
బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాసిన విషయాన్ని..
సాక్షి, గాజువాక : చంద్రబాబుకు బానిసత్వం చేసే వారే టీడీపీలో మిగిలారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం విశాఖపట్నం గాజువాకలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర బహిరంగ సభలో అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు ఏనాడైనా చంద్రబాబు మేలు చేశారా అని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు తోలు తీస్తానని, తాట తీస్తానని బెదిరించారని గుర్తుచేశారు.
ఒక మత్స్యకారుడు పార్లమెంట్ లో అడుగు పెట్టారంటే అందుకు సీఎం జగన్ కారణమని చెప్పారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్య సభకు పంపింది సీఎం జగనేనన్నారు. బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారని మండిపడ్డారు. దళితులను అవమానించిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. పీకే అంటే ప్యాకేజీ స్టార్ అని, జనసైనికుల కష్టాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్మేస్తున్నారని అప్పలరాజు ఫైర్ అయ్యారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. సీఎం పాలనను ఇతర రాష్ట్రాలు అచరిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వంపై త్పపుడు ప్రచారం చేస్తున్నాయి. అవినీతి రహిత పాలనను సీఎం జగన్ అందిస్తున్నారు. లంచాలు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. రాజధాని వైజాగ్‌కు వస్తె ఇక్కడ ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి’ అని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ నేత అంజాద్ బాషా మాట్లాడుతూ..‘ సీఎం జగన్ చెప్పిందే చేస్తారు. లోకేష్ కార్పొరేటర్‌గా కూడా గెలవడు. పవన్‌ను రెండు చోట్ల ఓడించిన మగాడు సీఎం జగన్’ అని కొనియాడారు.