Karumuri Venkata Nageswara Rao
-
బాబు హయాంలో నిత్యావసరాల ధరలకు రెక్కలు: కారుమూరి
-
రైతులకు 20 వేలు ఎక్కడ చంద్రబాబు.. టీడీపీపై కారుమూరి ఫైర్
-
చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి చందాలపైనే ఆధారపడ్డారంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి చందాలు.. అన్నా క్యాంటీన్లకు చందాలు.. చివరికి వరదల్లో కూడా చందాలే అంటూ ఆయన ఎద్దేవా చేశారు.విజయవాడ వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. వరదల్లో కేవలం ఆకలితో అలమటించి 30 మందిపైగా మరణించారన్నారు. రాష్ట్రమంతటా కూడా చిన్నపిల్లలను కూడా వదలకుండా వందల కోట్లు చందాలు వసూలు చేశారు. చందాలు, కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.‘‘వరద బాధితుల సాయంలో కూడా పెద్ద ఎత్తున దోచుకొంటున్నారు. మా ప్రభుత్వం హాయాంలో టీడీపీ వాళ్లు బాదుడే బాదుడు అంటూ ఇళ్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు కూటమి సర్కార్ సామాన్యుడు నడ్డి విరిగేలా నిత్యావసరాల ధరలు పెంచటాన్ని ఏమనాలి?. చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు అనుకుంటున్నారు. కూరగాయలు ఆకాశాన్నంటాయి. గత ప్రభుత్వంలో ఏమైనా ధరలు పెరిగితే రైతు బజార్లు ద్వారా సబ్సిడీకి అందించేవాళ్లం. గతంలో మేము ఇసుకను ప్రభుత్వానికి ఆదాయం కల్పించి సామాన్యులు కొనేలా అందించాం.. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు’’ అని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది : వైఎస్ జగన్ -
క్షమించరాని తప్పు ఆర్.కృష్ణయ్య రాజీనామాపై కారుమూరి రియాక్షన్
-
బేరసారాలకు ఆర్ కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం:కారుమూరి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేతలను కొనుగోలు చేసి.. ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీలకు వైఎస్ జగన్ ఎంతో మేలు చేశారు. రాజ్యాధికారం దక్కాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ద్వారా బీసీలకు మంచి జరుగుతుందని జగన్ అనుకున్నారు. కానీ, ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి బాబు బేరసారాలకు కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. .. బీసీలను కృష్ణయ్య మోసం చేశారు. ఈ ద్రోహంతో ఆర్ కృష్ణయ్యను తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన కృష్ణయ్య.. చరిత్ర హీనుడిగా మిలిపోవడం ఖాయం అని కారుమూరి అన్నారు. సీబీఐ అంటే ఎందుకు భయం?జగన్‌కు ఉన్న ప్రజా ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు. అందుకే తిరుపతి లడ్డు పేరుతో తప్పుడు ప్రచారానికి దిగారు. లడ్డుపై టీటీడీ ఈవో, ఒక మాట చంద్రబాబు మరో మాట మాట్లాడుతున్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సూపర్ సిక్స్ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసమే ఇదంతా. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారు.. లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించొచ్చు కదా అని కారుమూరి ప్రశ్నించారు. -
ప్రజలకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి జగన్
-
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
‘ఎవడైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు’
ప. గో. జిల్లా: నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్‌కి లేఖ రాయించి వాలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు మాయల ఫకీరు, జిత్తులమారి నక్క అంటూ మండిపడ్డారు. ‘ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు. ఎండలు మండుతున్నాయి . పెన్షన్ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం. చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంటీర్లు అంటే ఇష్టం లేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై పిర్యాదు చేయించాడు. వాలంటీర్లపై చంద్రబాబు నీచ బుద్ధి కపట ప్రేమ ఈరోజు బయటపడింది’ అని కారుమూరి విమర్శించారు. -
వాడు గుంటనక్క రాజకీయ వ్యభిచారి: కారుమూరి వెంకట నాగేశ్వర
-
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, వైస్ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జన బలమే గీటురాయి.. -
‘మా ప్రభుత్వానికి రైతు శ్రేయస్సే ముఖ్యం’
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈరోజు(శనివారం) తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి కారుమూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను నష్ట నివారణ చర్యలపై ఈ సమీక్షా సమావేశం నిర్వహించగా, రైతులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ‘మిచాంగ్ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల పర్యటించి చూశాను. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతులకు వెంటనే సబ్సిడీ అందించే విధంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు.. ఇబ్బంది పడకూడదు అని సీఎం జగన్ ఆదేశాలివ్వడం జరిగింది. తుపాను సమయంలో అధికారులంతా చాలా బాగా కష్టపడ్డారు. రంగుమారిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా కొనే విధంగా సీఎం జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. రైతు శ్రేయస్సే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని తెలిపారు. -
రైతులను ఆదుకుంటాం
వెంకటాచలం/పామర్రు/నరసాపురం రూరల్/తొండంగి/త్రిపురాంతకం: ‘ఎవరూ అధైర్య పడొద్దు... ఈ కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది. రైతులకు అన్ని విధాలా సాయం చేస్తుంది...’ అని పలువురు రాష్ట్ర మంత్రులు చెప్పారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేశ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులతోపాటు పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: కారుమూరి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పామర్రులో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట పొలాలను, రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాశులను పరిశీలించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి రూ.1,300కోట్లకు గాను, బుధవారం వరకు రైతుల ఖాతాల్లో రూ.1,089 కోట్లు జమ చేశామని, మిగిలిన మొత్తం కూడా ఒకటి, రెండు రోజుల్లో చెల్లిస్తామని వివరించారు. కౌలు కార్డులు లేని కౌలురైతుల ధాన్యాన్ని కూడా స్థానిక సొసైటీల ద్వారా కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని స్పష్టంచేశారు. కృష్ణాజిల్లా రైతులు తమ ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డ్రయర్స్ ఉన్న మిల్లులకు అమ్ముకునే విధంగా అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పొలంలో చల్లిన మినుము విత్తనాలు పాడైపోయిన వారికి మళ్లీ సబ్సిడీపై విత్తనాలు అందించేలా చూస్తామన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు మండలాల్లోని ముంపు గ్రామాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్వే: దాడిశెట్టి కాకినాడ జిల్లా ఏ.కొత్తపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా పరిశీలించారు. బాధిత రైతులు, అధికారులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. మంత్రి రాజా మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నష్టం వివరాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పంట నష్టం అంచనాలు అందినవెంటనే సాయం: ఆదిమూలపు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద దెబ్బతిన్న వరి పొలాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరిశీలించారు. తహశీల్దార్ వి.కిరణ్, వ్యవసాయ శాఖ అధికారులను అడగి పంటనష్టం గురించి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో పంట నష్టం అంచనాలు అందిన వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ రైతు పక్షపాతి అని ప్రతి ఒక్క రైతుకూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ : కాకాణి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన తిక్కవరప్పాడు, ఇస్కపాళెం, పుంజులూరుపాడు, గుడ్లూరువారిపాళెం, తిరుమలమ్మపాళెం గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. తిరుమలమ్మపాళెం, ఇతర వరద ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. కొంతమేరకు వరినాట్లు, నారుమళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు ఆర్బీకేల ద్వారా 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి పరిహారాన్ని అందిస్తామని వివరించారు. ఏర్పాట్లు బాగున్నాయి రాత్రి కురిసిన వర్షానికి ఇళ్ల చుట్టూ నీరు చేరింది. ఏం చేయాలో తెలియలేదు. ఇంకా నీరు ఎక్కువగా వస్తే ఎలా ఉండాలో తెలియక అయోమయంలో పడ్డాం. వెంటనే సకాలంలో అధికారులు వచ్చి చర్యలు తీసుకున్నారు. శిబిరానికి తీసుకొచ్చారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, టీ కూడా అందజేశారు. అధికారులు మా బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. – రాచూరి ముత్యాలరావు, చెరుకూరి రత్నం, తాళ్లపూడి, తూర్పు గోదావరి జిల్లా పరీక్షలు చేసి మందులిచ్చారు నేను, మా ముసలావిడ ఇద్దరమే ప్రకాశపురంలోని గుడిసెలో నివసిస్తున్నాం. తుపాను రాగానే జోరువానలో మమ్మల్ని ఇద్దర్నీ మా వలంటీర్ వచ్చి వ్యానులో తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో అన్నం పెట్టించారు. వయసు మీద పడటంతో ఈ వలంటీరే దిక్కయింది. శిబిరంలో డాక్టర్లు మందులిచ్చారు. – మురాల ప్రభుదాసు, ప్రకాశపురం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సురక్షితంగా బయట పడ్డాను నా ఇల్లు బాగోలేదు. తుపాన్ వేళ ఎలా చేయాలని దిగులు పడుతున్న సమయంలో గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. నన్ను అక్కడికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు భోజనాలు, టిఫిన్లు పెట్టారు. నిద్రపోవడానికి వసతి కూడా కల్పించారు. విపత్తులు వచ్చినప్పుడు ఈ విధంగా ఎన్నడూ చేయలేదు. అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – శింగోతు నాంచార్లు, కె.పల్లెపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను నేను చాలా తుపాన్లు చూశాను. శిబిరానికి వెళ్లేందుకు నిరాకరిస్తే మా వలంటీర్ అమ్మాయి వచ్చి మామ్మా.. నేను తీసుకెళ్తాను అంటూ పట్టుబట్టింది. సిబ్బందితో వచ్చి వ్యానులో తీసుకెళ్లారు. రెండు రోజులు వేములదీవి ఈస్ట్ గ్రామంలోని తుపాను షెల్టర్‌లో ఉన్నాను. నేను శిబిరానికి వెళ్లిన తర్వాత నా గుడిసె కూలిపోయింది. వలంటీర్ మాట విని ఉండకపోతే నా ప్రాణాలు పోయేవి. వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను. – మైలాబత్తుల కమలమ్మ, వేములదీవి ఈస్ట్, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సకాలంలో ఆదుకున్నారు వర్షం నీటితో ఇల్లు మొత్తం నీరు చేరింది. అధికారులు, పంచాయతీ సిబ్బంది సకాలంలో వచ్చి మమ్మల్ని ఉన్నత పాఠశాల వద్దకు చేర్చారు. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. భోజనం, అల్పాహారం, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. – గోపిరెడ్డి రమ్య, వేగేశ్వరపురం, తూర్పు గోదావరి జిల్లా -
జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు
-
తోక కత్తిరించి తాట తీస్తా..మంత్రి కారుమూరి పవర్ ఫుల్ స్పీచ్
-
చరిత్ర సృష్టించిన సామాజిక సాధికార యాత్ర..టీడీపీ పని అయిపొయింది
-
సామాజిక న్యాయం సీఎం జగన్ చేసి చూపించారు: మంత్రి కారుమూరి
సాక్షి, కోనసీమ జిల్లా: కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మధ్యాహ్నం రావులపాలెంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైకు ర్యాలీ ప్రారంభమైంది. ఎనిమిది కిలోమీటర్లు మేర బస్సు యాత్ర సాగింది. సాయంత్రం కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాంగ బద్ధమైన పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి మాట్లాడుతూ, పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారని కిందిస్థాయిలో ఏ ఒక్క కార్యకర్త కలవలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేరుగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని, ఇంతకంటే ఏం కావాలని పేద వర్గాలు అంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. జైలు ఊచలు లెక్కపెట్టిన చంద్రబాబు.. కంటి ఆపరేషన్ అని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు గుండెకాయ రోగం వచ్చిందట అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు -నేడు వంటి కార్యక్రమాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ఎంతోమందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుంది. ఆయనకంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసిన ఘనత ఆయన కుమారుడు జగన్‌కే దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు. నాడు నేడుతో మారిన స్కూళ్ల రూపురేఖలు: మార్గాని భరత్ మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. మరి చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నాడో చంద్రబాబు చెప్పాలి. నాడు-నేడుతో ఏడున్నర దశాబ్దాల స్కూళ్ల పరిస్థితిని సీఎం జగన్ మార్చేశారని మార్గాని పేర్కొన్నారు. చదవండి: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ -
హైదరాబాద్ లో రోడ్డెక్కి తందానాలు: కారుమూరి వెంకట నాగేశ్వరరావు
-
బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదు
-
'స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే'
తాడేపల్లి: చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి అన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ.. ముఖ్యమంత్రి జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు పాలయ్యారని అన్నారు. స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని చెప్పారు. కేసుల నుంచి బయటపడటానికి చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారని మంత్రి కారుమూరి చెప్పారు. బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదని స్పష్టం చేశారు. బాబు పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలందరికీ ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని అన్నారు. చంద్రబాబు అవినీతిని ఎండకడతానన్న పవన్ టిడిపితోనే కుమ్మక్కయ్యారని మంత్రి కారుమూరి అన్నారు. తడాకా చూపిస్తానని చెప్పి బాబు పంచన చేరారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి పవన్‌కు ఏమీ లేదని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: ఒకరిది ఓర్పు.. పిరికితనం మరొకరిది!.. ఎందుకిలా.. -
నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్?
సాక్షి, తాడేపల్లి: ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటి?అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో రూ. 371 కోట్లు నొక్కేసి సాక్ష్యాధారాలతో సహా పట్టుబడిపోయాడన్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. వాస్తవం ఇది అయితే.. వాస్తవాలను వక్రీకరిస్తూ, టీడీపీకి చెందిన ఒక సామాజికవర్గం వారు చంద్రబాబు అరెస్టు అన్యాయం-అక్రమం, సేవ్ డెమోక్రసీ అంటూ మాట్లాడుతున్నారు. అంటే ప్రజా ధనాన్ని లూటీ చేసిన బాబును అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టా..? అని నిలదీస్తున్నామన్నారు. అసెంబ్లీలో చర్చించరు..బయట మాత్రం సింపతీ గేమ్ అలాగే, 'చంద్రబాబు చేసిన స్కాములు-అరెస్టులపై అసెంబ్లీలో చర్చిద్దామంటే.. వాళ్ళు చర్చకు రారు. కానీ, చంద్రబాబును ఈ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసిందని పబ్లిసిటీ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ, కౌన్సిల్లో చర్చిద్దామంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరూ లేరు, అంతా పారిపోయారు. ఒక్కొక్కరికి కోటిన్నర ఇచ్చి లాయర్లను రప్పించి వాదనలు వినిపించినా.. వారు ఎంతసేపటికీ టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తారు తప్పితే.. చంద్రబాబు అవినీతి చేయలేదు అని ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ కార్యకర్తలు సైతం నమ్మరు, ఎన్టీఆర్ కుటుంబం నమ్మదు.. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు' అని మంత్రి మండిపడ్డారు. బాబు పాలన అంతా స్కాములే.. స్కీముల్లేవ్ 'చంద్రబాబు పాలన అంతా అవినీతి, స్కాములే. ఆయన 14 ఏళ్ళ పాలన అంతా స్కాముల మయమే.. జగన్ గారి పరిపాలనలో ప్రతిదీ పేద ప్రజలకోసం అమలు చేస్తున్న సంక్షేమ స్కీములే. బాబు నిప్పు, నీతిమంతుడే అయితే ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను అమెరికాకు పంపించి, ఎందుకు దాచిపెట్టారు? నీ.. పీఎస్ శ్రీనివాస్‌కు హవాలా మార్గంలో నిధులు రాకపోతే.. అతన్ని ఎందుకు పంపించేశావు? అలా, మీ స్కాములకు లాబియిస్టుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని(ఎంవీపీ) దుబాయ్ పారిపోయాడు! చంద్రబాబు చేసిన స్కాములతో ఆయన పాపం పండింది. బాబు తప్పులు చేశాడు కాబట్టే.. మీరు చొక్కాలు విప్పి రోడ్డున పడుతున్నారు' అని విమర్శించారు. బాబుకు వెన్నుపోటు పొడిచేందుకు లోకేష్, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్? 'లోకేష్ ఎక్కడ దాక్కున్నాడు..? చంద్రబాబును అరెస్టు చేస్తే.. నా తండ్రి దగ్గరకు వెళ్ళనివ్వరా.. అని రెచ్చిపోయి, ప్లకార్డులు పట్టుకుని, కింద కూర్చుని నానా హడావుడి చేశాడు. ఇప్పుడేమో ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. నీ తండ్రి జైల్లో ఉంటే.. నీవు కూడా ఈ స్కాముల్లో పాత్రధారుడివి కాబట్టి, ఢిల్లీలో నక్కావా..? తండ్రి జైల్లో ఉంటే.. బాలకృష్ణతో కలిసి లోకేష్ పార్టీని లాక్కోవాలని చూస్తున్నట్టు ఉన్నారు. ఎన్టీఆర్ గారికి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే.. రివర్స్‌లో ఆయనను పొడిచేందుకు మామ, అల్లుళ్ళు బాలకృష్ణ, లోకేష్‌లు రెడీ అయినట్టు ఉన్నారు. అందుకే, జైల్లో ఉన్న తండ్రిని పట్టించుకోకుండా, సీక్రెట్‌గా వీళ్ళు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కూర్చున్నాడు. అసెంబ్లీలో ఆయన కుర్చీపైకి ఎక్కి నిల్చొన్నాడు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే.. చంద్రబాబుకు తగిన శాస్తి జరగాల్సిందే' అంటూ చెబుతూ వచ్చారు. బాలకృష్ణ తొడకొడితే బిల్డింగ్ కూలుతుందేమో అని భయపడ్డాం! 'బాలకృష్ణ మొన్న స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి మీసం మెలేసి, తొడగొట్టాడు. దాంతో చంద్రబాబు దోపిడీ చేసి, నిర్మించిన టెంపరరీ అసెంబ్లీ బిల్డింగ్లు ఎక్కడ కూలిపోతాయోనని మేమంతా భయపడ్డాను. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒంటి చేత్తో పది, ఇరవై లారీలను ఎత్తేస్తాడు. ఆయన తొడకొడితే భూమి బద్ధలైపోతుంది. అందుకే, యనమల నోరు తెరవట్లేదు? చంద్రబాబు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు ఈ స్కాములు జరగలేదని మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా.. ఆయన కూడా నోరు తెరవడం లేదు. ఎందుకంటే, బాబు తర్వాత యనమలకే ఈ అవినీతి గురించి బాగా తెలుసు. అవినీతి జరిగిందన్నది యనమలకు తెలుసు. నాడు అవినీతి.. నేడు నీతి అయిందా పవన్? 'చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులు, దుర్మార్గులు, తన తల్లిని తిట్టారు, నియోజకవర్గానికి వెయ్యి కోట్లు చొప్పున అవినీతి చేశారు.. అని మాట్లాడిన పవన్ కల్యాణ్- ఈరోజు ఎందుకు నోరు విప్పడు. ఆరోజు పవన్ కల్యాణ్ మాట్లాడిన అవినీతి కేసులే ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకున్నాయి. అప్పుడు అవినీతి అయినవి.. ఇప్పుడు మీ కళ్ళకు నీతివిగా కనిపిస్తున్నాయా..? దేశానికి ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీనే అరెస్టు చేశారు. బాబు ఏమైనా దిగొచ్చాడా..? తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. స్కిల్ స్కాంకు సంబంధించిన నోట్ ఫైళ్ళపై.. చంద్రబాబు 13 సంతకాలు పెట్టాడు. పైగా, బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే.. చైర్మన్‌కు ఏమిటి సంబంధం అని అవగాహన లేకుండా లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా తానే స్వయంగా నోట్ ఫైళ్ళ మీద సంతకాలు చేసి, నిధులు విడుదలకు ఒత్తిళ్ళు చేస్తే.. అది తప్పు కాకుండా ఒప్పు అవుతుందా..? చంద్రబాబు తప్పు చేశాడు, సాక్ష్యాలతో సహా చిక్కాడు కాబట్టి.. ఆయన ఏ కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు విప్పాలి. ఏమి అడిగినా 'తెలియదు, గుర్తులేదు, మరచిపోయాను..' అని ఒకటే సమాధానం చెబుతున్నాడంటూ' మండిపడ్డారు. భేషుగ్గా జగన్ పరిపాలన! సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు దేశం యావత్తు చూస్తుంటే.. ఇక, మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని ప్రభుత్వంపై ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రోజూ బురద జల్లుతున్నారు. గత నాలుగేళ్ళ సీఎం జగన్ పరిపాలనలో విద్యారంగం మొదలు సచివాలయ వ్యవస్థ.. పారదర్శకమైన పరిపాలన.. సామాజిక న్యాయం.. ప్రతి ఇంటికీ మూడు-నాలుగు సంక్షేమ పథకాలు అందేలా.. గొప్పగా పాలన చేస్తూ, ఏపీ దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే ముందుంది. పేదరికం 11 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నాం. జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ మేలు జరుగుతుంటే.. వీళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు. అందుకే, ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు’ అని మంత్రి కారుమూరి ధ్వజమెత్తారు. -
చంద్రబాబుకు భారీ షాక్
-
‘ఈనాడు తప్పుడు రాతలు.. కళ్లు పెద్దవి చేసుకుని చూడు రామోజీ’
సాక్షి, తాడేపల్లి: ధాన్యం కొనుగోళ్లపై రామోజీవి తప్పుడు రాతలు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రైతులకు కనీసం ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదని, సీఎం జగన్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. ‘‘రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారు. రామోజీ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు-నేడు ఏం జరిగిందో అర్థమవుతోంది. సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం 2 కోట్ల 65 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ ప్రభుత్వం 32 లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల 65 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించింది. 58 వేల కోట్లు చెల్లించాం’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చాం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. రామోజీ.. ఈనాడు పత్రికను మరింతగా దిగజారుస్తున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా చేసిన మా పై నిందలా.. తప్పుడు రాతలు రాయడానికి రామోజీకి సిగ్గులేదా?. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం. టీడీపీ హయాంలో దళారీ వ్యవస్థతో రైతులను దోచుకుతిన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు. నిజాలు తెలుసుకుని వార్తలు రాయడం నేర్చుకో రామోజీ’’ అంటూ మంత్రి కారుమూరి దుయ్యబట్టారు. చదవండి: సినిమా రేంజ్లో సీన్లు పండించిన పవన్.. ప్లాన్ బెడిసికొట్టింది! ‘‘దొంగ ఓట్లు చేర్చడంలో చంద్రబాబు దిట్ట. ఈ రోజు నిజం బయటపడటంతో చంద్రబాబు భయపడుతున్నాడు. చంద్రబాబు మాకొద్దు బాబోయ్ అంటున్నారు ప్రజలు. 600 హామీలిచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది ఎవరు?. డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు? చంద్రబాబు, లోకేష్, పవన్ రోడ్లపై తిరగడం వల్ల వర్షాలు కూడా పడటం లేదు’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
నారా లోకేష్ ఓ పిల్ల కాకి: మంత్రి కారుమూరి
సాక్షి, పల్నాడు జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేష్ ఓ పిల్ల కాకి అంటూ దుయ్యబట్టారు. మూడు పర్యాయాలు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించాడా అని ప్రశ్నించారు. ‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు. బీసీలను ఓట్లేసే యంత్రంలా చంద్రబాబు వాడుకున్నాడు. ఇష్టానుసారంగా దొంగ ఓట్లు రాయించింది చంద్రబాబే. అల్జీమర్స్ వ్యాధి చంద్రబాబు కుటుంబంలో ఉంది’’ అని మంత్రి మండిపడ్డారు. చదవండి: పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ -
చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై మంత్రి కారుమూరి ఫైర్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ బాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఓ ముసలి నక్క, దుర్మార్గుడు, పుంగనూరులో రౌడీలా వ్యవహరించారని ఆరోపించారు. లోకేశ్ పప్పు.. అతనొక రాజకీయ నాయకుడేనా? అని ప్రశ్నించారు. పవన్ తాటతీస్తా.. పంచలూడదీస్తా అంటున్నాడు.. ఇది కరెక్టేనా? అని అన్నారు. సినిమాలకు రాజకీయాలను జోడించడమేంటి.. కాగా, మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో పోలీసులకు చేతులెత్తి దండం పెట్టాలి. రక్తమోడుతున్నా తుపాకులకు పనిచెప్పకుండా సంయమనం పాటించారు. చంద్రబాబు ఇంకెంతమంది ఉసురు పోసుకుంటారని విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని చూపించడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. పవన్ తాటతీస్తా.. పంచలూడదీస్తా అంటున్నాడు.. ఇది కరెక్టేనా? అని అన్నారు. మనస్థాయి ఏంటి.. మన బ్రతుకేంటి అని ఆలోచించుకోవాలి. సినిమాను సినిమాగా.. రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి. అంతేకానీ సినిమాకు, రాజకీయాలను జోడించి చూడటం సరికాదు. ప్రజల వద్దకు వెళ్లి ఏం చెబుతారు.. మమ్మల్ని విమర్శించే ఏ పార్టీ నాయకులకైనా ప్రజల వద్దకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీలో నేతలు తప్ప ఏ ఒక్క కార్యకర్త అయినా మాట్లాడుతున్నాడా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని పార్టీల వారికీ పథకాలు అందుతున్నాయి. అందుకే నాయకులు తప్ప ఆ పార్టీల కార్యకర్తలెవరూ మమ్మల్ని విమర్శించడం లేదు. వీరంతా ఏం చేశారని ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడతారు. సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. వాళ్లు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తల ఉసురు, ప్రజల ఉసురు కచ్చితంగా చంద్రబాబుకు తగులుతుంది. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే అందరినీ కలుపుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లో టీడీపీ హింసను ప్రేరేపిస్తుంది: కొమ్మినేని -
‘ఏపీకి చంద్రబాబు ఏమీ చేయలేదు.. ఆయనకు అడిగే హక్కులేదు’
సాక్షి, తిరుపతి: చంద్రబాబుకి ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదని.. ఆయన ఏనాడు ప్రజలకు మంచి పని చేయలేదని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. గురువారం ఉదయం మంత్రి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కి పరిపాలనలో మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకోవడం జరిగిందన్నారు. ఏపీ అన్ని రంగాల్లో ముందుంది. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు, విమర్శలు చేసినా సీఎం జగన్ తాను పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. భారతదేశంలోనే ఏపీ నంబర్ వన్ స్ధానానికి వస్తుందన్నారు. జీడీపీలో ఏపీ మొదటి స్థానంలో, విద్యలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ