
సాక్షి, హైదరాబాద్: పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు, వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి, ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాం«దీభవన్‌లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని, ప్రధాని మోదీకి దేశభద్రత పట్టదని, ప్రభుత్వాలను కూల్చడమే పరమావధి అయిందని ఆరోపించారు.
రాష్ట్రాన్ని దోచుకోవడం పూర్తయిందని భావిస్తున్న కేసీఆర్.. బీఆర్‌ఎస్ పేరుతో జాతీయస్థాయిలో దోపిడీకి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, కేసీఆర్‌ల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలని విజ్ఞప్తి చేశారు.
దేశ ప్రయోజనమే లక్ష్యంగా...
స్వతంత్ర ఉద్యమం నుంచి వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా పార్టీ పని చేస్తోందన్నారు. మహిళా సాధికారిత కోసం కాంగ్రెస్ తెచ్చి న మహిళా రిజేర్వేషన్ బిల్లును బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయ ఫలితమేనని చెప్పారు.
చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment