సాక్షి, విశాఖ: ఉద్యోగం కోసమని గల్ఫ్‌కి వెళ్లి మోసపోయిన 22 మంది విశాఖ వాసులను పోలీసులు వెనక్కి తీసుకొచ్చారు. వాట్సప్‌లో పంపిన సందేశానికి ఆధారంగా ఆరా తీసిన పోలీసులు ఎట్టకేలకు బాధితులను విశాఖకు తీసుకొచ్చారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. కొరియా కంపెనీల్లో ఉద్యోగమని చెప్పి భారీగా వసూళ్లు చేసిన ఏజెంట్.. తీరా దుబాయి వెళ్లిన తర్వాత వారికి చిన్న కంపెనీల్లో ఉద్యోగం ఇప్పించారని వాపోయారు. చాలీ చాలని జీతంతో, ఓ పూట తిని మరో పూట పస్తులున్నామని తమ బాధను వెళ్లబుచ్చారు.
స్వదేశానికి వెళ్లకుండా గల్ఫ్ కంపెనీ ఏజెంట్ తమ పాస్‌పోర్ట్‌లు లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో తాము స్వదేశానికి తిరిగి వచ్చామని తెలిపారు. కాగ విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ యోగానంద్ మాట్లాడుతూ.. గాజువాక ఆటోనగర్ వెస్కో రోబోటెక్ వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు, ఏజెంట్ ఎల్‌డీ ప్రసాద్‌పై గాజువాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment