సాక్షి, అమరావతి: అమరావతి మహాపాదయాత్ర అనేది చంద్రబాబు అండ్ కో ఆడిస్తున్న డ్రామాగా అభివర్ణించారు ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వరరావు. ఈ యాత్రలో బౌన్సర్లతో రైతులు యాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రైతుల పాదయాత్రలో ఎప్పుడు బౌన్సర్‌లను చూడలేదు. రోలెక్స్ వాచీలు పెట్టుకుని మరీ పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఇంత రిచ్ రైతులను.. వాళ్లు చేస్తున్న యాత్రను దేశచరిత్రలోనే చూసి ఉండరు అని మంత్రి కారుమురి సెటైర్ వేశారు. అమరావతిని కడితే రాష్ట్ర భవిష్యత్ దెబ్బతింటుందన్న ఆయన.. ఒక వేళ నిజంగా నాలుగు లక్షల కోట్లు పెట్టి ఉంటే ఊహించిన నష్టం వాటిల్లేదన్నారు. చంద్రబాబు తన నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేసేవాడని విమర్శించారు.
ఇక.. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. కొంతమంది కావాలనే రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి. ప్రజలందరూ మూడు రాజధానులు కోరుకుంటున్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు మేలు జరగాలన్నదే మా కోరిక అని మంత్రి కారుమురి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అది ప్రభుత్వ విధాన నిర్ణయం-ఏపీ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment