ను కంప్లీట్ చేయాల్సిందిగా షరతును విధించాడు. అలా చేయలేకపోతే.. వారు స్వయంగా నామినేట్ అవుతారంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు. బిగ్‌బాస్ మొదటగా తేజస్వీని పిలిచి బిగ్‌బాస్.. తను ఎలిమినేషన్లో భాగంగా ఈ వారం నామినేట్ అయినట్లు తెలిపారు. అయితే దీన్నుంచి తప్పించుకోవాంటే.. సామ్రాట్‌ను క్లీన్షేవ్ చేసుకునేలా ఒప్పించాలని టాస్క్ ఇచ్చాడు. తేజస్వీ కోసం.. సామ్రాట్ క్లీన్షేవ్ చేసుకుని తేజస్వీని నామినేషన్ నుంచి తప్పించాడు. గణేష్ కోసం... బాబు గోగినేని కొత్తిమీర కట్టలు తిన్నారు. గీతా మాధురి కోసం.. తేజస్వీ తనకిష్టమైన తెల్ల దుప్పటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించేసింది. తనీష్ కోసం దీప్తి సునయన తన జుట్టును కత్తిరించుకుంది. సామ్రాట్ కోసం తనీష్ తన జాకెట్‌ను రెడ్కలర్లో ముంచాడు. ఇలా ఒక్కొక్కరు తమ ప్రేమను వ్యక్తపరిచారు. అయితే రోల్‌రైడా కోసం గణేష్ ఒక్కవారం పాటు కేవలం పళ్లు తింటూ.. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. దీప్తి కోసం నందిని వెళ్లి కౌశల్‌ను ప్రతివారం సెల్ఫ్ నామినేషన్ చేసుకునేలా ఒప్పించాలని టాస్క్రాగా.. దీంట్లో నందిని ఫెయిల్ అవుతుంది. గెలవడానికే ఇక్కడకు వచ్చానని, నాకు నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే.. నా అంతట నేనే ఒడిపోయానని ఒప్పుకున్నట్లు అవుతుందంటూ నందినికి చెప్పాడు. సో.. దీప్తికి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌కు చేయనందుకు దీప్తి నామినేట్ అయింది. భాను కోసం అమిత్ మొదటగా బిగ్‌బాస్ షరతులను ఒప్పుకోగా.. కొద్దిసేపటికే సామ్రాట్, తేజస్వీల మాటలకు ప్రభావితమైన అమిత్ వాటికి ఒప్పుకోలేదు. అమిత్ చేసిన ఈ పని వల్ల భానును బిగ్‌బాస్ నామినేట్ చేశారు. ఈ టాస్క్‌లు కంప్లీట్ అయ్యేసరికి గణేష్, దీప్తి, భానులు నామినేట్ అయ్యారు. రసవత్తరంగా మారిన మంచి-చెడు టాస్క్ లగ్జరీ బడ్జెట్లో భాగంగా బిగ్‌బాస్ ఈవారం.. ఇంటి సభ్యులను మంచి, చెడు టీమ్ సభ్యులుగా విడగొట్టాడు. కౌశల్, తనీష్, దీప్తి సునయన, దీప్తి, నందిని, రోల్‌రైడా మంచి టీమ్ సభ్యులు కాగా, మిగిలిన వారంతా చెడు టీమ్‌సభ్యులు. చెడు టీమ్ సభ్యులు ఇంటిని నాశనం చేయడం టాస్క్ కాగా, మంచి టీమ్ వీరి ఆగడాలను భరించడం, ఇంటిని చక్కదిద్దడం వంటి పనులు చేయాలి. చెడు టీమ్ సభ్యులు ఇంటి వస్తువులను, ఇంటిని నాశనం చేయగా మంచి టీమ్ సభ్యులు వాటిని సరిచేస్తుండగా.. టాస్క్ మధ్యలో భానుకు ఏదో అయినట్లు కింద పడిపోయి ఆడిన నాటకం వల్ల తనీష్, దీప్తి సునయనలు మానసికంగా నొచ్చుకున్నారు. మరుసటి రోజు ఈ టాస్క్ కంటిన్యూ కాగా.. ఇంటి ఆవరణలో పెట్టిన ఆపిల్ చెట్టుకు ఉన్న రెడ్ ఆపిల్స్‌ను మంచి టీమ్ సభ్యులు కాపాడాలి, బ్లాక్ ఆపిల్స్‌ను చెడు టీమ్‌సభ్యులు కాపాడాలి, ఇది కాకుండా జైల్లో ఒక టీమ్ సభ్యుడిని పెట్టాలి అంటూ బిగ్‌బాస్ టాస్క్‌ను ఇచ్చారు. జైలుకు సంబంధించిన తాళం చెవిని చెడు టీమ్ సభ్యులు చేజిక్కించుకున్నారు. ఆపిల్స్ ఆటలో మొదలైన వైరం.. చెట్టుకు ఏ కలర్ ఆపిల్స్ ఉంటే వారే విజేత అని తేల్చేసిన బిగ్‌బాస్.. విజేతలు కావడం కోసం పోటీపడ్డారు. ఎవరికి దొరికిన ఆపిల్స్‌ను వారు దాచిపెట్టుకున్నారు. మంచి టీమ్‌సభ్యులకు ఆపిల్స్ తక్కువగా దొరకగా.. చెడు టీమ్ సభ్యులు దాచిన మిగతా ఆపిల్స్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో అమిత్ వాటిని దాచకూడని ప్లేస్‌లో దాచాడు. మళ్లీ వాటిని తీసి ఇంట్లో ఓ చోట భద్రపరిచాడు. టాస్క్ ఇలా సాగుతుండగా.. ఆపిల్ చెట్టుకు తమ బ్లాక్ కలర్ యాపిల్‌ను పెట్టడానికి భాను, గీతా మాధురి ప్రయత్నిస్తూ.. ఆ చెట్టునే పట్టుకుని ఉన్నారు. మంచి టీమ్ సభ్యులు వాటిని కాజేయాలని ప్రయత్నిస్తుండగా.. కౌశల్ ఆపిల్‌ను కాజేయాలని ట్రై చేయగా.. తగలకూడని చోట చేయి తగిలిందని భాను కౌశల్‌పై విరుచుకుపడింది. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా చేయి తగిలిందా అని తేజస్వీని భాను అడగ్గా.. తాకింది, చూశానని తేజు కూడా కౌశల్‌పై అనుచిత వాఖ్యలు చేసింది. వాడి బుద్ధే అంత అని, తూ.. అంటూ కౌశల్‌ను దూషించింది. అక్కడే ఉన్న గీతామాధురి ఇది తప్పు.. అంటూ.. గేమ్‌ను గేమ్‌లా ఆడండి. క్యారెక్టర్ల గురించి మాట్లాడొద్దు అంటూ.. కౌశల్ చేయి భానుకు తగల్లేదని చెప్పుకొచ్చింది. కౌశల్ కూడా తేజస్వీ, భానులపై ప్రతిదాడికి దిగాడు. ఆపిల్స్ కోసమే చెయ్యి పెట్టానని, తన చేయి భానుకు తగల్లేదని వారించాడు. జైల్లో పెట్టడానికి పడ్డ ఇంటిసభ్యులు పడ్డ తిప్పలు.. జైలుకు సంబంధించిన కీని చేజిక్కించుకున్న చెడు టీమ్ సభ్యులు.. మంచి టీమ్ సభ్యులను జైల్లో పెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. ఒకసారి దీప్తి సునయనను ఎత్తుకెళ్లారు, మరోసారి దీప్తిని ఎత్తుకెళ్లారు. తనీష్, కౌశల్ వీరిని కాపాడే ప్రయతం చేయగా.. కౌశల్‌ను జైల్లో వేయాలని ప్రయత్నించగా విఫలమయ్యారు. రోల్ రైడాను జైల్లో వేయడానికి సామ్రాట్ ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఇలా టాస్క్ కొనసాగుతుండగా.. దీప్తిని జైల్లో వేయడానికి తేజస్వీ ప్రయత్నించగా.. దీప్తి తప్పించుకోవడంతో.. ఏదైనా తగలరాని చోట తగిలితే ఎలా అంటూ దీప్తిపై తేజస్వీ విరుచుకుపడింది. చివరకు తేజస్వీ తనంతట తానుగా జైల్లో కూర్చుంది. చెట్టుపై చెడు టీమ్‌కు సంబంధించిన బ్లాక్ ఆపిల్స్ ఉండడం వల్ల ఈ టాస్క్‌లో చెడు టీమ్ సభ్యులు విజేతలయ్యారని బిగ్‌బాస్ ప్రకటించారు. తరువాతి కెప్టెన్‌గా.. గీతా మాధురి గీతా మాధురికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో విజయవంతం అయినందుకు బిగ్‌బాస్ అభినందనలు తెలిపారు. ఈ సారి కెప్టెన్‌గా ఇంట్లోని ఆడవారు మాత్రమే పోటీ చేయాలని.. అది కూడా ఇంతవరకు పోటీ చేయని సభ్యురాలు మాత్రమే కెప్టెన్‌గా ఉండాలని చెబుతూ.. సీక్రెట్ టాస్క్‌లో విజయవంతమైనందుకు ఒక పోటీదారుగా గీతా మాధురిని సెలెక్ట్ చేశాడు బిగ్‌బాస్. రెండో పోటీదారుగా దీప్తి సునయన నిల్చుంది. సంస్కరణలు చేపట్టాలని, దానికోసం మీరు చేయబోయే భవిష్యత్ కార్యాచరణను ఇంటి సభ్యులకు చెప్పి వారి ఓట్లను పొందాలని ఆదేశించగా.. గీతా మాధురి, దీప్తి సునయనలు ఆ పనిలో నిమగ్నమయ్యారు. చివరకు పోటీలో గీతా మాధురికి 11 ఓట్లు రాగా, దీప్తి సునయనకు 2 ఓట్లు వచ్చాయి. ఇంటి కెప్టెన్‌గా గీతా మాధురి బాధ్యతలు తీసుకుంది. ఆదివారం జరుగబోయే కార్యక్రమంలో భాను ఎలిమినేట్ కాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. కౌశల్‌పై భాను అనుచిత వ్యాఖ్యలు చేయడం, టాస్క్‌లో ప్రవర్తించిన తీరు ఆమెపై వ్యతిరేకత కలిగేలా చేసింది. భాను, తేజస్వీలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.