gajuvaka
-
20 టన్నుల బెల్లంతో గాజువాక మహా గణపతి
-
ఆయేషా.. వారెవ్వా..!
సాక్షి, హైదరాబాద్: రష్యాలోని ఉలియనోస్క్ సిటీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో భారత్‌తోపాటు వివిధదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై పలువురు తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. అప్పుడే ఒకమ్మాయి లేచి నిల్చుంది. తన మదిలో మెదులుతున్న భావనలను వేదికపై నిలబడి సగర్వంగా చాటిచెప్పింది. ఆమె చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె పేరే షేక్ ఆయేషా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయేషా దేశం తరఫున బ్రిక్స్ సదస్సులో ప్రతినిధిగా పాల్గొన్న ఏౖకైక తెలుగమ్మాయి కావడం విశేషం.పెందుర్తి టు సెంట్రల్ యూనివర్సిటీ ఏపీలోని గాజువాక జిల్లా పెందుర్తికి చెందిన మదీనాబీబీ– రెహ్మాన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్నకూతురు ఆయేషా. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక చైతన్యంలో ఆయేషా ముందుండేది. డిగ్రీ వరకు విశాఖపట్నంలో చదవగా, విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సింథటిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీలో చేరింది.సామాజిక సమస్యలపై పోరాటం చదువుతోపాటు సామాజిక స్పృహ కూడా ఆయేషాకు ఎక్కువే. ఎప్పుడూ తన తోటి విద్యార్థులతో కలిసి హక్కుల కోసం గొంతుక వినిపించేది. ఇటీవల హెచ్‌సీయూలో జరిగిన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గెలుపోటములు పక్కన పెడితే విద్యార్థుల కోసం తాను ఉన్నానంటూ తెలియజెప్పడమే తన ధ్యేయమని ఆయేషా చెబుతోంది.ఐదు రోజుల సదస్సు.. ఈ నెల 22న రష్యాలో ప్రారంభమైన బ్రిక్స్ యూత్ సదస్సు శుక్రవారంతో ముగియనుంది. ఈ సదస్సులో సామాజిక సేవ విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుందని ఆయేషా ప్రతిపాదించింది. సంస్కృతి, యువతనాయకత్వం, కమ్యూనిటీ సర్వీస్ విషయంలో వలంటీర్ వర్క్ ఎలా జరుగుతుందనే విషయాలను బ్రిక్స్ దేశాల యువత పరస్పరం పంచుకోవాలని చెప్పింది. దీనిపై సదస్సులో చర్చ జరిగిందని, బ్రిక్స్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆయేషా వెల్లడించింది. కేంద్ర యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ సహాయమంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే కూడా తనపై ప్రశంసలు కురిపించారని ఆమె పేర్కొంది. -
గాజువాకలో నా పోటీ..దొంగలెవరో తేలిపోయింది
-
విశాఖ గాజువాకలోని మోహిని థియేటర్ లో భారీ చోరీ
-
బీసీలను పెద్దల సభకు పంపింది సీఎం జగన్: మంత్రి సీదిరి
సాక్షి, గాజువాక : చంద్రబాబుకు బానిసత్వం చేసే వారే టీడీపీలో మిగిలారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం విశాఖపట్నం గాజువాకలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర బహిరంగ సభలో అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు ఏనాడైనా చంద్రబాబు మేలు చేశారా అని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు తోలు తీస్తానని, తాట తీస్తానని బెదిరించారని గుర్తుచేశారు. ఒక మత్స్యకారుడు పార్లమెంట్ లో అడుగు పెట్టారంటే అందుకు సీఎం జగన్ కారణమని చెప్పారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్య సభకు పంపింది సీఎం జగనేనన్నారు. బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారని మండిపడ్డారు. దళితులను అవమానించిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. పీకే అంటే ప్యాకేజీ స్టార్ అని, జనసైనికుల కష్టాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్మేస్తున్నారని అప్పలరాజు ఫైర్ అయ్యారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. సీఎం పాలనను ఇతర రాష్ట్రాలు అచరిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వంపై త్పపుడు ప్రచారం చేస్తున్నాయి. అవినీతి రహిత పాలనను సీఎం జగన్ అందిస్తున్నారు. లంచాలు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. రాజధాని వైజాగ్‌కు వస్తె ఇక్కడ ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి’ అని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేత అంజాద్ బాషా మాట్లాడుతూ..‘ సీఎం జగన్ చెప్పిందే చేస్తారు. లోకేష్ కార్పొరేటర్‌గా కూడా గెలవడు. పవన్‌ను రెండు చోట్ల ఓడించిన మగాడు సీఎం జగన్’ అని కొనియాడారు. -
బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ సమీపంలో జెండాలను తొలగించాం
-
కరోనాతో భార్య మృతి, మనస్తాపంతో భర్త ఆత్మహత్య!
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): భార్య కరోనాతో మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవీఎంసీ 69వ వార్డు హరిజనజగ్గయ్యపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాజువాక ఎస్ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాలివీ.. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి సన్యాసిరావు(50) హరిజనజగ్గయ్యపాలెంలో ఇంట్లోనే టైలరింగ్ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని భార్య చిన్నమ్మలు ఏప్రిల్‌లో కరోనాతో మృతి చెందింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటుపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. శనివారం మధ్యాహ్న సమయంలో హోటల్ నుంచి భోజనం తెచ్చుకున్నాడు. దాన్ని విప్పకుండా రోడ్డుపై పడేసి.. కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపుల లోపలి గడియ పెట్టుకున్నాడు. ఇంటి యజమానికి అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సన్యాసిరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు, కుమార్తెకు వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు అవివాహితుడని పోలీసులు తెలిపారు. చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
గాజువాక సీఐకి నూతన్ నాయుడు ఫోన్..
సాక్షి, విశాఖపట్నం : కొందరు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లు ఉంటారు. దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్ట అయిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వీరాభిమాని, బిగ్‌బాస్ ఫేమ్, సినీ దర్శకుడు నూతన్ నాయుడి తీరు అలానే ఉంది. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్లో ఆయన ఇంటి చుట్టు పక్కల నీతి వాక్యాలతో కూడిన ప్లెక్సీలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘కోపం.. అసూయ.. అబద్ధాలు.. మోసం.. ఇలాంటి వ్యవహారాలు చేస్తే జీవితం మొత్తం పతనమవుతుంది’ అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తాయి. కలశ ఫౌండేషన్ పేరిట తన ఇంటి చుట్టూ ఆశ్యర్యపరిచేలా ఫ్లెక్సీలుంటున్నాయి. కానీ ఆయన చేసే మోసాలు లెక్క కట్టలేని విధంగా ఉన్నాయి. దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన 24 గంటల్లోనే గాజువాక పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరిట సుమారు 30 మందికి పైగా అధికారులకు ఫోన్లు చేసి పైరవీలకు పాల్పడిన నూతన్ నాయుడు మోసాలు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌కి చేసిన ఫోన్‌తో బట్టబయలైన విషయం తెలిసిందే. ఒకవైపు శ్రీకాంత్‌కు శిరోముండనం సంఘటనలో నూతన్ నాయుడు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా స్పష్టం చేయగా... మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరిట పైరవీలకు పాల్పడిన కేసులను పోలీసులు ఒక్కోకటి దర్యాప్తు చేస్తూ బయటపెడుతున్నారు. గాజువాక సీఐకి నూతన్ నాయుడు ఫోన్ గతంలో గాజువాక పోలీస్‌స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యారు. నూతన్‌నాయుడు తాను మాజీ ఐఏఎస్ అధికారినని అరెస్టయిన వ్యక్తిని వదిలేయమని గాజువాక సీఐకి ఫోన్ చేశాడు. అతడు ట్రాఫిక్ సీఐకి కాల్ ట్రాన్స్ఫర్ చేయగా.. అది సీఎంఓ ఆఫీస్ నెంబర్ కాదనేసరికి ఫోన్ కట్చేసేశారు. ఈ కేసులో కూడా నూతన్ నాయుడిపై కేసు నమోదు చేశారు. అలాగే శ్రీదేవి కేబుల్ టీవీలో షేర్స్ కావాలని.. ఆ సంస్థ ఉద్యోగికి ఫోన్ చేశాడు. మిగతా కాల్స్‌ను కూడా ఒక్కొక్కటి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖకి నూతన్ నాయుడు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి నూతన్‌నాయుడిని అరెస్ట్ చేసి శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. శనివారం విశాఖకు బయలుదేరారు. ఆదివారం ఉదయానికి నూతన్నాయుడుని విశాఖకు తీసుకురానున్నారు. -
దారుణం : మహిళపై యాసిడ్ దాడి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. గాజువాకలోని సమతానగర్‌లో తన చెల్లితో మాట్లాడుతున్న ఒక మహిళప్తె గుర్తుతెలియని మరో మహిళ యాసిడ్ దాడికి పాల్పడింది. కాగా వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన శిరీష తన చెల్లిని చూడడానికి విశాఖలోని గాజువాకకు వచ్చినట్టు సమాచారం. శిరీషకు పెళ్ళికి ముందు వేరే వ్యక్తితో పరిచయం ఉండేది. తరచూ ఆ వ్యక్తితో కలిసి తిరుగుతున్నవిషయం ఆమె భర్తకు తెలిసింది. ఈ నేపథ్యంలో భర్త అక్కకు సర్ధి చెప్పమని శిరీషను గాజువాకలోని చెల్లి ఇంటికి పంపించాడు. సమతానగర్ లో మేడ మీద శిరీష, ఆమె చెల్లి,వివాహేతర సంబంధం వున్న వ్యక్తి కలిసి మాట్లాడుకుంటుండగా ఆకస్మాత్తుగా మరో మహిళ ఒక్కసారిగా శిరీషపై యాసిడ్‌తో దాడి చేసినట్లు తెలిసింది. 30 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన శిరీషకు చికిత్స నిర్వహించిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. దాడి చేసిన మహిళ ఎవరనేది ఆరా తీస్తున్నారు. దీంతో పాటు వివాహేతర సంబంధం వున్న వ్యక్తి ఎవరనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
పని చేస్తున్నసంస్థకే కన్నం
సాక్షి, గాజువాక(విశాఖపట్నం) : ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన ఒక యువకుడు అప్పుల పాలై వాటిని తీర్చడానికి తాను పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి రూ.9.42లక్షల నగదు, ఇతర సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోన్ – 2 డీసీపీ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ సిద్ధేశ్వరం గ్రామానికి చెందిన బొండాల సంతోష్ (31) ఎంబీఏ చదివాడు. అక్కిరెడ్డిపాలెంలోని సింహపురి ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. 2010లో రూ.6వేల జీతానికి సూపర్వైజర్గా చేరిన సంతోష్ తొమ్మిదేళ్లుగా అక్కడే పని చేస్తుండటంతో క్యాషియర్‌గా ప్రమోట్ చేసి రూ.15వేలు చెల్లిస్తున్నారు. అప్పులు తీర్చేందుకు దొంగావతారం ఈ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో గత మూడేళ్లుగా ఆన్లైన్ రమ్మీ, జంగిల్ గేమ్స్ ఆడటానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో వ్యసనాలకు కూడా బానిసయ్యాడు. తనకు వచ్చే జీతం చాలకపోవడంతో ఐసీఐసీఐ, ఆంధ్రాబ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో అప్పులు వాడేశాడు. వాటితోపాటు తెలిసిన వారివద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేసి ఆన్లైన్ గేమ్‌లలో పోగొట్టుకున్నాడు. అప్పులను తిరిగి చెల్లించాలని బ్యాంకులు, అప్పులిచ్చిన వారు వస్తారన్న భయంతో తాను పని చేస్తున్న సంస్థలోనే డబ్బులను కాజేయాలని నిర్ణయించుకున్నాడు. తన పథకం ప్రకారం గత నెల 30న రాత్రి విధులు ముగించుకొన్న తరువాత కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో మేనేజర్ డెస్క్‌ను విరగ్గొట్టి అందులో ఉన్న రూ.11 లక్షలను తస్కరించాడు. అప్పటి నుంచి విధులకు కూడా హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. తమ కార్యాలయంలో నగదు చోరీకి గురైందని మేనేజర్ వడ్లమూడి సురేష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సౌత్ క్రైం సీఐ ఎం.అవతారం ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సంతోష్ చోరీకి పాల్పడినట్లు తేలడంతో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.9,42,500 నగదుపాతోటు రూ.56,500 విలువైన 18 గ్రాముల బంగారు గొలుసు, ఒక బ్లూటూత్ డివైస్, ఒక సెల్‌ఫోన్, అమెరికన్ టూరిస్టు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో ప్రతిభ చూపిన క్రైం సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో అదనపు క్రైం డీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీ టి.పి.ప్రభాకర్, ఎస్ఐలు జి.వెంకటరావు, ఐ.దామోదర్‌రావు, జి.సంతోష్ పాల్గొన్నారు. -
జగన్ అనే నేను ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా
-
దృష్టి ఫ్యాన్‌పై ఉండాలి.. వేలు స్విచ్‌పై ఉండాలి
గాజువాక : ‘ఈనెల 11వ తేదీని అందరూ గుర్తు పెట్టుకోండి. ఆ రోజు మాత్రం మనందరి దృష్టి ఫ్యాన్ గుర్తుపై ఉండాలి. మన వేలు ఈవీఎం స్విచ్‌పై ఉండాలి’ అని సినీ నటుడు అలీ అన్నారు. వైఎస్సార్సీపీ గాజువాక అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి మద్దతుగా ఆయన గాజువాకలో బుధవారం ప్రచారం నిర్వహించారు. నాగిరెడ్డితో కలిసి తొలుత పాతగాజువాక జంక్షన్ 60 అడుగుల రోడ్డులోను, అజీమాబాద్ కాలనీలోనూ ప్రసంగించారు. ముస్లిం మైనార్టీల కోసం దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు. గాజువాక ప్రజల సంక్షేమం కోసం నాగిరెడ్డి విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్క ముస్లిం వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఎంపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణను గెలిపించాలని కోరారు. -
విశాఖ బీచ్‌లో హోలీ సంబరాలు
-
డబ్బులిచ్చి బిగ్‌బాస్ విజేత కాలేదు: కౌశల్
సాక్షి, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): బిగ్‌బాస్–2లో విజేతనయ్యేందుకు తాను డబ్బులు వెదజల్లాననే పుకార్లు రావడం దురదృష్టకరమని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ మండ అన్నారు. అంత కోటీశ్వరుడినే అయి ఉంటే తన తండ్రి బీహెచ్‌పీవీలో ఉద్యోగం చేసే వారే కాదన్నారు. తన అభిమానుల ఓటింగ్ వల్లే విన్నర్ అయ్యానని తెలిపారు. కౌశల్ ఆర్మీని దుషించేవారిని మట్టికరిపిస్తానని హెచ్చరించారు. భెల్ (హెచ్‌పీవీపీ) మైదానంలో బుధవారం రాత్రి తన అభిమానులు నిర్వహించిన సభలో కౌశల్ పాల్గొన్నాడు. తొలుత తన తల్లి లలిత కుమారి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. (బిగ్‌బాస్ విజేత కౌశల్) తాను బీహెచ్‌పీవీ ప్రాంతంలో పుట్టి, విద్యాభ్యాసం అంతా టౌన్షిప్ క్వార్టర్స్‌లోనే కొనసాగించానని గుర్తుచేశారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు, ఆటలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుతెచ్చుకున్నారు. కళాకారుడిగా తన తండ్రి సుందరయ్య ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని అందువల్లే సంస్థ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. ఆ తరువాత ఫ్యాషన్‌పై మక్కువతోనే హైదరాబాదు వెళ్లిపోయినట్టు చెప్పారు. అనంతరం అనేక సంఘాలు, వివిధ పార్టీలు, అసోసియేషన్ సభ్యులు కౌశల్‌ను ఘనంగా సన్మానించారు. కౌశల్ ఆర్మీని విస్తరిస్తా.. పెదవాల్తేరు(విశాఖతూర్పు): కౌశల్ ఆర్మీని మరింత విస్తరిస్తానని బిగ్‌బాస్–2 విజేత కౌశల్ పేర్కొన్నారు. ఆయన పెదవాల్తేరులోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో పర్యటించి కౌశల్ ఆర్మీ సభ్యులను కలుస్తానన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు. తన అభిమానులంతా కౌశల్ ఆర్మీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కౌశల్‌ఆర్మీ తరపున రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో పడిన బాధ వర్ణణాతీతమన్నారు. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలతోపాటు క్యాన్సర్ రోగుల వైద్యానికి తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తానని కౌశల్ వెల్లడించారు. చదవండి: ఫ్యాన్స్‌తో కలిసి కౌశల్ ఇలా.. బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు బిగ్‌బాస్ సెట్ ముందు కౌశల్ ఆర్మీ హల్చల్! -
22మంది గల్ఫ్ బాధితులకు విముక్తి
సాక్షి, విశాఖ: ఉద్యోగం కోసమని గల్ఫ్‌కి వెళ్లి మోసపోయిన 22 మంది విశాఖ వాసులను పోలీసులు వెనక్కి తీసుకొచ్చారు. వాట్సప్‌లో పంపిన సందేశానికి ఆధారంగా ఆరా తీసిన పోలీసులు ఎట్టకేలకు బాధితులను విశాఖకు తీసుకొచ్చారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. కొరియా కంపెనీల్లో ఉద్యోగమని చెప్పి భారీగా వసూళ్లు చేసిన ఏజెంట్.. తీరా దుబాయి వెళ్లిన తర్వాత వారికి చిన్న కంపెనీల్లో ఉద్యోగం ఇప్పించారని వాపోయారు. చాలీ చాలని జీతంతో, ఓ పూట తిని మరో పూట పస్తులున్నామని తమ బాధను వెళ్లబుచ్చారు. స్వదేశానికి వెళ్లకుండా గల్ఫ్ కంపెనీ ఏజెంట్ తమ పాస్‌పోర్ట్‌లు లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో తాము స్వదేశానికి తిరిగి వచ్చామని తెలిపారు. కాగ విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ యోగానంద్ మాట్లాడుతూ.. గాజువాక ఆటోనగర్ వెస్కో రోబోటెక్ వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు, ఏజెంట్ ఎల్డీ ప్రసాద్‌పై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
వేసిన గంటల్లోనే.. కూలిన శ్లాబ్
గాజువాక:గాజువాకలోని ఓ షాపింగ్ మాల్‌కు సంబంధించిన భవన నిర్మాణంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వేసిన కొన్ని గంటలకే భవనం రెండో అంతస్తు శ్లాబు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న 8 మంది కార్మికులు గాయపడ్డారు. గాజువాక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్థానిక చైతన్యనగర్ దరి జాతీయ రహదారికి ఆనుకొని సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు సంబంధించిన ఐదంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. మొదటి దశ పనుల్లో భాగంగా గురువారం రాత్రి రెండో అంతస్తు శ్లాబు వేశారు. పనులు పూర్తయిన కొద్ది గంటలకే ఒకపక్క శ్లాబుకు సంబంధించిన డెకింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులు గాయాలపాలయ్యారు. శ్రీకాకుళానికి చెందిన ఎం.అప్పారావుకు కాలు విరిగ్గా, ఒడిశాకు చెందిన లక్ష్మీనారాయ్, దినేష్ యాదవ్, శ్రీకాకుళానికి చెంది న టి.రామకృష్ణ, టి.నారాయణ, ఎం.రాంబాబు, ఎం.శ్రీపతినాయుడు, మార్తూర్ యాద వ్ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల పరిశీలన ప్రమాద స్థలాన్ని గాజువాక ఇన్చార్జి తహసీల్దార్ చేతన్ కుమార్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ వి.చక్రధరరావు పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించి వారి వివరాలను తెలుసుకున్నారు. సైట్ ఇన్చార్జులతో మాట్లాడి భవనం పనులకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా గాజువాక జోనల్ కమిషనర్ సాక్షితో మాట్లాడారు.సంబంధిత భవనానికి ఆఫ్‌లైన్ ప్లాన్ ఉందన్నారు. నిర్మాణదారుడు కార్మికులకు బీమా కూడా చేయించారన్నారు. బీమా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కూడా తాను మాట్లాడానని తెలిపారు. ఒక్కో బాధితునికి రూ.2 లక్షల చొప్పున పరిహారం మంజూరయ్యే అవకాశం ఉందని చెప్పారు. -
పెళ్లి పేరుతో మోసం..
గాజువాక: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఆమె గర్భం దాల్చడంతో తనకు సంబంధం లేదంటూ మొహం చాటేశాడు. యువకుడితో తనకు వివాహం చేయాలని అటు పోలీసులు, ఇటు పెద్దల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో బాధితురాలు మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మను ఆశ్రయించింది. బాధితురాలికి న్యాయం చేయాలని తమ ప్రతినిధులతో కలిసి పద్మ గాజువాక పోలీస్ స్టేషన్వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. దిగొచ్చిన పోలీసులు యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగ్లాం గ్రామానికి చెందిన యువతితో ఆమె బంధువు గొలగాని శ్రీనివాస్‌కు వివాహం చేయాలని పెద్దలు ప్రతిపాదన చేశారు. పెళ్లి మాటలు కొనసాగుతుండగానే గత ఏడాది డిసెంబర్ 20న శ్రీనివాస్ తుంగ్లాంలోని యువతి ఇంటికి వచ్చాడు. తన తల్లిదండ్రులు పనికి వెళ్లిపోయారని ఆమె చెప్పినప్పటికీ ఇంట్లోకి వెళ్లాడు. కొద్దిసేపు మాటల తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ఆ యువతి చేయి పట్టుకున్నాడు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత భయమెందుకంటూ శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. తనను పెళ్లి చేసుకోలేనని ఆ యువతికి షాకిచ్చాడు. మరుసటి నెలలోనే ఆమె గర్భం దాల్చిన విషయం తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీనికి శ్రీనివాస్ తల్లిదండ్రులు ససేమిరా అనడంతో తొలుత గాజువాక పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని పిలిచి మాట్లాడతామని చెప్పిన పోలీసులు.. రోజులు గడిచే కొద్దీ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో కొందరు పెద్దలను కలిసి న్యాయం చేయాలని కోరారు. యువతికి గర్భస్రావం చేయించాలని వారు నిర్ణయించారు. ఆసుపత్రికి వెళ్లిన అనంతరం అబార్షన్‌కు డాక్టర్ అంగీకరించకపోగా కేసు పెడతానని హెచ్చరించి పంపేశారు. పెళ్లికి అంగీకరించబోమంటూ నిందితుడి తల్లిదండ్రులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో పెద్దలు కూడా చేతులెత్తేయడంతో బాధితురాలు మహిళా చేతన ప్రతినిధులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఆందోళనతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
స్వచ్ఛ గాజువాకలో హీరో సుమన్
గాజువాకలో సోమవారం నిర్వహిం చిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. జింక్ గేటు నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు రహదారిని శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించవచ్చని ఆయన అన్నా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ, కరాటే అసోసియేషన్ ప్రతినిధులు హైదర్ ఆలీ, తాజు ద్దీన్బాబు, ఎస్టీబీఎల్ ప్రాజెక్టు ప్రతినిధి శంకర్రావు, స్థానిక నాయకులు లక్ష్మణ్, నాయుడు, ఖాజీ తదితరులు పాల్గొన్నారు. - గాజువాక -
గాజువాక టీడీపీలో ఆ నలుగురు
టికెట్‌పై కుదరని సయోధ్య గందరగోళంలో అధినేత కార్యకర్తల్లో నైరాశ్యం గాజువాక, న్యూస్‌లైన్: ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ గాజువాక టీడీపీలో అసమ్మతి రాజుకుంటోంది. కాంగ్రెస్ నాయకులు చేరడంతో గ్రూపుల జాబితా పెరిగింది. ప్రతి గ్రూపు నుంచీ ఒకరు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తుండటంతో అధినేత చంద్రబాబు సైతం గందరగోళంలో పడ్డారు. మొన్నటి వరకు ఇక్కడ బండారు సత్యనారాయణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు మార్గదర్శకత్వంలో రెండు గ్రూపులు నడిచాయి. తాజాగా గాజువాక ఫైవ్‌మెన్ కమిటీని ఆ పార్టీ సీనియర్ నాయకుడు హర్షవర్థన్ ప్రసాద్ తెరపైకి తెచ్చారు. ఇది బండారు నేతృత్వంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చిం ది. అయ్యన్న మద్దతుతో కోన తాతారావు మరో గ్రూపును నడిపిన విషయం తెలిసిందే. చింతలపూడి వెంకట్రామయ్య మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీలో ఇటీవల చేరారు. కాంగ్రెస్‌లో ఉంటే మనుగడ కష్టమన్న విషయం గ్రహించిన ఆ పార్టీ గాజువాక ఇన్చార్జి పల్లా శ్రీనివాసరావు కూడా రెం డు రోజుల క్రితమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు, టి.హర్షవర్థన్ప్రసాద్, చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు గాజువాక టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అధినేతతో నేరుగా హర్ష మాట్లాడుతున్నట్టు సమాచారం. కోనకు టికెట్ ఇవ్వాల్సిందేనని అయ్యన్నపాత్రుడు పట్టుపడుతున్నట్టు తెలిసింది. గంటా బృందం చేరికను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నందున ఆయన్ని చల్లబర్చడం కోసం టికెట్‌ను కోనకు కేటాయిస్తానని అధినేత హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. మరో పక్క వెంకట్రామయ్య నేరుగా రంగంలోకి దిగారని కార్యకర్తలంటున్నారు. యనమల రామకృష్ణుడు మద్దతుతో తనకే టికెట్ వస్తుందని పల్లా శ్రీనివాసరావు ధీమాగా ఉన్నారు. ఒకవేళ పార్లమెంట్‌కు పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే పాటించాలని ముందుగానే ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయనకు ఏదో ఒక టికెట్ తప్పనిసరి అని భావిస్తున్నారు. నాలుగు గ్రూపుల్లో టికెట్ ఎవరికి వచ్చినా మిగిలిన గ్రూపువారు సహకరించే పరిస్థితి లేకపోగా, ఒకరిద్దరు నాయకులు మాత్రం స్వతంత్రులుగానైనా బరిలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఈ పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర నైరాశ్యానికి గురి చేస్తున్నాయి. -
టీడీపీకి గుడ్‌బై
గాజువాక : టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుడివాడ నాగమణి, ఆమె తనయుడు, 65వ వార్డు మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్నాథ్ శు క్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు. టీడీపీలో తమ పదవులకు, పార్టీ క్రీయాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పత్రులను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పం పారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు నాయుడు వైఖరి గందరగోళంగా మారడంతో పాటు ఆ పార్టీ స్థానిక నాయకత్వం కూడా సరిగా లేకపోవడంతో రాజీనామా చేసినట్టు వారు. -
కొలత కన్నెర్ర
విశాఖపట్నం: జిల్లాలో తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. అక్రమ వ్యాపారాలపై కన్నెర్రజేసింది. వరుస దాడులతో హడలెత్తిస్తోంది. ఇటీవల విశాఖలోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణాలు, జిల్లావ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులపై దాడులు చేపట్టింది. పెట్రోల్ బంకుల్లో మోసాలను బయటపెట్టింది. ఇదే ఉత్సాహంతో మరిన్ని తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో కోట్లలో భారీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన వేబ్రిడ్జిల అంతుతేల్చడానికి కసరత్తు చేస్తోంది. లోడ్లతో వచ్చే వాహనాల్లో సరకును అవసరం మేరకు ఎక్కువ, తక్కువ చూపిస్తూ ఇవి కోట్లు గడిస్తున్న విషయాన్ని గ్రహించి వీటిపై దాడులకు సన్నద్ధమవుతోంది. ఆహార పదార్ధాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు, పెట్రోల్ బంకులు..ఇలా బరువుతో తూచే ఏ విషయంలోనైనా అక్రమాలు జరిగితే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత తూనికలు కొలతలశాఖ అధికారులది. కానీ జిల్లాలో మాత్రం ఈ శాఖకు సంబంధించిన విషయాల్లో అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు ఇప్పటి వరకు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వ్యాపారులు క్రమాలకు పాల్పడుతున్నారు. ఈ శాఖ అధికారులు ఇటీవల నగరంలో అయిదు బ్రాండెడ్ బంగారు ఆభరణాల దుకాణాలపై వరుసగా దాడులు చేశారు. తూనికలు కొలతల్లో మోసాలను గుర్తించి 15 కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులపై దాడులు నిర్వహించారు. మొత్తం ఏడు కేసులు నమోదు చేసి, 26 పంపులు సీజ్ చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా కలవరం మొదలైంది. వరుస దాడుల నేపథ్యంలో ఊపుమీద ఉన్న ఈ శాఖ అధికారులు త్వరలో జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 300 వేబ్రిడ్జిలపై దాడులకు కసరతు ్తచేస్తున్నారు. వాస్తవానికి ఈ వేబ్రిడ్జిల్లో ఏటా కోట్లలో అవినీతి జరుగుతోంది. ఉక్కు, ఆహార పదార్థాలు ఇలా రకరకాల సరకుల లోడుతో వెళ్లే వాహనాల బరువును తూచే ఈ వేబ్రిడ్జిలు తూకాల్లో భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ బ్రిడ్జిల్లో కొనేవి, అమ్మేవి రెండు రకాలు ఉండగా, వీటిలో చిన్నతరహా సంస్థల్లో మాత్రం అవినీతి దారుణంగా ఉంటోంది. వస్తువులు, సరకు కొనే వేబ్రిడ్జిలు తక్కువ తూకం చూపిస్తూ మోసం చేస్తే...విక్రయించే వేబ్రిడ్జిలు ఎక్కువ తూకాలతో వినియోగదారులు, వ్యాపారులను మోసం చేస్తున్నాయి. తద్వారా ఏటా కోట్లలో సొమ్ములు వెనకేసుకుంటున్నాయి. అక్రమాలను గుర్తించిన అధికారులు త్వరలో నగర, గ్రామీణ జిల్లాల్లో దాడులకు సమాయత్తమవుతున్నారు. గాజువాక, గోపాలపట్నం, పరవాడ, పెందుర్తి, భీమిలి, అనకాపల్లి తదితర చోట్ల ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించారు. ఇటీవల పెట్రోల్ బంకులపై దాడులు చేసిన అధికారులు మరో రెండు నెలల్లో మలివిడత తనిఖీలు చేయాలని నిర్ణయించారు. లోపాలున్న బంకులు రెండు నెలల్లోగా సరిదిద్దుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అప్పటికీ సరిదిద్దుకోని బంకుల సంగతి చూడాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కేసులు నమోదు చేసిన బంకుల విషయంలో కేసు తీవ్రత దృష్ట్యా త్వరలోనే వీటికి జరిమానా విధించనున్నారు. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడకూడదని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ శాఖకు సరిపడా పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఫలితంగా తరచూ దాడులు జరగడంలేదు. మొత్తం 29 కీలక పోస్టులకు గాను ఏడుకుపైగా ఖాళీగా ఉన్నాయి. అయిదుగురు జిల్లా ఇన్స్పెక్టర్లు అవసరమైతే రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్లకు ఇన్చార్జి ఇన్స్పెక్టర్లను నియమించారు. ఫలితంగా అక్కడ ఆకస్మిక తనిఖీలు, దాడులు మొక్కుబడిగానే ఉంటున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ తర్వాత అత్యధిక వ్యాపార లావాదేవీలు జరిగే విశాఖకు అదనపు సిబ్బంది అవసరం. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమర్థవంతంగా ఈ శాఖ పనిచేయడానికి ఇబ్బందులు పడుతోంది. -
విశాఖలో వివాహిత ఆత్మహత్య
గాజువాక, న్యూస్‌లైన్: విశాఖ గాజువాక పరిధిలోని ఇందిరా కాలనీలో ఓ గృహిణి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లిమర్లకు చెందిన మాణిక్యం లక్ష్మణరావు కూర్మన్నపాలెం ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకులో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. విజయనగరంలోని బాబామెట్టకు చెందిన సుశీల(26)ను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ఈ దంపతులు ఉపాధి వెతుక్కుంటూ విశాఖ వచ్చేశారు. లక్ష్మణరావు శుక్రవారం ఉదయం విధుల్లోకి వెళ్లాడు. ఆయన విధుల్లో ఉండగా తన ఆరోగ్యం బాగులేదని, ఆస్పత్రికి వెళ్లాల్సి ఉన్నందున రావాలని భార్య ఫోన్ చేసింది. తాను డ్యూటీలో ఉన్నందున వెంటనే రాలేనని, మధ్యాహ్న భోజన సమయంలో వస్తానని భర్త బదులిచ్చాడు. ఆ తర్వాత కూడా సుశీల రెండుమూడు సార్లు భర్తకు ఫోన్ చేసింది. అనంతరం కొద్దిసేపటికి వంటగదిలోని ఫ్యాన్‌హుక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు లక్ష్మణరావుకు, గాజువాక పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ దాలిబాబు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని లక్ష్మణరావును విచారణ చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.