yatra
-
జ్యోతిర్లింగాల మహా యాత్రలో 'కన్నప్ప' టీమ్ (ఫోటోలు)
-
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
భారత్-నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం.. టిక్కెట్ ఎంతంటే..
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన భారత్ గౌరవ్ రైలు సిరీస్‌లో మరో రైలు ప్రారంభమైంది. భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణంతో పర్యాటకులు భారత్ - నేపాల్ భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని చవిచూడగలుగుతారు. ఈ యాత్రకు ‘ఇండియా- నేపాల్ మైత్రి యాత్ర’ అని పేరు పెట్టారు. రైల్వేల ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ సందర్శించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా భారత్ గౌరవ్ యాత్ర పేరుతో ఈ నూతన సేవను ప్రారంభించామని, ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త భారత్ గౌరవ్ యాత్రలు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఈ భారత్ గౌరవ్ రైలులో ప్రయాణికులు భారతదేశం- నేపాల్‌ల సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ఒకే ప్యాకేజీలో పర్యటించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 'ఇండియా నేపాల్ మైత్రి యాత్ర' ప్రయాణం 9 రాత్రులు, 10 పగళ్లు ఉండనుంది. ఈ రైలు ప్యాకేజీలో అయోధ్య, కాశీ, సీతామర్హి, జనక్‌పూర్, పశుపతినాథ్, బిండియా బస్ని టెంపుల్లను దర్శించవచ్చు. ప్రయాణికుల బస, ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారతీయ రైల్వే కల్పిస్తుంది.ఈ రైలులో మొదటి ఏసీ క్యాబిన్ ఛార్జీ ఒక్క వ్యక్తికి రూ.1,05,500, ఇద్దరికి రూ.89,885, ముగ్గురికి రూ.87,655లు ఉంటుంది. ఇందులో బెడ్ విత్ చైల్డ్ ఛార్జీ రూ.82,295. సెకండ్ ఏసీలో ఒక్క వ్యక్తి టిక్కెట్ ధర రూ.94,735. ఇద్దరు వ్యక్తులకు రూ.79,120 కాగా, ముగ్గురికి రూ.76,890. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.71,535గా ఉంది. థర్డ్ ఏసీలో ఒక్క వ్యక్తికి రూ.81,530, ఇద్దరికి రూ.66,650, ముగ్గురికి రూ.64,525. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.60,900గా ఉంటుంది. ఈ రైలులో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీట్లతో పాటు పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. రైలులో ప్రయాణికుల కోసం రెండు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో 370 రోజులకు పైగా! -
Kedarnath: మట్టిపెళ్లల్లో కూరుకుపోయి నలుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రా మార్గంలో పెద్ద ప్రమాదం జరిగింది. సోన్‌ప్రయాగ్ -గౌరీకుండ్ మధ్య మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద పలువురు కూరుకుపోయారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మట్టిపెళ్లల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. పలు విపత్తుల కారణంగా యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా పరిస్థితులు కాస్త అనుకూలించడంతో యాత్ర మళ్లీ వేగం పుంజుకుంది. అయితే తాజా ఘటన తర్వాత అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉంటూ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. -
మణిమహేష్ యాత్ర ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్‌లో జన్మాష్టమికి మొదలై రాధాష్టమికి ముగిసే యాత్రను మణిమహేష్ యాత్ర అని అంటారు. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అటు ప్రకృతి ప్రేమికులకు, ఇటు సాహస ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఇది. అలాగే విహారయాత్రలు చేసేవారికి, ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేవారికి హిమాచల్‌ప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచింది.వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించవచ్చు. ముఖ్యంగా జన్మాష్టమి నుండి రాధాష్టమి వరకు మణిమహేష్ సరస్సును సందర్శించేందుకు ఉత్తమమైన సమయం. దాల్ సరస్సునే మణిమహేష్ సరస్సును అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి అనంతరం మణిమహేష్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలివస్తుంటారు.ఆగస్టు 26 నుండి మణిమహేష్ యాత్ర ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. కైలాస శిఖరంపై నివసిస్తున్న మణిమహేషుడు(మహాశివుడు)ఈ సమయంలో దాల్ సరస్సునుంచి అద్భుతంగా కనిపిస్తాడని చెబుతారు. మణిమహేష్ యాత్ర ప్రతియేటా సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే జన్మాష్టమి నుంచి మొదలువుతుంది. తొమ్మదివ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మన్ ఇక్కడే శివుణ్ణి దర్శనం చేసుకున్నాడని చెబుతారు. సెప్టెంబర్ 11 రాధాష్టమితో మణిమహేష్ యాత్ర పరిసమాప్తమవుతుంది. -
విశాఖపట్నం : భక్తిశ్రద్ధలతో మార్వాడిల కావడి యాత్ర (ఫొటోలు)
-
Madhya Pradesh: కావడియాత్రలో విషాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావడియాత్రికులతో కూడిన ట్రాక్టర్‌ను ఒక ట్రక్కు బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు కావడియాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఘాట్‌కు ట్రాక్టర్లో తరలివెళ్తున్నారు.డియోరీ గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడియాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 12 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్వర్ యాత్ర: సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి షాక్
కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించింది. జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను రాయాలని తొలుత ఆదేశించింది. తరువాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. వీటిపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. విచారణలో ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని కోరింది. దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.దీనికిముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని, మైనారిటీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నదని పేర్కొన్నారు. యూపీ, ఉత్తరాఖండ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సియు సింగ్ మాట్లాడుతూ పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని అన్నారు.విచారణ అనంతరం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో జారీ చేసిన నేమ్ ప్లేట్లకు సంబంధించిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్టే విధించింది. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. -
యూపీలో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అధికారం ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని యూపీలో బరిలోకి దిగిన హస్తం పార్టీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరించింది. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దెబ్బ తీసింది. దీంతో యూపీలో ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయోత్సాహంతో యూపీలో జూన్11నుంచి15 దాకా ధన్యవాద్ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర జరగనున్నట్లు తెలిపింది. పార్టీ సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు. -
జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ “జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజు ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 22న సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ పర్యాటక రైలు అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచి్చ, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి జూన్ 30న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి.సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలుకు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో యాత్రికులు ఎక్కిదిగేందుకు అవకాశం కలి్పంచారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ రూ.14,250, 3 ఏసీ రూ.21,900, 2 ఏసీ రూ.28,450గా ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం గాని సెల్ : 9281495848, 8287932312 నంబర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. -
ఇన్నోవేషన్ యాత్ర 2024: ఆలోచనకు పునాది వేయనున్న ముగింపు!
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC), నవమ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యంత విజయవంతమైన 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' ముగింపు వేడుకలకు ఆహ్వానించడానికి 'అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్' ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి. నెట్వర్క్ ఆఫ్ ఎకోసిస్టమ్ పాట్నర్స్, ఈవెంట్ స్పాన్సర్‌గా నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్), అసోసియేట్ పార్టనర్‌గా లాజులిన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. 2024 మార్చి 12 నుంచి ప్రారంభమైన ఐదు రోజుల బస్సు యాత్ర 16వ తేదీ ముగుస్తుంది. ఈ ప్రయాణం నిజామాబాద్ నుంచి ప్రారంభమై పర్యావరణ వ్యవస్థలను అన్వేషిస్తూ.. సాగుతుంది. ఈ ప్రయాణం నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట ప్రాంతాలలో పర్యటించి హైదరాబాద్‌లోని ఏసీఐసీ-సీబీఐటీలో ముగుస్తుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు ఇలా.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు (మార్చి 16) యాత్రలో పాల్గొన్నవారు వారి విజయాలను జరుపుకుంటారు, వారి సృజనాత్మకను కూడా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ACIC-CBIT, గండిపేటలో జరుగుతుంది. ఇన్నోవేషన్ యాత్ర - 2024 చివరి రోజు కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ కింది విషయాలను తెలుసుకోవచ్చు. విజయవంతమైన వ్యవస్థాపకులు, స్థానిక ఆవిష్కర్తల నెట్వర్క్ అనుభవాల ద్వారా సమాజ అవసరాల గురించి లోతైన అవగాహన సమస్యకు పరిష్కారం తెలుసుకునే నైపుణ్యం ఆలోచనను ఉపయోగించి వాస్తవ-ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం భావసారూప్యత గల వ్యక్తుల సహాయక సంఘాన్ని నిర్మించడం గ్రామీణ ఆవిష్కర్తల కథల నుంచి ప్రేరణ -
కొంగొత్త ఆలోచనలకు అంకురం... ఇన్నొవేషన్ యాత్ర 2024!
అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్ నేతృత్వంలో.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ (TSIC) భాగస్వామ్యంతో 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' (Innovation Yatra - 2024) పేరుతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 రేపటితో ప్రారంభమై శనివారం వరకు (మార్చి 12 నుంచి 16) జరగనుంది. ఇందులో నవమ్ ఫౌండేషన్, ఎకో సిస్టం భాగస్వాములుగా Ag-Hub, అడ్వెంచర్ పార్క్, AIC-GNITS, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్లె సృజన మొదలైనవి భాగస్వాములుగా పాల్గొంటాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇన్నోవేషన్ యాత్ర 5 రోజులు, 60 మంది యాత్రికులు, 6 గమ్యస్థానాలు, 800 కి.మీ సాగుతుంది. ఇది ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనటానికి అప్లై చేసుకోవచ్చు. ఐదు రోజులు జరిగే ఈ బస్సు యాత్రలో పాల్గొనేవారు విజవయంతమైన వ్యవస్థాపకులు, లోకల్ ఇన్నోవేటర్స్తో సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రయాణంలో మంచి అనుభవాలు పొందటమే కాకుండా.. విలువైన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఈ యాత్రలో పాల్గొనేవారు తెలంగాణలోని విభిన్న కమ్యూనిటీలను కలుసుకోవడం, వారి ప్రత్యేకమైన అవసరాలు.. వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి లోతైన అవహగాన పొందటమే కాకుండా, వారి అనుభవాల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన మనస్తత్వం మీలో పెంపొందించుకోవడంలో ఈ యాత్ర తప్పకుండా తోడ్పడుతుంది. ఇన్నోవేషన్ యాత్రలో వ్యక్తిగత అభివృద్ధికి అతీతంగా.. విభిన్న నేపథ్యాలకు చెందిన 59 యాత్రికులతో కనెక్ట్ అవుతారు. దీని ద్వారా మీకు కావలసిన జ్ఞానాన్ని పొందుతారు. సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కోవడానికి, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఈ యాత్ర ద్వారా సంపాదించవచ్చు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ఆవిష్కర్తల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రదర్శించడం కూడా ఇందులో ఒక భాగం. వారు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనేది యాత్ర లక్ష్యం. -
బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో కోడిగుడ్ల దాడి
-
నీటి పోరు యాత్రకు సిద్ధమైన బీఆర్ఎస్
-
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
Yatra 2 @ London : లండన్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్‌లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర..
కరీంనగర్: ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రతీ నిమిషం ప్రజల్లోనే ఉన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యరద్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం మేడిపల్లిలో ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా అంబేడ్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కుటుంబానికి సైతం సమయం ఇవ్వకుండా తన నియోజవర్గ ప్రజలతో మమేకమై ప్రతీ సందర్భంలోనూ వెన్నంటి ఉన్నానని గుర్తు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి ఎంపీగా ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మేడిపల్లి–గోవిందారం రోడ్డుకు రూ.22కోట్లు, గోవిందారం బస్టాండ్‌కు రూ.15 లక్షలు, వెంకట్రావ్‌పేటకు రూ.20 లక్షలు, దేశాయిపేటకు రూ.20లక్షలు, తొంబర్రావుపేట, పోరుమల్ల, కొండాపూర్, మేడిపల్లి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి మండలానికి చేసిందేమీ లేదన్నారు. ‘బండి సంజయ్ ఏం చేశాడు’ అని మాట్లాడుతున్న నేతల నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర అని చెప్పారు. అనంతరం ప్రజాహితయాత్ర మండలంలోని కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడెం నుంచి రాత్రి 10 గంటల వరకు కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చేరింది. కాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో బైపాస్ రోడ్డు నిర్మాణంతో తాము నష్టపోతున్నామని, అలైన్మెంట్ మార్పించాలని పలు వురు రైతులు సంజయ్‌కు వినతిపత్రం ఇచ్చారు. యాత్రలో నారాయణఖేడ్, హుస్నాబాద్ బీజేపీ నాయకులు సంగప్ప, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు మొరపల్లి సత్యనారాయణ, ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు ముంజ శ్రీనివాస్ పాల్గొన్నారు. కథలాపూర్‌లో ఘనస్వాగతం కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపెల్లి గ్రామాల్లో శనివారం రాత్రి ప్రజలను పలకరిస్తూ.. నమస్కరిస్తూ ఎంపీ సంజయ్ యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎంపీకీ ఘన స్వాగతం పలికారు. మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో బ్యాంక్ ఏర్పాటు చేయించాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నియోజకవర్గ నాయకుడు చెన్నమనేని వికాస్‌రావు, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పూట గడవడమూ కష్టమే! -
బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం
కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం -
రాహుల్ యాత్రకు ఆహ్వానం లేదు: అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే యాత్రకు రావాల్సిందిగా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఎన్నో పెద్ద ఈవెంట్లు జరుగుతుంటాయని, అన్నిటికి తమను పిలవరని అన్నారు. వెంటనే దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాంరమేష్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ న్యాయ యాత్ర షెడ్యూల్ ఇంకా ఖరారవలేదు. ఒకట్రెండు రోజుల్లో టూర్ షెడ్యూల్ ఫైనల్ అవుతుంది. న్యాయ యాత్రకు అఖిలేశ్ హాజరైతే ఇండియా కూటమి ఇంకా బలోపేతం అవుతుంది’ జైరాం రమేష్ అన్నారు. రెండవ విడత మణిపూర్ నుంచి వరకు ప్రారంభమైన రాహుల్‌గాంధీ న్యాయ యాత్ర ఐదు రాష్ట్రాల్లో టూర్ పూర్తి చేసుకుంది. యాత్రలో ఈసారి ఎక్కువ భాగం రాహుల్‌గాంధీ బస్సులోనే పర్యటించారు. ఈ నెల 16న న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘పెళ్లెప్పుడు?’ పిల్లాడి ప్రశ్నకు రాహుల్ ఏమన్నారు?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో కొనసాగింది. ఈ సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు. దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు. అదేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే! ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఉన్న రాహుల్‌ను ఆ కుర్రాడు ఈ ప్రశ్న అడగగానే రాహుల్ గాంధీ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ష్ అనే ఆరేళ్ల బాలుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ బ్లాగ్ క్రియేట్ చేశాడు. దానిలో ఆ కుర్రాడు రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా అభివర్ణించాడు. ఆ కుర్రాడు రాహుల్ గాంధీని ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని అడిగాడు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని అన్నారు. తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా బీహార్ వచ్చిన రాహుల్‌ను చూసేందుకు జనం తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్‌కు చేరుకుంది. -
14 నుంచి రాహుల్ గాంధీ ‘న్యాయ్ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14 నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ప్రారంభిస్తారని ఏఐసీసీ జాతీ య అధికార ప్రతినిధి షమా అహ్మద్ తెలిపారు. గురువారం ఆమె గాం«దీభవన్‌లో మాట్లాడుతూ మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర ఉంటుందని, మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. దేశంలో యువత ఉద్యోగాలు, ఉపాధిలేక అల్లాడుతోందని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ సర్కార్ మోసం చేసిందని, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరి గిపోయాయని విమర్శించారు. దీంతో సామా న్య ప్రజల జీవనం కష్టంగా మారిందని అన్నా రు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై ఈడీ, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారన్నా రు. మరోవైపు కిసాన్, దళిత, ఆదివాసీలు, మ ణిపూర్‌లో చర్చిలు, ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. -
పేదల ప్రగతితో బలమైన భారత్
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. -
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్‌లలో వాట్సప్ స్టేటస్‌లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్‌ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్‌లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
రాహుల్ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్ ఆవిష్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరహాలో మారో యాత్ర చేపడతారని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసందే. అయితే శనివారం రాహుల్ గాంధీ చేపట్టే యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేస్తూ కాంగ్రెస్ చీఫ్ మళ్లికార్జున ఖర్గే ప్రకటించారు. భారత్ జోడో యాత్ర లోగో, స్లోగన్‌ను ఖర్గే ఆవిష్కరించారు. ఈ యాత్రకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేసి.. ‘న్యాయం అందేవరకు’ అనే స్లోగన్‌ను పెట్టినట్లు తెలిపారు. ఇక.. ఈ జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ చేపట్టే.. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్రగా కొనసాగనుంది. ये है 14 जनवरी, 2024 को मणिपुर से मुंबई तक शुरू होने जा रही भारतीय राष्ट्रीय कांग्रेस की भारत जोड़ो न्याय यात्रा का रूट मैप। @RahulGandhi 66 दिनों में 110 ज़िलों से गुज़रते हुए 6700 किलोमीटर से ज़्यादा की दूरी कवर करेंगे। यह पिछली भारत जोड़ो यात्रा की तरह ही प्रभावशाली और… pic.twitter.com/m3JeA3Nw4O — Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2024 చదవండి: Ayodhya: 22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే.. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది
-
రాహుల్ యాత్ర...కాంగ్రెస్ కి మాత్ర అవుతుందా ?
-
రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర
-
రూల్స్ బ్రేక్ చేసిన ధనుష్ కుమారుడికి ఫైన్ వేసిన పోలీసులు
తమిళ చిత్రసీమలోనే కాకుండా భారతీయ చిత్రసీమలో కూడా ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నాడు ధనుష్.. రీసెంట్గా తెలుగులో 'సార్' సినిమాతో మెప్పించాడు. సాధారణ వ్యక్తిలా తన కెరియర్ను ప్రారంభించిన ధనుష్ ఎంతో కష్టపడి కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను 2004లో ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమారు 18 ఏళ్ల తర్వాత వారిద్దరి మధ్య ఒక్కసారిగా మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం నుంచి విడివిడిగా ఉంటున్నారు కానీ వారిద్దరి పిల్లలు యాత్ర, లింగ ప్రస్తుతానికి ఐశ్వర్య రజనీకాంత్ వద్దే ఉంటున్నారు. తరుచూ వారిద్దరూ ధనుష్ వద్దకు వెళ్తూ ఉంటారు. తాజాగా ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పలు తమిళ మీడియా సంస్థలు కూడా అదే కథనాన్ని ప్రచురించాయి. తన YZF R15 బైక్‌ను నడుపుతున్న సమయంలో యాత్ర హెల్మెట్ లేకుండా పోలీసుల కెమెరాలకు చిక్కాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. ఆ సమయంలో అతను తన తాత రజనీకాంత్ ఇంటి నుంచి తన తండ్రి ధనుష్ ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో అతివేగంతో ద్విచక్రవాహనాన్ని నడిపిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి నిజంగానే ధనుష్ కొడుకు యాత్రే అని పోలీసులు నిర్ధారించారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1000 జరిమానా విధించారు. -
హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!
అతడు ఓ స్టార్ హీరో కొడుకు. అనుకోకుండా ఓ పొరపాటు చేశాడు. దీంతో సదరు హీరో ఇంటికి పోలీసులు వచ్చారు. అసలేం జరిగిందో చెప్పి క్లారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) అసలేం జరిగింది? స్టార్ హీరో ధనుష్ పేరుకే తమిళోడు కానీ తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించాడు. సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ధనుష్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే పిల్లలు మాత్రం ఇద్దరితోనూ ఉంటున్నారు. తాజాగా ధనుష్ పెద్ద కొడుకు యాత్ర.. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ పొరపాటు చేశాడు? అయితే ధనుష్ కొడుకు యాత్ర వయసు 15 ఏళ్లే. అలాంటిది డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా తాము నివసిస్తున్న పోయస్ గార్డెన్ ఏరియాలో బైక్ నడిపాడు. దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడింది. బైక్ పై ఉన్నది ధనుష్ కొడుకా కాదా అని స్వయంగా ఇతడి ఇంటికొచ్చి కన్ఫర్మేషన్ తీసుకున్నారు. అతడే అని తేలడంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను రూ.1000 జరిమానా విధించారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
బీసీలను పెద్దల సభకు పంపింది సీఎం జగన్: మంత్రి సీదిరి
సాక్షి, గాజువాక : చంద్రబాబుకు బానిసత్వం చేసే వారే టీడీపీలో మిగిలారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం విశాఖపట్నం గాజువాకలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర బహిరంగ సభలో అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు ఏనాడైనా చంద్రబాబు మేలు చేశారా అని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు తోలు తీస్తానని, తాట తీస్తానని బెదిరించారని గుర్తుచేశారు. ఒక మత్స్యకారుడు పార్లమెంట్ లో అడుగు పెట్టారంటే అందుకు సీఎం జగన్ కారణమని చెప్పారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్య సభకు పంపింది సీఎం జగనేనన్నారు. బీసీలు జడ్జిలుగా పనికి రారని చంద్రబాబు లేఖలు రాశారని మండిపడ్డారు. దళితులను అవమానించిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. పీకే అంటే ప్యాకేజీ స్టార్ అని, జనసైనికుల కష్టాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్మేస్తున్నారని అప్పలరాజు ఫైర్ అయ్యారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. సీఎం పాలనను ఇతర రాష్ట్రాలు అచరిస్తున్నాయి. ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వంపై త్పపుడు ప్రచారం చేస్తున్నాయి. అవినీతి రహిత పాలనను సీఎం జగన్ అందిస్తున్నారు. లంచాలు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. రాజధాని వైజాగ్‌కు వస్తె ఇక్కడ ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి’ అని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేత అంజాద్ బాషా మాట్లాడుతూ..‘ సీఎం జగన్ చెప్పిందే చేస్తారు. లోకేష్ కార్పొరేటర్‌గా కూడా గెలవడు. పవన్‌ను రెండు చోట్ల ఓడించిన మగాడు సీఎం జగన్’ అని కొనియాడారు. -
రాష్ట్ర ప్రభుత్వ బాటలో కేంద్రం
సాక్షి, అమరావతి : అర్హులందరికీ నవరత్న పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే కేంద్రం పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్నీ అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందిస్తోంది. ఒక వేళ పొరపాటున అర్హులైన వారికి ఏ పథకం అయినా అందకపోయినా ఏడాదిలో రెండు సార్లు అలాంటి వారి కోసం అవకాశం కల్పింస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన మిగిలిన వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలన చేసి ఏడాదిలో రెండు సార్లు పథకాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలనూ దేశవ్యాప్తంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందించేందుకు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15న తొలుత దేశ వ్యాప్తంగా 110 గిరిజన జిల్లాల్లో ప్రారంభిస్తారు. మిగతా జిల్లాల్లో నవంబర్ మూడో వారం నుంచి ప్రారంభించనున్నారు. ఇటీవలే కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. తగిన చర్యలు తీసుకోండి : సీఎస్ జవహర్‌రెడ్డి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారానికి రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. యాత్ర సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, అలాగే సీఎస్ అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ, పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వికసిత్ యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. వారంలో 14 గ్రామ పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ యాత్ర కొనసాగేలాగ ప్రణాళికను రూపొందించడంతో పాటు ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వ ఐటీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఆడియో, వీడియోతో కూడిన ఎల్ఈడీ స్క్రీన్ మొబైల్ వాహనాలతో పాటు ప్రచార సామగ్రి సరఫరా చేస్తుందని, వీటిని క్షేత్రస్థాయిలో చేరవేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు. -
వైఎస్సార్సీపీ పాలనలోనే సాధికారత
తెనాలి (పట్నంబజారు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, ప్రాంత, రాజకీయ పక్షపాతం లేకుండా ప్రతి పేదవాడి ఇంటి ముంగిటకు సంక్షేమాన్ని తీసుకెళ్లారని మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, కేవలం ఒక సామాజిక వర్గం, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారికే పాలన అందించారని మంత్రి సురేష్ తెలిపారు. అణగారిన వర్గాలు, బడుగు, బలహీన వర్గాల పేదలకు పరిపాలనను చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఎన్ని దాడులు చేసిందో అందరికీ అనుభవమేనన్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి లేని పాలన, సమర్థవంతమైన నాయకత్వం నాలుగు స్థంభాలుగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. 70 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాధికారత కల్పించారని తెలిపారు. సామాజిక సాధికారత కోసం తాము యాత్ర చేస్తుంటే రిమాండ్ ఖైదీ కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పక్షపాత పార్టీ అని మంత్రి జోగి రమేష్ చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో చేసింది చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను చేస్తున్న దమ్మున్న నేత సీఎం జగన్ అని అన్నారు. ఇప్పటివరకు రూ.2.31 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చుపెట్టిన ఘనత సీఎం జగన్‌దే అని అన్నారు. 2019లో ఓటు వేయని వారు కూడా వైఎస్ జగన్ పరిపాలన చూసి 2024లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లను గెలవబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. సినిమాల్లో హీరోగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో కామెడీ యాక్టర్‌గా మారిపోయారని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌ను తట్టుకోలేక టీడీపీ, జనసేన భూస్థాపితం కావడం తథ్యమన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన చేర్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జగనన్న రావడానికి ముందు అన్నీ స్కామ్‌లేనని, జగనన్న వచ్చాక అన్నీ స్కీములేనని, ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. టీడీపీ మైనార్టీలకు చేసింది ఏమిలేదని చెప్పారు. మాయమాటలతో బీసీల ఓట్లు వేయించుకునే రాజకీయాలకు సీఎం వైఎస్ జగన్ చెల్లు చీటి రాశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి చెప్పారు. జన్మభూమి అనే పనికిమాలిన కమిటీల ద్వారా టీడీపీ సిగ్గుమాలిన పాలన చేసిందని, అందుకు భిన్నంగా పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం జరిగిందని, ఇంకా చేస్తానని ఆయన స్పష్టంగా చెబుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అంబేడ్కర్ భావజాలాన్ని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. సీఎం జగన్ బీసీ సాధికారతను చేతల్లో చూపించారని మాజీ ఎంపీ బుట్ట రేణుక తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో రూ.1,800 కోట్ల తో సంక్షేమం, అబివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని చెప్పారు. దేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు రోశయ్య, షేక్ మహ్మాద్ ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు. సామాజిక సాధికార రణభేరి ఇది తెనాలి: దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సామా జిక న్యాయాన్ని నెలకొల్పారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తలెత్తుకొని తిరిగేలా చేశారని తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలు, జెండాలు, అజెండాలు లేకుండా అందరం మనసున్న జగనన్న బాటలోనే నడుస్తామని చెప్పారు. ఇది సామాజిక సాధికార రణభేరి అని, సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి జరిగింది కాబట్టే, సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించమని కోరుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైంది. కొలకలూరు బాపయ్యపేట వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడే కుండల తయారీలో ఉన్న శాలివాహనులను పలకరించిన అనంతరం మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వికేంద్రీకరణ మంత్రంతో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 3.5 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు సాధికారత చేకూరిన విధానాన్ని ప్రజలకు వివరించి, వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను ధైర్యంగా కోరతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, ముస్తాఫా, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి పాల్గొన్నారు. -
భువనేశ్వరి ప్రసంగాలతో ఆ స్పష్టత వచ్చినట్లే!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపైకి కొత్త పాత్ర ప్రవేశించింది. ఆమె ఎవరో వేరే చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఆ పాత్ర ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. అవినీతి కేసులో జైలులో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన భార్య నారా భువనేశ్వరి యాత్ర ఆరంభించారు. ఆమె వచ్చే శాసనసభ ఎన్నికలలో తాను కూడా పోటీచేయాలని ఆలోచిస్తూ ఈ యాత్ర చేస్తున్నారేమో తెలియదు. నిజం గెలవాలి అనే బ్యానర్ ఆమె చేబూని తిరగడం ఆరంభిస్తే, అవును.. నిజం గెలిచింది ..అందుకే చంద్రబాబు జైలులో ఉన్నారు.. అని వైఎస్సార్సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజం పూర్తిగా గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక 150 మంది మరణించారట. వారి కుటుంబాలను ఓదార్చడానికి ఈమె యాత్ర చేస్తున్నారట. భర్త జైలులో ఉంటే.. రాజమహేంద్రవరంలో క్యాంప్ ఇంటిలో ఉండి ఆయనకు అవసరమైన ఆహారం, మందులు వంటివాటిని పంపిచే బాధ్యతను తొలుత చేపట్టిన భువనేశ్వరి, ఆపై ఆ పని మాని జనంలో సానుభూతి కోసం తిరగడం ఆరంభించారు. ఆ సందర్భంగా ఆమె ఎవరో రాసిచ్చిన ఉపన్యాసాన్ని చదువుతున్నారు. తప్పు లేదు. కాకపోతే అందులో ఉన్న నిజాలు ఎన్ని అన్నదే ప్రశ్న. ఈ మొత్తం వ్యవహారం చూస్తే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే, ఆ పార్టీ ఉనికి కోల్పోతుందన్న భయం, దానికి మించి చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల ఉచ్చు మరింత బిగిస్తుందనే ఆందోళన, తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు గోవిందా అవుతుందన్న అనుమానం వంటి కారణాలతో భువనేశ్వరి ఈ ఓదార్పు యాత్ర చేస్తున్నారు. తెలుగుదేశం ఒకవిధంగా కొత్త విన్యాసం చేస్తోందని చెప్పాలి. తమ నాయకుడిని అరెస్టు చేస్తేనే దానిని తట్టుకోలేక మరణిస్తున్నారని జనాన్ని నమ్మించడానికి యత్నిస్తూ, అందుకు కొంత పెట్టుబడి కూడా పెడుతోంది. తద్వారా చంద్రబాబు అమాయకుడని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ప్రజలలో ప్రచారం చేయాలన్నది వారి లక్ష్యం. నిజం ఏమిటో చంద్రబాబుకు తెలుసు! భువనేశ్వరికి తెలుసు. లోకేష్‌కు తెలుసు. బహుశా బ్రాహ్మణికి కూడా తెలిసి ఉండాలి. అయినా జైలులో ఉన్న చంద్రబాబు సూచన మేరకు ఈ డ్రామాను ఆరంభించి ఉండాలి. భువనేశ్వరి ఏమి చెబుతున్నారంటే.. చంద్రబాబు కేసుల్లో అసలు ఆధారాలు లేవట. అయితే చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసును ఆమెకు చూపించి, అందులో చంద్రబాబుకు ఎలా ,ఎక్కడెక్కడ ముడుపులు ముట్టాయన్న విషయం చాలా స్పష్టంగా తెలిపిన విషయాన్ని వివరించాలి. అయినా ఆమె బుకాయించవచ్చు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ షాపూర్జిపల్లంజీ ప్రతినిధి మనోజ్ నుంచి ముడుపులు ముట్టాయని వాంగ్మూలం ఇచ్చిన సంగతి గురించి ఆమె మాట్లాడగలరా? ఆదాయపన్ను శాఖ నోటీసులోని అంశాలతో కాని, అంతకుముందు శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు గుర్తించినట్లు సీబీటీడీ చేసిన ప్రకటన గురించి ఆమె ఏమైనా చెప్పగలరా?. రాజకీయాలు చేయడానికి రాలేదంటూనే రాజకీయాలు మాట్లాడిన ఆమె అచ్చం అబద్దాలనే తన ఉపన్యాసంలో చెప్పినట్లు అర్ధం అవుతుంది. చివరికి ఆమె ఇచ్చి న మూడు లక్షల రూపాయల చెక్కు లో కూడా అబద్దం ఉండడం విశేషం. చంద్రబాబు సెప్టెంబర్ తొమ్మిదిన అరెస్టు అయితే, ఆయన సెప్టెంబర్ మూడవ తేదీనే ఎలా సంతకాలు చేశారన్నది సహజంగానే వచ్చే ప్రశ్న. చంద్రబాబు తమ జీవితాలలో వెలుగులు నింపుతారని ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని ఆమె అన్నారు. నిజంగా ఆ నమ్మకం ఉంటే గత శాసనసభ ఎన్నికలలో టిడిపిని 23 సీట్లకే ఎందుకు పరిమితం చేస్తారు?. చంద్రబాబు ఐదేళ్లపాలనపై ఎందుకు అంత ఆగ్రహం ప్రదర్శిస్తారు!. ఏపీని చీకటి పాలు చేశారనే కదా ఆ ఓటమి ఎదురైంది. ఆయన హైదరాబాద్ లో హైటెక్ సిటీని ఏర్పాటు చేస్తే అప్పట్టో అవహేళన చేశారని మరో అబద్దం చెప్పారు. నిజానికి అంతకు కొన్ని ఏళ్ల ముందే నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇదే ప్రాంతంలో సాఫ్ట్ వేర్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన విషయం దాచి వేయాలన్నది ఆమె ఉద్దేశం కావొచ్చు. ఆయన 2000 సంవత్సరంలో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం ఒకటి కట్టించారు. దానిపై కూడా అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. ఆనాటి ప్రతిపక్ష నేత పి.జనార్దనరెడ్డి ఈ భవన నిర్మాణంలో జరిగిన అవినీతిపై పలు విషయాలు చెబుతుండేవారు. అది వేరే సంగతి. ఆ తర్వాత మూడేళ్లలో ఆయన ఓటమి చెందారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చారు. ఆయన హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో సహా అనేక ఐటి సంస్థలు వచ్చాయి. అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే తదితర సదుపాయాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంతంలో అనేక కొత్త వంతెనలు వచ్చాయి. అనేక ప్రైవేటు సంస్థలు ప్రైవేటు భూములలో భవంతులు కట్టాయి. ఇరవైఏళ్ల క్రితం సి.ఎమ్. గా చేసిన చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్ ను తానే నిర్మించానని క్లెయిమ్ చేసుకోవడం అతిశయోక్తి తప్ప ఇంకొకటికాదు. నిజంగానే చంద్రబాబుకు అంత అభివృద్ది దృష్టి ఉంటే విభజిత ఏపీలో ఐదేళ్లపాటు పాలించి ఎందుకు ఐటి కంపెనీలను రాబట్టలేకపోయారు?ఎక్కడ ఏ అభివృద్ది జరిగినా అదంతా తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య. ఇప్పుడు ఆయన భార్య భువనేశ్వరి కూడా అదే బాట పట్టినట్లున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారట. అంతే తప్ప పోలీసు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు దగ్దం చేయడం, ఒక పోలీసుకు కన్ను పోవడం.. ఇవేమీ అసలు హింసకిందకు రావని ఆమె అనుకుంటున్నారేమో తెలియదు. న్యాయాన్ని జైలులో నిర్భంధించారట. చంద్రబాబు కోసం జనం రోడ్ల మీదకు వచ్చారట. అవన్నీ నిజం అయితే ఆమె ఇప్పుడు ఓదార్పు యాత్ర డ్రామాకు తెరదీయవలసిన అవసరం ఏమి ఉంటుంది. లోకేష్ సమర్ధతపై నమ్మకం లేకే చంద్రబాబు తన భార్యను రంగంలో దించారన్నది ఒక అభిప్రాయంగా ఉంది. తెలుగు పౌరుషం అంటే ఏమిటో ఎన్.టి.ఆర్.చెప్పారట. మరి అలాంటి ఎన్.టి.ఆర్.ను తన భర్త దారుణంగా అవమానించి పదవి నుంచి దించేయడాన్ని ఏమనాలి. అసలు చంద్రబాబు గురించి ఎన్.టి.ఆర్. ఏ స్థాయిలో దూషించింది భువనేశ్వరి తెలియనట్లే నటిస్తున్నారు. ఎంతైనా చంద్రబాబు భార్య కదా! అచ్చం ఆయన మాదిరే నటనావైదుష్యాన్ని ప్రదర్శించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మహిళగా ఆమె బాధను అర్ధం చేసుకోవాలని అంటున్నారు. ఒక భార్యగా ఆమె బాధపడడంలో తప్పు లేదు. మరి రాజమహేంద్రవరంలోనే గోదావరి పుష్కరాలలో వీరి స్నానం కారణంగా తొక్కిసలాట జరిగి మృతి చెందిన 29 మంది కుటుంబాల బాధను ఏమనాలి. చంద్రబాబు సభల కారణంగా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటలు జరిగి పదకుండు మంది మరణించారు. వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారా! చంద్రబాబు ప్రజాధనం వందల కోట్లు కొల్లగొట్టారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నప్పుడు కోర్టులు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపుతున్నప్పుడు న్యాయాన్ని నిర్భందించడం ఎలా అవుతుంది?. సెంటిమెంట్ డైలాగులు వాడితే జనం పడిపోతారా! న్యాయం,చట్టం ఎవరికైనా ఒకటే నని ఇన్నాళ్ల తర్వాత తేలుతోందని ప్రజలు భావిస్తున్నారు. వయసుకు ,అవినీతి కేసులకు సంబంధం లేదని పలు ఉదాహరణలు చెబుతున్నాయి. ఏది ఏమైనా భువనేశ్వరి రాసుకు వచ్చిన ప్రసంగం చదువుతూ ప్రజలలో సానుభూతిని ఆశిస్తున్నారు. కాని, అక్కడ కూర్చున్న మహిళల ముఖాలు చూస్తే ఈమె ఏమి చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో అర్ధం కాక దిక్కులు చూస్తున్నారనిపించింది. చంద్రబాబు భార్యగా ఆమె అబద్దాలు చెబుతున్నారు తప్ప, ఎన్.టి.ఆర్.కుమార్తెగా నిజాలు చెప్పాలని ఆమె అనుకోవడం లేదు. ఆ విషయం ప్రజలకు ఇట్టే బోధపడుతోంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
భువనేశ్వరి సెంటిమెంట్ అస్త్రంపై నెటిజన్స్ కామెంట్స్
-
నిప్పో...తుప్పొ తేలిపోతుందా ?
-
ప్రజల్లోకి మరింత ఉధృతంగా..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత 52 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. విప్లవాత్మక మార్పులతో సు పరిపాలన ద్వారా ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేస్తున్న మంచిని చాటిచెప్పడానికి పార్టీ శ్రేణులు మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రాంతీయ సమ న్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో సోమవారం జరిగిన పార్టీ ప్రతినిధుల సదస్సులో నిర్దేశించిన అంశాలపై నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించాలని సూచించిన విషయం తెలిసిందే. దసరా తర్వాత ఈనెల 26 నుంచి సామాజిక న్యాయ యాత్ర పేరుతో 3 ప్రాంతాల్లో చేపట్టే బస్సుయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రతినిధుల సద స్సులో నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై వారితో చర్చించి.. వాటిని ప్రజల్లోకి ప్రభావవంతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఇది నా పార్టీ అని పేదలు భావించాలి.. దసరా ముగిశాక.. అక్టోబర్ 26 నుంచి సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సుయాత్ర మొదలు పెట్టాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్ సూచించారు. ఈ యాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యులను నియమిస్తామన్నారు. ఈ యాత్ర సందర్భంగా మూడు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగసభల ఏర్పాట్లను సమన్వయపరచడానికి కూడా ముగ్గురు బాధ్యులను నియమిస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహించి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఒక్కోటి చొప్పున ప్రతిరోజూ 3 సమావేశాలు నిర్వహించాలని స్పష్టంచేశారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమావేశాలు విజయవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడతారని చెప్పారు. 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ సమావేశాల ద్వారా వివరించి.. ఆ వర్గాలకు పార్టీని మరింత చేరువ కావాలన్నారు. పేదవాడు మన పార్టీని తన పార్టీగా ఓన్ చేసుకునేలా బస్సుయాత్రలు ప్రభావంతంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర జరగాలన్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలపై తేదీ, స్థలం సహా పక్కా ప్రణాళిక తయారుచేసుకోవాలని ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్ జగన్ సూచించారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అంశాలను ప్రస్తావిస్తూ ఈ బస్సు యాత్ర జరగాలన్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ అవగాహన కల్పించాలి.. విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రకటించిన కార్యక్రమాలపై నియోజకవర్గ స్థాయిలో కూడా అవగాహన కల్పించాలని ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే అవగాహన సమావేశాలకు గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు హాజరయ్యేలా చూడాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి.. ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలు సృష్టిస్తుంటే యాత్రకు అనుమతులు రద్దుచేయండి
సాక్షి, అమరావతి: సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని హైకోర్టు పేర్కొంది. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో, అలాగే పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా యువగళం యాత్రలో భాగంగా మందలపర్రు గ్రామంలో లోకేశ్ చర్చి వైపు వేలు చూపిస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లి చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారని చెప్పారు. లోకేశ్ బహిరంగంగానే టీడీపీ శ్రేణులను దాడులకు ఉసిగొల్పుతున్నారని తెలిపారు. కనీసం 12 నుంచి 20 కేసులున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించే బాధ్యత తనదంటూ లోకేశ్ ప్రతి సభలోను బహిరంగంగా చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం చూడవచ్చన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోను చంద్రబాబునాయుడు ఇదే రీతిలో టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. అందుకే పుంగనూరు ఘటనలో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు పెట్టుకున్న పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించామని, ముందస్తు బెయిల్ ఇస్తే ఇలాంటి ఘటనలు పునరావృత్తం చేస్తూ ఉంటారని ఆ రోజు మొత్తుకున్నామని చెప్పారు. ఆ రోజున తాము వ్యక్తం చేసిన ఆందోళన ఈ రోజు నిజమైందన్నారు. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఆ రోజున టీడీపీ నేతల అరాచకాలు ఎలా ఉంటాయో స్పష్టంగా వివరించామని తెలిపారు. కేసులు పెడితే వెంటనే హైకోర్టుకు వస్తున్నారన్నారు. అదే వారి ధైర్యమని చెప్పారు. ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని స్పష్టం చేసింది. ‘మీరు (ప్రభుత్వం) ఇచ్చిన అనుమతితోనే కదా యాత్ర చేస్తున్నది. అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అనుమతులు రద్దుచేయవచ్చు కదా?’ అని ఏఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. లోకేశ్ పాదయాత్ర గురించి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు టీడీపీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పెద్దగా అరుస్తూ.. ప్రస్తుత కేసులతో లోకేశ్ పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదని, యువగళం ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. టీడీపీ న్యాయవాదులు గొంతు పెద్దదిగా చేసి మాట్లాడుతుండటంతో న్యాయస్థానం వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? లేక కోర్టు అనుకుంటున్నారా? అంటూ వారిని మందలించింది. ఏఏజీ వాదనలు వినిపిస్తున్నప్పుడు మధ్యలో ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించింది. ఆయన వాదనలకు సమాధానం ఇచ్చేందుకు మీకు అవకాశం వచ్చినప్పుడు అన్నీ చెప్పుకోవాలే తప్ప ఇలా చేపల మార్కెట్లో అరిచినట్లు అరవడం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేసింది. ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు గతంలో ఇతర నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇచ్చిన ఉత్తర్వులను తాజా వ్యాజ్యాల్లోనూ ఇస్తూ ఆ వ్యాజ్యాలను పరిష్కరించాలని టీడీపీ న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎం.లక్ష్మీనారాయణ, పుల్లగూర నాగరాజు తదితరులు కోరారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అలా చేయడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కనీసం కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని వారు అభ్యర్థించారు. అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వేర్వేరు పిటిషన్లు వేసిన టీడీపీ నేతలు అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, గంటా నరహరి, షాజహాన్ బాషా,దొమ్మాలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు, ఎం.రాంప్రసాద్‌రెడ్డి తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయా లంటూ టీడీపీ నేతలు వి.చంద్రశేఖర్, ఎం.రాంప్రసాద్రెడ్డివేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా విచారణ సబబు కాదు అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నాని, చల్లా బాబు తదితరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము సుప్రీంకోర్టులో సవాలు చేశామని సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లోని పలు అంశాలను తాము సుప్రీంకోర్టు ముందు లేవనెత్తామన్నారు. టీడీపీ నేతల తీరుపై ఆందోళనతోనే వారికిచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లు చెప్పారు. తమ పిటిషన్లకు సుప్రీంకోర్టులో డైరీ నంబర్ కూడా జారీ అయిందని, అయితే ఎప్పుడు విచారణకు వస్తాయో నిర్దిష్టంగా చెప్పలేమని తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొందరు టీడీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేయడం సబబుగా ఉంటుందని కోర్టు భావిస్తే, అలాగే వాయిదా వేయచ్చన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై తాము విచారించడం సబబుగా ఉండదని అభిప్రాయపడింది. -
తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల వేళ అధికార పార్టీ ఇప్పటికే స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ తొలి విడతలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను ప్రకటించే ప్లాన్ చేస్తోంది. ఇక, బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం.. ఈ నెలాఖరులోనే బీజేపీ యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలని మూడుచోట్ల నుంచి యాత్రలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం, బాసర, ఆలంపూర్ నుంచి యాత్రలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల్లో స్థానిక బీజేపీ నేతలు, లీడర్లు ఆ మార్గాల్లోనే పాల్గొననున్నారు. సుమారు 18 రోజులు పాటు బీజేపీ నేతల యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఒక్కో రూట్లో 36 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ రూపకల్పన చేశారు. ఇక, బీజేపీ నేతల యాత్ర ప్రారంభం నుంచే ప్రతీరోజు రెండు నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కమలం పార్టీ యాత్రల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. అయితే, యాత్ర ముగింపు సభను సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోదీని కూడా ముగింపు సభకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన ముగింపు సభ కన్నా ముందే ఉండే నేపథ్యంలో యాత్రలు కూడా ముందుగానే ముగించాలనుకుంటున్నట్టు బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: పవన్. చిరంజీవిపై కేఏ పాల్ సంచలన కామెంట్స్ -
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
-
చావో రేవో తేల్చుకోవాలి
గురుగ్రామ్: హరియాణా పల్వల్‌లో విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఆదివారం నిర్వహించిన మహా పంచాయత్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రను ఆగస్టు 28న పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. జులై 31న నూహ్‌లో దుండగుల దాడితో మత ఘర్షణలు చెలరేగి యాత్ర అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. యాత్ర నిర్వహించి తీరాలని, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని మహాపంచాయత్‌లో హరియాణా గో రక్షక దళానికి చెందిన ఆచార్య ఆజాద్ శాస్త్రి అన్నారు. యాత్రలో అంతా ఆయుధాలు ధరించాలని పిలుపునిచ్చారు. మహాపంచాయత్‌లో విద్వేష ప్రసంగాలు చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ హిందూ నాయకులు పెడచెవిన పెట్టారు. కనీసం 100 రైఫిల్స్‌కు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లింలతో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ఆజాద్ శాస్త్రి రెచ్చగొట్టేలా ప్రసంగించారు. మరి కొందరు వక్తలు కూడా ఇదే తరహాలో ప్రసంగించారు. మీరు ఎవరైనా వేలెత్తి చూపిస్తే మీ చెయ్యినే నరికేస్తాం అని హెచ్చరించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న నూహ్ జిల్లానే రద్దు చేయాలని ఆ ప్రాంతంలో గోవధ ఉండకూదని వక్తలు డిమాండ్ చేశారు. నూహ్‌లో హిందువుల యాత్రపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఆందోళనలున్నాయి. -
రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వుకుంటూ..
చంఢీగర్: హరియాణాలోని మేవాత్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాసిర్, జునైద్ హత్య కేసులో మోనూ మానేసర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే.. బివానీ జిల్లాలో బొలేరో వాహనంలో మోనూ మానేసర్ సంచరించాడనే ఈ అల్లర్లు మొదలైనట్లు తెలుస్తోంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు శోభా యాత్రలో పాల్గొనాలని మోనూ మానేసర్ కోరినట్లు తెలుస్తోంది. అనంతరం సోమవారం ఉదయం యాత్ర ప్రారంభమైన వెంటనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ ఈ ఘటనపై స్పందించారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు యాత్ర కోసం అనుమతులు పొందినట్లు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇతర వర్గాల ప్రజలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. మేవాత్ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు. అల్లర్లను అదుపు చేయడానికి ఆగష్టు 2వరకు ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం.. -
జగన్ వీరాభిమాని బైక్ యాత్ర
అనకాపల్లి టౌన్: ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని కోరుతూ జగన్ వీరాభిమాని పాస్టర్ అడవికొట్టు రాజు చేపట్టిన బైక్ యాత్రకు స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి సోమవారం ఘన స్వాగతం లభించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మే 15వ తేదీన తన బైక్ యాత్ర ప్రారంభించాడు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలం సీహెచ్ఎన్ అగ్రహారం చేరుకున్నాడు. ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ను కలిశాడు. జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న రాజు సంకల్పం నెరవేరాలని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. సదరు వ్యక్తి బైక్ యాత్ర పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం చేరుకుంది. -
‘వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలి’
జగ్గయ్యపేట(ఎన్టీఆర్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి కూడా సీఎం కావాలని కోరుతూ తెలంగాణకు చెందిన వైఎస్సార్సీపీ నేత చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించింది. జనగామ జిల్లా బచ్చనపేట మండలం లింగంపల్లికి చెందిన బొడ్డు ప్రవీణ్ రెండోసారి జగన్ సీఎం కావాలని కోరుతూ ఈ నెల 21న జనగామ నుంచి తాడేపల్లి వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు యాత్ర చేరుకోవడంతో.. పట్టణంలోని బైపాస్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ రెండో సారి కూడా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు. చదవండి: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు -
ఏపీ సీఎం జగన్ పై అభిమానాన్ని చాటుకున్న తెలంగాణ యువకుడు
-
పవన్‌తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో!
అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. వారాహి వాహనం ఎక్కిన దగ్గర నుంచి ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అంబటి అన్నారు. పవన్ మానసికి స్థితి సరిగా ఉండటం లేదని వ్యంగ్యాస్త్రాలు సందించారు వారాహి వాహనం వెనకాలే అంబులెన్స్ ఏర్పాటు చేసి అందులో మానసిక వైద్యున్ని అందుబాటులో ఉంచమని ఏపీ వైద్య శాఖను కోరుతున్నానని ఎద్దేవా చేశారు. మానసిక స్థితి బాగులేని వారికోసం ఏ మందులు వాడతారో ఆ మందులనే అంబులెన్స్‌లో ఉంచమని చెప్పండని అంబటి సూచించారు. పవన్ మానసిక పరిస్థితి బాగులేకపోతే మందులిచ్చి వారాహి వాహనం ఎక్కించాలని కోరారు. 'బయటికి లాక్కొచ్చి తంతాను అని మాట్లాడుతున్నారు. లేకపోతే జనసేన నేతల చొక్కాలు పవన్ చించుతారు' అని మంత్రి అంబటి చురకలు అంటించారు. పవన్ బట్టలిప్పి కొట్టడానికి ఇది సినిమా కాదని అంబటి అన్నారు. ఇదీ చదవండి: దస్తగిరి అరాచకం... డబ్బు చెల్లించి మీ కొడుకును తీసుకెళ్లండి.. -
లోకేష్ పాదయాత్ర ఈవినింగ్ వాక్ లా ఉంది..!
-
లెక్కలేనంత తిక్క..!
-
అది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం పవన్ వల్ల కాదు..!
-
జగన్ మరోసారి సీఎం కావాలంటూ నియోజకవర్గాల్లో బైక్ యాత్ర
-
నా యాత్ర ఎందుకు ఆపారు? ఎవరి ఒత్తిడికి తలొగ్గారు?: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిఖ్ రావు ఠాక్రేకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన హాత్ సే హాత్ జోడో యాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఆదేశించడం తనను తీవ్రంగా బాధించిందని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. యాత్ర ఆగిపోవడం తనను అప్రతిష్టపాలు చేసిందని, ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి నా యాత్రను నిలిపివేశారని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సే సర్వస్వం అనుకుని పని చేస్తున్న తనను ఇలా అవమానించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 'నా 18 ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఇలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా ఇదే మొదటి సారి. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన అనంతరం అర్ధంతరంగా నిలిపివేయాలని మీరు ఆదేశించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు తలపెట్టిన నా తెలంగాణ పోరు యాత్రను విరామం అనంతరం తిరిగి ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభించేందుకు నేను అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. కానీ మీరు నిర్మల్ సభ ముగిసిన అనంతరం, షెడ్యూల్ ప్రకారం నా యాత్రను కొనసాగించడానికి వీల్లేదని, రద్దు చేసుకోవాలని ఆదేశించడం నన్ను షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంలో మీరు నాతో మాట్లాడిన తీరు కూడా నన్ను తీవ్రంగా బాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు హాత్ సే హాత్ జోడో యాత్రను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహిస్తానంటూ ముందుకురావడం, సహకరించాలని నన్ను కోరడంతో నేను నా యాత్రను భట్టి గారి యాత్రలో విలీనం చేస్తున్నట్టు, ఈ యాత్రను ఆయన కొనసాగిస్తారని ప్రకటించాల్సి వచ్చింది. నా యాత్రను మీరు ఉన్న పళంగా అకారణంగా రద్దు చేసిన అంశం వివాదం కావొద్దనే సదుద్దేశంతో నేను భట్టి విక్రమార్క గారి యాత్రకు సహకరిస్తున్నట్టు ప్రకటించాను. అయితే నాయాత్రను ఆపేయాలన్న మీరు అదే సందర్భం లో ఇతర సీనియర్లు కూడా యాత్రలు చేస్తారని చెప్పడం వెనకున్న మతలబేంటి, మరి విజయవంతంగా సాగుతున్న నా యాత్రను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేసినట్టు, ఇంతలా నన్ను అవమానించడం ఎంత వరకు సమంజసం? హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది ఏఐసీసీ రూపొందించిన ప్రోగ్రామ్. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రలను పర్యవేక్షించాల్సింది నేనే. అలాంటి బాధ్యతలో ఉన్న నన్ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అయినే మీరే అడ్డుకోవడమేంటి? కాంగ్రెస్ ఇమేజ్ ను బలోపేతం చేసేందుకు పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేస్తున్నానే తప్ప కొందరిలా సొంత ప్రతిష్ట పెంచు కోవాలనే అజెండాతో కాదే, మరి అలాంటపుడు ఎందుకని నా యాత్రను ఆపేయాలన్నారు? ఏఐసిసి ప్రోగ్రామ్స్ అమలు విషయంలో నన్ను బైపాస్ చేస్తూ, అవమానిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే జరుగుతున్న లోపాలను సరిచేయాల్సిన మీరే అవేమీ పట్టించు కోకుండా ఏక పక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజా సేవే నా లక్ష్యం. ఇది నాకు తాత, తండ్రి నుంచి వచ్చిన రక్తగత లక్షణం. ఆత్మాభిమానాన్ని చంపుకుని అవమానాలు, భరిస్తూ పనిచేయడం నా విధానం కాదు. నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా.' అని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చదవండి: నా యాత్రలో అందరూ భాగస్వాములు కావాలి: భట్టి విక్రమార్క -
నా యాత్రలో అందరూ భాగస్వాములు కావాలి: భట్టి విక్రమార్క
మధిర: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజారహత్నూర్ మండలం పిప్పిరి నుంచి ప్రారంభమయ్యే తన పాదయాత్ర 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర సాగి ఖమ్మంలో ముగుస్తుందని తెలిపారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త శక్తి మేరకు తనతో నాలుగు అడుగులు వేసి పారీ్టకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవమే నినాదాలుగా సాధించుకున్న తెలంగాణలో సమస్యలు కాంగ్రెస్‌తోనే పరిష్కారమవుతాయన్న విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తానని భట్టి తెలిపారు. మూడు బహిరంగ సభలు పాదయాత్రలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు భట్టి తెలిపారు. మంచిర్యాల, హైదరాబాద్ శివారుతో పాటు ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, అవసరాలు, ఆశయాలను కాంగ్రెస్ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్తోందని.. తన యాత్రలో ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొనాలని కోరారు. ఇదీ రూట్ మ్యాప్.. ఈనెల 16వ తేదీన మొదలుకానున్న తన పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలను భట్టి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఖానా పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, ముదిగొండ, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు మీదుగా ఖమ్మం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు నాయకులు చావా వేణు, సూరంశెట్టి కిషోర్, మిర్యాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రేపట్నుంచి చాయ్ తాగడానికి కూడా ఎవరూ ఉండటం లేద్సార్! యాత్రకు మీతో పాటు నేనూ వస్తాను!!
రేపట్నుంచి చాయ్ తాగడానికి కూడా ఎవరూ ఉండటం లేద్సార్! యాత్రకు మీతో పాటు నేనూ వస్తాను!! -
రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి
-
త్వరలో మరో ‘జోడో’!
నవా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): అదానీ వ్యవహారంలో మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. అధికార బీజేపీ నేతలు నిస్సిగ్గుగా అదానీ గ్రూపుకు ఏకంగా పార్లమెంటులోనే కొమ్ముకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వ్యాపార మిషతో వచ్చి భారత్‌ను ఆక్రమించిన ఈస్టిండియా కంపెనీతో అదానీ గ్రూపును పోల్చారు! అక్రమ మార్గాల్లో భారీగా సంపద పోగేసి దేశానికి వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు. దీనిపై మోదీ స్పందనేమిటని పార్లమెంటులో విపక్షాలన్నీ నిలదీస్తే అది తప్ప అన్ని విషయాలపైనా మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. ‘‘దీనిపై నిజం వెలుగు చూసేదాకా అదానీ గ్రూపు వ్యాపార పద్ధతులు తదితరాలపై ప్రశ్నస్త్రాలు సంధిస్తూనే ఉంటాం. అవసరమైతే పార్లమెంటులో వెయ్యిసార్లైనా దీన్ని ప్రస్తావిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఆదివారం రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజు ముగింపు సమావేశాలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘అదానీకి ఒక్కటే చెప్పదలచా. ఆయన కంపెనీ దేశానికి నష్టం చేస్తోంది. దేశ మౌలిక వసతులన్నింటినీ చెరబడుతోంది’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘పోర్టులు తదితరాలతో పాటు దేశ సంపదను చెరబట్టిన కంపెనీకి వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మేం చేస్తున్న పోరాటమిది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘చరిత్ర పునరావృతమవుతోంది. అవసరమైతే మరోసారి మరో కంపెనీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది’’ అని ప్రకటించారు. కాశ్మీరీల్లో దేశభక్తిని రగిల్చాం... భారత్ జోడో యాత్ర ద్వారా జరిగిన ‘తపస్సు’ తాలూకు స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘అందుకు కావాల్సిన వ్యూహాలు రూపొందించండి. దేశమంతటితో పాటు నేను కూడా వాటిలో భాగస్వామిని అవుతా’’ అని సూచించారు. తద్వారా త్వరలో మరో దేశవ్యాప్త యాత్ర ఉంటుందని సంకేతాలిచ్చారు. ‘‘జోడో యాత్రలో ప్రజలు లక్షలాదిగా పాల్గొన్నారు. యాత్ర పొడవునా నేనెంతో నేర్చుకున్నా. కన్యాకుమారిలో మొదలై కశ్మీర్ చేరేసరికి ఎంతగానో మారాను. మిగతా ప్రజలంతా ఆనందంగా ఉంటే కశ్మీరీలు మాత్రమే ఎందుకు బాధల్లో ఉన్నారని ఒక బాలుడు అడిగాడు. నా యాత్ర కాశ్మీర్లో ప్రవేశించాక పోలీసు సిబ్బంది పత్తా లేకుండా పోయారు. కానీ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు అంతటా వేలాదిగా కశ్మీరీలు త్రివర్ణం చేబూని నాతో పాటు నడిచారు. తానూ లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేశానని మోదీ చెప్పుకున్నారు. నాతోపాటు వేలాది మంది కాశ్మీరీలు లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. త్రివర్ణంపై కశీ్మరీల్లో ప్రేమను మోదీ తన వేధింపు చర్యల ద్వారా దూరం చేస్తే మేం దాన్ని వారిలో తిరిగి పాదుగొల్పాం. ఈ తేడాను ఆయన అర్థం చేసుకోలేకపోయారు’’ అని కాంగ్రెస్ ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య చెప్పుకొచ్చారు. సమైక్యంగా శ్రమిద్దాం... ఎన్నికల పరీక్ష నెగ్గుదాం ‘‘కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా చాలా కీలకం. ఆ ఎన్నికల్లో విజయానికి సమైక్యంగా, క్రమశిక్షణతో కృషి చేయండి’’ అని పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయ్‌పూర్ ప్లీనరీ పిలుపునిచ్చింది. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలకు చక్కని వేదిక సిద్ధం చేసుకుందామని పేర్కొంది. ఈ మేరకు ఐదు సూత్రాలతో రాయ్‌పూర్ డిక్లరేషన్‌ను ప్లీనరీ ఆమోదించింది. భావ సారూప్యమున్న పార్టీలతో నిర్మాణాత్మక ఉమ్మడి ప్రణాళికతో కలిసి పని చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, అది ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ పేర్కొంది. ‘‘బీజేపీ, ఆరెస్సెస్‌లతో, వాటి మోసపూరిత రాజకీయాలతో ఎన్నడూ రాజీ పడని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ నియంతృత్వానికి, మతవాద, ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు వ్యతిరేకంగా దేశ రాజకీయ విలువ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సమాజంలో చీలిక తెచ్చే యత్నాలు, రాజకీయ నియంతృత్వాలపై రాజీలేని పోరాటం చేస్తాం. ఇందుకోసం భావ సారూప్య పార్టీలతో కలిసి పని చేస్తాం’’ అని డిక్లరేషన్‌లో పేర్కొంది. పాసీఘాట్ నుంచి పోరుబందర్ దాకా...! తూర్పున అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసీఘాట్ నుంచి పశ్చిమాన గుజరాత్‌లోని పోరుబందర్ దాకా మరో దేశవ్యాప్త పాదయాత్ర చేసే యోచన ఉన్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ‘‘భారత్ జోడో యాత్ర సక్సెస్‌తో పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మరో యాత్ర కోసం కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నారు. అది జోడో యాత్రకు భిన్నంగా ఉంటుంది. దారి పొడవునా నదులు, దుర్గమారణ్యాలున్నందున చాలావరకు కాలినడకన, అక్కడక్కడా ఇతరత్రా సాగొచ్చు. జూన్‌కు ముందు గానీ, నవంబర్ ముందు గానీ కొత్త యాత్ర మొదలు కావచ్చు. కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు. -
జగన్ మళ్లీ సీఎం కావాలంటూ బైక్ యాత్ర
చిత్తూరు (కార్పొరేషన్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్ యాత్ర చేపట్టాడు. ఈ నెల 6న ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం చిత్తూరు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు వీరాభిమాని అయిన వీరబాబు మాట్లాడుతూ.. ‘మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం. 2009లో ఖమ్మంలోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్‌మెంట్స్ ద్వారా నాలుగేళ్లు (రూ.1.60 లక్షల ఖర్చుతో) బీటెక్ పూర్తి చేశా. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించా. వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ నుంచి విజయనగరానికి బైక్ యాత్ర మొదలుపెట్టా. ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తున్నా. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు వెళ్తున్నా. రాత్రివేళ ఎక్కడికక్కడ లాడ్జిలో బసచేస్తూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కింద నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నా. జగనన్న అందిస్తున్న పథకాలు ఎంతగానో నచ్చాయి. అందుకే.. ఆయనే మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బైక్ యాత్ర చేపట్టా’ అని వివరించారు. చదవండి: బెజవాడలో టీడీపీ గూండాల బరితెగింపు -
దేశాన్ని దోచుకునేందుకు బయలుదేరారు
ములుగు/వెంకటాపురం(ఎం): 2001లో రబ్బరు చెప్పులకు కూడా గతిలేని కేసీఆర్ కుటుంబం నేడు రాష్ట్రాన్ని దోచుకుని రూ.లక్షల కోట్లకు పడగలెత్తిందని, అది చాలదన్నట్లు ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి ముఖ్యమంత్రి బయలుదేరారని టీపీపీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. డ్రామారావు (కేటీఆర్‌నుద్దేశించి) రాష్ట్ర ప్రజలు తమ కుటుంబ సభ్యులని, కుటుంబ పాలన ఉంటుందని అనడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ద్రోహులు ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డిని చుట్టూ చేర్చుకొని దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రేవంత్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు విలేకరుల సమావేశంలో, రాత్రి 8 గంటలకు పాదయాత్ర ములుగుకు చేరుకున్నాక గ్రామ పంచాయతీ ఎదుట ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే సమ్మక్క–సారలమ్మ జిల్లా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు సరైన ఇల్లు లేక రోడ్లపై అవస్థలు పడుతుంటే 160 పడక గదుల భవనంలో దొర దర్జాగా గడుపుతున్నారని విమర్శించారు. ములుగు ప్రజల ఆదరణ, పౌరుషాన్ని పుణికి పుచ్చుకొని రాష్ట్ర మంతటా సీతక్కతో కలిసి యాత్ర కొనసాగించి అధికారంలోకి వస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను సమ్మక్క–సారలమ్మల పేరు మీద మారుస్తూ తొలి సంతకం పెడతామని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని పునరుద్ఘాటించారు. భోజనం పెట్టిన కూలీలు ములుగు జిల్లా కేశవాపూర్ రోడ్డు మీదుగా యాత్ర సాగుతుండగా మధ్యాహ్నం సమయంలో పక్కనే పత్తి, మిర్చి ఏరుతున్న కూలీలను రేవంత్ పలకరించారు. ఇప్పటి ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? అని అడగడంతో ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నట్లు కూలీలు తెలిపారు. తాము తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను తెరిచి రేవంత్‌రెడ్డి, సీతక్కలకు భోజనం పెట్టారు. -
గంగా విలాస్ యాత్రను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’
సాక్షి, హైదరాబాద్: పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు, వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాం«దీభవన్‌లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని, ప్రధాని మోదీకి దేశభద్రత పట్టదని, ప్రభుత్వాలను కూల్చడమే పరమావధి అయిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవడం పూర్తయిందని భావిస్తున్న కేసీఆర్.. బీఆర్ఎస్ పేరుతో జాతీయస్థాయిలో దోపిడీకి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, కేసీఆర్‌ల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనమే లక్ష్యంగా... స్వతంత్ర ఉద్యమం నుంచి వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా పార్టీ పని చేస్తోందన్నారు. మహిళా సాధికారిత కోసం కాంగ్రెస్ తెచ్చి న మహిళా రిజేర్వేషన్ బిల్లును బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయ ఫలితమేనని చెప్పారు. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్రకు మద్దతిచ్చా : కమల్ హాసన్
-
ఢిల్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
-
‘కరోనా ఒక సాకు’.. కేంద్రం లేఖపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
చండీగఢ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయటంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ. హరియాణాలోని నుహ్ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ యాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఇది వారి(బీజేపీ) కొత్త పన్నాగం, కరోనా వస్తోంది యాత్రను ఆపేయండీ అంటూ నాకు లేఖ రాశారు. ఇవన్నీ యాత్రను ఆపేందుకు చూపుతోన్న సాకులు మాత్రమే. వారు ఈ దేశం బలం, నిజానికి భయపడుతున్నారు.’ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం -
విద్య, సామాజిక న్యాయానికే పోరు యాత్ర
మన్సూరాబాద్: చదువు, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్రను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పాలమూరు నుంచి పట్నం వరకు చేపడుతున్న పోరుయాత్రను శుక్రవారం ఎల్బీనగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, కాసోజు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మళ్లీ రోడ్డు ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు తెలంగాణ సర్కార్ భరోసా కల్పించడంలో విఫలమైందని, బీసీ విద్యార్థులపై కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఇతర వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి, బీసీ విద్యార్థులకు మూడేళ్లయినా విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులను పెంచిందని, కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా బీసీ విద్యార్థులపై భారం వేసిందని విమర్శించారు. అన్ని జిల్లాల్లో జనవరి 8 వరకు యాత్ర సాగుతుందని జాజుల పేర్కొన్నారు. -
ఏలూరు పెదవేగి మండలంలో దెందులూరు ప్రగతి యాత్ర
-
మీసం తిప్పుతూ ఫోటోలకు పోజులిచ్చిన రాహుల్ గాంధీ, విజేందర్
-
యాత్రా ఆన్లైన్ ఐపీవో.. సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రయాణ సంబంధ సేవలందించే యాత్రా ఆన్లైన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందింది. యాత్రా ఆన్లైన్ ఇంక్‌కు దేశీ అనుబంధ సంస్థ అయిన కంపెనీ ఇష్యూలో భాగంగా రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93,28,358 షేర్లను కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులున్న సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను వ్యూహాత్మక కొనుగోళ్లు, కస్టమర్లను ఆకట్టుకునే పెట్టుబడులు తదితర వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. 700 భారీ కంపెనీలు కస్టమర్లుగా కలిగిన యాత్రా ఆన్లైన్ దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ సర్వీసుల విభాగంలో ముందుంది. చదవండి: ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్! -
మహా సంకల్పానికి ఐదేళ్లు ..
-
పొలిటికల్ కామెంట్ : రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ కోలుకుంటుందా ..?
-
బిగ్ క్వశ్చన్ : ఫేక్ యాత్రకి షాక్..
-
పొలిటికల్ కారిడార్ : రాహుల్ గాంధీ యాత్రతో తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సహం
-
భారత్ జోడో యాత్రలో మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ
-
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదు : రాహుల్ గాంధీ
-
భారత్ జోడో యాత్రలో రాహుల్ రన్నింగ్
-
తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
-
అమరావతి పాదయాత్రకు బ్రేక్
-
నేడు ఏపీ లోకి రాహుల్ జోడో యాత్ర
-
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
జోడో యాత్రలో రాహుల్ ను కలుస్తా : రఘువీరా రెడ్డి
-
ఈనెల 18 నుంచి ఏపీలో రాహుల్ గాంధీ జోడో యాత్ర
-
హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర
-
అన్నీ బీజేపీ గుప్పిట్లోనే.. మాకు యాత్ర తప్ప మరో మార్గం లేదు
సాక్షి, బెంగళూరు: చట్ట సభలు, ప్రసార, ప్రచార మాధ్యమాలు తదితర వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాల గొంతుకను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో తమకు పాదయాత్ర తప్పలేదని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. యాత్ర శుక్రవారం తమిళనాడులోని గుడలూర్ నుంచి చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట వద్ద కర్ణాటకలో ప్రవేశించింది. గుండ్లపేటలోని అంబేడ్కర్ భవన్ మైదానంలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర ఎందుకు అనే ప్రశ్న తమకు అడుగడుగునా ఉత్పన్నమవుతోందని రాహుల్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో మీడియా, పార్లమెంట్, అసెంబ్లీ వంటివి ఉన్నాయని, అయితే అక్కడ ఎక్కడా తమ వాణి వినిపించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పారు. పార్లమెంట్లో తాము మాట్లాడుతుండగా మైక్ బంద్ చేస్తున్నారని, అసెంబ్లీల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. మీడియాను సైతం అధికార పార్టీ గుప్పిట్లో పెట్టుకుందన్నారు. వారి చర్యలకు నిరసనగా ఆందోళన చేపడితే అరెస్టులు చేస్తున్నారని, తమకున్న ఏకైక మార్గం ప్రజల ముందుకు వెళ్లి వారితో కలసి అడుగు వేయడమేనని చెప్పారు. తమ యాత్రను ఎవరూ అడ్డుకోలేరన్నారు. కర్ణాటకలోజరిగే ఈ పాదయాత్రలో ధరల పెంపు, అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యల గురించి ప్రజలు తమ బాధలను చెప్పుకుంటున్నారన్నారు. చదవండి: రాహుల్ పాదయాత్ర.. వయా గాంధీభవన్ -
‘రోలెక్స్ వాచీలు, బౌన్సర్లతో జరిగేది రైతుల యాత్రనా?’
సాక్షి, అమరావతి: అమరావతి మహాపాదయాత్ర అనేది చంద్రబాబు అండ్ కో ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వరరావు. ఈ యాత్రలో బౌన్సర్లతో రైతులు యాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పాదయాత్రలో ఎప్పుడు బౌన్సర్లను చూడలేదు. రోలెక్స్ వాచీలు పెట్టుకుని మరీ పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఇంత రిచ్ రైతులను.. వాళ్లు చేస్తున్న యాత్రను దేశచరిత్రలోనే చూసి ఉండరు అని మంత్రి కారుమురి సెటైర్ వేశారు. అమరావతిని కడితే రాష్ట్ర భవిష్యత్ దెబ్బతింటుందన్న ఆయన.. ఒక వేళ నిజంగా నాలుగు లక్షల కోట్లు పెట్టి ఉంటే ఊహించిన నష్టం వాటిల్లేదన్నారు. చంద్రబాబు తన నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసేవాడని విమర్శించారు. ఇక.. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. కొంతమంది కావాలనే రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి. ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకుంటున్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు మేలు జరగాలన్నదే మా కోరిక అని మంత్రి కారుమురి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అది ప్రభుత్వ విధాన నిర్ణయం-ఏపీ హైకోర్టు -
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ లోగో విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో భారత్ జోడో యాత్ర లోగో, వెబ్‌సైట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, యాత్ర నిర్వాహక కమిటీ దిగ్విజయ్ సింగ్ మీడియా సమావేశంలో ‘కలిసి నడుద్దాం..దేశాన్ని కలిపి ఉంచుదాం(మిలే కదమ్.. జుడే వతన్)’అనే నినాదంతో కూడిన జోడో యాత్ర నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు. యాత్రలో పాల్గొనదలిచిన వారు వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాల్గొనే ప్రధాన యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని 5 నెలలపాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగి కశ్మీర్లో ముగియనుందన్నారు. ఇదీ చదవండి: రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ -
ఆ యాత్ర ఓ చరిత్ర
ఏమాత్రం ఆధునిక ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో ‘కాశీ యాత్ర’ చేసినవాడు ఏనుగుల వీరాస్వామి. తన యాత్రానుభవాలను గ్రంథస్థం చేసిన మొదటి ఆధునిక భారతీయ యాత్రికుడూ ఆయనే! వీరాస్వామి పదహారణాల తెలుగువాడు. ఈయన 1780లో చెన్నైలో జన్మించారు. పూర్వీకులు ఒంగోలు ప్రాంతీయులు. మద్రాస్ సుప్రీం కోర్టులో ‘ఇంటర్ ప్రిటర్’ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత కాశీయాత్ర చేప ట్టారు. ‘రెగినాల్డ్ బిషప్ హెబార్డ్’ అనే తూర్పు ఇండియా కంపెనీ మతాధికారి 1824 – 1826లో భారతదేశ యాత్ర చేసి ‘బిషప్ హెబార్డ్ జర్నల్’ అనే పేరుతో ఓ గ్రంథం రాశారు. ఇదే వీరా స్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ గ్రంథానికి స్ఫూర్తి. వీరాస్వామి ‘కాశీ యాత్ర’ 1830 మే 18వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని తండయారువీడు లోని సొంత ఇంటి నుంచి ప్రారంభమైంది. తల్లి, భార్యతో సహా 100 మందితో బయలుదేరివెళ్లిన ఆయన... 1831 సెప్టెంబర్ 3వ తేదీన మరలా ఇంటికి చేరుకోవడంతో యాత్ర సుఖాంతమైంది. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం 15 నెలల, 15 రోజులు కొనసాగింది. (చదవండి: అక్షర యోధుడు అదృష్టదీపుడు) 1830, మే 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి... 33 రోజుల అనంతరం జూన్ 24వ తేదీన తెలంగాణాలో ప్రవేశించి ఆగస్టు 6వ తేదీ వరకు కొనసాగింది. ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్రలో ప్రవే శించారు. తరువాత మధ్యప్రదేశ్ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించి కాశీ చేరుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన యాత్రానుభ వాలను ‘కాశీ యాత్రా చరిత్రగా’ గ్రంథస్థం చేసి నాటి కాలమాన పరిస్థితులను ముందు తరాలకు అందించారు. వీరాస్వామి కాశీ యాత్ర చేపట్టిన మే 18వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా ఉంటుంది. – కోరాడ శ్రీనివాసరావు సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా -
కన్యాకుమారి నుంచి కశ్మీర్.. భారత్ జోడో యాత్ర
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: వరుస ఓటములతో నీరసించిన కాంగ్రెస్‌లో పునరుత్తేజం తీసుకొచ్చి, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధినేత్రి సోనియా గాంధీ ‘భారత్ జోడో’ నినాదం ఇచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా యాత్ర సాగుతుంది. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా నేతలు, కార్యకర్తలంతా భాగస్వాములు కావాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం చింతన్ శిబిర్‌లో ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘2024’ దృష్టితో సంస్కరణలు పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలపై చింతన్ శిబిర్‌లో విస్తృతంగా చర్చించామని సోనియా అన్నారు. ‘‘2024 ఎన్నికలపై దృష్టి పెడుతూ పలు సంస్కరణలు అమలు చేయనున్నాం. అందుకు రెండు మూడు రోజుల్లో టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు. తన నేతృత్వంలో రానున్న అడ్వైజరీ కమిటీ వల్ల సీనియర్ సహచరుల అనుభవం నుంచి తాను నేర్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. అది నిర్ణయాలు తీసుకొనే కమిటీ కాదని స్పష్టత ఇచ్చారు. అడ్వైజరీ కమిటీ భేటీలే కాకుండా సీడబ్ల్యూసీ సమావేశాలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె వివరించారు. మేనిఫెస్టోలో ఈవీఎంల రద్దు: చవాన్ ఈవీఎంల విశ్వసనీయత, పనితీరుపై పార్టీల్లో, ప్రజల్లో అనుమానాలున్నందున వాటిని పక్కనపెట్టి, ఎన్నికల్లో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం తేవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశమని పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇస్తామన్నారు. ఈవీఎంల వల్ల ఎన్నికల్లో జరిగే అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పేపర్ బ్యాలెట్ల అంశాన్ని చింతన్ శిబిర్‌లో లేవనెత్తానని అన్నారు. చాలామంది నేతలు తన వాదనకు మద్దతు పలికారని వెల్లడించారు. ఈవీఎంలను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినా ఫలితం ఉండదని, అందుకే తమ మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపర్చాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో నెగ్గడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమని వివరించారు. తమ విజయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ పదేపదే కోరుతోంది. సవాళ్లను అధిగమిస్తాం ‘‘చింతన్ శిబిర్ చాలా ఉపయోగకరంగా, ఫలవంతంగా సాగింది. నా పెద్ద కుటుంబం (కాంగ్రెస్)తో గడిపే అవకాశం కలిగింది’’ అని సోనియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘సవాళ్లను కచ్చితంగా అధిగమిస్తాం. కాంగ్రెస్‌కు కొత్త శుభోదయం రానుంది. అదే మన అంకితభావం. అదే నూతన సంకల్పం’’ అన్నారు. భారత్ జోడోయాత్రలో తన లాంటి సీనియర్ నేతలు కూడా ఇబ్బందులు పడకుండా పాల్గొనే మార్గాలు వెతకాలంటూ చమత్కరించారు. సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, లుప్తమైపోతున్న రాజ్యాంగ విలువలను కాపాడేందుకే ఈ యాత్ర అన్నారు. నిరుద్యోగం, ధరల భారం అంశాలను జన జాగరణ్ అభియాన్–2లో లేవనెత్తుతామన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలలో ఈ పరిస్థితి లేదు.. -
బస్సులో బాబు.. సైకిల్‌పై చినబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ తలపెట్టిన ప్రజా యాత్రలు ఆ పార్టీలో అయోమయం సృష్టిస్తున్నాయి. ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో ప్రజల్లోకి వెళ్లేందుకైనా ఏదో ఒక యాత్ర చేపట్టాలని చంద్రబాబు చాలా రోజులుగా తలపోస్తున్నారు. అయితే యాత్ర ఏదైనా సరే.. తాను చేస్తానని ఆయన కుమారుడు లోకేష్ పట్టుబడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక దశలో పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు లోకేష్ ప్రయత్నించారు. తండ్రికి బదులు తానే జిల్లాల్లో పర్యటనలు, పరామర్శలు, సమీక్షలు నిర్వహించారు. చంద్రబాబు బస్సు యాత్ర దాదాపుగా ఖరారైంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేలా యాత్ర చేపట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తాను కూడా సైకిల్ యాత్ర నిర్వహిస్తానని లోకేశ్ పేర్కొనగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసింది. కాగా లోకేష్ యాత్రల పట్ల పార్టీ సీనియర్లలో విముఖత వ్యక్తమవుతోంది. దీనివల్ల పార్టీకి లాభం చేకూరకపోగా నష్టం వాటిల్లుతుందని చర్చించుకుంటున్నారు. -
కృష్ణా జలాల పరిరక్షణకు కోదండరాం యాత్ర
సాక్షి, హైదరాబాద్ /సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్ర గెజిట్‌ను రద్దు చేయాలని, నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జన సమితి (టీజేఎస్) బుధవారం నుంచి కృష్ణా జలాల పరిరక్షణ యాత్రకు సిద్ధమైంది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఆరు రోజుల పాటు 150 కిలోమీటర్ల యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. ఇదీ యాత్ర షెడ్యూల్.. ♦4వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉదయ సముద్రం పానగల్ వద్ద యాత్ర ప్రారంభం. సా యంత్రం 6–30 గంటలకు నల్లగొండ పట్టణం లోని గడియారం సెంటర్లో బహిరంగ సభ ♦5న ఆర్జాలబావి, చర్లపల్లి, ఎంజీ వర్సిటీ, ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు మీదుగా నార్కట్‌పల్లి వరకు కొనసాగింపు. ♦6 నార్కట్ పల్లి నుంచి ఏనుగులదోరి, గోపలాయపల్లి, వట్టిమర్తి స్టేజీ, చిట్యాల మార్కెట్, నేరడ, చౌడంపల్లి, బ్రాహ్మణవెల్లెంల వరకు కొనసాగుతుంది. ♦7న బ్రాహ్మణ వెల్లెం నుంచి ఎలికట్టె, రత్తిపల్లి, సింగారం, మునుగోడు, బోడంగిపర్తి, కొండాపురం, కమ్మగూడెం, తేరట్పల్లి, గట్టుప్పల్ వరకు కొనసాగుతుంది. ♦8న గట్టుప్పల్ నుంచి చర్లగూడెం, మర్రిగూడెం సెంటర్, ఈదులకుంట, కృష్ణరాంపల్లి, వింజమూరు, చింతపల్లి, మల్లేపల్లి, దేవరకొండ వరకు కొనసాగుతుంది. ♦9న దేవరకొండలో యాత్ర ప్రారంభం. నక్కలగండి ఎస్ఎల్బీసీ టన్నెల్‌కు చేరుకుంటారు. అక్కడ యాత్ర ముగించి విలేకరులతో మాట్లాడతారు. -
ఇదే చివరి యుద్ధం కావాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే అధికార టీఆర్ఎస్ కుటిల యత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం ఇతర పార్టీలతో జట్టు కడుతోంది. అయినా మేం తెలంగాణలో పాగా వేసి తీరుతాం. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా తెలంగాణ అభివృద్ధి చెందలేదు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ప్రజలారా ఇదే చివరి యుద్ధం కావాలి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం మంథన్‌గోడ్ నుంచి ప్రారంభమైన బండి పాదయాత్ర దండు మీదుగా నెహ్రూగంజ్‌కు చేరుకుంది. మక్తల్ మార్కెట్ యార్డులో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. ‘బీజేపీని ఎదుర్కోలేకే టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ 31 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు ఇవ్వబోతోంది. కేసీఆర్‌తో పీకే మంతనాల వెనుక మతలబు ఇదే. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే. కాంగ్రెస్‌లో గెలిచేటోడు అమ్ముడుపోతాడు.. ఓడిపోతే పార్టీనే అమ్మేస్తాడు. పాతబస్తీ మాదే.. యావత్ తెలంగాణ మాదే’అని బండి వ్యాఖ్యానించారు. బీజేపీ ఏనాడూ టీఆర్ఎస్తో కలసి పోటీ చేయలేదని, పొత్తు పెట్టుకోలేదని బండి గుర్తుచేశారు. బీజేపీ చేసిన ఉద్యమంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ దాటి బయటకు వచ్చారని, ధర్నాచౌక్‌ను తెరిచారని బండి పేర్కొన్నారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రమే టీఆర్ఎస్ది అని.. స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతుల్లో ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 48 సీట్లు.. ఉపఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచాక కేసీఆర్‌కు భయం మొదలైందన్నారు. కేంద్రంలోనే కాదు.. రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. యథావిధిగా పాదయాత్ర.. బండి పాదయాత్రపై సోమ వారం గందరగోళం చోటుచేసు కుంది. సంజయ్ ఆదివారం అస్వస్థతకు గురవడంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో యాత్రను 2 రోజుల పాటు బండి వాయిదా వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ తెలిపారు. అయితే కాసేపటికే యాత్ర యథావిధిగా కొనసాగుతుందని ఆమె పేరిట ప్రకటన విడుదల చేశారు. -
దొరల పాలన అంతమే బీఎస్పీ లక్ష్యం
మోత్కూరు/కొడకండ్ల/దేవరుప్పల: తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమే బీఎస్పీ లక్ష్యమని, ఇందుకు ప్రజలంతా తమతో కలిసి రావాలని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్, పూలే, మహాత్మాగాంధీ విగ్రహాలకు ప్రవీణ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీనగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రవీణ్‌కుమార్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో రాష్ట్రంలో మార్చి 6న ఖిలాషాపూర్‌లో ప్రారంభమైన యాత్రను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారన్నారు. కాగా, అంతకుముందు బహుజన రాజ్యాధికార యాత్ర 11వ రోజులో భాగంగా జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. దేవరుప్పల మండలం కడివెండిలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ రాజ్యాధికార యాత్ర ర్యాలీలు, కార్యక్రమాలకు ప్రజలు హాజరుకాకుండా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కుట్రలు పన్నుతున్నారని, దళితబంధు రాదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమది ప్రజలకు అండగా నిల్చే పార్టీ అని, రాబోయే 289 రోజుల యాత్రనూ ఇదే తరహాలో ఆదరించాలని కోరారు. దొడ్డి కొమురయ్య కలలు సాకారం చేయాలంటే బడుగుల రాజ్యాధికారం అనివార్యమన్నారు. -
ఖిలాషాపూర్ నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర
సాక్షి, హైదరాబాద్: బహుజనులకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ విభాగం బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకా రం చుట్టింది. ఈ క్రమంలో 300 రోజుల పాటు సుదీర్ఘంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపడుతున్నట్టు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బడుగుల రాజకీయ అధికారం కోసం మూడు శతాబ్దాల క్రితం మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. ముందుగా అక్కడే ప్రారంభ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
కామారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆమె పరామర్శించారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, లింగంపేట మండలం ఐలాపూర్, నాగిరెడ్డిపేట మండకం వడల్ పర్తి గ్రామాల్లో ఈ యాత్ర సాగుతుండగా.. షర్మిలకు అడ్లూరు ఎల్లారెడ్డిలో ప్రజలు, రైతులు స్వాగతం పలికారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. చదవండి: ఏ అధికారంతో వరి వద్దంటున్నారు? -
మరోసారి వినాయక చవితి కోలాహలం.. గోళూరు గణనాథా..
సాక్షి, తుమకూరు(కర్ణాటక): వినాయక చవితి సందోహం తిరిగివచ్చింది. తుమకూరు నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన గోళూరు మహా గణపతి నిమజ్జనం వైభవోపేతంగా నిర్వహించారు. బలి పాఢ్యమి రోజును గణపతి ఆలయంలో వినాయక ప్రతిమను ప్రతిష్టించి ఇప్పటివరకు నిత్యపూజలు చేశారు. కార్తీక మాసమంతా విఘ్నాధిపతికి నైవేద్యాలను సమర్పించారు. ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో ఊరేగింపుగా నిమజ్జన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందాల ప్రదర్శనలు రంజింపజేశాయి. చెరువులో జలార్పణం గావించారు. చదవండి: ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు -
రాణె యాత్ర పునఃప్రారంభం త్వరలో
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం తరువాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తన జన్ ఆశీర్వాద్ యాత్రను మళ్లీ ప్రారంభించనున్నారని బుధవారం ఆయన అనుచరులు తెలిపారు. త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందని వారు పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాణె అనుచరుడు రజన్ తెలి తెలిపారు. గతంలో ప్రకటించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చదవండి: Shiv Sena-Narayan Rane: రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం, పరిస్థితి ఉద్రిక్తం ఇటీవలే కేంద్ర కేబినెట్లోకి చేరిన రాణె ఆగస్ట్ 19వ తేదీన ముంబైలో తన జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడు రోజులు పాటు సాగే ఈ యాత్ర సింధుదుర్గ్‌లో ముగియాల్సి ఉంది. అయితే, సోమవారం రాయ్‌గఢ్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియనందుకు ఉద్ధవ్ చెంప పగలకొడతానని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపింది. ఆయనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. శివసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆయనకు మహాడ్‌లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చదవండి : నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె -
తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర
సాక్షి, చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కాసేపట్లో విజయవాడ బయల్దేరనున్నారు. నేటి మధ్యాహ్నం కనక దుర్గమ్మను కిషన్‌రెడ్డి దర్శించుకోనున్నారు. తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం కోదాడ బహిరంగ సభలో కిషన్‌రెడ్డి పాల్గొంటారు. -
ప్రజా ఆశీర్వాద యాత్రకు శ్రీకారం
-
పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు
న్యూఢిల్లీ: బిహార్‌లోని లోక్‌జనశక్తి పార్టీలో బాబాయ్, అబ్బాయిల మధ్య పోరాటం కొత్త పరిణామాలకు దారి తీసింది. రామ్‌విలాస్ పాశ్వాన్‌కి తానే అసలు సిసలైన వారసుడినని చెప్పుకోవడానికి, పార్టీపై పట్టు పెంచుకోవడానికి చిరాగ్ ప్రజల ఆశీర్వాదం కోరనున్నారు. ఆదివారం ఢిల్లీలోని చిరాగ్ నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. చిరాగ్ ఇక తాను ప్రజల్లోకి వెళ్లి బాబాయ్ పశుపతి పరాస్ నీచ రాజకీయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. జూలై 5న రామ్‌విలాస్ పాశ్వాన్ జయంతి రోజున హజీపూర్ నుంచి ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. పరాస్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తానే జనంలోకి వెళ్లి వాస్తవాలన్నీ వెల్లడిస్తానని అన్నారు. అంతేకాదు ఈ సమావేశం పాశ్వాన్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా చేసింది. సమావేశం ముగిసిన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మహాభారత యుద్ధాన్ని చూస్తారని ఆవేశంగా చెప్పారు. ‘‘వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 90 శాతం నా వైపే ఉన్నారు. ఢిల్లీ, కశ్మీర్ పార్టీ అధ్యక్షులు మినహాయించి మిగిలిన వారంతా ఆ వైపు ఉన్నారు. పశుపతి పరాస్ వైపు 9 శాతం మంది మాత్రమే ఉన్నారు’’అని చిరాగ్ వెల్లడించారు. మరోవైపు పరాస్ ఆ సమావేశానికి చట్టబద్ధత లేదన్నారు. సమావేశానికి హాజరైన వారంతా పార్టీ సభ్యులే కారని ఆరోపించారు. ఎవరిది అసలైన పార్టీ్టయో ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని విలేకరులతో చెప్పారు. పార్టీ ఎంపీలను తన వైపు తిప్పుకొని పరాస్ తిరుగుబాటు జెండా ఎగుర వేసినప్పటికీ బిహార్‌లో 6 శాతం జనాభా ఉన్న పాశ్వాన్ వర్గం ఇప్పటికీ చిరాగ్‌నే పార్టీ నాయకుడిగా చూస్తోంది. అంతేకాదు లాలూ ప్రసాద్ యాదవ్‌కి చెందిన ఆర్జేడీ కూడా పాశ్వాన్ జూనియర్‌కే మద్దతిస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది. -
ఢిల్లీ చేరుకున్న కుంభ్ సందేశ్ యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా ప్రాముఖ్యతను కొత్త తరానికి చాటిచెప్పడం, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు ప్రజలు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించేందుకు ప్రారంభమైన కుంభ్ సందేశ్ యాత్ర, మిషన్ 5151 బృందం దేశ రాజధానిలో అడుగుపెట్టింది. గత నెల 27న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర 7 రాష్ట్రాల్లో సుమారు 7వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఢిల్లీకి చేరుకుంది. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్ర సుమారు 500 పట్టణాల ద్వారా సాగిందని జీకాట్ వ్యవస్థాపకుడు, కుంభ్ సందేశ్‌యాత్ర నిర్వహణ కార్యదర్శి ఢిల్లీ వసంత్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లల్లో సన్నాహక యాత్ర జరిగిందన్నారు. సన్నాహక యాత్రను ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అనంతరం తమిళనాడు కన్యాకుమారి దగ్గర త్రివేణి సంగమం నుంచి ఫిబ్రవరి 27న అధికారికంగా ప్రారంభమైన ఈ కుంభ్‌సందేశ్ యాత్ర కుంభమేళా జరిగే మొత్తం నాలుగు క్షేత్రాలు నాసిక్, ఉజ్జయిని, ప్రయాగరాజ్ మీదుగా ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీలో రాబోయే రెండు మూడు రోజుల పాటు ఐఐటీ, ఐసీసీఆర్, ఐసీఏఆర్, జీజీఎఫ్, డబ్ల్యూసీఎఫ్, అంతర్జాతీయ సంస్థలు, రాయబార కార్యాలయాలు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో భేటీ అవుతామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24 న పాదయాత్ర ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు 250 కిలోమీటర్ల మేర పాదయాత్రను వారం రోజుల్లోగా పూర్తిచేస్తామని వసంత్ అన్నారు. హరిద్వార్‌కు చెందిన దివ్యప్రేమ సేవా మిషన్, ఢిల్లీకి చెందిన ఐఎస్ఆర్ఎన్, హైదరాబాద్‌కు చెందిన మాస్ సంస్థ, జేడీ ఫౌండేషన్, భారతీయం, ఇంపాక్ట్ ఫౌండేషన్, రెడ్డి జేఏసీ వంటి అనేక సంస్థలు ఈ సందేశ్ యాత్రకు సహాయపడుతున్నాయని వసంత్ తెలిపారు. హరిద్వార్‌లో అఖాడా పరిషత్‌లు, సామాజిక సంస్థలు, ఎన్జీఓలతో సమావేశమై చివరగా ప్రకటించే హరిద్వార్ డిక్లరేషన్‌ను యూఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, రాష్ట్రపతి, ప్రధానితో పాటు సీఎంలకు అందిస్తామన్నారు. -
ఈబిక్స్ చేతికి యాత్రా ఆన్లైన్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీగా సేవలు అందించే యాత్రా ఆన్‌లైన్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ ఈబిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విలీన ఒప్పందం విలువ 337.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,325 కోట్లు)గా ఉండనుంది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి డీల్ పూర్తి కావచ్చని అంచనా. లావాదేవీ పూర్తయ్యాక ఈబిక్స్ గ్రూప్‌లోని ఈబిక్స్‌క్యాష్ వ్యాపార విభాగంలో ఒక భాగంగా యాత్ర ఉంటుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. యాత్ర బ్రాండ్ పేరిటే ఇకపైనా సేవలు కొనసాగుతాయని వివరించాయి. ఒక్కో షేరుకు 4.90 డాలర్ల రేటు చొప్పున యాత్ర సంస్థ విలువను 337.8 మిలియన్ డాలర్లుగా లెక్కించినట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతి పెద్ద, అత్యంత లాభసాటి ట్రావెల్ సేవల కంపెనీగా ఈబిక్స్‌క్యాష్ ఆవిర్భవించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఈబిక్స్ చైర్మన్ రాబిన్ రైనా తెలిపారు. అలాగే ఈబిక్స్‌క్యాష్ ఐపీవోకూ ఊతం లభించగలదని చెప్పారు. బహుళజాతి ఆన్–డిమాండ్ సాఫ్ట్వేర్, ఈ–కామర్స్ సంస్థలో భాగం కావడం ద్వారా తమ షేర్‌హోల్డర్ల పెట్టుబడులకు వృద్ధి అవకాశాలు లభించగలవని యాత్రా ఆన్లైన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ శృంగి చెప్పారు. ఈబిక్స్‌కు ఇప్పటికే వయా, మెర్క్యురీ పేరిట రెండు ట్రావెల్ సేవల వ్యాపార విభాగాలు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌లో సెంట్రమ్ గ్రూప్‌నకు చెందిన ఫారెక్స్ కార్డ్ వ్యాపార విభాగం సెంట్రమ్ డైరెక్ట్‌ను రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఎస్సెల్ ఫారెక్స్‌ను 8 మిలియన్ డాలర్లకు, వీజ్మాన్ ఫారెక్స్‌లో 49 మిలియన్ డాలర్లకు 75 శాతం వాటాలు కొనుగోలు చేసింది. -
‘యాత్ర’ బ్లాక్‌బస్టర్ మీట్
-
భావోద్వేగాలతో సాగే చిత్రం యాత్ర : మారుతి
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ప్రముఖ డైరెక్టర్ మారుతి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యాత్ర నిజాయితీతో కూడిన భావోద్వేగాలతో సాగే చిత్రమని, హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ఉందని పేర్కొన్నారు. దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డిలా మమ్ముట్టి నటించిన తీరు, మహి వీ రాఘవ పనితీరు అద్భుతమని కొనియాడారు. మిగతా నటులు, చిత్రానికి పని చేసిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. -
వాషింగ్టన్ డీసీలో ‘యాత్ర’ జైత్రయాత్ర
సాక్షి, వాషింగ్టన్ డీసీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని థియేటర్లు వైఎస్సార్ అభిమానులతో కోలాహలంగా మారాయి. వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాల్లో (మేరీల్యాండ్, డెలావేర్, వర్జీనియా) యాత్ర ప్రీమియర్ షోల సందర్భంగా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'యాత్ర' చిత్ర యూనిట్‌కి వైఎస్సార్ అభిమానులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ అభిమానులు యాత్ర రిలీజ్‌ను పండగలా జరుపుకున్నారు. వైఎస్సార్ జీవితంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉందని వైఎస్సార్సీపీ సలహాదారు (యూఎస్ఏ), రీజనల్ ఇంఛార్జ్(మిడ్ అట్లాంటిక్) వల్లూరు రమేష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి జీవం పోసి అత్యంత అద్భుతంగా నటించారని, బాడీ లాంగ్వేజ్ వైఎస్సార్‌ని తలపించిందని, చివరికి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పారన్నారు. వర్జీనియాలోని సినేమార్క్ థియేటర్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి సతీసమేతంగా యాత్ర సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కిందని, భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ 'యాత్ర' లో పాల్గొనాల్సిందేనని తెలిపారు. పలు సందర్భాలలో మహానేత రాజశేఖర రెడ్డి తమతో ఉన్నట్లుగా ఈ చిత్రం తమను కదిలించిందని పేర్కొన్నారు. ఈ యాత్రలో వాస్తవిక సంఘటనలున్నాయన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఓ రైతు చేసే ఆత్మహత్యాయత్నం, పేదరికంతో వైద్యం చేయించలేక ఓ కన్నతల్లి తన బిడ్డను కోల్పోవడం, పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడే ఓ విద్యార్థి వేదనవంటివి దర్శకుడు మహి వి. రాఘవ్ చూపించిన తీరు వైఎస్సార్‌కి ఇచ్చిన నివాళి అనడం సబబేమో అని కొనియాడారు. యాత్ర సినిమాని చుసిన తరువాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని తలచుకుని పలువురు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చారు. వైఎస్ రాజశేఖరెడ్డి పాత్రను (రాజన్నను) కళ్లకు కట్టినట్టుగా చూపించారని కృష్ణ రెడ్డి చాగంటి, భువనేశ్ భుజాల, రామ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాధవీ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ నిజ జీవితంలో మాట ఇస్తే వెనక్కి తగ్గని వైఎస్ వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం ‘యాత్ర’ అని సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ తమ వంతు బాధ్యతలు చక్కగా నిర్వర్తించారని అన్నారు. లక్ష్మి, గీత మాట్లాడుతూ... రాజన్న రాజసం చక్కగా సినిమాలో చూపించారని ప్రశంసించారు. మహానేత పాదయాత్ర నాయకుడికి.. ప్రజలకు మధ్య దూరాన్ని చెరిపేసిందని, రాష్ట్ర స్థితిగతులను మార్చి ఎందరికో మార్గదర్శకమైందని అందుకే ఆయనను ప్రేమించని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదని సత్తిరాజు సోమేశ్వర రావు అన్నారు. సమాజం మళ్లీ ఒక్కసారి వైఎస్ స్మృతులను నెమరు వేసుకోవడం చాలా అందమైన అనుభవమని ప్రవాసులు అన్నారు. సహజత్వానికి దూరం పోకుండా నిజాయతీగా తీసిన సినిమా ‘యాత్ర’. తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పిన మహీ ప్రయోగం బాగుందని తెలిపారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు ఓ మహా యోధుడిని సమాజానికి చూపించాలనే ఆకాంక్ష నిర్మాతలు విజయ్, శశి దేవిరెడ్డి, శివ మేకలది. ఈ కార్యక్రమంలో వల్లూరు రమేష్ రెడ్డి, మాధవి రెడ్డి, సోమిరెడ్డి, క్రిష్ణా రెడ్డి, గీత రెడ్డి, రామ్ రెడ్డి, లక్ష్మి రెడ్డి, కోటి రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజశేఖర్ కాసారానేని, భువనేశ్ భుజాల, రాజశేఖర్ బసవరాజు, సత్తిరాజు సోమేశ్వర రావు అనేక మంది పాల్గొన్నారు. -
మలేషియాలో ‘యాత్ర’ టికెట్ రూ.90 వేలు
కౌలాలంపూర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కథాంశంగా నిర్మించిన ‘యాత్ర’ సినిమా రిలీజ్ వేడుకలు శుక్రవారం విదేశాల్లో ఘనంగా జరిగాయి. మలేషియాలో జరిగిన సినిమా విడుదల వేడుకల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా మొదటి టికెట్ వేలం వేయగా 5,250 రింగెట్స్ (ఇండియన్ కరెన్సీలో రూ.90 వేలు) పలికినట్లు వైఎస్సార్ అభిమాని చిలేకాంపల్లె విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. సింగపూర్‌లోనూ వైఎస్సార్ అభిమానులు సినిమా రిలీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగపూర్‌లోని కార్నివాల్ షో టవర్స్‌లో జరిగిన యాత్ర సినిమా విడుదల వేడుకల్లో వైఎస్సార్ అభిమానులు పాల్గొని.. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
హ్యూస్టన్‌లో 'యాత్ర' సంబరాలు
హ్యూస్టన్ : మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చుట్టూ సాగే ఈ ‘యాత్ర’ ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. యాత్ర చిత్ర విడుదల సందర్భంగా హ్యూస్టన్‌లో 200 కార్లతో వైఎస్సార్ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని కేటీలోని సినేమార్క్ థియేటర్లో యాత్ర చ్రిత విడుదలను సంబరంగా జరుపుకున్నారు. సినిమా అయిపోయిన తరువాత అందరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఈ సందర్బంగా వారు చిత్ర దర్శకునికి, నిర్మాతలకు, చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర చిత్రాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని, ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత ఎంత వరకైనా వెళ్లగలను అనడానికి వైఎస్సార్ ఒక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ఈ వేడుకల్లో సుమారు 300 మంది వైఎస్సార్ అభిమానులు పాల్గొని యాత్ర కేక్ కట్ చేశారు. జోహార్ వైఎస్సార్, జై జగన్ నినాదాలతో థియేటర్ మొత్తాన్ని హోరెతించారు. సినిమా విజయవంతం అయినందుకు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమాకి వచ్చిన అందరికి డిస్ట్రిబ్యూటర్ రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . -
తెలుగు రాష్ట్రాల్లో ‘యాత్ర’ సినిమా సందడి
-
యాత్ర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
-
‘యాత్ర’ ప్రీరిలీజ్ ఫంక్షన్
-
ప్రతి శుక్రవారం చాలా మారుతుంది
‘‘సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాయిస్ ఉండదు. హిట్ అయితే నెక్ట్స్ డిఫరెంట్ సినిమా చేయడానికి చాన్స్ వస్తుంది. నా గత చిత్రం ‘ఆనందోబ్రహ్మా’ హిట్ సాధించడంతో ‘యాత్ర’ వంటి డిఫరెంట్ మూవీచేయగలిగా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం చాలా మారుతుంది’’ అని దర్శకుడు మహి వి. రాఘవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహి చెప్పిన విషయాలు. ∙వైఎస్సార్‌గారి గురించి కావాలని చేసిన సినిమా కాదు ‘యాత్ర’. ఒక గొప్ప వ్యక్తి జీవిత కథను చెప్పే నైపుణ్యం నాలో ఇంకా రాలేదు. అయితే చాలామంది ఆయన గురించి చెప్పినవి, ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నవి విని, స్ఫూర్తి పొందాను. వైఎస్సార్‌గారి గురించి కొందరిని అడిగినప్పుడు ఆయన ధైర్యసాహసాలు గురించి ఎక్కువగా చెప్పలేదు నాకు. ఆయన చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన పథకాలు, జనరంజకమైన పాలన గురించే చెప్పారు. ఒక రాజకీయ నాయకుడి గురించి ప్రజలు ఇంత మంచిగా చెప్పడం తక్కువ. అప్పుడు అనిపించింది వైఎస్సార్‌గారి గురించి ఓ కథ చెప్పాలని. ఆయన జీవితం మొత్తం చూపించాలనుకోవడం లేదు. మనం ఎంచుకుంటున్నది వివాదాలు లేని పాదయాత్ర ఎపిసోడ్ అనుకుని కథ రాశాను. ∙ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల వల్ల వైఎస్సార్‌గా గుర్తుండిపోయారు. ఇలాంటి అంశాలు సబ్‌ప్లాట్స్‌గా ఉంటాయి సినిమాలో. వైఎస్సార్‌గారు పాదయాత్ర పూర్తిచేసిన వరకూ సినిమా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆయన లైఫ్ గురించి బ్రీఫ్‌గా పెంచలదాస్గారి ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ∙వైఎస్సార్‌గారి పాత్రకు మమ్ముట్టిగారైతే సరిగ్గా సరిపోతారని అనిపించింది మాకు. కథ విని మమ్ముట్టిగారు ఎగై్జట్ అయ్యారు. మమ్ముట్టిగారి దృష్టిలో పర్ఫార్మెన్స్ అంటే యాక్టింగ్ విత్ డబ్బింగ్. నిజంగా వేరే వారితో చెప్పించినా కూడా ఇప్పుడు మమ్ముట్టిగారు చెప్పినంత బాగా అవుట్‌పుట్ వచ్చేది కాదేమో. -
యాత్ర ఆన్లైన్ చేతికి కార్పొరేట్ ట్రావెల్ వ్యాపారం
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ యాత్ర ఆన్లైన్ ఇన్‌కార్పొ.... చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎల్ వరల్డ్‌వేస్ కంపెనీకి చెందిన కార్పొరేట్ ట్రావెల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను యాత్ర కంపెనీ వెల్లడించలేదు. ఈ డీల్ కారణంగా దక్షిణ భారతదేశంలో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని యాత్ర పేర్కొంది. ప్రస్తుతం 700గా ఉన్న కార్పొరేట్ క్లయింట్ల సంఖ్య అదనంగా మరో వందకు పైగా పెరుగుతుందని వివరించింది. -
ఉయ్యూరులో పార్ధసారధి సంఘీభావ యాత్ర
-
సీఎం యాత్ర అంత ఖరీదా..!
జైపూర్ : పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారంటూ రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వసుంధర రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ్ యాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ నెల 4 నుంచి10 వరకు ఉదయ్‌పూర్ డివిజన్లోని 23 నియోజకవర్గాల్లో వసుంధర పర్యటించారు. ఈ యాత్రకు ప్రభుత్వం ప్రజల సొమ్మను దుర్వినియోగపరుస్తోందని, ఇప్పటి వరకు ఎంత మొత్తం ఖర్చు చేశారో తెలియాజేయాలని రాజస్తాన్ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు బెంచ్ దీనిపై అఫడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు రోజుల సీఎం యాత్రంలో కోటీ పదిలక్షల రూపాయాలను ఖర్చు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ హైకోర్టుకు తెలిపారు. యాత్రలో భాగంగా టెంట్‌కు 38.98 లక్షలు, బ్యానర్స్‌కు 25.99 లక్షలు చొప్పున ఖర్చు చేసినట్లు సైనీ వెల్లడించారు. సీఎం ఉపయోగించే పెన్‌డ్రైవ్ కోసం ఏకంగా 16వేలు, పాటల కోసం 3.50 లక్షలు ఖర్చు చేసినట్లు అఫడవిట్లో సైనీ తెలియజేశారు. వసుంధర ఖర్చు పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రజల సొమ్మును పార్టీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన సైనీ ఈ యాత్ర పార్టీ కార్యక్రమాల్లో ఓ భాగమని, దీని ఖర్చు మొత్తం పార్టీ యూనిట్ నేతలే చెల్లిస్తున్నారని తెలిపారు. కాగా వసుంధర తదుపరి యాత్ర ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు 165 నియోజకవర్గాల్లో 6000 కిలోమీటర్లు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. -
7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర
హైదరాబాద్: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలనే నినాదంతో రాష్ట్ర బీసీ విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి వచ్చే నెల 11 వరకు ‘బీసీల రాజకీయ చైతన్య యాత్ర’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. 1990 ఆగస్టు 7న మండల్ కమిషన్ సిఫార్సును అమలు పరిచిన రోజును పురస్కరించుకుని ఆ రోజు నుంచే యాత్ర ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 7న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో యాత్ర ప్రారంభ మవుతుందన్నారు. 8న వనపర్తి జిల్లా, 9న మహబూబ్‌నగర్, 10న కల్వకుర్తి, 11న నల్ల గొండ, 13న మిర్యాలగూడ, 14న సూర్యాపేట, 16న భువనగిరి యాదాద్రి, 17న జనగాం, 18న వరంగల్ అర్బన్, 19న వరంగల్ రూర ల్, 20న మహబూబాబాద్, 21న ఖమ్మం, 22న కొత్తగూడెం, 23న జయశంకర్ భూపాల్పల్లి, 24న పెద్దపల్లి, 25న మంచిర్యాల, 27న ఆసిఫాబాద్, 28న ఆదిలాబాద్, 29న నిర్మల్, 30న నిజామాబాద్, సెప్టెంబర్ 1న కామారెడ్డి, 2న రాజన్న సిరిసిల్ల, 3న జగిత్యాల, 4న కరీంనగర్, 5న సిద్దిపేట, 6న మెదక్, 7న సంగారెడ్డి, 8న వికారాబాద్, 9న రంగారెడ్డి, 10న మేడ్చల్, 11న హైదరాబాద్‌లో సభతో ముగు స్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంబీసీ సంఘం నేత నర్సింహా సగర, సంఘం యూత్ అధ్యక్షుడు శ్యామ్‌కురుమ పాల్గొన్నారు. -
భాష కాదు మానవత్వమే అందరినీ కలుపుతుంది
సాక్షి,సిటీబ్యూరో: అభివృద్ధిలో కేరళతో తెలంగాణ పోటీపడుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం రవీంద్రభారతిలో కైరాలీ పీపుల్ ఇన్నోటెక్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాను పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేరళలోని పంచాయితీ రాజ్ పనితీరును ఆదర్శంగా తీసుకుని పనిచేశానన్నారు. ఇటీవల కస్తూరి రంగన్ నిర్వహణలో ఉన్న సంస్థ 30 రంగాలకు సంబంధించిన అంశాల్లో జరిపిన సర్వేలో కేరళ మొదాటిస్థానంలో నిలవగా మూడో స్థానం తెలంగాణకు వచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధిలో కేరళ ప్రభుత్వంతో పోటీ పడతామని తెలిపారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అక్కడి ప్రజలు పాలక ప్రభుత్వాలను మారుస్తుంటారన్నారు. కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడూ ఒకే లాగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా కేరళతో కలిసి పని చేస్తామన్నారు. సినీ నటుడు, కైరాలీ చైర్మన్ భారత్ మమ్ముట్టి మాట్లాడుతూ.. భాష కాదు మానవత్వమే అందరినీ కలుపుతుందన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన ఐదుగురికి ఇన్నోటెక్ అవార్డ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి సహకరించిన నందుకుగాను భారతీ సిమెంట్ మార్కెటింగ్ ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ కైరాలీ పీపుల్స్ ఇన్నోటెక్‌అవార్డును అందుకొన్నారు. కైరాలీ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ డైరెక్టర్ ఎన్ పీ చంద్రశేఖరన్,కైరాలీ ఎండీ జాన్ బ్రిట్టాస్, ఎన్ఎండీసీ సీఎండీ బైజేంద్రకుమార్, టెక్నోపార్క్ అండ్ జూరీ ఫౌండర్ సీఈవో జి. విజయ రాఘవన్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీటీఆర్‌ఎంఏ అధ్యక్షుడు లిబ్బి బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. ‘యాత్ర’ స్టోరీ బాగా నచ్చింది. వైఎస్సార్ పాదయాత్ర గురించి తీసే సినిమా ‘యాత్ర’లో మంచి స్టోరీ ఉండటంతో అందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు మమ్ముట్టి తెలిపారు. రవీంద్రభారతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్ర సినిమా స్టోరీ తనకు బాగా నచ్చిందన్నారు. అందుకే అడిగిన వెంటనే కాదనలేక పోయానన్నారు. కేరళ ప్రభుత్వ పనితీరు బాగుందని, అన్ని ప్రభుత్వాలతో పోల్చలేమన్నారు. -
పరిపూర్ణానంద గృహ నిర్బంధం
హైదరాబాద్: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఆయనను గృహ నిర్బం ధం చేశారు. ఉదయం ఆయన ఉంటున్న ప్రాంతా నికి భారీగా చేరుకున్న పోలీసులు.. పరిపూర్ణానంద స్వామిని బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిపూర్ణానంద ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 8 నుంచే జూబ్లీహిల్స్ ఫిలింనగర్ రహదారులన్నీ పోలీ సు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పరిపూర్ణానంద స్వామి భక్తులు జూబ్లీహిల్స్‌కు తరలి రావడంతో రహదారులన్నీ భక్త జనసందోహంతో కిటకిటలాడాయి. నినాదాలతో దద్దరిల్లాయి. భక్తులంతా పరిపూర్ణానందను విడుదల చేయాలంటూ గొడవకు దిగారు. పోలీసులతో పలువురు భక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 20 మంది భక్తులను పోలీసులు అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్ వచ్చారు. అయితే చింతలను మాత్రమే లోనికి అనుమతించారు. అలాగే పీఠాధిపతి విద్యా గణేశానంద సరస్వతి కూడా పరిపూర్ణానందను పరామర్శించారు. పెట్రోల్‌తో అర్చకుడి హల్చల్ పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేయడాన్ని జీర్ణించుకోలేని అర్చకుడు రాహుల్ దేశ్‌పాండే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆయన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
యాత్ర : మమ్ముట్టితో ప్రత్యేక ఇంటర్వ్యూ
స్ఫూర్తి నడిపిస్తుంది. నడత నడక నేర్పిస్తుంది. స్మృతులు పాద ముద్రలు. బాట ఒక పాఠం. నడిచిన చరిత్ర కళనీ కదిలిస్తుంది. కళ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. స్మృతి యాత్ర అందరికీ స్ఫూర్తి యాత్ర కావాలని నటుడు మమ్ముట్టి అంటున్నారు. ‘యాత్ర’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది... మమ్ముట్టి : (నవ్వుతూ). నాదేం లేదు. మా టీమ్ అంతా కష్టపడుతున్నాం. అలాగే ఇది బయోపిక్ అని మక్కీకి మక్కీ దించాలనుకోవడంలేదు. వైయస్సార్‌గారిని నేను అర్థం చేసుకుని చేస్తున్నాను. ఆయన పాత్ర చేస్తున్నాను కాబట్టి, ఆయన మేనరిజమ్స్ నాలో కనిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటివి ఉంటాయి. అయితే ఆయనలానే ఉంటాయని చెప్పలేను. వైయస్సార్‌గారి క్యారెక్టర్ తీసుకొని కథ చెబుతున్నాం. ఆ కథలో నేను కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ మహీ, నిర్మాత విజయ్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏమనుకున్నారు? మమ్ముట్టి: యాక్చువల్లీ మహీ నాకు బయోపిక్ అని చెప్పలేదు. నిజానికి ఇది వైయస్సార్‌గారి జీవిత చరిత్ర కాదు. ‘యాత్ర’ సినిమా ఆయన ౖలైఫ్లో జరిగిన ఒక చాప్టర్. ఆయన చేసిన పాద యాత్ర మీద ఈ సినిమా ఫోకస్ ఉంటుంది. వైయస్సార్‌గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయింది, ఓ లీడర్‌గా జనాల్లోకి వెళ్లి, ఆయన ఎలా ఇంటరాక్ట్ అయ్యారన్నది ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ విషయాలు చెప్పినప్పుడు ఒక యాక్టర్‌గా చాలా ఎగై్జట్ అయ్యాను. దర్శకుడిగా మహీవి రెండు మూడు సినిమాలే కదా. ఆ విషయంలో ఏమైనా సెకండ్ థాట్ ఉండేదా? మమ్ముట్టి: స్క్రిప్ట్ అంత బావున్నప్పుడు ఎందుకు సంకోచిస్తాను? నో అని చెప్పడానికి వీలు లేనంత బాగుంది. మహీ చేసిన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. నా మీద అతని కాన్ఫిడెన్స్ చూసి, అతని కాన్ఫిడెన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మహీ: యాక్చువల్లీ డైలాగ్స్‌ని తెలుగులో చదవమన్నారు. ఫుల్ నరేషన్ కూడా తెలుగులోనే జరిగింది. ఆ డైలాగ్స్ అన్నింటినీ మలయాళంలో రాసుకున్నారు. దానికి 15 రోజులు పట్టింది. ఈ సినిమా ఒప్పుకున్నాక వైయస్సార్ గారి గురించి తెలుసుకున్నారా? మమ్ముట్టి: ఇప్పటి పొలిటీషియనే కాబట్టి నాకు ఆయన గురించి కొంచెం అవగాహన ఉంది. లుక్స్, గెటప్స్ అన్నీ టీమ్ చూసుకున్నారు. రిఫరెన్స్ కోసం రాజశేఖర్‌రెడ్డిగారి పొలిటికల్ వీడియోలు చూస్తే ఆ ప్రభావం నా మీద ఎక్కువ పడిపోతుంది. అందుకే నేను జస్ట్ ఒకట్రెండు యూట్యూబ్ క్లిప్స్ మాత్రమే చూశాను. వైయస్సార్‌లా ఎంత సిమిలర్‌గా కనపడతానో తెలియదు. ఆయన స్పీచ్‌ను కూడా ఇమిటేట్ చేయడం కాదు, వైయస్సార్‌గారు తెలియని వాళ్లు కూడా అప్రిషియేట్ చేయాలి. మా ప్రయత్నం అదే. సినిమా స్టార్ట్ చేసి కొన్ని రోజులే అయింది కాబట్టి ఎక్కువ విషయాలు బయటపెట్టకూడదని అనుకుంటున్నాను. మహీ: ఈ స్టోరీలో వైయస్సార్ గారి సోల్ అండ్ స్పిరిట్ ఉంటుంది. ఆయన జర్నీ మీద ఉంటుంది. మమ్ముట్టి సార్ చెప్పినట్టు వైయస్సార్‌గారి జీవితాన్ని మక్కీకి మక్కీ తీయడంలేదు. ఆయన లైఫ్‌లోని ఒక ఇంపార్టెంట్ చాప్టర్‌ని డిస్కస్ చేస్తున్నాం. పాదయాత్ర మీదే తీయాలనుకోవడానికి కారణం? మమ్ముట్టి: యాత్ర అంటే అందరికీ పేపర్లో న్యూసే తెలుసు. ఈరోజు ఇన్ని కిలోమీటర్లు నడిచారని చదివి తెలుసుకుంటారు. ఆ నడక వెనకాల రియల్‌గా అక్కడేం జరిగింది... ప్రతీ ఒక్కరితో వైయస్సార్‌గారు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? అన్నది కూడా ఇందులో చూపించబోతున్నాం. ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్‌ను చూపించనున్నాం. మహీ: మేం ‘యాత్ర’ను ఓ డాక్యుమెంటరీలా తీయడంలేదు. అలాగని బాగా డ్రమటైజ్ కూడా చేయడం లేదు. సినిమా చూసే ప్రతి ఒక్కరినీ హత్తుకునే ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయిన 3, 4 నిమిషాల్లోనే ఆడియన్స్ కథలోకి వెళ్లిపోయేట్లు తీస్తున్నాం. మమ్ముట్టి గారే ఈ పాత్రకు సరిపోతారని మీకెలా అనిపించింది? మహీ: ‘దళపతి’ దగ్గర నుంచి మమ్ముట్టి సార్ సినిమాలు ఫాలో అవుతున్నాను. ఒక మనిషి నిల్చున్నా, కూర్చున్నా తనతో పాటు ఒక లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీని క్యారీ చేయగలగాలి. వైయస్సార్‌గారికి ఆ చరిష్మా ఉంది. వైయస్సార్ గారు మామూలుగా నడిచినా అది తన సొంత ప్లేస్ అనుకొనేంత ధీమాగా నడవగలరు. చేయి అలా గాల్లో ఊపితే ఓ భరోసా కనిపిస్తుంది. వంద మందిలో ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు తనవాళ్లని, అది తన ప్లేస్ అనిపించేంత చరిష్మా ఆయనలో కనిపిస్తుంది. మమ్ముట్టి గారిలో కూడా ఆ లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ ఉందనిపించింది. వైయస్గారిలా ఆయన్ను ఊహించుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది. విజయ్ చిల్లా: మహీ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నా మైండ్‌లో ఫస్ట్ తట్టిన వ్యక్తి కూడా మమ్ముట్టిగారే. వైయస్సార్ గారి మీద సినిమా తీయాలని మీకు ఎప్పుడనిపించింది? మహీ: 2011లో ఈ ఐడియా వచ్చింది. ‘ఆనందో బ్రహ్మ’ ముందు అనుకున్నాను. వైయస్‌గారి లైఫ్ హిస్టరీ అంతా కవర్ చేయాలని అనుకోలేదు. ఆయన లైఫ్‌లో జరిగిన ఒక చాప్టర్ చుట్టూ కథ రాశాను. వైయస్సార్‌గారి లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ అంటే పాదయాత్రే. మనందరికీ కూడా ముందు గుర్తొచ్చేది పాదయాత్రే. అందుకే ఆ యాత్ర చుట్టూ సినిమా ప్లాన్ చేశాను. బహుశా ఇలాంటిది ఇండియాలో ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటున్నాను. మమ్ముట్టి: ఆడియన్స్‌కి వైయస్సార్‌గారు ఓ లీడర్‌గానే తెలుసు. కానీ ఈ సినిమా ద్వారా ఆయన పర్సనల్‌గా ఎలా ఉంటారో అందరికీ తెలుస్తుంది. షూటింగ్లో మెమొరబుల్ మూమెంట్ ఏదైనా..? మమ్ముట్టి: షూటింగ్ స్టార్ట్ అయి టెన్ డేసే అయింది. ఈ పది రోజులు కూడా మెమొరబుల్ అని అంటాను. మీ అబ్బాయి దుల్కర్గారు బయోపిక్‌తోనే (‘మహానటి’) ఇటీవల తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. మీరు కూడా మళ్లీ బయోపిక్‌తోనే రీ–ఎంట్రీ ఇస్తున్నారు. మమ్ముట్టి: అది వేరే ఇది వేరే (నవ్వుతూ). విజయ్ చిల్లా: యాక్చువల్లీ ‘మహానటి’కన్నా ముందే ఈ సినిమా ప్లాన్ చేసేశాం. టోటల్ షూటింగ్ డేస్ ఎన్ని అనుకున్నారు? విజయ్: వైయస్‌గారు 68 రోజులు పాదయాత్ర చేశారు. మేం ఇంకో రెండు రోజులు కలిపి 70 రోజుల్లో సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఓ నాలుగైదు రోజుల షూటింగ్ మినహా మమ్ముట్టిగారు మొత్తం ఉంటారు. మమ్ముట్టి: సినిమా మొత్తం ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. వేరే సినిమాలు చేస్తే ఇందులో నుంచి బయటకు వచ్చేస్తామో అని. అలా డీవియేట్ అవకూడదని ముందే అనుకున్నాను. ఓ ఎక్స్పీరియన్డ్స్ ఆర్టిస్ట్‌గా వేరే సినిమాలు చేసుకుంటూ, ఈ సినిమా చేస్తూ మ్యానేజ్ చేయొచ్చు కానీ, ఈ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి డిస్ట్రబెన్స్ ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడిప్పుడే తెలుగు లాంగ్వేజ్‌తో కొంచెం ఫెమీలియర్ అవుతున్నాను కదా... త్వరలోనే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. గతంలో ‘స్వాతి కిరణం’ అవీ చేసినప్పుడు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? మమ్ముట్టి: అలా కాకపోతే సినిమాలు చేయను. నా సినిమాల్లో నా గొంతే వినపడాలి. నా దృష్టిలో ఏ ఆర్టిస్ట్ అయినా తన గొంతు కూడా వినిపించినప్పుడే ‘యాక్టర్’ అనిపించుకుంటారని నా ఫీలింగ్. మహీ : అవును. ‘స్వాతి కిరణం’ వంటి సినిమాలకు మమ్ముట్టిగారే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమా డైలాగ్స్‌తో పోల్చితే ‘స్వాతి కిరణం’ కాంప్లికేటెడ్. అయినా బాగా చెప్పారు. ఈ సినిమాలో సింపుల్ లాంగ్వేజ్‌తో, క్యాజువల్ డైలాగ్స్ ఉంటాయి. పొలిటికల్ స్పీచ్‌లు కూడా ఉంటాయి. మమ్ముట్టి: తెలుగు డైలాగ్స్ అన్నీ మలయాళంలో రాసుకోవడం వల్ల ఈజీ అయింది. బాగా చదువుకుంటున్నా (నవ్వుతూ). ఈజీగా చెప్పేస్తున్నా. విజయ్: అది చాలా పెద్ద ఎఫర్ట్. ఆల్రెడీ మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్లోను రోజుకో గంట ఈ లైన్స్ ప్రాక్టీస్ చేయడం చిన్న విషయం కాదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెలుగుకు తిరిగి రావడం ఎలా ఉంది? మమ్ముట్టి: చాలా చేంజెస్ కనిపించాయి. ఆయినా ఫుల్‌గా ఇక్కడికి వచ్చినట్టు కాదు. నేను బయటే ఉన్నాను. వచ్చి సినిమా చేసి, వెళ్లిపోతున్నాను. మమ్ముట్టిగారి లుక్ టెస్ట్ జరిగాక దర్శక–నిర్మాతలుగా మీ ఫీలింగ్? విజయ్: మాకు ఎగై్జటింగ్‌గా అనిపించింది. మమ్ముట్టిగారు గాల్లోకి అలా చెయ్యెత్తగానే చాలా ఎగై్టట్ అయ్యాం. మనకి ఇద్దరూ (వైయస్సార్, మమ్ముట్టి) తెలుసు. వైయస్సార్‌గారిని చూశాం. నటుడిగా మమ్ముట్టిగారిని ఎన్నో పాత్రల్లో చూశాం. వైయస్సార్‌గారి పాత్రలో ఆయన్ను చూడటం ఓ స్పెషల్ ఫీలింగ్. మహీ: ఆ ఫీలింగ్‌ని మాటల్లో చెప్పడం కష్టం. వైయస్‌ని పర్సనల్‌గా ఎప్పుడైనా కలిశారా? మమ్ముట్టి: లేదు. మహీగారూ.. ఈ కథ రాసే ముందు మీరు చేసిన రిసెర్చ్ గురించి? మహీ: నేను వైయస్‌గారి ఫ్యామిలీ అందరితో మాట్లాడాను. స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి తొమ్మిది నెలలు పట్టింది. స్పెసిఫిక్‌గా ఈ టైమ్‌లో కథ రాయడం మొదలుపెట్టానని చెప్పను. ఐదారేళ్లుగా బిట్స్ బిట్స్‌గా రాసుకుంటూ వచ్చాను. నాకు ఇన్స్పైరింగ్గా అనిపించినవన్నీ రాశాను. సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అన్నింటినీ కలిపి స్క్రిప్ట్‌ని ఓ స్ట్రక్చర్కి తీసుకొచ్చాం. ఫైనల్లీ సినిమా బడ్జెట్ ఎంత అనుకున్నారు? విజయ్: సుమారు 30 కోట్లు అనుకుంటున్నాం. వైయస్ లాంటి గొప్ప లీడర్ సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాం. – డి.జి. భవాని -
కడప దాటి వస్తున్నా
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రారంభమవుతోంది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘భలేమంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మా బ్యానర్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు పేదల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవటానికి ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’ అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించి, 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు ‘యాత్ర’ సినిమా కూడా నాన్‌స్టాప్ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నాం. ఈరోజు షూటింగ్ మొదలుపెట్టి సెప్టెంబర్‌కి పూర్తి చేస్తాం. టాలీవుడ్లో ఇదే లాంగెస్ట్ షెడ్యూల్‌గా చెప్పవచ్చు. వైఎస్‌గారి బయోపిక్ గురించి దర్శకుడు మహి చెప్పిన విధానం నచ్చి, చాలా గ్యాప్ తర్వాత మమ్ముట్టి తెలుగులో నటిస్తున్నారు. ముఖ్యంగా మడమతిప్పని పాత్ర కావటం వల్ల వైఎస్‌గారి బాడీలాంగ్వేజ్‌ని ఆయన బాగా అవగాహన పట్టి, పూర్తి డెడికేషన్‌తో ఈ పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. మా ప్రొడక్షన్ విలువలు రెట్టింపు చేసేలా, ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘యాత్ర’ నిర్మిస్తాం’’ అన్నారు. వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు సంబంధించిన మరిన్ని వార్తలకు ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి....! ప్రతి గడపలోకి వస్తున్నా యాత్ర ఫస్ట్ లుక్.. వైఎస్సార్‌గా మెగాస్టార్ సబితగా సుహాసిని వైఎస్ బయోపిక్ యాత్ర.. అధికారిక ప్రకటన -
సబితగా సుహాసిని
‘నా సోదరి’ అని మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆప్యాయంగా అనేవారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్నకు ఎంతో ఇష్టంగా రాఖీ కట్టేవారు సబిత. వైఎస్ హయాంలో తొలి మహిళా హోంమంత్రిగా సబిత బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా ‘యాత్ర’ పేరుతో ఓ సినిమా నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి పాత్రను సుహాసిని చేయనున్నారు. త్వరలో లుక్ టెస్ట్ జరగనుంది. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ గెటప్‌లో ఉన్న మమ్ముట్టి ఫస్ట్ లుక్‌కి అనూహ్య స్పందన లభించింది. -
కమ్మ కులంలో చెడపుట్టావు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబును గద్దె దించటమే ధ్యేయంగా ఇకపై తాను పని చేస్తానని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఉధ్ఘాటించారు. అవసరమైతే ఏపీలోని విపక్షాలన్నింటితో కలిసి తాను పని చేస్తానని ఆయన ప్రకటించారు. మోత్కుపల్లి తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఆయన్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం తన నివాసంలో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత జెండా లేనోడివి... ‘రాజకీయాల్లో చీడపురుగులా తయారయ్యావు. అల్లుడి వేషంలో ఎన్టీఆర్‌ను చంపి టీడీపీ జెండా ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు. ఆ జెండా చూసే జనాలు ఓట్లేశారు తప్ప.. నీ ముఖం చూసి కాదు. చంద్రబాబును నమ్మొద్దని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. అంతేకాదు టీడీపీ నుంచి చంద్రబాబును ఎన్టీఆర్ బహిష్కరించారు. బాబు కారణంగా ఎన్టీఆర్ శిష్యులు చనిపోయారు. ఎన్టీఆర్ లాంటి మహానీయుడిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కేసీఆర్, వైఎస్ జగన్, పవన్‌లది సొంత జెండా. టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది. వాళ్లను మోసం చేసి ఆ పదవి అనుభవిస్తున్నావ్. దమ్ముంటే ఆ జెండాను వాళ్లకిచ్చేయ్. సొంత జెండాతో పోటీ చేసి గెలువు. కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి’ అని మోత్కుపల్లి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబు కాదు.. నమ్మకద్రోహి... ‘చంద్రబాబును నాయకుడని ఎవరూ అనరు. ఓ బ్రోకర్.. ఓ దొంగ. జెండా దొంగవని స్వయానా ఎన్టీఆరే అన్నారు. బ్రోతల్ హౌజ్ కన్నా దారుణంగా టీడీపీని నడుపుతున్నావ్. తెలంగాణలో పార్టీ దుస్థితికి కారణం నువ్వు కాదా?.. కులాల మధ్య చిచ్చు పెట్టినవ్. డబ్బున్నోడికే, పాపాలు చేసినోడికే టికెట్లు ఇస్తున్నవ్.. ఇది మోసం కాదా? రాజ్యసభ సీట్లను అమ్ముకోలేదా? టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ సీటు అమ్మలేదా?.. పైసల్ పెట్టి ఓట్లు కొంటావ్.. అసలు ఆ సాంప్రదాయం నేర్పిందే చంద్రబాబు. అందరినీ వాడుకుని వదిలేస్తావ్. స్వయానా నరేంద్ర మోదీని మోసం చేసినవ్.. నువ్వేం మిత్రుడివి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను వాడుకున్నావ్. ఓటుకు కోట్లు కేసులో గొంతు నీదే అని ప్రజలతో చెప్పిస్తా.. రాజీనామా చేసే దమ్ముందా?’ అని మోత్కుపల్లి చంద్రబాబుకు సవాల్ విసిరారు. కరివేపాకులా వాడుకున్నావ్.. ‘ఎన్టీఆర్ మీద అభిమానంతోనే పార్టీలో కొనసాగా. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న నన్ను చంద్రబాబు పార్టీకి దూరం చేశారు. వేరే పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా ఏనాడూ వాటి గురించి ఆలోచించలేదు. ఇన్నేళ్లలో నేను ఏ పదవినీ ఆశించలేదు. రాజకీయాల కోసం నన్ను కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నాడు. బాబు కారణంగానే ఎన్టీఆర్ శిష్యులు చనిపోయారు. నీచ కులాల్లో ఎవరు పుడతారని చంద్రబాబు అన్నాడు. వచ్చే ఎన్నికల్లో దళిత వర్గాల ప్రజలు బాబుకి గట్టిగా బుద్ధి చెప్తారు. వంద గజాల లోతులో చంద్రబాబు రాజకీయాల్ని బొందపెడతారు’ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా.. ‘ఎప్పుడైతే నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేసిండో అప్పుడే నీ పతనం ప్రారంభమైంది. నీతిమంతులపై నిందలేస్తే పుట్టగతులు లేకుండా పోతావ్. ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ రోజు పాదయాత్ర చేస్తా. పవన్ యాత్రలోనూ పాల్గొంటా. వామపక్ష ర్యాలీలకూ హాజరవుతా. నమ్మేవాడి గొంతు కోసే నమ్మకద్రోహివి. పోనీలే అని గమ్మున ఉంటే కిరాయికి అమ్ముడుపోయానని నాపై తప్పుడు మెసేజ్‌లతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తావా? పిచ్చి పిచ్చిగా మెసేజ్‌లు పెడితే ఊరుకోను. నువ్వేమైనా దొరవా? సుద్ద పుసవా? నరహంతకుడివి.. దొంగవి... ఎన్టీఆర్ స్పిరిట్ నాలో ఎంతకాలం ఉంటే అంతకాలం పని చేస్తా’ అని మోత్కుపల్లి పేర్కొన్నారు. బాబు ఉంటే హోదా రానేరాదు... ఏపీ ప్రత్యేక హోదా విషయంలో అడ్డుతగులుతుంది చంద్రబాబేనని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ప్యాకేజ్ ముద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని, రైతుల భూముల విషయంలోనూ అడ్డగోలు అవినీతి జరిగిందని మోత్కుపల్లి ఆక్షేపించారు. సింగపూర్, అమెరికా అంటూ కథలు చెబుతూ ఈ ఐదేళ్లలో సాధించిందేంటని చంద్రబాబును నిలదీశారు. పదవి కోసం దిగజారుడు రాజకీయ చేసావ్. బలహీన వర్గాల అన్నదమ్ములు బొందపెట్టడం ఖాయమని చెప్పుతున్నా. అందుకే తిరుమల యాత్ర... ఎన్టీఆర్ ఆశయం.. దుర్మార్గుడ్ని గద్దె దించటం. ఆ ఆశయ సాధన కోసమే తిరుమల మెట్లు ఎక్కుతున్నా అని మోత్కుపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబును ఓడించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా మోత్కుపల్లి మరోసారి పిలుపునిచ్చారు. యాత్రకు వైఎస్సార్సీపీ సంఘీభావం... మోత్కుపల్లి తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మోత్కుపల్లిని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యాత్రకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన కూడా ప్రెస్మీట్లో మోత్కుపల్లి పక్కన కూర్చున్నారు. -
ప్రతి గడపలోకి వస్తున్నా
దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వైయస్సార్ గెటప్‌లో ఉన్న మమ్ముట్టి మొదటి లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్‌లో మమ్ముట్టి అచ్చం వై.ఎస్. లాగా ఉన్నారు. ‘కడప దాటి ప్రతీ గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది’ అని ఫస్ట్ లుక్‌పై ఉన్న మాటలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘60 రోజుల్లో 1500 కిలోమీటర్లు కాలి నడకతో ప్రతి గడపకు వెళ్లి పేదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ల బాధల్ని, రైతుల ఆవేదనని స్వయంగా తెలుసుకున్న మహానేత వైఎస్ గారు.ప్రజల కష్టాలను తీర్చి వారి హృదయాల్లో స్థానం సంపాదించిన ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డిగారు. ఉచిత కరెంటు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ.. లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారాయన. అలాంటి మహానేత జీవిత చరిత్రను మేం తెరకెక్కిస్తుండటం, ఈ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత మమ్ముట్టిగారు నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. వైఎస్‌గారి రియల్ పాదయాత్ర 2003 ఏప్రిల్ 9న ప్రారంభమైంది. రీల్ పాదయాత్ర ఈ నెల 9న ప్రారంభం అవుతోంది. ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాల్లో వై.ఎస్‌గారి తండ్రి రాజారెడ్డిగారి, తనయుడు జగన్ మోహన్‌రెడ్డిగారి పాత్రలు కనిపిస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివ మేక. -
తిరుమల యాత్రలో రామానుజులు
సహస్రాబ్ది ధారావాహిక – 17 రామానుజుడు బోధించిన భగవద్గుణాలను వివరించే హరి మేలుకొలుపు గీతాలు ఒక ఇంటినుంచి చాలా వీనుల విందుగా వినిపిస్తుంటే గోవిందుడు అక్కడే ఆగిపోయి, ఆ అరుగుమీద కూచుని తన్మయుడై వింటూ ఉన్నాడు. నిజానికి అది ఒక వేశ్య ఇల్లు. వెంటనే మరికొందరు శిష్యులు ఈ విషయాన్ని గురువుగారికి చేరవేశారు. ఇదేమి వింత గోవిందా, నీవు వేశ్య ఇంటి అరుగుమీద కూచోవడమేమిటి? అని రామానుజులు ప్రశ్నించారు. ‘‘మీ భగవద్గుణాలను వింటున్నానే గాని నాకు అదెవరి గృహమో తెలియదు ఆచార్యా’’ గోవిందుని నిష్కల్మష భక్తిని రామానుజుడు ప్రశంసించాడు.గోవిందుడికి అప్పటికే వివాహమైంది. భార్య రుతుమతి అయిన తరువాత గోవిందుని తల్లి కుమారుని దగ్గరకు వచ్చి గృహస్థాశ్రమ ధర్మానికి అనుగుణంగా సంసార బాధ్యత స్వీకరించి కోడలికి గర్భాదానం చేయాలని కుమారునికి ప్రబోధించింది. సరేనని ఒక రాత్రికి కోడలిని తీసుకురమ్మన్నాడు. ఆమె పాపం తీసుకువచ్చింది. కాని గోవిందుడు రానే రాలేదు. ఎంతసేపటికి భగవన్నామ స్మరణే కాని సంసారం ధ్యాసే లేకుండా పోయిందని రామానుజుడికి విన్నవించింది ఆయన తల్లి. నేను కనుక్కుంటానమ్మా అన్నారు రామానుజుడు. ‘‘గోవిందా నీవు సంసార జీవితంలో ఉంటే భార్యతో కాపురం చేయాలి కదా’’ అని అడిగారు. ‘‘అవును ఆచార్యా కాని ఏకాంతం దొరికితే కదా సంసారం చేసేది. నాకు అన్ని సమయాల్లోనూ అన్ని కాలాల్లోనూ మీ దివ్యబోధలే వినిపిస్తున్నాయి. సూర్యుడిపై మీరే వెలుగుతున్నారు. ఇక చీకటే లేదు. ఏకాంతమే లేదు. ఇంత వెలుగులో సంసారమూ కాపురమూ సాధ్యమేనంటారా?’’ అన్నాడు గోవిందుడు. తన శిష్యునికిసన్యాసాశ్రమమే సరైందని నిర్ధారించి రామానుజుడు అతణ్ని సన్యాసాశ్రమంలో చేర్పించి ఎంబార్ అనే నామాన్ని ఇచ్చారు. దాశరథికంచి మఠంలో ఉన్నపుడే మేనమామ కుమారుడు దాశరథి (మొదలియాండన్) శిష్యుడైనాడు. మరొక ముఖ్యశిష్యుడి పేరు కురేశుడు. అతను కుర్ అనే అగ్రహారానికి రాజు. అత్యంతసంపన్నుడైన కురేశుడు తన సతి ఆండాళమ్మతో కలసి రామానుజుని పాదాలను ఆశ్రయించాడు. తిరుమారి మార్బన్ అనే నామాన్నిచ్చారు రామానుజులు. ఇదే సందర్భంలో ఒకనాటి గురువు యాదవప్రకాశులు తన తల్లి ఆజ్ఞమేరకు రామానుజుని శిష్యుడుగా గోవింద దాసు అనే కొత్త నామంతో ఆశ్రమప్రవేశం చేశారు. ముగ్గురికీ పంచ సంస్కారాలు చేశారు. యతిధర్మసముచ్ఛయము అనే పుస్తకం రాసిన తరువాత కొద్దికాలానికి యాదవ ప్రకాశులు పరమపదించారు. తిరుమలను పుష్పవనంగా మార్చిన రామానుజులుద్వారక శ్రీ కృష్ణ క్షేత్రాన్ని వస్త్రధామంగానూ, పూరీ జగన్నాథ క్షేత్రాన్ని అన్నధామంగానూ కీర్తిస్తారు. ఆవిధంగానే తిరుమల పుష్పధామం అంటారు. పూలవనాలకు పెట్టింది పేరు తిరుమల. అందుకు కారణం రామానుజుడు. ఒకసారి రామానుజుడు తిరువాయిమొళిలో ఒక పాశురం పారాయణం చేస్తూ ఉన్నారు. వైకుంఠ వాసులైన నిత్యసూరులు కూడా పరమపదం నుంచి వచ్చి తిరుమల స్వామిని సేవిస్తారు అని ఆ పాశురంలో వివరించారు. ‘‘శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్యకైంకర్యం చేయాలి, సర్వకాలాలలో సర్వావస్థలలో కైంకర్యం ఆగకూడదు’’ అంటూ ఎవరైనా తిరుమల వెళ్లి అక్కడే ఉండి ఆ చలికి ఓర్చి పూలవనాలు పెంచుతూ స్వామికి పుష్పకైంకర్యం చేస్తారా అని రామానుజులు అడిగారు. అనంతసూరి (అనంతాళ్వారు) నేను వెళ్తానన్నాడు. అందుకు మెచ్చుకుని ఆశీర్వదించి పంపారు. తిరుమలలో అంతకుముందు యామునాచార్యుల వారు కొన్నాళ్లు పూల సేవ చేసేవారు. ఆయన శిష్యులైన శ్రీశైలపూర్ణుల వారి నేతృత్వంలో అనంతాళ్వార్ ఆ సేవ కొనసాగించాలని సూచించారు. తిరుమల కొండలలో రకరకాల పూల మొక్కలను పెంచారు అనంతసూరి. దానికి యామునోత్తర పుష్పవనం అని పేరు పెట్టారు. కాని ఆ మొక్కలు ఇచ్చే పూలు సరిపోవనీ, ప్రత్యేకంగా ఒక ఉద్యానవనమే స్వామివారికి ఉండాలని, అందుకు ఒక చెరువు కూడా అవసరం అని అనంతాళ్వారు అనుకున్నారు. చెరువు తవ్వకంలో తన భార్య తప్ప మరెవరి సాయం తీసుకోకూడదని నేల తవ్వడం మొదలు పెట్టారు. భార్య తట్టలో ఎత్తి మన్ను దూరంగా పారబోసేది. వీరి దీక్ష పరీక్షించాలని శ్రీనివాసుడే బాలుడి రూపంలో వచ్చి నేను మీకు సాయం చేస్తానని పేచీ పెట్టాడు. ససేమిరా వీల్లేదన్నారు అనంతాళ్వార్లు. గర్భవతి అయిన భార్య చెమటోడ్చి తట్టల్లో మట్టి ఎత్తుతూ ఉంటే కొంతదూరంలో ఆ తట్టలను అందుకుని దూరంగా గుమ్మరించి తట్టను అమ్మగారికి ఇచ్చేస్తున్నాడు బాల బాలాజీ. కాస్సేపటి తరువాత భార్య వేగంలో అంతరార్థం ఆయనకు అర్థమైంది. పట్టుకుందామని వెంటపడ్డాడు. దొరకలేదు. తన చేతిలో ఉన్న గునపం విసిరినాడు. అది ఆయన గదుమకు గాయం చేసింది. పరుగెత్తిపోయాడు. వెంట తానూ పరిగెత్తివెళ్లాడు. ఆ బాలుడు ఆనందనిలయంలోకి వెళ్లి అంతర్థానమైనాడు. గర్భగుడిలో వేంకటేశుని మూలమూర్తి గదుమనుంచి రక్తం కారుతున్నది. అర్చకులు స్వామివారి చుబుకానికి పచ్చ కర్పూరం పెడుతున్నారు. తను గాయపరిచింది సాక్షాత్తూ వేంకటేశ్వరుడినే అని తెలిసి ఏడుస్తూ అనంతాళ్వార్ పడిపోయారు. క్షమించమని వేడుకున్నారు. ‘‘నీ భక్తికైంకర్యాన్ని లోకానికి చాటడానికే ఈ లీల. బాధపడకు అనంతాళ్వార్ నీ భక్తికి గుర్తుగా నేనీ పచ్చకర్పూరాన్ని నిత్యమూ నా గదుమ మీద ధరిస్తాను’’ అని స్వామి పలికారు. చెరువు పూర్తయింది. పక్కనే పెద్ద తోట. రకరకాల పూల మొక్కలతో అలరారుతున్నది. రామానుజం అని ఆ తోటకు పేరు పెట్టారు. స్వామికి రెండుపూటలా సుగంధ సుమమాలలు అందుతున్నాయి. ఈ పూలు పూచే తోట చూడాలని స్వామి అలమేలు మంగతో కలిసి రాత్రి తోటకు వచ్చిన కథ మరొకటి వాడుకలో ఉంది. దంపతులిద్దరూ తోటలో పూలు తెంపి వాసన చూసి కొప్పులో ముడిచి వెళ్లినట్టు మరునాడు అనంతాళ్వార్‌కు స్పష్టంగా కనిపిస్తున్నది. తన తోటనెవరో పాడు చేస్తున్నారని భావించి రాత్రి కాపలా ఉన్నారు. తొమ్మిదో రాత్రి నవయువ దంపతులిద్దరూ కనిపించారు. అమ్మవారిని పట్టుకుని మల్లెతీగలతో చెట్టుకు కట్టి, పరుగెత్తుతున్న యువకుడి వెంట పడ్డారు. ఆయన అప్రదిక్షణంగా తిరుగుతూ మాయమైపోయారట. సుప్రభాతం తరువాత గర్భాలయంలో ప్రవేశిస్తే స్వామి వక్షస్థలంమీద అమ్మవారి విగ్రహం మాయమై కనిపించింది. అర్చకులు ఆందోళన పడుతుంటే స్వామి కంఠధ్వని వినిపించింది. అలమేలు మంగమ్మ అనంతాళ్వార్ తోటలో ఉంది తీసుకుని రమ్మన్నారట. ఛత్ర చామర వాహన మంగళ వాయిద్యాలతో తోటకు వెళ్లి సాక్షాత్తూ అమ్మవారినే కట్టివేసిన గొప్పదనం నీదే అనంతాళ్వార్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాడాయన. క్షమించమని ప్రాథేయపడి ఆమెను పూలబుట్టలో కూర్చుండబెట్టి, ఆనందనిలయంలో స్వామికి అప్పగించారు. అప్పటినుండి ఆయన అమ్మవారికి మేనమామ అయ్యారని కొందరు, కాదు కాదు స్వామికి కన్యాదానం చేసినట్టు అమ్మవారినిచ్చి ఆయన స్వామికే మామ అయ్యాడనీ అంటారు. రామానుజులు ఆ పాశురం చదివినప్పటినుంచి వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలనే తపన పెరిగింది. కంచి, తిరుమలక్షేత్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని రామానుజులు శ్రీరంగనాథుని కోరారు. కంచికి వచ్చి కాంచీపూర్ణులను కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన అపరిమితానందపరవశుడై అప్యాయంతో లేవనెత్తి ఆలింగనం చేసుకుని వరదుడి దర్శనానికి తీసుకు వెళ్లారు. గోపురానికి నమస్కరించి, అనంతసరస్సులో స్నానమాచరించి, ప్రాకారంలో నెలకొన్న వరాహస్వామిని దర్శించి తరువాత ఆళ్వార్లకు, బలిపీఠానికి, ద్వారపాలకులైన జయవిజయులకు మొక్కి, అనంతునికి ప్రణమిల్లి, సభామండపంలో ప్రవేశించారు. ఆ సభలోనే మొదటిసారి యామునాచార్యులు రామానుజుని చూసి సంతోషించారు. ఆ విషయం గుర్తుచేసుకుంటూ భాష్పపూరిత లోచనాలతో రామానుజుడు నమోనమో యామునాయ యామునాయ నమోనమః నమోనమో యామునాయ యామునాయ నమోనమః అని స్తుతించాడు. కంచి విమానాన్ని దర్శించారు. వరదుడి పట్టమహిషి పేరుందేవిని కీర్తించాడు. చక్రత్తాళ్వారునిదర్శించి, పెరియ తిరువడికి (గరుడునికి) నమస్కరించి హస్తగిరి 24 మెట్లు ఎక్కుతూ వరదుడి ప్రాంగణానికి చేరుకున్నారు. వరదరాజస్వామి ముందు నిలిచి, ఎంత కాలం తరువాత నీ దర్శనం పెరుమాళ్ అనుకుంటూ వేయికళ్లు చేసుకుని చూసుకున్నారు. తీర్థ శఠగోప ప్రసాదాలను స్వీకరించి, మహానంద భరితుడైనాడు. తనతో పాటు నడిచి దర్శనం ఇప్పించిన కాంచీ పూర్ణులకు రామానుజుడు వందనమొనర్చినారు. తిరుమలనాథుడిని దర్శించాలన్న ప్రగాఢమైన వాంఛ ఉందని కాంచీపూర్ణులకు తెలియజేశారు. కాంచీపూర్ణులు దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శిష్యగణంతో కాషాయవస్త్రధారియై త్రిదండధారియై ఆచార్య రామానుజుడు తిరుమలకు బయలుదేరారు. కొంతదూరం నడిచిన తరువాత దారి తోచడం లేదు. ఎవరూ దారి ఏదో చెప్పలేకపోతున్నారు. అక్కడ బావిలో నీరుతోడుకుంటున్న ఒక వ్యక్తిని దారి అడిగాడు. అతను చాలా ఓపికగా గుర్తులు చెబుతూ దారి అర్థమయ్యేట్టు చెప్పాడు. రామానుజుడు అతనికి కృతజ్ఞతలు చెప్పడం ఏ విధంగా అని ఒక క్షణం ఆలోచించి సాష్టాంగ నమస్కారం చేశారు. తమ ఆచార్యులు నేలమీద సాగిలపడే సరికి ఆయన శిష్యులంతా అక్కడే ఆ బావిదగ్గర, తామూ నేల మీద పడి దండాలు పెట్టారు. ఇంత పెద్ద స్వాములోరు తనకు దండాలు పెడుతుంటే ఏం చేయాలో తెలియక అతనూ ప్రతినమస్కారం చేశాడు. అక్కడి వారంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణించి తిరుపతి చేరుకున్నారు. తిరుమల కొండ కింద తిరుపతి దగ్గర ఆళ్వారుతీర్థంలో నెలకొన్న పదిమంది ఆళ్వారులను సేవించారు. ఆళ్వార్ తీర్థాన్నే కపిల తీర్థం, దివ్యసూరి తీర్థమనీ అంటారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఆళ్వారులంతా అక్కడ ఆగి, తిరుమల కొండమీదనుంచి జాలువారుతున్న కపిల తీర్థంలో స్నానం చేసి తిరుమల పర్వతానికి మొక్కి ఇక్కడినుంచే మంగళ శాసనం పాడి తిరిగి వెళ్లిపోయేవారు. అందుకని అది ఆళ్వార్ తీర్థం అయింది. శేషాచలం అంటే ఆదిశేషుడే అక్కడ పర్వతమై నిలిచి ఉన్నాడు. అంతటి శేషుడిపైన కాలుపెట్టడం అపచారమనీ, సాలగ్రామ మయమైన తిరుమలను తమ పాదాలతో తొక్కరాదని రామానుజుడు అక్కడే నిలబడి పోయినాడు. రామానుజులు తిరుమల తిరుపతికి బయలుదేరి వస్తున్నారనే వార్త అక్కడ వైష్ణవులందరికీ తెలిసిపోయింది. తన మేనల్లుడు ఆచార్యుడై వస్తున్నాడని సంతోషించి శ్రీశైలపూర్ణుడు రామానుజుడిని తోడ్కొని రావడానికిగాను కొండదిగి వచ్చారు. స్వాగతం చెప్పి ‘‘రా నాయనా కొండమీదికి వెళ్దాం. వేంకటేశ్వరుని దర్శనం చేసుకుందాం పద’’ అన్నారు. ‘‘ఆచార్యవర్యా, పరమపావనమైన ఈ తిరుమల శిఖరాలను నేను కాలితో తొక్కడమా, అది భావ్యమా? నేను ఇక్కడే ఆగిపోతాను. నేనిక్కడినుంచే మంగళాశాసనం పాడుతాను...’’అన్నారు ఆ కొండనే చూస్తూ..శ్రీశైలపూర్ణులు చాలా సేపు రామానుజుడికి నచ్చజెప్పారు. కాని ఆయన వినలేదు. ‘‘సరే అయితే మీరు చేయగూడని పని అనుకున్న పని మేము మాత్రం చేయడమెందుకు. మేమూ వెళ్లం రామానుజా’’ అని కూర్చుండిపోయారు. ‘‘అయ్యా మీ ఆజ్ఞ, మీతోపాటే నేనూ ఈ వైష్ణవ బృందం వస్తాం. ఇక ఆయనదే భారం. ఈ దివ్య పర్వతాన్ని కాలితో తాకుతున్నందుకు నన్ను క్షమించుగాక...పదండి స్వామీ’’ అని రామానుజులు అన్నారు. అందరూ గోవిందనామం చేస్తూ బయలుదేరారు. రామానుజుడు భయభక్తులతో మోకాలు మోపి అపరాధ క్షమాపణ కోరి నడిచారు. చివరికొండనయితే ఆయన మోకాళ్లమీదుగానే ఎక్కారని, అందుకే అది మోకాళ్ల పర్వతం అనే పేరు సంతరించుకుందని అంటారు. ∙ -
ద్వంద్వ నీతి
– ముద్రగడ పాదయాత్ర అనుమతి విషయంలో హైడ్రామా – దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తామంటున్న హోంమంత్రి – పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామంటున్న ఎస్పీ విశాల్ గున్నీ – ఒకవైపు కవ్వింపు చర్యలు – మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు – పంతానికి పోతున్న చంద్రబాబు – ఉద్యమ స్ఫూర్తితో ముద్రగడ – మధ్యలో నలిగిపోతున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : – దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని, దరఖాస్తు చేయకుండానే అనుమతి ఇవ్వమంటే ఎలా అని హోంమంత్రి చినరాజప్ప తనదైన ధోరణిలో తరుచూ వ్యాఖ్యానిస్తున్నారు. – అనుమతి లేని పాదయాత్రను అడ్డుకుంటాం. అనుమతి కోరితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేస్తున్నారు. – పాదయాత్ర చేయలేకే అనుమతి తీసుకోవడం లేదని హోంమంత్రి రాజప్పతో పాటు టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారు. – పాదయాత్ర చేయగలనో లేదో అనుమతి ఇచ్చి చూడండని...పాదయాత్ర చేస్తే సదరు మంత్రులు రాజీనామా చేస్తారా అని ముద్రగడ సవాల్ విసిరితే స్పందించకుండా టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ముద్రగడ పాదయాత్ర అనుమతి విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని స్పష్టమవుతోంది. ఒకవైపు మంత్రుల ద్వారా రెచ్చగొడుతోంది. మరోవైపు పోలీసులతో అడ్డుకుంటోంది. కవ్వింపు చర్యలతో వ్యూహాత్మకంగా నడుస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నాళ్లు పోరాడుతారో చూస్తాం...ఎంతవరకు ఉద్యమం చేస్తారో చూద్దాం అన్నట్టుగా హైడ్రామాను ప్రభుత్వం నడిపిస్తోంది. సుప్రీంకోర్డు మార్గదర్శకాలను చూపించి ప్రస్తుతం పాదయాత్రను పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. ఆ మార్గదర్శకాలు చూస్తే ముద్రగడ దరఖాస్తు చేసినా అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే, తుని ఘటన చూపించి శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని అనుమతికి ససేమిరా చెప్పక తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ చెబుతున్నారే తప్ప అనుమతి ఇస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఇదంతా చూస్తుంటే అనుమతి పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. ఎవరో ఒకరు వెనక్కి తగ్గడమో...సయోధ్య కుదరడమో జరగాలి. లేదంటే పాదయాత్ర ముందుకెళ్లేది లేదు. పట్టు వదలని విక్రమార్కుడిగా ముద్రగడ వెనక్కి తగ్గేది ఉండదు. పంతకానికి పోతున్న చంద్రబాబు, ఉద్యమస్ఫూర్తితో ఉన్న ముద్రగడ ఎక్కడా తగ్గేలా లేరు. ఇప్పడదే కొనసాగుతోంది. ఇరకాటంలో పోలీసులు దీనివల్ల పోలీసులు నలిగిపోతున్నారు. ఎప్పుడు అవకాశమిస్తే అప్పుడే నడుస్తాను...పోలీసులు ఎన్ని రోజులు ఉంటారో చూస్తాను... పాదయాత్ర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రకు ఎప్పుడు బయలు దేరినా అడ్డుకుంటాం...బందోబస్తు విషయంలో రాజీపడేది లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అటు ముద్రగడ, ఇటు ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన తిండి లేక...విశ్రాంతి తీసుకునేందుకు వసతి దొరకక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగం కదా ..ఎలాగైనా చేస్తారులే అన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తమకు ఇంకెన్నాళ్లీ కష్టాలని 15 రోజులుగా పడిగాపులు కాస్తున్న పోలీసులు లబోదిబోమంటున్నారు. రోడ్ల మీద ఎన్నాళ్లీ తిప్పలని గగ్గోలు పెడుతున్నారు. -
కాపు ఉద్యమాన్ని అణచివేస్తే తిరుగుబాటు
– అభివృద్ధి పనులు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం – పోలీసులను రోడ్లు పాలు చేసి అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబునాయుడు – వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విమర్శ భ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరంలో గురువారం పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు విస్మరించిందని అన్నారు. పుష్కర కాలువ ఎత్తిపోతల పథకం ద్వారా 1.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తే రైతులు పంటలు పండించుకొని లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రైతులకు నీరు అందించే విషయం మర్చిపోయి కాపు ఉద్యమం అణచివేతపై దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు. కాపు ఉద్యమం పోలీసులతో అణచి వేసేందుకు పోలీసులను రోడ్డు పాలు చేశారని అన్నారు. వారి విధులు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అన్నిచోట్లా అవినీతి పెచ్చుమీరిందని అన్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎమ్మర్జన్సీని తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ, గ్రేటర్ రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం ఆయనను ప్రకాష్‌నగర్ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం పొడవునా 144 ,30 సెక్షన్ల అమలు చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి నాయుడు, అడబాల శ్రీను, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, మోర్త పవన్‌మూర్తి, గడుగుల సత్యనారాయణ, దొడ్డి వెంకటేష్, కొప్పిశెట్టి గాంధీ, యమన నారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. -
సడలిన ఆంక్షలు
– ఆగస్టు 3న పాదయాత్రకు వస్తానన్న ముద్రగడ – అప్పటి వరకు హౌస్ అరెస్ట్‌లోనే – ఇంటి వద్ద ఆంక్షలు సడలించిన పోలీసులు – ముద్రగడను కలిసేందుకు అందరికీ అనుమతి – కొనసాగుతున్న పికెట్లు, చెక్‌పోస్టులు – ముద్రగడకు మద్దతుగా కొనసాగుతన్న నిరసనలు సాక్షి, రాజమహేంద్రవరం: ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రను అడ్డుకోవడడంతోపాటు వారం రోజులు ఆయన్ను గృహ నిర్బంధించి, ఎవరూ కలవకుండా ఆంక్షలు విధించడంతో వచ్చిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వం కొంత మేర ఆంక్షలు సడలించింది. ఈ నెల 19వ తేదీ నుంచి గురువారం వరకు ముద్రగడ ఇంటి ఛాయలకు మీడియాతో సహా ఎవ్వరినీ రానీయని పోలీసులు ఆగస్టు 3వ తేదీన పాదయాత్రకు ఇంటి నుంచి వస్తానని ముద్రగడ ప్రకటించడంతో శుక్రవారం కొద్దిమేర ఆంక్షలు సడలించారు. మీడియాను ఇంట్లోకి అనుమతించారు. కాపు నేతలు, సాధారణ ప్రజలు ముద్రగడను కలిసేందుకు అనుమతించారు. లోనికి వెళ్లే వారి పేరు, వివరాలు తీసుకుని పోలీసులు అనుమతి ఇస్తున్నారు. బాబు మనసు మారాలని పూజలు... కాపు సమాజికవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారాలని, ముద్రగడ పాదయాత్ర సాఫీగా జరగాలని మలికిపురం మండలం చింతలమోరిలో మహిళలు, విద్యార్ధులు స్థానిక శ్యామలాంబ ఆలయంలో పూజలు చేశారు. కాపు సామాజిక వర్గ విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. అమలాపురంలో వైఎస్సార్సీపీ మహిళా నేత కొల్లాటి దుర్గాభవాని చంద్రబాబుకు బుద్ధి రావాలని వరలక్ష్మి వ్రతం చేశారు. తుని మండలం ఎస్.అన్నవరం నుంచి కిర్లంపూడికి ముద్రగడకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరంలో కాపు ఉద్యమానికి మద్దతుగా రంగా విగ్రహానికి కాపులు పాలాభిషేకం చేశారు. కడియంలో మద్యంషాపులపై అఖిలపక్ష సమావేశానికి వెళ్తున్న గిరిజాల బాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. కాకినాడలో కాపు న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద వినతి పత్రాన్ని ఉంచి కాపు న్యాయవాదులు నిరసన తెలిపారు. కొనసాగుతన్న పికెట్లు, చెక్‌పోస్టులు... వచ్చే నెల 3వ తేదీన పాదయాత్ర చేస్తానని ముద్రగడ ప్రకటించడంతో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి. 16వ నంబర్ జాతీయ రహదారిలో జగ్గంపేట, ప్రత్తిపాడు వద్ద, కిర్లంపూడి గ్రామం చుట్టుపక్కల ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద యథాతథంగా తనిఖీలు చేశారు. తల్లడిల్లుతున్న పోలీసు ‘అమ్మ’ ఈ నెల 26న పాదయాత్ర చేపడతానని ముద్రగడ ప్రకటించడంతో వారం రోజులు ముందుగానే పోలీసుల బలగాలను కిర్లంపూడికి తరలించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి సివిల్ పోలీసులను రప్పించారు. ఇందులో మహిళా పోలీసులు దాదాపు 200 మంది ఉన్నారు. వీరిలో ఏడాది నుంచి రెండేళ్ల లోపు వయసున్న పిల్లలు కలిగిన తల్లులున్నారు. వారం రోజులుగా చంటి పిల్లలకు దూరంగా ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.డ్యూటీలు మారుస్తామని, తమ స్థానంలో కొత్త వారిని తెస్తామని, తిరిగి తమ జిల్లాలకు పంపుతామని మూడు రోజులుగా అధికారులు చెబుతున్నారే తప్ప ఆచరణలో చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అడుగు పడనీయ లేదు
– రెండో రోజు ఇంటి నుంచి బయటకొచ్చిన ముద్రగడ – గేటు వద్దే నిలిపివేసిన పోలీసులు – వారం రోజులపాటు గృహ నిర్బంధం – ఎప్పుడు వెళ్లనిస్తే అప్పుడే వెళతానన్న ముద్రగడ – జిల్లాలో ముద్రగడకు మద్దతుగా మహిళల నిరసనలు – అణిచివేస్తున్న పోలీసులు – కొనసాగుతున్న చెక్‌పోస్టులు, పికెట్లు – కాపు నేతల వద్ద పోలీసుల కాపలా జిల్లాలో... 1336 మంది బైండోవర్ 256 మంది గృహ నిర్బంధం. వైఎస్సార్సీపీ కాపు నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజులు, గిరిజాల బాబులు ఎక్కడికి వెళ్లినా వారి వాహనాల్లోనే పోలీసులు వెన్నంటి నిఘా... తుని మండలం ఎస్.అన్నవరంలో ముద్రగడ పద్మనాభం వియ్యంకుడిని గురువారం పోలీసులు గృహ నిర్బంధించారు. చెక్‌పోస్టులు: 69 చెక్ పోస్టులు, 112 పికెట్లు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి పరిసర ప్రాంతాలు, ప్రత్తిపాడు, జగ్గంపేట జాతీయరహదారి, కోనసీమ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా వ్యాప్తంగా 7000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్రలో పోలీసులు రెండో రోజు కూడా అడుగు పడనీయ లేదు. బుధవారం ప్రకటించిన మేరకు ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో కలసి ఇంటి నుంచి ఉదయం 9 గంటలకు బయటకు రాగానే గేటు వద్దకు 9.6 గంటలకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధిచడం సరికాదని, కావాలంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడను ఆగస్టు 2వ తేదీ వరకు వారం రోజులపాటు గృహ నిర్భందిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు ఎప్పుడు వెళ్లనిస్తే అప్పుడే పాదయాత్రకు వెళతానని పేర్కొంటూ ముద్రగడ తన అనుచరులతో తిరిగి ఇంటిలోకి వెళ్లిపోయారు. మొదటి రోజు బుధవారంతో పోల్చుకుంటే గురువారం ఉదయం ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల బలగాల హడావుడి కాస్త తగ్గింది. ముద్రగడకు మద్దతుగా గ్రామంలో దకాణాలు వరుసగా రెండో రోజు కూడా వ్యాపారులు మూసివేశారు. ప్రభుత్వ తీరుపై మహిళల నిరసనలు... కాపు సామాజికవర్గంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా, ముద్రగడకు మద్దతుగా జిల్లాలో కాపు సామాజికవర్గంతోపాటు, బీసీలు ఆందోళనలు చేశారు. + కిర్లంపూడి సమీపంలోని రాజుపాలెంలో మహిళలు మెరుపు ఆందోళన చేశారు. తమ సామాజికవర్గం పట్ట ప్రభుత్వడం అవలంబిస్తున్న తీరుపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. రోడ్డును అరగంటసేపు దిగ్బంధించారు. కిర్లంపూడి నుంచి వెళ్లిన మహిళా పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. కిర్లంపూడిలో బీసీలు ముద్రగడకు మద్దతుగా ఏనుగుల సెంటర్ ప్రాంతంలో ధర్నా చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. + అమలాపురంలో కాపు జేఏసీ నేతలు నళ్లా విష్ణుమూర్తి, నల్లా పవన్‌ను కాపులపై èచంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తలకు మాస్క్‌లు, మెడకు ఉరితాళ్లు వేసుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మరో కాపు ఉద్యమ నేత దివంగత నల్లా సూర్యచంద్రరావు చిత్రాలను కాపు నేతలు తమ ముఖాలకు మాస్క్‌లుగా ధరించి నిరసన తెలిపారు. ఎస్.అన్నవరంలో కాపులు స్వాంత్రయ్య సమరయోధుల విగ్రహాలకు క్షీరాభిక్షేకాలు చేసి నిరసన తెలిపారు. + మలికిపురంలో ర్యాలీ చేస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపేటలో అంబేడ్కర్ విగ్రహానికి మండల కాపు జేఏసీ కన్వీనర్ చీకట్ల ప్రసాద్ ఆధ్వర్యంలో కాపు యువత వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ చర్యలకు నిరసనగా శుక్రవారం కొత్తపేటకు బంద్ పిలుపునిచ్చారు. ముద్రగడ పాదయాత్రపై ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీకి రాజీనామా చేస్తామని సలాది రామకృష్ణ హెచ్చరించారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్లో కాపు నాయకులు నిరసన తెలియజేసి, గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. కాపు నేతలపై పోలీసుల నిఘా... జిల్లాలో బుధవారం బైండోవర్ చేసిన 1336 మంది కాపులు, గృహ నిర్బంధించిన 256 మంది నేతలపై పోలీసుల నిఘా పెట్టారు. వారు తమ అనుచరులను నిరసనల వైపు ప్రోత్సహించకుండా కట్టడి చేశారు. వైఎస్సార్సీపీ కాపు నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజులు, గిరిజాల బాబులు ఎక్కడికి వెళ్లినా వారి వాహనాల్లోనే పోలీసులు వెన్నంటి ఉన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలో ముద్రగడ పద్మనాభం వియ్యంకుడిని గురువారం పోలీసులు గృహ నిర్బంధించారు. + పెద్దాపురం నియోజక కాపు జెఎసీ కన్వీనర్ మలకల చంటిబాబును పెద్దాపురంలో హౌస్ అరెస్టు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 69 చెక్ పోస్టులు, 112 పికెట్లు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి పరిసర ప్రాంతాలు, ప్రత్తిపాడు, జగ్గంపేట జాతీయరహదారి, కోనసీమ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా వ్యాప్తంగా 7000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ విశాల్ గున్ని కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవ్వరూ ప్రజలను ఆందోళనల వైపు ప్రోత్సహించకపోతే ప్రస్తుత పరిస్థితిని సడలించేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం
-
ముద్రగడ వెంటే మేమంతా
అరచేతిని అడ్డుపెట్టి ఉద్యమాన్ని ఆపలేరు పాదయాత్ర జరిగి తీరుతుంది కాపు జేఏసీ నాయకులు కిర్లంపూడి (జగ్గంపేట) : అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఏ విధంగా ఆపలేరో పోలీసులను అడ్డుపెట్టి ముద్రగడ పాదయాత్రను ఆపలేరని, ఆరు నూరైనా పాదయాత్ర జరిగి తీరుతుందని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, ఆరేటి ప్రకాష్, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్ తదితరులు మాట్లాడుతూ ముద్రగడ వెంట ఎవరూ లేరని కొందరు తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారని ముద్రగడ వెంట ఎవరూ లేకపోతే పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో పోలీసు పికెట్లు ఎందుకు పెట్టారని, కిర్లంపూడిలో వేలమంది పోలీసు బలగాలను ఎందుకు మొహరింపజేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీల అమలు గుర్తు చేయడం కోసం తమ నాయకుడు రోడ్డెక్కి పాదయాత్ర నిర్వహించ తలపెడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తారా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ కోసం 30 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆ తరువాత కృష్ణా పుష్కరాలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. తుని రైల్వే సంఘటన కాపులకు సంబంధం లేదని 2016 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పత్రికా ముఖంగా తెలిపారని, అప్పటి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు కిర్లంపూడి వచ్చి ఆరు నెలల్లో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారన్నారు. ఇచ్చిన గడువు పూర్తయ్యింది, మరో ఏడాది కావస్తుంది ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం పాదయాత్ర చేస్తుంటే తమ జాతిని అణగ దొక్కేందుకు బైండోవర్ కేసులు బలవంతపు సంతకాలు తీసుకుని భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. మంజునాథ కమిషన్ రిపోర్టు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని మాట్లాడుతున్నారు. కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందా, ప్రభుత్వాన్ని కమిషన్ ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో కమీషన్లు ఏర్పాటు చేశారు ఐదారు నెలల కాలంలో రిపోర్టులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కాపుల కోసం వేసిన కమీషన్ 18 నెలలు దాటినా అతీగతీ లేదన్నారు. సహనం పాటించాల్సిన ప్రభుత్వం 26న పాదయాత్రకు పిలిపిస్తే వారం రోజుల ముందుగానే బైండోవర్ కేసులు, అరెస్టులకు పాల్పడుతుందన్నారు. కాపు జాతి ఏం పాపం చేసుకుంది, మేమేమన్నా దొంగలమా, ఉగ్రవాదులమా అన్నారు. జీఓ నంబర్ 30ని అమలు చేయమని అడుగుతుంటే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సెక్షన్ 30, 144లు అమలు చేసి వేలాది మంది కాపుల మీద కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 1994లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో తమపై పెట్టిన కేసులు అన్యాయమని ఖండించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు కొట్టివేశారన్నారు. పదేళ్ల అధికారంలో కాపులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అడుగుతుంటే కేసులు పెట్టి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తుని ఐక్యగర్జనకు హాజరై ఆ నాడు మద్దతు తెలిపిన నాయకులు పార్టీ మారిన తరువాత వారి తీరు మారిందని విమర్శించారు. ప్రభుత్వం, పోలీసులు ఏకమై అత్యుత్యాహం ప్రదర్శించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. దమ్ముంటే ముద్రగడను విమర్శించే మంత్రులు, ఎమ్మెల్యేలు కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని చంద్రబాబును డిమాండ్ చేయాలని హితవు పలికారు. జేఏసీ నాయకులు తోట రాజీవ్, నడిశెట్టి సోమేశ్వరరావు, గౌతు స్వామి, చల్లా సత్యన్నారాయణ, తోట బాబు, మండపాక చలపతి, రాపేటి పెద్ద, ఇంటి రాజా, కురుమళ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నిరంకుశ పాలన
వైఎస్సార్సీపీకి చెందిన కాపునేతలపై అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ : రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మంగళవారం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతగా మారాడని జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు.ఎన్నికల్లో చంద్రబాబు కాపు కులస్తులను బీసీ జాబితాలో చేరుస్తానని , కాపు కులాల వారు అడకుండానే హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హమీని అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తుంటే దానిని అడ్డుకోవడం దారుణమన్నారు. హిట్లర్ మించి చంద్రబాబు పాలన ఉందని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభంతో ఫొటో దిగినా, ముద్రగడ ఫొటోతో ఫ్లెక్సీ వేసుకున్న వారిపై కూడా కేసులు పెట్టడడం సిగ్గుచేటన్నారు. కాపు కులస్తులను అన్ని విధాలా చంద్రబాబు పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఎలా చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే వైఎస్సార్సీపీకి చెందిన కాపు నేతలు, రైతులకు నోటీసులు ఇస్తూ, బైండోవర్ కేసులు పెడుతున్నారని, టీడీపీ చెందిన కాపు నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపు కులస్తులను ముద్రగడ పద్మనాభం పాదయాత్ర పేరుతో వేధిస్తున్నారని, కాపు కులస్తులు భయపడేది లేదన్నారు. కాపు కులస్తులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు బొరుసు బద్రి, తోరాటి శ్రీను, ఆరిబోలు చినబాబు, పాలం నాగవిష్ణు, యర్రంశెట్టి పొలారావు, వుల్లి ఘణ, దేవన దుర్గాప్రసాద్, చిక్కిరెడ్డి సురేష్, దేవన బాబీ, దోసపాటి దుర్గారావు, మారిశెట్టి అర్జునరావు , గుగ్గిలం భాను తదితరులున్నారు. -
ఒకే...ఒక్కరోజు...
♦ పాదయాత్రకు క్లైమాక్స్ ♦ వేడెక్కిన పరిణామాలు ♦ వెనక్కి తగ్గని ఇరువర్గాలు ♦ చావోరేవో తేల్చుకుంటామంటున్న కాపులు ♦ పాదయాత్ర జరగనిచ్చేది లేదంటున్న పోలీసులు ♦ త్రిశంకు స్వర్గంలో టీడీపీ కాపు నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో హైటెన్షన్ చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘చలో అమరావతి’ పాదయాత్రకు ఒక్క రోజు వ్యవధి ఉండటంతో ఉత్కంఠ నెలకుంది. అటు ప్రభుత్వం, ఇటు ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. కిర్లంపూడిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రపైనే చర్చ జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలంతా భయపడుతుంటే...టీడీపీ నేతల పరిస్థితి మరో రకంగా ఉంది. అడకత్తెరలో పోకచెక్కలా వారి పరిస్థితి తయారైంది. ఉద్యమానికి దూరంగా ఉంటే కాపు సామాజిక వర్గం దూరమవుతుందని గుబులు వెంటాడుతుండగా, పోరాటానికి దగ్గరైతే అధిష్టానం ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందేమోనని భయం పట్టుకుంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ముద్రగడ పాదయాత్ర ప్రారంభం కావల్సి ఉంది. కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యమ నాయకులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవడంతో పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అనుమతి లేని పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తుండగా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతామంటూ ముద్రగడ బృందం తేల్చి చెబుతోంది. తమకిది చావోరేవోలాంటిదని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేయడంతో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పోలీసులు కిర్లంపూడిని అన్ని వైపులా మోహరించారు. ముద్రగడ నివాసాన్ని దాదాపు తమ అదుపులోకి తీసుకున్నారు. చెక్‌పోస్టులు, అవుట్ పోస్టులతో రహదారులన్నీ నిఘా వలయంలో ఉన్నాయి. ఒకవైపు పోలీసుల కవాతు, మరోవైపు కాపుల సమరభేరీతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాయి. సెక్షన్ 144, సెక్షన్ 30తో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారు. కాపులున్న గ్రామాలనైతే దాదాపు దిగ్బంధం చేస్తున్నారు. ఏ ఒక్కర్నీ బయటికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర జరగనివ్వకూడదని పోలీసులు పక్కా పథకంతో ముందుకెళ్తున్నారు. ఆరు నూరైనా పాదయాత్ర చేస్తామంటూ జేఏసీ నాయకులు ధీటుగా స్పందించడంతో కిర్లంపూడిలో యుద్ధ వాతావరణం నెలకుంది. బైండోవర్, హెచ్చరికలు, నోటీసులు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. చట్టం తన పనిచేసుకు పోతుందనే ధోరణితో పోలీసులు అన్ని రకాల ఆంక్షలు పెడుతున్నారు. చావో రేవో తేల్చుకుంటామంటూనే బుధవారం పాదయాత్ర అడ్డుకుంటే...మరో రోజు ప్రారంభిస్తామని...తమదెలాగూ నిరవధిక పాదయాత్ర అని ముద్రగడతోపాటు జేఏసీ నాయకులు తేల్చి చెప్పడంతో పోలీసు వర్గాలు డైలామాలో పడ్డాయి. ఇరకాటంలో టీడీపీ నేతలు అందరి పరిస్థితి ఒకలా ఉంటే టీడీపీ కాపు నేతల పరిస్థితి మరో రకంగా ఉంది. జిల్లాలో కాపు ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. కాపు జాతి కోసం జరుగుతున్న పోరాటంగా నిలిచిపోయింది. కాపులెవరైనా ఉద్యమానికి సహకరించకపోతే ద్రోహులగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా సంక్లిష్ట పరిస్థితిని టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. అధినేత చంద్రబాబు కారణంగా టీడీపీ నేతలు కాపు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. పదవులు పోతాయని, చంద్రబాబు ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని జేఏసీ నేతలను పలుకరించడానికి కూడా భయపడుతున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఛీత్కరించుకుంటోంది. రిజర్వేషన్ కోసం పోరాడాల్సిందిపోయి తిరిగి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే పదవులున్నాయి...భవిష్యత్తులో మన పరిస్థితేంటనే భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. ఎందుకంటే, ఉద్యమం కారణంగా ఇప్పటికే కాపు సామాజిక వర్గం మండిపోతోంది. ఏ దశలోనూ అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. జేఏసీ నాయకులు కూడా చంద్రబాబు, టీడీపీ నేతల్ని టార్గెట్ చేసుకునే ఉద్యమం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతల్లో చెప్పుకోలేని టెన్షన్ మొదలైంది. ఏదేమైనప్పటికీ ముందుకెళితే నుయ్యి– వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా పచ్చనేతల పరిస్థితి తయారైంది. -
చంద్రబాబు పతనం ప్రారంభం
రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు ధవళేశ్వరంలో అడ్డుకున్న పోలీసులు నోటీసులు జారీ ధవళేశ్వరం : కాపుల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పతనం ప్రారంభమయిందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్‌బ్యారేజ్ మీదుగా రాజమహేంద్రవరం వైపు వెళుతున్న హనుమంతరావును పోలీసులు ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్లో అడ్డుకున్నారు. జిల్లాలో 144సెక్షన్ అమలులో ఉందని, జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వెనుదిరిగి వెళ్లిపోయాలని పోలీసులు సూచించారు. తానేమి పాకిస్థాన్‌కు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వి.హనుమంతరావు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజమహేంద్రవరం దక్షిణ మండల డిఎస్పీ నారాయణరావు హనుమంతరావుతో చర్చించారు. తాను కిర్లంపూడి వెళ్లనని వ్యక్తిగత పనిమీద రాజమహేంద్రవరం వచ్చానని 26న తిరిగి వెళతానని హనుమంతరావు పేర్కొన్నారు. దీంతో ఆయనను ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ బయట తన వాహనంలోనే కూర్చున్న హనుమంతరావు తాను వెనక్కి వెళ్ళేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. విషయం తెలుసుకున్న ధవళేశ్వరం కాపు సంఘం నాయకులు పెద్దఎత్తున ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌కు తరలి వచ్చి హనుమంతరావుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హమిని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. 144సెక్షన్లు అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదని ఇప్పటికైన చంద్రబాబునాయుడు ముద్రగడ పద్మనాభంతో మాట్లాడి ఇచ్చిన హామిని నెరవేర్చాలన్నారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెనక్కి వెళ్ళేందుకు నిరాకరించడంతో వి.హనుమంతరావును రాజమహేంద్రవరంలోని హోటల్‌కు పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. ప్రభుత్వ తీరు దారుణం : గిరజాల కాపులను బీసీల్లో చేర్చాలని శాంతియుతంగా చేపట్టనున్న పాదయాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ గిరజాల వీర్రాజు(బాబు ) పేర్కొన్నారు. ధవళేశ్వరంలో పోలీసులు అడ్డుకున్న వి.హనుమంతరావును గిరజాల వీర్రాజు(బాబు) కలిశారు. పోలీసులతో ఉద్యమాన్ని అణగతొక్కాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందని గిరజాల వీర్రాజు(బాబు) విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కాపులు తమ సత్తాను చూపుతారన్నారు. -
మేమేమైనా ఉగ్రవాదులమా ?
పోలీసుల తీరుపై కాపు జేఏసీ నేతల ఆగ్రహం ఉక్కుపాదంతో అణచివేతకు పోలీసుల కుట్ర కిర్లంపూడి(జగ్గంపేట) : రాష్ట్రంలో కాపుజాతిని అణచి వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, గౌతు స్వామి, పసుపులేటి ఉషాకిరణ్, నల్లకట్ల పవన్‌కుమార్‌లు అన్నారు. ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపు కాపులను బీసీల్లో కలుపుతానని, ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి కాపుల అభివృద్ధికి కట్టుబడతానని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి అధికారం చేపట్టి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హామీల అమలుకు ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమం చేపట్టి రెండేళ్లు దాటినా కాపులకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రికి గుర్తు చేయడం కోసం శాంతియుతంగా గాంధేయ మార్గంలో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర నిర్వహించ తలపెట్టారన్నారు. 26 కు ముందే వేలాది మంది పోలీసులను మోహరింపజేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను భయభ్రాంతులకు గురి చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ముద్రగడ పాదయాత్రపై విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరు చూస్తుంటే మేమేమన్నా నక్సలైట్లమా, తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు రిజర్వేషన్లు, స్పష్టమైన వైఖరిని ప్రకటించండాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నో విషయాలపై కమిషన్లు వేశారు, మూడు, నాలుగు నెలల్లో కమిషన్ రిపోర్టులు ఆయా ప్రభుత్వాలు తెప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం రెండేళ్లు దాటినా కమిషన్ రిపోర్టు తెప్పించుకోకుండా కాలయాపన చేయడం కాపులను మోసం చేయడమేనన్నారు. ఇచ్చిన హామీలను అడుగుతుంటే నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందన్నారు. ఇదే ధోరణి అవలంబిస్తే భవిష్యత్తులో జాతి తిరగబడటానికి సిద్ధంగా ఉందన్నారు. 1994లో తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపుల మీద జరిగిన దౌర్జన్యానికి నిసనగా సొంత పార్టీ మీదే తిరుగుబాటు చేసి జాతి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జీఓ నంబర్ 30ని సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ముద్రగడను విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే ముద్రగడ సారథ్యంలో కిర్లంపూడి నుండి అమరావతి వరకు పాదయాత్ర చేసి తీరుతామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు బిఎన్ మూర్తి, పసుపులేటి మురళి, దోమాల బాబు, ఏసురెడ్డి పాపారావు, ఎస్సీ నాయకులు పల్లె హరిశ్చంద్రప్రసాద్, ఎస్కే ఇబ్రహీం, చల్లా సత్యనారాయణ, అన్నెం సత్తిబాబు, అడబాల శ్రీను, మండపాక చలపతి తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పాదయాత్రకు వెళితే కేసులా తునిలో 100 మందికి నోటీసులు తుని : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత కేసులను తెరపైకి తీసుకువచ్చి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెల 26న ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రలో పాల్గొనవద్దని పోలీసులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తుని నియోజకవర్గం పరిధిలో ఆదివారం నాటికి 30 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా, 70 మందికి నోటీసులు ఇచ్చారు. కాపు జేఏసీ మాత్రం నోటీసులకు భయపడేది లేదని చెబుతున్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుందని కాపులు విమర్శిస్తున్నారు. ఎంతమందిని జైలులో పెట్టినా పాదయాత్రకు కాపులు తరలి వెళతారని జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంత అతి ? పోలీసుల ఓవరాక్షన్‌పై వైఎస్సార్ సీపీ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ మండిపాటు జగ్గంపేట : చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీని అమలు చేయమని ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టదలచడంతో ఆయనను నిలువరించేందుకు ప్రభుత్వం పోలీసులతో అవసరానికి మించి ఓవరాక్షన్ చేయిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ పట్టణ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు. ముద్రగడను కలిసి మద్దతు తెలిపేందుకు ఆదివారం ఆమె కిర్లంపూడి వచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడకు కలవడానికి వస్తే నక్సలైట్, మావోయిస్టు, సంఘ విద్రోహ శక్తులను చూసేందుకు వస్తున్నట్టు దారిలో నాలుగు చోట్ల వాహనం ఆపి కిందకు దించి ఫొటోలు తీసుకున్నారని ఇది ఎంతవరకు సమంజసం మన్నారు. ఇన్ని అడ్డంకులు దేనికని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా గట్టి బందోబస్తుతో ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమెతో పాటు పసుపులేటి మురళీకృష్ణ, మనోజ్ తదితరులు ఉన్నారు. -
టెన్షన్.. టెన్షన్..
- ముద్రగడ పాదయాత్రపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ - అణచివేసేందుకు ప్రభుత్వ వ్యూహం - జిల్లాలో 6 వేల మంది పోలీసుల మోహరింపు - పలు ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం - విస్తృతంగా డ్రోన్ కెమెరాల వినియోగం - నేతలపై కొనసాగుతున్న బైండోవర్ విచారణలు - నోటీసులు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు - అయినా పాదయాత్ర జరిపి తీరుతామని కాపు నేతల ప్రకటనలు సాక్షి, రాజమహేంద్రవరం / జగ్గంపేట : కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలన్న డిమాండుతో.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి జరుప తలపెట్టిన ‘చావో రేవో చలో అమరావతి’ పాదయాత్రపై జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగానే ముద్రగడ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలన్న ప్రభుత్వ వ్యూహం.. ఈసారి ఎలాగైనాసరే పాదయాత్ర జరిపి తీరాలన్న కాపు నేతల ప్రతివ్యూహాల నేపథ్యంలో.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం హీటెక్కుతోంది. గద్దెనెక్కిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. మూడేళ్లు దాటినా తూతూ మంత్రప్రకటనలతో కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబుపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని, చేసిన మోసాన్ని తలచుకుంటున్న కాపు సామాజిక యువత, మహిళలు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తామన్న కాపులను, పోలీసులతో అణచివేసేందుకు చేస్తున్న యత్నాలపై మండిపడుతున్నారు. పాదయాత్ర విజయవంతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా బలగాలు పాదయాత్రకు గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వం మరిన్ని పోలీసు బలగాలను జిల్లాకు రప్పించింది. మండలాల వారీగా పోలీసులను మోహరించింది. కడప, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 5 వేల మంది పోలీసులను రప్పించారు. జిల్లా పోలీసులు మరో వెయ్యి మందితో కలుపుకుని మొత్తం 6 వేల బలగాలు జిల్లాలో బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడి, పరిసరాలతోపాటు, సున్నిత ప్రాంతాలైన కోనసీమ, కాకినాడ, సామర్లకోట తదితర ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులు ఆదివారం కవాతు నిర్వహించారు. ఇప్పటికే కాపు నేతలు, వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలపై బైండోవర్ కేసులు పెట్టారు.. పెడుతున్నారు. పాదయాత్రలో పాల్గొనడం చట్టరీత్యా నేరమంటూ నోటీసులు జారీ చేశారు. బైండోవర్ చేసినవారు స్థానికంగా ఉండేలా తహసీల్దార్లు వారిని వాయిదాలకు తిప్పుతున్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 26 వరకు వారిని బైండోవర్ చేశారు. పరిస్థితిని బట్టి తరువాత కూడా బైండోవర్ కొనసాగింపు ఉంటుందని రెవెన్యూ, పోలీసులు అధికారులు పేర్కొంటున్నారు. మోగుతున్న పోలీసు సైరన్లు జిల్లాలో సున్నిత ప్రాంతమైన కోనసీమలో దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు. పోలీస్ పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సెక్షన్ 144 అమలులో ఉందంటూ మైకు ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, పాల్గొనరాదని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసు వాహనాల సైరన్ల మోతతో కోనసీమ హోరెత్తిపోతోంది. ఆదివారం డ్రోన్ కెమెరాలను కూడా అమలాపురం తీసుకువచ్చారు. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఉపయోగించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరిపి తీరుతామని కాపు జేఏసీ నేతలు ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో.. 26వ తేదీన పరిస్థితి ఎలా ఉండనుందన్న ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉండగా, ముద్రగడ పాదయాత్ర విజయవంతం కావాలని కాపు మహిళలు పలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని వేగులమ్మ అమ్మవారి ఆలయంలో మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. -
ఆనంద పరమానంద
–వీధివీధులా విహరించిన విశ్వవిభుడు –అంబరాన్నంటిన భక్తజనఘోష –వైభవంగా జగన్నాథ రథయాత్ర రాజమహేంద్రవరం కల్చరల్ : ‘జయ జగన్నాథ.. గోవిందా జయ జయ, గోపాల జయజయ, హరేకృష్ణ హరే కృష్ణ, కృష్ణకృష్ణ హరే హరే నామసంకీర్తనలతో రాజమహేంద్రవరం మార్మోగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఆలయ నృత్యకళావనం వద్ద వైభవంగా ప్రారంభమైంది. జగదారాధ్యుడు, జగద్వంద్యుడు, జగదానందకారకుడు, జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు బలరామ, సుభద్రలతో రథంపై ఆశీనుడయ్యాడు. భక్తజన మానసాలను అమందానందకందళిత హృదయారవిందాలను చేస్తూ, రథం కదలింది. ముందుగా నిర్వాహకులు గుమ్మడికాయలు కొట్టి, హారతులు ఇచ్చి రథయాత్రను ప్రారంభించారు. రథం వెళ్లే మార్గాన్ని ప్రజాప్రతినిధులు లాంఛనంగా, సంప్రదాయాన్ని అనుసరించి కొద్దిమేర శుభ్రం చేశారు. రథమార్గమంతటా భక్తులు పూలవాన కురిపించారు. 70 దేశాల నుంచి తరలి వచ్చిన సుమారు 200మంది భక్తులు రథయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తూ ఆ నందగోపాలుడిని స్మరించారు. కేరళరాష్ట్రం నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారులు, విచిత్రవేషధారణలలో సంప్రదాయ కళాకారులు పాల్గొన్నారు. జోడుగుర్రాల ప్రత్యేక వాహనంపై ఇస్కాన్ స్థాపనాచార్యులు భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. కోటిపల్లి బస్టాండు, మెయిన్ రోడ్డు, కోటగుమ్మం, జండాపంజారోడ్డు, దేవీచౌక్‌లమీదుగా రథం ఆనం కళాకేంద్రం చేరుకుంది. ఇస్కాన్ నగరశాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్, భక్తినిత్యానంద స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడారు. రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైయస్సార్ సి.పి సిటీ కన్వీనర్ రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వీరరాఘవమ్మ దంపతులు, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, చల్లా శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతిలేని కార్యక్రమాలను అడ్డుకుంటాం
ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చర్యలు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : పోలీసుల నుంచి ముందస్తు అనుమతిలేకుండా నిర్వహించే కార్యక్రమాలను శాంతి భద్రతల రీత్యా అడ్డుకుంటామని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్పష్టం చేశారు. శనివారం సర్పవరం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సున్నిత అంశాలపై జిల్లాలో 1994, 1998, 2016 సంవత్సరాల్లో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా సెక్షన్ 30 అమల్లో పెట్టినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదని స్పష్టం చేశారు. సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించరాదని, ఇందుకు అన్ని రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత వాతావరణంలో చేసుకునే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు. తొండంగిలో నిర్మించనున్న దివీస్ కర్మాగార స్థాపనకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనను అడ్డుకోగా, కోర్టు ఉత్తర్వులతో సీపీఎం నేతలను అక్కడకు అనుమతించామన్నారు. ఈ నెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి అంతర్వేది దాకా ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. అనుమతి కోసం దరఖాస్తు రాలేదని, వస్తే పరిశీలిస్తామన్నారు. ఈనెల 28 నుంచి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి అమలాపురం దాకా బైక్‌ర్యాలీ నిర్వహిస్తామని, ఇం దుకు అనుమతి కోరుతూ దరఖాస్తు వచ్చిందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకువస్తే, ఆమోదయోగ్యం గా చట్టానికి లోబడి నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామ న్నారు. ఇది అన్ని రాజకీయపార్టీలకు వర్తిస్తుందన్నారు. తునిలో జరిగిన కాపు గర్జనకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్క డ అనుకోకుండా అరాచకశక్తులు చొరబడడంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రశాంతవరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఎస్బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
సత్యాగ్రహ యాత్ర సాగి తీరుతుంది
ముద్రగడను విమర్శించే అర్హత చినరాజప్పకు లేదు 25న రావులపాలెంలో మొదలై.. 30న అంతర్వేదిలో ముగుస్తుంది విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ చైర్మ¯ŒS వాసిరెడ్డి ఏసుదాసు రాజమహేంద్రవరం సిటీ : సత్యాగ్రహయాత్రకు కోర్టు అనుమతించినా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని, ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా యాత్ర కొనసాగుతుందని కాపు జేఏసీ చైర్మ¯ŒS వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టంచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాపుల ఉద్యమాన్ని అణగదొక్కడానికే సెక్ష¯ŒS 30 ఉందా అని ప్రశ్నించారు.రిజర్వేష¯ŒS మేము అడుక్కోవడం లేదని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని దాన్ని అమలు చేయని కోరుతున్నామన్నారు. ఏకులాన్ని ఇబ్బంది పెట్టకుండా ముద్రగడ ప్రశాంతంగా పాదయాత్ర చేపట్టారని దీన్నిఅందరూ స్వాగతించాలన్నారు. టీడీపీ కాపులకు ఎల్కేజీ నుండి పీజీ వరకూ ఉచిత విద్య, రూ.వెయ్యి కోట్ల కేటాయింపు, పాత రిజర్వేష¯ŒS విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చిందని దాన్ని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప యాత్ర అపేస్తామంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏడు నెలల్లో రిజర్వేష¯ŒS అమలు చేస్తామని ముదగ్రడ కు మాటిచ్చిన మంత్రులు, నాయకులు పత్తా లేకుండా పోయారన్నారు.కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS కాపుల కోసం పనిచేయకుండా చంద్రబాబు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు రావులపాలెం నుండి బయలు దేరిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర 30వ తేదీకి అంతర్వేది చేరుతుందన్నారు, రోజుకు 18, 20 కిలోమీటర్ల చొప్పున దారిలో అయినవిల్లి, అమలాపురం మీదుగా 5 రాత్రులు ఒక పగలుగా యాత్ర కొనసాగనున్నదన్నారు. కాపులు వేలాదిగా తరలిరావాలన్నారు. కాపు నాయకులు, వైఎస్సార్సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్, ఉమామహేశ్వరి, వైకేఎల్, కొత్తపేట రాజా, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. కాపు పాదయాత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలి అమలాపురం టౌ¯ŒS: ఈనెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో కోనసీమలో చేపట్టనున్న పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేయాలని కాపు మిత్ర బృందం ప్రతినిధులు కాపు ఉద్యమ నేతలకు శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. ఆ మిత్ర బృందం చైర్మ¯ŒS డాక్టర్ జి.హరిచంద్రప్రసాద్ కోనసీమలో పర్యటించారు. అమలాపురంలో కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా పవన్, కల్వకొలను తాతాజీ, మిండగుదిటి మోహ¯ŒSలను స్వయంగా కలసి అనుమతికి దరఖాస్తు చేసుకునే విషయమై మాట్లాడి వినతి పత్రాలు అందజేశారు. త్వరలో రాష్ట్ర మంత్రులను కూడా కలిసి పాదయాత్రకు అనుమతి కోరతామని కాపు మిత్ర బృందం ప్రతినిధులు బండారు రామమోహనరావు, కరాటం ప్రవీణ్, ఏఎస్డీ ప్రసాదరావు, సత్తి బాపూజీ పేర్కొన్నారు. -
ఏంచేశారని జనచైతన్య యాత్రలు?
ఇళ్లు, ఇళ్ల స్థలాలకోసం ఎమ్మెల్యే అనంతలక్షి్మని నిలదీసిన మహిళలు ∙చేసింది తక్కువ–చెప్పేది ఎక్కువ ∙వేములవాడవాసుల అసంతృప్తి వేములవాడ (కరప) : మండలంలోని వేములవాడలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పార్టీనాయకులు, కార్యకర్తలతో కల్సి నిర్వహించిన జన చైతన్యయాత్రలో మహిళల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. గురువారం వేములవాడలో జరిగిన జన చైతన్యయాత్రలో గ్యాస్ కనెక్షన్లు, పెట్టుబడి నిధి చెక్కులు పంపిణీచేసున్నారని చెపితే మహిళాశక్తి సంఘ సభ్యులు తరలివచ్చారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి తదితరులు కాలనీవద్ద ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులతో పాటు పలువురు నాయకులు ఊకదంపుడు ప్రసంగాలిచ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాకా ఏం చేశారని చైతన్య యాత్రలు నిర్వహిసున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు మీరుణం తీర్చుకునేందుకు ఏపనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగా కొంతమంది మహిళలు ఏదో అడగడానికి ప్రయత్నించగా స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. పంపిణీకార్యక్రమం అయినతర్వాత మహిళలు ఎమ్మెల్యే చుట్టుముట్టి తమ సమస్యలను ఏకరువుపెట్టారు. రెండేళ్లుగా తిరుగుతున్నా హౌసింగ్‌లోన్ ఇవ్వలేదని, మరుగుదొడ్డి బిల్లులు ఇవ్వడంలేదని, ఇంటి స్థలం ఇవ్వలేదని అడుగుతుండగా స్థానికనాయకులు అక్కడనుంచి జారుకున్నారు. ఇప్పటికే కొంతమందికి ఇచ్చామని, రానున్నరోజుల్లో అర్హులందరికీ గృహరుణాలు ఇస్తామన్నారు. ఇవ్వడంజరుగుతుందని సద్దిచెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రంలో అవాస్తవాలు ఉన్నాయని వారు వివరిచారు. ఈ సందర్భంగా హైస్కూలులో మూడేళ్లుగా గదుల నిర్మాణం పూర్తికాక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాపుకార్పొరేషన్ ద్వారా 14 మందికి ఇచ్చామన్న రుణాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతామని ప్రజలు తెలిపారు. -
పెట్టుబడి నిధులిస్తామని పత్రాలిస్తారా?
ఎమ్మెల్యేపై ఎస్సీపేట మహిళల ఆగ్రహం జనచైతన్య యాత్ర నుంచి వెనుదిరిగిన వైనం గిడజాం (రౌతులపూడి) : డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధికింద మంజూరైన సొమ్ములను ఇస్తామని చెప్పి పత్రాలు ఇవ్వడమేమిటని పలువురు మహిళలు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును నిలదీశారు. జన చైతన్య యాత్రలో బాగంగా మండలంలోని గిడజాం, కోడూరు, పారుపాక, డి.జే.పురం, ఎస్.అగ్రహారం గ్రామాల్లో మంగళవారం టీడీపీ శ్రేణులతో కలసి ఆయన పర్యటించారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించాల్సిన ఈ యాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కావడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ముందుగా గిడజాం పంచాయతీ కార్యాలయం వద్ద పెట్టుబడినిధికి సంభందించిన సొమ్ములుకోసం వచ్చిన మేడపాటి వెంకయమ్మ పెట్టుబడినిధి సొమ్ములు ఇస్తారంటే వచ్చాం. పత్రాలు చేతిలో పెట్టారేంటని ఆమె ఎమ్మెల్యేను నిలదీసింది. అలాగే గ్రామంలోని ఎస్సీ పేటలోని మహిళలను పెట్టుబడనిధిసొమ్ములు ఇస్తారని మభ్యపెట్టి ఇక్కడకు రప్పించారని ఉదయంనుంచి వేచివున్నా ఫలితం లేకపోవడంతో ఏదైనా ఇచ్చేదివుంటే ఎస్సీపేటలో ఇవ్వాలికాని ఇక్కడకు రమ్మనటమేమిటిని టీడీపీ శ్రేణులపై మండిపడి వెనక్కు వెళ్లిపోయారు. చేసేదిలేక ఎమ్మెల్యే వరుపుల, మిగిలిన టీడీపీ శ్రేణులంతా ఎస్సీపేటకు వెళ్లి పెట్టుబడినిధి సొమ్ములు బ్యాంకులో జమచేస్తారని కేవలం ఈ పత్రాలు మంజూరు పత్రాలు మాత్రమేనని మహిళలకు వివరించారు. అలాగే పారుపాక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఉపాధి హామీ పథకంలో ఆరేళ్లుగా మామిడి, జీడిమామిడి మొక్కలు వేసుకొని సాగుచేసుకుంటే నేటికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, ఎన్నిసార్లు అ«ధికారులను అడిగినా కనీసం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన ఉర్లంకల బాబూరావు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.దీంతో సంభందిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్టుబడినిధి పత్రాలను పలువురు మహిళలకు అందించారు. అనంతరం డి.జే.పురం, ఎస్.అగ్రహారాల్లోని పార్టీ ముఖ్యనాయకులను కలసి జనచైతన్య యాత్రలను పూర్తిచేసారు. ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మిశివకుమారి, టీడీపీ సమన్వయ కర్త పర్వత రాజుబాబు, పార్టీనాయకులు పాల్గొన్నారు. -
పాదయాత్రకు అనుమతి కోరితే పరిశీలిస్తాం
గతంలో జరిగిన అల్లర్య దృష్ట్యా భారీ బందోబస్తు పోలీసు వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తుంది ∙ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కిర్లంపూడి : పాదయాత్రకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అనుమతి కోరితే పరిశీలిస్తామని గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వెల్లడించారు. బుధవారం కిర్లంపూడిలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కిర్లంపూడి పోలీస్‌స్టేష¯ŒSలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లు జరిగినా బాధ్యత వహిస్తానని హామీ పత్రాన్ని ఇస్తే షరతులతో కూడిన అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. నెల్లూరు ఎస్పీ విశాల్‌గున్ని, ఏఎస్పీలు ఫకీరప్ప, అద్నా¯ŒSనమూమ్ ఆజ్మీ ఉన్నారు. -
సమస్యలు చెబుతుంటే పోలీసులను ఉపయోగిస్తున్నారు..!
వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కూనవరం (సీతానగరం) : టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్రలో ప్రజలు తమ సమస్యలను చెబుతుంటే పోలీసులతో వారిని అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. బుధవారం కూనవరంలో చౌటిపల్లి లాల్‌బాబు ఇంటివద్ద జరిగిన విందు కార్యక్రమంలో రాజా పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుప మేరకు చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా జనచైతన్య యాత్రలు టీడీపీ చేపట్టిందన్నారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీలలో ఒకటి అమలు జరపలేదని ప్రజలు తమ వద్ద వాపోతున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జనచైతన్య యాత్రలో ప్రజలు స్పందించి, ఎక్కడకక్కడ ఖండిస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో 90 ఇల్లు కాలిపోతే అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే బుచ్చియ్యచౌదరి వారే ఇళ్ల కాల్చుకున్నారని అనడం అధికారం అహంకారంతో ఉన్నారని రుజువైందన్నారు. రెండేళ్ళ క్రితం ఇళ్లను వేరే ప్రాంతంలో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన బుచ్చియ్య చౌదరి దానిని మర్చారన్నారు. దేశంలో గత ప్రభుత్వంలో 47 లక్షల గృహాలు కడితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టారని గుర్తు చేశారు. రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవన్నారు. మోదీ ప్రకటనతో ప్రజల ఇబ్బందులు ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పట్టిసీమ, దేవుడు భూములు అమ్ముకున్న డబ్బు, అమరావతి ద్వారా సంపాదించిన నల్లదనాన్ని ఏవిధంగా మారుస్తావని ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేయమని మేమే చెప్పామని టీడీపీ నాయకులు చంద్రబాబును తెగపొగుడుతుంటే, చంద్రబాబు మాత్రం ఇంటిలో కూర్చుని డబ్బులు ఏవిధంగా మార్చాల అని మదనపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వేల కోట్లు రూపాయల అవినీతి జరుగుతుందని, ప్రజలే త్వరలో గట్టిగా బుద్ధిచెబుతారని రాజా హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షుడు పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, మండల సేవాదళ్ అద్యక్షుడు ఆళ్ళ కోటేశ్వరావు, బంక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కాపు సత్యాగ్రహ యాత్ర’ పోస్టర్ ఆవిష్కరణ
బోట్‌క్లబ్ (కాకినాడ) : స్థానిక కాపు కల్యాణమండపంలో సోమవారం ‘కాపు సత్యాగ్రహ యా త్ర’ పోస్టర్‌ను కాపు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, జిల్లా కాపు సద్భావన సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చుతామని ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. తుని ఘటన కొన్ని దుష్టశక్తులు కారణంగా జరిగిందని స్పష్టం చేశారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో తీసుకు వెళ్లేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కాపు జేఏసీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోను కాపు జేఏసీ ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొనుల తాతాజీ, రావూరి వేంకటేశ్వర్ారవు, పసుపులేటి చంద్రశేఖర్, పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు -
కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలి
పి.గన్నవరం : ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 16న కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న కాపు సత్యాగ్రహ యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి పిలుపునిచ్చారు. పి.గన్నవరం గరుడేశ్వర స్వామివారి ఆలయం వద్ద మండల టీబీకే అధ్యక్షుడు కొమ్మూరి మల్లిబాబు అధ్యక్షతన బుధవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు రోజులపాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈయాత్ర జరుగుతుందన్నారు. రాష్ట్ర కాపు రిజర్వేషన్ జేఏసీ జాయింట్ కన్వీనర్లు ఆకుల రామకృష్ణ, నల్లా పవన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ ముద్రగడ పోరాటం వల్లే టీడీపీలోని కాపు నేతలకు గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారన్నారు. కాపు జాతి ముద్రగడ వెన్నంటి ఉన్నారని వారు స్పష్టం చేశారు. అనంతరం సత్యాగ్రహ యాత్రకు సంబంధించిన కరపత్రాలను విష్ణుమూర్తి ఆవిష్కరించారు. టీబీకే నాయకులు ఉలిశెట్టి బాబీ, జక్కంపూడి వాసు, అడ్డగళ్ళ వెంకట సాయిరామ్, ఆర్వీ నాయుడు, దాసరి కాశీ, తోలేటి బంగారు నాయుడు, వివిధ గ్రామాలకు చెందిన టీబీకే నాయకులు, యువకులు పాల్గొన్నారు. -
శోభాయాత్రలో అపశ్రుతి
బాణసంచాతో బెదిరిన ఆవులు గుద్దుకొని మహిళ దుర్మరణం కామేపల్లి: పండితాపురం గ్రామంలో వినాయకుడి ఊరేగింపులో కాల్చిన బాణసంచా శబ్దాలతో ఆవులమంద బెదిరి.. ఒక్కసారిగా మీదికి దూసుకురావడంతో శోభాయాత్ర చూస్తున్న ధనియాకుల శకుంతల(50) కిందపడిపోగా, ఆవులు ఆమెను తొక్కుకుంటూ పోవడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఆవులు బలంగా గుద్దుకుంటూ ముందుకెళ్లిపోగా..కిందపడి స్పృహ కోల్పోయిన ఈమెను వైద్యం నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. కాగా మరొక నలుగురు మహిళలు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని కామేపల్లి తహసీల్దార్ కె.లక్ష్మణస్వామి, ఇల్లెందు సీఐ నరేందర్ పరిశీలించారు. ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ బానోత్ కస్తూరిబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బానోత్ నర్సింహానాయక్, సొసైటీ చైర్మన్ బోడేపూడి రమేష్‌బాబు తదితరులు సంతాపం తెలిపారు. -
తెలంగాణ విమోచనదినం కోసమే తిరంగా యాత్ర
బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి బూర్గంపాడు: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తోనే బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా యాత్ర మోరంపల్లిబంజర గ్రామంలో శనివారం ప్రారంభమైంది. వందలాదిమంది యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్‌సైకిల్ ర్యాలీతో యాత్రలో పాల్గొన్నారు. సారపాక ప్రధానకూడలిలో జరిగిన సభలో విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ... 29వ కొత్తరాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తరువాత కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించకపోవటం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా బీజేపీ చేపట్టిన తిరంగాయాత్రలో ప్రజలందరు పాల్గొనాలని, సెస్టెంబర్ 17న వాడవాడలా జాతీయజెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, చందా లింగయ్య, భూక్యా సీతారామ్‌నాయక్, యర్రంరాజు బెహరా, ఏనుగుల వెంకటరెడ్డి, బి శ్రీనివాసరెడ్డి, మహంకాళి వెంకటరమణ, జీ సతీష్, అన్వేష్రాజు, స్వామిదాసు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎస్ఎఫ్ఐ సైకిల్‌యాత్ర
మిర్యాలగూడ అర్బన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా జిల్లాలో కొనసాగుతున్న సైకిల్‌యాత్ర బుధవారం మిర్యాలగూడలో ముగిసింది. ఈ సందర్భంగా పట్టణంలోని గల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెస్‌బిల్లులు పెంచాలని డిమండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, కళాశాలల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తుల విద్యాసాగర్, ఖమ్మంపాటి శంకర్, సైదా, సాయి, వెంకటేశ్, నరేష్, సూర్య, భాను తదితరులు పాల్గొన్నారు. -
జెరూసలెం యాత్రకు ఆర్థిక సహాయం
శ్రీకాకుళం: పవిత్ర జెరూసలెం యాత్రకు వెళ్లే జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలు ఆర్థిక సహాయం కోసం ఏపీ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వాహక సంచాలకులు కె.నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్ర మొత్తానికి రూ.89వేలు ఖర్చు అవుతుందని అంచనా కాగా, ప్రభుత్వం తరఫున రూ.20వేలు అందజేస్తామని చెప్పారు. దరఖాస్తులకు అన్ని పత్రాలు జతచేసి మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి పంపించాలన్నారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1068, 040–23392243, 040–2391068, శ్రీ రాఘవేంద్ర 73962 84529, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 9849901160/08922–230250 లను సంప్రదించాలని సూచించారు. -
అమరనాథ్ యాత్రలో జిల్లా వాసి మృతి
గండేపల్లి : అమరనాథుని దర్శనానికి వెళ్లిన గండేపల్లి మండలం కె.గోపాలపురానికి చెందిన బొదిరెడ్డి నూకరాజు(62) గుండెపోటుతో సోమవారం మరణించాడు. భార్య నరసమ్మ, ఆయన శుక్రవారం బంధువులతో కలిసి అమరనాథ్ తీర్థయాత్రకు రాజమహేంద్రవరం నుంచి రైలులో బయలుదేరారు. శనివారం సాయంత్రం నిజామాబాద్ నుంచి జమ్ము వెళ్లేందుకు మరో రైలెక్కి, ఆదివారం ఉదయానికి కాట్ర అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ బస చేసి, సోమవారం మధ్యాహ్నం వైష్ణవదేవి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. 14 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోకుండానే మార్గం మధ్యలో నూకరాజు కుప్పకూలాడు. ఆలయానికి చెందిన వైద్య సిబ్బంది అంబులెన్సులో అక్కడకు చేరుకుని, ఆయనను పరీక్షించారు. అప్పటికే చనిపోయినట్టు చెప్పారని బంధువులు కొప్పాక వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు తెలిపారు. మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. స్వగ్రామానికి మృతదేహం ఆలయానికి చెందిన అంబులెన్సులో మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తీసుకురానున్నారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలిస్తారని బంధువులు తెలిపారు. -
‘చలో కొత్తగూడెం’కు తరలిన కార్మికులు
మందమర్రి : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన పోరుయాత్ర సభకు మందమర్రి ఏరియా ఏఐటీయూసీ నాయకులు ఆదివారం సింగరేణి రైలుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తున్నామని అన్నారు. పోరుయాత్ర సభకు మందమర్రి ఏరియాలోని 500 మంది కార్మికులు చలో కొత్తగూడెంకు తరలి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి తరలిన నేతల్లో సుదర్శన్, ఆర్ వెంకన్న, అంకతి సాయిలు తదితరులున్నారు. -
వైభవంగా జగన్నాథుని రథ యాత్ర
ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రగా పేరొందిన పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ శుక్ల విదియ బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైన రథయాత్ర 9 రోజులపాటు కొనసాగుతుంది. భక్తజన వల్లభుడు పూరీ జగన్నాధుడు దేశ ప్రజలందరినీ చల్లాగా చూసి కాపాడాలని ప్రధాని ఈ సందర్భంగా కోరుతూ ట్వీట్ చేశారు. పూరీ జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రథయాత్ర నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. జగన్నాథుని ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి చెందాలని, పేద ప్రజలు, రైతులు మంచి ఫలితాలను సాధించి భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగగలదని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. జగన్నాథుని భారీ రథయాత్రకు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పూరీ ప్రాంతంలో భద్రతా చర్యలను పటిష్టం చేసింది. బుధవారం ఉదయం 4 గంటలకు మంగళహారతి అనంతరం గోపాల వల్లభ సేవతో పూరీ శ్రీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. రథయాత్ర జరిగే ప్రాంతమైన బొడోదండో జగన్నాథస్వామి నామస్మరణతో మారుమోగుతోంది. May the blessings of Lord Jagannath lead to development of villages, well-being of poor & farmers and take India to new heights of progress. — Narendra Modi (@narendramodi) 6 July 2016 On the occasion of Rath Yatra, my warmest greetings to you all. May Lord Jagannath continue to shower his blessings on everyone. — Narendra Modi (@narendramodi) 6 July 2016 -
ఫ్రజానేత స్పర్శతో బాధిత కుటుంబాల్లో ఆనందం
-
మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
-
నవకళేబర యాత్ర ప్రారంభం
-
షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్లు విడుదల
-
వైఎస్ షర్మిల పరామర్శయాత్ర