భెల్‌లో జరిగిన సభలో మాట్లాడుతున్న కౌశల్
సాక్షి, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్–2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ మండ అన్నారు. అంత కోటీశ్వరుడినే అయి ఉంటే తన తండ్రి బీహెచ్‌పీవీలో ఉద్యోగం చేసే వారే కాదన్నారు. తన అభిమానుల ఓటింగ్ వల్లే విన్నర్ అయ్యానని తెలిపారు. కౌశల్ ఆర్మీని దుషించేవారిని మట్టికరిపిస్తానని హెచ్చరించారు. భెల్ (హెచ్‌పీవీపీ) మైదానంలో బుధవారం రాత్రి తన అభిమానులు నిర్వహించిన సభలో కౌశల్ పాల్గొన్నాడు. తొలుత తన తల్లి లలిత కుమారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. (బిగ్‌బాస్ విజేత కౌశల్)
తాను బీహెచ్‌పీవీ ప్రాంతంలో పుట్టి, విద్యాభ్యాసం అంతా టౌన్‌షిప్ క్వార్టర్స్‌లోనే కొనసాగించానని గుర్తుచేశారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు, ఆటలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుతెచ్చుకున్నారు. కళాకారుడిగా తన తండ్రి సుందరయ్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని అందువల్లే సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. ఆ తరువాత ఫ్యాషన్‌పై మక్కువతోనే హైదరాబాదు వెళ్లిపోయినట్టు చెప్పారు. అనంతరం అనేక సంఘాలు, వివిధ పార్టీలు, అసోసియేషన్ సభ్యులు కౌశల్‌ను ఘనంగా సన్మానించారు.
కౌశల్ ఆర్మీని విస్తరిస్తా..
పెదవాల్తేరు(విశాఖతూర్పు): కౌశల్ ఆర్మీని మరింత విస్తరిస్తానని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ పేర్కొన్నారు. ఆయన పెదవాల్తేరులోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో పర్యటించి కౌశల్ ఆర్మీ సభ్యులను కలుస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కౌశల్‌ఆర్మీ తరపున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో పడిన బాధ వర్ణణాతీతమన్నారు. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలతోపాటు క్యాన్సర్ రోగుల వైద్యానికి తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని కౌశల్ వెల్లడించారు.
చదవండి:
ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment